NASA
-
‘నియర్’ వెరీ డియర్
‘నియర్’ అనుభవంతో దాన్ని అడ్డుకునే పనిలో నాసా సరిగ్గా 24 ఏళ్ల క్రితం భూమి నుంచి ప్రయోగించిన ఒక అంతరిక్ష నౌక అనూహ్యంగా ఒక గ్రహశకలంపై దిగింది. దానికి ఆ సామర్థ్యం ఏమాత్రమూ లేకపోయినా రాతితో కూడిన నేలపై అతి సున్నితంగా లాండైంది. అన్ని ప్రతికూలతలను తట్టుకుంటూ అక్కడి నుంచి రెండు వారాల నిక్షేపంగా పనిచేసింది. సదరు అస్టరాయిడ్కు సంబంధించిన విలువైన డేటాను భూమికి చేరవేసింది. గ్రహంపై కాకుండా ఓ గ్రహశకలంపై కాలుమోపిన తొలి స్పేస్‌క్రాఫ్ట్‌గా చరిత్ర సృష్టించింది. ఇదంతా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అప్పట్లో ప్రయోగించిన నియర్ ఎర్త్ అస్టరాయిడ్ రెండీవ్ (నియర్) స్పేస్‌క్రాఫ్ట్ గురించే. ‘2024 వైఆర్4’ అనే గ్రహశకలం భూమి వైపుగా శరవేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో నాసా సైంటిస్టులు నాటి నియర్ ఘనతను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. వైఆర్4 భూమిని ఢీకొనే అవకాశాలు 2 శాతం దాకా ఉన్నట్టు వారు అంచనా వేస్తున్నారు. ఇది బహుశా 2032లో జరిగే చాన్సుందట. భూమికేసి రాకుండా దాన్ని దారి మళ్లించాలని భావిస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో నాడు ‘నియర్’ అందించిన వివరాలు ఎంతగానో ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. అలా జరిగింది... భూమికి 35.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘433 ఏరోస్’ అనే ఎస్–క్లాస్ గ్రహశకలం లక్షణాలు, అందులోని ఖనిజాలు, అయస్కాంత క్షేత్రం తదితరాలను అధ్యయనం చేయాలని నాసా భావించింది. దాని చుట్టూ కక్ష్యలో పరిభ్రమించే లక్ష్యంతో నియర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను 1996 ఫిబ్రవరి 17న ప్రయోగించింది. అంతరిక్షంలో వెళ్లిన ఏడాదికి అది అస్టరాయిడ్ ఉపరితలానికి 1,200 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అక్కణ్నుంచి మరింత ముందుకెళ్లి ఏరోస్ చుట్టూ కక్షలోకి తిరగాల్సి ఉండగా నియర్ జాతకమే తిరగబడింది. 1998 డిసెంబర్ 20న సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజన్ బర్న్ కారణంగా నియర్ అనుకున్నట్లుగా పనిచేయలేని పరిస్థితి! దాంతో బ్యాకప్ ఇంధనం సాయంతో దాన్ని ఏకంగా అస్టరాయిడ్పైనే దించాలని నాసా నిర్ణయించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా నియర్ 2001 ఫిబ్రవరి 12న ఏరోస్కు అత్యంత సమీపానికి చేరుకుంది. చివరికి నెమ్మదిగా ఏరోస్పై దిగి చరిత్ర సృష్టించింది. ఒక అంతరిక్ష నౌక గ్రహశకలాన్ని తాకడం అదే మొదటిసారి. అలా నియర్ కాస్తా సైంటిస్టులకు వెరీ డియర్గా మారిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంకా ముందుగానే సునీతా విలియమ్స్ రాక!
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరింత ముందుగానే భూమ్మీదకు రానున్నారా?. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో ఎనిమిది నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే చిక్కుకుపోయిన ఆమెను వెనక్కి రప్పించే ప్రక్రియ మరింత వేగవంతం కానుందా?.. అసలు మేటర్ ఏంటంటే..మార్చి నెలాఖరులో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో క్రూ-10 మిషన్ నిర్వహించాలని నాసా భావించింది. ఈ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములను స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా ఐఎస్ఎస్(ISS)కు పంపాలనుకుంది. అయితే ఈ ప్రయోగంలోనే సునీత, విల్మోర్లను తిరిగి భూమ్మీదకు రప్పించేందుకు స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ‘ఎండేవర్’ను వినియోగించబోతోంది. తొలుత మార్చి 25వ తేదీన ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేయగా ఇప్పుడది ముందుకు జరిగింది. మార్చి 12వ తేదీనే ఈ ప్రయోగం నిర్వహించబోతున్నారని నాసా(NASA) ధృవీకరించింది. ఈ కొత్త టీం అక్కడికి చేరుకోగానే.. -క్రూ-9లో వెళ్లిన సునీతా విలియమ్స్(Sunita Williams), విల్మోర్లు రిలీవ్ అవుతారు. అలా డ్రాగన్ క్యాప్సూల్ ఎండేవర్ ద్వారా ఇద్దరు భూమ్మీదకు రావడానికి మార్గం సుగమం అవడమే కాకుండా ఐఎస్ఎస్ నిర్వహణ కూడా నిలిచిపోకుండా ఉండగలుగుతుందన్నమాట. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మార్చి 19వ తేదీన సునీత, విల్మోర్లు భూమ్మీద అడుగుపెట్టే అవకాశాలున్నాయి .ఇక క్రూ-10లో వెళ్లే నలుగురు వోమగాములు 150 రోజుల తర్వాత అంటే ఈ జులైలో స్పేస్ ఎక్స్‌కే చెందిన ఎండూరెన్స్ క్యాప్సూల్ ద్వారా భూమ్మీదకు చేరుకుంటారు. కిందటి ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా క్రూ-9 మిషన్‌లో భాగంగా సునీత సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. అయితే.. స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు మాత్రమే తిరిగి భూమ్మీదకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి సునీత, విల్మోర్లు స్పేస్ స్టేషన్లోనే ఉండిపోయారు. ఇదీ చదవండి: యాక్సియోమ్ మిషన్-4లో భారతీయుడు -
సునీతా విలియమ్స్ రాకపై ఉత్కంఠ
-
యాక్సియోమ్–4 మిషన్ వాయిదా?
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే వారిని వెనక్కి తీసుకురావాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, స్పేస్ఎక్స్ సంస్థ తొలుత నిర్ణయించాయి. సాంకేతిక కారణాలతో మార్చి నెలకు వాయిదా వేశాయి. అది కూడా సాధ్యమయ్యే అవకాశం లేదని సైంటిస్టులు అంటున్నారు. ఐఎస్ఎస్ నుంచి ఇద్దరు వ్యోమగాములను రప్పించడానికి స్పేస్ఎక్స్ సిద్ధం చేస్తున్న నూతన అంతరిక్ష వాహనం ‘డ్రాగన్’లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. బ్యాటరీల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఎప్పటిలోగా సరి చేస్తారన్న ఎవరూ చెప్పలేకపోతున్నారు. డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ సిద్ధమైతే తప్ప సునీతా విలియమ్స్, విల్మోర్ వెనక్కి రాలేరు. ఏప్రిల్ నాటికి కూడా డ్రాగన్ అందుబాటలోకి రావడం అనుమానమేనని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, సునీతా విలియమ్స్, విల్మోర్ రాక ఆలస్యమవుతుండడం మరో కీలక ప్రయోగంపై ప్రభావం చూపుతోంది. యాక్సియోమ్–4 మిషన్‌లో భాగంగా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే భారత గ్రూప్ కెపె్టన్ శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు ప్రైవేట్ వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకోవాల్సి ఉంది. ఏప్రిల్‌లో ఈ ప్రయోగం చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. డ్రాగన్‌లో సునీతా విలియమ్స్, విల్మోర్ను వెనక్కి వస్తేనే ఈ నలుగురు ఐఎస్ఎస్కు చేరుకోగలుగుతారు. లేకపోతే ప్రయోగం వాయిదా వేయక తప్పదు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 19లోగా ఇద్దరు వ్యోమగాములు వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు యాక్సియోమ్–4 మిషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సునీతా విలియమ్స్, విల్మోర్ గత ఏడాది జూన్‌లో బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం వారం రోజుల్లో భూమిపైకి తిరిగిరావాలి. స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో అది సాధ్యం కాలేదు. వారిద్దరూ అక్కడే ఉండిపోయారు. వారి ఆరోగ్యం బాగుందని, ఎలాంటి సమస్యలు లేవని నాసా అధికారులు ప్రకటించారు. -
‘2023 ఓజీ40’ : గ్రహశకలాన్ని గుర్తించిన బాలుడు
నాసా వారి ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్(ఐఏడీపీ)లో ఇద్దరు క్లాస్మెట్లతో కలిసి పాల్గొన్న 14 సంవత్సరాల దక్ష్ మాలిక్ అంగారక గ్రహం, బృహస్పతిల మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ మధ్య గ్రహశకలాన్ని కనుగొన్నాడు. దీని కోసం ఆస్ట్రోనామికా అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకున్నాడు.హార్డిన్ సిమన్స్ యూనివర్శిటికి చెందిన డాక్టర్ పాట్రిక్ మిల్లర్ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. తాత్కాలికంగా ఈ గ్రహశకలానికి ‘2023 ఓజీ40’ అని నామకరణం చేశారు. త్వరలో మాలిక్ పెట్టబోయే పేరే ఈ గ్రహశకలానికి శాశ్వతంగా ఉండిపోతుంది. గ్రహశకలానికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించడానికి నాసాకు నెలల సమయం పడుతుంది. ఆ తరువాత దానికి పేరు పెడతారు.ఇదీ చదవండి: Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మాలిక్ ‘శివనాడర్ స్కూల్’లో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి మాలిక్‌కు అంతరిక్షం అంటే ఇష్టం. గ్రహాలు, సౌరకుటుంబం గురించి నేషనల్ జియోగ్రాఫిక్‌లో వచ్చిన డాక్యుమెంటరీలన్నీ చూసేవాడు. ఐఏడీపీలో ప్రతి సంవత్సరం ఆరువేలమందికి పైగాపాల్గొంటారు. వారిలో కొందరు కొత్త గ్రహశకలాలని కనుక్కోవడంలో విజయం సాధించారు. ‘ఐఏడీపీ’ వెబ్సైట్ ప్రకారం గ్రహశకలాన్ని కనుగొన్న ఆరవ భారతీయ విద్యార్థి దక్ష్ మాలిక్. ‘ఈ అన్వేషణ నాకు సరదాగా అనిపించింది. గ్రహశకలం కోసం వెదుకుతున్నప్పుడు నాసాలో పనిచేస్తున్నట్లు అనిపించింది. నా కల నిజమైంది’ అంటున్నాడు ఆనందంగా దక్ష్ మాలిక్.చదవండి : కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్ -
సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు
నాసా వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా నిలిచారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న ఆమె.. తన 9వ స్పేస్‌వాక్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ సేపు స్పేస్ వాక్ చేసిన ఘనతతో ఆమె నాసా ఆల్‌టైం లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు.సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గురువారం ఉమ్మడిగా స్పేస్‌వాక్ చేశారు. తాజా స్పేస్‌వాక్‌తో కలిపి.. మొత్తంగా 62 గంటల 6 నిమిషాలపాటు ఆమె వాక్ పూర్తి చేసుకున్నారు. తద్వారా నాసా వ్యోమగామి పెగ్గీ వైట్సన్ రికార్డు(60 గంటలు) ఆమె అధిగమించారు. అంతేకాదు.. స్పేస్‌వాక్ టాప్ టెన్ జాబితాలో సునీతా విలియమ్స్ నాలుగో స్థానానికి ఎగబాకారు. అత్యధికంగా స్పేస్‌వాక్ చేసింది కాస్మోనాట్ అనాటోలీ సోలోవ్యెవ్. పదహారుసార్లు స్పేస్‌వాక్ చేసిన ఆయన.. 82 గంటల 22 నిమిషాలు గడిపారు. ఇక ఈ టాప్ టెన్ లిస్ట్‌లో ఎనిమిది మంది నాసా వ్యోమగాములే ఉండడం గమనార్హం. ఫైడోర్ యర్చికిహిన్(కాస్మోనాట్) 59 గంటల 28 నిమిషాలు వాక్ చేసి తొమ్మిది స్థానంలో కొనసాగుతున్నారు.కాస్మోనాట్.. రష్యా(పూర్వపు సోవియట్ యూనియన్) వ్యోమగామి , ఆస్ట్రోనాట్.. అమెరికా నాసా వ్యోమగామి.. వ్యోమనాట్.. తరచూ భారత వ్యోమగామికి, టైకోనాట్.. చైనా వ్యోమగామి, స్పేషియోనాట్.. ఫ్రాన్స్‌తో పాటు ఫ్రెంచ్ మాట్లాడే మరికొన్ని దేశాలువారం వ్యవధిలో సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్ చేయడం ఇది రెండోసారి. సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు బయటి భాగంలో చేయాల్సిన మరమ్మతులు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించారు. భూమికి 420 కిలోమీటర్ల ఎగువన సరిగ్గా స్పెయిన్ దేశం పైభాగాన తాము స్పేస్‌వాక్ చేశామని, చాలా ఆనందంగా ఉందని వాళ్లు అంటున్నారు. ఇదిలా ఉంటే.. అంతరిక్షంలో తొలిసారి స్పేస్‌వాక్ చేసింది సోవియట్ కాస్మోనాట్(ప్రస్తుత రష్యా) వ్యోమగామి అలెక్సీ లెనోవ్. 1965, మార్చి 18వ తేదీన వాష్కోడ్ 2 మిషన్‌లో భాగంగా.. 12 నిమిషాల 9 సెకండ్లపాటు ఆయన బయటకు వచ్చారు. అంతరిక్ష పరిశోధనల్లో ఆయన నడక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఇక.. గత ఏడాది జూన్‌లో వీళ్లిద్దరూ ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో అది సాధ్య పడలేదు. ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.అయితే.. అందుకోసం ప్రయత్నాలు మాత్రం ముమ్మరం అయ్యాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం జోక్యం చేసుకున్నారు. ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకురావడానికి సాయం అందించాలని స్పేస్ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్ ను కోరారు. అన్నీకుదిరితే.. ఈ మార్చి ఆఖర్లో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో వాళ్లను భూమ్మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరగొచ్చు. -
డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ పైలట్‌గా శుభాంశు శుక్లా
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన మొట్ట మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) రికార్డుకెక్క బోతు న్నాడు. స్పేస్ఎక్స్(SpaceX) సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్Dragon spacecraft)కు పైలట్‌గా వ్యవహరించబోతున్నాడు. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతి మంజూరు చేసింది. యాక్సి యోమ్–4 మిషన్‌లో భాగంగా నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని కి చేరుకోనున్నారు. 14 రోజుల తర్వాత తిరిగి వస్తారు. ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైతం భాగస్వా మిగా మారింది. డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ సారథ్యం వహించనున్నా డు. పోలాండ్‌కు చెందిన ఉజ్నాన్స్కీ, హంగేరీకి చెందిన టిబో ర్ కపూ సైతం ఇందులో పాలుపంచుకుంటున్నా రు. మొత్తం నలుగురు అస్ట్రోనాట్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్కు చేరుకుంటారు. త్వరలో ఈ ప్రయోగం చేపట్టడానికి ఏర్పాట్లు పూర్త య్యాయి. శుభాంశు శుక్లా ప్రస్తుతం భార త వైమా నిక దళంలో గ్రూప్ కెప్టెన్‌గా పనిచేస్తున్నాడు. యా క్సియోమ్–4 మిషన్‌కు ఎంపికయ్యాడు. నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఏరో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీలో శిక్షణ పొందాడు. -
సునీత స్పేస్‌వాక్ చూశారా?
కేప్ కెనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి, స్టేషన్ కమాండర్ సునీతా విలియమ్స్ దినచర్య గురువారం కాస్త మారింది. దాదాపు ఏడు నెలలపాటు వివిధ శాస్త్రీయ ప్రయోగాలతో గడిపిన ఈమె గురువారం ఐఎస్ఎస్ వెలుపలికి వచ్చి స్పేస్‌వాక్ చేశారు.ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో విహరించడమే స్పేస్‌వాక్(Space Walk). నాసాకే చెందిన మరో వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి సునీతా విలియమ్స్(Sunitha Williams) ఐఎస్ఎస్కు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో ఐఎస్ఎస్ తుర్క్మెనిస్తాన్కు సరిగ్గా 260 మైళ్ల ఎత్తులో ఉందని నాసా తెలిపింది. అంతకుముందు కూడా పలుమార్లు ఐఎస్ఎస్లోకి వచి్చన సునీతకు తాజా స్పేస్‌వాక్ ఎనిమిదోది కావడం గమనార్హం.గతేడాది జూన్‌లో బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారం పాటు మాత్రమే వారు అక్కడ గడపాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్‌లో సమస్యలు తలెత్తడంతో అప్పటి నుంచి వారి తిరుగు ప్రయాణం వాయిదా పడుతూ వస్తోంది. వచ్చే వారం సునీత, విల్మోర్ను తిరిగి తీసుకు వచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తోంది. The rate gyro assembly that helps maintain station orientation has been replaced. @AstroHague will soon work on the NICER X-ray telescope while @Astro_Suni will replace navigation hardware. pic.twitter.com/EfqNDF8ZAI— International Space Station (@Space_Station) January 16, 2025🚀 జూన్ 5వ తేదీన బోయింగ్ కొత్త స్టార్‌లైనర్ క్రూ క్యాప్సూల్‌లో.. సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారంపాటు టెస్ట్ ఫ్లైట్ తర్వాత వాళ్లు తిరిగి భూమికి చేరాల్సి ఉంది. కానీ..🚀బోయింగ్ స్టార్‌లైనర్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. థ్రస్టర్ ఫెయిల్యూర్స్, హిలీయం లీకేజీలతో.. ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. దీంతో సెప్టెంబర్ 7వ తేదీన ఆ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే క్యాప్సూల్ భూమ్మీదకు వచ్చేసింది. వాళ్లు భూమ్మీదకు ఎప్పుడు తిరిగి వస్తారో అనే ఆందోళన మొదలైంది.🚀టెంపరరీ విజిటర్స్‌గా వెళ్లిన విలియమ్స్, విల్మోర్లు.. ఐఎస్ఎస్కు ఫుల్‌టైం సిబ్బందిగా మారిపోయారు.స్పేస్‌వాక్, ఐఎస్ఎస్ నిర్వహణతో పాటు ఆ భారీ ప్రయోగశాలలో వీళ్లిద్దరితో శాస్త్రీయ పరిశోధనలు చేయించింది నాసా. అంతేకాదు.. వీళ్ల పరిస్థితిని మరో రూపకంలోనూ ‘ఛాలెంజ్’గా తీసుకుంది నాసా. ఇలాంటి విపత్కర పరిస్థితిల నడుమ అంతరిక్షంలో ఇరుక్కుపోయినవాళ్లను రక్షించేందుకు మంచి ఐడియాలు గనుక ఇస్తే.. వాళ్లకు రూ.17 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తామని నాసా ప్రకటించింది.🚀తప్పనిసరిగా ఇద్దరూ నెలలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. దీంతో.. సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న కథనాలు కలవరపాటుకు గురి చేశాయి. తాజాగా విడుదల చేసిన ఫొటోలు, వీడియోల్లోనూ ఆమె బరువు తగ్గినట్లు స్పష్టమైంది. గురుత్వాకర్షణ శక్తి లేని అలాంటి చోట.. కండరాలు, ఎముకలు క్షీణతకు గురవుతాయి. అలాంటప్పుడు.. రోజుకి రెండున్నర గంటలపాటు వ్యాయామాలు చేయడం తప్పనిసరి. 🚀అయితే నాసా మాత్రం ఆమె ఆరోగ్యంపై వస్తున్న కథనాలను.. పుకార్లుగా కొట్టిపారేస్తోంది. బరువు తగ్గినప్పటికీ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ను అందిస్తూ వస్తోంది. కానీ, ఐఎస్ఎస్లో ఆమె పరిస్థితిని చూసి నాసా ఏమైనా దాస్తోందా? అనే అనుమానాలు కలిగాయి. ఈ తరుణంలో తాను క్షేమంగానే ఉన్నానంటూ స్వయంగా సునీతనే ఓ వీడియో విడుదల చేశారు.🚀ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 1998 నవంబర్‌లో ఇది ప్రారంభమైంది. నాసాతో పాటు ఐదు దేశాల స్పేస్ స్టేషన్లు దీనిని నిర్వహణ చూసుకుంటాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భూమి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో లో ఎర్త్ ఆర్బిట్(LEO) వద్ద ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బరువు 4 లక్షల 45 వేల కేజీలు. 59ఏళ్ల సునీతా విలియమ్స్.. ప్రస్తుతం దీనికి కమాండర్‌గా ఉన్నారు. -
సూర్యుడి ‘కరోనా’ను తాకింది...
న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ స్పేస్‌క్రాఫ్ట్ చరిత్ర సృష్టించింది. నాసా ప్రయోగించిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ సూర్యుడికి అత్యంత సమీపానికి చేరుకుంది. ఈ విషయాన్ని నాసా శుక్రవారం ధ్రువీకరించింది. 2018లో ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక కొద్దిరోజుల క్రితమే భగభగ మండే సూర్యుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్ల(6.1 మిలియన్ కిలోమీటర్లు) దూరానికి విజయవంతంగా చేరుకుంది. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా గుండా ప్రయాణించింది. ఎలాంటి ముప్పు లేకుండా సురక్షింగా ఉంది. చరిత్రలో ఇప్పటిదాకా లోకబాంధవుడికి ఇంత సమీపానికి వెళ్లి, సురక్షితంగా ఉన్న అంతరిక్ష నౌక మరొకటి లేదు. అంతా సవ్యంగా ఉన్నట్లు పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి గురువారం రాత్రి నాసాకు సందేశం అందింది. పార్కర్ రాబోయే కొన్ని రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలో చక్కర్లు కొట్టనుంది. దాంతో అక్కడి నుంచి సంకేతాలు ఆగిపోతాయి. సురక్షిత ప్రాంతానికి తిరిగివచ్చిన తర్వాత మళ్లీ సంకేతాలు అందుతాయి. మానవులు ఇప్పటిదాకా నిర్మించిన అంతరిక్ష నౌకల్లో ఇదే అత్యంత వేగవంతమైంది కావడం గమనార్హం. గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 2,500 డిగ్రీల సెల్సియస్ ఫారెన్‌హీట్(1,370 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతను సైతం తట్టుకొనేలా పటిష్టమైన హీట్ షీల్డ్‌ను పార్కర్‌పై అమర్చారు. సూర్యుడి నుంచి అత్యధిక ఉష్ణోగ్రత జనించడానికి కారణం ఏమిటన్నది మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించారు. ఇదిలా ఉండగా, పార్కర్ సోలార్ ప్రోబ్ వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ సూర్యుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించనుంది. -
మరో మూడు నెలల్లో ‘నిసార్’ ప్రయోగం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఉమ్మడి ప్రయోగానికి రంగం సిద్ధమైంది. నాసా–ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్(నిసార్) శాటిలైట్‌ను వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రయోగించబోతున్నారు. ఈ మిషన్ విలువ రూ.5,000 కోట్లు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల్లో రెండు దేశాల మధ్య సహకారంలో ఇదొక మైలురాయిగా మారబోతోంది. అంతరిక్షంపై అత్యాధునిక పరిశోధనల కోసం నిసార్‌ను ప్రయోగిస్తున్నారు. 2009లో మొదలైన ఈ ఆలోచన వాస్తవం రూపం దాల్చబోతోంది. నిసార్ ఉపగ్రహం బరువు 2.8 టన్నులు.భూమిపై జరిగే మార్పులను ఈ ప్రయోగంతో అత్యంత కచి్చతత్వంతో గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సంప్రదాయ శాటిలైట్ల కంటే ఇది పూర్తిగా భిన్నమైనది. ఇందులో అడ్వాన్స్డ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ టెక్నాలజీ ఉపయోగించారు. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ ఎంకే–2 రాకెట్ ద్వారా నిసార్‌ను ప్రయోగించనున్నారు.ఇది మిషన్ కాల వ్యవధి మూడేళ్లు. మరోవైపు స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్(స్పేడెక్స్) ఉపగ్రహాల చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. పీఎస్ఎల్వీ–సి60 రాకెట్ ద్వారా వీటిని త్వరలో ప్రయోగించనున్నారు. ఈ రెండు ఉపగ్రహాలతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో భారత్ ముందంజ వేయనుంది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా పీఎస్ఎల్వీ ఆర్బిటాల్ ఎక్స్పరిమెంట్ మాడ్యూల్–4(పోయెం–4) ద్వారా 24 శాస్త్రీయ ప్రయోగాలు చేయాలని ఇస్రో నిర్ణయించింది. -
రేపు సూర్యుడి సమీపానికి ‘నాసా’ పార్కర్
న్యూయార్క్: సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌గా ‘నాసా’ పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు సృష్టించబోతోంది. సూర్యగోళంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 2018లో అంతరిక్ష నౌకను ప్రయోగించింది. అప్పటినుంచి సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తూనే ఉంది. మంగళవారం ఇది లోకబాంధవుడికి అత్యంత సమీపంలోకి వెళ్లనుంది. అంటే భాస్కరుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్ల(6 మిలియన్ కిలోమీటర్లు) దూరానికి చేరుకుంటుంది. ఒక ఫుట్‌బాల్ మైదానాన్ని ఊహించుకుంటే ఒకవైపు సూర్యుడు, మరోవైపు భూమి ఉంటాయని, 4–యార్డ్ లైన్ వద్ద పార్కర్ ఉంటుందని నాసా సైంటిస్టు జో వెస్ట్‌లేక్ చెప్పారు.సూర్య భగవానుడికి ఇంత సమీపంలోకి వెళ్లిన అంతరిక్ష నౌక ఇప్పటిదాకా ఏదీ లేదు. సూర్యుడికి దగ్గరిగా వెళ్లిన తర్వాత పార్కర్ నుంచి సమాచారం నిలిచిపోనుంది. అప్పుడు దాని పరిస్థితి ఏమటన్నది అంచనా వేయలేకపోతున్నారు. క్షేమంగా వెనక్కి వస్తుందా? లేక ఏదైనా జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో పార్కర్ అత్యంత వేగవంతమైనది. ఇది గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణానికి దెబ్బతినకుండా బలమైన హీట్ షీల్డ్ అమర్చారు. ఇది 1,371 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు. సూర్యుడికి దగ్గరగా వెళ్లిన తర్వాత వచ్చే ఏడాది సెపె్టంబర్ దాకా అదే కక్ష్యలోకి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యుడి ఉపరితలం కంటే కరోనా ఎందుకు వందల రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుందన్న సంగతి తెలుసుకోవడానికి పార్కర్ తగిన సమాచారం ఇస్తుందని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు. -
సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం!
వాషింగ్టన్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న ఇద్దరు వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకురావడానికి మరింత సమయం పట్టనుందని నాసా ప్రకటించింది.వ్యోమగాముల్ని స్పేస్ నుంచి భూమికి తీసుకువచ్చే బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్‌లైనర్ అనే వ్యోమనౌకలో అనేక సాంకేతికత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా సునీత విలియమ్స్, విల్మోర్లు వచ్చే ఏడాది మార్చి నెల చివరి నాటికి స్పేస్ నుంచి భూమి మీదకు వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది. వ్యోమగాములు సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్లు 8 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్మోర్లు ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి సమస్యలు తలెత్తాయి.NASA again delays return of two astronauts stranded on space station.Veteran astronauts Butch Wilmore and Suni Williams arrived at the ISS in June aboard Boeing's Starliner spacecraft, and were due to spend eight days on the orbiting laboratoryhttps://t.co/1ZIsWApfvX pic.twitter.com/AyFR5ifJdd— AFP News Agency (@AFP) December 18, 2024 స్టార్ లైనర్‌లో సమస్యల్ని పరిష్కరించి భూమి మీదకు తెచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి స్పేస్‌లో చిక్కుకున్న వీరిద్దరిని భూమి మీదకు తెచ్చేందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్పేస్ ఎక్స్ క్రూ మిషన్ స్పేస్‌లోకి పంపింది. క్రూ-9 మిషన్ విజయవంతంగా ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. ఇదే క్రూ-9 మిషన్‌లో సునీత విలియమ్స్, విల్మోర్లు వచ్చే ఏడాదిలో రానున్నట్లు నాసా వెల్లడించింది. -
బృహస్పతి చంద్రుడిపై శిలాద్రవ గదులు
సౌర వ్యవస్థలో సూర్యుడి నుంచి ఐదో గ్రహం జూపిటర్(బృహస్పతి). అన్ని గ్రహాల్లోకెల్లా ఇదే పెద్దది. మన భూమికి ఉపగ్రహం చందమామ ఉన్నట్లే బృహస్పతికి కూడా ‘ఐవా’ అనే ఉపగ్రహం ఉంది. మొత్తం సౌర వ్యవస్థలో నిరంతరం జ్వలించే భారీ అగ్నిపర్వతాలు (వాల్కనో) ఉన్న పెద్ద ఉపగ్రహం ఐవా. ఇక్కడ 400 అగ్నిపర్వతాలు ఉన్నట్లు అంచనా. ఇవి నిత్యం శిలాద్రవాన్ని(మాగ్మా) విరజిమ్ముతూనే ఉంటాయి. అదొక అగ్ని గుండమని చెప్పొచ్చు. సరిగ్గా మన చందమామ పరిమాణంలో ఉండే ఐవాలో ఈ వాల్కనోలకు కారణం ఏమిటన్నది చాలా ఏళ్లుగా మిస్టరీగానే ఉండేది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ’నాసా’ ఈ రహస్యాన్ని ఛేదించే విషయంలో పురోగతి సాధించింది. నాసా సైంటిస్టులు జూనో మిషన్‌లో భాగంగా బృహస్పతిపై పరిశోధనలకు జూనో స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగించారు. 2023 డిసెంబర్, 2024 ఫిబ్రవరిలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఐవా సమీపంలోకి వెళ్లింది. ఐవా ఉపరితలం నుంచి 1,500 కిలోమీటర్ల ఎత్తువరకూ చేరుకొని ఫొటోలు చిత్రీకరించింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన డాప్లర్ డేటాను సేకరించింది. ఈ గణాంకాలను విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలు ఐవాపై నిప్పుల కొండలకు కారణం ఏమిటన్నది గుర్తించారు. ఐవా ఉపరితలం కింద మాగ్మా ఒక సముద్రం తరహాలో విస్తరించి లేదని, వేర్వేరు చాంబర్ల(గదులు)లో ఉందని కనిపెట్టారు. శిలాద్రవం ఒకదానితో ఒకటి సంబంధం లేదని వేర్వేరు చాంబర్లలో ఉండడం వల్ల అధిక ఒత్తిడితో ఉపరితలంపైకి వేగంగా చొచ్చుకొని వస్తున్నట్లు చెప్పారు. దాంతో విరామం లేకుండా అగ్నిపర్వతాలు జ్వలిస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ సముద్రం తరహాలో మాగ్మా విస్తరించే ఉంటే దానిపై ఒత్తిడి తక్కువగా ఉండేది. అలాంటప్పుడు అది పైకి ఉబికి వచ్చే అవకాశం అంతగా ఉండదు. ఈ అధ్యయనం వివరాలను నేచురల్ జర్నల్‌లో ప్రచురించారు. ఐవా ఉపగ్రహాన్ని తొలిసారిగా 1610లో గలీలియో గలిలీ కనిపెట్టారు. కానీ, అక్కడ భారీ సంఖ్యలో అగ్నిపర్వతాలు ఉన్న సంగతి 1979తో తెలిసింది. నాసా ప్రయోగించిన వోయేజర్–1 స్పేస్‌క్రాఫ్ట్ ఈ విషయం గుర్తించింది. అప్పటి నుంచి వీటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఐవాపైనున్న వాల్కనోల గుట్టు తెలిసింది కాబట్టి గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా, ఎప్పుడు ఏర్పడ్డాయన్నది గుర్తించడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమివైపు దూసుకొస్తున్న ఐదు భారీ గ్రహశకలాలు
అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) అంతరిక్ష పరిశోధనలు సాగిస్తుంటుంది. ఈ నేపధ్యంలో ఖగోళంలో జరిగే దృగ్విషయాలను ప్రపంచానికి తెలియజేస్తుంటుంది.తాజాగా నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఐదు గ్రహశకలాలపై దృష్టి పెట్టింది. ఈ ఖగోళ శకలాలు 2024, డిసెంబరు 11న భూమిని దాటుతాయని తెలిపింది. వీటివలన భూమికి ఎటువంటి ప్రమాదం ఉండబోదని నాసా తెలిపింది. నాసా శాస్త్రవేత్తలు గ్రహశకలాలపై అధ్యయనం చేసేందుకు ఇది సదవకాశంగా భావిస్తున్నారు. ఆ గ్రహశకలాల వివరాలను శాస్త్రవేత్తలు తెలియజేశారు.గ్రహశకలం 2018 ఎక్స్‌యూ 3గ్రహశకలం 2018 ఎక్స్‌యూ 3.. ఈ సమూహంలో అతిపెద్దది. దాదాపు 811 అడుగుల ఎత్తు కలిగిన ఇది విమానం సైజును పోలి ఉంటుంది. ఇది 4 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమిని సురక్షితంగా దాటనుంది. శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం నిర్మాణాన్ని, కదలికలను అధ్యయనం చేయనున్నారు.గ్రహశకలం 2024 ఎక్స్జెడ్ 11గ్రహశకలం 2024 ఎక్స్జెడ్ 11.. ఎక్స్‌యూ 3 కంటే కొంచెం చిన్నది. 71 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. ఇది భూమికి 2.112 మిలియన్ మైళ్లు దూరం నుంచి దాటనుంది.గ్రహశకలం 2024 ఎక్స్ఎల్ 11గ్రహశకలం 2024 ఎక్స్ఎల్ 11 ఈ సమూహంలో అతి చిన్నది. కేవలం 20 అడుగుల పరిమాణంతో, 7,35,000 మైళ్ల దూరం నుంచి భూమిని దాటుతుంది. దీని పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ, దీని పరిశోధనలో అనేక విషయాలు వెల్లడికానున్నాయి.గ్రహశకలం 2024 ఎక్స్‌కే 1గ్రహశకలం 2024 ఎక్స్‌కే 1 పరిమాణంలో ఒక బస్సును పోలి ఉంటుంది. 31 అడుగుల పరిమాణంతో, ఇది భూమికి 1.16 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది.గ్రహశకలం 2024 డబ్ల్యూబీ 14గ్రహశకలం 2024 డబ్ల్యూబీ 14 వెడల్పు 86 అడుగులు. ఇది 4.3 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమిని సురక్షితంగా దాటుతుంది. నాసా తన ప్రయోగశాల నుండి ఈ గ్రహశకలాలను పర్యవేక్షిస్తోంది. శాస్త్రవేత్తలు వీటిపై అధ్యయనం సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: Sharad Pawar Birthday: సోనియా.. శరద్ పవార్ వైరం వెనుక.. -
60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి.. ‘నాసా’ కొత్త చీఫ్ ఇసాక్‌మన్ సక్సెస్ స్టోరీ
అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార పీఠం అధిష్టించాక పాలనలో పలు మార్పులు తీసుకువస్తున్నారు. ప్రతిష్టత్మక పదవులలో నూతన నియామకాలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే అధ్యక్షుడు ట్రంప్ తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)కు చీఫ్‌గా 41 ఏళ్ల బిలియనీర్ జారెడ్ ఇసాక్మన్ను నియమించారు.ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ స్పేస్ ఎక్స్ సాయంతో అంతరిక్షంలోకి మొదటి ప్రైవేట్ ట్రిప్ చేసిన వ్యక్తి ఇసాక్‌మన్. 2009లో ఇసాక్‌మన్ 60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి నూతన ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 16 ఏళ్ల వయసులో చదవును విడిచిపెట్టి, నేడు నాసాకు చీఫ్‌గా నియమితులయ్యే వరకూ ఇసాక్‌మన్ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇసాక్‌మన్ అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగానూ గుర్తింపుపొదారు.ఇసాక్‌మన్ 1983, ఫిబ్రవరి 11న న్యూజెర్సీలో డొనాల్డ్,సాండ్రా మేరీ ఐజాక్మన్ దంపతులకు జన్మించారు. నలుగురు తోబుట్టువులలో ఇసాక్‌మన్ చిన్నవాడు. ఆయన కిండర్ గార్టెన్ నుండి ఆరవ తరగతి వరకు వెస్ట్‌ఫీల్డ్‌లోని విల్సన్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాడు. ఇసాక్మన్కు 12 ఏళ్లు ఉన్నప్పుడు అతని కుటుంబం న్యూజెర్సీలోని బెర్నార్డ్స్ టౌన్‌షిప్‌లోని లిబర్టీ కార్నర్ విభాగానికి షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఇసాక్‌మన్ విలియం అన్నీన్ మిడిల్ స్కూల్లో చదువుకున్నారు.హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో ఇసాక్‌మాన్ తన స్నేహితునితో కలిసి తన ఇంటిలో క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ కంపెనీ షిఫ్ట్ 4ను ప్రారంభించారు. 1999లో ఇసాక్‌మన్ పాఠశాల చదువును మధ్యలోనే విడిచిపెట్టారు. అయితే హైస్కూల్ డిప్లొమాకు సమానమైన జీఈడీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం కంపెనీ షిఫ్ట్ 4 కంపెనీ విలువ దాదాపు 7.4 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ హిల్టన్, కేఎఫ్‌సీ వంటి బ్రాండ్లకు చెల్లింపు ప్రాసెసింగ్ చేస్తుంది.ఇసాక్‌మన్ ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెషనల్ ఏరోనాటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. 2011లో ఈ డిగ్రీని పొందిన ఇసాక్మన్కు సైనిక విమానాలను నడిపేందుకు అవసరమైన లైసెన్స్ కూడా ఉంది. అతని దగ్గర దాదాపు 100 యుద్ధ విమానాలు ఉన్నాయి. అతని కంపెనీ అమెరికా, నాటో దేశాల వైమానిక దళాల ఫైటర్ పైలట్లకు శిక్షణ ఇస్తుంది. ఇసాక్‌మన్ అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అతని ఆస్తుల నికర విలువ 1.9 అమెరికన్ బిలియన్ డాలర్లు. 2021లో పొలారిస్ ప్రోగ్రామ్ కింద ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్ సహాయంతో చారిత్రక అంతరిక్ష యాత్ర చేశాడు. ఈ పర్యటన కోసం ఇసాక్‌మన్ 200 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాడు.ఇది కూడా చదవండి: భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్ వైఖరి? -
ఆండ్రోమెడాలో వెలుగుల పున్నమి
సువిశాల విశ్వంలో ఎన్నెన్నో నక్షత్ర మండలాలు (గెలాక్సీలు)న్నాయి. మన నక్షత్ర మండలాన్ని పాలపుంత (మిల్కీవే) అంటారన్నది తెలిసిందే. మనకు సమీపంలో ఉన్న అతిపెద్ద నక్షత్ర మండలం ఆండ్రోమెడా. ఈ గెలాక్సీలో అరుదైన దృశ్యాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) బృందం కెమెరాలో బంధించింది. గెలాక్సీలోని నక్షత్రాలపై ఉన్నట్టుండి పేలుడు సంభవించి భిన్న రంగులతో కూడిన అత్యధిక కాంతి వెలువడడాన్ని నోహ్‌వై అంటారు. ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో ఇలాంటి నోహ్‌వై నుంచి పరారుణ ఉద్గారాలను తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఆస్ట్రోశాట్ ఉపగ్రహంపై అమర్చిన అ్రల్టావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (యూవీఐటీ) ద్వారా ఈ ఉద్గారాలను చిత్రీకరించారు. నోహ్‌వై సాధారణంగా బైనరీ నక్షత్ర వ్యవస్థలో సంభవిస్తూ ఉంటుంది. భూమి పరిమాణంలో ఉన్న మరుగుజ్జు నక్షత్రం మరో నక్షత్రానికి సమీపంలో పరిభ్రమిస్తున్నప్పుడు ఈ పరిణామాన్ని చూడొచ్చు. ఒక నక్షత్రం తన గురుత్వాకర్షణ శక్తితో మరో నక్షత్రంలోని పదార్థాన్ని ఆకర్షిస్తే శక్తివంతమైన థర్మోన్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుంది. దాంతో హఠాత్తుగా మిరుమిట్లు గొలిపే వెలుగుతో నక్షత్రంపై పేలుడు సంభవిస్తుంది. ఆండ్రోమెడా గెలాక్సీలో నోహ్‌వై నుంచి 42 దాకా అ్రల్టావైలెట్ ఉద్గారాలను గుర్తించడం విశేషం. వీటిపై మరింత అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాలను అస్ట్రో ఫిజికల్ జర్నల్‌లో ప్రచురించారు. నక్షత్ర మండలాల గురించి తెలుసుకోవడానికి ఈ సమాచారం తోడ్పడుతుందని భావిస్తున్నారు. నోహ్‌వై రహస్యాలను ఛేదించడానికి భవిష్యత్తులో అ్రల్టావైలెట్, ఎక్స్–రే మిషన్లలో పరిశోధనలకు సైతం ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Sunita Williams: ఆర్నెల్లు పూర్తి.. నాసా ఏమైనా దాస్తోందా?
వారం అనుకుంటే.. అటు తిరిగి ఇటు తిరిగి అదికాస్త ఆరు నెలలు దాటేసింది. నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుట్చ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లి ఆరు నెలలు పూర్తైంది. మరో రెండు నెలలపాటు వాళ్లు అక్కడ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈలోపు సునీతా విలియమ్స్ ఆరోగ్యం పాడైపోయిందంటూ కథనాలు వెలువడ్డాయి. ఇంకొన్ని కథనాలైతే ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురయ్యే అవకాశాలున్నాయంటూ భయపెట్టిస్తున్నాయి. ఇంతకీ నాసా ఏమంటోంది?🚀జూన్ 5వ తేదీన బోయింగ్ కొత్త స్టార్‌లైనర్ క్రూ క్యాప్సూల్‌లో.. సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారంపాటు టెస్ట్ ఫ్లైట్ తర్వాత వాళ్లు తిరిగి భూమికి చేరాల్సి ఉంది. కానీ..🚀బోయింగ్ స్టార్‌లైనర్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. థ్రస్టర్ ఫెయిల్యూర్స్, హిలీయం లీకేజీలతో.. ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. దీంతో సెప్టెంబర్ 7వ తేదీన ఆ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే క్యాప్సూల్ భూమ్మీదకు వచ్చేసింది. వాళ్లు భూమ్మీదకు ఎప్పుడు తిరిగి వస్తారో అనే ఆందోళన మొదలైంది.🚀టెంపరరీ విజిటర్స్‌గా వెళ్లిన విలియమ్స్, విల్మోర్లు.. ఐఎస్ఎస్కు ఫుల్‌టైం సిబ్బందిగా మారిపోయారు.స్పేస్‌వాక్, ఐఎస్ఎస్ నిర్వహణతో పాటు ఆ భారీ ప్రయోగశాలలో వీళ్లిద్దరితో శాస్త్రీయ పరిశోధనలు చేయించింది నాసా. అంతేకాదు.. వీళ్ల పరిస్థితిని మరో రూపకంలోనూ ‘ఛాలెంజ్’గా తీసుకుంది నాసా. ఇలాంటి విపత్కర పరిస్థితిల నడుమ అంతరిక్షంలో ఇరుక్కుపోయినవాళ్లను రక్షించేందుకు మంచి ఐడియాలు గనుక ఇస్తే.. వాళ్లకు రూ.17 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తామని నాసా ప్రకటించింది.🚀తప్పనిసరిగా ఇద్దరూ ఎనిమిది నెలలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. దీంతో.. సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న కథనాలు కలవరపాటుకు గురి చేశాయి. తాజాగా విడుదల చేసిన ఫొటోలు, వీడియోల్లోనూ ఆమె బరువు తగ్గినట్లు స్పష్టమైంది. గురుత్వాకర్షణ శక్తి లేని అలాంటి చోట.. కండరాలు, ఎముకలు క్షీణతకు గురవుతాయి. అలాంటప్పుడు.. రోజుకి రెండున్నర గంటలపాటు వ్యాయామాలు చేయడం తప్పనిసరి. 🚀అయితే నాసా మాత్రం ఆమె ఆరోగ్యంపై వస్తున్న కథనాలను.. పుకార్లుగా కొట్టిపారేస్తోంది. బరువు తగ్గినప్పటికీ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ను అందిస్తూ వస్తోంది. కానీ, ఐఎస్ఎస్లో ఆమె పరిస్థితిని చూసి నాసా ఏమైనా దాస్తోందా? అనే అనుమానాలు కలిగాయి. ఈ తరుణంలో తాను క్షేమంగానే ఉన్నానంటూ స్వయంగా సునీతనే ఓ వీడియో విడుదల చేశారు.🚀సెప్టెంబర్ 19న.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఈసారి ఆమె పుట్టినరోజు జరిగింది. అయితే అంతరిక్షంలో ఇదే ఆమెకు తొలి పుట్టినరోజేం కాదు. 2012లో జులై 14 నుంచి నవంబర్ 18 మధ్య ఆమె స్పేస్‌లోనే గడిపారు.🚀భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్.. అంతరిక్షం నుంచే కోట్లాది మందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు.. జులై 26వ తేదీన ఓ సరదా వీడియోను విడుదల చేసింది నాసా. భూమికి మైళ్ల దూరంలో స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు సరదా యాక్టివిటీస్‌లో భాగం అవుతారని ‘ఒలింపిక్స్’పేరిట వీడియో రిలీజ్ చేశారు.🚀ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 1998 నవంబర్‌లో ఇది ప్రారంభమైంది. నాసాతో పాటు ఐదు దేశాల స్పేస్ స్టేషన్లు దీనిని నిర్వహణ చూసుకుంటాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భూమి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో లో ఎర్త్ ఆర్బిట్(LEO) వద్ద ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బరువు 4 లక్షల 45 వేల కేజీలు. 59ఏళ్ల సునీతా విలియమ్స్.. ప్రస్తుతం దీనికి కమాండర్‌గా ఉన్నారు. 🚀మరో రెండు నెలల తర్వాత.. ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ -9 రాకెట్ అక్కడికి వెళ్లనుంది. అందులో సునీతా విలియమ్స్, బుట్చ్ విల్మోర్లను భూమ్మీదకు తీసుకు వస్తారు.🚀అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న భారత–అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది స్పేస్‌వాక్ చేయబోతున్నారు. ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించారు. ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో విహరించడమే స్పేస్‌వాక్. 🚀భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్.. అమెరికాలోని ఒహాయో పట్టణంలో 1965లో జన్మించారు. ఆమె తండ్రి గుజరాతీ. తల్లి స్లొవేనియన్. మసాచుసెట్స్‌లోని నీధమ్ హైస్కూల్లో స్కూలింగ్ పూర్తిచేసిన ఆమె.. యూఎస్‌లోని నావల్ అకాడమీలో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తిచేసిన సునీత.. తొలుత అమెరికన్ నావికా దళంలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. డైవింగ్ ఆఫీసర్‌గా కొన్నాళ్ల పాటు పనిచేసిన ఆమె.. అంతరిక్షంపై మక్కువతో 1998లో రోదసీ యానానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు.🚀తన తొలి పర్యటనలో భాగంగా 2006 డిసెంబర్ నుంచి 2007 జూన్ వరకు.. సుమారు ఏడు నెలల పాటు ఐఎస్ఎస్లో గడిపారామె. ఈ సమయంలోనే 29 గంటల 17 నిమిషాల పాటు ఐఎస్ఎస్ వెలుపల నాలుగుసార్లు స్పేస్‌వాక్ చేశారు. ఇది అప్పట్లో రికార్డుగా నిలిచింది. ఇక 2012లో రెండోసారి అంతరిక్ష యాత్రకు వెళ్లారు సునీత. ఈ క్రమంలో నాలుగు నెలల పాటు ఐఎస్ఎస్లోనే గడిపిన ఆమె.. అక్కడి ఆర్బిటింగ్ ల్యాబొరేటరీపై పరిశోధనలు చేశారు. ఈ సమయంలోనూ అంతరిక్షంలో నడిచిన ఆమె.. మొత్తంగా 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేసి.. ఎక్కువ సమయం స్పేస్‌వాక్ చేసిన రెండో మహిళా వ్యోమగామిగా చరిత్రకెక్కారు. ఇలా గత రెండు స్పేస్షటిల్స్తో కలిపి మొత్తంగా 322 రోజులు అంతరిక్షంలో గడిపారు సునీత. 🚀కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో ఇండో-అమెరికన్ మహిళగా ఖ్యాతి గడించారు. ఇప్పటిదాకా రెండుసార్లు వెళ్లొచ్చారు. నాసా స్టార్‌లైనర్ వ్యోమనౌకలో ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్ష యానంలోనూ భారతీయ మూలాలను ఆమె ఏనాడూ వదల్లేదు. భగవద్గీతతో పాటు ఉపనిషత్తులను, గణపతి విగ్రహాన్ని వెంట తీసుకెళ్తానని ఆమె చెబుతూ ఉంటారు. -
నాసా చీఫ్‌గా జేర్డ్
వాషింగ్టన్: బిలియనీర్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్మన్ను నాసా చీఫ్‌గా కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంపిక చేశారు. ఫ్లోరిడా డెమొక్రటిక్ మాజీ సెనేటర్ బిల్ నెల్సన్ స్థానంలో జేర్డ్ ఇకపై నాసా అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. హైస్కూల్ డ్రాపవుట్ నుంచి అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగిన 41 ఏళ్ల జేర్డ్కు రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లిన అనుభవం ఉంది. అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేసిన తొలి ప్రైవేట్ వ్యోమగామిగా గుర్తింపుపొందారు. పైలట్, వ్యోమగామి అయిన జేర్డ్ను నాసా అడ్మినిస్ట్రేటర్‌గా నామినేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం ‘షిఫ్ట్4 పేమెంట్స్’ కంపెనీ సీఈవోగా ఉన్న జేర్డ్ తన 16వ ఏటలోనే ఈ కంపెనీని ప్రారంభించారు. 1983 ఫిబ్రవరి 11న న్యూజెర్సీలో జన్మించిన జేర్డ్ ఐజాక్మన్ 16వ ఏట హైస్కూలు చదువు మానేశారు. ‘నాసా చీఫ్‌గా పనిచేయడానికి అధ్యక్షుడు ట్రంప్ నామినేషన్‌ను స్వీకరించడం నాకు గౌరవంగా ఉంది. రెండో అంతరిక్ష యుగం ఇప్పుడే మొదలైంది. నాసా బృందంతో కలిసి పనిచేయడం జీవితకాల గౌరవం’ అని జేర్డ్ అన్నారు.Trump picks billionaire Jared Isaacman to lead NASA pic.twitter.com/cViJxvbK5y— Vaišvydas (@PauldoesShit) December 5, 2024 -
స్పేస్‌లో సునీతా విలియమ్స్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ చెక్ పెట్టారు. తాజాగా, తన ఆరోగ్యంగా బాగుందని స్పష్టం చేస్తూ ఓ ఫొటోని విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం సునీతా విలియమ్స్ బక్కచిక్కిన ముఖం కనిపించారు. ఇప్పుడు విడుదల చేసిన ఫొటోలో విలియమ్స్ ముఖంలో మార్పులు కనిపించాయి. ఆరోగ్యం సైతం కుదుట పడినట్లు అర్ధమవుతుంది. అంతరిక్షంలోని బోయింగ్ క్రూ ఫ్లైట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల్ని పరిష్కరించేందుకు ఈ ఏడాది జూన్ 5న సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ స్టార్‌లైనర్ స్పేస్‌లోకి వెళ్లారు. పని పూర్తి చేసుకుని కొన్ని రోజుల వ్యవధి తర్వాత తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది.కానీ వ్యోమగాముల్ని తీసుకెళ్లిన బోయింగ్ క్రూ ఫ్లైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ ఇద్దరు వ్యోమగాలు వచ్చే ఏడాది వరకు స్పేస్‌లో ఉండనున్నారు.అయితే స్పేస్‌లో మైక్రోగ్రావిటీ కారణంగా సునీతా విలియమ్స్ శరీరంలో ఎర్రరక్తకణాలు క్షీణించాయి. దీంతో సునీతా విలియమ్స్ ముఖం బక్కిచిక్కపోవంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. తిరిగి సాధారణ స్థితికి రావాలంటే పౌష్టికాహారం తప్పని సరి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సునీతా విలియమ్స్ అంతరిక్ష వాతావరణాన్ని తట్టుకునేలా ఆహారాన్ని తీసుకున్నారు. ఫలితంగా ఆరోగ్యం కుదుట పడి సాధారణ స్థితికి వచ్చారు.తాజాగా, సునీతా విలియమ్స్ షేర్ చేసిన ఫొటోతో ఆమె ఆరోగ్యంపై రేకెత్తుతున్న ఆందోళనలకు పులిస్టాప్ పడింది. -
చంద్రుని దక్షిణ ధ్రువంపై నాసా గ్యాస్ పైప్‌లైన్!
చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం దిశగా ప్రయత్నాలను నాసా ముమ్మరం చేస్తోంది. ఇందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్ ప్రోగ్రాంపై ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది కూడా. అందులో భాగంగా దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని అమెరికా అంతరిక్ష సంస్థ తాజాగా తలపోస్తోంది. దీన్ని ల్యూనార్ సౌత్‌పోల్ ఆక్సిజన్ పైప్‌లైన్ (ఎల్–ఎస్పీఓపీ)గా పిలుస్తున్నారు. చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్ రవాణాకు సంబంధించిన రిస్కులను, ఖర్చులను భారీగా తగ్గించుకోవడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఎందుకంటే చంద్రుని ఉపరితలం మీది రాతి నిక్షేపాల నుంచి ఆక్సిజన్‌ను వెలికితీయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నీటి అవసరాలను చంద్రునిపై అపారంగా పరుచుకున్న మంచుతో తీర్చుకోవాలని యోచిస్తోంది.ఎలా చేస్తారు?చంద్రునిపై ఆక్సిజన్‌ను కంప్రెస్డ్ గ్యాస్, లేదా ద్రవ రూపంలో ట్యాంకుల్లో బాట్లింగ్ చేయా లన్నది నాసా ప్రణాళిక. కాకపోతే వాటి రవాణా పెను సవాలుగా మారనుంది. ఆక్సిజన్‌ను దాని వెలికితీత ప్రాంతం నుంచి సుదూరంలో ఉండే మానవ ఆవాసాలకు తరలించేందుకు అత్యంత వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం తొలి దశలో కనీసం 5 కి.మీ. పొడవైన పైప్‌లైన్ నిర్మించాలన్నది ప్రాథమిక ప్రణాళిక. దీన్ని చంద్రునిపై అందుబాటులో ఉండే అల్యుమి నియం తది తరాల సాయంతోనే పూర్తి చేయాలని నాసా భావిస్తోంది.→ ఈ పనుల్లో పూర్తిగా రోబోలనే వాడనున్నారు.→ మరమ్మతుల వంటివాటిని కూడా రోబోలే చూసుకుంటాయి→ పైప్‌లైన్ ద్వారా ఆక్సిజన్ గంటకు రెండు కి.మీ. వేగంతో ప్రవహిస్తుంది→ ప్రాజెక్టు జీవితకాలం పదేళ్లని అంచనా – సాక్షి, నేషనల్ డెస్క్ -
సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunitha villiams) ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) కు వెళ్లిన విషయం తెలిసిందే. ఎనిమిది రోజుల కోసమని అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు బారీ విల్మోర్, సునీత విలియమ్స్‌లు ఎనిమిది నెలల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, వారిని స్పేస్ఎక్స్ డ్రాగన్‌లో భూమిపైకి తీసుకురావాలని నాసా ప్లాన్ చేస్తోంది. అయితే ఇటీవల సునీతాకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ కావడంతో ఆమె అనారోగ్యానికి గురయ్యిందని పలు కథనాలు రావడం మొదలయ్యాయి. ఈ తరుణంలో తన ఆరోగ్య పరిస్థితిపై ఐఎస్ఎస్ నుంచి సునీతా స్వయంగా అప్ డేట్ ఇచ్చారు. తన శారీరక పరిస్థితి, బరువు తగ్గడం తదితర ఊహగానాలకు చెక్‌పెట్టేలా తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. అలాగే తాను బరువు కోల్పోలేదని పెరిగానని చెప్పారు. తాను అంతరిక్షం కేంద్రవ వద్దకు వచ్చినప్పుడు ఎంత బరువు ఉన్నానో అంతే ఉన్నానని అన్నారు. అంతేగాదు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించేలా చంద్రుడు, అంగారక గ్రహంపై భవిష్యత్తులో మానవ అన్వేషణ లక్ష్యంగా చేస్తున్న ఈ మిషన్ కొనసాగుతుందని ధీమాగా చెప్పారు. అలాగే అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ కారణంగానే తన శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయే తప్ప బరువు కోల్పోలేదని వివరించారు. మైక్రోగ్రామిటీ వల్లే ఇదంతా..అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీకి శరీరంమంతా ఉండే ద్రవాలు పునః పంపిణీ అవుతుంటాయి. దీంతో తమ తలలు చాలా పెద్దవిగా కనిపిస్తాయని అన్నారు సునీతా. అలాగే ఈ అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు వ్యాయామాలు, వర్కౌట్లు వంటివి అత్యంత అవసరమని అన్నారు. సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు వారి తుంటి, వెన్నుమకల్లో ప్రతి నెల రెండు శాతం వరకు ఎముక సాంద్రతను కోల్పోతారని అన్నారు. అలా జరగకుండా ఉండేందుకు తాము వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్లు, ట్రెడ్మిల్ వర్కౌట్లతో సహా రోజువారీ ..వ్యాయామం రెండు గంటలకు పైగా చేస్తామని చెప్పారు. విపరీతంగా చేసిన వ్యాయమాల కారణంగానే శరీరాకృతిలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. అలాగే తాను బాగానే తింటున్నాని, ముఖ్యంగా..ఆలివ్‌లు, అన్నం, టర్కిష్ చేపల కూర తింటున్నట్లు చెప్పారు. (చదవండి: క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం.. నాసా ఏం చెప్పింది?) -
క్షేమంగానే ఉన్నా.. ఆరోగ్యంపై సునీతా విలియమ్స్ క్లారిటీ
-
క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం.. నాసా ఏం చెప్పిందంటే?
వాషింగ్టన్: బోయింగ్ తయారీ స్టార్‌లైనర్ సంస్థ పంపిన రాకెట్లో ప్రొపల్షన్ వ్యవస్థలో లోపం కారణంగా భూమికి తిరిగిరాలేక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉండిపోయిన భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎస్ఎస్కు వెళ్లేటపుడు పుష్టిగా ఉన్న సునీత తర్వాత బక్కచిక్కిపోయారని వార్తలొచ్చాయి. బుగ్గలు నొక్కుకుపోయిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో చివరకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి ఎదురైంది. ముందస్తు సన్నద్ధత లేకుండా సుదీర్ఘకాలంపాటు భారరహిత స్థితిలో గడపడం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నదని మీడియాతో కథనలు వెలువడటం తెల్సిందే. ఈ వార్తలను నాసా తాజాగా తోసిపుచ్చింది.‘‘అక్కడి వ్యోమగాముల ఆరోగ్యస్థితిని ఫ్లైట్ సర్జన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు’’ అని నానా స్పేస్ ఆపరేషన్స్ మిషన్ డైరెక్టరేట్ అధికార ప్రతినిధి జిమ్మీ రస్సెల్ అన్నారు. ‘‘ఎనిమిది రోజుల్లో తిరిగొస్తారనుకుంటే ఆరునెలలపాటు అక్కడే ఉంచుతున్నారు. సుదీర్ఘకాలం భారరహిత స్థితిలో ఉంటే కండరాల క్షీణత బారిన పడే వీలుంది. ఎముకల పటిష్టత తగ్గుతుంది. పోషకాలలేమి సమస్యలు వస్తాయి’’ అని కొందరు వైద్యనిపుణలు అభిప్రాయపడటం తెల్సిందే. సునీతతోపాటు బేరీ బుచ్విల్మోర్ సైతం అదేరోజున ఐఎస్ఎస్కు వెళ్లిన విషయం విదితమే.చదవండి: అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన ఎన్నారైలు.. ఎంతమంది గెలిచారంటే? కాగా, అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ ఎప్పుడు తిరిగొస్తారనే దానిపై స్పష్టత కరువైంది. ఈ సంవత్సరంలో ఆమె భూమికి తిరిగొచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆమె అంతరిక్షం నుంచి రావొచ్చని నాసా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
వోయేజర్–1 పునరుత్థానం! 43 ఏళ్ల తర్వాత నాసాకు సందేశం
వోయేజర్–1 అంతరిక్ష నౌక గుర్తుందా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్. సాంకేతిక కారణాలతో 1981 నుంచి మూగబోయింది. రేడియో ట్రాన్స్మిట్టర్లో విద్యుత్ నిండుకోవడంతో సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి. భూమి నుంచి ప్రస్తుతం ఏకంగా 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లో ఉన్న వోయేజర్–1 రేడియో ట్రాన్స్మిట్టర్కు మళ్లీ జీవం పోసే పనిలో నాసా సైంటిస్టులు నిమగ్నమయ్యారు. ఆ దిశగా తాజాగా స్వల్ప పురోగతి సాధించారు. దాంతో ఈ వ్యోమనౌక 43 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ నాసాతో అనుసంధానమైంది. వోయేజర్–1ను క్రియాశీలకంగా మార్చడంలో భాగంగా దాని హీటర్లు పని చేసేలా డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా అక్టోబర్ 16న కమాండ్స్ పంపించారు. ఈ ప్రయత్నాలు ఫలించాయి. అక్టోబర్ 18న వోయేజర్–1 స్పందించింది. అది పంపిన సందేశం 23 గంటల తర్వాత భూమికి అందింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి ఈ సందేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ పార్టీలో 21 ఏళ్ల అపురూపమైన డ్రెస్‌లో అనన్య పాండే : ఆయన కోసమే! -
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళన
-
ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం
ఏకంగా 70 అంతస్తుల భవనం అంత ఎత్తున్న భారీ గ్రహశకలం ఈ నెల 28న భూమికి సమీపానికి రాబోతోంది. సైంటిస్టులు దీనికి ‘అస్టరాయిడ్ 2020 డబ్ల్యూజీ’ అని పేరుపెట్టారు. ఈ నెల 28న ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఈ గ్రహ శకలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్(జేపీఎల్) తొలుత గుర్తించింది. ఇది భూమికి అతి సమీపంలోకి.. అంటే 3.3 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి రాబోతున్నట్లు తేల్చారు. ఇది భూమికి, చంద్రుడికి మధ్యనున్న దూరానికి 9 రెట్లు అధికం. సమీపం నుంచి దూసుకెళ్లే ఈ అస్టరాయిడ్ వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు. గ్రహ శకలాలలపై మరిన్ని పరిశోధనలకు ఇది తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది సెకన్‌కు 9.43 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని, సమీపం నుంచే క్షుణ్నంగా పరిశీలించవచ్చని అంటున్నారు. ఇదొక అరుదైన అవకాశమని చెబుతున్నారు. భవిష్యత్తులో భూమికి సమీపంలోకి రాబోయే గ్రహ శకలాలు, వాటి నుంచి వాటిల్లే ముప్పు, ఆ ముప్పు తప్పించే మార్గాలపై అధ్యయనానికి ‘అస్టరాయిడ్ 2020 డబ్ల్యూజీ’ రాకను ఉపయోగించుకుంటామని సైంటిస్టులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సరికొత్త స్పేస్ సూట్
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’అర్టిమిస్–3 ప్రయోగం కోసం సన్నద్ధమవుతోంది. చందమామ ఉపరితలంపైకి వ్యోమగాములను పంపించడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి ప్రాడా కంపెనీ తన వంతు సాయం అందిస్తోంది. చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాముల కోసం అత్యాధునిక స్పేస్ సూట్‌ను(అక్సియోమ్ ఎక్స్ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్–ఏఎక్స్ఈఎంయూ) అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఏరోసేŠస్స్ అండ్ ఫ్యాషన్, అక్సియోమ్ స్పేస్ సంస్థల సహకారం తీసుకుంది. ఇటలీలోని మిలన్ నగరంలో ఇంటర్నేషనల్ అస్ట్రోనాటికల్ కాంగ్రెస్‌లో ఈ స్పేస్ సూట్‌ను ప్రదర్శించింది. మిగిలి ఉన్న కొన్ని పరీక్షల్లో సైతం ఈ స్పేస్‌సూట్ నెగ్గితే చంద్రుడిపైకి వెళ్లే నాసా వ్యోమగాములు ఇదే ధరించబోతున్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్నవాటితో పోలిస్తే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ప్రాడా కంపెనీ చెబుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకొని, దీర్ఘకాలం మన్నికగా ఉండేలా ఈ స్పేస్‌సూట్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రాడా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ అధికారి లోరెంజో బెర్టిలీ చెప్పారు. దృఢత్వం, భద్రతా ప్రమాణాల విషయంలో దీనికి తిరుగులేదని అన్నారు. ఇప్పటిదాకా జరిగిన పరీక్షల్లో ప్రాడా స్పేస్‌సూట్ నెగ్గింది. 2025లో తుది పరీక్షలు జరుగబోతున్నాయి. వివిధ రకాల వ్రస్తాల ఉత్పత్తిలో ప్రాడాకు మంచి పేరుంది. -
మంచు లోకంలో మహా సముద్రం!
‘‘ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?’’ అని ప్రశి్నస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్ర దేశాలను కనిపెట్టేదెలా? వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్ర దేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేíÙంచాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది. నీరు–రసాయనాలు–శక్తి ఈ మూడు వనరుల నెలవు! జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి. మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది. భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేíÙంచాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న! గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అ్రల్టావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు–భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి–గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు–గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది. అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది. రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎల్రక్టానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది. యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు–ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్సŠోప్లరర్’(జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. యూరోపా... మరో జల ప్రపంచం! జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15–25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60–150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట. గతంలో పయనీర్–10, పయనీర్–11, వోయేజర్–1, వోయేజర్–2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు). అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కలి్పంచే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’పరిశోధిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
గురుడి చందమామ యూరోపా..
“ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?”… అని ప్రశ్నిస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్రదేశాలను కనిపెట్టేదెలా?వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్రదేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేషించాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ భారత కాలమానం ప్రకారం ఈ నెల 14న రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’ అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది.నీరు-రసాయనాలు-శక్తి… ఈ మూడు వనరుల నెలవు!జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’ అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి.మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది.భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేషించాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! యూరోపా... మరో జల ప్రపంచం! జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’ యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15-25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60-150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట.గతంలో పయనీర్-10, పయనీర్-11, వోయేజర్-1, వోయేజర్-2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’ యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు).అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కల్పించే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’ సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’ పరిశోధిస్తుంది.క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న!గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అల్ట్రావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు-భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి-గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు-గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’ తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది.అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’ గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’ తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది.రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది.యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు-ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్’ (జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది.- జమ్ముల శ్రీకాంత్ -
50 ఏళ్లలో తొలిసారి సహారా ఎడారిలో వరదలు.. ఫోటోలు వైరల్
ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారాలో అత్యంత అరుదైన దృశ్యం కనిపించింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు సహారా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ప్రవహించింది. ఆగ్నేయ మొరాకోలోని ఎడారి ప్రాంతంలో వర్షం పడడమంటే చాలా అరుదైన ఘటన. మొరాకో ప్రభుత్వ సమాచారం మేరకు సెప్టెంబరులో రెండురోజుల పాటు కురిసిన వర్షం.. చాలా ప్రాంతాల్లో ఏడాది సగటును మించిపోయింది.ఇక్కడ ఏటా 250 మి.మీ. కంటే తక్కువగా సగటు వర్షపాతం నమోదవుతుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని రబత్కు 450 కి.మీ. దూరంలోని టాగౌనైట్ గ్రామంలో 24 గంటల్లోనే 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసిందని.. ఇది అత్యంత అరుదైన పరిణామమని పేర్కొన్నాయి. జాగోరా, టాటా మధ్య 50 ఏళ్లుగా పాటు పొడిగా ఉన్న ఇరికీ సరస్సు వరద కారణంగా తిరిగి నిండినట్లు నాసా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడవుతోంది. గత 30 నుంచి 50 సంవత్సరాల నుంచి ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ వర్షాలు కురవడం ఇదే తొలిసారి అనిి మొరాకో వాతావరణ సంస్థ అధికారి హౌసీన్ యూబెబ్ పేర్కొన్నారు. కాగా గత నెలలో మొకరాలో సంభవించిన వరదలు 18 మందిని బలిగొన్నాయి.ఇక సహారా ఎడారి, ఉత్తర, మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికా అంతటా 9 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్రమైన వాతావరణ వేడిని ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ తరహా తుఫానులు మరింత తరచుగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
గురుడి చందమామ యూరోపా.. మంచు లోకంలో మహా సముద్రం!
భూమి మినహా ఈ అనంత విశ్వంలో మరెక్కడైనా జీవులు ఉన్నాయా? కోట్లాది నక్షత్ర మండలాలు, తారాతీరాలు, గ్రహాలు... సుదూరాన ఇలా ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి పరిఢవిల్లుతోందా? భూమి కాకుండా ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువులపై జీవరాశి జాడ తెలుసుకోవడమెలా? జీవులకు ఆవాసయోగ్యమైన భౌమ్యేతర ప్రదేశాలను కనిపెట్టడమెలా? జీవం ఉనికి, జీవుల మనుగడకు సంబంధించి సానుకూల పరిస్థితులతో ఆశలు రేకెత్తిస్తున్న ప్రదేశాలు మన సౌరకుటుంబంలో ఏవైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవుల కోసం అన్వేషణ సాగాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడ వెదకాలి? ఈ అన్వేషణకు ఒక సరైన, అత్యుత్తమ ప్రదేశమేదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఈ నెల 10న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’ అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది. జలం మూలం ఇదం జీవం! జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’ అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. యూరోపాపై ఏకంగా ఓ భారీ సముద్రమే ఉంది! దాని అడుగుభాగం శిలానిర్మితమని, ప్రాణుల మనుగడకు అవసరమైన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. ఈ ‘బిల్డింగ్ బ్లాక్స్’ యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉంటాయని; తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ మూలకాలను దానిపై విడిచిపెట్టి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీది సమస్త శక్తికీ సూర్యుడే ఆధారం. కిరణజన్యసంయోగ క్రియతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి.మొక్కలను తినడం ద్వారా మానవులు, జంతువులకు శక్తి బదలాయింపు జరుగుతుంది. కానీ యూరోపాలోని మహాసముద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని భావిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగానే రసాయన చర్యల వల్ల యూరోపాలోని సముద్రంలో కూడా హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది. భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని ఊహిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలా కాలం గడిచి ఇక జీవం పుట్టే సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేషించాలి. అదిగో... సరిగ్గా అక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న ప్రదేశం యూరోపానే!యూరోపా.. ఆశల లోకం!జీవాన్వేషణలో ‘నాసా’ యూరోపాను ఎంచుకోవడానికి కారణాలు బోలెడు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో తన టెలిస్కోపుతో కనుగొన్నారు. ఆ గెలీలియన్ మూన్స్ పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో యూరోపా మన చంద్రుడి సైజులో ఉంటుంది. యూరోపా ఓ ‘ఐసీ మూన్’. దాని ఉపరితలం మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 5-40 కిలోమీటర్లు. మంచు పొర కింద 50-150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉన్నట్టు భావిస్తున్నారు. గతంలో పయనీర్-10, పయనీర్-11, వోయేజర్-1, వోయేజర్-2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. మన భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని ఆ మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపా ఉపరితలంపై పెద్ద సంఖ్యలో పగుళ్లు, కొద్దిపాటి బిలాలు దర్శనమిస్తున్నాయి. వాటి ఆధారంగా దాని ఉపరితలం భౌగోళికంగా క్రియాశీలంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’ యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించుకోవడానికి కానే కాదు! అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వబోవటం (డ్రిల్ చేయడం) లేదు. అలాగే అక్కడి మహా సముద్రం లోపలికి చొచ్చుకెళ్లి పరిశీలించబోవడం లేదు కూడా. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవుల ఆవాసానికి అవసరమైన నివాసయోగ్యతా సామర్థ్యం యూరోపాకు ఉందా? ఆసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును నాసా చేపడుతోంది. భవిష్యత్ మిషన్లకు అవసరమయ్యే ముఖ్య సమాచారాన్ని యూరోపా క్లిప్పర్ నౌక సంపాదించబోతోంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిరులు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి నిటారుగా పైకి లేస్తున్న నీటి ఆవిరులు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’ పరిశోధిస్తుంది.క్లిప్పర్.. అతి పెద్ద స్పేస్ క్రాఫ్ట్! గ్రహాంతర అన్వేషణ కోసం ‘నాసా’ ఇప్పటివరకు రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక బరువు 6 టన్నులు. ఇందులో ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో 9 శాస్త్రీయ పరికరాలు అమర్చారు. యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అల్ట్రావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ వాటిలో ఉన్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ నౌక ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే! బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు-భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి-గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువగా (77 కోట్ల కిలోమీటర్లు) ఉంటుంది. సూర్యుడు-గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక సూర్యకిరణాలు కూడా బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, ఆ డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. తక్కువ ఇంధనం వినియోగం నిమిత్తం తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని ‘యూరోపా క్లిప్పర్’ ఉపయోగించుకుంటుంది. ఐదున్నరేళ్లు సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2030 ఏప్రిల్‌లో ‘యూరోపా క్లిప్పర్’ గురుగ్రహం కక్ష్యను చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోమారు గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది. రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ ప్రమాదం మెండు. అందుకే క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ ఏర్పాటు చేశారు. యూరోపాలో మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, దాని లవణీయతను కొలుస్తుంది. యూరోపా గురుత్వక్షేత్రాన్ని, ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు-ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టాలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ (జ్యూస్) మిషన్ కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. అయితే, హరికేన్ 'మిల్టన్' ఫ్లోరిడాను తాకే అవకాశమున్నందున యూరోపా క్లిప్పర్ ప్రయోగం వాయిదా పడొచ్చు. కానీ, నాసా మాత్రం ఇంకా ఏ ప్రకటనా చేయలేదు. -జమ్ముల శ్రీకాంత్.(Courtesy: NASA, The New York Times, Space.com, Astrobiology News, TIME, CNN, Business Standard, DNA, Mint, The Economic Times, Hindustan Times). -
స్పేస్ఎక్స్ మిషన్‌లో... స్వల్ప సమస్య
వాషింగ్టన్: స్పేస్ఎక్స్ సంస్థ క్రూ–9 డ్రాగన్ అంతరిక్ష ప్రయోగంలో చిరు వైఫల్యం చోటుచేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ శనివారం ఈ మిషన్ చేపట్టడం తెలిసిందే. అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి ఫాల్కన్9 రాకెట్ ద్వారా క్రూ–9 డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. ఇది విజయవంతమైనట్టు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. అయితే, ‘‘డ్రాగన్ వ్యోమనౌక రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి ఐఎస్ఎస్ వైపు సాగింది. అనంతరం ఫాల్కన్9 రాకెట్ క్షేమంగా భూమిపైకి తిరిగివచి్చంది. అందులోని రెండో దశ మాత్రం సముద్రంలో పడాల్సిన చోటికి కాస్తంత దూరంలో పడిపోయింది’’ అని స్పేస్ఎక్స్ వెల్లడించింది. ఇందుకు కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొంది. ఫాల్కన్9 పునరి్వనియోగ రాకెట్. ఇందులోని రెండో దశ విఫలం కావడం ఇది రెండోసారి. ఇది స్పేస్ఎక్స్కు ఇబ్బందికరంగా మారింది. పొరపాట్లు సరి చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చెబుతోంది. క్రూ–9 రాకెట్లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మాస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఐఎస్ఎస్కు పయనమయ్యారు. సునీత, విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు వీలుగా రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. వారిద్దరూ జూన్‌లో స్టార్‌లైనర్ తొలి ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోవడం తెలిసిందే. -
వచ్చేస్తోంది మార్స్ ట్రాన్స్ఫర్ విండో!
మరొక్క నెల రోజులే! సైంటిస్టులంతా రెండేళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ అక్టోబర్‌లో అందుబాటులోకి రానుంది. 2022 నాటి ట్రాన్స్ఫర్ విండో సందర్భంగా నాసా వంటి అంతరిక్ష సంస్థలు పలు అంగారక ప్రయోగాలు చేశాయి. భావి మార్స్ మిషన్లకు అవసరమైన సామగ్రిని అంగారకునిపైకి ముందే చేరేసేందుకు ప్రయతి్నంచాయి. మరో నెల రోజుల అంతరం అక్టోబర్ ‘విండో’లో కూడా అలాంటి ప్రయోగాలు చేపట్టే దిశగా యోచిస్తున్నాయి. ఏమిటీ ట్రాన్స్ఫర్ విండో? ఇది భూ, అంగారక గ్రహాలు రెండూ పరస్పరం అత్యంత సమీపానికి వచ్చే సమయమని చెప్పవచ్చు. కనుక సహజంగానే ఆ సందర్భంగా భూమికి, అంగారకునికి మధ్య దూరం అత్యంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అతి తక్కువ ఇంధన వ్యయంతో అంగారక ప్రయోగాలు సాధ్యపడుతాయి. ఫలితంగా ప్రయోగ ఖర్చుతో పాటు అరుణ గ్రహాన్ని చేరేందుకు పట్టే సమయమూ తగ్గుతుంది. కేవలం 6 నుంచి 8 నెలల్లో అంగారకున్ని చేరవచ్చు. అదే ఇతర సమయాల్లో అయితే ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. వీటన్నింటికీ మించి ట్రాన్స్ఫర్ విండోలో ప్రయోగించే అంతరిక్ష నౌక అంగారకుడు అత్యంత అనువైన పొజిషన్లో ఉండగా దాని కక్ష్యలోకి ప్రవేశించగలుగుతుంది. కనుక ప్రయోగం విజయవంతమయ్యే అవకాశం ఎన్నో రెట్లు పెరుగుతుంది. భూమి, అంగారకుల మధ్య ఈ విండో దాదాపు 26 నెలలకు ఓసారి పునరావృతమవుతూ ఉంటుంది. హాన్‌మన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ సూత్రం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. ఈ విండో సమయాన్ని కచి్చతంగా లెక్కించడం అంతరిక్ష సంస్థలకు చాలా కీలకం. లేదంటే ప్రయోగం రెండేళ్లు ఆలస్యమయ్యే ప్రమాదముంటుంది. 2026 విండోపై స్పేస్ ఎక్స్ కన్ను ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ తన అంగారక యాత్ర సన్నాహాలకు మరింత పదును పెడుతోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2026లో అంగారకునిపైకి మానవరహిత ‘స్టార్íÙప్’ మిషన్ చేపట్టనున్నట్టు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ ఏడాది ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ సందర్భంగా ప్రయోగం ఉంటుందని వెల్లడించారు. అంతరిక్ష నౌక సజావుగా అరుణ గ్రహంపై దిగి తమ మిషన్ విజయవంతమైతే మరో రెండేళ్లలో, అంటే 2028 నాటికి మానవసహిత అంగారక యాత్ర ఉంటుందని చెప్పారు. నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు కూడా 20206 విండో సందర్భంగా అంగారకునిపైకి మరింత అదనపు సామగ్రి తదితరాలను చేరవేసేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దేశీ స్టార్టప్‌కు నాసా కాంట్రాక్టు
న్యూఢిల్లీ: దేశీ ప్రైవేట్ స్పేస్‌క్రాఫ్ట్ స్టార్టప్ సంస్థ పిక్సెల్ తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు భూగోళ పరిశీలన డేటా సంబంధ సర్వీసులను అందించే కాంట్రాక్టు దక్కించుకుంది. 476 మిలియన్ డాలర్ల విలువ చేసే కాంట్రాక్టుకు సంబంధించి మొత్తం ఎనిమిది కంపెనీలు ఎంపికవగా, వాటిలో పిక్సెల్ కూడా ఒకటి. భూమిపై జీవనాన్ని మెరుగుపర్చేందుకు నాసా సాగిస్తున్న పరిశోధన కార్యకలాపాలకు ఉపయోగపడేలా ఈ కంపెనీలు ఎర్త్–అబ్జర్వేషన్ డేటాను అందిస్తాయి. కాంతి తరంగధైర్ఘ్యాల వ్యాప్తంగా ఉండే డేటాను హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజ్‌ల రూపంలో సేకరించి, వాతావరణ మార్పులు, వ్యవసాయం, జీవ వైవిధ్యం, వనరుల నిర్వహణ మొదలైన వాటి సూక్ష్మ వివరాలను పిక్సెల్ టెక్నాలజీ అందిస్తుంది.ఇదీ చదవండి: నాలుగేళ్లలో రెట్టింపు ఎగుమతులునేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) కాంట్రాక్టు దక్కడంపై పిక్సెల్ సహ–వ్యవస్థాపకుడు అవైస్ అహ్మద్ సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్ష ఆధారిత భూ పరిశోధనల్లో హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ కీలకంగా మారబోతోందనడానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మరింత అధిక రిజల్యూషన్‌తో ఇమేజ్‌లు ఇచ్చే ఫైర్‌ఫ్లైస్ ఉపగ్రహాలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు పిక్సెల్ తెలిపింది. భూగోళ అధ్యయనానికి అవసరమయ్యే వివరాలను తక్కువ వ్యయాలతో సేకరించేందుకు తాజా కాంట్రాక్టు ఉపయోగపడగలదని నాసా పేర్కొంది. -
నింగిలోనే వ్యోమగాములు.. భూమిపైకి ‘స్టార్‌లైనర్’
అంతరిక్షానికి వ్యోమగాములను మోసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ అర్ధంతరంగా భూమికి తిరిగివచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌విల్మోర్‌ను తీసుకు రాకుండానే భూమికి వచ్చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్(ఐఎస్ఎస్) నుంచి బయలుదేరిన ఆరు గంటల తర్వాత శుక్రవారం(సెప్టెంబర్ 6) రాత్రి స్టార్‌లైనర్ వ్యోమనౌక న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో భూమిపై దిగింది.అసలు స్టార్‌లైనర్‌కు ఏమైంది..?బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఈ ఏడాది జూన్‌లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఈ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సిఉంది. అయితే స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకైంది. ఒక దశలో స్టార్‌లైనర్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయన్న ప్రచారం జరిగింది. నాసా ఎందుకు ఒప్పుకోలేదు..?హీలియం లీకేజీ సమస్యను సరిచేసే క్రమంలో వ్యోమగాములు భూమికి తిరిగిరావడం ఆలస్యమవుతూ వచ్చింది. చివరిగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ సంస్థ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్‌లైనర్ సురక్షితమే అని ప్రకటించింది. అయితే గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నాసా అందుకు అంగీకరించలేదు.వ్యోమగాముల తిరిగి రాక ఎలా..వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి నాసా ఒప్పుకోకపోవడంతో స్టార్‌లైనర్ ఖాళీగా భూమికి రావాల్సి వచ్చింది. వ్యోమగాములను తిరిగి తీసుకురావడం కోసం ఇలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ మరో వ్యోమనౌకను సిద్ధం చేస్తోంది. దీంతో మరికొన్ని నెలల పాటు వ్యోమగాములు సునీతా, విల్మోర్ ఐఎస్ఎస్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీత వచ్చేది అప్పుడేనా..స్పేక్స్ ఎక్స్‌కు చెందిన క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను నాసా ఐఎస్ఎస్కు పంపే ఛాన్సుంది. సెప్టెంబరులోనే ఈ ప్రయోగం ఉండొచ్చని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రూ డ్రాగన్‌లో సునీత, విల్మోర్ను భూమి మీదకు తీసుకురావాలని నాసా యోచిస్తోంది. -
స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలు
హూస్టన్: సెపె్టంబర్ 6వ తేదీన వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి రానున్న బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకకు సంబంధించిన మరో పరిణామం. వివిధ సమస్యలతో ఇప్పటికే మూడు నెలలుగా ఐఎస్ఎస్తోపాటే ఉండిపోయిన స్టార్‌లైనర్ నుంచి వింతశబ్ధాలు వస్తున్నాయని వ్యోమగామి బచ్ విల్మోర్ చెప్పారు. ఆయన తాజాగా హూస్టన్‌లోని నాసా మిషన్ కంట్రోల్‌తో టచ్‌లోకి వచ్చారు. వ్యోమనౌకను బయటి నుంచి ఎవరో తడుతున్నట్లుగా, జలాంతర్గామిలోని సోనార్ వంటి శబ్దాలు పదేపదే వస్తున్నాయని చెప్పారు. స్టార్ లైనర్ అంతర్గత స్పీకర్‌ను తన మైక్రోఫోన్‌కు దగ్గరగా పెట్టి ఈ శబ్దాలను నాసా నిపుణులకు సైతం ఆయన వినిపించారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి, ఎందుకు వస్తున్నాయో అంతుపట్టడం లేదని, తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నామని నాసా తెలిపింది. విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టమ్ వల్ల ఈ వింత శబ్దాలు వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో కలిసి బచ్ విల్మోర్ బోయింగ్ జూన్ 5వ తేదీన చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత ప్రయోగం ద్వారా స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)నకు చేరుకోవడం తెలిసిందే. వారు 8 రోజులపాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు చేపట్టిన అనంతరం భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్‌లో థ్రస్టర్ వైఫల్యం, హీలియం లీకేజీ వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నం కావడంతో ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఆ ఇద్దరినీ మరో అంతరిక్ష నౌకలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని ఇటీవలే నాసా నిర్ణయం తీసుకుంది. స్టార్‌లైనర్‌ను మాత్రం వ్యోమగాములు లేకుండానే ఖాళీగా ఈ నెల 6న తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. స్టార్‌లైనర్ పునరాగమనంపై దీని ప్రభావం ఉండకపోవచ్చని నాసా తెలిపింది. -
కల్పన మరణం.. నాసాకొక పాఠం
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయారు. రెండు నెలలుగా వారు అంతరిక్షంలోనే కాలం గడుపుతున్నారు. సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్లు 2025 ఫిబ్రవరి నాటికి తిరిగివచ్చే అవకాశాలున్నాయని నాసా ప్రకటించింది. దీని ప్రకారం వారు ఎనిమిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండనున్నారు. ఇప్పుడు సునీతా విలియమ్స్ ఉదంతం మరో భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లాను తలపిస్తోంది. నాటి విషాద ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు నాసా తన ప్రయత్నాలు సాగిస్తోంది.కల్పనా చావ్లా భారతీయ-అమెరికన్ వ్యోమగామి. వృత్తిరీత్యా ఇంజనీర్. ఆమె అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె 1997లో ఎస్టీఎస్-87, 2003లో ఎస్టీఎస్-107 అనే రెండు స్పేస్ షటిల్ మిషన్లలో ప్రయాణించారు. అయితే 2023 ఫిబ్రవరి ఒకటిన రీ-ఎంట్రీ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న స్పేస్ షటిల్ కొలంబియా కూలిపోవడంతో కల్పనా చావ్లా ప్రాణాలొదిలారు. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది మృతిచెందారు. కొలంబియా ప్రమాదానికి ముందు 1986 జనవరి 28న స్పేస్ షటిల్ ఛాలెంజర్ పేలడంతో 14 మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు.కల్పన ప్రాథమిక విద్యాభ్యాసం 1976లో హర్యానాలోని కర్నావ్లోని ఠాగూర్ బాల్ నికేతన్‌లో జరిగింది. కల్పన ఎనిమిదో తరగతిలో ఉండగా తాను ఇంజనీర్ కావాలనుకున్నారు. 1982లో పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాల నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నారు. యుఎస్‌లో తదుపరి విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆమె 1994లో నాసాలో వ్యోమగామిగా చేరారు. 1995లో నాసాకు చెందిన వ్యోమగామి కార్ప్స్లో చేరారు. 1997లో అంతరిక్షయానానికి ఎంపికయ్యారు.సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయిన నేపధ్యంలో ‘నాసా’ అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ అంతరిక్ష ప్రయాణానికి అత్యంత సురక్షితమైన ఏర్పాట్లు చేసినప్పటికీ అది ప్రమాదకరమేనని అన్నారు. టెస్ట్ ఫ్లైట్ అనేది సహజంగానే సురక్షితమైనది. బుచ్, సునీతలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంచడం, సిబ్బంది లేకుండానే బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ని కిందకు తీసుకురావాలనే నిర్ణయం భద్రతా పరంగా సరైనదే అని అన్నారు. స్పేస్ ఎక్స్ వ్యోమగాములను తిరిగి తీసుకురాగలదు. అయితే కొన్ని సాంకేతిక కారణాల రీత్యా వారు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడే ఉండాల్సివస్తుంది. కల్పనా చావ్లా ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకున్న నాసా ఇప్పుడు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అత్యంత సురక్షితంగా తీసుకురావాలనుకుంటోంది. ఇందుకు స్పేస్ ఎక్స్ సాయంతో తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. -
సునీత రాక ఫిబ్రవరిలోనే!
కేప్‌కనావెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రావడానికి బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యూల్ సురక్షితం కాదని నాసా తేల్చిచెప్పింది. వారిని అందులో వెనక్కు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమని శనివారం పేర్కొంది. ఆ రిస్క్ తీసుకోరాదని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్‌్కకు చెందిన స్పేస్ ఎక్స్ షటిల్ డ్రాగన్ క్యాప్సూల్‌లో వారిని తీసుకురావాలని నిర్ణయించింది.పలు వైఫల్యాల తర్వాత బోయింగ్ స్టార్‌లైనర్ గత జూన్‌లో సునీత, విల్మోర్లను అంతరిక్ష కేంద్రానికి చేర్చడం తెలిసిందే. థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీకేజీ తదితర సమస్యల నడుమ అతికష్టమ్మీద∙స్టార్‌లైనర్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. వారం కోసమని వెళ్లిన సునీత, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. ఫిబ్రవరిలో తిరుగు ప్రమాణమంటే ఎనిమిది నెలలకు పైగా ఐఎస్ఎస్లోనే గడపనున్నారు. స్టార్‌లైనర్‌కు మరమ్మతులు చేయడానికి బోయింగ్ ఇంజనీర్లతో కలిసి నాసా తీవ్రంగా శ్రమించింది. మూడునెలల ప్రయత్నాల అనంతరం.. మానవసహిత తిరుగు ప్రమాణానికి స్టార్‌లైనర్ సురక్షితం కాదని తేల్చేసింది. అది ఒకటి, రెండు వారాల్లో ఐఎస్ఎస్ నుంచి విడివడి ఆటోపైలెట్ మోడ్‌లో ఖాళీగా భూమికి తిరిగి రానుంది. తమ విమానాల భద్రతపై ఇప్పటికే ఇబ్బందులను ఎదుర్కొంటున్న బోయింగ్‌కు స్టార్‌లైనర్ వైఫల్యం గట్టి ఎదురుదెబ్బే.స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలోనే ఉంది. మార్చి నుంచి ఐఎస్ఎస్లో ఉన్న నలుగురు వ్యోమగాములను తీసుకుని సెపె్టంబరు నెలాఖరులో భూమికి తిరిగివస్తుంది. అత్యవసరమైతే తప్ప అందులో మరో ఇద్దరిని ఇరికించడం సురక్షితం కాదని నాసా తెలిపింది. రష్యాకు చెందిన సోయుజ్ క్యాప్సూల్ కూడా ఐఎస్ఎస్లోనే ఉన్నా అందులోనూ ముగ్గురికే చోటుంది. ఏడాదిగా ఐఎస్ఎస్లో ఉన్న ఇద్దరు రష్యా వ్యోమగాములు అందులో తిరిగొస్తారు. డ్రాగన్ సెపె్టంబరులో ఇద్దరు వ్యోమగాములతో ఐఎస్ఎఐస్కు వెళ్తుంది. తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను కూడా తీసుకొస్తుంది. -
భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న గ్రహశకలం
-
టిక్.. టిక్.. టిక్... మిగిలింది 19 రోజులే
వాషింగ్టన్: బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికే (ఐఎస్ఎస్) పరిమితమైన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ విషయంలో ఉత్కంఠ పెరుగుతోంది. వారు మరో 19 రోజుల్లో వారం అక్కడి నుంచి బయల్దేరకపోతే మరో కీలక ప్రయోగాన్ని నిలిపివేయక తప్పదు. అందుకే నాసా సైంటిస్టులు, బోయింగ్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఎందుకీ ఆందోళన? విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ సంస్థ తొలిసారి అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు సునీత, విల్మోర్ జూన్ 5న ఐఎస్ఎస్కు బయలుదేరారు. అయితే నింగిలోకి దూసుకెళ్తున్న క్రమంలోనే అందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. 28 థ్రస్టర్లకు గాను 5 మొరాయించాయి. సరీ్వస్ మాడ్యూల్లో ఐదు చోట్ల హీలియం లీకేజీలు బయటపడ్డాయి. సానా సైంటిస్టులు భూమి నుంచే రిమోట్ కంట్రోల్‌తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. తర్వాత స్టార్‌లైనర్ ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమై జూన్ 13న సునీత, విల్మోర్ ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టారు. షెడ్యూల్ ప్రకారం వారం తర్వాత స్టార్‌లైనర్‌లో వెనక్కు రావాలి. కానీ దానికి పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తే తప్ప బయల్దేరలేని పరిస్థితి! మరోవైపు స్పేస్ఎక్స్ ‘క్రూ–9 మిషన్’లో భాగంగా నాసా వ్యోమగాములు జెనా కార్డ్‌మాన్, నిక్ హేగ్, స్టెఫానీ విల్సన్, అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ నెల 18న ఐఎస్ఎస్కు బయలుదేరాల్సి ఉంది. వారు 23 కల్లా అక్కడికి చేరేలా గతంలోనే షెడ్యూల్ ఖరారైంది. ఐఎస్ఎస్ నుంచి స్టార్‌లైనర్ వెనక్కి వస్తే తప్ప ‘క్రూ–9’ను పంపలేని పరిస్థితి! దాంతో ఏం చేయాలో అర్థంకాక నాసా తల పట్టుకుంటోంది. దీనికి తోడు ఐఎస్ఎస్లో సునీత ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్లు సమాచారం. స్టార్‌లైనర్ త్వరలో సిద్ధం కాకుంటే ఆమెను రప్పించడానికి ప్రత్యామ్నాయం చూడాల్సి రావొచ్చు. -
అంతరిక్ష కేంద్రంలోకి శుభాన్షు శుక్లా
న్యూఢిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సారథ్యంలో భారతీయ వ్యోమగామి త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టబోతున్నాడు. ఇందుకోసం భారతవాయుసేన గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లాను ఎంపికచేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మానవసహిత అంతరిక్ష వ్యోమనౌక కేంద్రం (హెచ్ఎస్ఎఫ్సీ), నాసా, అమెరికాకు చెందిన ఆక్సియమ్ స్పేస్ సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా గగనయాత్రికులను నాసా ఐఎస్ఎస్కు తీసుకెళ్లనుంది. మిషన్ పైలట్‌గా గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా వ్యవహరిస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఆయన వెళ్లలేకపోతే బ్యాకప్ మిషన్ పైలట్‌గా మరో గ్రూప్ కెపె్టన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను ఐఎస్ఎస్కు పంపిస్తారు. వీరికి ఈ వారంలోనే శిక్షణ మొదలవుతుంది. యాక్సియమ్–4 మిషన్ ద్వారా అక్కడకు వెళ్లే శుక్లా ఐఎస్ఎస్లో తోటి వ్యోమగాములతో కలిసి శాస్త్ర పరిశోధనలుచేయడంతోపాటు పలు సాంకేతికతలను పరీక్షించనున్నారు. తర్వాత ఐఎస్ఎస్ ఆవల అంతరిక్షంలోనూ గడిపే అవకాశముంది. శుక్లాతోపాటు ఐఎస్ఎస్కు అమెరికా, పోలండ్, హంగేరీల నుంచి ఒకరు చొప్పున వ్యోమగామి రానున్నారు. భారత తన సొంత మానవసహిత అంతరిక్ష ప్రయోగాల కోసం నలుగురిని గత ఏడాదే ఎంపికచేసిన విషయం తెల్సిందే. గగన్‌యాన్ మిషన్ కోసం బెంగళూరులోని ఇస్రో వ్యోమగామి శిక్షణా కేంద్రంలో వీరి శిక్షణ కూడా గతంలో మొదలైంది. ఇటీవల రష్యాలోనూ ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకున్నారు. గగన్‌యాన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి తీసుకెళ్లి తిరిగి సురక్షితంగా సముద్రజలాల్లో దింపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. -
Apollo 11 Mission: జెండా రెపరెపల వెనుక...
అది 1969. జూలై 20. అంతరిక్ష రేసులో యూఎస్‌ఎస్‌ఆర్‌పై అమెరికా తిరుగులేని ఆధిక్యం సాధించిన రోజు. అంతేకాదు. అందరాని చందమామను మానవాళి సగర్వంగా అందుకున్న రోజు కూడా. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న లక్షలాది మంది సాక్షిగా నాసా అపోలో 11 మిషన్ విజయవంతంగా చంద్రునిపై దిగింది. కాసేపటికి వ్యోమగామి నీల్ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై కాలుపెట్టాడు. ఆ ఘనత సాధించిన తొలి మానవునిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఎడ్విన్ ఆ్రల్డిన్తో కలిసి నమూనాలు సేకరిస్తూ ఉపరితలంపై కొద్ది గంటలు గడిపాడు. మానవాళి ప్రస్థానంలో చిరస్థాయిగా మిగిలిపోనున్న ఆ మైలురాయికి గుర్తుగా అమెరికా జెండాను సగర్వంగా చంద్రునిపై పాతాడు. అయితే ఈ చర్య పెద్ద గందరగోళానికే దారితీసింది. నాసా విడుదల చేసిన ఫొటోల్లో ఆ జెండా రెపరెపలాడుతూ కని్పంచడం నానా అనుమానాలకు తావిచ్చింది. అసలు భూమిపై మాదిరిగా వాతావరణం, గాలి ఆనవాలు కూడా లేని చంద్రుని ఉపరితలంపై జెండా ఎలా ఎగిరిందంటూ సర్వత్రా ప్రశ్నలు తలెత్తాయి. చివరికి పరిస్థితి అపోలో 11 మిషన్ చంద్రునిపై దిగడం శుద్ధ అబద్ధమనేదాకా వెళ్లింది! అంతరిక్ష రంగంలో దూకుడు ప్రదర్శిస్తున్న యూఎస్ఎస్ఆర్ మీద ఎలాగైనా పైచేయి సాధించేందుకు నాసా ఇలా కట్టుకథ అల్లి ఉంటుందంటూ చాలామంది పెదవి విరిచారు కూడా... కానీ, ఆ జెండా రెపరెపల వెనక నాసా కృషి, అంతకుమించి సైన్స్ దాగున్నాయి. చూసేందుకు అచ్చం గాలికి రెపరెపలాడుతున్నట్టు కన్పించే అమెరికా జాతీయ జెండాను ఎలాగైనా చంద్రునిపై పాతాలన్నది నాసా పట్టుదల. నాసా సాంకేతిక సేవల విభాగం చీఫ్ జాక్ కింజ్లర్ ఈ సవాలును స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో సైంటిస్టులు ఎంతగానో శ్రమించి మరీ ఆ జెండాను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. జెండా పై భాగం పొడవునా ఒక క్రాస్‌బార్ అమర్చారు. దానికి జెండాను అక్కడక్కడా ప్రెస్ చేశారు. తద్వారా జెండా పలుచోట్ల వంపు తిరిగినట్టు కని్పంచేలా చేశారు. ఫలితంగా చూసేందుకది అచ్చం గాలికి రెపరెపలాడుతున్నట్టుగా కని్పంచింది. నాసా ఉద్దేశమూ నెరవేరింది. అదే క్రమంలో వివాదాలకూ తావిచి్చంది. జెండా తయారీలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు. జెండా కర్రను కూడా అతి తేలికగా, అదే సమయంలో అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా అత్యంత మన్నికగా ఉండే అనోడైజ్డ్ అల్యుమినియంతో తయారు చేశారు. చంద్రుని నేలపై తేలిగ్గా దిగేందుకు, కిందకు వాలకుండా నిటారుగా ఉండేందుకు వీలుగా దాని మొదట్లో చిన్న స్ప్రింగ్‌ను అమర్చారు. ఇక జెండాను కూడా చంద్రునిపై తీవ్రమైన ఉష్ణోగ్రత తదితరాలను తట్టుకునేందుకు వీలుగా నైలాన్ బట్టతో తయారు చేశారు. అనంతరం పలు అపోలో మిషన్లలో కూడా ఇదే తరహా జెండాలను చంద్రునిపైకి పంపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఐఎస్ఎస్’ కూల్చడమెందుకు? ‘నాసా’ ఏం చెప్పింది?
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) ఫ్యూచరేంటి..? 400కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో తిరుగుతున్న ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి ఎలా కూలుస్తారు. ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించేందుకు సిద్ధం చేస్తున్న యూఎస్‌డీఆర్బిట్ వెహిహికిల్(యూఎస్‌డీవీ)ని ఎలా ఉపయోగిస్తారు..?అసలు ఐఎస్ఎస్ను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. అంతా సజావుగా జరిగి 2030లో ఐఎస్ఎస్ నింగి నుంచి మాయమైన తర్వాత అంతరిక్ష పరిశోధనల మాటేమిటి..? ఈ విషయాలన్నింటిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అసలు ఐఎస్ఎస్ ఏంటి.. ఎందుకు..?అమెరికా, రష్యా, కెనడా, జపాన్, యూరప్‌లు 1998 నుంచి 2011వరకు శ్రమించి ఐఎస్ఎస్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాయి. 2000 సంవత్సరం నవంబర్ 2వ తేదీనే ఐఎస్ఎస్ కమిషన్ అయింది. అప్పటినుంచే అది అంతరిక్షంలో వ్యోమగాములకు ఆశ్రయమిస్తూ ఎన్నో పరిశోధనలకు వేదికైంది. ప్రస్తుతం 15 దేశాలు ఐఎస్ఎస్ను నిర్వహిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భారీ ఖర్చుతో ఐఎస్ఎస్ను నిర్మించారు. ఆశించినట్లుగానే స్పేస్ రీసెర్చ్‌లో 24 ఏళ్లుగా ఐఎస్ఎస్ గొప్పగా సేవలందిస్తోంది.డీ కమిషన్ చేయడం ఎందుకు..?ఐఎస్ఎస్ నింగిలో పనిచేయడం ప్రారంభించి 2030నాటికి 30 ఏళ్లు పూర్తవుతుంది. అప్పటికి ఐఎస్ఎస్ చాలా పాతదవుతుంది. అంతరిక్ష వాతావరణ ప్రభావం వల్ల దాని సామర్థ్యం తగ్గిపోతుంది. అందులోని చాలా విడిభాగాలు పనిచేయవు. ఐఎస్ఎస్లోని పరికరాలన్నీ నెమ్మదిస్తాయి. ఐఎస్ఎస్లో వ్యోమగాములు నివసించే మాడ్యూళ్లు పనికిరాకుండా పోతాయి. అది ప్రస్తుతం తిరుగుతున్న 400 కిలోమీటర్ల ఎత్తులోని ఆర్బిట్ నుంచి దానికదే కిందకు దిగడం ప్రారంభమవుతుంది. నిజానికి ఐఎస్ఎస్ను నిర్దేశిత కక్ష్యలో ఉంచడం మళ్లీ సాధ్యమే అయినప్పటికీ అది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇందుకే 2030లో ఐఎస్ఎస్ను డీ కమిషన్ చేయాలని నిర్ణయించారు.ఎలా కూలుస్తారు..?ఐఎస్ఎస్ను తొలుత కక్ష్యలో నుంచి తప్పించి(డీఆర్బిట్) నెమ్మదిగా భూమిపై కూల్చేస్తారు. ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి భూమిపై కూల్చేయడం సాధారణ విషయం కాదు. దీనిని చాలా అడ్వాన్స్డ్ సైంటిఫిక్ నైపుణ్యంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఈలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తయరు చేస్తున్న యూఎస్‌డీఆర్బిట్ వాహనాన్ని నాసా వాడనుంది. 2030లో ఐఎస్ఎస్ను డీ కమిషన్ చేయనున్నప్పటికీ 18 నెలల ముందే డీ ఆర్బిట్ వెహికిల్ నింగిలోకి వెళ్లి ఐఎస్ఎస్తో అనుసంధానమవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి జాగ్రత్తగా భూ వాతావరణానికి తీసుకువస్తారు. భూ వాతావరణానికి రాగానే ఐఎస్ఎస్ మండిపోతుంది. దాని శకలాలను మనుషులెవరూ ఉండని దక్షిణ పసిఫిక్ ఐలాండ్లలో పడేలా చేస్తారు. డీఆర్బిట్ వెహిహికల్ ఎలా పనిచేస్తుంది..సాధారణంగా ఐఎస్ఎస్కు వ్యోమగాములను మోసుకెళ్లి దానితో అనుసంధానమయ్యే డ్రాగన్ కాప్స్యూల్స్‌తో పోలిస్తే డీఆర్బిట్ వెహికిల్ యూఎస్‌డీవీకి ఆరు రెట్ల ఎక్కువ శక్తి కలిగిన ప్రొపల్లెంట్ ఉంటుంది. డీ ఆర్బిట్ వెహికిల్ ఐఎస్ఎస్ డీ కమిషన్‌కు 18 నెలల ముందే వెళ్లి దానితో అనుసంధానమవుతుంది. ఇంకో వారంలో ఐఎఎస్ఎస్ డీ ఆర్బిట్ అవనుందనగా యూఎస్‌డీవీలోని ఇంధనాన్ని మండించి ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి భూమివైపు తీసుకురావడం మొదలుపెడతారు. చివరిగా భూ వాతావరణంలోకి రాగానే ఐఎస్ఎస్ మండిపోతుంది. దీంతో ఐఎస్ఎస్ 30 ఏళ్ల ప్రస్థానం ముగిసిపోతుంది.ఐఎస్ఎస్ తర్వాత నాసా ప్లానేంటి..? పరిశోధనలు ఎలా..? ఐఎస్ఎస్ చరిత్రగా మారిన తర్వాత సొంతగా కొత్త స్పేస్ స్టేషన్లను అభివృద్ధి చేసే ప్లాన్ అమెరికాకు లేదు. ప్రైవేట్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న స్పేస్ స్టేషన్లను అద్దెకు తీసుకుని అంతరిక్ష పరిశోధనలు చేసే అవకాశముంది. ఒకవేళ 2030కల్లా ప్రైవేట్ కంపెనీల స్పేస్ స్టేషన్లు సిద్ధం కాకపోతే డీ ఆర్బిట్ వెహికిల్‌ను వాడి ఐఎస్ఎస్ జీవితకాలాన్ని పొడిగించాలన్న ప్లాన్ బీ కూడా నాసాకు ఉండటం విశేషం. -
నీ రాక కోసం.. అంతరిక్షంలో చిక్కుకున్న సునీత
సునీతా విలియమ్స్. పరిచయమే అవసరం లేని పేరు. భారత మూలాలున్న ఈ నాసా వ్యోమగామి మరో సహచరునితో కలిసి ఇటీవలే ముచ్చటగా మూడో అంతరిక్ష యాత్ర చేపట్టి మరోసారి వార్తల్లోకెక్కారు. తీరా అంతరిక్ష కేంద్రానికి చేరాక వ్యోమ నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే చిక్కుబడిపోయి నెలకు పైగా రోజూ వార్తల్లోనే నిలుస్తూ వస్తున్నారు. వ్యోమ నౌకకు నాసా తలపెట్టిన మరమ్మతులు ఎప్పటికి పూర్తవుతాయి, సునీత ఎప్పుడు సురక్షితంగా తిరిగొస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి ఎప్పటికి తెర పడుతుందన్న దానిపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు...ప్రపంచంలో అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన బోయింగ్ ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి మానవసహిత రోదసీ యాత్రలో సునీత భాగస్వామి అయ్యారు. సహచరుడు బారీ బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్ ‘స్టార్‌లైనర్’ వ్యోమ నౌకలో జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. అయితే యాత్ర సజావుగా సాగలేదు. ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ మొదలుకుని వ్యోమ నౌకలో పలు లోపాలు తలెత్తాయి. ఉత్కంఠ నడుమే ఎట్టకేలకు జూన్ 6న స్టార్‌లైనర్ సురక్షితంగా ఐఎస్ఎస్తో అనుసంధానమైంది.నిజానికి ఇది మానవసహిత యాత్రల సన్నద్ధతను పరీక్షించేందుకు బోయింగ్ చేసిన క్రూ ఫ్లైట్ టెస్ట్ (సీఎఫ్‌టీ). షెడ్యూల్ ప్రకారం సునీత, విల్మోర్ వారం పాటు ఐఎస్ఎస్లో ఉండి జూన్ 13న బయల్దేరి 14న భూమికి చేరుకోవాలి. కానీ ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ తదితరాలకు తోడు వ్యోమ నౌకలో మరిన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు. వీటన్నింటినీ సరిచేసే పనిలో నాసా ప్రస్తుతం తలమునకలుగా ఉంది. వ్యోమగాములను వెనక్కు తీసుకొచ్చే విషయంలో తమకు హడావుడేమీ లేదని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం మేనేజర్ స్టీవ్ స్టిచ్ స్పష్టం చేశారు. వారి భద్రతకే తొలి ప్రాధాన్యమని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ సమస్యలు ఏమిటి?⇒ స్టార్‌లైనర్ వ్యోమ నౌకలో ఏకంగా ఐదు చోట్ల హీలియం లీకేజీలు చోటుచేసుకున్నాయి. ఇది పెను సమస్య. దీనివల్ల వ్యోమనౌక లోపలి భాగంలో అవసరమైన మేరకు ఒత్తిడిని మెయిన్‌టెయిన్ చేయడం కష్టమవుతుంది. నౌక పనితీరూ బాగా దెబ్బ తింటుంది. ⇒ దీంతోపాటు వ్యోమ నౌకలో కీలకమైన 28 రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్టర్లలో ఏకంగా ఐదు విఫలమైనట్టు నాసా సైంటిస్టులు గుర్తించారు. అవి ఉన్నట్టుండి పని చేయడం మానేశాయి. సురక్షితంగా తిరిగి రావాలంటే కనీసం 14 థ్రస్టర్లు సజావుగా పని చేయాలి.⇒ ప్రొపెల్లెంట్ వాల్వ్ కూడా పాక్షికంగా ఫెయిలైంది.⇒ వీటిని పరిశీలిస్తున్న క్రమంలో మరిన్ని సాంకేతిక సమస్యలూ బయటపడ్డాయి. థ్రస్టర్లలో ప్రస్తుతానికి నాలుగింటిని రిపేర్ చేశారని, అవి సజావుగా పని చేస్తున్నాయని చెబుతున్నారు.⇒ ఈ సమస్యలను సరి చేసేందుకు బోయింగ్ బృందం నాసాతో కలిసి పని చేస్తోంది. నెవెడాలో అచ్చం ఐఎస్ఎస్ తరహా పరిస్థితులను సృష్టించి స్టార్‌లైనర్‌లో తలెత్తిన సమస్యలను ఎలా పరిష్కరించాలో పరీక్షిస్తున్నారు. ఇది తుది దశలో ఉన్నట్టు సమాచారం. ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి...బోయింగ్ స్టార్‌లైనర్ గరిష్టంగా 45 రోజుల పాటు ఐఎస్ఎస్తో అనుసంధానమై ఉండగలదు. అది జూన్ 6న అక్కడికి చేరింది. ఆ లెక్కన జూలై 22 దాకా సమయముంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే? సునీత, బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయాలున్నాయి. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ ద్వారా, లేదంటే రష్యా సూయజ్ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కు తీసుకురావచ్చు.ఐఎస్ఎస్లోనే మకాంసునీత, విల్మోర్ ప్రస్తుతానికి ఐఎస్ఎస్లోనే సురక్షితంగా ఉన్నారు. సునీత తన అనుభవం దృష్ట్యా పరిశోధనలు, ప్రయోగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అక్కడున్న ఏడుగురుతో కలిసి ఐఎస్ఎస్ నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల్లో బిజీగా గడుపుతున్నారు.నేను, మీ సునీతను...!అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న సునీతా విలియమ్స్ తమ తాజా అంతరిక్ష యాత్ర గురించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30కు ఈ కార్యక్రమం ఉంటుంది. నాసా టీవీ, నాసా యాప్, సంస్థ వెబ్‌సైట్‌తో పాటు యూట్యూబ్‌లో దీన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. -
ఐఎస్ఎస్ను కూల్చేయనున్న స్పేస్ఎక్స్
వాషింగ్టన్: ప్రతి గంటన్నరకు ఒకసారి భూమి చుట్టూ తిరిగే ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఉన్న ఆకాశ ప్రయోగశాల.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) త్వరలో నీలిసంద్రంలో కూలిపోనుంది. 2030 సంవత్సరంకల్లా పాతబడిపోతున్న ఐఎస్ఎస్ అంతరిక్షచెత్తగా మిగిలిపోకుండా, తదుపరి ప్రయోగశాలలకు అవరోధంగా మారకుండా చూడాలని అమెరికా నాసా నిర్ణయించుకుంది. అందుకే గడువు ముగిసేనాటికి దానిని ప్రస్తుత కక్ష్య నుంచి తప్పించనుంది.ఇప్పటికే రాకెట్ల తయారీతో అంతరిక్ష అనుభవం గడించిన కుబేరుడు ఎలాన్ మస్‌్కకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థకు నాసా ఈ బాధ్యతను అప్పగించింది. ఇందుకోసం దాదాపు రూ.7,036 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను స్పేస్ఎక్స్కు ఇచి్చనట్లు నాసా బుధవారం ప్రకటించింది. కాంట్రాక్ట్‌లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ డీఆర్బిట్ వెహికల్(యూఎస్‌డీవీ)ను స్పేస్ఎక్స్ నిర్మించనుంది. అది సముద్రంలో చిన్న పడవలను లాగే/నెట్టే టగ్ బోటులా ఉంటుందని భావిస్తున్నారు.ఐఎస్ఎస్ ప్రస్తుతం భూమికి 400 కి.మీ.ల ఎత్తులో తిరుగుతోంది. ఏకంగా 430 టన్నుల బరువైన ఐఎస్ఎస్ను యూఎస్డీవీతో నియంత్రిస్తూ దశల వారీగా దిగువ కక్ష్యలకు తీసుకొస్తూ ముందుగా నిర్దేశించిన పసిఫిక్ మహాసముద్రంలోని మారుమూల ‘పాయింట్ నెమో’ వద్ద కూల్చేయనున్నారు. ఈ ‘పాయింట్ నెమో’ సముద్రప్రాంతం నుంచి దగ్గర్లోని భూభాగానికి వెళ్లాలంటే కనీసం 2,500 కిలోమీటర్లు ప్రయాణించాలి. పౌరులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదని సుదూర ప్రాంతాన్ని ఎంచుకున్నారు.వేల ప్రయోగాలకు వేదిక ఐఎస్ఎస్ నిర్మాణం కోసం తొలి భాగాలను 1998లో రాకెట్లలో తీసుకెళ్లారు. 2000 సంవత్సరందాకా దీని నిర్మాణం సాగింది. శూన్యంలో ఎన్నో భిన్న ప్రయోగాలకు ఐఎస్ఎస్ సాక్షిగా నిలిచింది. అమెరికా, రష్యా, కెనడా, జపాన్ తదితర దేశాలు దీని నిర్వహణ చూసుకుంటున్నాయి. 2028లో చేతులు దులిపేసుకుంటామని రష్యా చెప్పేసింది. -
సునీతా విలియమ్స్ రాక ఎప్పుడు..? ‘మస్క్’ వైపు ‘నాసా’ చూపు
కాలిఫోర్నియా: ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలిందా.. ఏవియేషన్, స్పేస్‌టెక్ రంగాల్లో ఇప్పటికే అపఖ్యాతి మూటగట్టుకున్న కంపెనీ తాజాగా మరో పెద్ద సమస్య ఎదుర్కొంటోందా..? స్పేస్ టెక్నాలజీ రంగంలో ఈలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ బోయింగ్‌ను ఛాలెంజ్ చేస్తోందా..? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి.ఇటీవలే భారత సంతతికి చెందినవ అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో మరో వ్యోమగామని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సునీతా విలియమ్స్‌తో పాటు ఆమెతో వెళ్లిన మరో వ్యోమగామి భూమికి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.షెడ్యూల్ ప్రకారం వీరిరువురు జులై 2న తిరిగి భూమ్మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఐఎస్ఎస్కు అటాచ్ అయి ఉన్న స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకవుతున్నట్లు బోయింగ్‌తో పాటు నాసా గుర్తించాయి. ఈ కారణంగా స్టార్‌లైనర్‌లో సునీత తిరిగి రావడం మరింత ఆలస్యమవుతుందని నాసా భావిస్తోంది.దీంతో ఈలాన్ మస్క్‌కు స్పేస్ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్‌లో సునీతతో పాటు మరో వ్యోమగామిని వెనక్కి రప్పించే అంశాన్ని నాసా పరిశీలిస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. మార్చ్‌లో నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్కు తీసుకువెళ్లిన క్రూ డ్రాగన్ అంతరిక్షంలో రెడీగా ఉంది.దీనిలో ఇద్దరు లేదా నలుగురు లేదా మరింతమందిని భూమ్మీదకు తీసుకువచ్చే వెసులుబాటు ఉంది. స్టార్‌లైనర్ మరమ్మతులు గనుక సమయానికి పూర్తి కాకపోతే మస్క్ క్రూ డ్రాగన్‌లోనే సునీత తిరిగి రావొచ్చు. ఇదే జరిగితే స్పేస్ వ్యోమగాముల ప్రయాణానికి సంబంధించి బోయింగ్‌పై మస్క్ స్పేస్ ఎక్స్ పైచేయి సాధించినట్లేనని చెబుతున్నారు. -
రామసేతు రహస్యం పార్ట్1: రామసేతు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
సైన్స్‌కు, స్పిరిచ్యువాలిటీకి లంకె కుదరదు. లాజిక్కులు, ఆధారాలపై సైన్స్ ఆధారపడితే నమ్మకం పునాదిగా ఆధ్యాత్మికత వెల్లివిరిస్తుంది. ఆ విశ్వాసమే దైవం లాంటి శక్తిని, ఆ దైవత్వం ఉనికిని జీర్ణించుకుంటుంది. సైన్స్ మాత్రం ఇతిహాసాలు, పురాతాన గ్రంథాల్లో చెప్పినవాటిని ఒప్పుకోవడానికి ఇష్టపడదు. ఏది నమ్మాలన్నా సాక్ష్యాధారాలు కావాలంటుంది సైన్స్. ఐతే ఇంత అత్యాధునిక కాలంలోనూ, ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఎన్నో రహస్యాలను సైన్స్ ఛేదించలేకపోయిందని ఆధ్యాత్మిక వాదులు అంటారు. పిరమిడ్లు, బెర్ముడా ట్రయాంగిల్ నుంచి ఎన్నో మర్మాల గుట్టు ఇంకా బయటపడలేదు. వాటి విషయంలో శాస్త్రవేత్తలు, పరిశోధకుల మధ్యనే ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.ఆ కోవలోకే వస్తుందీ రామసేతు. శాస్త్ర-సాంకేతిక రంగంలో అమెరికా శాస్త్రవేత్తలకు మంచి పేరే ఉంది. అందులోనూ నాసా సైంటిస్టులంటే గురి కాస్త ఎక్కువ. ఏడేళ్ల క్రితం నాసా శాటిలైట్ కొన్ని చిత్రాలు పంపించింది. మనదేశాన్ని, శ్రీలంకను విడదీసే హిందూ మహాసముద్రం అంతర్భాగానికి సంబంధించిన ఫోటోలు అవి. భారత్, శ్రీలంక మధ్య హిందూమహాసముద్రం లోతు తక్కువ ఉన్న ప్రాంతంపై ప్రయాణిస్తున్న సమయంలో నాసా శాటిలైట్ ఒక ఆశ్చర్య కర పరిణామాన్ని గుర్తించింది. ఆ ప్రాంతంలో సముద్రంలో మునిగిపోయిన పెద్ద వస్తువుల కదలికలను ఆ ఉపగ్రహం గుర్తించింది. వెంటనే ఆ కదలికలకు సంబంధించి ఫోటోలు తీసి శాస్త్రవేత్తలకు పంపించింది.నాసా శాటిలైట్ పంపిన ఫోటోల్లో ఉన్న రాళ్లు మామూలు రాళ్లు కాదు. చాలా పెద్ద పెద్ద బండరాళ్లు అవి. దాంతో శాస్త్రవేత్తల్లో ఆసక్తి పెరిగి పోయింది. ఎందుకంటే ఆ ఫోటోల్లో ఉన్న రాళ్లు భారత్, శ్రీలంక మధ్య ఉన్న ఓ రాతివంతెనకు సంబంధించినవి. దాంతో ఇండియానా యూనివర్సిటీ నార్త్ వెస్ట్, యూనివర్సిటీ ఆప్ కొలరాడో బౌల్డర్, సదరన్ ఓరేగాన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు, జియోలజిస్టులు రంగంలోకి దిగి పరిశోధనలు జరిపారు. ఆ పరిశీలనల్లో ఆ రాతి వంతెన 30 మైళ్ల పొడవుతో ఉన్నట్లుగా బయటపడింది. సైంటిస్టులు, జియోలజిస్టులు పరిశోధించిన రాతి వంతెన మరేదో కాదు. భారతీయ మూలాల్లో ఇమిడిపోయిన శ్రీరామసేతు అది. ఆడమ్ బ్రిడ్జ్‌గా, సేతుబంధనంగా పేర్కొనే రామవారధి నిర్మాణానికి చెందిన రాళ్లు అవి. దాంతో శాస్త్రజ్ఞుల దృష్టి ఆ రాళ్లు, వాటి కింద ఉన్న ఇసుక నిర్మాణంపై పడింది. భూగర్భశాస్త్రవేత్తలు, సముద్ర పరిశోధకులు ఇసుక, రాతి వంతెన నిర్మాణాలపై లోతుగా పరిశోధనలు జరిపారు. ఆ రీసెర్చ్‌లో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. సైంటిస్టుల పరిశోధనలో ఇసుక నిర్మాణం సహజసిద్దంగా ఏర్పడినదే అని బయటపడింది. మరి రాతి వంతెన నిర్మాణం మాటేమిటి. అదే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఇచ్చిన సమాధానమే ఇప్పుడు యావత్ ప్రపంచపు దృష్టిని మళ్లీ రామసేతుపై పడేలా చేసింది.నాసా శాటిలైట్ పంపిన చిత్రాల ఆధారంగా రాతి వంతెనపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఆ వంతెన సహజసిద్దంగా ఏర్పడింది కాదని తేల్చారు. అంటే ఆ స్టోన్ బ్రిడ్జ్ నిర్మాణం అకస్మాత్తుగానో, ప్రకృతి పరంగానో ఏర్పడింది కాదు. ఎవ్వరో ఆ రాళ్లను తీసుకొచ్చి ఆ ఇసుక నిర్మాణంపై పేర్చుకుంటూ పోయారన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇదే నిజమైతే ఆ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎలా అక్కడికి చేరుకున్నాయి...?ఇసుక నిర్మాణం సహజసిద్ధంగా ఏర్పడిందని తేల్చిన శాస్త్రవేత్తలు రాళ్ల సంగతిని తేల్చే పనిలో పడ్డారు. జియోలజిస్టులు రంగంలోకి దిగి ఆ రాళ్లపై విస్తృతంగా పరిశోధనలు జరిపారు. ఈ రీసెర్చ్‌లో మరో విస్మయకర విషయం బయటపడింది. శాస్త్రీయ విశ్లేషణల ప్రకారం ఆ రాళ్లు 7వేల ఏళ్ల క్రితం నాటివి. కానీ ఆశ్చర్యకరంగా రాళ్లతో ఉన్న ఇసుక మాత్రం 4వేల ఏళ్ల క్రితం నాటిదే. ఇది క్రీస్తు పూర్వం ఏర్పడింది కాబట్టి ఆ లెక్కల ప్రకారం ఇసుక వయసు కంటే రాళ్ల వయసు తక్కువ. కార్బన్ డేటింగ్ప్రక్రియ ఆధారంగా రాళ్లు, ఇసుక వయసులను లెక్క కట్టిన సైంటిస్టులు రాతివంతెన నిర్మాణం సహజసిద్దంగా ఏర్పడింది కాదని తేల్చి చెప్పారు. ఆ వారధి మానవులు నిర్మించిందే అని స్పష్టం చేశారు. భారతీయ పరిశోధకుల అంచనా ప్రకారం సుమారు 5 వేల ఏళ్ల క్రితం భారత్, శ్రీలంక మధ్య ఓ వారధి నిర్మాణం జరిగింది. అప్పట్లో శ్రీరామునిగా మానవ రూపంలో అవతరించిన భగవానుడు ఆ వారధిని నిర్మించారన్నది హిందువుల విశ్వాసం. ఇప్పుడు విదేశీ సైంటిస్టులు చెబుతున్నది కూడా అదే. అంటే పరిశోధకులు చెబుతున్నదీ, పురాణాలు పేర్కొంటున్నదీ ఒక్కటే అన్నమాట. అంటే రామసేతు నిర్మాణం మానవ నిర్మిత అద్భుతమే అనుకోవాలి.హిందువుల విశ్వాసాలతో పెనవేసుకుపోయిన రామసేతు భారత్, శ్రీలంకను కలిపే వారధి. తమిళనాడులోని రామేశ్వరం దీవి సమీపంలో ఉన్న ధనుష్కోడి నుంచి శ్రీలంక సమీపంలో ఉన్న మన్నార్ద్వీపాన్ని కలుపుతూ ఈ వంతెన నిర్మాణం ఉంటుంది.ధనుష్కోడి నుంచి మన్నార్ ద్వీపం మధ్య అంతా సముద్రమే ఉన్నప్పటికీ లోతు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ఇప్పటికీ ఆ రాతి వంతెనకు సంబంధించిన రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. స్థానిక ఆలయవర్గాల సమాచారం ప్రకారం 50 కిలో మీటర్ల పొడవైన ఈ వంతెన 15వ శతాబ్దం వరకు సముద్ర మట్టానికి పైనే ఉండేది. 1480లో సంభవించిన పెను తుపాను ధాటికి ఆ వంతెన కూలిపోయింది.ఇక రామసేతు నిర్మాణం మానవ నిర్మితమా కాదా అన్న అంశంపై చాలా వాదనలున్నాయి. ఇస్రోలోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు చెందిన మెరైన్ అండ్ వాటర్ రీసోర్సెస్గ్రూప్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్-ICHR, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తదితర సంస్థలతో పాటు దేశ, విదేశీ సైంటిస్టుల బృందాలు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా పరిశోధననలు జరిపాయి. భారత్‌నుంచి శ్రీలంకను వేరు చేసే క్రమంలో సున్నితమైన సున్నపురాయి గుట్టలు ముక్కలు ముక్కలయ్యాయని, తర్వాత ఆ రాతి ముక్కలే వంతెనగా రూపాంతరం చెందాయని, కాబట్టి అది కృత్రిమ వంతెనే అని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.దాదాపు 103 చిన్న చిన్న గుట్టల నిర్మాణమే ఆడమ్ బ్రిడ్జ్ అని మెరైన్ అండ్ వాటర్ రీసోర్సెస్గ్రూప్ పేర్కొంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాత్రం ఆ వంతెన లక్ష 25 వేల ఏళ్ల క్రితం నాటిదని అభిప్రాయపడింది. ఐతే రామేశ్వరం, తలైమన్నార్ మధ్య ఉన్న రాళ్ల శాంపిల్లను రేడియో కార్భన్ డేటింగ్లో పరిశోధిస్తే అవి 7 వేల నుంచి 18 వేల ఏళ్ల క్రితం నాటివని బయటపడింది. ప్రొఫెసర్ SM రామస్వామి ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ రిమోట్ సెన్సింగ్పరిశోధనలో ఆ రాళ్ల వయసు 3 వేల 5 వందల సంవత్సరాలుగా తేలింది. -
ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)లో విషాదం చోటు చేసుకుంది. నాసా రిటైర్డ్ వ్యోమగామి విలియం ఆండర్స్ (90) ఘోర విమాన ప్రమాదంలో మరణించారు.1968న నాసా అపోలో 8లో ముగ్గురు వ్యోమగాములు ఫ్రాంక్ బోర్మాన్, జేమ్స్ లోవెల్, విలియం ఆండర్స్ చంద్రుడి మీదకు పంపించింది.అయితే ఈ ముగ్గురు వ్యామగాములు డిసెంబర్ 24, 1968న చంద్ర కక్ష్యలోకి వెళ్లి తిరిగి డిసెంబర్ 27న భూమికి తిరిగి వచ్చారు. అప్పుడే భూమి మూలాలతో చంద్రుడికి సంబంధం ఉన్నట్లు వెల్లడించారు.ఆ ఫోటో తీసింది ఈయనే అపోలో 8లో చంద్రుడి చుట్టు తిరిగే సమయంలో ముగ్గురి ఆస్ట్రోనాట్స్‌లో ఒకరైన విలియం ఆండర్స్ చంద్రుడి ఉపరితలంపై నుంచి వెలుగుతూ కనిపిస్తున్న భూమి ఫోటోని తీశారు.ఈ ఫోటోకు ‘ఎర్త్ రైజ్’గా పేరు పెట్టారు. అంతరిక్షం నుంచి భూమికి తీసిన తొలి కలర్ ఫోటో ఇదీ.విమానంలో సాంకేతిక లోపంతాజాగా ఎర్త్రైజ్ ఫోటోతీసిన విలియం అండర్స్ జోన్స్ ద్వీపం తీరానికి చేరే సమయంలో ఆండర్స్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ విమానం ప్రమాదంలో అండర్స్ మరణించారని, ఆ విమానంలో తన తండ్రి మాత్రమే ఉన్నారంటూ అండర్స్ కుమారుడు గ్రెగ్ చెప్పారంటూ ది సీటెల్ టైమ్స్ నివేదించింది.ఆకాశం నుంచి అనంతలోకాల్లోకి కేసీపీక్యూ-టీవీ కథనం ప్రకారం..అండర్స్ పాతకాలపు ఎయిర్ ఫోర్స్ సింగిల్ ఇంజిన్ టీ-34 విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో లోపం తలెత్తడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆకాశం నుంచి నిటారుగా సముద్ర తీర ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అండర్స్ ప్రాణాలు కోల్పోవడంతో నాసాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
సునీతా విలియమ్స్ అరుదైన ఘనత
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(59) అరుదైన ఘనతను సాధించారు. మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌక ద్వారా మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో సురక్షితంగా అంతరిక్ష కేంద్రానికి(ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్) చేరుకున్నారామె. ఆ సమయంలో సునీతా విలియమ్స్ ఆనందంతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించిన 26 గంటల తర్వాత వారు బోయింగ్ అంతరిక్ష నౌకను ISSలో విజయవంతంగా ల్యాండ్ చేశారు. ఐఎస్ఎస్లో వీళ్లిద్దరికీ ఘన స్వాగతం లభించింది. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను సునీత, బుచ్ విల్మోర్లు ఆలింగనం చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తపర్చారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం.. గంటకొట్టి వారిని ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్ స్పేస్ తన ఎక్స్ ఖాతాలో పంచుకోగా ప్రస్తుతం అది వైరలవుతోంది. That feeling when you're back on the station! 🕺@NASA_Astronauts Butch Wilmore and Suni Williams are greeted by the @Space_Station crew after @BoeingSpace #Starliner's first crewed journey from Earth. pic.twitter.com/fewKjIi8u0— NASA (@NASA) June 6, 2024ఐఎస్ఎస్లో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్నారు. వారిని కలిసిన సందర్భంగా తాను ఈ విధంగా డ్యాన్స్ చేసి వేడుక చేసుకున్నానని తెలిపారామె. కాగా, బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్‌కు ఇది తొలి మానవసహిత యాత్ర. స్టార్‌లైనర్‌లో ప్రయాణించిన మొదటి సిబ్బంది విలియమ్స్, విల్మోర్. వీళ్లిద్దరూ అక్కడ వారం గడుపుతారు. ఈ యాత్ర ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఇవాళ ఉదయం కూడా హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్-కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా గంట ఆలస్యమైనప్పటికీ.. ఐఎస్ఎస్తో అనుసంధానం కాగలిగింది. ఐఎస్ఎస్కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్మోర్లు కొద్దిసేపు పరీక్షించారు. మార్గమధ్యంలోనూ ఈ క్యాప్సూల్‌ను హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్ ప్రతినిధి తెలిపారు. వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని చెప్పారు.భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌కు ఇది మూడో రోదసి యాత్ర. 1998లో నాసా ద్వారా వ్యోమగామిగా ఎంపికయ్యారు. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్ఎస్కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. ఆమె ఒక మారథాన్ రన్నర్. ఐఎస్ఎస్లో ఓసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. -
మూడోసారి సునీత అంతరిక్ష ప్రయాణం
-
మూడోసారి అంతరిక్షంలోకి సునీత
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్(61)తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో బుధవారం పయనమయ్యారు. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు 25 గంటల్లో చేరుకోబోతోన్నారు. అక్కడ వారం రోజులపాటు ఉంటారు. స్టార్‌లైన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే ఈ నెల 14న మళ్లీ భూమిపైకి చేరుకుంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ప్రయాణం అరంభమైంది. స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగాములుగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చరిత్ర సృష్టించారు. ఈ స్పేస్ మిషన్‌కు సునీతా ఫైలట్‌గా, విల్మోర్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. సునీతా అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి కావడం విశేషం. 2006లో, 2012లో అంతరిక్ష ప్రయాణం సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రయథ్లాన్ పూర్తిచేసిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. వెయిట్ లిఫ్టింగ్ మెషీన్ సాయంతో శూన్య వాతావరణంలో ఈత కొట్టారు. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తారు. 2007లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బోస్టన్ మారథాన్ పూర్తిచేశారు. అమెరికా నావికాదళంలో పనిచేసిన సునీతా విలియమ్స్‌ను నాసా 1998లో ఎంపిక చేసి వ్యోమగామిగా శిక్షణ ఇచి్చంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్టు మిషన్ చాలా ఏళ్లు వాయిదా పడింది. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధిలో కొన్ని అటంకాలు తలెత్తడమే ఇందుకు కారణం. ఎట్టకేలకు స్పేస్‌క్రాఫ్ట్ సిద్ధమైంది. బోయింగ్ కంపెనీ డెవలప్ చేసిన మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం వాహనం స్టార్‌లైనర్ కావడం విశేషం. ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇలాంటి అంతరిక్ష ప్రయాణ వాహనాలు తయారు చేసే తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డుకెక్కింది. తాజా ప్రయోగంతో రెండో ప్రైవేట్ సంస్థగా బోయింగ్ కంపెనీ రికార్డు సృష్టించింది. -
నేడు సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
న్యూఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. భారత కాల మానం ప్రకారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి బోయింగ్ స్టార్‌లైనర్ రాకెట్లో ఈ రోజు రాత్రి 10 గంటల సమయంలో అంతరిక్షంలోకి బయలు దేరనున్నారు. అంతరిక్షంలో లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కి వ్యోమగాములను చేరవేసే ప్రాజెక్ట్‌పై బోయింగ్ స్టార్‌లైనర్ పనిచేస్తోంది.ప్రాజెక్ట్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైన్ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లే సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్కు చెందిన హార్మోనీ మాడ్యుల్ సబ్‌సిస్టమ్స్ పనితీరుపై వారం రోజుల పాటు పనిచేయనున్నారు. ఈ పర్యటన విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్ లైనర్ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. ఇప్పటివరకు ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ నాసా సర్టిఫై అయింది. స్టార్ లైనర్ వ్యోమనౌక అంతరిక్ష యాత్ర కూడా విజయవంతమైతే స్పేస్ ఎక్స్ జాబితాలో చేరిపోనుంది.బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయోగం గత నెల 7న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ రాకెట్‌ను నింగిలోకి పంపే రెండుగంటల ముందు వాల్వ్‌లో సమస్య తలెత్తడంతో.. కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. దీంతో భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా, బుచ్ విల్ మోర్ల అంతరిక్షయానం వాయిదా పడింది. తాజాగా భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 10గంటలకు ప్రారంభం కానుంది. 2006లో సునీతా విలియమ్స్ తన తొలి రోదసి యాత్రను చేపట్టారు. ఆ తర్వాత 2012లో రెండో సారి అంతరిక్షంలోకి వెళ్లారు. తాజాగా మరోసారి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నారు. -
స్టార్‌లైనర్ క్యాప్సుల్ ప్రయోగం మళ్లీ వాయిదా..కారణం..
నాసా స్టార్‌లైనర్ క్యాప్సుల్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు తెలిపింది. ప్రొపల్షన్ సిస్టమ్‌లో హీలియం లీక్ అవుతున్నట్లు గమనించామని, త్వరలో సమస్య పరిష్కరిస్తామని నాసా వర్గాలు వెల్లడించాయి.అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, బోయింగ్‌తో కలిసి స్టార్‌లైనర్ క్యాప్యుల్ ప్రయోగాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు అంతరిక్ష సిబ్బందిని, కార్గోను చేరవేస్తారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్ల కొద్దికాలంగా ఈ ప్రయోగం వాయిదా పడుతోంది. మే7న ఫ్లోరిడా నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రయోగం ప్రారంభంకానున్న కొన్నిగంటల ముందు అట్లాస్ బూస్టర్‌లో సమస్య గుర్తించారు. దాంతో మొదట వాయిదాపడింది. ఈ అట్లాస్ రాకెట్‌ను యునైటెడ్ లాంచ్ అలయన్స్, బోయింగ్‌కు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ సంయుక్తంగా తయారుచేశారు.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లుఇటీవల అన్ని సమస్యలు పరిష్కరించామని ప్రకటించిన ఇరు సంస్థలు తాజాగా ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి హీలియం లీక్ అవ్వడాన్ని గుర్తించారు. దాంతో రెండోసారి ఈ ప్రయోగం పోస్ట్‌పోన్ అవుతున్నట్లు నాసా ప్రకటించింది. ఈ సందర్భంగా నాసా ప్రతినిధులు మాట్లాతుడూ..‘ప్రొపల్షన్ సిస్టమ్‌లో హీలియం లీక్ అయినట్లు గుర్తించాం. సిస్టమ్ పనితీరు, రిడెండెన్సీని అంచనా వేస్తున్నాం. మిషన్ అధికారులు సమస్యను మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. తదుపరి ప్రయోగ తేదీని త్వరలో ప్రకటిస్తాం’ అని చెప్పారు. -
నాసా ఏరో స్పేస్ ఇంజనీర్‌గా తొలి భారతీయ యువతి!
అమెరికాలోని నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్)లో ఉద్యోగం... ఈ కల చాలా మందికే ఉండి ఉంటుంది. ఈ కలను సాకారం చేసుకున్న తొలి భారతీయ యువతి అక్షత కృష్ణమూర్తి. నాసా అనగానే మనకు అంతరిక్షంలోకి వెళ్లి గ్రహాలను అధ్యయనం చేసిన రాకేశ్ శర్మ గుర్తు వస్తారు. అలాగే కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ కూడా గుర్తుకు వస్తారు. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ ఇద్దరూ భారతీయ సంతతికి చెందిన వారే కానీ భారత పౌరసత్వం ఉన్న వాళ్లు కాదు. అమెరికా పౌరసత్వమే వారి అంతరిక్ష పథాన్ని సుగమం చేసింది. ఇక అక్షత విషయానికి వస్తే... ఆకాశానికి ఆవల బెంగళూరుకు చెందిన అక్షతా కృష్ణమూర్తికి చిన్నప్పటి నుంచి ఆకాశానికి ఆవల ఏముంటుంది అనే ఆలోచనే. ఆమె బాల్యం ఆకాశంలో నక్షత్రాలను చూడడంతో, చుక్కల్లో చందమామ వెలుగుతో సంతృప్తి చెందలేదు. అంతరిక్షం అంటే మనకు కనిపించేది మాత్రమే కాదు, ఇంకా ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. బాల్యంలో మొదలైన ఆసక్తిని పెద్దయ్యేవరకు కొనసాగించింది. తన పయనాన్ని అంతరిక్షం వైపుగా సాగాలని కోరుకుంది. అందుకోసం తీవ్రంగా శ్రమించింది, నేడు నాసాలో ఏరో స్పేస్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ వివరాలను తెలియచేస్తూ ‘‘ఇది కేవలం అదృష్టం అని కానీ, కాకతాళీయంగా జరిగిపోయిందని చెప్పను. పూర్తిగా పదిహేనేళ్ల కఠోర శ్రమతోనే, అంతకు మించిన ఓర్పుతోనే సాధ్యమైంది’’ అంటుంది అక్షత. అలాగే అంతరిక్షంలో కెరీర్‌ని వెతుక్కోవాలంటే పాటించాల్సిన కొన్ని సూత్రాలను కూడా పంచుకుంది. నక్షత్రశాల నుంచి అంతరిక్షం వరకు... ‘‘నాసాలోని జెట్ ప్రోపల్షన్ లాబొరేటరీలో స్పేస్ మిషన్లకు ‘ప్రిన్సిపల్ నావిగేటర్ అండ్ స్పేస్ సిస్టమ్స్ ఇంజనీర్’గా విధులు నిర్వర్తిస్తున్నాను. నాసా–ఇస్రో సంయుక్తంగా నిర్వహించిన సింథటిక్ ఆపెర్చర్ రాడార్ మిషన్‌లో ఫేజ్ లీడ్‌గానూ, మార్స్ 2020 మిషన్‌లో రోబోటిక్స్ సిస్టమ్స్ ఇంజనీర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాను. నేను చదివింది స్టేట్ బోర్డ్ సిలబస్‌లోనే. మాది సంపన్న కుటుంబం కూడా కాదు. అయితే చిన్నప్పుడు నా వీకెండ్ ఎంజాయ్మెంట్లో ప్లాలానిటేరియం విజిట్స్, బెంగుళూరులో ఎయిర్షోస్ ఎక్కువగా ఉండేవి. నా ఆసక్తిని గమనించిన మా అమ్మానాన్న నేనడిగిన ప్రతిసారీ తీసుకెళ్లేవారు. హబుల్ టెలిస్కోప్ గురించి తెలుసుకోవడం నా జీవితంలో గొప్ప మలుపు. బహుశా 2000 సంవత్సరంలో అనుకుంటాను. నాకప్పుడు పదేళ్లు. వ్యోమగాములు అంతరిక్షంలో నడవడం గురించి తెలిసి చాలా ఆనందం కలిగింది. అంతరిక్షం నుంచి భూమిని చూడాలనే కోరిక కూడా. కెరీర్ గురించిన ఆలోచనలకు స్పష్టమైన రూపం వచ్చింది కూడా అప్పుడే. అంతరిక్షంలోకి వెళ్లే మార్గాల గురించి అధ్యయనం చేయగా చేయగా వ్యోమగాముల్లో ఎక్కువమంది ఎమ్ఐటీలోనే చదివారని తెలిసింది. నేను అదే సంస్థలో చదవాలని నిర్ణయించుకున్నాను. దాంతో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరాను. బెంగళూరులోని ఆర్ కాలేజ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ 2010 బ్యాచ్‌లో నేను మాత్రమే అమ్మాయిని. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయీలో ఏరోస్పేస్లో మాస్టర్స్ చేశాను. పీహెచ్‌డీకి ఎమ్ఐటీ (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. అయితే యూఎస్‌లో అంతరిక్షంలో ఉద్యోగం రావాలంటే ఆ దేశ పౌరసత్వం ఉండాలి కనీసం గ్రీన్‌కార్డ్ అయినా ఉండాలి. సెమినార్లలో నేను సమర్పించిన పేపర్లకు ప్రశంసలు వచ్చినప్పటికీ ఉద్యోగం వచ్చేది కాదు. అయినా నా పరిశోధనలను మాత్రం ఆపలేదు. ప్రొఫెసర్లకు వారితో కలిసి పని చేసే అవకాశం ఇవ్వమని వినతులు పోస్ట్ చేయడం కూడా ఆపలేదు. నా అప్లికేషన్ ఎప్పుడూ వెయిల్ లిస్టులోనే ఉండేది. వీసా సమయం పూర్తి కావస్తున్న సమయంలో ఒక పేపర్ ప్రెజెంటేషన్ సారా సీగర్ అనే ఆస్ట్రో ఫిజిసిస్ట్ దృష్టిని ఆకర్షించింది. అలా ఒక ఏడాదికి ఇంటర్న్‌షిప్‌కి అవకాశం వచ్చింది. ఆ ఏడాది పూర్తవుతున్న సమయంలో మరో పీహెచ్‌డీకి అప్లయ్ చేశాను. నాసా – ఇస్రో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా పని చేశాను. మొత్తం మీద మూడవ ప్రయత్నంలో నాసాలో ఫుల్‌టైమ్ ఉద్యోగినయ్యాను. మేధ ఉంది– పాదు లేదు మనదేశంలో అంతరిక్షంలో పరిశోధన చేయగలిగిన మేధ ఉంది. మొక్క ఎదగాలంటే అందుకు అనువైన పాదు ఉండాలి. అలాంటి పాదును తల్లిదండ్రులు బాల్యంలోనే వేయాలి. అలాంటి ప్రోత్సాహం మన దగ్గర ఉండాల్సినంతగా లేదనే చెప్పాలి. అందుకే లక్ష్యాన్ని సాధించడంలో నాకు ఎదురైన సవాళ్లతోపాటు అవకాశాలను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నాను. నేను సూచించేదేమిటంటే... స్కూల్లో సైన్స్ ప్రాజెక్టుల్లో పాల్గొనాలి. అంతరిక్షంలో కూడా ఆస్ట్రో ఫిజిక్స్, ఆ్రస్టానమీ, టెక్నాలజీ, ఇంజినీరింగ్ వంటి చాలా విభాగాలుంటాయి. మన ఆసక్తి ఎందులో అనేది తెలుసుకోవాలి. అంతరిక్షరంగంలో స్థిరపడాలంటే బాచిలర్స్ సరిపోదు. బాచిలర్స్లో సైన్స్, ఇంజినీరింగ్‌తోపాటు పీహెచ్డీ తప్పనిసరి. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, కోడింగ్ వంటి నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకోవాలి. అంతరిక్షానికి సంబంధించి వీలైనంత ఎక్కువ సదస్సులు, సమావేశాల్లో పాల్గొనాలి. నిపుణులను సంప్రదిస్తూ మన సందేహాలను నివృత్తి చేసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ అంతరిక్షయానాన్ని సుగమం చేసే మార్గాలు’’ అంటోంది అక్షత. View this post on Instagram A post shared by Dr. Akshata Krishnamurthy | NASA Rocket Scientist (@astro.akshata) (చదవండి: వీల్‌చైర్‌కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!) -
ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
తల్లాహస్సీ: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధం అయ్యారు. అయితే ఈ యాత్ర ఆగిపోయింది. సాంకేతిక కారణాల దృష్ట్యా రోదసీ యాత్ర ఆగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎక్స్ ద్వారా తెలిపింది. అయితే తిరిగి యాత్ర ఎప్పుడు ఉంటుందనేదానిపై నాసా స్పష్టత ఇవ్వలేదు.బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ Starliner వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి ఈ వ్యోమనౌక అట్లాస్-V రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. Today's #Starliner launch is scrubbed as teams evaluate an oxygen relief valve on the Centaur Stage on the Atlas V. Our astronauts have exited Starliner and will return to crew quarters. For updates, watch our live coverage: https://t.co/plfuHQtv4l— NASA (@NASA) May 7, 2024అయితే 90 నిమిషాల ముందర రాకెట్లో సమస్యతో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో సునీత.. మిషన్ పైలట్‌గా వ్యవహరించబోతున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కూడా వెళ్లాల్సి ఉంది.మిషన్ ప్రకారం.. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వారం పాటు బసచేస్తారు. వాస్తవానికి స్టార్‌లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.ప్రస్తుతం ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక ఈ తరహా సేవలు అందిస్తోంది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి.అందుకే ఒకింత ఆత్రుత.: సునీతతాజా అంతరిక్ష యాత్ర గురించి సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఐఎస్ఎస్కు వెళ్తుంటే.. సొంతింటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుంది. స్టార్‌లైనర్‌కు ఇది మొదటి మానవసహిత యాత్ర కావడం వల్ల ఒకింత ఆత్రుతగా ఉంది. అయినప్పటికీ గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదు. రోదసిలో సమోసాను ఆస్వాదించడమంటే ఇష్టం. నేను ఆధ్యాత్మికవాదిని. గణేశుడు నా అదృష్ట దైవం. అందువల్ల గణనాథుడి విగ్రహాన్ని వెంట తీసుకువెళతాను’’ అని ఆమె పేర్కొన్నారు. సునీత ఒక మారథాన్ రన్నర్. ఐఎస్ఎస్లో ఓసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. గతంలో ఆమె 2006, 2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. -
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
అమెరికన్ స్పేస్ షటిల్స్... ముప్పై ఏళ్లు కొనసాగిన వీటి శకం 2011లో ముగిసింది. 1960ల నాటి సోవియట్ ‘సోయజ్’ కేప్సూల్... పాతపడిన, ఇరుకైన ఓ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి ఆధునిక మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో కాలం నెట్టుకొస్తున్నా అది కూడా నిష్క్రమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేశాక... రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లు అమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడపడాన్ని చూశాక... చెప్పేదేముంది? అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, రోదసి పరిశోధన, భావి చంద్ర-అంగారక యాత్రలు... అన్నీ ప్రైవేటైజేషనే! కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తోకూస్తో నిధులు... వీటికే ప్రభుత్వరంగ పాత్ర పరిమితమవుతోంది. పెట్టుబడి, పరిశోధన, లాంచింగ్స్ పరంగా రోదసిని ఇకపై ప్రైవేటు రంగమే ఏలబోతోంది. అంతరిక్షాన్ని అందుకోవడానికి రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు సిద్ధమయ్యాయి. ఇవి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లే అంతరిక్ష నౌకలు (స్పేస్ కేప్సూల్స్). ‘ఎక్స్’ (ట్విట్టర్) బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ వ్యోమగాములు, సరుకుల్ని చేరవేస్తోంది. ప్రపంచ అతిపెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ వ్యోమనౌకతో ఈ నెల 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో ప్రధాన విశేషం.మన సునీత హ్యాట్రిక్!ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్... ముద్దుపేరు సునీ... 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతోంది. అమెరికన్ నేవీ కెప్టెన్ (రిటైర్డ్) అయిన సునీతకు అనుభవమే మనోబలం. నాసా ఆమెను 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్య (ముంబాయి) కాగా, తల్లి స్లోవేన్-అమెరికన్ అర్సలిన్ బోనీ. అమెరికాలో 1965లో సునీత జన్మించారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్-5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ కంపెనీ వ్యోమనౌక ‘స్టార్ లైనర్’లో ఈ నెల 6న రాత్రి 10:34 గంటలకు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04 గంటలకు) ఫ్లోరిడాలోని కేప్ కెవెవరాల్ నుంచి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలో వారం రోజులు గడిపి భూమికి తిరిగొస్తారు. 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత 2007 జూన్ 22 వరకు రోదసిలో గడిపారు. ఆ సందర్భంగా మొత్తం 29 గంటల 17 నిమిషాలపాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. 2008లో మరో మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఐదు సార్లు స్పేస్ వాక్ చేసి సునీత రికార్డును బద్దలుకొట్టారు. తర్వాత సునీత రెండోసారి 2012 జులై 14 నుంచి 2012 నవంబరు 18 వరకు 127 రోజులపాటు ఐఎస్ఎస్లో ఉండి ప్రయోగాలు నిర్వహించారు. జపాన్ వ్యోమగామి అకిహికో హోషిడేతో కలసి ఆమె మూడు స్పేస్ వాక్స్ చేశారు. అంతరిక్ష కేంద్రం సౌర ఫలకాల నుంచి ఐఎస్ఎస్ వ్యవస్థలకు పవర్ సరఫరా చేసే ఓ విడిభాగం పాడైపోగా దాన్ని తొలగించి కొత్తదాన్ని అమర్చారు. అలాగే ఐఎస్ఎస్ రేడియటర్ అమ్మోనియా లీకేజిని సరిచేశారు. ఈ రెండు మిషన్లలో సునీత 322 రోజులు రోదసిలో గడిపారు. మొత్తం 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత పెగ్గీ విట్సన్ 10 సార్లు స్పేస్ వాక్స్ చేసి మరోమారు సునీత రికార్డును అధిగమించారు. ఎట్టకేలకు బోయింగ్... గోయింగ్! రాకెట్లు అనేవి వాహకనౌకలు. అవి వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళ్లి వదిలివేస్తాయి. అక్కడి నుంచి వారు గమ్యం చేరుకోవడానికి వ్యోమనౌక (స్పేస్ షిప్/ స్పేస్ కేప్సూల్)లో ప్రయాణించాల్సిందే. అమెరికన్ స్పేస్ షటిల్స్ నేరుగా ఐఎస్ఎస్ కు వెళ్లి వచ్చేవి. ఆ ఫ్లీట్ కనుమరుగైంది. ఐఎస్ఎస్ యాత్రల కోసం నాసా మార్గాంతరం లేక తమ సోయజ్ రాకెట్-వ్యోమనౌకల శ్రేణిపై ఆధారపడటంతో రష్యా గట్టిగా డబ్బులు పిండటం మొదలెట్టింది. ఒక్కో సీటుకు రేటు పెంచేసింది. అమెరికన్ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పట్టుకెళ్లి తిరిగి తీసుకురావడానికి ఒక్కొక్కరికి రూ.700 కోట్లు చొప్పున రష్యా వసూలు చేస్తోంది.దీంతో నాసా తమ ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’లో భాగంగా వ్యోమనౌకలను అభివృద్ధి చేసే కాంట్రాక్టుల్ని 2014లో రెండు సంస్థలకు కట్టబెట్టింది. ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ స్పేస్ కేప్సూల్ డిజైనింగ్, అభివృద్ధి కోసం బోయింగ్ సంస్థ 4.2 బిలియన్ డాలర్ల (రూ.35 వేల కోట్లు) కాంట్రాక్టు, ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్ ఆవిష్కరణ కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టు పొందాయి. 2020 నుంచే స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’లో వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళుతోంది. బోయింగ్ తన ‘సీఎస్టీ-100 (క్రూ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్-100) స్టార్ లైనర్’ పరీక్షల్లో వెనుకబడింది. 2019లో మానవరహిత ఆర్బిటాల్ ఫ్లైట్ టెస్టు (ఓఎఫ్టీ-1) సందర్భంగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాఫ్టువేర్ సమస్య తలెత్తింది. దాంతో అంతరిక్ష కేంద్రానికి నౌక అనుసంధానం కాకుండానే వెనుదిరిగి అతి కష్టంమీద భూమికి తిరిగొచ్చింది. 2022లో అది మానవరహిత ఓఎఫ్టీ-2లో విజయవంతమైంది. తాజాగా ఈ నెల 6న ‘స్టార్ లైనర్’ తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, ‘స్టార్ లైనర్’ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదం కాగానే... అంతరిక్ష మానవసహిత యాత్రలకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను నాసా ఆరంభిస్తుంది. అలా ‘స్టార్ లైనర్’కు లైసెన్స్ లభిస్తుంది. ఏడుగురు వెళ్లి రావచ్చు!‘స్టార్ లైనర్’లో ఏడుగురు వ్యోమగాములు రోదసికి వెళ్ళి రావచ్చు. వీరి సంఖ్యను తగ్గించుకునే పక్షంలో సరకులను తరలించవచ్చు. ‘స్టార్ లైనర్’ లో క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ ఉంటాయి. గత అమెరికన్ స్పేస్ కేప్సూల్స్ మాదిరిగా ఇది సముద్రంలో దిగదు. పైన పారాచూట్లు, కింద ఎయిర్ బ్యాగుల సాయంతో నేల మీదనే దిగుతుంది. అపోలో కమాండ్ మాడ్యూల్, స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’ కంటే సైజులో ‘స్టార్ లైనర్’ పెద్దది. ఇది ఐఎస్ఎస్ కు అనుసంధానమై ఏడు నెలల పాటు కక్ష్యలో ఉండగలదు. ‘స్టార్ లైనర్’ పునర్వినియోగ స్పేస్ కేప్సూల్. ఒక కేప్సూల్ పది మిషన్ల దాకా పనికొస్తుంది. నాసా తమ వ్యోమగాముల యాత్రల కోసం ఒక్కో సీటుకు స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’లో అయితే రూ.450 కోట్లు, బోయింగ్ ‘స్టార్ లైనర్’లో అయితే రూ.700 కోట్లు కుమ్మరించి కొనుక్కోవాల్సిందే! - జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The Boeing Company, NASA, The New York Times, The Washington Post, BBC, Reuters, Space.com, SciTechDaily, ars TECHNICA, PHYS.ORG, Forbes, Popular Science, Scientific American, Hindustan Times, The Indian Express, ND TV, India TV News, Business Today, The Economic Times, News 18, mint, Business Standard, First Post, Times Now) -
NASA భారత విద్యార్థులకు నాసా అవార్డులు
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ నిర్వహించిన హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ చాలెంజ్‌లో మన విద్యార్థులు సత్తా చాటారు.న్యూఢిల్లీ ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల బృందాలు నాసా అవార్డులను గెలుచుకున్నాయి.అలబామా రాష్ర్టంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అవార్డును గెలుచుకున్నట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) సోమవారం ప్రకటించింది. అలాగే ముంబైకి చెందిన ద కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. కాగా ఈ పోటీలో అమెరికాలోని డాలస్‌కు చెందిన పారిష్ ఎపిస్కోపల్ స్కూల్ హైస్కూల్ విభాగంలో తొలి బహుమతి సాధించింది. అలాగే కాలేజీ, యూనివర్సిటీ విభాగంలో హంట్స్ విల్లేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలబామా ప్రథమ బహుమతిని గెల్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 600 మందికిపైగా విద్యార్థులతో కూడిన 72 టీమ్స్ ఈ వార్షిక పోటీలో పాల్గొన్నాయి. అమెరికాలోని 24 రాష్ట్రాలతోపాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, ప్యూర్టోరికో, భారత్ సహా మరో 13 దేశాల నుంచి 42 కాలేజీలు, యూనివర్సిటీలు, 30 హైస్కూళ్ల విద్యార్థులు ఈ పోటీలో తన ప్రతిభను చాటారు. -
పగలే కమ్ముకున్న చీకట్లు
మునుపెన్నడూ చేసుకోని పరిణామాలకు ఉత్తర అమెరికా వేదిక అయ్యింది. గ్రహణంతో పగలే కారుచీకట్లు కమ్ముకున్నవేళ.. లక్షల మంది ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించారు.ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించి అమెరికాకు చెందిన నాసా పూర్తి సూర్య గ్రహణం ఏర్పడిన చిత్రాన్ని, వీడియోను విడుదల చేసింది. సోమవారం చోటు చేసుకున్న సంపూర్ణ సూర్యగ్రహణం సుమారు 2045 ఏడాదిన మళ్లీ ఏర్పడనుందని పేర్కొంది. Ever seen a total solar #eclipse from space? Here is our astronauts' view from the @Space_Station pic.twitter.com/2VrZ3Y1Fqz — NASA (@NASA) April 8, 2024 అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణ గమనానికి సంబంధించి ఓ వీడియోను కూడా నాసా షేర్ చేసింది. ఇందులో సూర్యగ్రహణ గమనం కారణంగా నెమ్మదిగా కదులుతూ.. ఉత్తర అమెరికాపై చీకటి ఛాయ వ్యాపించడాన్ని అంతరిక్ష కేంద్ర నుంచి వ్యోమగాములు గమనిస్తున్నారని తెలిపింది. పట్టపగలే కొంత సమయం పాటు ఉత్తర ఆమెరికా ప్రాంతం చీకటిగా మారిందని తెలిపింది. ఇండియానాపోలిస్ మొత్తాన్ని క్రాస్ చేస్తూ.. ఇలా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటం సుమారు 800 ఏళ్లలో ఇదే మొదటిసారని వెల్లడించింది నాసా. Follow, follow the Sun / And which way the wind blows / When this day is done 🎶 Today, April 8, 2024, the last total solar #eclipse until 2045 crossed North America. pic.twitter.com/YH618LeK1j — NASA (@NASA) April 8, 2024 మరోవైపు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘సూర్యుడు భ్రమిస్తూ గ్రహణం ఏర్పడటం ఆర్బిట్ నుంచి కనిపిస్తుంది’ అని కామెంట్ జత చేశారు. View of the eclipse from orbit pic.twitter.com/2jQGNhPf2v — Elon Musk (@elonmusk) April 9, 2024 -
సూర్య గ్రహణం ఎఫెక్ట్.. అమెరికాలో భారీగా రోడ్డు ప్రమాదాలు !
వాషింగ్టన్: సూర్యగ్రహణం వేళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అమెరికన్లను నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమవారం(ఏప్రిల్ 8) ఉదయం ఉత్తర అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2017 సూర్యగ్రహణంతో పోలిస్తే ఈ గ్రహణ సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు 31 శాతం దాకా పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం 2017లో గ్రహణం పూర్తిగా కనిపించే(ద పాత్ ఆఫ్ టొటాలిటీ) 70 మైళ్ల విస్తీర్ణం. ఈ విస్తీర్ణంలోని ప్రాంతాలకు గ్రహణాన్ని చూసేందుకు వచ్చిన వారితో కోటి 20 లక్షల మంది జన సాంద్రత ఏర్పడిందని, సోమవారం ఏర్పడే గ్రహణం 115 మైళ్ల విస్తీర్ణంలో పూర్తిగా కనిపించనుండగా మొత్తం 31.6 మిలియన్ల మంది ఈ విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు వచ్చి దీనిని చూస్తారని నాసా అంచనా వేసింది. అయితే గ్రహణం పూర్తిగా ఉన్న సమయంలో దానిని చూసేందుకు ఎక్కడి వారు అక్కడే ఆగి పోవడంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. గ్రహణానికి ముందు అది పూర్తిగా కనిపించే ప్రాంతాలకు చేరుకోవడానికి, గ్రహణం తర్వాత సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ సమయంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి 25 నిమిషాలకు సగటున ఒక ప్రమాదం జరుగుతుండగా, ప్రతి 95 నిమిషాలకు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు గత అనుభవాలు చెబుతున్నాయి. 2017 సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కేవలం మూడు పెద్ద నగరాలకు మూడు గంటల దూరంలో పూర్తిగా కనిపించగా ప్రస్తుత సూర్య గ్రహణం కెనడాలోని టొరంటో సహా ఎనిమిది పెద్ద నగరాలకు 3 గంటల ప్రయాణ దూరంలో పూర్తిగా కనిపించనుంది. దీంతో దీనిని వీక్షించేందుకు అబ్జర్వేటరీలకు వెళ్లడానికి రోడ్డెక్కేవారి సంఖ్య భారీగా పెరగనుంది. కాగా, సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని మెక్సికో, అమెరికా, కెనడాల మీద ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో గ్రహణం ప్రభావాన్ని బట్టి పూర్తిగా చీకటి కమ్ముకోనుంది. అయితే భారత్‌లో దీని ప్రభావం లేదు. భారత కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి మంగళవారం తెల్లవారుజామున 2.22గంటల వరకు గ్రహణం ఉంటుంది. ఇదీ చదవండి.. నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏయే రాశులకు ఏం జరుగుతుందంటే.. -
చంద్రుడికి టైం వచ్చింది..!
-
Voyager-1: హస్త లా విస్తా.. బేబీ!
వోయేజర్–1. ఈ పేరే ఖగోళ శాస్త్రవేత్తలకు ఎనలేని స్ఫూర్తి. నింగికేసి ఉత్సాహంగా చూసేలా కొన్ని తరాలను పురి గొలి్పన ప్రేరణ శక్తి. అలుపెరుగని యాత్ర. కోట్లాది కిలోమీటర్ల జైత్రయాత్ర. అర్ధ శతాబ్ద కాలపు వైజ్ఞానిక పరిశోధనల సారం. మానవాళి కలలుగన్న ‘సుదూర’ లక్ష్యపు సాకార రూపం. గ్రహాంతర హద్దులను దాటి నక్షత్రాంతర రోదసికెగసిగిన విశ్వవిఖ్యాత వ్యోమనౌక వోయేజర్–1. అంతరిక్షంలో ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువు ఇదే. 1977 సెపె్టంబరు 5న అమెరికా ప్రయోగించిన ఈ వ్యోమనౌకది 46 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఈ జనవరి నాటికి అది భూమి నుంచి 2,440 కోట్ల కిలోమీటర్ల దూరాన ఉంది. ఇప్పుడీ వ్యోమనౌకకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి. గత నవంబరు నుంచి భూమికి సరైన సమాచారమివ్వడం లేదు. నాసాకు పిచ్చి పిచ్చి సందేశాలు పంపుతోంది. ఎలా చూసినా వోయేజర్–1 చరిత్ర ఇక ముగిసిన అధ్యాయమేనని అనిపిస్తోంది. అద్భుతమేదైనా జరిగితే తప్ప అది మనకిక హస్త లా విస్తా (వీడ్కోలు) చెప్పినట్టే! వోయేజర్–1లోని ఓ కంప్యూటర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో కాలిఫోర్నియాలోని పసడెనాలో జెట్ ప్రొపల్షన్ లే»ొరేటరీలో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ కేంద్రానికి వ్యోమనౌక నుంచి అర్థరహిత సమాచారం అందుతోంది. వోయేజర్–1ను నిర్మించి ప్రయోగించినప్పటి నాసా సిబ్బందిలో చాలామంది కాలం చేశారు. దాంతో తాజా సమస్యను పరిష్కరించి వ్యోమనౌకను మళ్లీ గాడిన పెట్టేందుకు దాని నిర్మాణం తాలూకు పాత పత్రాలను ముందేసుకుని శాస్త్రవేత్తలు కొన్ని నెలలుగా కుస్తీలు పడుతున్నారు. ఈ సమస్య నుంచి వ్యోమనౌక బయటపడితే అద్భుతమేనని 2010 నుంచి ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న సుజానే డాడ్ అన్నారు. సౌరవ్యవస్థను దాటి మున్ముందుకు! హీలియోస్ఫియర్. సౌరవ్యవస్థ చుట్టూ సూర్యుడు నేరుగా ప్రభావం చూపే పొడవైన బుడగ లాంటి ప్రదేశం. దీని అంచును హీలియోపాజ్ అంటారు. వోయేజర్–1 2012లోనే ఈ హీలియోపాజ్నును దాటేసి నక్షత్రాంతర రోదసిలోకి ప్రవేశించింది. అలా ఇంటర్ స్టెల్లార్ స్పేస్‌లోకి అడుగిడిన తొలి మానవ నిర్మిత వస్తువుగా రికార్డుకెక్కింది. 2018లో వోయేజర్–2 కూడా ఇంటర్ స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది. కాస్మిక్ కిరణాలు, నక్షత్రాంతర ప్రాంతంలోని అయస్కాంత క్షేత్రంలో అసాధారణ అలజడులు, ప్లాస్మా కణాలపై వోయేజర్–1 అధ్యయనం చేస్తోంది. భూమి నుంచి దానికి ఆదేశం పంపడానికి 22.5 గంటలు, దాన్నుంచి డేటా స్వీకరించడానికి మరో 22.5 గంటలు.. ఇలా సమాచారం ఇచి్చపుచ్చుకోవడానికి రమారమి రెండు రోజులు పడుతోంది. జంట విజయాలు... వోయేజర్ ప్రాజెక్టులో వోయేజర్–1, 2 భాగస్వాములు. వోయేజర్–2ను వోయేజర్–1 కంటే రెండు వారాల ముందు ప్రయోగించారు. నిజానికి వీటిది కేవలం నాలుగేళ్ల మిషన్. కానీ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. వోయేజర్–2 ప్రస్తుతం పనిచేస్తున్నా దాన్నీ సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. పయనీర్–10, 11 వ్యోమనౌకల యాత్రలకు కొనసాగింపుగాం గురు, శని గ్రహాల అన్వేషణకు వోయేజర్ జంట నౌకలను పంపారు. వీటితో గురు గ్రహంపై పెద్ద ఎర్ర మచ్చ, శని వలయాలు, ఈ రెండు గ్రహాల కొత్త చంద్రుళ్లకు సంబంధించి ఎన్నో విశేషాలు వెలుగు చూశాయి. వోయేజర్–1 1979లో గురుగ్రహాన్ని 3.5 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తిలకించింది. దాని చంద్రుడు ‘అయో’పై క్రియాశీల అగి్నపర్వతాలను గుర్తించింది. భూమి మినహా సౌరకుటుంబంలోని తక్కిన ఖగోళ వస్తువుల్లో అగి్నపర్వత క్రియాశీలతను కనుగొనడం అదే తొలిసారి. 1990 ఫిబ్రవరి 14న సూర్యుడికి 600 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ‘లేత నీలి చుక్క’లా కనిపిస్తున్న భూమి ఫొటోను వోయేజర్–1 కెమెరా బంధించింది. ఆ సింగిల్ పిక్సెల్ ఫొటో ‘మానవాళి తనకుతాను గీసుకున్న స్వీయ చిత్తరువు’లా అనిపిస్తుంది. ఇక యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా వోయేజర్–2 పేరుగాంచింది. శిలాగ్రహాలైన బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడిని అంతర గ్రహాలంటారు. వాయుమయ గురు, శని, యురేనస్, నెప్ట్యూన్లను బాహ్య గ్రహాలుగా పిలుస్తారు. 4 బాహ్య గ్రహాలను దగ్గరగా సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా వోయేజర్–2 1989లో రికార్డు సృష్టించింది. – జమ్ముల శ్రీకాంత్ -
Voyager-1: హస్త లా విస్తా.. బేబీ!
వోయేజర్-1.. ఈ పేరే ఖగోళ శాస్త్రవేత్తలకు ఓ స్ఫూర్తి. ఈ పేరు.. ఉత్సాహంగా నింగికేసి చూసేలా కొన్ని తరాల వారిని పురిగొల్పిన ప్రేరణ శక్తి. అలుపెరుగని యాత్ర.. కోట్లాది కిలోమీటర్ల జైత్రయాత్ర.. దాదాపు అర్ధ శతాబ్ద కాలపు వైజ్ఞానిక పరిశోధనల సారం.. మానవాళి కలలుగన్న ‘సుదూర’ లక్ష్యం సాకారం.. అది గ్రహాంతర హద్దులను దాటి నక్షత్రాంతర రోదసికేగిన విశ్వవిఖ్యాత వ్యోమనౌక.. అదే వోయేజర్-1. అంతరిక్షంలో ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువు ఇదే. అమెరికా 1977 సెప్టెంబరు 5న ప్రయోగించిన ఈ వ్యోమనౌకది 46 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఈ ఏడాది జనవరి నాటికి అది భూమి నుంచి 2,440 కోట్ల కిలోమీటర్ల దూరాన ఉంది. ఇప్పుడీ వ్యోమనౌకకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి. గత ఏడాది నవంబరు నుంచి వోయేజర్-1 భూమికి సరైన సమాచారం ఇవ్వడం లేదు. భావ వ్యక్తీకరణ సామర్థ్యం కోల్పోయిన వృద్ధ పక్షవాత రోగిలా... ‘నాసా’ శాస్త్రవేత్తలకు అది ‘పిచ్చి’ సందేశాలు పంపుతోంది. వోయేజర్-1లోని ఓ కంప్యూటర్లో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. దాంతో కాలిఫోర్నియాలోని పసడెనాలో జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ కేంద్రానికి వ్యోమనౌక నుంచి అర్థరహిత సమాచారం అందుతోంది. వోయేజర్-1ను నిర్మించి, ప్రయోగించినప్పటి ‘నాసా’ సిబ్బందిలో చాలామంది కాలం చేశారు. దాంతో తాజా సమస్యను పరిష్కరించి వ్యోమనౌకను మళ్లీ గాడిన పెట్టేందుకు దాని నిర్మాణం తాలూకు పాత పత్రాలను ముందేసుకుని శాస్త్రవేత్తలు కొన్ని నెలలుగా కుస్తీలు పడుతున్నారు. ప్రస్తుత సమస్య నుంచి తమ వ్యోమనౌక బయటపడితే అద్భుతం జరిగినట్టేనని వోయేజర్ ప్రాజెక్టు మేనేజర్ సుజానే డాడ్ వ్యాఖ్యానించారు. ఆమె 2010 నుంచి ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. వోయేజర్-1 నేడు ముదిమి వయసులో ఉంది. దాని చరిత్ర ఇక ముగిసిన అధ్యాయమేనని తెలుస్తోంది. జంట వోయేజర్స్ విజయాలు.. వోయేజర్ ప్రాజెక్టులో వోయేజర్-1, వోయేజర్-2 భాగస్వాములు. వోయేజర్-2ను వోయేజర్-1 కంటే రెండు వారాల ముందు ప్రయోగించారు. నిజానికి వీటిది కేవలం నాలుగేళ్ల మిషన్. కానీ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. వోయేజర్-2 ప్రస్తుతం పనిచేస్తున్నప్పటికీ దాన్ని కూడా సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. పయనీర్-10, 11 వ్యోమనౌకల యాత్రలకు కొనసాగింపుగా… గురుడు, శని గ్రహాల అన్వేషణ కోసం వోయేజర్ జంటనౌకలను పంపారు. వీటితో గురు గ్రహం (బృహస్పతి)పై పెద్ద ఎర్ర మచ్చ, శని వలయాలు, ఈ రెండు గ్రహాల కొత్త చంద్రుళ్లకు సంబంధించి ఎన్నో విశేషాలు వెలుగుచూశాయి. వోయేజర్-1 1979లో గురుగ్రహాన్ని 3.5 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తిలకించింది. దాని చంద్రుడు ‘అయో’పై క్రియాశీల అగ్నిపర్వతాలను గుర్తించింది. భూమి మినహా సౌరకుటుంబంలోని తక్కిన ఖగోళ వస్తువుల్లో అగ్నిపర్వత క్రియాశీలతను కనుగొనడం అదే తొలిసారి. 1990 ఫిబ్రవరి 14న సూర్యుడికి 600 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ‘లేత నీలి చుక్క’లా కనిపిస్తున్న భూమి ఫొటోను వోయేజర్-1 తన కెమెరాలో బంధించింది. ఆ సింగిల్ పిక్సెల్ ఫొటో... ‘మానవాళి తనకుతాను గీసుకున్న సొంత చిత్తరువు’లా అనిపిస్తుంది. ఇక వోయేజర్-2 యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా పేరుగాంచింది. శిలాగ్రహాలైన బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడిని అంతర గ్రహాలు అంటారు. వాయుమయ గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లను బాహ్యగ్రహాలుగా పిలుస్తారు. 4 బాహ్య గ్రహాలను దగ్గరగా సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా వోయేజర్-2 1989లో రికార్డు సృష్టించింది. సౌరవ్యవస్థను దాటి మున్ముందుకు! హీలియోస్ఫియర్ అంటే సౌరవ్యవస్థ చుట్టూ సూర్యుడు నేరుగా ప్రభావం చూపే పొడవైన బుడగ లాంటి ప్రదేశం. హీలియోస్ఫియర్ అంచును హీలియోపాజ్ అంటారు. ఈ ‘హీలియోపాజ్’ను 2012లోనే వోయేజర్-1 దాటవేసి నక్షత్రాంతర రోదసిలోకి ప్రవేశించింది. అలా ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి అడుగిడిన తొలి మానవ నిర్మిత వస్తువుగా అది గణుతికెక్కింది. 2018లో వోయేజర్-2 కూడా హీలియోస్ఫియర్ బాహ్య అంచును దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్ (సూర్యుడు, ఇతర నక్షత్రాల మధ్యనున్న ప్రాంతం)లోకి ప్రవేశించింది. హీలియోపాజ్ ఆవల నుంచి నక్షత్రాంతర రోదసి మొదలవుతుంది. కాస్మిక్ కిరణాలు, నక్షత్రాంతర ప్రాంతంలోని అయస్కాంత క్షేత్రంలో అసాధారణ అలజడులు, ప్లాస్మా కణాలపై వోయేజర్-1 అధ్యయనం చేస్తోంది. వోయేజర్-1కు భూమి నుంచి ఆదేశం పంపడానికి 22.5 గంటలు, వ్యోమనౌక నుంచి శాస్త్రవేత్తలు డేటా స్వీకరించడానికి మరో 22.5 గంటలు.. ఇలా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి రమారమి రెండు రోజులు పడుతోంది. ఫ్లైట్ డేటా సిస్టమ్ లోపాలు వోయేజర్-1లో మూడు కంప్యూటర్లు ఉన్నాయి. అవి ఫ్లైట్ డేటా సిస్టమ్ (ఎఫ్‌డీఎస్), కమాండ్ అండ్ కంట్రోల్ సెంట్రల్ సిస్టమ్, ఆటిట్యూడ్ కంట్రోల్ అండ్ పాయింటింగ్ సిస్టమ్. వ్యోమనౌక సైన్స్ పరికరాల నుంచి శాస్త్ర పరిశోధనల డేటాను, నౌక ఆరోగ్యానికి సంబంధించిన ఇంజినీరింగ్ డేటాను ఎఫ్‌డీఎస్ సేకరించి సింగిల్ ప్యాకేజీగా మారుస్తుంది. అనంతరం అది టెలిమెట్రీ మాడ్యులేషన్ యూనిట్ (టీఎంయూ) ద్వారా బైనరీ కోడ్ రూపంలో భూమికి ప్రసారమవుతుంది. ప్రస్తుతం ఎఫ్‌డీఎస్ కంప్యూటరులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇంజినీరింగ్, సైన్స్ డేటాను భూమికి పంపే సామర్థ్యాన్ని వోయేజర్-1 కోల్పోయింది. వోయేజర్-1, 2లలో ప్రయోగ సమయంలో రెండేసి ఎఫ్‌డీఎస్ లు ఉన్నాయి. దురదృష్టవాశాత్తు వోయేజర్-1 బ్యాకప్ ఎఫ్‌డీఎస్ 1981లో విఫలమైంది. ‘నాసా’ శాస్త్రవేత్తలు తాజాగా ఎఫ్‌డీఎస్ ను రీ-స్టార్ట్ చేసేందుకు యత్నించారు. కానీ ఈ అన్ ‘ప్లగ్ అండ్ ప్లగ్ ఇన్’ పద్ధతి ఫలితమివ్వలేదు. 2025 నాటికి వోయేజర్ జంట నౌకల్లోని ప్లూటోనియమ్ ఆధారిత అణుశక్తి జనరేటర్లు పని చేయడం మానేస్తాయని ‘నాసా’ అంచనా. భూమ్మీది జీవం, మానవాళి భిన్న సంస్కృతులను ప్రతిబింబించే చిత్రాలు, వివిధ భాషల్లో శుభాకాంక్షలు, ఆడియో-విజువల్ సందేశాలను డిస్కుల (గోల్డెన్ రికార్డులు) రూపంలో ఈ నౌకల్లో పంపారు. (Photo Credits: The New York Times, NASA, Business Insider, Gizmodo, NPR, Popular Mechanics, WIRED, Ars Technica, Science Alert, Popular Science, Smithsonian Magazine) ✍️ జమ్ముల శ్రీకాంత్ -
జస్ట్ రూ. 150ల ప్రాజెక్టుతో నాసాకు, ఈ విద్యార్థి చాలా స్పెషల్!
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఓ బాలుడు నాసాకి ఎంపికయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జస్ట్ అతడు చేసిన రూ. 150ల ప్రాజెక్టు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా నిర్వహించే ఇంజనీరింగ్ డిజైన్ ఛాలెంజ్ టీమ్‌లో సెలక్టయ్యేలా చేసింది. ఓ సాదాసీదా ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటూ నాసాకి ఎంపికవ్వడమే కాకుండా తన అద్భుత మేధాతో అందర్నీ అబ్బురపరుస్తున్నాడు ఈ బాలుడు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీలోని చిన్నగ్రామమైన ఛాయ్సన్కు చెందిన 15 ఏళ్ల ఉత్కర్ష్ అనే బాలుడు నాసాకు వెళ్తున్నాడు. పదోవతరగతి చదువుతున్న ఈ ఉత్కర్ష్ జనవరిలో సైన్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ పోటీల్లో వివిధ పాఠశాల విద్యార్థులంతా సుమారు రూ. 25 వేల నుంచి లక్షలు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు ప్రిపేర్ చేస్తే, ఉత్కర్ష్ కేవలం రూ. 150ల ప్రాజెక్టుతో పాల్గొన్నాడు. అంతమంది విద్యార్థుల మందు నిలబడగలనా? అనుకున్న ఉత్కర్ష్ ..తన అద్భుత ప్రతిభతో తయారు చేసిన వైర్లెస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అదికూడా తక్కువ మొత్తంలో ప్రాజెక్టుని ప్రజెంట్ చేయడంతో ఉత్కర్షని అంతా ప్రశంసలతో ముంచెత్తారు. అతడిలో ఉన్న ఆ అసాధారణ మేధస్సే నాసా హ్యుమన్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్(హెచ్‌ఈఆర్‌సీ) అని పిలిచే ఇంజనీర్ డిజైన్ ఛాలెంజ్ 2024లో పాల్గొనే కైజెల్ టీమ్‌లో ఉత్కర్షని భాగమయ్యేలా చేసింది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మానవ అంతరిక్ష పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులనే భాగం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా ఇంజనీరింగ్ డిజైన్ ఛాలెంజ్‌ని నిర్వహిస్తుంది. ఆ రోవర్ ఛాలెంజ్‌లో ఉత్కర్ష్ తన బృందంతో కలసి పాల్గొననున్నాడు. ఈ ఛాలెంజ్ వచ్చే నెల ఏప్రిల్ 18 నుంచి 20, 2024 వరకు జరుగుతుంది. ఇక ఉత్కర్ష నేపథ్యం వచ్చేటప్పటికీ..ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. వారి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. ఉత్కర్ష్ తన తాత సురేంద్ర సింగ్ చేసే వ్యవసాయ పనుల్లో సాయం చేస్తుంటాడు కూడా. చిన్నతనంలోనే ఉత్కర్ష్ బ్రెయిన్ హేమరేజ్కి గురయ్యి దాదాపు మూడు నెలలు వెంటిలేటర్ ఉన్నట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. "మృత్యముఖం నుంచి కాపడుకున్నా మా బిడ్డ ఈ రోజు ప్రతిష్టాత్మకమైన నాసా వంటి అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఎంపిక కావడం అన్నది మాకెంతో గర్వంగా ఉంది". అని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక ఉత్కర్ష్ తోపాటు పదోవతరగతి చదువుతున్న టౌరుకు చెందిన లోకేష్ కుమార్, గుహ, గురుగ్రామ్‌కి చెందిన పల్లవి, ఫరీదాబాద్‌కి చెందిన అరుణ్ కుమార్, పానిపట్ నుంచి రోహిత్ పాల్, నోయిడా నుంచి ఓమ్ తదితర విధ్యార్థులు ఎంపికయ్యారు. ఎంత్రీఎం ఫౌండేష్ ఈ వైఎంఆర్డీ టీమ కైజెల్కి మద్దతు ఇస్తుంది. నాసా నిర్వహించే ఈ ఇంజనీరింగ్ ఛాలెంజ్‌లో భారత్ తరుఫు నుంచి ఎనిమిది టీమ్‌లను ఎంపిక చేయగా, వాటిలో ఎన్జీవో మద్దతు గల జట్టే ఈ కైజెల్ టీమే. (చదవండి: స్నానమే ఆమెకు శాపం! చేసిందా..నరకమే..!) -
NASA: సౌర రేడియేషన్‌తో పెనుముప్పు
అంతరిక్షం నుంచి వెలువడే ప్రమాదకర సౌర రేడియేషన్‌ను భూమి అధికంగా శోషించుకుంటోందని దాంతో వాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నాసా తాజా డేటాను విశ్లేషించి సౌర రేడియేషన్ గురించి వారు కీలక విషయాలు వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి 2023 డిసెంబర్ దాకా డేటాను వారు పరిగణనలోకి తీసుకున్నారు. రేడియేషన్‌ను భూమి శోషించుకోవడం అనేది సంవత్సరమంతా ఒకేతీరుగా లేదని, కొన్నిసార్లు ఎక్కువ స్థాయి, మరికొన్నిసార్లు తక్కువ స్థాయిలో నమోదైనట్లు గుర్తించారు. 2023లో ఫిబ్రవరి, మార్చి, డిసెంబర్లో అధికంగా సోలార్ రేడియేషన్‌ను భూమి గ్రహించిందని వెల్లడించారు. గత ఏడాది జనవరిలో స్వల్పంగా పెరిగిన రేడియేషన్ ఫిబ్రవరిలో చదరపు మీటర్‌కు 3.9 వాట్లు, మార్చిలో చదరపు మీటర్‌కు 6.2 వాట్లుగా నమోదైందని తెలియజేశారు. 2000 సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే 2023లో సౌర రేడియేషన్‌ను భూమి శోషించుకోవడం ఎన్నో రెట్లు పెరిగినట్లు తేల్చారు. ఇది ఇంకా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భూగోళంపై శక్తి సమతుల్యతలో మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదంతా భూవాతావరణంలో ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, మంచు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగుదల వంటి పరిణామాలకు దారి తీస్తున్నట్లు స్పష్టం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒడిస్సియస్ ఒరిగింది
వాషింగ్టన్: చంద్రునిపై కుదురుగా దిగని లాండర్ల జాబితాలోకి ఒడిస్సియస్ కూడా చేరింది. అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ఇంట్యూటివ్ మెషీన్స్ ప్రయోగించిన ఈ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగుతూనే ఓ పక్కకు పడిపోయింది. చంద్రుడి నేలకు సమాంతరంగా వాలిపోయింది. దాంతో ల్యాండర్ సమాచార వ్యవస్థల నుంచి సంకేతం అందుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ల్యాండర్ పక్కకు పడిందని ఇంట్యూటివ్ మెషీన్స్ (ఏఎం) సీఈవో స్టీవ్ ఆల్టెమస్ ధ్రువీకరించారు. అది నిర్దేశిత ప్రదేశంలోనో, ఆ దగ్గర్లోనో దిగి ఉంటుందన్నారు. ఒడిస్సియస్ నుంచి డేటా స్వీకరిస్తున్నట్టు ఏఎం, నాసా వెల్లడించాయి. అది మోసుకెళ్లిన పరికరాల్లో చాలా పేలోడ్స్ పని చేసే స్థితిలోనే ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పాయి. జపాన్ అంతరిక్ష సంస్థ ‘జాక్సా’ తాజాగా పంపిన ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై తలకిందులుగా దిగడం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువ సమీపంలో ల్యాండర్ కాలుమోపిన ‘మాలాపెర్ట్ ఎ’ బిలం వాస్తవానికి ల్యాండింగ్‌కు ప్రమాదభరితమైన ప్రదేశం. కానీ చంద్రుడిపై శాశ్వత స్థావరం నెలకొల్పడానికి దోహదపడే గడ్డకట్టిన నీరు అక్కడ పుష్కలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ చోటునే ఎన్నుకున్నారు. లాండింగ్‌కు 30 సెకండ్ల ముందు ఒడిస్సియస్‌లోని ‘ఈగిల్ కామ్’ ల్యాండర్ నుంచి దూరంగా వెళ్లి ల్యాండింగ్ ఘట్టాన్ని చిత్రీకరించాల్సి ఉంది. కానీ నేవిగేషన్ అవసరాల దృష్ట్యా ల్యాండింగ్ సమయంలో కామ్‌ను స్విచాఫ్ చేశారు. ‘‘ఒడిస్సియస్ పొజిషనింగ్‌కు సంబంధించిన ఫొటో చాలా ముఖ్యం. అందుకోసం ఈగిల్ కామ్‌ను విడుదల చేసేందుకు ప్రయతి్నస్తున్నాం. అది సుమారు 8 మీటర్ల దూరం నుంచి ఒడిస్సియస్‌ను ఫొటో తీస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఏఎం తెలిపింది. అయితే లాండింగ్‌కు కాస్త ముందు చంద్రునిపై షోంబర్గర్ క్రేటర్ ప్రాంతాన్ని దాదాపు 10 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఒడిస్సియస్ ఫొటో తీసి పంపింది. సౌరఫలకాలు లాండర్ పై భాగంలో, యాంటెన్నా కింది భాగంలో ఉండిపోవటంతో దాన్నుంచి డేటా సేకరణ కూడా కష్టసాధ్యమవుతోంది. చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న నాసా ఉపగ్రహం లూనార్ రీకానసన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్వో) త్వరలో ఒడిస్సియస్ ఆనుపానులు కనిపెట్టనుంది. ల్యాండర్ కచి్చతంగా ఏ ప్రాంతంలో ఉందో గుర్తించి ఫొటోలు తీయనుంది. -
పక్కకు ఒరిగిన ‘ఒడిస్సియస్’.. ఆసక్తికర విషయం వెల్లడించిన ‘నాసా’
కాలిఫోర్నియా: జాబిల్లిపై 50 ఏళ్ల తర్వాత అడుగుపెట్టిన అమెరికా ల్యాండర్ ఒడిస్సియస్కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వెల్లడించింది. ల్యాండ్ అయ్యే సమయంలో ఒడిస్సియస్ చంద్రుని ఉపరితలాన్ని నిర్దేశించని రీతిలో తాకింది. దీంతో ల్యాండర్ కాస్త పక్కకు ఒరిగినట్లు నాసా తెలిపింది. చంద్రుని దక్షిణ ధృవంలోని క్రేటర్(గోయి) మలాపెర్ట్ సమీపంలో ఒడిస్సియస్ గురువారం ఉదయం ల్యాండ్ అయింది. ఇంట్యూటివ్ మెషీన్స్(ఐఎమ్) అనే ప్రైవేట్ స్పేస్ కంపెనీ, నాసా సంయుక్తంగా ఒడిస్సియస్‌ను ఎలాన్‌మస్క్ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్లో చంద్రునిపైకి పంపాయి. ల్యాండ్ అయిన తర్వాత భూమికి సిగ్నల్స్ పంపేందుకు ఒడిస్సియస్ కొంత సమయం తీసుకుంది. అయితే ల్యాండింగ్ సమయంలో తలెత్తిన ఇబ్బందితో కాస్త పక్కకు ఒరిగినప్పటికీ ఒడిస్సియస్‌లోని అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నట్లు ఇంట్యూటివ్ మెషిన్స్ సీఈవో స్టీవ్ ఆల్టిమస్ తెలిపారు. ఒడిస్సియస్ ల్యాండ్ అయిన చోట నీరు గడ్డకట్టి మంచు రూపంలో ఉండటంతో భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఒక లూనార్ బేస్‌గా పనికొస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో చాలా గోతులుండటం వారిని కొంత కంగారు పెడుతోంది. ఒడిస్సియస్ భూమి నీడలోకి వెళ్లేముందు వారం రోజుల పాటు పరిశోధనలు సాగించి డేటా పంపనుంది. ఇదీ చదవండి.. ఎక్స్ మెయిల్ వచ్చేస్తోంది -
SOFIA telescope: గ్రహశకలాలపై నీటి జాడలు
గ్రహశకలాలు పూర్తిగా పొడి శిలలతో కూడుకుని ఉంటాయని ఇప్పటిదాకా సైంటిస్టులు భావించేవారు. కానీ అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా వాటిపై నీటి అణువుల జాడలను గుర్తించారు! సోఫియా (స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రా రెడ్ ఆ్రస్టానమీ ఎయిర్‌బోర్న్ టెలిస్కోప్) టెలిస్కోప్ అందించిన డేటాను అధ్యయనం చేసిన మీదట వారు ఈ మేరకు ధ్రువీకరణకు వచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో సోమవారం ప్రచురితమయ్యాయి. ఇలా చేశారు... గ్రహశకలాలపై నీటిజాడను కనిపెట్టేందుకు సైంటిస్టులు పెద్ద ప్రయాసే పడాల్సి వచి్చంది... ► ముందుగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలను దాదాపుగా పూర్తిగా అడ్డుకునే భూ వాతావరణానికి ఎగువన ఉండే స్ట్రాటోస్పియర్ను తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ► అవసరమైన మార్పుచేర్పులు చేసిన బోయింట్ 747ఎస్పీ విమానంలో స్ట్రాటోస్పియర్ గుండా సోఫియా టెలిస్కోప్‌ను సుదీర్ఘకాలం ప్రాటు పయణింపజేశారు. ► ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. ఐరిస్, మస్సాలియా అనే గ్రహశకలాలపై నీటి అణువుల జాడను సోఫియా తాలూకు ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా (ఫోర్కాస్ట్) స్పష్టంగా పట్టిచ్చింది! ► సోఫియా కెమెరా కంటికి చిక్కిన నీటి పరిమాణం కనీసం 350 మిల్లీలీటర్ల దాకా ఉంటుందని అధ్యయన బృందం నిర్ధారించింది. ► ఈ గ్రహశకలాలు సూర్యుడి నుంచి ఏకంగా 22.3 కోట్ల మైళ్ల దూరంలో గురు, బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్టిరాయిడ్ బెల్ట్‌లో ఉన్నాయి. ► ఈ ఉత్సాహంతో సోఫియా కంటే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మరో 30 గ్రహశకలాలపై నీటి జాడలను మరింత స్పష్టంగా కనిపెట్టే పనిలో నాసా సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. జాబిలిపై నీటి జాడలే స్ఫూర్తి... గతంలో చంద్రునిపై నీటి జాడలను కనిపెట్టింది కూడా సోఫియానే! ఆ స్ఫూర్తితోనే అదే టెలిస్కోప్ సాయంతో గ్రహశకలాలపైనా నీటి జాడల అన్వేషణకు పూనుకున్నారు. నిజానికి ఈ అధ్యయనానికి సహ సారథ్యం వహించిన నాసా సైంటిస్టు డాక్టర్ మాగీ మెక్ ఆడమ్ ఈ గ్రహశకలాలపై గతంలోనే ఆర్ర్దీకరణ(హైడ్రేషన్) జాడలను కనిపెట్టారు. కానీ దానికి కారణం నీరేనా, లేక హైడ్రోక్సిల్ వంటి ఇతర అణువులా అన్నదానిపై మాత్రం స్పష్టతకు రాలేకపోయారు. ఆ అనుమానాలకు తాజా అధ్యయనం తెర దించిందని దానికి సారథిగా వ్యవహరించిన రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ అనీసియా అరెడొండో తెలిపారు. ‘‘నిజానికి డాక్టర్ మెక్ ఆడమ్ తన పరిశోధనకు ఎంచుకున్న ఈ రెండు గ్రహశకలాలు పూర్తిగా సిలికేట్మయం. కనుక అవి పూర్తిగా పొడిబారినవే అయ్యుంటాయని తొలుత అనుకున్నాం. కానీ వాటిపై కనిపించింది నీరేనని మా పరిశోధనల్లో స్పష్టంగా తేలింది’’ అని వివరించారు. 2020లో చంద్రుని దక్షిణార్ధ గోళంలో నీటి జాడలను సోఫియా నిర్ధారించింది. ఏమిటీ గ్రహశకలాలు... ఒక్కమాటలో చెప్పాలంటే మన సౌర వ్యవస్థ రూపొందే క్రమంలో మిగిలిపోయిన అవశేషాలు. ఒకరకంగా సూర్యుడు, తన నుంచి నిర్ధారిత దూరాల్లో గ్రహాలు ఒక్కొక్కటిగా రూపొందే క్రమంలో మిగిలి విడిపోయిన వ్యర్థాల బాపతువన్నమాట. సౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో సూర్యుడికి కాస్త దూరంలో ఉన్న భూమి వంటి గ్రహాలు రాళ్లు తదితరాలకు ఆలవాలంగా మారితే సుదూరంలో ఉన్న యురేనస్, నెప్ట్యూన్ వంటివి నింపాదిగా చల్లబడి మంచు, వాయుమయ గ్రహాలుగా రూపుదిద్దుకుంటూ వచ్చాయట. గ్రహశకలాలు కోట్లాది ఏళ్ల క్రితం భూమిని విపరీతమైన వేగంతో ఢీకొన్న ఫలితంగానే మన గ్రహంపై నీరు ఇతర కీలక మూలకాలు పుట్టుకొచ్చాయని సైంటిస్టులు చాలాకాలం క్రితమే సిద్ధాంతీకరించారు. గ్రహశకలాలపై నీటి అణువుల ఉనికి దానికి బలం చేకూర్చేదేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రహశకలాల పరమాణు కూర్పును మరింత లోతుగా పరిశోధిస్తే అంతరిక్షంలో వీటి జన్మస్థానంపై ఇంకాస్త కచి్చతమైన నిర్ధారణకు రావచ్చన్నది సైంటిస్టుల భావన. అది అంతరిక్షంలో ఇతర చోట్ల నీరు తదితర కీలక మూలకాలతో పాటు జీవం ఉనికి కోసం చిరకాలంగా చేస్తున్న పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడగలదని వారంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
NASA: మెరుస్తున్న భూమి.. అందమైన చిత్రాలు తీసిన ఐఎమ్ వన్
కాలిఫోర్నియా: చంద్రునిపైకి నాసా పంపిన ఇంట్యూటివ్ మెషిన్(ఐఎమ్ వన్) నింగి నుంచి భూగోళం అద్భుతమైన చిత్రాలను తీసింది. ఈ చిత్రాల్లో భూమి వజ్రంలా మెరిసిపోతుండటం విశేషం. స్పేస్ ఎక్స్ రాకెట్ నుంచి వేరుపడి రెండో దశ ప్రయాణం ప్రారంభించన వెంటనే ఐఎమ్ వన్ భూమి అందమైన చిత్రాలను కెమెరాలో బంధించింది. ఈ నెల తొమ్మిదో తేదీన కేప్కెనరావల్లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్లో ఐఎమ్ వన్ నోవా సి ల్యాండర్‌ను నింగిలోకి పంపారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 22న నోవా సీ ల్యాండర్ చంద్రునిపై అడుగు పెడుతుంది. నాసా, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ వాణిజ్య పరంగా కస్టమర్ల కోసం చేపట్టిన కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రోగ్రామ్(సీఎల్పీఎస్) కింద నోవా సి ల్యాండర్ చంద్రునిపై ప్రయోగాలు చేయనుంది. ఈ దశాబ్దం చివర్లో చంద్రునిపైకి వ్యోమగాములను(నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్) పంపేందుకుగాను అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా ఐఎమ్ వన్ వ్యోమనౌకలో నాసా ఆరు పేలోడ్లను అమర్చింది. ఇది చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయితే 1972 తర్వాత అమెరికా వ్యోమగాములతో సహా చంద్రునిపైకి పంపిన అపోలో మిషన్ తర్వాత రెండో మిషన్‌గా చరిత్రకెక్కనుంది. ఇదీ చదవండి.. పిల్లల ప్రపంచం తగ్గిపోతోంది -
Nasa: చంద్రుని అరుదైన ఫొటో ! నాసా ఏం చెప్పిందంటే..
కాలిఫోర్నియా: చంద్రుడంటే భూమి మీదున్న ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. ఇటీవల భారత్ చంద్రయాన్ మిషన్ సక్సెస్ అయినప్పటి నుంచి చంద్రుని గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ మరింత పెరిగింది. దీంతో చంద్రునికి సంబంధించి ప్రపంచంలో ఏ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ ఎలాంటి ప్రకటన చేసినా ఇటీవలి కాలంలో అది సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలోనే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తాజాగా ఈ నెల 4న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అమావాస్యకు దగ్గరగా ఉన్న అర్ధ చంద్రుని(వేనింగ్ క్రిసెంట్ మూన్) అరుదైన ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. అమావాస్యకు దగ్గరగా ఉన్నపుడు చంద్రుడు భూమి మీద నుంచి చూసేవాళ్లకు కొద్ది కొద్దిగా అదృశ్యమవుతూ కనిపిస్తాడు. ఈ సమయంలో భూమి మీద ఉన్నవాళ్లకు కనిపించని పక్క చంద్రునిపై సూర్య కాంతి పడిన చిత్రాన్ని నాసా ఒడిసిపట్టింది. ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదీచదవండి.. భారత్, అమెరికా సంబంధాలు.. చపాతీ, పూరీలతో పోలిక -
గోబర్గ్యాస్తో అంతరిక్షంలోకి.. ‘జీరో’తో సాధ్యం
గోబర్ గ్యాస్ తెలుసుకదా.. అదేనండి వంట వండటానికి ఉపయోగిస్తుంటాం. దాంతో వంట చేసుకోవటం పాత విషయమే కానీ తాజాగా గోబర్గ్యాస్తో రాకెట్లనూ నడపొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. జపాన్‌కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ ఏకంగా గోబర్గ్యాస్తో పనిచేసే రాకెట్ ఇంజిన్‌ను రూపొందించింది. రాకెట్ ఇంజిన్లలో రకరకాల ఇంధనాలు వాడుతుంటారు. చాలావరకు బాగా శుద్ధి చేసిన కిరోసిన్‌ను ఉపయోగిస్తారు. దీనికి భిన్నంగా జపాన్‌కు చెందిన ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ అనే అంకుర సంస్థ పర్యావరణహిత రాకెట్ ఇంజిన్‌ను రూపొందించింది. దీని పేరు ‘జీరో’. ఇది ఆవు పేడ నుంచి తీసిన బయోమీథేన్ వాయువు సాయంతో పనిచేస్తుంది. ఈమధ్యనే దీన్ని విజయవంతంగా పరీక్షించారు. చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడమే ‘జీరో’ ఇంజిన్ ఉద్దేశం. వాతావరణంలోకి అదనంగా కార్బన్ డయాక్సైడ్ను వెదజల్లకుండా దీన్ని తయారుచేశారు. నిజానికి బయోమీథేన్ పూర్తిగా ఉద్గార రహితమేమీ కాదు. ఇది మండినప్పుడూ బొగ్గుపులుసు వాయువు విడుదలవుతుంది. కానీ సాధారణ శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇందులో వెలువడే కార్బన్ డయాక్సైడ్ మోతాదును చాలా పరిమితం. సహజంగా ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడ్కు ఇది అదనపు వాయువునేమీ జోడించదు. ఇదీ చదవండి: భారత్‌లో ఐకియా విస్తరణ.. కొత్త స్టోర్ నిర్మాణం.. ఎక్కడంటే.. పెరుగుతున్న సాంకేతిక, వివిధ రిమోట్ సెన్సింగ్ వస్తువుల వాడకం, ఇతర కారణాల వల్ల రాకెట్ ప్రయోగాలు ఊపందుకుంటున్నాయి. పర్యావరణం మీద వీలైనంత తక్కువ దుష్ప్రభావం పడేలా చూడటానికి ప్రాధాన్యం పెరుగుతోంది. మున్ముందు అంతరిక్ష పర్యటనలు కొనసాగాలంటే ఇది మరింత అవసరం. ఈ నేపథ్యంలో వినూత్న జీరో రాకెట్ ఆసక్తి కలిగిస్తోంది. నిశ్చల ప్రయోగ పరీక్షలో మంచి సామర్థ్యాన్ని కనబరచింది. ఇది 10 సెకండ్ల పాటు నీలి మంటను వెలువరించింది. -
అల్లదివో.. ‘మూన్ స్నైపర్’ ఫోటోలు తీసిన ‘నాసా’ ఉపగ్రహం
జపాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగకముందు, దిగిన తర్వాత ‘క్లిక్’మనిపించిన ‘నాసా’ ఉపగ్రహం. ‘నాసా’ ఉపగ్రహం ‘లూనార్ రీకానసన్స్ ఆర్బిటర్’ (LRO) ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తూ పరిశోధనలు చేస్తోంది. ఈ నెల 19న జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ జాబిలిపై దిగింది. అనంతరం ఐదు రోజులకు అంటే ఈ నెల 24న ‘నాసా’ ఆర్బిటర్... ‘మూన్ స్నైపర్’ దిగిన ప్రాంతం మీదుగా ప్రయాణించింది. ఆ సందర్భంగా జాబిలి ఉపరితలానికి 80 కిలోమీటర్ల ఎత్తు నుంచి జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ ఛాయాచిత్రాలను LRO తన కెమెరాలో బంధించింది. ‘నాసా’ శుక్రవారం వాటిని విడుదల చేసింది. ఓ చిన్న చుక్కగా ల్యాండర్ ఈ ఫొటోల్లో దర్శనమిస్తోంది. చంద్రుడిపై 13.3160 డిగ్రీల దక్షిణ అక్షాంశ, 25.2510 తూర్పు రేఖాంశ ప్రదేశంలో, మైనస్ 912 మీటర్ల (మైనస్ 2,992 అడుగుల) ఎలివేషన్‌లో ‘మూన్ స్నైపర్’ దిగింది. ఈ మైనస్ ఎలివేషన్ అనేది జాబిలిపై నిమ్న ప్రదేశాన్ని సూచిస్తుంది. ఎందుకంటే.. చంద్రుడి ఉపరితలం కంటే దిగువన షియోలీ బిలం (భారీ గుంత) వాలులో ‘మూన్ స్నైపర్’ దిగింది. -
Nasa: మార్స్‌పై హెలికాప్టర్ క్రాష్
కాలిఫోర్నియా: అంగారకుని(మార్స్)పై అమెరికా అంతరిక్ష పరిశోపధన సంస్థ నాసాకు చెందిన మినీ హెలికాప్టర్ మూడేళ్ల ప్రస్థానం ముగిసింది. అంగారకునిపై ఈ నెల 18న చివరిసారిగా ఎగిరి ల్యాండ్ అయ్యే సమయంలో రోటర్ చెడిపోయి మినీ హెలికాప్టర్ క్రాష్ అయినట్లు నాసా ప్రకటించింది. మార్స్‌పై ఇన్‌జెన్యూటీ మినీ హెలికాప్టర్ ప్రయాణం ముగిసిందని నాసా అధికారులు తెలిపారు. హెలికాప్టర్ క్రాష్‌కు గల కారణాలను అణ్వేషిస్తున్నట్లు చెప్పారు. 2021 ఏప్రిల్‌లో మార్స్‌పై ల్యాండ్ అయినప్పుడు తొలుత హెలికాప్టర్ 30 రోజులు పనిచేస్తుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా అది 3 సంవత్సరాల పాటు పనిచేసి మార్స్‌పై 14 సార్లు ఎగరగలిగింది. సౌరవ్యవస్థలో సరికొత్త ఏవియేషన్ ప్రయోగాలకు ఇన్‌జెన్యూటీ నాంది పలికింది. మార్స్‌పై ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను ప్రిజర్వెన్స్ రోవర్ ఆపరేట్ చేసింది. ఇదీచదవండి.. మూన్ ష్నైపర్ శీర్షాసనం -
భళా.. కైవల్య!
నిడదవోలు: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన కుంచాల కైవల్యరెడ్డి (15) వ్యోమగామి కావాలన్న కలను నెరవేర్చుకునే దిశగా ఓ అడుగు ముందుకేసింది. నాసా అందిస్తున్న ఐఏఎస్పీ (ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్) కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెరికాలోని ఎయిర్‌స్పేస్ అండ్ రాకెట్ సెంటర్, నాసా సంయుక్త ఆధ్వర్యంలో ఏటా నవంబర్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం (ఐఏఎస్పీ) శిక్షణ అందిస్తోంది. విద్యార్థులకు 10 రోజుల పాటు వ్యోమగావిుకి సంబంధించిన పలు ఆంశాలపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 మందికే ఈ అవకాశం లభిస్తోంది. 2023లో భారత్ నుంచి ఎంపికైన వారిలో కైవల్యరెడ్డి ఒకరు. ఆమె ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అతి చిన్న వయసులో ఐఏఎస్‌పీకి ఎంపికై శిక్షణ పూర్తి చేస్తున్న భారతీయురాలిగా రికార్డు సైతం నమోదు చేసింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు ముందస్తుగా ఇచ్చే శిక్షణను నాసా ద్వారా అందించారు. ఇందులో భాగంగా సొంతంగా విమానం నడపడం, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, జీరో గ్రావిటీ, స్కూబా డైవింగ్ తదితర ఆంశాలల్లో కైవల్య శిక్షణ తీసుకుంది. కైవల్య సాధించిన విజయాలివీ ► ఆస్టరాయిడ్‌ను గుర్తించి.. స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ (న్యూఢిల్లీ) అంబాసిడర్ బృంద సభ్యురాలిగా చిన్నతనంలోనే కైవల్యరెడ్డి ఎంపికైంది. ► అంతరిక్ష పరిశోధన రంగంలో ఏపీ తరఫున చిన్నప్రాయంలోనే గుర్తింపు తెచ్చుకున్న కైవల్యరెడ్డిని 2023లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ప్రభుత్వం తరఫున రూ.లక్ష నగదు బహుమతి అందించారు. ► కైవల్య ఇటీవల అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు సొంతం చేసుకుంది. ► జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ అస్ట్రానమి, ఆస్ట్రో ఫిజిక్స్ అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించిన ఆన్లైన్ ప్రతిభా పోటీలలో కైవల్యరెడ్డి మూడు రౌండ్లలో ప్రతిభ కనబరిచి సిల్వర్ ఆనర్‌ను సాధించింది. వ్యోమగామి కావాలన్నదే లక్ష్యం వ్యోమగామి కావడమే లక్ష్యంగా నాసా ఐఏఎస్పీ కోర్సును విజయవంతంగా పూర్తి చేశాను. నా లక్ష్యానికి ఇది తొలి మెట్టు. ఈ స్ఫూర్తితో భవిష్యత్‌లో ఖగోళ శాస్త్రవేత్తగా ఎదగాలన్నదే నా లక్ష్యం. ప్రభుత్వం నుంచి రూ.6.70 లక్షలు మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. – కుంచాల కైవల్యరెడ్డి -
చంద్రయాన్-3.. స్లీప్‌మోడ్‌లోనూ సిగ్నల్.. ఇస్రో కీలక అప్డేట్
చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కీలక అప్డేట్ అందించింది. చంద్రునిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుందని సంగతి తెలిసిందే. ఈ కారణంగా రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాకపోవడంతో సెప్టెంబర్ 2 రోవర్, సెప్టెంబర్ 4న ల్యాండర్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచారు. అయితే చంద్రయాన్-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందుకు సంబందించిన వివరాలను బెంగళూరులో వారు ధ్రువీకరించారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్-3 ల్యాండర్లో వివిధ దేశాలకు చెందిన కొన్ని పరికరాలను అమర్చారు. అయితే అందులో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ)లోని లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ అరే (ఎల్ఆర్ఏ) చంద్రుడి దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవలను పునరుద్ధరించిందని తెలిపారు. డిసెంబరు 12 నుంచి ఎల్ఆర్ఏ నుంచి సంకేతాలు అందినట్లు ఇస్రో పేర్కొంది. చంద్రయాన్-3లో పలు సంస్థలకు చెందిన ఎల్ఆర్ఏలను అమర్చినా నాసాకు చెందిన ఎల్ఆర్ఏ నిత్యం పనిచేస్తోందని ఇస్రో చెప్పింది. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్ఆర్ఏ పర్యవేక్షణ ప్రారంభిస్తుంది. చంద్రయాన్-3లోని 8 ఫలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణాన్ని తట్టుకునేలా ఏర్పాటు చేశారు. దాదాపు 20 గ్రాముల బరువుండే ఈ పరికరం పదేళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై మనుగడ సాగించే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: రాబోతోంది మరతరం.. కాఫీ చేస్తున్న హ్యుమనాయిడ్ రోబోలు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23న విజయంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని భారత్ ‘శివ శక్తి పాయింట్’గా నామకరణం చేసింది. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించింది. 14 రోజులపాటు అక్కడి వాతావరణ, నీటి పరిస్థితి, ఖనిజాల గురించి అధ్యయనం చేసి కీలక సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. ఇస్రో మొదట రోవర్ 300-350 మీటర్ల దూరం ప్రయాణించేలా ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల రోవర్ ఇప్పటి వరకు 105 మీటర్లు మాత్రమే కదిలింది. అయినప్పటికీ, మిషన్ దాని లక్ష్యాలను అధిగమించింది. -
America: ‘ఆస్ట్రోబోటిక్స్’ మూన్ మిషన్ ఫెయిల్.. కారణమిదే
పిట్స్బర్గ్: అమెరికాకు చెందిన ఆస్ట్రోబోటిక్స్ కంపెనీ పంపిన పెరిగ్రైన్ వ్యోమనౌక చంద్రునిపై సాధారణ ల్యాండింగ్(సాఫ్ట్ ల్యాండ్) అయ్యే అవకాశాలు దాదాపు లేనట్లేనని తేలిపోయింది. ఈ విషయాన్ని ఆస్ట్రోబోటిక్స్ కంపెనీ మంగళవారం ప్రకటించింది. నింగిలోకి ఎగిరిన కొద్ది గంటలకే వ్యోమనౌకకు చెందిన ప్రొపెల్లెంట్లోని ఇంధనం లీక్ అవడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ఫ్లోరిడాలోని కేప్ కెనరావల్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం పెరిగ్రైన్ను నింగిలోకి పంపారు. నింగిలోకి పంపినపుడు తొలుత వ్యోమనౌక ప్రయాణం బాగానే జరిగినప్పటికీ తర్వాత దాని సోలార్ ప్యానెళ్లు సూర్యునికి సరైన కోణంలోకి రాకపోవడం వల్ల బ్యాటరీల్లోని ఇంధనం ఒక్కసారిగా ఖాళీ అయింది.దీంతో అది నియంత్రణను కోల్పోయింది.అయితే అందులో మరో 40 గంటల ఇంధనం మిగిలి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అన్నీ సజావుగా జరిగితే ఫిబ్రవరిలో పెరిగ్రైన్ చంద్రునిపై ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ప్రఖ్యాత ఏవియేషన్ కంపెనీలు బోయింగ్, లాక్హిడ్ మార్టిన్లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వల్కన్ రాకెట్ ద్వారా పెరిగ్రైన్ ల్యాండర్‌ను చంద్రునిపైకి పంపారు. మరోవైపు చంద్రునిపైకి నాసా తలబెట్టిన ఆర్టెమిస్ మిషన్ కూడా వాయిదా పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మిషన్‌కు అవసరమైన కొన్ని పరికరాల సరఫరా ఆలస్యమవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఇదీచదవండి.. మాల్దీవుల వివాదం..భారత్‌పై చైనా మీడియా సంచలన కథనాలు -
అర్ధ శతాబ్ది తర్వాత చంద్రుడిపై అమెరికా కన్ను
కేప్ కనావరెల్(యూఎస్): యాభై సంవత్సరాల తర్వాత అమెరికా చంద్రుడిపై పరిశోధనలకు నడుం బిగించింది. ఆర్టెమిస్ మిషన్ సన్నాహకాల్లో భాగంగా నాసా.. ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ వారు తయారుచేసిన పెరీగ్రీన్ ల్యాండర్‌ను యూనైటెడ్ లాంఛ్ అలయన్స్ వల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. సోమవారం ఫ్లోరిడాలోని కేప్ కనావరెల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. పలుమార్లు కక్ష్యలను మార్చుకుంటూ ఫిబ్రవరి 23వ తేదీన అది చంద్రుడిపై దిగనుంది. దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో ఈ ల్యాండర్‌ను తయారుచేశారు. ల్యాండర్ తయారీలో ఆస్ట్రోబోటిక్కు అవకాశం ఇవ్వడం ద్వారా నాసా.. అంతరిక్ష ‘డెలివరీ’ సేవల రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహా్వనించినట్లయింది. చంద్రుడిపై దిగాక పెరీగ్రీన్ పలు పరిశోధనలు చేయనుంది. ఈ పరిశోధనలు ఈ ఏడాది చివర్లో నాసా నలుగురు వ్యోమగాములతో చేపట్టే ప్రయోగానికి సాయపడనున్నాయి. ఆస్ట్రోబోటిక్తోపాటు నోవా–సీ ల్యాండర్‌ను తయారుచేసేందుకు హ్యూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్తోనూ నాసా ఒప్పందం కుదుర్చుకుంది. నోవా–సీను ల్యాండర్‌ను వచ్చే నెలలో స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా చంద్రుడి మీదకు పంపనున్నారు. నేరుగా ప్రయాణం కారణంగా పెరిగ్రీన్ కంటే ముందుగా వారం రోజుల్లోనే ఇది చంద్రుడిపై దిగనుంది. 1960, 70 దశకాల్లో చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్లతో అమెరికా, సోవియట్ యూనియన్లు పోటాపోటీగా ప్రయోగాలు చేపట్టడం తెల్సిందే. చంద్రుడిపై శోధనాపర్వంలో 2013లో చైనా, 2023లో భారత్ చేరాయి. గతేడాది రష్యా, జపాన్ ల్యాండర్లు విఫలమయ్యాయి. -
2024.. దునియాలో కొత్తగా జరగనుంది?
కొత్త సంవత్సరం వచ్చేసింది... 2024లో మనలో చాలా మంది కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంటారు. 2024 సంవత్సరంలో మనమంతా పలు ఆవిష్కరణలను చూడబోతున్నాం. కొత్త సంవత్సరంలో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియోని మనం చూడబోతున్నాం. అదే సమయంలో పోషకాహార లోపాన్ని తొలగించగల దివ్య ఔషధం మన ముందుకు రాబోతోంది. చర్చిలో మహిళా మతాధికారులు కాథలిక్కులు మహిళలను మతాధికారులుగా నియమించేందుకు అంతగా ఇష్టపడరు. అయితే 2024లో ‘కానన్ లా’లో మార్పు రానుంది. కాథలిక్ చర్చిలు ఈ చట్టం ప్రకారం నడుచుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో కాథలిక్ నియమాలలో పలు సంస్కరణలు చోటుచేసుకోనున్నాయి. పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధం బిల్ గేట్స్ ఫౌండేషన్ పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధాన్ని తీసుకురానుంది. పోషకాహార లోపాన్ని నివారించే ఔషధంపై స్టేజ్-3 ట్రయల్ జరుగుతోంది. 2024లో ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి పొందింది. ఈ ఔషధం వల్ల భారతదేశానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. చంద్రునిపైకి నలుగురు మానవులు 2024లో ‘నాసా’ నలుగురు వ్యోమగాములను చంద్రునిపైకి పంపనుంది. 1972లో అపోలో-17 మిషన్‌లో ‘నాసా’ ఇద్దరు వ్యోమగాములను చంద్రునిపైకి పంపింది. 52 ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రునిపైకి మనుషులను పంపుతోంది. అందుబాటులోకి సూపర్ కంప్యూటర్ యూరప్ తన మొదటి ఎక్సా-స్కేల్ సూపర్ కంప్యూటర్ 2024లో అందుబాటులోకి రానుంది. జర్మనీలోని జూలిచ్‌లోని నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ సూపర్‌కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సూపర్ కంప్యూటర్ మెరుపువేగంతో పనిచేయనుంది. అతిపెద్ద వ్యోమనౌక అతిపెద్ద అంతరిక్ష నౌక క్లిప్పర్ మిషన్ నిర్మితం కానుంది. ఈ వ్యోమనౌక బరువు ఇంధనం లేనపుడు 3241 కిలోలు ఉంటుంది. ఈ వ్యోమనౌక పొడవు బాస్కెట్‌బాల్ కోర్ట్ అంటే 30 మీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. జూపిటర్ మిషన్ కోసం సిద్ధం చేసిన ఈ అంతరిక్ష నౌకలో 24 ఇంజన్లు ఉంటాయి. మూడవసారి పారిస్‌లో ఒలింపిక్స్ 2024లో పారిస్‌లో మూడవసారి ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఇప్పటి వరకు మూడుసార్లు ఒలింపిక్ క్రీడలు జరిగిన ఏకైక నగరం లండన్. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు దాదాపు రూ.76 వేల కోట్లు ఖర్చు కానుంది. అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో 2024లో అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకానుంది. ఈ స్పేస్ స్టూడియో పేరు ఎస్ఈఈ-1. డిసెంబర్ 2024 నాటికి ఈ స్టూడియో సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్టూడియో సాయంతో అంతరిక్షంలో సినిమా చిత్రీకరించనున్నారు. ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు -
దివిలో దివ్యంగా క్రిస్మస్ ట్రీ!
ఆకాశం అనే కాన్వాస్ అద్భుత చిత్రాలకు వేదిక. తాజా అద్భుతం విషయానికి వస్తే... అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం ‘నాసా’ ఒక చిత్రాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. నాసా వారి ‘చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీ’ కాప్చర్ చేసిన ఈ ఫోటోలో అంతరిక్షంలో క్రిస్మస్ ట్రీ కనువిందు చేస్తోంది. భూమికి 2,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర సమూహం తాలూకు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కాంతి క్రిస్మన్ టీ ఆకారంలో దర్శనమిస్తోంది. పాలపుంత లోపల ఉన్న ఈ నక్షత్ర సమూహాన్ని ‘ఎన్జీసీ 2264’ అని పిలుస్తారు. దేశంలోనే పెద్దదైన క్రిస్మస్ ట్రీ బెంగళూరులో ఉంది. వంద అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్రిస్మస్ చెట్టు సబ్రీ నగర్‌లోని ‘ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా’ పరిసరాల్లో ఉంది. ‘సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్’గా మారింది. మరో విశేషం ఏమిటంటే మూడుసార్లు గ్రామీ అవార్డ్ గెలుచుకున్న మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ ఈ ట్రీ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ సందర్భంగా లైవ్ మ్యూజిక్ షో చేశాడు. బెంగళూరులో దేశంలోనే పెద్దదైన క్రిస్మస్ ట్రీ -
సౌర విలయం!
వాషింగ్టన్: వజ్రపు మొనపై కాంతి ఒక క్రమంలో చెదిరిపోయి చిత్రించిన అందమైన వెలుగు రేఖల్లా కని్పస్తున్నాయి కదూ! కానీ ఇవేమిటో తెలుసా? సూర్యునిపై చెలరేగుతున్న ప్రచండమైన మంటలు! వీటిని ఎక్స్ కేటగిరీకి చెందిన సోలార్ ఫ్లేర్స్‌గా నాసా పేర్కొంది. గత 20 ఏళ్లలో నమోదైన అత్యంత శక్తిమంతమైన మంటలు ఇవేనట! సాధారణంగా సూర్యుని ఉపరితలంపై అయస్కాంత క్షేత్రాలు పునఃసంధానమయ్యే క్రమంలో ఈ మంటలు చెలరేగుతుంటాయి. తీవ్రతను బట్టి వాటిని బీ, సీ, ఎం, చివరగా అతి తీవ్రమైన మంటలను ఎక్స్‌గా వర్గీకరిస్తారు. ఇవి వరుసగా ఒక దానికంటే మరొకటి పదిరెట్లు శక్తిమంతమైనవన్నమాట. తాజా మంటలు ఎక్స్ కేటగిరీలోనూ అతి తీవ్రతతో కూడినవని నాసా వివరించింది. వీటి దెబ్బకు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కొద్దిసేపు రేడియో ధారి్మకత బాగా పెరిగిపోయింది. వీటి దెబ్బకు ఆయా చోట్ల రెండు గంటలకు పైగా సిగ్నల్స్‌కు అంతరాయం కూడా కలిగిందట. 2003లో వీటికంటే 15 రెట్లు శక్తిమంతమైన సోలార్ ఫ్లేమ్స్ నమోదయ్యాయి! -
రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..!
సక్సెస్‌కి మారుపేరుగా నిలవాలంటే జెండర్‌తో పని ఏముంది. పట్టుదల ఉండాలి...దానికి తగ్గ కృషి, వీటన్నింటికీ మించిన సంకల్పం ముఖ్యం. దీనికి ఆత్మ విశ్వాసాన్ని, కఠోర శ్రమను జోడించి సక్సెస్‌తో సలాం చేయించుకుంటూ ఈ విషయంలో మేమేం తక్కువ కాదంటోంది మహిళా శక్తి. వివక్షల్నీ, అడ్డంకుల్నీ అధిగమించి వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా శక్తికి, సాధికారతకు, నిదర్శనంగా నిలిచారు ముగ్గురు ధీర వనితలు. దేశం గర్వించేలా భారత నారీశక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. అక్షతా కృష్ణమూర్తి అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)తో కలిసి మార్స్ రోవర్‌ను నిర్వహించే తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ డా. అక్షతా కృష్ణమూర్తి. పెద్ద పెద్ద కలలు కనడం పిచ్చితనమేమీ కాదు.. మిమ్మల్ని మీరు నమ్ముకోండి.. ఆశయ సాధనలో అలుపెరుగక పనిచేస్తూ పొండి... విజయం మీదే, నాదీ గ్యారంటీ అంటారామె. అంగారక గ్రహంపై రోవర్‌ను ఆపరేట్ చేయనున్న తొలి భారతీయ మహిళగా అవతరించిన తన సక్సెస్ జర్నీని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 13 ఏళ్ల క్రితమే నాసాలో పని చేయాలనేది ఆమె కల. భూమి ,అంగారక గ్రహంపై సైన్స్ అండ్ రోబోటిక్ ఆపరేషన్స్‌కు నాయకత్వం వహించాలనేది చిరకాల డ్రీమ్. అలా అమెరికా ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో లక్ష్యాన్ని సాధించేంతవరకు ఎవరేమన్నా పట్టించుకోలేదు. View this post on Instagram A post shared by Dr. Akshata Krishnamurthy | Rocket Scientist (@astro.akshata) కానీ ఇది అంత సులువుగా ఏమీ జరగలేదు. పీహెచ్డీ డిగ్రీనుంచి నాసాలో ఫుల్ టైం ఉద్యోగం వచ్చేదాకా ఎంతో కష్టపడ్డాను అని చెప్పారు. ఈ రోజు, అంగారక గ్రహంనుంచి అనేక శాంపిల్స్‌ను భూమికి తీసుకురావడానికి రోవర్‌తో సహా పలు కూల్ స్పేస్ మిషన్లలో పని చేస్తున్నాను అని పేర్కొన్నారు. అక్షత MIT (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుండి పీహెచ్డీ ఏశారు. నాసాలో చేరిన అతికొద్ది మంది భారతీయుల్లో ఆమె కూడా ఒకరు. నాసాలో ప్రధాన పరిశోధకురాలిగా గత ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. మహిళా ఆర్మీ డాక్టర్ కెప్టెన్ గీతిక కౌల్ సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లోని భారత సైన్యానికి చెందిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. స్నో లెపార్డ్ దళానికి చెందిన కెప్టెన్ గీతికా కౌల్ చరిత్ర సృష్టించారు. హిమాలయాల ఉత్తర భాగంలో ఉన్న సియాచిన్ బాటిల్ స్కూల్లో కఠినమైన ఇండక్షన్ శిక్షణను సక్సెస్‌ఫుల్‌గా ప పూర్తి చేసి మరీ ఈ కీలకమైన మైలురాయిని సాధించారు. అనేక అడ్డంకులను ఛేదించి అంకితభావంతో, దేశానికి సేవ చేయడం స్ఫూర్తిదాయకం. స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాధి తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేసిన మరో మహిళా శక్తి స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాధి. మిజోరాంలో గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి కీలక పదవిలో పాధిని ఎంపిక చేశారు. 2015 బ్యాచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయిన Sqn లీడర్ మనీషా పాధిని భారత సాయుధ దళాల నుండి భారతదేశపు తొలి మహిళా సహాయకురాలుగా (ఎయిడ్-డే-క్యాంప్) నియమించారు.అధికారికంగా ఆమె బాధ్యతలను కూడా స్వీకరించారు. Sqn లీడర్ మనీషా పాధి మూడు కీలక పదవులను కూడా నిర్వహించారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్, బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, పూణే, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, భటిండాలో పనిచేశారు. ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన మనీషా తండ్రి ఇన్స్పిరేషన్. ఆమె భర్త మేజర్ దీపక్ సింగ్ కర్కీ ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నారు. భువనేశ్వర్‌లోని CV రామన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా 2015లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ఏఐఎఫ్‌లో చేరారు. Squadron Leader Manisha Padhi appointed as Aide-De-Camp(ADC) to the Governor of Mizoram. Sqn Leader Manisha is India’s first Woman Indian Armed Forces officer to be appointed as Aide-De-Camp(ADC) to the Governor in the country: Governor of Mizoram (Source: Office of Governor of… pic.twitter.com/3wsWuI5hBW — ANI (@ANI) December 4, 2023 ఏడీసీ అంటే? గవర్నర్‌కు వ్యక్తిగత సహాయకురాలిగా అధికారిక పర్యటనలలో కూడా రాజ్యాంగ అధికారంతో వెంట ఉంటారు. ప్రతి గవర్నర్‌కు ఇద్దరు ADCలు ఉంటారు, ఒకరు సాయుధ దళాల నుండి , మరొకరు పోలీసు అధికారి. మిజోరంలో,రెండో ఏడీసీ రాష్ట్ర పోలీసు అధికారిగా జోనున్ తారా ఉన్నారు.