కేప్ కెనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి, స్టేషన్ కమాండర్ సునీతా విలియమ్స్ దినచర్య గురువారం కాస్త మారింది. దాదాపు ఏడు నెలలపాటు వివిధ శాస్త్రీయ ప్రయోగాలతో గడిపిన ఈమె గురువారం ఐఎస్‌ఎస్ వెలుపలికి వచ్చి స్పేస్‌వాక్ చేశారు.
ఐఎస్‌ఎస్ నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో విహరించడమే స్పేస్‌వాక్(Space Walk). నాసాకే చెందిన మరో వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి సునీతా విలియమ్స్(Sunitha Williams) ఐఎస్‌ఎస్‌కు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో ఐఎస్‌ఎస్ తుర్క్‌మెనిస్తాన్‌కు సరిగ్గా 260 మైళ్ల ఎత్తులో ఉందని నాసా తెలిపింది. అంతకుముందు కూడా పలుమార్లు ఐఎస్‌ఎస్‌లోకి వచి్చన సునీతకు తాజా స్పేస్‌వాక్ ఎనిమిదోది కావడం గమనార్హం.
గతేడాది జూన్‌లో బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. వారం పాటు మాత్రమే వారు అక్కడ గడపాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్‌లో సమస్యలు తలెత్తడంతో అప్పటి నుంచి వారి తిరుగు ప్రయాణం వాయిదా పడుతూ వస్తోంది. వచ్చే వారం సునీత, విల్మోర్‌ను తిరిగి తీసుకు వచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తోంది.
The rate gyro assembly that helps maintain station orientation has been replaced. @AstroHague will soon work on the NICER X-ray telescope while @Astro_Suni will replace navigation hardware. pic.twitter.com/EfqNDF8ZAI
— International Space Station (@Space_Station) January 16, 2025
🚀 జూన్ 5వ తేదీన బోయింగ్ కొత్త స్టార్‌లైనర్ క్రూ క్యాప్సూల్‌లో.. సునీత, విల్‌మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. వారంపాటు టెస్ట్ ఫ్లైట్ తర్వాత వాళ్లు తిరిగి భూమికి చేరాల్సి ఉంది. కానీ..
🚀బోయింగ్ స్టార్‌లైనర్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. థ్రస్టర్ ఫెయిల్యూర్స్, హిలీయం లీకేజీలతో.. ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. దీంతో సెప్టెంబర్ 7వ తేదీన ఆ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే క్యాప్సూల్ భూమ్మీదకు వచ్చేసింది. వాళ్లు భూమ్మీదకు ఎప్పుడు తిరిగి వస్తారో అనే ఆందోళన మొదలైంది.
🚀టెంపరరీ విజిటర్స్‌గా వెళ్లిన విలియమ్స్, విల్‌మోర్‌లు.. ఐఎస్‌ఎస్‌కు ఫుల్‌టైం సిబ్బందిగా మారిపోయారు.స్పేస్‌వాక్, ఐఎస్‌ఎస్ నిర్వహణతో పాటు ఆ భారీ ప్రయోగశాలలో వీళ్లిద్దరితో శాస్త్రీయ పరిశోధనలు చేయించింది నాసా. అంతేకాదు.. వీళ్ల పరిస్థితిని మరో రూపకంలోనూ ‘ఛాలెంజ్’గా తీసుకుంది నాసా. ఇలాంటి విపత్కర పరిస్థితిల నడుమ అంతరిక్షంలో ఇరుక్కుపోయినవాళ్లను రక్షించేందుకు మంచి ఐడియాలు గనుక ఇస్తే.. వాళ్లకు రూ.17 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తామని నాసా ప్రకటించింది.
🚀తప్పనిసరిగా ఇద్దరూ నెలలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. దీంతో.. సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న కథనాలు కలవరపాటుకు గురి చేశాయి. తాజాగా విడుదల చేసిన ఫొటోలు, వీడియోల్లోనూ ఆమె బరువు తగ్గినట్లు స్పష్టమైంది. గురుత్వాకర్షణ శక్తి లేని అలాంటి చోట.. కండరాలు, ఎముకలు క్షీణతకు గురవుతాయి. అలాంటప్పుడు.. రోజుకి రెండున్నర గంటలపాటు వ్యాయామాలు చేయడం తప్పనిసరి.
🚀అయితే నాసా మాత్రం ఆమె ఆరోగ్యంపై వస్తున్న కథనాలను.. పుకార్లుగా కొట్టిపారేస్తోంది. బరువు తగ్గినప్పటికీ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ను అందిస్తూ వస్తోంది. కానీ, ఐఎస్‌ఎస్‌లో ఆమె పరిస్థితిని చూసి నాసా ఏమైనా దాస్తోందా? అనే అనుమానాలు కలిగాయి. ఈ తరుణంలో తాను క్షేమంగానే ఉన్నానంటూ స్వయంగా సునీతనే ఓ వీడియో విడుదల చేశారు.
🚀ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 1998 నవంబర్‌లో ఇది ప్రారంభమైంది. నాసాతో పాటు ఐదు దేశాల స్పేస్ స్టేషన్లు దీనిని నిర్వహణ చూసుకుంటాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భూమి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో లో ఎర్త్ ఆర్బిట్(LEO) వద్ద ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బరువు 4 లక్షల 45 వేల కేజీలు. 59ఏళ్ల సునీతా విలియమ్స్.. ప్రస్తుతం దీనికి కమాండర్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment