భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunitha villiams) ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) కు వెళ్లిన విషయం తెలిసిందే. ఎనిమిది రోజుల కోసమని అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు బారీ విల్‌మోర్, సునీత విలియమ్స్‌లు ఎనిమిది నెలల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, వారిని స్పేస్‌ఎక్స్ డ్రాగన్‌లో భూమిపైకి తీసుకురావాలని నాసా ప్లాన్ చేస్తోంది.
అయితే ఇటీవల సునీతాకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ కావడంతో ఆమె అనారోగ్యానికి గురయ్యిందని పలు కథనాలు రావడం మొదలయ్యాయి. ఈ తరుణంలో తన ఆరోగ్య పరిస్థితిపై ఐఎస్ఎస్ నుంచి సునీతా స్వయంగా అప్ డేట్ ఇచ్చారు. తన శారీరక పరిస్థితి, బరువు తగ్గడం తదితర ఊహగానాలకు చెక్‌పెట్టేలా తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు.
అలాగే తాను బరువు కోల్పోలేదని పెరిగానని చెప్పారు. తాను అంతరిక్షం కేంద్రవ వద్దకు వచ్చినప్పుడు ఎంత బరువు ఉన్నానో అంతే ఉన్నానని అన్నారు. అంతేగాదు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించేలా చంద్రుడు, అంగారక గ్రహంపై భవిష్యత్తులో మానవ అన్వేషణ లక్ష్యంగా చేస్తున్న ఈ మిషన్ కొనసాగుతుందని ధీమాగా చెప్పారు. అలాగే అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ కారణంగానే తన శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయే తప్ప బరువు కోల్పోలేదని వివరించారు.
మైక్రోగ్రామిటీ వల్లే ఇదంతా..
అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీకి శరీరంమంతా ఉండే ద్రవాలు పునః పంపిణీ అవుతుంటాయి. దీంతో తమ తలలు చాలా పెద్దవిగా కనిపిస్తాయని అన్నారు సునీతా. అలాగే ఈ అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు వ్యాయామాలు, వర్కౌట్‌లు వంటివి అత్యంత అవసరమని అన్నారు. సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు వారి తుంటి, వెన్నుమకల్లో ప్రతి నెల రెండు శాతం వరకు ఎముక సాంద్రతను కోల్పోతారని అన్నారు.
అలా జరగకుండా ఉండేందుకు తాము వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్‌లు, ట్రెడ్‌మిల్ వర్కౌట్‌లతో సహా రోజువారీ ..వ్యాయామం రెండు గంటలకు పైగా చేస్తామని చెప్పారు. విపరీతంగా చేసిన వ్యాయమాల కారణంగానే శరీరాకృతిలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. అలాగే తాను బాగానే తింటున్నాని, ముఖ్యంగా..ఆలివ్‌లు, అన్నం, టర్కిష్ చేపల కూర తింటున్నట్లు చెప్పారు.
(చదవండి: క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం.. నాసా ఏం చెప్పింది?)
Comments
Please login to add a commentAdd a comment