Walk
-
సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు
నాసా వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా నిలిచారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న ఆమె.. తన 9వ స్పేస్‌వాక్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ సేపు స్పేస్ వాక్ చేసిన ఘనతతో ఆమె నాసా ఆల్‌టైం లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు.సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గురువారం ఉమ్మడిగా స్పేస్‌వాక్ చేశారు. తాజా స్పేస్‌వాక్‌తో కలిపి.. మొత్తంగా 62 గంటల 6 నిమిషాలపాటు ఆమె వాక్ పూర్తి చేసుకున్నారు. తద్వారా నాసా వ్యోమగామి పెగ్గీ వైట్సన్ రికార్డు(60 గంటలు) ఆమె అధిగమించారు. అంతేకాదు.. స్పేస్‌వాక్ టాప్ టెన్ జాబితాలో సునీతా విలియమ్స్ నాలుగో స్థానానికి ఎగబాకారు. అత్యధికంగా స్పేస్‌వాక్ చేసింది కాస్మోనాట్ అనాటోలీ సోలోవ్యెవ్. పదహారుసార్లు స్పేస్‌వాక్ చేసిన ఆయన.. 82 గంటల 22 నిమిషాలు గడిపారు. ఇక ఈ టాప్ టెన్ లిస్ట్‌లో ఎనిమిది మంది నాసా వ్యోమగాములే ఉండడం గమనార్హం. ఫైడోర్ యర్చికిహిన్(కాస్మోనాట్) 59 గంటల 28 నిమిషాలు వాక్ చేసి తొమ్మిది స్థానంలో కొనసాగుతున్నారు.కాస్మోనాట్.. రష్యా(పూర్వపు సోవియట్ యూనియన్) వ్యోమగామి , ఆస్ట్రోనాట్.. అమెరికా నాసా వ్యోమగామి.. వ్యోమనాట్.. తరచూ భారత వ్యోమగామికి, టైకోనాట్.. చైనా వ్యోమగామి, స్పేషియోనాట్.. ఫ్రాన్స్‌తో పాటు ఫ్రెంచ్ మాట్లాడే మరికొన్ని దేశాలువారం వ్యవధిలో సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్ చేయడం ఇది రెండోసారి. సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు బయటి భాగంలో చేయాల్సిన మరమ్మతులు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించారు. భూమికి 420 కిలోమీటర్ల ఎగువన సరిగ్గా స్పెయిన్ దేశం పైభాగాన తాము స్పేస్‌వాక్ చేశామని, చాలా ఆనందంగా ఉందని వాళ్లు అంటున్నారు. ఇదిలా ఉంటే.. అంతరిక్షంలో తొలిసారి స్పేస్‌వాక్ చేసింది సోవియట్ కాస్మోనాట్(ప్రస్తుత రష్యా) వ్యోమగామి అలెక్సీ లెనోవ్. 1965, మార్చి 18వ తేదీన వాష్కోడ్ 2 మిషన్‌లో భాగంగా.. 12 నిమిషాల 9 సెకండ్లపాటు ఆయన బయటకు వచ్చారు. అంతరిక్ష పరిశోధనల్లో ఆయన నడక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఇక.. గత ఏడాది జూన్‌లో వీళ్లిద్దరూ ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో అది సాధ్య పడలేదు. ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.అయితే.. అందుకోసం ప్రయత్నాలు మాత్రం ముమ్మరం అయ్యాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం జోక్యం చేసుకున్నారు. ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకురావడానికి సాయం అందించాలని స్పేస్ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్ ను కోరారు. అన్నీకుదిరితే.. ఈ మార్చి ఆఖర్లో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో వాళ్లను భూమ్మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరగొచ్చు. -
Sunita Williams: అంతరిక్షంలోనే ఏడు నెలలు..నడక మర్చిపోయా..!
గతేడాది జూన్ 14వ తేదీన అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. కేవలం పది రోజులు ఉండడానికి మాత్రమే వారిద్దరు అంతరిక్షానికి వెళ్లారు. అయితే వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దాంతో వారు ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. వాళ్లు భూమ్మీదకి ఎప్పుడు అడుగుపెడతారనే దానిపై స్పష్టత లేదు. అయితే అంతకాలం అంతరిక్షంలోనే జీరో గ్రావిటీ వద్ద తేలియాడుతుండటంతో వ్యోమగాములకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో..? అనే సందేహాలు సర్వత్రా లేవనెత్తాయి. అయితే వాటన్నింటికీ చెక్‌పెడుతూ గతంలో సునీతా తాను బాగానే ఉన్నానంటూ రిప్లై ఇచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం విలియమ్స్ తాజాగా తాను ఆ సమస్యలు ఎదుర్కొంటున్నా అంటూ.. బాంబు పేల్చింది. దీంతో ఆరోగ్య నిపుణుల అనుమానాలే నిజమవుతున్నాయా..? అనే సందేహం అందిరిలోనూ రేకెత్తింది. ఇంతకీ విలియమ్స్ ఏం చెప్పారు..? భవిష్యత్ మిషన్ల పరిస్థితి ఏంటీ అంటే..సునీతా విలియమస్స్(Sunita Williams) ఏడు నెలలుగా అంతరిక్షంలోనే(space) ఉండిపోవడంతో నడక(Walk) ఎలా ఉంటుందో మర్చిపోయానని అన్నారు. నిత్యం జీరో గ్రావిటీ వద్ద తేలియాడుతూ ఉండటంతో దేన్నైనా ఆధారం చేసుకుని నిలబడితే ఎలా ఉంటుంది అనే ఫీల్ వస్తోందట. ఇలా అన్నేళ్లు ఉండిపోతే ఎముకలు పటుత్వం కోల్పోతాయని, పలు అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్యనిపుణులు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడూ అదే నిజమైంది అన్నట్లుగా ఉన్నాయి విలియమ్స్ మాటలు చూస్తే. నెలల తరబడి గురత్వాకర్షణ శక్తిలో తేలుతూ ఉండటం వల్ల నడవడం ఎలా ఉంటుందో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారామె. ఆమె అక్కడ కూర్చోలేదు, పడుకోలేదు, అందువల్ల నేలపై నడిచే అనుభూతిని తిరిగి పొందడానికి కష్టపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అంతరిక్ష నౌకలో స్వల్పకాలిక మిషన్‌గా భావించిన సునీతాకు అదికాస్తా ఓపికకు పరీక్ష పెట్టే నిరుత్సాహకరమైన అనుభవంగా మారిపోయింది. ఇంతకాలం కుటుంబానికి భౌతికంగా దూరమైనా.. వారితో టచ్‌లో ఉండేలో ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిరోజు తన అమ్మతో మాట్లాడతున్నట్లు తెలిపారు. ఈ మిషన్ తన శారీరక బలానికి మాత్రమే కాకుండా భావోద్వేగ స్థితిస్థాపకతకు కూడా పరీక్షగా మారింది. ఈ సుదీర్ఘ అంతరిక్ష పరిశోధన వ్యోమగాముల(Astronauts) కుటుంబ జీవితాన్నే గాకుండా భవిష్యత్తులో ఇలాంటి మిషన్ పరిశోధనల కోసం వ్యోమగాములకు త్యాగాలు తప్పవనే విషయాన్ని నొక్కి చెబుతోంది. అలాగే అంతరిక్ష ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉంటుందో ఈ ఉదంతమే చెబుతోంది. కాగా, మార్చి చివరలో లేదా ఏప్పిల్‌లో స్పేస్ఎక్స్ క్రూ-10 ప్రయోగించి ఆ వ్యోమగాములిద్దరిని తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. అలాగే ట్రంప్ కూడా వారిని సురక్షితంగా తీసుకురావాలని మస్క్‌ని కోరినట్లు సమాచారం. (చదవండి: ఆ ఇద్దరి కోసం ట్రంప్ సాయం అడిగారు: మస్క్) -
సునీత స్పేస్‌వాక్ చూశారా?
కేప్ కెనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి, స్టేషన్ కమాండర్ సునీతా విలియమ్స్ దినచర్య గురువారం కాస్త మారింది. దాదాపు ఏడు నెలలపాటు వివిధ శాస్త్రీయ ప్రయోగాలతో గడిపిన ఈమె గురువారం ఐఎస్ఎస్ వెలుపలికి వచ్చి స్పేస్‌వాక్ చేశారు.ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో విహరించడమే స్పేస్‌వాక్(Space Walk). నాసాకే చెందిన మరో వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి సునీతా విలియమ్స్(Sunitha Williams) ఐఎస్ఎస్కు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో ఐఎస్ఎస్ తుర్క్మెనిస్తాన్కు సరిగ్గా 260 మైళ్ల ఎత్తులో ఉందని నాసా తెలిపింది. అంతకుముందు కూడా పలుమార్లు ఐఎస్ఎస్లోకి వచి్చన సునీతకు తాజా స్పేస్‌వాక్ ఎనిమిదోది కావడం గమనార్హం.గతేడాది జూన్‌లో బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారం పాటు మాత్రమే వారు అక్కడ గడపాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్‌లో సమస్యలు తలెత్తడంతో అప్పటి నుంచి వారి తిరుగు ప్రయాణం వాయిదా పడుతూ వస్తోంది. వచ్చే వారం సునీత, విల్మోర్ను తిరిగి తీసుకు వచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తోంది. The rate gyro assembly that helps maintain station orientation has been replaced. @AstroHague will soon work on the NICER X-ray telescope while @Astro_Suni will replace navigation hardware. pic.twitter.com/EfqNDF8ZAI— International Space Station (@Space_Station) January 16, 2025🚀 జూన్ 5వ తేదీన బోయింగ్ కొత్త స్టార్‌లైనర్ క్రూ క్యాప్సూల్‌లో.. సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారంపాటు టెస్ట్ ఫ్లైట్ తర్వాత వాళ్లు తిరిగి భూమికి చేరాల్సి ఉంది. కానీ..🚀బోయింగ్ స్టార్‌లైనర్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. థ్రస్టర్ ఫెయిల్యూర్స్, హిలీయం లీకేజీలతో.. ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. దీంతో సెప్టెంబర్ 7వ తేదీన ఆ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే క్యాప్సూల్ భూమ్మీదకు వచ్చేసింది. వాళ్లు భూమ్మీదకు ఎప్పుడు తిరిగి వస్తారో అనే ఆందోళన మొదలైంది.🚀టెంపరరీ విజిటర్స్‌గా వెళ్లిన విలియమ్స్, విల్మోర్లు.. ఐఎస్ఎస్కు ఫుల్‌టైం సిబ్బందిగా మారిపోయారు.స్పేస్‌వాక్, ఐఎస్ఎస్ నిర్వహణతో పాటు ఆ భారీ ప్రయోగశాలలో వీళ్లిద్దరితో శాస్త్రీయ పరిశోధనలు చేయించింది నాసా. అంతేకాదు.. వీళ్ల పరిస్థితిని మరో రూపకంలోనూ ‘ఛాలెంజ్’గా తీసుకుంది నాసా. ఇలాంటి విపత్కర పరిస్థితిల నడుమ అంతరిక్షంలో ఇరుక్కుపోయినవాళ్లను రక్షించేందుకు మంచి ఐడియాలు గనుక ఇస్తే.. వాళ్లకు రూ.17 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తామని నాసా ప్రకటించింది.🚀తప్పనిసరిగా ఇద్దరూ నెలలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. దీంతో.. సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న కథనాలు కలవరపాటుకు గురి చేశాయి. తాజాగా విడుదల చేసిన ఫొటోలు, వీడియోల్లోనూ ఆమె బరువు తగ్గినట్లు స్పష్టమైంది. గురుత్వాకర్షణ శక్తి లేని అలాంటి చోట.. కండరాలు, ఎముకలు క్షీణతకు గురవుతాయి. అలాంటప్పుడు.. రోజుకి రెండున్నర గంటలపాటు వ్యాయామాలు చేయడం తప్పనిసరి. 🚀అయితే నాసా మాత్రం ఆమె ఆరోగ్యంపై వస్తున్న కథనాలను.. పుకార్లుగా కొట్టిపారేస్తోంది. బరువు తగ్గినప్పటికీ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ను అందిస్తూ వస్తోంది. కానీ, ఐఎస్ఎస్లో ఆమె పరిస్థితిని చూసి నాసా ఏమైనా దాస్తోందా? అనే అనుమానాలు కలిగాయి. ఈ తరుణంలో తాను క్షేమంగానే ఉన్నానంటూ స్వయంగా సునీతనే ఓ వీడియో విడుదల చేశారు.🚀ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 1998 నవంబర్‌లో ఇది ప్రారంభమైంది. నాసాతో పాటు ఐదు దేశాల స్పేస్ స్టేషన్లు దీనిని నిర్వహణ చూసుకుంటాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భూమి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో లో ఎర్త్ ఆర్బిట్(LEO) వద్ద ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బరువు 4 లక్షల 45 వేల కేజీలు. 59ఏళ్ల సునీతా విలియమ్స్.. ప్రస్తుతం దీనికి కమాండర్‌గా ఉన్నారు. -
లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ
మోడలింగ్, ఫ్యాషన్ గురించి ప్రస్తావించగానే స్లిమ్, యంగ్‌గా కనిపించడాన్ని ప్రధానంగా చూస్తారు. వాటికే ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈమె లేటు వయసులో మోడల్‌గా కెరీర్‌గా ప్రారంభించింది. ఆ ఏజ్‌లో మోడల్‌గా ప్రయత్నించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఎన్నో హేళనలు, అవమానాలు తట్టుకోవాల్సిందే. అన్ని దాటుకుని నిలబడటమే గాక మోడల్ అంటే యవ్వనంగా కనిపించే వాళ్లే కాదు తనలాంటి సీనియర్ సిటిజన్లు కూడా యంగ్ జనరేషన్‌కి ఏ మాత్రం తీసిసోని విధంగా దూసుకుపోతారని ప్రూవ్ చేసింది. ఆమె పేరు ముక్కాసింగ్. ఆమెనే యాక్సిడెంటల్ మోడల్‌గా చెప్పొచ్చు. లాక్మే ఫ్యాషన్ వీక్ 2024లో ర్యాంప్‌పై డిఫరెంట్ డిజైనర్ వేర్‌తో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా అర్థం కానీ రీతిలో కొందర్నీ అద్భుతంగా ప్రపంచం ముందు నిలబడేలా చేస్తుంది. అలానే ముక్తాసింగ్ మోడల్ అయ్యేందుకు ఇది ఓ గొప్ప ఫ్లాట్‌ఫామ్‌గా నిలిచింది.సోషల్ మీడియాలో ఆమె ప్రస్థానం ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్‌గా ప్రారంభయమయ్యింది. చివరికి 2021 నుంచి ఆమెకు గుర్తింపు లభించడం మొదలయ్యింది. అయితే ఆమె మోడల్‌గా మారడానికి కారణం మాత్రం తన మేనగోడలు వివాహ వేడుక . ఆ ఫంక్షన్లో ఆమె కట్టుకున్న చీర అందర్నీ ఆకర్షించింది. ముఖ్యంగా కట్టిన తీరు మెచ్చుకుంటూ ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇక అప్పుడే డిసైడ్ అయ్యింది. తనకు తాను స్వతహా ఫ్యాషన్‌ని సెట్ చేసుకుని విన్నూతనంగా కనిపించాలని ఫిక్స్ అయ్యింది. అంతేగాదు ఆ ఫంక్షన్‌లోని తన పిక్స్‌ని నెట్టింట షేర్ చేయగా వేలల్లో వ్యూస్, లైక్‌లు రావడంతో ఈ రంగం వైపు అడుగులు వేసింది ముక్తా సింగ్. అలా ఆమె మోడల్‌గా ర్యాంప్‌పై నడిచి ఫ్యాషన్‌కి కొత్త నిర్వచనం ఇచ్చింది. ముక్తా రానున్న కల్కి2 మూవీలో కూడా నటిస్తోంది కూడా. కాగా, ముక్తాకి 15 ఏళ్ల వయసుకే జుట్టు మెరిసిపోయి అందవిహీనంగా అయిపోయింది. View this post on Instagram A post shared by Mukta Singh (@mukta.singh) ఆ తర్వాత పెళ్లి , పిల్లలు బాధ్యతలతో కెరీర్‌పై దృష్టి సారించే అవకాశమే దక్కలేదు. దీనికి తోడు ఆ టైంలోనే ముక్తా తల్లి కేన్సర్ బారిన పడటం, ఇవన్నీ ఆమెను కుంగుబాటుకి గురిచేసి తన ఆహార్యంపై దృష్టిపెట్టే అవకాశం లేకుండా చేశాయి. ఆ గడ్డు పరిస్థితు నుంచి బయటకు రావడానికి ఆమె హార్డ్ రాక్ సంగీతంవైపుకి మళ్లింది. అలా కోలుకుంటూ మళ్లీ ఈ ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చి..తన కలను నిజం చేసుకుంది ముక్తా. అంతేగాదు ఈ వయసులోనా అని సమాజం నుంచే వచ్చే సవాళ్లకు లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకుసాగి ఫ్యాషన్‌కి సరికొత్త వివరణ ఇచ్చింది. View this post on Instagram A post shared by Mukta Singh (@mukta.singh) (చదవండి: ఓ పచ్చని నీడ! గ్రీన్ వారియర్..పద్నాలుగేళ్లకే..!) -
2500 మిలియన్ల ఏళ్ల చరిత్ర ఉన్న బండరాళ్లివి!
రాక్ సొసైటీ గుర్తింపు పొందిన ఉర్దూ విశ్వవిద్యాలయంలోని పత్తర్ కే దిల్, ఏక్తా మే తాకత్ హై పేర్లు కలిగిన రెండు బండరాళ్లకు మాత్రం 2500 మిలియన్ల ఏళ్ల చరిత్ర ఉందని, దక్కన్ పీఠభూముల్లో భాగం అని చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు బండరాళ్లలో రెండు రాళ్లు పక్కపక్కనే ఉండడాన్ని గుర్తించి ఈ రాళ్లకు ‘పత్తర్కే దిల్’ అని నామకరణం చేశారు. రాళ్లన్నీ ఒకేచోట ఉండడంతో ఏక్తా మే తాకత్ హై (యునైటెడ్ వి స్టాండ్) అని నామకరణం చేశారు. అలాగే మరోచోట ఉన్న రాళ్లకు కూడా అనేక్ తా మే ఏక్తా (యూనిటీ ఇన్ డైవర్సిటీ) అని కూడా పిలుస్తున్నారు. రాక్స్ పేరిట వీకెండ్స్ వాక్ ∙విభిన్న రాష్ట్రాలు, భాషలు, కులాలు, మతాలకు చెందిన వారితో మినీ భారత్‌గా మారిన హెచ్‌సీయూలో విద్యార్థులలో ఐక్యత బలపడేలా చేసేందుకు హెచ్‌సీయూ ఎక్స్‌ప్లోరర్ పేరిట వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు ద్వారా వీకెండ్స్‌లో వాక్‌లను నిర్వహిస్తున్నారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో మష్రూమ్ రాక్, వైట్ రాక్, టెంపుల్ రాక్, వర్జిన్ రాక్, వైట్ రాక్స్, హైరాక్స్, సాసర్ రాక్, కోన్ రాక్ కాంప్లెక్స్ ఇలా రకరకాల పేర్లతో ఈ బండరాళ్లను విద్యార్థులు పిలుస్తుంటారు. హెచ్‌సీయూ, మనూ యూనివర్సిటీల్లో హెరిటేజ్ రాక్స్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ‘ఏక్తా మే తాకత్ హై’పేరుతో పిలిచే రాళ్లు ‘పత్తర్ కే దిల్.. ఏక్ తా మే తాకత్ హై.. అనేక్ తా మే ఏక్తా.. ‘మష్రూమ్ రాక్,.. వైట్ రాక్స్.. టెంపుల్ రాక్’లు హెరిటేజ్ రాక్స్గా గుర్తింపు పొందాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన భారీ బండరాళ్లకు పెట్టిన పేర్లు ఇవి. నగరంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న రాతి సంపద హెచ్‌సీయూ, మనూ ఉర్దూ యూనివర్సిటీల్లో ఉండడం విశేషం. నగరంలో గుర్తించిన హెరిటేజ్ రాళ్లలో హెచ్‌సీయూ ‘మష్రూమ్రాక్’ ఉంది. వీటికి శతాబ్దాల చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. వీటి గురించి భావితరాలకు తెలిసేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. హెచ్‌సీయూలో 2,300 ఎకరాలు, ‘మనూ’లో 200 ఎకరాలు కలిపి 2,500 ఎకరాలలో విభిన్న తరహాలో ఏర్పడిన భారీ బండరాళ్ల (రాక్స్)ను రక్షిస్తూ వస్తున్నారు. – రాయదుర్గం -
అంతరిక్షం నుంచి ఐక్యతా గీతం
అంతరిక్షంలో తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ చేసిన వ్యోమగాముల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా ‘స్టార్‌వార్స్: ద ఫోర్సెస్ అవేకెన్స్’లోని ప్రఖ్యాత ‘రేస్ థీమ్’ను అంతరిక్షం నుంచే పర్ఫామ్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. పొలారిస్ డాన్ ప్రైవేట్ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్ఎస్కు ప్రయాణించిన స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక నుంచే ఆమె ఈ మ్యూజికల్ ట్రిబ్యూట్లో పాల్గొన్నారు. సోలో వయోలిన్‌ను సారా వాయించగా పూర్తిస్థాయి ఆర్కెస్ట్రా బృందం భూమి నుంచి ఆమెకు వాద్య సహకారం అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘హార్మనీ ఆఫ్ రెసీలియన్స్’ పేరిట పొలారిస్ ప్రోగ్రాం బృందం శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘‘విశ్వభాష అయిన సంగీతమే ఈ వీడియోకు స్ఫూర్తి. అలాగే బాలల్లో క్యాన్సర్ తదితర మహమ్మారులపై పోరాటం కూడా. చుక్కలనంటే ఉన్నత ఆశయాలను నిర్దేశించుకునేలా తర్వాతి తరాన్ని ప్రేరేపించడమే దీని ఉద్దేశం’’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. ‘అందమైన మన పుడమి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ ఆనంద క్షణాలను సంగీతమయంగా మార్చి మీ అందరితో పంచుకునేందుకు చేసిన ఓ చిన్న ప్రయత్నమిది’ అంటూ సారా గొంతుతో వీడియో ముగుస్తుంది. ‘‘మానవాళి ఐక్యతకు, మెరుగైన ప్రపంచపు ఆకాంక్షలకు ఈ ప్రయత్నం ఓ ప్రతీక. బాలల్లో నిబిడీకృతమై ఉండే అనంతమైన ప్రతిభా పాటవాలకు ఇది అంకితం’’ అని సారా పేర్కొన్నారు. పొలారిస్ డాన్ మిషన్ కమాండర్ జరేద్ ఐజాక్‌మ్యాన్‌తో పాటు సారా గురువారం స్పేస్ వాక్ చేయడం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగాములుగా వారు నిలిచారు. ఈ వీడియో తయారీలో సెయింట్ జూడ్ చి్రల్డన్స్ రీసెర్చ్ హాస్పిటల్ కూడా పాలుపంచుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విశాఖలో హ్యాండ్లూమ్స్ కోసం చీర కట్టులో స్పెషల్ వాక్ ర్యాలీ (ఫొటోలు)
-
కేదార్నాథ్ యాత్రలో విషాదం.. ముగ్గురు మృతి
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి నడక మార్గంలో నేటి ఉదయం (ఆదివారం) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండలపై నుంచి పడిన రాళ్ల కారణంగా ముగ్గురు యాత్రికులు మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకూ శిథిలాల నుంచి ముగ్గురు యాత్రికుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరంతా మహారాష్ట్రకు చెందిన వారని సమాచారం. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. కేదార్నాథ్ యాత్రా మార్గం సమీపంలో కొండపై నుండి పడుతున్న రాళ్ల కారణంగా కొందరు యాత్రికులు మృతిచెందారన్న వార్త చాలా బాధ కలిగిందని సీఎం పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులకు సూచనలు జారీ చేశారు.జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 7.30 గంటలకు కేదార్నాథ్ యాత్రా మార్గంలోని చిర్బాసా సమీపంలోని కొండపై నుండి పడిన భారీ రాళ్ల కారణంగా యాత్రికులు సమాధి అయినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే ఎన్డిఆర్ఎఫ్, డిడిఆర్, వైఎంఎఫ్ అడ్మినిస్ట్రేషన్ బృందంతో సహా యాత్రా మార్గంలోని భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారన్నారు. రెస్క్యూ టీమ్ శిథిలాల నుంచి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసిందని, గాయపడిన ఎనిమిది మందిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. -
రాత్రి భోజనం తర్వాత నడిస్తే ఇన్ని లాభాలా..!
పూర్వం నుంచి రాత్రి భోజనం తర్వాత నాలుగు అడుగులు వేయండి అని మన పెద్దలు తరుచుగా చెబుతుంటారు. భోజనం అయ్యిన వెంటనే పడక మీద వాలిపోవద్దని అంటుంటారు. ముఖ్యంగా ఆయుర్వేద నిపుణులు, ఆరోగ్య నిపుణులు కూడా ఈ విషయమే చెబుతుంటారు కూడా. అసలు దీని వల్ల ఏం జరుగుతుంది? కలిగే ప్రయోజనాలు ఏంటంటే..భారతీయ సంప్రదాయంలో ఈ విధానాన్ని ఎక్కువగా పాటిస్తుంటారు కొందరూ. రాత్రి భోజనం అయ్యిన వెంటేనే కాసేపు ఆరు బయట అలా కబుర్లు చెప్పుకుంటూ నడవడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన ఆయుర్వేద శాస్త్రంలో మంచి ఆరోగ్యానికి పాటించాల్సిన సూత్రాల్లో ఇది అత్యంత ప్రధానమైనది. రాత్రి భోజనం తర్వాత కనీసం ఓ అరగంట నడిస్తే చాలని చెబుతుంటారు ఆయుర్వేద నిపుణులు. ఇలా చేస్తే కలిగే ప్రయోజనాలేంటంటే..రాత్రి భోజనం తర్వాత ఓ 30 నిమిషాల పాటు నడిస్తే మన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా ప్రోత్సహిస్తుంది. పొట్ట ఉబ్బరాన్ని నివారించి అజీర్ణాన్ని దరి చేరనియ్యదు. ఇది ప్రేగుల ఆరోగ్యానికి మంచిది కూడా. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ స్పైక్‌లను నిరోధించడంలో ఉపయోగపడుతుంది. ఇలా నడవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. పైగా తేలికపాటి వ్యాయామం శరీరానికి అంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. అలాగే అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. ఇలా నడవడం వల్ల శరీరం మంచి పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. ఈ నడక వల్ల కుటుంబ సభ్యులతో గడిపే ఒక చక్కటి అవకాశం కూడా దొరుకుతుంది. ఒకరకంగా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చాలామంది వైద్యులు డిన్నర్ తర్వాత నడక గణనీయమైన ప్రయోజనాలనను పొందగలరని నొక్కి చెబుతున్నారు. ఉదయం వాకింగ్ ఎముకల ఆరోగ్యానికి మంచిదైతే సాయంత్రం భోజనం తర్వాత కొద్దిపాటి నడక జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు నిపుణులు. అదే సమయంలో అలాంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులుచేయకూడనవి ఏంటంటే..అసౌకర్యం లేదా అజీర్తి రాకూడదంటే భారగీ భోజనం చేసినట్లయితే వెంటనే నడవకూదు. కనీసం 15 నుంచి 30 నిమిషాలు విరామం ఇచ్చి నడిస్తే మంచిది. వేగంగా కూడా నడవకూడదు. ఇది తిమ్మిర్లు, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. డిన్నర్ తర్వాత నడిస్తే కొందరికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాంటివాళ్లు ఉదయం, సాయంత్రాల్లో నడిచేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే తేలిక పాటి నడకే మంచిది. ఏదో కేలరీలు బర్న్ అవ్వాలి అన్నంతగా ఆ సమయంలో నడవకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.(చదవండి: ఆ నేత ఆలోచన 'వేరేలెవెల్'..గెలుపుని కూడా పర్యావరణ హితంగా..!) -
తిరుమలకు స్టార్ హీరోయిన్.. కాలి నడకన కొండపైకి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం నడిచి వెళ్లారు. సామాన్య భక్తులతో కలిసి దాదాపు ముడున్నర గంట పాటు నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. నడక మార్గంలో దీపికా పదుకుణేతో భక్తులు సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అనంతరం తిరుమలలోని రాధేయం అతిధి గృహం చేరుకున్నా దీపికా పదుకుణే.. ఇవాళ రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయమే స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. అనంతరం విఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.. -
దోస్తానా అంటే ఇదికదా! స్నేహితుడు మార్నింగ్ వాక్‌కి రావటం లేదని..
ఫ్రెండ్ అనే పదంలోనే.. ఏదైన సమస్య వస్తే మనల్ని బయటపడేలా అండగా నిలబడే వాడని అర్థం. సాయం చేయలేకపోయినా.. కనీసం మనకు పరిష్కరమైనా చెప్పి సమస్య నుంచి బయటపడే యత్నం చేస్తాడు. మంచి స్నేహితులను పొందడం అనేది ఓ గొప్ప వరం. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఇక్కడొక స్నేహితుడు వాకింగ్ చేయడానికి రావడం లేదని అతడి దోస్తులంతా చేసిన పని నిజంగా నవ్వు తెప్పిస్తుంది. ఏం చేశారంటే.. పాపం అతడు కూడా తమతో వాకింగ్‌కి వచ్చి సరదాగా గడపడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండాలని కోరుకున్నారు. ఎంతలా చెప్పి చూశారో ఏమో మనోడు అస్సలు వాకింగ్ వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు కాబోలు. దీంతో విసిగిపోయిన అతడి స్నేహితులు లాభం లేదనుకుని ఏకంగా బ్యాండ్ బాజాలతో అతని ఇంటికి వెళ్లి మరీ స్వాగతం పలికారు. దీంతో ఆ స్నేహితుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి.. వస్తాన్రా బాబు అని దండం పెట్టి మరీ వేడుకుంటున్నాడు. ఆపండ్రా ఆ బ్యాండ్ బాజాలు వాయించడం ఓ రెండు నిమిషాలు టైం ఇవ్వండి అని అడుగుతున్నా..ఆపద్దు వాయించండి వచ్చేంత వరకు అంటున్నారు అతడి దోస్తులు. స్నేహం అంటే ఇది కదా! స్నేహితుడి బద్ధకం వదిలించి మరీ వాకింగ్ తీసుకువెళ్లాలనుకుంటున్నా అతడి దోస్తులు నిజంగా గ్రేట్!. మేలు కోరే స్నేహితులు దొరకడం కూడా ఓ అదృష్టం కదూ!. Friend not coming for morning walk.. morning walk friends decided to go home with band baza... pic.twitter.com/yGimAsuS2z — Rakesh Reddy (@rakeshreddylive) October 31, 2023 (చదవండి: అద్భుతమైన డెవిల్స్ బ్రిడ్జ్! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!) -
ఈ మోడల్ ధరించిన కాస్ట్యూమ్ చూస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!
మోడలింగ్ చేసే అమ్మాయిలు కాస్ట్యూమ్స్ చాలా వెరైటీగా ఉంటాయి. కానీ ఇక్కడ ఓ మోడలింగ్ వేసుకున్న కాస్ట్యూమ్ చూస్తే మాటలు రావు. ఆమె ఎలా ధరించిందా అనే సందేహం వస్తుంది. వాట్ ఏ కాస్ట్యూమ్ అని అనుకుండా ఉండలేరు. అంత వెరైటీగా, షాకింగ్‌గా ఉంటుంది ఆ కాస్ట్యూమ్. చెన్నైలోని ఓ ఫ్యాషన్ షోలో ఓ మోడల్ చాలా వెరైటీ కాస్ట్యూమ్ వేసుకొచ్చింది. ఓ సాగరకన్య మాదిరిగా డ్రస్ వేసుకొచ్చింది. అక్కడితో ఆగలేదు. చక్కగా హోయలోలికిస్తూ నడస్తు ర్యాప్‌పై రాగా ఓ వ్యక్తి ఓ సంచిలో చేపలను తీసుకొచ్చి..ఆమె కాస్ట్యూమ్‌కి అమర్చిని బౌల్లో వేశాడు. ఏకంగా లైవ్ ఫిష్‌తో కూడాని కాస్ట్యూమ్‌తో ధగ ధగ మెరిసిపోయింది. అక్కడ ఉన్నవాళ్లంతా ఆ కాస్ట్యుమ్ని చూసి నిర్ఘాంతపోయారు. అందుకు సంబంధించని వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఐతే నెటిజన్ల మాత్ర ఓ రేంజ్‌లోనే ఫైర్ అయ్యారు. ఇలా జంతువులతో ఫ్యాషన్ షోల కోసం కామెడీ వేషాలు వేయొద్దని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Make over by Preethi (@ohsopretty_makeover) (చదవండి: బ్లాక్ యాపిల్ గురించి విన్నారా? ఒక్కొక్కటి ఏకంగా..) -
ఏడుపదుల వయసులో స్కూల్‌కి..అది కూడా 3 కిలోమీటర్లు..
చదువుకోవాలన్న తప్పన, జిజ్ఞాస ఉండేలా కాని చదువుకోవడానికి ఏ వయసు అయితే ఏంటి?. చదువుకోవాల్సిన టైంలో ఏవో కారణాల రీత్యా చదువుకోలేకపోవచ్చు. అవకాశం దొరికితే వదులుకోకుండా ఆ కోరిక నెరవేర్చుకోవచ్చు అని నిరూపించాడు ఓ వృద్ధుడు. వివరాల్లోకెళ్తే..మిజోరాంకు చెందిన లాల్రింగ్థరా అనే 78 ఏళ్ల వృద్ధుడు హైస్కూల్లో చేరి ఔరా అనిపించాడు. ఆ వయసులో కాలినడకన స్కూల్‌కి వెళ్లి మరీ చదువుకుంటున్నాడు. చదువుకి వయసు అడ్డంకి కాదు అని చేసి చూపించి ఆశ్చర్యపరిచాడు. ఆ వృద్ధుడు 1945లో ఇండో మయన్మార్ సరిహద్దు సమీపంలోని ఖువాంగ్లెంగ్ గ్రామంలో జన్మించాడు. రెండొవ తరగతి వరకే చదువుకున్నాడు. తండ్రి మరణంతో చదువుకు దూరమయ్యాడు. తన తల్లికి అతడు ఒక్కడే సంతానం కావడంతో తల్లికి చేదోడుగా పొలం పనులకు వెళ్తుండేవాడు. బతుకు పోరాటం కోసం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తూ..అలా న్యూహ్రుయికాన్ గ్రామంలో స్థిరపడ్డాడు. బాల్యం అంతా కటిక పేదరికంలోనే మగ్గిపోయింది. దీంతో లాల్రింగ్థరా చదువు అనేది అందని ద్రాక్షలా అయిపోయంది. ఇప్పుడు అతను ఓ చర్చిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతనిలో చదువుకోవాలనే కోరిక మాత్రం చావలేదు. అందువల్లే ఇక ఇప్పుడైన తన కోరిక తీర్చుకోవాలనే కృత నిశ్చయానికి వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఈ మేరకు లాల్రింగ్థరా మాట్లాడుతూ..తనకు చదవడం, రాయడంలో ఇబ్బంది లేదని, ఆంగ్లభాషలోని సాహిత్య పదాలు మాత్రం అర్థమయ్యేవి కావంటున్నాడు. ఎలాగైనా తన ఆంగ్ల భాషను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతోనే స్కూల్లో జాయిన్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు లాల్రింగ్థరా. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా అతను మా టీచర్ల బృందానికి, విద్యార్థులకు ఆదర్శమైన వ్యక్తి అని, అదే సమయంలో అతనికి నేర్పడం అనేది మాకు ఒక సవాలు కూడా అని అన్నారు. అతనికి తాము అన్ని విధాల మద్దతు ఇవ్వడమేగాక చదువుకోవడంలో తగిన సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. (చదవండి: ఇదేం విచిత్రం! ఆవు పాము రెండు అలా..) -
Kerala: చంపేస్తామన్న బెదిరింపు లేఖకి ఝలక్ ఇచ్చేలా..మోదీ రోడ్ షో
రెండు రోజుల కేరళ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీని ఆత్మహుతి దాడి చేసి చంపేస్తామని వచ్చిన బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ లేఖ నేపథ్యంలో..మోదీ తన రోడ్‌షోలకు విభిన్నంగా కొచ్చిలో మెగా రోడ్ షో నిర్వహించారు. ఆయన కారుదిగి స్వయంగా కాలినడకన రోడ్ షో ప్రారంభించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ బెదిరింపు లేఖకి ఝలక్ ఇచ్చేలా రోడ్ షో చేశారు. ఈ మేరకు ఆయన కేరళ సంప్రదాయ దుస్తులు, కసావు ముండు, శాలువా, కుర్తా ధరించి రహదారికి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ భద్రత కోసం వేలాది మంది పోలీసులు మోహరించారు. ఇదిలా ఉండగా మళయాళంలో కొచ్చి నివాసి రాసినట్లు వచ్చిన లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ కార్యాలయం అందుకున్నారు. ఆయనే పోలీసు చీఫ్‌కు ఈ లేఖను అందజేసినట్లు చెప్పారు కూడా. ఐతే పోలీసుల నుంచి లీక్ అయిన ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌ని ఘోర తప్పిదమని మండిపడ్డారు. దీన్ని కేంద్ర సహాయం మంతి మురళీధరన్ కూడా తీవ్రంగా ఖండించారు. ప్రధాని భద్రతా వివరాలు ఎలా వాట్సాప్‌లో లీక్ అయ్యి వైరల్ అయ్యిందనేది ముఖ్యమంత్రి వివరించాలన్నారు. దీని అర్థం హోం శాఖ కుదేలైందనే కదా అంటూ ఫైర్ అయ్యారు. కాగా, మోదీ కేరళ పర్యటలనో దాదాపు రూ. 3 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మోదీ కేరళలో బుధవారం తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్ల ద్వారా కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 ద్వీపాలను కలిపే ఒక రకమైన ప్రాజెక్ట్ అయిన కొచ్చి వాటర్ మెట్రోను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. Thank you Kochi! pic.twitter.com/hbuY9FRivM — Narendra Modi (@narendramodi) April 24, 2023 (చదవండి: 'బీజేపీ జీరో కావాలన్నదే నా కోరిక’) -
పెళ్లి కోసం వరుడు పాట్లు..రాత్రంత కాలినడకన వెళ్లి మరీ తాళి కట్టాడు!
డ్రైవర్ల సమ్మె కారణంగా వరడు నానాపాట్లు పడ్డాడు. పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడ్డాడు. చివరికి వరుడు కుటుంబం కాలినిడకన వధువు ఇంటికి చేరుకుని మరీ ఆ వధవరులకు వివాహం జరిపించారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఒడిశాలోని కల్యాణ్ సింగ్‌పూర్ బ్లాక్ పరిధిలోని సునఖండి పంచాయతీలో నివసిస్తున్న వరుడు 28 కి.మీ దూరంలో ఉన్న దిబలపాడు గ్రామానికి రాత్రంతా నడిచి మరి వధువు ఇంటికి చేరుకుని పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐతే శుక్రవారం ఆ జంటకి వివాహం ఘనంగా జరిగింది. ఇదిలా ఉండగా, ఒడిశాలో డ్రైవర్లు భీమా, ఫించన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితరాలను కావాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ ఏక్తా మహాసంఘ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మే చేపట్టింది. 90 రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మెని తమ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిలిపేశారు. రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పి కె జెనా, డీజేపీ ఎస్ కే బన్సక్ సమ్మెను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసిన కొద్ది గంటలే డ్రైవర్ల ఏక్తా మహాసంఘ్ సమ్మెను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు రెండు లక్షల మంది డ్రైవర్ల సమ్మె కారణంగా కార్యాలయాలకు వెళ్లేవారు, పర్యాటకులు, సామాన్యులు ఎంతగానే ఇబ్బందిపడ్డారు. ఈ సమ్మె కారణంగా ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి కూడా. (చదవండి: మద్యం మత్తులో కళ్యాణ మండపానికి వెళ్లడం మర్చిపోయిన వరుడు) -
నడకతో గుండె పదిలం..!
వాషింగ్టన్ : ప్రతిరోజూ ఉదయం లేవగానే కాస్త అటూ ఇటూ నడిస్తే మీ గుండెకు వచ్చే ముప్పు తగ్గుతుందని మరోసారి తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోజుకి 6 వేల నుంచి 9 వేల అడుగులు వేసే వారిలో గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం సగానికి సగం తగ్గిపోతోందని ఆ అధ్యయనం తెలిపింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన జర్నల్ సర్క్యులేషన్ తాజా అధ్యయనం వివరాలను ప్రచురించింది..ఆ అధ్యయనం ప్రకారం రోజుకి 9 వేల అడుగులు నడిచే వారిలో గుండె వ్యాధులు వచ్చే ముప్పు 40–50 శాతం తగ్గిపోతుంది. మధ్య వయస్కులు రోజుకి 6 వేల నుంచి 9 వేల అడుగులు నడిస్తే గుండె సంబంధిత వ్యాధులు సోకే అవకాశం 50% తగ్గిపోతుంది. ఇక 60 ఏళ్ల వయసు పైబడిన వారు ఎంత ఎక్కువ నడిస్తే వారి గుండెకు అంత మంచిది. యుక్త వయసులో ఉన్న వారి గుండె ఆరోగ్యానికి, వారి నడకకు ఎలాంటి సంబంధమూ లేదు. నడకకి, గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న లింకుపై ఇప్పటివరకు జరిగిన ఎనిమిది అధ్యయనాల ఫలితాల్ని క్రోడీకరించి తాజా అధ్యయనాన్ని రూపొందించారు. 18 ఏళ్లకు పైబడిన వయసున్న వారు 20,152 మంది ఇందులో పాల్గొన్నారు. ఆరేళ్లపాటు వారి స్మార్ట్ వాచ్‌లు, ఫోన్ల్లో రికార్డయిన వివరాల ద్వారా తాజా అధ్యయనాన్ని రూపొందించారు. -
ఏం అమ్మాయి.. ఒంట్లో ఎముకలు లేవా ఏం?
ఒంట్లో ఎముకలే లేవన్నట్లుగా వెనక్కి, ముందుకు ఏ ఆకృతిలోనైనా వంగిపోగల బ్రిటిష్ టీనేజర్ ఈమె. పేరు లిబర్టీ బారోస్. వయసు 14 ఏళ్లు. వెనక్కి వంగి మోకాళ్లు పట్టుకుని అత్యంత తక్కువ సమయంలో 20 మీటర్ల దూరం నడిచి గిన్నిస్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అదీ 22 సెకన్లలోనే. అందులో గిన్నిస్ బుక్‌లోకి ఆమె పేరు ఎక్కింది. గురువారం లండన్‌లో ఈ ఘనత సాధించింది. #LibertyBarros poses with her #GuinnessWorldRecords' certificate for achieving the fastest 20m back bend knee lock, in London, Britain, November 10, 2022. pic.twitter.com/oCdDiwbM41 — 香港商報 (@hkcd_HK) November 10, 2022 -
డల్లాస్‌లో నాట్స్ 5కే రన్/1కే ఫన్ వాక్
టెక్సాస్: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్ లో 5కే రన్/1కే ఫన్ వాక్, ఫుడ్ డ్రైవ్ లను నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ప్రతి ఏటా గాంధీ జయంతి సందర్భంగా మన తెలుగువారిలో ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తోంది. ఇందులో వారిని భాగస్వాములను చేసేందుకు ఈ కార్యకమాన్ని 2014 నుంచి నిర్వహిస్తూ వస్తుంది. డల్లాస్-ఫోర్టువర్తు మెట్రో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి దాదాపు 100 మందికి పైగా ఈ రేసులో పాల్గొన్నారు. ఫిటెనెస్ కోసం పరుగులు పెట్టే వారంతా 5కె రన్లో పాల్గొంటే.. ఆరోగ్యం కోసం 1కే ఫన్‌లో సరదాగా నడస్తూ ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఈ పరుగు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రేస్ బిబ్స్ ను అందించడం జరిగింది. దీని ఆధారంగా వారు 5K రన్ పూర్తి చేయటానికి తీసుకున్న సమయం, వారి వయోపరిమితి ఆధారంగా తీసుకోవడంతో పాటు మొదటి మూడు స్థానాలలో నిలిచిన వారిని విజేతలుకు పతకాలను అందించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల ఈ రన్ విజయవంతం కావడానికి తన వంతు సహకారం అందించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యక్రమాలకి తమ సహాయ సహకారాలను అందిస్తున్న అందరికి చాప్టర్ కోఆర్డినేటర్ సత్య శ్రీరామినేని ధన్యవాదాలు తెలిపారు. స్వాగత్ బిర్యానీస్ ఇండియన్ క్యూసిన్, ఫార్మ్ 2 కుక్, హిండ్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, ఏజ్నిక్స్ ఫార్మాస్యూటికల్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాల్వేషన్ ఆర్మీ కోసం నాట్స్ ఫుడ్ డ్రైవ్ నాట్స్ ప్రతి ఏటా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ఫుడ్ డ్రైవ్ కూడా డల్లాస్ నాట్స్ విభాగం ఈ 5కే రన్‌తో పాటు నిర్వహించింది. ఈ ఫుడ్ డ్రైవ్ కి కూడా మన తెలుగు వారి నుంచి విశేష స్పందన లభించింది. దీని ద్వారా విరాళంగా వచ్చిన ఆహారాన్ని డల్లాస్‌లోని స్థానిక సాల్వేషన్ ఆర్మీకి విరాళంగా అందించారు. డల్లాస్ టీం క్రీడా విభాగ నాయకులు గౌతం కాశిరెడ్డి, నాట్స్ డల్లాస్ చాప్టర్ కో-కోర్డినేటర్ రవి తాండ్ర, డల్లాస్ టీం సభ్యులు శ్రీథర్ న్యాలమడుగుల, రవీంద్ర చుండూరు, శ్రీనివాస్ ఉరవకొండ, త్రినాథ్ పెద్ది, యషిత, రేహాన్, సందీప్ తాతినేనితో పాటు ఇతర సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ డల్లాస్ విభాగం చేపట్టిన రన్, ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా క్రీడా విభాగ సభ్యులకు నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
దేశమంతా పాదయాత్ర
కోచి: కేరళలోని కొట్టాయానికి చెందిన బెన్నీ కొట్టార్తిల్ (53), ఆయన భార్య మోలీ బెన్నీ (46) దేశమంతటినీ కాలినడకన చుట్టొచ్చారు. ఈ ఘనత సాధించిన తొలి జంటగా నిలిచారు. 2021 డిసెంబర్ 1న కన్యాకుమారిలో మొదలు పెట్టి జూలై 3న ముగించారు. మొత్తం 17 రాష్ట్రాలను కవర్ చేశారు. ప్రజల్లో నడకపై అవగాహనను మరింత పెంచేందుకే పాదయాత్ర చేసినట్టు చెబుతున్నారు. ‘‘యాత్ర పొడవునా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. బిహార్‌లో ఓ రాత్రి ఎక్కడా ఆశ్రయం దొరక్క శ్మశానంలో తలదాచుకున్నాం! పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం అన్నింటికంటే ఎక్కువగా నచ్చింది. ఆంధ్రా స్టైల్ భోజనానికి ఏదీ సాటి రాదు’’ అన్నారు. యాత్రానుభవాలను సొంత యూట్యూబ్ చానళ్లో పంచుకున్నారు. స్పాన్సర్లు దొరికితే మళ్లీ పాదయాత్రకు సిద్ధమంటున్నారు! -
‘గే’ స్ హర్ట్ అవుతున్నారు.. ఎందుకు?
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఎస్... ఐ యామ్ గే. సిగ్గెందుకు.. చెప్పుకోడానికి?! నేను అబ్బాయిని. కానీ అమ్మాయిలకు ఎట్రాక్ట్ కాను. ఇందులో తప్పేముంది? నేను అమ్మాయిని. కానీ అబ్బాయిలు నన్ను ఎట్రాక్ట్ చెయ్యలేరు. ఇందులో ఒప్పుకానిది ఏముంది? ప్రకృతి ధర్మం ఒకటి ఉంటుంది కదా అంటుంది లోకం. ప్రకృతి ఒక్కటేనా ధర్మం? ప్రకృతి విరుద్ధ ధర్మాలు ఉండవా?! అబ్బాయిల దగ్గర మాత్రమే కంఫర్ట్ ఫీలయ్యే అబ్బాయిలు, అమ్మాయిల ఆలింగనాలలో మాత్రమే ఆలంబన పొందే అమ్మాయిలు అడుగుతున్న ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా? లేదు. సానుభూతి ఉందా? లేదు. సహానుభూతి ఉందా? అదెలాగూ ఉండదు. సాఫ్ట్ కార్నర్ ఉందా? ఎప్పటికైనా ఏర్పడుతుందేమో తెలీదు. మరేముంది? అభ్యంతరం ఉంది. అసహనం ఉంది. అవహేళన ఉంది. ‘ఎట్లానో చావండి. మీ ఒంట్లో ఏం జరుగుతోందో మా కంట్లో పడనివ్వకండి’ అని దూరంగా జరిగిపోయేంత ఈసడింపు ఉంది. ‘గే’ స్ హర్ట్ అవుతున్నారు. నేచురల్ బాధ అనేది సాధారణ జెండర్లకు ఉండి, ట్రాన్స్జెండర్లకు లేకుండా పోతుందా?! ఎవరైనా మనుషులే కదా. బాధ పడతారు. అయితే వారి బాధ.. వాళ్లని మనం గుర్తించడం లేదని కాదు. వాళ్లని మనం గౌరవించడం లేదని కాదు. మరి? వాళ్లేమిటో వాళ్లని చెప్పుకోనివ్వడం లేదని! మగదీరుడిగా నిన్ను నువ్వు ఎగ్జిబిట్ చేసుకుంటావు. కోమలాంగిగా నిన్ను నువ్వు రిప్రెజెంట్ చేసుకుంటావు. మరి గే గా నన్నెందుకు బయట పడనివ్వవు అని నేస్తం సంస్థ ప్రతినిధులు నిగ్గుదీసి నిలదీస్తున్నారు. ఇది నేను..నాలా‘గే’ ఉంటానని థర్డ్‌జెండర్స్ బీచ్ రోడ్డులో గర్వంగా ప్రైడ్వాక్ వాక్ చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పునిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. మేమూ సాధారణ వ్యక్తులమే..మాకూ హక్కులున్నాయి. మమ్మల్నీ గౌరవించండంటూ నేస్తం సంస్థ ఆధ్వర్యంలో వైజాగ్ క్వీర్ ఆత్మాభిమాన్ యాత్ర పేరుతో ప్రైడ్ వాక్ ను ఆదివారం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహం నుంచి ఆర్కేబీచ్ వరకు సాగిన ఈ వాక్‌ను జిల్లా హెచ్ఐవీ నియంత్రణ ప్రొగ్రాం మేనేజర్ శైలాజ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టాలు ప్రతి ఒక్కరికి నచ్చినట్టు జీవించే హక్కును కల్పించాయన్నారు. ఎవరి హక్కులను మనం వ్యతిరేకించారదన్నారు. థర్డ్‌జెండర్, స్వలింగ సంపర్కులపై వివక్ష చూపించడం సరైంది కాదన్నారు. వారు కూడా మనలో ఒకరిగా మనం గుర్తించి వారికి మనోధైర్యం కల్పించాలన్నారు. ఈ వాక్కు పలు ఎన్జీవోలు, కాలేజీ విద్యార్థులు మద్దతిచ్చారు. రాష్ట్రంలో మొదటి ప్రైడ్ వాక్.. స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్ వారి హక్కుల కోసం రాష్ట్రంలో మొదటి సారిగా విశాఖలో ప్రైడ్ వాక్‌ను నిర్వహించినట్టు నిర్వహకులు తెలిపారు. ఈ వాక్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొందరు పాల్గొన్నారు. తమపై వివక్ష పూర్తిగా పోయే వరకు ఇటువంటి వాక్‌లను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఇది తొలి మెట్టు.. ఇంత భారీ వర్షంలో కూడా అనేక మంది వచ్చిన ఈ ప్రైడ్ వాక్‌లో పాల్గొనడం తొలిమెట్టుగా భావిస్తున్నాం. స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్ హక్కుల కోసం రాష్ట్రంలో తొలి సరిగా నిర్వహించిన ఈ వాక్కు ఎన్జీవోలు, విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. స్వలింగ సంపర్కులు, థర్డ్జెండర్పై ప్రజలు చూపిస్తున్న వివక్ష పోయే వరకూ పోరాటం ఆగదు. – విశ్వతేజ్, రాష్ట్ర స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి మా సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఇందుకు కోసం ఒక ప్రత్యేకమైన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సరిగా మా ఆత్మ గౌవరం కోసం ఎంతో ధైర్యంతో ప్రైడ్ వాక్‌ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వాక్ ద్వారా ప్రజల్లో ప్రేరణ వస్తుందని ఆశిస్తున్నాను. అందరితో పాటు మాకు సమాన హక్కులున్నాయని ప్రజలు గుర్తించాలి. – కృష్ణమ్మ, హైదరాబాద్ హక్కుల కోసం ఒకే వేదికపై.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్స్ అంతా ఒకే వేదికపైకి వచ్చి హక్కుల కోసం మొదటి సరిగా ప్రైడ్ వాక్ నిర్వహించడం చాలా ధైర్యాన్ని ఇచ్చింది. మా హక్కులను హరించవద్దని కోరుతున్నా. మాపై వివక్ష చూపించకుండా అందరిలానే సమానంగా చూడాలని కోరుకుంటున్నా. – నందిత, ట్రాన్స్ మహిళ మేము మానసిక రోగులం కాదు ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి నచ్చడం, అబ్బాయికి అబ్బాయి నచ్చడం మానసిక రోగం కాదు. సుప్రీం కోర్టు కూడా ఇంటువంటి ఆలోచనలు కలిగిన వారిని కాన్వర్జేషన్ థెరిపీ చేయటం నిషేధించింది. నేను ఈ వాక్ ద్వారా స్వలింగ సంపర్కులు, థర్డ్‌జెండర్ ఎదుర్కొంటున్న వివక్షకు గురవుతున్నవారి బాధలు తెలుసుకున్నా. – భావ్య, క్వీర్ పర్సన్ -
చేపా చేపా.. వాకింగ్‌కు వస్తావా?
చాలా మందికి కుక్కలో, పిల్లులో, ఇతర పెంపుడు జంతువులో ఉంటాయి.. అప్పుడప్పుడూ వాటిని తీసుకుని అలా వాకింగ్‌కు వెళ్లొస్తుంటారు కూడా. మరి చేపలను పెంచుకునేవారి పరిస్థితి ఏమిటి? వాటిని ఎలా తీసుకెళ్లడం?.. తైవాన్‌కు చెందిన హువాంగ్ జెర్రీ అనే యూట్యూబర్‌కు ఇలాంటి సందేహమే వచ్చింది. అనుకున్నదే తడవుగా తాను పెంచుకుంటున్న గోల్డ్ ఫిష్‌లతో బయటికి వెళ్లే మార్గమేమిటా అని ఆలోచించాడు. ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న ‘వాకర్ ఫిష్ ట్యాంక్’ను తయారు చేసేశాడు. ఇదేదో అల్లాటప్పా ‘వాకర్ ఫిష్‌ట్యాంక్’ కాదు.. మంచి దృఢంగా ఉండే ఆక్రిలిక్ ఫైబర్ గాజు, గట్టి ఉక్కు మెటీరియల్‌తో రూపొందించాడు. చేపలకు ఆహారం వేసేందుకు ఏర్పాటు చేశాడు. ట్యాంకులోని నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసే చిన్నపాటి ఫిల్టర్‌ను.. నీటిలో ఆక్సిజన్ సరిగా ఉండేందుకు.. గాలిని పంపే ఎయిర్‌పంప్‌ను అమర్చాడు. ఇవి నడిచేందుకు ఓ బ్యాటరీని అనుసంధానించాడు. ఇంకేం.. నీళ్లు మార్చాల్సిన అవసరం లేకుండానే.. ఎక్కడికైనా, ఎంతసేపైనా ‘ఫిష్’తో వాకింగ్‌కు వెళ్లొచ్చన్నమాట. హువాంగ్ ఇలా తన చేపలతో వాకింగ్‌కు వెళితే.. జనమంతా కళ్లప్పగించి చిత్రంగా చూశారట. ఇటీవల యూట్యూబ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. తినేందుకు వాడేస్తున్నారట.. ఇంతకుముందు జపాన్‌కు చెందిన ఎంఏ కార్పొరేషన్స్ చేసిన ‘పోర్టబుల్ ఫిష్ ట్యాంక్’ ఇది. ఎక్కడికైనా అలా చేతిలో పట్టుకుని వెళ్లిపోయేలా దీనిని రూపొందించారు. ట్యాంక్‌లోని నీళ్లలో ఆక్సిజన్ స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించే ఏర్పాటూ ఉంది. అయితే దీన్ని చేపలు పెంచుకునేవారితోపాటు.. చేపలు, పీతలు వంటివి ఫ్రెష్‌గా తినాలనుకునేవారు వాటిని తెచ్చిపెట్టుకునేందుకు ఈ ట్యాంక్‌ను వాడేస్తున్నారట. -
అదిరిన కోతి నడక.. అచ్చం మనిషిలాగే
కోతి.. ఈ పేరు వినగానే అందరికి అది చేసే అల్లరే గుర్తుకు వస్తుంది. అందుకే పిల్లలు అల్లరి చేస్తే వారిని కోతి చేష్టలు అంటారు. కోతులు వేటిని కుదురుగా ఉంచవు. అన్నింటినీ కిందపడేసి, అటూ ఇటూ పరుగెత్తుతాయి. కుదురుగా ఒక చోట ఉండవు. నానా హంగామా చేస్తాయి. కోతుల చేష్టలు ఎక్కువగా మనుషులను పోలి ఉంటాయి. మనుషులు ఏం చేస్తే అవి వాటిని అనుకరిస్తాయి. తాజాగా ఓ కోతి చేసిన వినూత్న పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెరువు పక్కన ఉన్నరోడ్డుపై వెళ్తున్న కోతి అచ్చం మనిషిలాగా రెండు కాళ్లతో నడుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిని నేచర్ లైఫ్ పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో కోతి ఒక సరస్సు సమీపంలోని రోడ్డుపై ఒక వ్యక్తిలాగా రెండు కాళ్లపై మీద దర్జాగా నడుస్తూ కనిపిస్తుంది. దీనిని చూస్తుంటే ఎంతో స్టైల్‌గా క్యాట్ వాక్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. అనంతరం బ్రిడ్జిపైకి దూకి దానిపై చకాచకా గెంతుతుంది. చదవండి: అదిరిన కోతి నడక.. అచ్చం మనిషిలాగే ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుండటంతో ఇప్పటి వరకు మిలియన్‌కు పైగా వ్యూవ్స్ వచ్చాయి. ఇక కోతి స్టైల్ చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. కోతి మోడల్‌గా మారి ర్యాంప్ వాక్ చేస్తుంది. బాడీ బిల్డింగ్ పోటీలకు రెడీ అవుతుందేమో.. మంచి ట్రైనింగ్ ఇచ్చారు’. అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Travel | Nature | adventure (@naturelife_ok) -
అత్యద్భుతమైన ప్రపంచ రికార్డు...చూస్తే వెన్నులో వణుకుపుడుతుంది!
సాహసోపేతమైన ప్రపంచ రికార్డులు చూస్తే.. అవి నిపుణుల పర్యవేక్షణలో సాధన చేస్తే సాధ్యమనిపిస్తుంది. మరికొన్ని ఫీట్లు సాధ్యమేనా ? అనే సందేహన్ని కలిగిస్తాయి. చాలా వరకూ ఆయా వ్యక్తుల అభిరుచి, ఒక విభిన్నమైన వ్యక్తిగా నిలవాలనే తపన వంటి లక్ష్యాలతోనే ఇలాంటి ప్రపంచ రికార్డులను నెలకొల్పగలరేమో !. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సాధించిన ప్రపంచ రికార్డును చూస్తే చేయగలమా? అని సందేహం కచ్చితంగా వస్తుంది. ప్రయత్నించాలన్నా భయంగానే ఉంటుంది. ఎందుకంటే అది అత్యంత భయంకరమైన సాహసోపేతమైన ప్రపంచ రికార్డు. వివరాల్లోకెళ్తే...బ్రెజిల్‌కి చెందిన రాఫెల్ జుగ్నో బ్రిడి అనే వ్యక్తి రెండు పారాచూట్ల మధ్య కట్టిన తాడుపై నడిచాడు. తాడు వెడల్పు కేవలం 25 సెం.మీ. అంతేకాదు అతను సుమారు ఒక వెయ్యి మీటర్లు(6,236 అడుగుల) ఎత్తులో తాడు పై నడిచాడు. అంటే బుర్జ్ ఖలీప్ కంటే రెంట్టింపు ఎత్తులో గాల్లో రెండూ పారాచూట్ల మధ్య కట్టిన తాడుపై నడిచాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలోని ప్రియా గ్రాండేలో చోటుచేసుకుంది. నిజానికి ఆఫీట్ చూస్తే భయాందోళనతో పాటు ఆశ్చర్యమూ కలుగుతుంది. ఈ మేరకు ఈ రికార్డుకు సంబంధించిన ఫీట్‌ని గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ ఫీట్ చూస్తే కాళ్లల్లో వణుకు కుపుడుతోందని ఒకరు, ఇది ప్రపంచం గుర్తించదగ్గ రికార్డు అంటూ బ్రిడిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఓరిని తెలివి.. పరీక్షల్లో ఇలా కూడా కాపీ కొడతారా.. అయినా దొరికిపాయే!) -
నన్ను ట్రోల్ చేయండి.. నా కూతురి జోలికొస్తే ఊరుకోను: హీరో
Abhishek Bachchan Lashes Out At Trolls Attacking Daughter Aaradhya: సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తైనా క్షణాల్లో వైరలవుతుంది. వారితో పాటు వాళ్ల ఫ్యామిలీపై కూడా జనాల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఇబ్బందిగానూ అనిపిస్తుంది. తమ అంచనాలకు తగ్గట్లు వారితో ఏమాత్రం మార్పులు కనిపించినా జనాలు తెగ ట్రోల్ చేసేస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్‌లకు సైతం ఎదురైంది. ఇటీవలె కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లిన బచ్చన్ ఫ్యామిలీ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంట పడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్ వెళ్లింది. ఐశ్వర్య ఎప్పుడూ కూతురి చేయి పట్టుకొనే నడిపించడం, ఆరాధ్య వంకరగా నడుస్తుందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న అభిషేక్ బచ్చన్.. తన కూతురి నడకపై చేస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. నేను పబ్లిక్ ఫిగర్‌ని. నన్ను ఎంతైనా ట్రోల్ చేయండి పడతాను. కానీ నా కూతుర్ని అనేడానికి మీకు హక్కు లేదు. దమ్ముంటే ఆ మాటలు నా ఎదురుగా వచ్చి అనండి అంటూ ట్రోలర్స్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం అభిషేక్ చేసిన ఈ కామెంట్స నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బ్రిటన్ రాణి తొలిసారి అలా కనిపించడంతో.. షాక్‌లో ప్రజలు
లండన్: బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2కు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలనే ఆసక్తి యూకే ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరికి ఉంటుంది. మరి ఆమే ఏం పడుచు పిల్ల కూడా కాదు. బ్రిటన్ రాణి వయసు ప్రస్తుతం 95 సంవత్సరాలు. ఈ ఏజ్‌లోనూ రాణివారు ఎంతో ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంటారు. బహుశా ఈ విషయమే ప్రజలకు ఆసక్తి రేకెత్తిస్తుంటుంది. చదవండి: బ్రిటన్ మహారాణి కన్నుమూస్తే...! సాధారణంగా ఇప్పటివరకు ఎలిజబెత్ రాణి బయట ఎక్కడ కనిపించినా ఎవరి సాయం లేకుండా స్వతహాగా నడుస్తూ ఉంటారు. అయితే తొలిసారి ఎలిజబెత్ తన చేతిలో కర్ర పట్టుకొని బయటకు వచ్చారు. మంగళవారం లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో చర్చిలో సమావేశానికి హాజరైన ఎలిజబెత్ కర్ర సాయంతో నడుస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కారు.ఘీ 95 ఏళ్ల చక్రవర్తి ఆమె కుమార్తె ప్రిన్సెస్ అన్నేతో కలిసి నల్ల కర్ర పట్టుకుని కారు నుంచి బయటకు దిగారు. చదవండి: ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే బ్రటిన్ రాణి కర్ర పట్టుకొని నడవడం చాలా అరుదు కావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె అనారోగ్యానికి గురయ్యారేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2004లో మోకాలి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చివరిసారిగా ఆమె కర్రను పట్టుకొని కనిపించారు. అయితే ప్రస్తుతం ఎలిజబెత్ ఇలా ఎందుకు కర్రను ఉపయోగించాల్సి వచ్చిందో ఆమె కార్యాలయం కారణం వెల్లడించలేదు. -
భార్యపై కోపంతో 418 కి.మీ నడక
ద రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ లైక్ ఎ ఫిష్ అండ్ ద వాటర్.. బట్ నాట్ లైక్ ఫిష్ అండ్ ద ఫిషర్ మ్యాన్..ఇంగ్లిష్‌లో అంత క్లియర్‌గా చెప్పినా సరే.. తెలుగు సినిమాలోని ఈ డైలాగును ఇటలీకి చెందిన దంపతులు పెద్దగా విన్నట్లు లేరు.. విన్నా.. అస్సలు పట్టించుకున్నట్లే లేరు. తెల్లారి లెగిస్తే చాలు.. మిగతా పనులన్నీ వదిలేసి.. గొడవ పెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు వాళ్లు.. ఇలాగే ఈ మధ్య ఓ రోజు మళ్లా కస్సుబుస్సుమన్నారు.. మాటామాటా పెరిగింది.. మొగుడు అని కూడా చూడకుండా కొంచెం గట్టిగానే వాయించేసింది.. అంతే.. ఆ ఒక్క మాటతో లేచి.. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని.. అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.. వెళ్లిపోవడం అంటే.. మీరు నేను మారి్నంగ్ వాక్కు వెళ్లినట్లు వెళ్లిపోవడం కాదు.. ఏదో ఊరెళ్లినట్లు వెళ్లిపోయాడు.. కోపం తగ్గేదాకా.. చివరికి పోలీసులు ఆపేదాకా.. నడుచుకుంటూ వెళ్లిపోయాడు.. ఎంత దూరమో తెలుసా? 418 కిలోమీటర్లు!! వినడానికి నమ్మదగ్గ విషయంలా లేకున్నా.. ఇది నిజమేనట. ఇటలీ పోలీసులే చెప్పారు. గిమర్రా పట్టణంలో లాక్డౌన్ కర్ఫ్యూను ఉల్లంఘించి.. ఓ వ్యక్తి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడనే సమాచారం రావడంతో ఓ పోలీసు పెట్రోల్ కార్ అతనిని అడ్డగించింది.. ఆరా తీస్తే.. మొత్తం విషయం చెప్పాడు.. పైగా... ఇతను తప్పిపోయినట్లు భార్య ఇచి్చన ఫిర్యాదు కూడా ఉండటంతో పోలీసులు అతనిని స్టేషన్‌కు తీసుకెళ్లారు.. ‘నా భార్యపై కోపంతో అలా నడుస్తూ వెళ్లిపోయాను.. వారం రోజులుగా నడుస్తూనే ఉన్నాను. దారిలో కొందరు దయతో ఇచ్చిన ఆహారం, నీరు తాగి.. ఇన్ని రోజులు ఉన్నా.. నేను బాగానే ఉన్నా.. కాకపోతే.. కొంచెం ఆలసిపోయా అంతే’ అని కోమోకు చెందిన ఈ 48 ఏళ్ల వ్యక్తి చెప్పాడు. మొత్తం విషయం విని.. నోరెళ్లబెట్టిన ఇటలీ పోలీసులు.. మళ్లీ ఎక్కడికి వెళ్లిపోతాడో అన్న భయంతో ఇతని భార్య వచ్చేంతవరకూ జాగ్రత్తగా చూసుకుని.. ఆమె రాగానే దగ్గరుండి అప్పగించారట.. ఇంతకీ ఈ మొత్తం స్టోరీలో నీతి ఏమిటి? మీరు విజు్ఞలు.. గ్రహించే ఉంటారు.. మేం మళ్లీ చెప్పాలా ఏమిటి?? – సాక్షి సెంట్రల్ డెస్క్ -
భోజనం కోసం ప్రతిరోజూ 25 కిలోమీటర్లు..
పిఠాపురం: కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.. ఒకరిపై ఆధార పడకూడదనుకున్న వారు తమ కాళ్లపై తాము నిలబడి బతికున్నంత కాలం తనకు వచ్చిన రీతిలో పొట్ట నింపుకుంటారు. ఆ కోవకే చెందిన వాడే కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన పెంకే రామకృష్ణ (70). ఆయన కుటుంబం పూర్వం చాలా ఉన్నత కుటుంబమైనా కాలగర్భంలో ఆస్తులన్ని కరిగిపోగా కన్నవారు ఉన్న వారు దూరమవ్వడంతో రామకృష్ణ ఒంటరిగా మిగిలి పోయాడు. తోబుట్టువులున్నా ఎవరి దారి వారు చూసుకోగా అవివాహితుడిగా ఉండిపోయిన రామకృష్ణ కాయకష్టం చేసుకుని జీవించేవాడు. స్థానికంగా ఖాళీగా ఉండే అరుగులే ఆయన నివాస స్థావరాలు. కాగా చిన్న చిన్న పనులు చేస్తు వచ్చిన దానితో పొట్ట నింపుకునే ఆయనకు అన్నదాతగా పిఠాపురంలోని గోపాల్‌బాబా ఆశ్రమం ఆసరాగా నిలిచింది. సుమారు పదేళ్ల క్రితం ఇక్కడ ఆశ్రమం స్థాపించిన నాటి నుంచి ఇక్కడ జరిగే ఉచిత అన్నదానంకు రామకృష్ణ వెళ్లడం ప్రారంభించాడు. ఉప్పాడ నుంచి పన్నెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురంలో గోపాల్‌బాబా ఆశ్రమానికి ఆయన ప్రతిరోజు నడిచి వెళ్లి భోజనం చేసి తిరిగి నడిచి ఉప్పాడ చేరుకుంటుండడం నిత్యకృత్యంగా మారింది. ఉదయం ఆరు గంటలకు ఉప్పాడలో టీ తాగి చిన్న చేతి కర్ర సాయంతో కాలి నడకన బయలు దేరే మధ్యాహా్ననికి పిఠాపురం చేరుకుని ఆశ్రమంలో భోజనం చేసి మళ్లీ కాలి నడకన సాయంత్రానికి ఉప్పాడ చేరుకుని ఒక అరుగుపై రాత్రి బస చేస్తుంటాడు. రోజూ అంత దూరం నడిచే బదులు ఆశ్రమంలోనే తలదాచుకోవచ్చు కదా అని ఎవరైనా అడిగితే సాయంత్రానికి తన పుట్టిన ఊరు చేరుకోపోతే తనకు నిద్ర పట్టదంటూ చెప్పడం విశేషం. ఎంత ఎండ కాసినా వర్షం వచ్చినా అతని కాలినడక మాత్రం ఆగదు. ఇదో రకం జీవన పోరాటం. -
పర్వతాల దెయ్యాన్ని ఈ పార్కు దగ్గర చూడొచ్చు..!
డెహ్రడూన్: అరుదైన మంచు చిరుత ఒకటి ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి నేషనల్ పార్కు సమీపంలోని నెలాంగ్ వ్యాలీలో ఇటీవల దర్శనమిచ్చింది. పార్కు పక్కన ఉన్న రోడ్డు మీద నుంచి నడుస్తూ ఓ పర్వతం వైపు వెళ్లింది. చిరుత రోడ్డుపై సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రపంచంలోనే ప్రత్యేకమైన జాతికి చెందిన ఈ చిరుత వీడియోను పర్వీన్ కస్వాన్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేశారు. ‘పర్వతాల దెయ్యం.. ప్రపంచంలోనే అరుదైన జాతి చిరుత.. గంగోత్రి నేషనల్ పార్క్ దగ్గర రోడ్డు మీద చూడొచ్చు’ అనే కాప్షన్‌తో అతను వీడియో షేర్ చేశాడు. ఈ ట్వీట్‌పై పలువురు కామెంట్ చేశారు.ఈ చిరుతను చూసిన వారు చాలా అదృష్టవంతులని ఒకరు.. ఆ మంచు చిరుత చాలా అందంగా ఉందని మరొకరు కామెంట్ చేశారు. ఎతైన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం.. ప్రపంచంలోని అత్యంత ఎతైన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో గంగోత్రి నేషనల్ పార్క్ ఒకటి. సముద్రమట్టం నుంచి సుమారు 11 వేల అడులు ఎత్తులో ఈ పార్కు ఉంది. ఇక నెలాంగ్ వ్యాలీ చైనా సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ ఐటీబీపీ యూనిట్లు ఉంటాయి. ఇక ఈ అరుదైన మంచు చిరుతల ఉనికి ఉత్తరఖండ్తో పాటు హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఉంది. నెలాంగ్ వ్యాలీలో మంచు చిరుతలతో పాటు హిమాలయ నీలం గొర్రెలు, అంతరించిపోతున్న కస్తూరి జింక జాతులు కూడా ఉన్నాయి. -
6 నెలల్లో షూ మార్చేస్తున్నారు
సాక్షి, అమరావతి: దేశీయ యువత తక్కువ బరువు ఉన్న స్పోర్ట్స్ షూలవైపు అత్యధికంగా మొగ్గుచూపుతున్నారని, ఒకసారి విడుదలైన మోడల్ ఆరు నెలలకు మించి ఉండటం లేదని ప్రముఖ పాదరక్షల సంస్థ ‘వాకరూ’ చైర్మన్ వి.నౌషద్ తెలిపారు. దేశీయ మిలీనియల్స్(యువత) ప్రతీ ఆరు నెలలకు ఒకసారి మోడల్స్‌ను మార్చేస్తున్నారని, ఇందుకోసం పాదరక్షల సంస్థ కొత్త మోడల్స్ విడుదలపై అత్యధికంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం విజయవాడ పర్యటలనకు వచ్చిన నౌషద్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పాదరక్షల విషయంలో ప్రజల అభిరుచులు, అభిప్రాయాలు వేగంగా మారుతున్నాయి, గతంలో కేవలం ఒక జత చెప్పులతో సరిపెడితే ఇప్పుడు సగటున అందరి వద్ద రెండు కంటే ఎక్కువ జతలు ఉంటున్నాయన్నారు. కానీ ఇది అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువని, ఆ దేశాల్లో ప్రతీ ఒక్కరు సగటున 4–6 జతలు కలిగి ఉంటున్నారన్నారు. దీంతో దేశీయ పాదరక్షల రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు అనేకమున్నాయన్నారు. ప్రస్తుతం దేశీయ పాదరక్షల పరిశ్రమ ఏటా 10 శాతం వృద్ధితో రూ.40,000 కోట్లకు చేరిందన్నారు. ఇందులో అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో దేశీయ తయారీ సంస్థలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. కొత్త మోడల్స్ విడుదల యువతను ఆకర్షించే విధంగా ఈ ఏడాది వాకరూ నుంచి కనీసం 100కు పైగా మోడల్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడు యువత చెప్పుల కంటే షూలకు ఎక్కువ మొగ్గు చూపుతుండటంతో షూలో కొత్త మోడల్స్ విడుదలపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 100 మందికి పైగా ఆర్అండ్డీ సిబ్బంది పనిచేస్తుండటమే కాకుండా యూరోపియన్ డిజైనర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. వాకరూకు దేశవ్యాప్తంగా ఉన్న 15 తయారీ కేంద్రాల నుంచి రోజుకు 5 లక్షల జతలు తయారవుతున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా తడ వద్ద ఉన్న తయారీ కేంద్రంలో 500 మంది పనిచేస్తున్నట్లు తెలిపారు. సొంత షోరూంలు ఏర్పాటు ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల విక్రయాల ద్వారా అమ్మకాలు చేస్తున్న తాము ఇక నుంచి ‘వాకరూ’ బ్రాండ్ పేరుతో ప్రత్యేక షోరూంలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్తు తెలిపారు. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లోని ముఖ్యమైన పట్టణాల్లో కనీసం 30 ఔట్లెట్లను ఫ్రాంచైజీ మోడల్లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆన్లైన్ విక్రయాలపై కూడా ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్తు వివరించారు. ఇప్పటి వరకు కేవలం ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా మాత్రమే విక్రయాలు జరుపుతున్నామని త్వరలోనే అమెజాన్‌తో పాటు మరికొన్ని ఆన్లైన్ రిటైల్ పోర్టల్స్‌తో పాటు సొంత పోర్టల్ ద్వారా కూడా ప్రొడక్టులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆదాయంలో కేవలం ఒక శాతంలోపు ఆన్లైన్ అమ్మకాల ద్వారా వస్తుంటే వచ్చే రెండేళ్లలో 5 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రూ. 1,000 కోట్ల వ్యాపార లక్ష్యం 2013లో ప్రారంభించిన వాకరూ ప్రస్తుత వ్యాపార పరిమాణం రూ.480 కోట్లకు చేరుకుందని, ఈ సంవత్సరం ఈ మొత్తం రూ.1,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కొత్త మోడల్స్, ప్రత్యేక ఔట్లెట్లు, భారీ ప్రచారం వంటి కారణాలతో ఈ ఏడాది వ్యాపారంలో రెట్టింపు వృద్ధిని ఆశిస్తున్నట్లు తెలిపారు. వాకరూ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమిర్‌ఖాన్‌ను ఎంపిక చేయడమే కలిసోచ్చే అంశమన్నారు. ఈ ఏడాది ప్రచారం కోసం రూ.30 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 550 డిస్ట్రిబ్యూటర్లు, 1.5 లక్షల మంది రిటైలర్లను కలిగి ఉన్నట్లు తెలిపారు -
వైఎస్ జగన్ సీఎం కావాలంటూ మోకాళ్లపై తిరుమల కొండకు
-
50 కి.మీ. నడక...
బీజింగ్: మహిళల 50 కిలోమీటర్ల నడక విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. చైనాలోని హువాంగ్షన్ పట్టణంలో శనివారం జరిగిన చైనీస్ రేస్ వాక్ గ్రాండ్‌ప్రి మీట్లో చైనాకు చెందిన లియు హాంగ్ ఈ ఘనత సాధించింది. 50 కిలోమీటర్ల దూరాన్ని లియు హాంగ్ 3 గంటల 59 నిమిషాల 15 సెకన్లలో అధిగమించి విజేతగా నిలిచింది. 4 గంటల 4 నిమిషాల 36 సెకన్లతో ఇప్పటిదాకా లియాంగ్ రుయి (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును లియు హాంగ్ బద్దలు కొట్టింది. 50 కిలో మీటర్ల గమ్యాన్ని 4 గంటల్లోపు చేరిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 31 ఏళ్ల లియు హాంగ్ 2016 రియో ఒలింపిక్స్‌లో 20 కిలోమీటర్ల విభాగంలో... 2011, 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాలు నెగ్గింది. -
మోదీ వైఫల్యాలు.. యువకుడి పాదయాత్ర
భువనేశ్వర్: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వాగ్దానాలకు వెంటనే అమలు చేయాలని కోరుతూ ఒడిశా యువకుడు ఏకంగా 1350 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాడు. కాలి నడకన ఢిల్లీ వెళ్లి మోదీని కలవడానికి బయలుదేరాడు. వృతిపరంగా విగ్రహాలు తయారు చేసే ముక్తికాంత్ బిస్వాల్(30) శనివారం జాతీయ జెండా చేతపట్టుకుని ఒడిశా నుంచి ఢిల్లీకు తన నడక ప్రారంభించారు. ఈ సందర్భంగా బిస్వాల్ మాట్లాడుతూ.. ‘2015లో మోదీ ఒడిశా పర్యటనకు వచ్చినప్పుడు రూర్కెలాలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, బ్రాహ్మిణి వంతెన పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. రూర్కెలా ప్రజలకు ప్రధాన ఆసుపత్రి అయిన ఇస్పత్ ఆసుపత్రిని పునరుద్దరిస్తామని కూడా హామీ ఇచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తైనా హామీలను అమలు చేయలేదు. వైద్య సదుపాయం లేక ప్రజలు చనిపోతున్నారు. కాలినడకన 1350 కిలోమీటర్లు నడిచి ఢిల్లీలో మోదీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నా’నని అన్నారు. బిస్వాల్ పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని చేసిన వాగ్దానాలకు నెరవేర్చాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా శనివారం నడక ప్రారంభించిన బిస్వాల్ ఆగ్రా ప్రధాన రహదారిపై సొమ్మసిల్లి పడపోవడంతో స్థానికులు అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. -
మనుషుల్లా నడవటం నాకూ తెలుసు
ఫిలడెల్ఫియా : గొరిల్లాలు మనుషుల్లా రెండు కాళ్ల మీద నడవటం పెద్ద విశేషం ఏం కాదు. అయితే అది అరుదుగా జరగాలే తప్ప.. అదే పనిగా ఉంటే మాత్రం చర్చనీయాంశమే. అమెరికా ఫిలడెల్ఫియాలోని ఓ జూలో ఉన్న లూయిస్ అనే మగ గొరిల్లా చాలా ప్రత్యేకం. రోజులో దాదాపు సమయం అది రెండు కాళ్ల మీద అది నడుచుకుంటూ వెళ్తుంది. అయితే అది అలా చేయటానికి కారణం ఉందని చెబుతున్నారు జూ నిర్వాహకులు. ‘లూయిస్‌కు బురద అంటే చికాకు. దానిని చూసేందుకు వచ్చే వాళ్లే వేసే తిండిని అది మట్టి పాలు కానివ్వదు. శుభ్రత ఎక్కువ. నిర్వాహకులు పెట్టే తిండిని కూడా అది చేతిలో పట్టుకునే దాని బోనులోకి వెళ్లి అది తింటుంది. ఆ సమయంలో అది రెండు కాళ్ల మీద నడుస్తూనే ఉంటుంది’ అని నిర్వాహకులు చెబుతున్నారు. 18 ఏళ్ల లూయిస్ ఆ మధ్య ఓ సందర్భంలో ఠీవీగా తిప్పుకుంటూ పోతుంటే.. దానిని వీడియో తీసిన జూ అధికారులు ట్విటర్లో పోస్ట్ చేయటంతో వేలలో కామెంట్లు వచ్చిపడుతున్నాయి. Although gorillas occasionally walk on two legs (bipedal), it is less common. Not for Louis though - he can often be seen walking bipedal when his hands are full of snack or when the ground is muddy (so he doesn't get his hands dirty)! pic.twitter.com/6xrMQ1MU9S — Philadelphia Zoo (@phillyzoo) 5 March 2018 -
దిగ్గజ యాత్రికుడి అస్తమయం.. నాసా ఘన నివాళులు
వాషింగ్టన్ : నాసా తరపున తొలిసారి అంతరిక్షంలో స్వేచ్ఛా విహారం చేసిన యాత్రికుడు బ్రూస్ మెక్ కాండ్లెస్స్ ఇక లేరు. గురువారం ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్ కాసేపటి క్రితం ఓ ప్రకటనలో తెలిపింది. 80 ఏళ్ల బ్రూస్ మెక్ కాండ్లెస్స్ అనారోగ్యంతో మరణించినట్లు సమాచారం. కాగా, 1984లో ఛాలెంజర్ స్పేస్ షటిల్లో ప్రయాణించిన ఆయన అంతరిక్షంలో ఎలాంటి ఆధారం లేకుండా తేలియాడిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయన అలా తేలుతున్న ఫోటోకు ఐకానిక్ ఫోటోగా గుర్తింపు కూడా లభించింది. మనిషి తలుచుకుంటే సాధించలేదనిది ఏదీ లేదని.. ఇది అమెరికన్లను ఎంతో గర్వకారణమని ఆ సమయంలో పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు కితాబు కూడా ఇచ్చారు. కాగా, బోస్టన్ లో జన్మించిన ఆయన కాలిఫోర్నియాలోనే విద్యాభ్యాసం చేశారు. నావల్ అకాడమీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా సాధించి.. 1973లో స్కై లాబ్ మిషన్‌లో ఆయన పాలుపంచుకున్నాడు. ఆపై 1984లో ప్రతిష్టాత్మక నాసా ఛాలెంజర్ ద్వారా అంతరిక్షంలో విహరించారు. 2006లో నాసాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాకు కనిపించటం అదే చివరిసారి. ఆ సమయంలో తాను ఎదుర్కున్న అనుభవాలను అప్పుడు వివరించి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు కూడా. 2015లో గార్డియన్ పత్రిక ఆయన చివరి ఇంటర్వ్యూను ప్రచురించింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ను ప్రారంభించిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నగరంలోని పీపుల్స్ ప్లాజాలో ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఇన్స్టిట్టూట్ ఆఫ్ ఇంజినీర్స్, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జనవరి నుంచి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందివ్వనున్నట్లు తెలిపారు. అలాగే సాధ్యమైనంత వరకు విద్యుత్‌ను ఆదా చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఖైరతాబాద్ వరకు ఎనర్జీ కన్సర్వేషన్ వాక్ నిర్వహించారు. -
సలేశ్వరానికి సాహసయాత్ర
-
‘హెరిటేజ్ వాక్’ పరిశీలన
అమరావతి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిని రెండేళ్ల క్రితం ప్రభుత్వం వారసత్వ నగరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పర్యాటకశాఖ అమరావతి, ధరణికోట గ్రామాల్లో హెరిటేజ్ వాక్ నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా నిర్మిస్తున్న రోడ్లను మంగళవారం పర్యాటక శాఖ డైరెక్టర్ హిమాంశ్ శుక్లా, జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా పర్యాటక శాఖ సలహాదారుడు ప్రొఫెసర్ గల్లా అమరేశ్వర్‌తో కలిసి పరిశీలించారు. ప్రొఫెసర్‌అమరేశ్వర్ అమరేశ్వరాలయం, కృష్ణా నది తీర ప్రశస్తిని వారికి వివరించారు. అనంతరం అమరావతి పాత మ్యూజియంలోని మహాస్థూపం, కొత్త మ్యూజియంలోని శిల్పాలను తిలకించారు. త్వరితగతిని నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రతినిధి కిరణ్, సాయిబాబు వీర్వో నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
క్యాట్‌వాక్ చేసిన సాక్షిమాలిక్, యోగేశ్వర దత్
-
ఉత్కంఠ రేపిన 'రోప్ వాక్' వెడ్డింగ్!
ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి అంటూ పెళ్ళిళ్ళు అట్టహాసంగా చేసేవారిని వర్ణిస్తుంటాం. అలాగే అందరికీ భిన్నంగా, కాస్తంత వెరైటీగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని తహతహలాడేవారినీ చూస్తాం. కానీ జీవనాధారం కోసం ప్రాణాలతో చెలగాటమాడే సర్కస్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు అదే సర్కస్ ఫీట్ తో పెళ్ళి చేసుకోవడం ఇప్పుడు చరిత్రను సృష్టించింది. ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో.. తాడుపై నడిచే రోప్ వాక్ ఫీట్ చేస్తూ.. పెళ్లి చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాదు.. ఆ రోప్ వాక్ వెడ్డింగ్ అతిథుల్లో ఉత్కంఠను కూడా రేపింది. సర్కస్ లో రోప్ వాక్ చేస్తూనే... వినూత్నంగా వివాహ వేడుకను నిర్వహించుకున్నారు హోస్టన్ కు చెందిన ముస్తాఫా డాంగ్విర్, అన్నా లెబెదేవాలు. ప్రపంచ ప్రఖ్యాత సర్కస్ రింగ్లింగ్ బ్రోస్ లో పనిచేసే ఆ ఇద్దరూ భూమి నుంచి 30 అడుగుల ఎత్తులో గట్టిగా కట్టిన తాడుపై నడుస్తూ దంపతులయ్యారు. 1884 లో అమెరికాలో మొత్తం ఏడుగురు రింగ్లింగ్ సోదరుల్లో ఐదుగురితో ప్రారంభమైన ఈ ప్రముఖ సర్కస్.. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ షో గా ప్రఖ్యాతి పొందింది. అటువంటి రింగ్లింగ్ బ్రోస్, బార్నమ్ అండ్ బైలీ స్థానిక ఎన్ఆర్జీ స్టేడియంలో సంయుక్తంగా నిర్వహించిన సర్కస్ షోలో.. అందులోనే పనిచేచే ముస్తాఫా డాంగ్విర్, అన్నా లెబెదేవాలు తమ వివాహాన్నినిర్వహించుకోవడం ఇప్పుడు సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. వైట్ టెక్సిడో కోట్ ధరించి, ఒంటెపై ఊరేగుతూ వివాహ వేదికకు వచ్చిన వరుడు.. పక్కనే ఉన్న నిచ్చెన మీదుగా అప్పటికే సిద్ధంగా ఉన్న సర్కస్ వాక్ రోప్ మీదకు చేరుకున్నాడు. తెల్లని ఆకట్టుకునే అందమైన పెళ్ళి గౌను, హైహీల్స్ వేసుకొని గుర్రంపై వచ్చిన వధువు.. సైతం సర్కస్ రోప్ పైకి చేరుకున్న అనంతరం.. రోప్ మధ్య భాగంలో కూర్చొని వధూవరులు ఉంగరాలు మార్చుకొని, అతిథుల ఆనందోత్సాహాలు, హర్షధ్వానాలమధ్య ఒక్కటయ్యారు. పెళ్ళికి హాజరైనవారిని చిరుమందహాసంతో పలుకరిస్తూ ఏడడుగులూ నడిచారు. -
బడికెళ్లాలంటే.. 10 కి.మీ. నడవాల్సిందే..
వారికి చదువంటే చాలా ఇష్టం.. కానీ తమ గ్రామం నుంచి మండలకేంద్రంలోని పాఠశాలకు చేరుకోవాలంటే సుమారు పది కిలోమీటర్లు నడవాల్సిందే.. ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆ విద్యార్థులు కాలినడకనే పాఠశాలకు వెళుతున్నారు.. ఎండకు, వానకు తట్టుకుని చదువుపై మక్కువతో నిత్యం కాలినడక సాగిస్తున్నారు.. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.. మద్నూర్ : మండలంలోని మొగా, పెద్ద శక్కర్గా, మారెపల్లి, శేఖాపూర్, హండేకేలూర్, అవాల్గావ్, చిన్న ఎక్లార తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు నిత్యం సుమారు 10 కి.మీ. కాలినడకన పాఠశాలకు వెళ్తున్నారు. ప్రైవేట్ వాహనాలున్నా కొన్నిసార్లు అవి కూడా అందుబాటులో ఉండకపోవడంతో వారికి కాలినడక తప్పడంలేదు.. మొగా, శేఖాపూర్, మారెపల్లి, లచ్మాపూర్ గ్రామాల విద్యార్థులు మేనూర్‌లోని ఉన్నత పాఠశాలకు, పెద్ద శక్కర్గా, చిన్న శక్కర్గా, హండేకేలూర్, అవాల్గావ్ గ్రామాల విద్యార్థులు మండల కేంద్రంలోని పాఠశాలకు, దన్నూర్, సోమూర్, ఖరగ్, చిన్న తడ్గూర్, కొడిచెర, అంతాపూర్ గ్రామాల విద్యార్థులు పెద్ద తడ్గూర్ ఉన్నత పాఠశాలకు వస్తారు. చిన్న ఎక్లార, రూపేగావ్, లచ్చన్, సుల్తాన్‌పేట్ విద్యార్థులు పెద్ద ఎక్లారలోని ఉన్నత పాఠశాలకు వస్తారు. దీంతో ప్రతిరోజు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని, రోజూ నడుచుకుంటూ వెళ్లిరావడంతో అలసిపోతున్నామని ఆ విద్యార్థులు వాపోతున్నారు. కొందరు విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఆడపిల్లలను బడికి పంపాలంటే తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
చదవాలంటే నడవాల్సిందే..
పై చదువులకోసం కిలోమీటర్ల దూరం నడుస్తున్న గిరిజన విద్యార్థులు మెదక్‌రూరల్: చదువుపై మక్కువతో గిరిజన విద్యార్థులు కిలో మీటర్ల మేర నడుస్తున్నారు. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ..పాఠశాలకు సమయానికి చేరుకోవాలనే ఆత్రుతతో కాలినడకన పరుగులు పెడుతున్నారు. తం డాల్లో ప్రాథమిక విద్య పూర్తిచేసుకున్న గిరిజన విద్యార్థులు పై చదువులు చదవాలంటే కిలో మీటర్ల పాదయాత్ర తప్పడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా..గిరిజన తండాలకు రవాణా సౌకర్యం మాత్రం కల్పించడం లేదు. దీంతో గిరిజన విద్యార్థులు కిలో మీటర్ల మేర దూరం నడుస్తూ విద్యాభ్యాసం చేస్తున్న మెదక్ మండలంలోని గిరిజన విద్యార్థుల చదువుల గోసపై సాక్షి కథనం.. మెదక్ మండలం హవేళి ఘణాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిధిలో హవేళి ఘణాపూర్ తండా, శేరిగడ్డ తండా, భరతమాత తండా, ఉప్పుతండా, బద్యాతండా, ఔరంగాబాద్ తండాలున్నాయి. శుక్లాల్పేటతండా, సుల్తాన్పూర్ తండా, శాలిపేట, బి.భూపతిపూర్, అవుసులపల్లి, బ్యాతోల్ లింగ్సాన్‌పల్లి గ్రామాలున్నాయి. ఆయా తండాలతోపాటు గ్రామాలలో ప్రాథమిక విద్య పూర్తిచేసుకున్న విద్యార్థులు సుమారు 300మంది హవేళిఘణాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వస్తుంటారు. గ్రామాలకు, తండాలకు రవాణా సౌకర్యం లేక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాలినడకన వస్తుంటారు. కొద్దిమంది మాత్రం సైకిళ్లపై వస్తుంటారు. మెదక్ మండలంలోని అన్ని మారుమూల గ్రామాలు, తండాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వర్షం కురిసినా...ఎండలు మండిన విద్యార్థులు నానా పాట్లు పడుతూ పాఠశాలకు చేరుకుంటున్నారు. ఇక విద్యార్థినులు అవస్థలు అన్నిఇన్నీ కావు. కిలో మీటర్ల దూరంలోని పాఠశాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో అంతదూరం నడవకలేక మధ్యలోనే మానేస్తున్నారు. ప్రచారమే తప్ప..కనీస వసతులు లేవు ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపాలంటూ బడిబాట కార్యక్రమంలో ప్రచారం చేస్తున్న ప్రభుత్వం మారుమూల గ్రామాలు, గిరిజన తండాల విద్యార్థుల సౌకర్యార్థం రవాణా సౌకర్యం కల్పించడం లేదు. మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థలు బస్సులను మారుమూల గ్రామాలకు, తండాలకు నడిపిస్తుండటంతో పోషకులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో అప్పులపాలవుతున్నప్పటికీ పిల్లల భవిష్యత్‌కోసం భారం మోస్తున్నారు. ప్రభుత్వం మారుమూల గ్రామాలకు, తండాలకు రవాణా సౌకర్యం కల్పిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఆరుకిలోమీటర్లు నడుస్తున్నా.. హవేళిఘణాపూర్ జెడ్పీహెచ్ఎస్లో 7వ తరగతి చదువుతున్నా. తండా నుంచి ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజు ఆరు కిలోమీటర్ల దూరం నడుస్తూ బడికి వస్తున్నా. వర్షంపడితే తడిసిపోవాల్సి వస్తోంది. పుస్తకాలు కూడా తడిసిపోతున్నాయి. ఇబ్బందులుపడాల్సి వస్తోంది. -గణేష్, 7వ తరగతి, ఔరంగాబాద్తండా అలసి పోతున్నాం.. హవేళిఘణాపూర్‌లోని జెడ్పీహెచ్ఎస్లో 6వ తరగతి చదువుతున్నా. సమయానికిపాఠశాలకు చేరుకోవాలని ఉదయాన్నే బయల్దేరినప్పటికీ పరుగులు పెట్టాల్సి వస్తోంది. పాఠశాల నుంచి ఇంటికి ఆరు కిలోమీటర్లు. దీంతో కాళ్లు నొప్పులు పెడుతున్నాయి. ఇంటికి వెళ్లే సరికి అలసి పోతున్నాం. ప్రభుత్వం మాలాంటి వారికోం స్కూల్ బస్సులు వేస్తే బాగుంటుంది. -అంబిక, 6వ తరగతి, ఔరంగాబాద్ -
నేను.. మీ పాదాన్ని!
ఆనంద్‌కు తన గుండె, కాలేయం, ఊపిరితిత్తుల వంటి అవయవాల మీద మక్కువ ఎక్కువ. నేను అంత సమస్యలను తెచ్చిపెట్టే అవయవాన్ని కాదని ఆనంద్ నమ్మకం. అందుకే నా గురించి పెద్దగా ఆలోచించడు. కానీ నేనొక నిర్మాణపమైన అద్భుతాన్ని. నేను ఆనంద్ పాదాన్ని. నేనెంత సంక్లిష్టమైన అవయవాన్నో తెలియక కాలిని కాస్తంత చిన్నచూపు చూస్తుంటాడు ఆనంద్. అతడి నడక సాఫీగా సాగడం అన్నది నేను సెలైంట్‌గా పనిచేస్తుండటం వల్లనే. నాలో 26 ఎముకలు ఉంటాయి. ఆనంద్ మొత్తం కాలిలో ఉండే మొత్తం ఎముకల సంఖ్యతో పోలిస్తే నాలుగో వంతు అతడి పాదంలోనే ఉంటాయి. 107 లిగమెంట్లు, 19 కండరాలు ఉంటాయి. అతడి 72 కిలోల బరువును నేనే మోస్తుంటాను. అతడి ఒంటిలోని అత్యంత పొడవైన ఎముక, దాని చుట్టూ ఉండే కండరాన్ని నేనే బ్యాలెన్స్ చేస్తుంటాను. ఆ బరువు మోయడానికి వీలుగా విశాలంగా రూపొందించుకోవడం కోసం అరికాలుగా మారి నన్ను నేను విస్తరించుకున్నాను. నడక... తెలియకుండానే రోజూ జరిగే సంక్లిష్ట ప్రక్రియ నిజానికి నడక అన్నది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. పాదం నేల మీద మోపగానే మొదటి షాక్ నాకు తగులుతుంది. ఆ షాక్ ప్రభావాన్ని తగ్గించడం కోసం... షాక్ అబ్జార్బర్‌లా పనిచేయడం కోసం... ఆ ప్రభావాన్ని నేను పాదమంతటికీ విస్తరింపజేస్తాను. కానీ ఆనంద్ మాత్రం నాకంటే అతడి వాహనం టైర్ల మీదే ఎక్కువగా దృష్టిసారిస్తుంటాడు. నాకు ఎప్పుడైనా దెబ్బతగిలితే... నాకు గాయమైందన్న అంశం కంటే తాను నడవలేకపోతున్నాననే అంశమే అతడిని బాధిస్తుంది. నడక ఎలా సాగుతుందంటే... పాదం మోపగానే మొదటి బరువు అతడి మడమలోని బంతిలాంటి ఎముకపై పడుతుంది. ఆ తర్వాత కాలివేళ్లలో ఎముకలైన ఐదు మెటాటార్సల్స్పై పడుతుంది. వాటి సాయంతో నేను నేలను వెనక్కుతోస్తాను. కానీ నేల కదలదు కదా. దాంతో ఆ చర్య ప్రభావంతో నేను ముందుకు కదిలి, ఆనంద్‌ను ముందుకు నడిపిస్తుంటాను. గచ్చు గట్టిదనంతో మరిన్ని గాయాలు... యుగాలనాటి ఆనంద్ పూర్వీకులు పాదరక్షలు ఏవీ లేకుండానే నడుస్తుండేవారు. ఆ తర్వాత నన్ను రక్షించుకోడానికి నా చుట్టూ చర్మాన్ని కట్టారు. ఇప్పుడు ఆధునిక కాలంలో షూస్ ధరిస్తున్నారు. ఆనంద్ పూర్వీకులు నేలపై నడిచినప్పుడు నాకు బాగానే ఉండేది. కానీ ఇప్పుడు సిమెంట్ చేసిన, కఠినమైన పేవ్మెంట్ల మీద ఆనంద్ నడుస్తున్నాడు. మెత్తటి నేల మీద, గడ్డి మీద నడవకుండా ఇలా కఠినమైన ఉపరితలం మీద నడవడం నాకు కష్టాలు తెస్తోంది. నాలోని ఎముకలు కాస్త మృదువుగా, కాస్తంత సాగే గుణంతో ఉంటాయి. ఇరవైలలోపే ఆంక్షలు ఆరంభం ఆనంద్‌కు 20 ఏళ్ల వయసు వచ్చే వరకూ నేను రూపొందే ప్రక్రియ పూర్తి కాదు. అందువల్ల ఈ లోపే నన్ను షూస్, సాక్స్ వంటి వాటితో బంధిస్తూ ఉండటం, నా ఎదుగుదలకు ప్రతిబంధకంగా నిలుస్తూ ఉండటం వల్ల నాలో చాలా కొద్దిపాటి లోపాలు తలెత్తుతూ ఉండవచ్చు. అయితే అందరు తల్లిదండ్రుల్లాగే ఆనంద్ పేరెంట్స్ కూడా అతడు బుడిబుడి అడుగులు వేయాలని ఎదురుచూశారు. అంతవరకూ మామూలుగా నన్ను ఉండనిచ్చినవాళ్లు అతడు అడుగులు వేయడం మొదలుపెట్టగానే నన్ను బంధించారు. దీనివల్ల నాకు వచ్చేవి చిన్నచిన్న లోపాలే అయినా అవి మున్ముందు ఆనంద్ పాదాలకు నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువ. అతడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఆనంద్ పేరెంట్స్ అతడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవారు. అతడి గుండె, ఊపిరితిత్తులు ఇతర అవయవాలు బాగానే ఉన్నాయా లేదా అని చూపించేవారు. కానీ నన్ను, నా ఆకృతి తీరును విస్మరించేవారు. కానీ ఆ అవయవాలతో పోలిస్తే... ఆ టైమ్‌లో నాకు వచ్చే ఇబ్బందులు ఎక్కువ. ఆనంద్‌కు నాలుగేళ్ల వయసులో నన్ను గనక ఆర్థోపెడిక్ సర్జన్‌కు / డాక్టర్‌కు చూపిస్తే వారు నాకు జరుగుతున్న నష్టాలు గుర్తించేవారు. (విదేశాల్లో అయితే పాదాల ప్రాథమిక సంరక్షణ కోసమే పనిచేసే వారుంటారు. వాళ్లను పోడియాట్రిస్ట్ అంటారు) ఆనంద్‌కు ఆరేళ్ల వయసు వచ్చే సరికి, దాదాపు 40 శాతం మంది పిల్లల్లో వచ్చే నష్టాలే నాకూ వచ్చాయి. నా పాదం వేళ్లు నష్టపోవడం మొదలైంది. ఇది జన్యుపరంగానో లేదంటే షూస్ వల్లనో జరుగుతుంది. ఆనంద్‌కు బ్రష్చేసుకోవడం ఎలా, జుట్టు దువ్వుకోవడం ఎలా అని నేర్పుతారు. కానీ పాద సంరక్షణ నేర్పరు. పొడిగా ఉంచితే ఆరోగ్యంగా ఉంటాను ఒక్కోసారి ఆనంద్ పాదాలకు కాయకాచి అందులో పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఇలా జరిగినప్పుడు పాదాల డాక్టర్‌కు చూపించుకుని, తగిన చికిత్స చేయించుకోవాలి. అథ్లెట్స్ ఫుట్ అనే సమస్య ఫంగస్ కారణంగా నాకు వస్తుంది. నిజానికి ఈ ఫంగస్ నాపై ఎప్పుడూ ఉండనే ఉంటుంది. కానీ పాదం ఎప్పుడూ తేమ, తడిలో ఉన్నప్పుడు ఫంగస్ పెరిగి, చర్మం చిట్లి, అథ్లెట్స్ ఫుట్ సమస్య వస్తుంది. అరికాళ్లలో ఉండే చెమట గ్రంథులు స్రావాలతో పాదం చెమ్మబారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటప్పుడు ఆనంద్ పాదాన్ని శుభ్రంగా కడిగి, వీలైతే ఆల్కహాల్ ఉన్న వాష్లను ఉపయోగించి శుభ్రం చేసి, పాదాల మీద పౌడర్ చల్లి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకుంటే నేను ఆరోగ్యంగా మారతాను. అవసరాన్ని బట్టి యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. ఆనంద్‌కు బొటనవేలిపై ఉన్న గోరు లోపలివైపునకు పెరుగుతూ ఉంది. ఇలా జరగకుండా చూసుకోవాలంటే కాలి గోర్లు తీసే సమయంలో మూలల్లో మరీ చిగుర్ల నుంచి కాకుండా కాస్తంత దూరం నుంచే కట్ చేసుకుంటే ఈ సమస్యను ఎప్పటికీ రాకుండా చూసుకోవచ్చు. ఇక ఈ మధ్య ఆనంద్‌కు కాలు చల్లగా అనిపించడం, పాదం మొద్దుబారినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పాదానికి రక్తప్రసరణ పెరిగేలా చూసుకోవడం వల్ల ఈ సమస్య రాదు. అన్నిటికంటే ఆనంద్ పూర్వికులలాగే అతడు కూడా కాసేపు వ్యాయామం చేస్తే మంచిది. ఇక చివరగా నేను ఆనంద్‌ను కాస్త భయపెట్టాలి. మున్ముందు ఆనంద్‌కు వయసు పెరగబోతోంది. ఆ సమయంలో అతడు ఒకింత వ్యాయామం ఇచ్చి నా ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. లేదంటే నేను అతడిని నడిపించలేకపోవచ్చు. అందుకు ఇకపైన అయినా అతడు నా పట్ల దృష్టిసారించాలి. అది కూడా మరింత సునిశితమైన దృష్టి. ప్రమాద అవకాశాలు అతడిలో కంటే ఆమెకే ఎక్కువ పాదం గాయపడిందంటే దేహం గాయపడినట్లే అన్న పాత సూక్తిని గుర్తుంచుకోవడం మేలు. ఆనంద్ బూట్లు ధరించడం వల్ల నిల్చునే భంగిమలోనే మార్పువస్తుంది. దాంతో మొత్తం ఆకృతిలోనే మార్పురావచ్చు. అది చేదు పరిణామాలు దారితీయవచ్చు. ఆనంద్‌తో పోలిస్తే అతడి భార్యకు ఇలా జరిగే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. ఎందుకంటే ఆనంద్ భార్య ధరించే హైహీల్స్ వల్ల ఈ ప్రమాదం నాలుగింతలు ఎక్కువగా ఉంటుంది. ఆమెకే కాదు... మహిళలందరికీ ఈ ముప్పు ఉంటుంది. కాలికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో! నాకు వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. పాదాలపై ఆనెకాయలు రావచ్చు. షూ వల్ల ఒకేచోట అదేపనిగా ఒత్తిడి పడుతుండటం వల్ల ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అక్కడ మృతకణాలు చేరుతూ పోవడం వల్ల ఇలా ఆనెకాయలు రావచ్చు. ఆనంద్ పాదాలలోని నరాలలో కొన్నింటిపై ఎక్కువ, మరికొన్నింటిపై తక్కువ ప్రభావం పడుతుండవచ్చు. అలా నరాలపై ఎక్కువ ఒత్తిడి పడ్డప్పుడు అతడికి నొప్పి వస్తుండవచ్చు. ఆనెకాయల విషయంలో ఆనంద్ తానే ఒక సర్జన్ అనుకుంటాడు. రేజర్బ్లేడు తీసుకుని, దాన్ని కోస్తూ ఉంటాడు. ఆనెకాయలను మాడ్చటానికి దానిపై కొన్ని చుక్కల యాసిడ్ పోస్తూ ఉంటాడు. కానీ నిజానికి ఆనెకాయలు వస్తే దాని చూట్టూ ప్లాస్టర్ వేసి డాక్టర్‌కు చూపించాలి. ఇక షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి బొటనవేలు లోపలి వైపునకు నొక్కుకుపోయి, దాని వెనకవైపు ఎముక ముందుకు పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. ఈ సమస్యను ‘బ్యూనియన్’ అంటారు. కొందరిలో ఇది వారసత్వంగానూ కనిపిస్తుంది. షూ వల్ల మరింత పెరుగుతుంది. షూ ఒరుసుకుపోతున్న చోట... నన్ను నేను రక్షించుకునేందుకు మరో అదనపు కణజాలాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాను. ఇలాంటప్పుడు దాని చుట్టూ ఆనంద్ పట్టీ కట్టి దాని పైన షూ తొడుగుతుంటాడు. దాని వల్ల సమస్య మరింత పెరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆనంద్ డాక్టర్‌ను కలిసి, అవసరమైతే శస్త్రచికిత్స లేదా బొటనవేలిని మరింత దృఢతరం చేసుకునే చికిత్సలు చేయించుకోవడం అవసరం. పాదరక్షల ఎంపిక ఎలా ఉండాలంటే... ఆనంద్ తన జీవితకాలంలో సగభాగం నన్ను బూట్ల జైలులో బంధించి ఉంచుతాడు. కానీ అతడికి సరైన పాదరక్షల ఎంపిక ఎలాగో తెలియదు. ఒక కాలికి సరిపోగానే వెంటనే అలాంటిదే మరోకాలికి పరీక్షించకుండానే తొడిగేస్తాడు. ఆనంద్ చేయాల్సింది అది కాదు. తన రెండు పాదాల పొడవును కొలిచి, రెండింటికీ సౌకర్యంగా ఉండే జోళ్లనే ఇవ్వమని చెప్పాలి. అతడి షూస్ అతడి పాదం చివరే ముగియకుండా... మరో రెండు సెంటీమీటర్లు ఎక్కువగా ఉండాలి. పాదంలో వెడల్పుగా ఉండే భాగం ముడుచుకోకుండా, సౌకర్యంగా పరచుకునేలా అతడి షూ ఉండాలి. ఈమధ్య ఆనంద్ షార్ట్ సాక్స్ తొడుగుతున్నాడు. ఇవి చాలా వరకు కాలిని ముడుచుకుపోయేట్లుగా చేసే బిగుతు షూ అంతటి ప్రమాదకరమైనవి. సాక్స్ కాస్త సాగుతూ ఉండేవి అయితేనే మంచిది. -
పూరీగారూ.. అవెక్కడో కాస్త మాకూ చెప్పరూ!
హైదరాబాద్: మనుషుల మధ్య దూరం పెరిగి బద్ధ వైరం ఉన్న జంతువుల మధ్య దూరం తగ్గిపోతున్న రోజులివి. ఆ విషయాన్నే రుజువు చేస్తూ కనిపించాయి ఇక్కడ ఆ జన్మ శత్రువులు. పాము, ముంగిస, కుక్క పిల్లి, పిల్లి ఎలుక ఇవంటేనే వెంటనే టకటకా శత్రువుల జాబితాలో చేరుస్తాం. కానీ, ఇప్పుడు తామే మంచి మిత్రులం అంటూ ఓ కుక్కపిల్లి నిజం చేశాయి. ప్రతిరోజూ కుక్క కోసం పిల్లి ఇంటిపై ఎదురుచూడడం.. ఆ ఎదురుచూస్తున్న పిల్లికోసం కుక్క ఎంతో ఆతృతగా అదే సమయానికి వచ్చేసి వెంటనే ఆ పిల్లి ఉన్న ఇంటి గుమ్మం వైపు చూడటం.. అబ్బ తన మిత్రుడు వచ్చాడనుకుని ఇంటిపైన ఉన్న ఆ పిల్లి కిందికి రావడం.. ఆ తర్వాత అదే వీధిలో ఏవో సరదా కబుర్లలో మునిగిపోయి ఏం చక్కా వాకింగ్‌కు వెళ్లిపోవడం షరా మాములైంది. ఇది ఏ ఒక్క రోజో కాదు. ప్రతి రోజంట. ఈ దృశ్యాలు మన టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎక్కడ చూశారో ఏమిటో.. వెంటనే ఆ చిత్రాలను తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన లోకేషన్ ఎక్కడో చెప్తే ఏం చక్కా మనం కూడా అక్కడికి వెళ్లి వాటిని చూసైనా శత్రుత్వాన్ని విడిచి మిత్రలమయంగా మారిపోతాం కదా. -
సింహ గర్జనకు దుమ్మురేపిన దున్నలు
సియోల్: ఒక్కోసారి ఎంతటి ప్రశాంతవాతవరణమైన రణరంగాన్ని తలపించొచ్చు. ఎంత శాంతంగా ఉన్న జీవైన భయంగుప్పిట్లోకి జారుకుందంటే తనకు తెలియకుండానే ప్రమాదబారిన పడటమో ప్రమాదంలో పడేయడమో చేయొచ్చు. దక్షిణాఫ్రికాలోని ఓ పెద్ద పార్క్‌లో ఇలాగే జరిగింది. అప్పటివరకు నిర్మలంగా.. చల్లటి గాలులు.. పచ్చని చెట్ల మధ్య పీస్ఫుల్ గా కనిపించిన ఆ రహదారి ఒక్కసారిగా దుమ్మురేగింది. భయం గుప్పిట్లోకి జారుకున్న అడవి దున్నలు చేసిన హంగామాకు ఆ రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఉలిక్కిపడ్డారు. వందల దున్నల టపాటపా తమ కార్లకు ఢీకొనడమే కాకుండా.. ఆ కార్లపై నుంచి కొన్ని దూకుతూ.. కార్లను తొక్కుతూ వెళ్లడంతో సచ్చాం రా దేవుడా అనుకొని కాసేపు ఊపిరి బిగబట్టుకున్నారు. దక్షిణాఫ్రికాలోని క్రూగ్ పార్క్‌లో విశాలమైన రహదారి ఉంది. ఈ రహదారి గుండా వెళుతూ టూరిస్టులు అటవీ జంతువును సందర్శిస్తుంటారు. అందులో భాగంగానే అప్పటికే కొన్ని వాహనాలు ముందుండగా ఓ రెండు కార్లు నెమ్మదిగా వెళుతున్నాయి. ఆ రోడ్డును అడవి దున్నలు ఎంతో ప్రశాంతంగా ఒక పద్థతిగా రోడ్డు దాటుతుండటంతో కాసేపు వార్లు కార్లు నిలుపుకున్నారు. అవి దాటేసి వెళ్లగానే కార్ల వేగం పెంచారు. ఈ లోగా అడవి రారాజు సింహం అరుపు వినిపించింది. దాంతో అప్పటికే ప్రశాంతంగా రోడ్డు దాటిన దున్నలన్నీ కూడా ఒక్కసారిగా తిరిగి మరోసారి రోడ్డు దాటేందుకు మెరుపు వేగంతో దూసుకొచ్చాయి. ఆ వందల దున్నలమధ్య ఆ రెండు కార్లు చిక్కుపోయాయి. ఏదో పెద్ద బాంబు పేలితే ఎంతటి దుమ్ముధూళి రేగుతుందో ఆ దున్నల పరుగుకు అంతటి దుమ్ము రేగింది. ఎన్నో దున్నల మధ్య తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. ఆ కార్లను చూసిన ఇతరులు ఆ దృశ్యం చూసి గుండెలు పట్టుకున్నారు. అదృష్టవశాత్తు ఏం కాలేదు. -
ఒడిశా బాలికల అరుదైన పోరాటం
భువనేశ్వర్: భారత గణతంత్ర దినోత్సవం రోజు ఒడిశాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల బాలికలు అరుదైన పోరాటాన్ని ఎంచుకున్నారు. సమస్యలతో విసిగి వేసారిన వారు.. చివరికి తాడోపేడో తేల్చుకోవాలనుకున్నారు. ఆరునూరైనా కలెక్టరును కలిసి తమ బాధలు చెప్పుకొని తీరాల్సిందేనని తీర్మానించుకున్నారు. దానికోసం పెద్ద సాహసమే చేశారు. 73 మంది బాలికలు దండుగా కదిలారు. సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. అర్థరాత్రి చలిలో 7 గంటలు పాటు నడిచి వెళ్లి మరీ తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ బాలికల వసతిగృహంలో విద్యార్థులు దుర్భర స్థితిలో చదువుకుంటున్నారు. సౌకర్యాలు దేవుడెరుగు.. కనీసం కడుపునిండా భోజనం కూడా ఉండదు. దీంతో చదువు కుంటుపడింది. హాస్టల్ అధికారులు తమను చిన్న చూపు చూస్తున్నారని, నాసిరకం భోజనం పెడుతున్నారని, పాఠశాలలో సరైన బోధన వనరులు లేవని ఎన్నోసార్లు అధికారులకు విజ్క్షప్తి చేశారు. అయినా ఫలితం శూన్యం. దీంతో పాపం.. ఆ చిన్నారులు తమ దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం రాత్రి కాలినడకన బయలుదేరారు. వద్దని ఎవరు ఎంత వారించినా వెనక్కి తగ్గలేదు. పోలీసులు, ఇతర అధికారులు, పెద్దలు వారి ప్రయత్నాలను విరమింపజేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వాహనం ఏర్పాటుచేస్తామన్నా వినలేదు. పట్టిన పట్టు వీడకుండా ముందుకు సాగారు. చేసేదేమీ లేక పోలీసులే వారికి రక్షణగా వెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ధర్నా మొదలుపెట్టారు. దీంతో కలెక్టర్ స్పందించక తప్పలేదు. కలెక్టర్ రాజేశ్ ప్రవకర్ పాటిల్ వెంటనే ఆ ప్రాంతంలో పర్యటిస్తాననీ, .. వారి సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరిస్తానని హామీ యిచ్చారు. దీంతో బాలికలు ఆందోళనను విరమించారు. అనంతరం కలెక్టర్ ఆదేశాలపై జిల్లా సంక్షేమ సంఘ కార్యాలయం అధికారులు అర్ధరాత్రి ఆ బాలికల్ని సురక్షితంగా వసతి గృహానికి తరలించారు. అయితే దీనిపై జిల్లా సంక్షేమ అధికారుల వాదన మరోలా ఉంది. కొత్తగా విధుల్లో చేరిన అధికారికి వ్యతిరేకంగా కొంతమంది గ్రామస్తులు ఈ కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. -
విద్యార్థులు, తల్లిదండ్రులపై ఓ ట్యూటర్ దుశ్చర్య
వడోదర: ఎలాగైనా మంచి మార్కులు సాధించడమేకాకుండా, గొప్ప ఉద్యోగాలు సంపాధించాలని విద్యార్థుల ఆత్రుత.. దానిని మరింత పరుగులుపెట్టించేంతగా తల్లిదండ్రుల ఒత్తిడి వెరసి ఓ ప్రైవేటు టీచర్‌కు బుద్ధితక్కువ ఆలోచనకు దారి తీసింది. నేలపై గాజుపెంకలు పరిచి వాటిపై నడిచి మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి అంటూ ఆ పనిచేయించాడు గుజరాత్ లో ఓ ప్రైవేటు ట్యూషన్ టీచర్.. ఆ పని కేవలం ఆ యువ విద్యార్థులతోనే కాకుండా వారి తల్లిదండ్రులతో కూడా చేయించాడు. ఈ విషయం బయటకు తెలిసి పోలీసులు విచారణ ప్రారంభించారు. వడోదరాలో రాకేశ్ పటేల్ అనే ఓ ప్రైవేటు టీచర్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడు. అతడి వద్దకు శిక్షణకు వస్తున్న యువకుల్లో ఓ 70మందిని ఎంచుకొని వారి తల్లిదండ్రులను కూడా పిలిపించాడు. అనంతరం తన కోచింగ్ సెంటర్ లోనే నేలపై గాజు పెంకలు పరిచి వాటిపై నడవమన్నాడు. తాను కూడా గతంలో అలాగే చేశానని, అందువల్ల తనలో గొప్పగా ఆత్మవిశ్వాసం పెంపొందిందని చెప్పాడు. చాలామంది ఈ గాజుపెంకులపై నడిచారని, వారికి ఏమీ కాలేదని అన్నారు. కాగా, ఈ అంశాన్ని వడోదర కలెక్టర్ తోపాటు గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్రసిన్హ చుదాశ్మ కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి చర్యలకు దిగుతున్నవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. -
చెన్నైలో టెన్నిస్ క్రీడాకారుల ఫాషన్ షో
-
బుల్లి షి‘కారు’...
తిక్క లెక్క బుజ్జాయిల సైజుకు సరిపోయే ఈ బుల్లి కారులో షికారు చేస్తున్న ఈ సరదా బుల్లోడిని చిత్రంగా చూస్తున్నారా..? ఈ కారును తయారు చేసింది ఇతగాడే. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని కారల్టన్లో ఉండే ఈ కుర్ర ఇంజనీరు పేరు ఆస్టిన్ కోల్సన్. కేవలం 63.5 సెంటీమీటర్ల ఎత్తు, 65.41 సెంటీమీటర్ల వెడల్పు, 126.47 సెంటీమీటర్ల పొడవు ఉండేలా ఈ కారును రూపొందించాడు. రోడ్ల మీద ఇది మామూలు కార్ల మాదిరిగానే ఇంచక్కా పరుగులు తీయగలదు. ప్రపంచంలోనే అతి బుల్లికారుగా ఇది గిన్నెస్ బుక్‌లోకి ఎక్కింది. -
సందడిగా పింక్ రిబ్బన్ వాక్
ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు ముందు పింక్‌రిబ్బన్ వాక్ సందడిగా జరిగింది. మంత్రి హరీష్‌రావు వాక్‌ను ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్ లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యపై అందరూ పోరు సాగించాలన్నారు. ఉషాలక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఉషాలక్ష్మి, కిమ్స్ చైర్మన్ బి.కృష్ణయ్య, ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌చందా, క్రికెటర్ మిథాలిరాజ్, సినీ నటులు లావణ్య త్రిపాఠి, మంచులక్ష్మి, యూబీఎఫ్ పాట్రన్ పింకిరెడ్డి, రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో మంచులక్ష్మి కుమార్తె విద్యానిర్వాన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - బంజారాహిల్స్ -
సైట్ డే కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌చరణ్
-
డీ-హైడ్రేషన్‌ను గుర్తించేదెలా?
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్ నా వయసు 35. రోజూ జాగింగ్‌ను చేస్తాను. నాకు చెమటలు ఎక్కువ. నాలాంటి వారికి డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందని విన్నాను. నాకు తగిన సూచనలు ఇవ్వండి. - రఘురామ్, నకిరేకల్ జాగింగ్ మొదలుపెట్టడానికి ముందుగా కనీసం నాలుగు వారాల పాటు వేగంగా నడక (బ్రిస్క్‌వాకింగ్) కొనసాగించడం మేలు. జాగింగ్‌కు అనువైన షూస్ ఎంచుకోవడం చాలా అవసరం. సుమారు ప్రతి 1000 కి.మీ. పరుగు తర్వాత ఆ షూస్ మార్చేయాలి. లేకపోతే చూడటానికి షూ బాగానే అనిపించినా సోల్ అరుగుదల వల్ల అడుగులు పడే తీరులో మార్పు వచ్చి దీర్ఘకాలంలో దాని దుష్పరిణామాలు కనిపిస్తాయి. ఇక జాగింగ్ వ్యవధి విషయానికి వస్తే రోజూ కనీసం అరగంట నుంచి 45 నిమిషాల పాటు స్లోజాగింగ్ చేయడం మేలు. జాగింగ్ చేయడానికి ముందుగా ఎవరైనా సరే... జాగింగ్‌కు ముందూ, జాగింగ్ తర్వాత స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. డీ-హైడ్రేషన్‌ను దీన్ని గుర్తించడం చాలా తేలిక. మీరు పరుగెత్తుతున్నప్పుడు చెమటల వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు, లవణాలను కోల్పోయి, వాటి (ఎలక్ట్రోలైట్స్) సమతౌల్యత చెబుతుంది. ఈ కండిషన్‌ను డీ-హైడ్రేషన్‌గా పేర్కొనవచ్చు. మీరు డీ-హైడ్రేషన్‌కు గురైతే మీకు స్వల్పంగా తలనొప్పి రావడం, దాహం వేస్తూ ఉండటం, చురుకుతనం తగ్గినట్లుగా అనిపించడం, వికారం, కండరాలు బిగుసుకుపోయి, పట్టివేసినట్లుగా అయిపోవడం (మజిల్ క్రాంప్స్), నీరసం, ఉమ్ము కూడా రాకపోవడం, ఒకవేళ ఊసినా అది చాలా చిక్కగా ఉండటం, తీవ్రమైన నిస్సత్తువకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే జాగింగ్ లేదా రన్నింగ్ చేసేవారు తగినంతగా నీళ్లు తాగాలి. లేకపోతే అది హైపోనేట్రీమియా (శరీరంలో సోడియమ్ లవణాల పాళ్లు తగ్గడం) అనే కండిషన్‌కు దారితీయవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితే. దీన్ని నివారించాలంటే మీరు స్థూలకాయులైతే జాగింగ్ మొదలుపెట్టడానికి ముందే శరీర బరువును తగ్గించుకోవడం అవసరం. ఇక జాగింగ్ చేసే సమయాల్లో తమ శరీరం ఉజ్జాయింపుగా ఎన్ని నీళ్లను కోల్పోతుందో గుర్తించి ఆ మేరకు (లవణాలతో కూడిన నీళ్లు లేదా కొబ్బరినీళ్లు) తీసుకోవాలి. ఉదాహరణకు జాగింగ్ చేయడానికి ముందు మీ శరీరం బరువు 63 కిలోలు ఉందనుకుందాం. అరగంట జాగింగ్ తర్వాత మీ బరువు 62.6 కిలోలు ఉందనుకుందా. అంటే అరగంటలో మీరు 0.4 కిలోల బరువు కోల్పోయారు. అందుకే ఉజ్జాయింపుగా మీరు 400 మిల్లీలీటర్లు లేదా గంట జాగింగ్ చేసేవారైతే 800 మిల్లీలీటర్లు (దాదాపు ఒక లీటరు నీరు) తాగి, మీరు కోల్పోయిన ఫ్లూయిడ్స్ భర్తీ చేసుకోవడం మేలు. అయితే నీటిని గింగ్/రన్నింగ్ ముగిసిన కొద్ది వ్యవధి / విశ్రాంతి తర్వాత తీసుకోవడం అన్నివిధాలా మేలు. డాక్టర్ ప్రవీణ్‌రావు, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
హైట్ కోసం ఆపరేషన్ చేయించుకుంటే..
ముంబై: ఎలాగైనా పొడవు పెరగాలని ఓ17 ఏళ్ల కుర్రాడు కలలు కన్నాడు. కానీ ఆ ప్రయత్నమే పీడకలగా మిగిలిపోతుందని అతడు ఊహించలేదు. అడుగు తీసి అడుగు వేయాలంటేనే నరకాన్ని అనుభవిస్తున్నాడు. చివరికి అవిటివాడుగా మారిన వైనం ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే 5 అడుగుల పొడవున్న ప్రేమ పటేల్ ఇంకొంచెం ఎత్తు పెరిగితే బావుండునని ఆశించాడు. చుట్టుపక్కల వాళ్లు, స్నేహితులు ...అతడిని మరగుజ్జు అని గేలి చేస్తోంటో ఎలాగైనా పొడవు పెరగాలని అనుకున్నాడు. అందుకోసం తల్లిదండ్రులను ఒప్పించి డాక్టర్లను సంప్రదించారు. ఆటో నడుపుకొని జీవనం సాగించే ఆ కుటుంబం అతని కోరికను కాదనలేకపోయింది. స్థానిక వైద్యుణ్ని సంప్రదించారు. అతను సియాన్ ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చాడు. అక్కడ ప్రేమ్ పటేల్‌ను పరీక్షించిన వైద్యులు జెనెటిక్ డిజార్డర్ అని, ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఆపరేషన్ చేస్తే ఎముకలు సాగుతాయనీ, పొడవు పెరుగుతుందనీ హామీ యిచ్చారు. అలా జూన్ 25, 2013న ప్రేమ్ పటేల్‌కు మొదటి ఆపరేషన్ జరిగింది. ఇక అంతే ఆ రోజు నుంచి అతనికి నరకం కనిపించడం మొదలైంది. దాదాపు నెలరోజుల పాటు మంచానికే పరిమితమ్యాడు. మెల్లిగా అడుగులు వేయగలిగాడు. అయితే భరించలేని నొప్పి. మళ్లీ ఆసుపత్రికి పరుగు దీశాడు. నొప్పి తగ్గాలంటే మళ్లీ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తేల్చారు. అలా 2014 డిసెంబర్ దాకా మొత్తం ఆరు ఆపరేషన్లు నిర్వహించారు. అయినా ఫలితం శూన్యం. కాలు కదిపితే నరకం.. అడుగు తీసి అడుగు వేయాలంటే భరించలేని నొప్పి. ఎడమ కాలుకు పూర్తిగా పాడయ్యింది. పొడవు పెరగాలని అనుకున్నానే తప్ప ఇంత నరకం అనుభవించాల్సి వస్తుందని అనుకోలేదని ప్రేమ్ వాపోతున్నాడు. మందుల ద్వారా పొడవు పెరగొచ్చని స్నేహితులు చెపితే నమ్మానని, చివరికి ఇలా మిగిలానంటూ అచేతనంగా మారిపోయిన తన కాళ్లను చూసుకుంటూ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు నిరుపేదలమైన తాము మూడులక్షలు ఖర్చు చేసి వైద్యం చేయిస్తే చివరికి తన కొడుకు అవిటివాడుగా మారిపోయాడని ప్రేమ్ పటేల్ తల్లి మీనా వాపోతోంది. అయితే ఆపరేషన్ చేసిన డాక్టర్ బినెత్ సేత్ మాత్రం బాధితుల విమర్శలను ఖండిస్తున్నారు. జెనిటిక్ బోన్ డిజార్డర్ తో బాధ పడుతున్నాడని, దానికి చికిత్స చేశామన్నారు. తాము చెప్పిన సలహాలను, జాగ్రత్తలను పాటించలేదని ఆరోపిస్తున్నారు. అందుకే ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్నారు. అయితే వైద్యుల వాదనను సామాజిక కార్యకర్త సంతోష్ ఖారత్ కొట్టివేస్తున్నారు. డాక్టర్ల అత్యాశ, నిర్లక్ష్యం ప్రేమ్ పటేల్ ప్రాణాల మీదికి తెచ్చిందని విమర్శిస్తున్నారు. అతని కాళ్లతో ప్రయోగాలు చేశారని, పరిస్థితి విషమించడంతో చేతులెత్తేసారని మండిపడుతున్నారు. దీనిపై బాధితుని తరపున న్యాయపోరాటానికి తాము సిద్ధమవుతున్నామని తెలిపారు. సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. -
2రోజుల బాబు నడిచాడు
-
అవేక్.. వాక్
కూర్చుని చేసే ఉద్యోగం, బయటకు అడుగుపెడితే వెహికిల్, వేళాపాళాలేని ఆహారపు అలవాట్లు. ఈ లగ్జరీయస్ లైఫ్‌స్టైల్‌కు సిటీ పొల్యూషన్ తోడై.. హైదరాబాదీల ప్రాణాలకే ప్రమాదం తెస్తోంది. ఇది కొత్త విషయం కాకపోయినా.. ఈ మధ్యకాలంలో ఎక్కువైన ఈ ట్రెండ్ సిటీ వాసులను డయాబె టిస్, హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు, మతిమరుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మ క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) బారిన పడేట్టు చేస్తోంది. కలవరానికి గురిచేస్తున్న ఈ విషయాలను వెల్లడించింది ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లోని నిపుణుల బృందం! ఇటీవల సిటీలో సర్వే నిర్వహించిన ఈ టీమ్... 53.6 శాతం మంది నగరవాసులు కదలకుండా ఉండే లైఫ్‌స్టైల్‌ను లీడ్ చేస్తున్నట్లు తెలిపింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 700 మందిలో సగటున 375 మంది నడక, ఎక్సర్‌సెజైస్, యోగాలాంటివేవీ చేయకుండా జీవితాన్ని వెళ్లదీస్తున్నట్లు పేర్కొంది. రోగాలెన్నింటినో దూరం చేసే శారీరక వ్యాయామాలను నగరవాసులు దూరం పెడుతున్నారని దీనివల్ల భవిష్యత్‌లో అనేక అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు.. సిటీ సిటిజన్స్ శరీరానికి సరైన పోషకాలనందించే పళ్లు, కూరగాయలను సక్రమంగా తీసుకోవడం లేదని తేల్చింది. ఇక 15 శాతం మంది తినాల్సినదానికంటే ఎక్కువ మోతాదులో ఉప్పు తింటున్నారని, మరో 20 శాతం మందికి పొగాకు, ఆల్కహాల్ వంటి వి వ్యసనంగా మారాయని తెలిపింది. బ్రిస్క్‌వాక్ చాలు... ఇలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించినట్లుగా రోజుకు 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల ఆకు కూరలు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వ్యాయామాలు చేయడమంటే కచ్చితంగా ఏ జిమ్‌లోనో జాయినవ్వాల్సిన అవసరం లేదని ఈ రిస్కీ లైఫ్‌స్టైల్‌ను ఎదుర్కోవడానికి బ్రిస్క్‌వాక్ చాలని చెబుతున్నారు. శరీరం మొత్తం కదిలే విధంగా చురుకైన నడక, లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం, చిన్న చిన్న దూరాలకు వెళ్లాలనుకున్నప్పుడు బైకో, కారో వాడకుండా సైకిల్‌పై వెళ్లడం వంటివి చేస్తే చాలని సలహా ఇస్తున్నారు! సిటీప్లస్