![Bollywood Actress Deepika Padukone Visits Tirumala By Walk - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/15/deepika.jpg.webp?itok=RaDtsTSu)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం నడిచి వెళ్లారు. సామాన్య భక్తులతో కలిసి దాదాపు ముడున్నర గంట పాటు నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. నడక మార్గంలో దీపికా పదుకుణేతో భక్తులు సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.
అనంతరం తిరుమలలోని రాధేయం అతిధి గృహం చేరుకున్నా దీపికా పదుకుణే.. ఇవాళ రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయమే స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. అనంతరం విఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు..
Comments
Please login to add a commentAdd a comment