ఆస్పత్రికి వెళ్లిన కల్కి భామ.. త్వరలోనే గుడ్‌న్యూస్‌! | Deepika Padukone visits hospital with mother ahead of baby arrival | Sakshi
Sakshi News home page

Deepika Padukone: ఆస్పత్రికి వెళ్లిన దీపికా పదుకొణె..త్వరలోనే గుడ్‌న్యూస్‌!

Sep 8 2024 7:12 AM | Updated on Sep 8 2024 11:14 AM

Deepika Padukone visits hospital with mother ahead of baby arrival

బాలీవుడ్ భామ దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించిన ముద్దుగుమ్మ.. ఈ నెలలోనే  మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నెలాఖరులోహా అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. తాజాగా తన తల్లి ఉజ్జల పదుకొణెతో కలిసి ముంబయిలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే దీపికా పదుకొణె రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రి వెళ్లనట్లు తెలుస్తోంది. ఇటీవలే తన భర్తతో కలిసి సిద్ధివినాయక ఆలయంలో పూజలు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితమే తన భర్తతో కలిసి  మెటర్నిటీ ఫోటో షూట్‌ పిక్స్‌ పంచుకున్నారు. షేర్‌ చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఫోటోలు వైరలయ్యాయి.

ప్రస్తుతం గర్భంతో ఉన్న దీపికా పదుకొణె సినిమాలకు విరామం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్స్‌లో పాల్గొనదని తెలుస్తోంది. ఇటీవలే ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి కల్కి 2898  ఏడీ సినిమాతో అభిమానులను అలరించింది. కల్కి పార్ట్‌-2 లోనూ దీపికా కనిపించనుంది. అంతే కాకుండా బాలీవుడ్ మూవీ సింగం ఎగైన్‌లోనూ నటించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement