
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ జంట ఒకరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. దీపికా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఈ దంపతులు ప్రకటించారు. త్వరలోనే ఈ జంట తమ మొదటి బిడ్డను జీవితంలోకి ఆహ్వానించనున్నారు.
అయితే తాజాగా రణ్‌వీర్ సింగ్ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. దీంతో వీరిద్దరిపై మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ జంట ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో మెరిసింది. రణవీర్‌తో కలిసి తిరిగివచ్చిన దీపికా జంటగా కనిపించారు. అయితే పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంపై ఇప్పటివరకు రణ్‌వీర్ సింగ్ స్పందించలేదు. దీపికా ఈ ఏడాది సెప్టెంబరులో తమ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.
దీపికా సినిమాల విషయానికొస్తే రణవీర్ సింగ్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్‌లతో కలిసి సింఘమ్ ఎగైన్‌లో కనిపించనుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీలతో కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించింది. మరోవైపు రణవీర్ సింగ్, కియారా అద్వానీ జంటగా డాన్- 3 చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment