దీపిక పదుకొణేకు రణ్‌వీర్ స్పెషల్ విషెస్.. సోషల్ మీడియాలో వైరల్..! | Ranveer Singh Special Wishes To Deepika Padukone Movie | Sakshi
Sakshi News home page

Ranveer Singh: భార్యపై మరోసారి అభిమానం చాటుకున్న రణ్‌వీర్ సింగ్.. ఫోటో వైరల్..!

Oct 5 2022 3:38 PM | Updated on Oct 5 2022 3:49 PM

Ranveer Singh Special Wishes To Deepika Padukone Movie - Sakshi

 బాలీవుడ్‌ రొమాంటిక్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొనే. ఈ ప్రేమ జంట ఎల్లప్పుడూ సోషల్ మీడియా పోస్ట్‌లతో అభిమానులను అలరిస్తుంటారు. తన భార్య సాధించిన విజయాల గురించి ఎంతో గర్వపడుతున్నట్లు చాలాసార్లు స్పష్టం చేశారు. తాజాగా ఆయన దీపికా పదుకొణెపై సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ప్రస్తుతం ఆమె ఓ షో కోసం పారిస్ వెళ్లగా.. అక్కడ ఏర్పాటు చేసిన ఆమె ఫోటో ముందు నిలబడి ఫోజులిచ్చాడు రణ్‌వీర్‌ సింగ్. 

రణ్‌వీర్ సింగ్ ఒక సుందరమైన శీర్షికతో దీపికకు శుభాకాంక్షలు తెలిపాడు. తన ఇన్‌స్టాలో రాస్తూ.. '.ఈరోజు గొప్ప ప్రదర్శన బేబీ! దీపికా పదుకొణేను' ట్యాగ్ చేశారు. రణ్‌వీర్ విషయానికి వస్తే చివరిసారిగా జయేష్‌ భాయ్ జోర్దార్‌ సినిమాలో కనిపించారు. ఇది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. రణ్‌వీర్ తదుపరి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న సిర్కస్ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌లో కనిపించనున్నాడు. రణ్‌వీర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరో రొమాంటిక్ కామెడీ చిత్రం 'రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ'కోసం కరణ్ జోహార్‌తో జతకడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అలియా భట్ కథానాయికగా నటిస్తోంది.

మరోవైపు దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్‌తో కలిసి యాక్షన్ థ్రిల్లర్ పఠాన్‌లో కనిపించనుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జనవరి 2023లో థియేటర్లలోకి రానుంది. ప్రభాస్ నటిస్తున్నప్రాజెక్ట్ కె చిత్రంతో ఆమె తెలుగులోకి కూడా అరంగేట్రం చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement