Deepika-Ranveer Video From Sports Award Show Goes Viral - Sakshi
Sakshi News home page

Deepika-Ranveer: రణ్‌వీర్‌ను పట్టించుకోని దీపికా.. వీడియో వైరల్

Published Sun, Mar 26 2023 11:12 AM | Last Updated on Sun, Mar 26 2023 12:25 PM

Deepika-Ranveer video from Sports Award Show Goes Viral - Sakshi

బాలీవుడ్ రొమాంటిక్ కపుల్స్‌లో దీపికా పదుకొణె- రణ్‌వీర్‌ సింగ్ జంట ఒకరు. ఎక్కడికెళ్లినా ఈ ప్రేమజంటపైనే అందరి దృష్టి ఉంటుంది. అంతే కాదు వీరిద్దరు చాలా అన్యోన్యంగా కనిపిస్తారు కూడా. ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఫోటోలకు ఫోజులిస్తారు. మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌గా ఈ జంటకు పేరుంది. అయితే ఇటీవల జరిగిన ఓ స్పోర్ట్స్ అవార్డ్‌ ఈవెంట్‌లో దీపికా-రణ్‌వీర్ సింగ్ జంట అభిమానులకు షాకిచ్చింది. ఎందుకంటే ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన జంట ఒకరికొకరు దూరం పాటించారు. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై మరోసారి చర్చకు దారితీసింది.

దీపికా-రణ్‌వీర్ స్టోర్ట్స్‌ అవార్డ్స్‌ ఈవెంట్‌కు వెళ్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వీడియోలో రణ్‌వీర్‌ సింగ్.. దీపికా చేయి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె కనీసం పట్టించకోలేదు. దీంతో అలాగే ఇద్దరు నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఈ వీడియో చూసిన అభిమానులు వీరిమధ్య గొడవలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

ఓ నెటిజన్ రాస్తూ.. 'దీపికా కోపంగా ఉంది. అందుకే రణ్‌వీర్‌ చేతిని పట్టుకోలేదు. ఈవెంట్‌కి ముందు వాళ్ల మధ్య గొడవలు జరిగినట్లు అనిపిస్తోంది.' అంటూ కామెంట్స్ చేశారు. మరొకరు రాస్తూ..'ఇద్దరి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ఒకరు చేయి ఒకరు పట్టుకోవడానికి ఇష్టంగా లేరు.' అంటూ రాసుకొచ్చారు. 

కాగా.. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కించిన రామ్-లీలా సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట 2018లో ఇటలీలో సన్నిహితుల వేడుకలో పెళ్లి చేసుకున్నారు. అయితే గతంలో దీపికా పదుకొనె-రణ్‌వీర్‌ సింగ్‌లు విడాకులు తీసుకోబుతున్నారంటూ ప్రచారం జరిగింది. రణ్‌వీర్‌ నగ్న ఫొటోషూట్‌ వివాదం నుంచి వారి వైవాహిక బంధంలో మనస్పర్థలు వచ్చాయని, అందువల్లే వీరు విడిపోతున్నారనే రూమర్స్ వినిపించాయి. అయితే విడాకుల రూమర్స్‌పై దీపికా కొట్టిపారేసింది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని.. రణ్‌వీర్‌తో అంతా బాగానే ఉందని తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement