Ram Leela
-
విషాదం: రామజపంతో కుప్పకూలిన ‘హనుమాన్’
Sudden Death Video: అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో.. సోమవారం దేశమంతా భక్తిపారవశ్యంతో ఊగిపోయింది. పల్లెపట్టణం తేడా లేకుండా రామ మందిర వేడుకల్ని ఘనంగా చేసుకున్నాయి. దేశం నలుమూలల ఒక పండుగ వాతావరణం కనిపించింది. ఆలయాల్లో బయటా.. అన్నదానాలు.. బాణాసంచా కాల్చి సంబురాలు.. రథయాత్రలు.. ఊరేగింపులు.. రామాయణ ఘట్టాల్ని నాటక రూపంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో హర్యానా భివానీలో నిర్వహించిన ‘రామ్‌లీలా’లో విషాదం చోటుచేసుకుంది. హనుమంతుడి వేషధారణలో ఉన్న నటుడు రామ నామం జపిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే ఆయన నటిస్తున్నారేమో అనుకుని అంతా చప్పట్లు కొట్టగా.. రాముడి వేషధారణలో ఉన్న నటుడు దగ్గరగా వెళ్లి చూసేసరికి చలనం లేకుండా పడి ఉన్నాడు. హుటాహుటిన అలాగే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. भिवानी में घटी दुखद घटना, श्री राम मूर्ति प्राण प्रतिष्ठा के उपलक्ष्य में हनुमान बने कलाकार ने त्यागे प्राण,भगवान राम की झांकी के दौरान श्री राम के चरणों में त्यागे प्राण।डॉक्टरों के मुताबिक कलाकार को हार्ट अटैक आने से हुई मौत। #RamMandirPranPrathistha #Haryana #bhiwani… pic.twitter.com/uBRwsRcT50 — Haryana Tak (@haryana_tak) January 23, 2024 Video Credits: Haryana Tak మృతుడి పేరును హరీష్ మెహతా. విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పని చేసిన ఆయన పదవీ విరమణ పొందారు. గత పాతికేళ్లుగా ఆయన హనుమంతుడి వేషధారణతో అలరిస్తూ వస్తున్నారు. సోమవారం ఒకవైపు అయోధ్య ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమమయంలో భివానీ జవహార్ చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. -
మహిళలు కేవలం దాని కోసమే కాదు: కంగనా రనౌత్ గట్టి కౌంటర్
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటి కంగనా. ఇటీవలే చంద్రముఖి-2 చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించింది. రాఘవ లారెన్స్ నటించిన ఈ మూవీని రజినీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం తేజస్ అనే మూవీతో మరోసారి అలరించేందుకు సిద్ధమైంది కంగనా. ఈ చిత్రంలో యుద్ధ విమాన పైలెట్‌గా కనిపించనుంది. అయితే ఇటీవలే దసరా సందర్భంగా దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రావణం దహనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంగనా రనౌత్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా రావణ దహనం చేసిన సంగతి తెలిసిందే. రామలీలా మైదానంలో రావణ్ దహన్ చేసిన మొదటి మహిళగా రనౌత్ చరిత్ర సృష్టించింది. ఒక మహిళ రావణుడి దిష్టిబొమ్మను బాణం విసిరి తగులబెట్టడం ఇదే మొదటిసారి. అయితే ఓ నెటిజన్ ట్విటర్లో గతంలో కంగనా స్విమ్షూట్తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈమె కంగనా రనౌతేనా?.. మోదీ ప్రభుత్వాన్ని ఎంటర్టైన్ చేస్తున్న ఓకే ఒక్క బాలీవుడ్ లేడీ అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన భాజపా మాజీ ఎంపీ సుబ్రమణియమ్ స్వామి నెటిజన్ ట్వీట్‌కు స్పందించారు. కంగనాపై వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేశారు. మాజీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. ' కంగనా కోసం ఎస్పీజీ సంస్థ కాస్తా ఎక్కువగానే పని చేస్తోంది. రాంలీలా మైదానంలో చివరి రోజున ఆమెను ముఖ్య అతిథిగా ఎంపిక చేశారంటే ఎంత మర్యాద ఇస్తున్నారో అర్థమవుతోంది. అది ఒక గౌరవం లేని సంస్థ' అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే ఇది చూసిన కంగనా రనౌత్.. సుబ్రమణ్య స్వామికి తనదైన శైలిలో కౌంటరిచ్చింది. కంగనా తన ట్వీట్లో రాస్తూ.. 'నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు కేవలం నాకు శరీరమే కారణమని అనుకుంటున్నట్లు ఉన్నారు. నా స్విమ్‌సూట్ ఫోటో గురించి ఇంత నీచంగా మాట్లాడారంటే మీ స్వభావం అర్థమవుతోంది. మహిళల విషయంలో మీ వక్రబుద్ధి స్పష్టంగా తెలుస్తోంది. అదే స్థానంలో ఒక యువకుడు ఉంటే ఇలాంటి మాటలు అనేవారా? భవిష్యత్తులో అతనొక గొప్ప నాయకుడు అవుతాడని చెప్పేవారు. అంతే కానీ రాజకీయాల్లోకి రావడానికి తన శరీరాన్ని వాడుకోవడం లేదు కదా అనేవారు.' అని రాసుకొచ్చింది. ఇది చూస్తుంటే మీలో పాతుకుపోయిన లింగవివక్ష, స్త్రీల పట్ల మీ వక్రబుద్ధి ఏంటో తెలుస్తోంది. స్త్రీలు కేవలం సెక్స్ కోసం మాత్రమే కాదు. వారికి మెదడు, గుండె, చేతులు, పాదాలు వంటి ఇతర అవయవాలు కూడా ఉన్నాయి. ఒక పురుషుడిలాగే గొప్ప నాయకురాలిగా ఉండటానికి అవసరమైన అన్ని అర్హతలు మహిళలకు ఉన్నాయి. ' అంటూ కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. కాగా.. కంగనా నటించిన తేజస్ అక్టోబర్ 27న రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఆమె నటిస్తోన్న మరో చిత్రం ఎమర్జన్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది. With a swimsuit picture and sleazy narrative you are suggesting that I have nothing else to offer except for my flesh to get my way in politics ha ha I am an artist arguably the greatest of all time in hindi films, a writer, director, producer, revolutionary right wing… https://t.co/dEcqamn7qO — Kangana Ranaut (@KanganaTeam) October 26, 2023 -
దీపికా- రణ్‌వీర్‌కు అసలేమైంది.. మరోసారి తెరపైకి రూమర్స్!
బాలీవుడ్ రొమాంటిక్ కపుల్స్‌లో దీపికా పదుకొణె- రణ్వీర్ సింగ్ జంట ఒకరు. ఎక్కడికెళ్లినా ఈ ప్రేమజంటపైనే అందరి దృష్టి ఉంటుంది. అంతే కాదు వీరిద్దరు చాలా అన్యోన్యంగా కనిపిస్తారు కూడా. ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఫోటోలకు ఫోజులిస్తారు. మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌గా ఈ జంటకు పేరుంది. అయితే ఇటీవల జరిగిన ఓ స్పోర్ట్స్ అవార్డ్ ఈవెంట్లో దీపికా-రణ్వీర్ సింగ్ జంట అభిమానులకు షాకిచ్చింది. ఎందుకంటే ఈవెంట్లో పాల్గొనేందుకు వచ్చిన జంట ఒకరికొకరు దూరం పాటించారు. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై మరోసారి చర్చకు దారితీసింది. దీపికా-రణ్వీర్ స్టోర్ట్స్ అవార్డ్స్ ఈవెంట్‌కు వెళ్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వీడియోలో రణ్వీర్ సింగ్.. దీపికా చేయి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె కనీసం పట్టించకోలేదు. దీంతో అలాగే ఇద్దరు నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఈ వీడియో చూసిన అభిమానులు వీరిమధ్య గొడవలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. 'దీపికా కోపంగా ఉంది. అందుకే రణ్వీర్ చేతిని పట్టుకోలేదు. ఈవెంట్‌కి ముందు వాళ్ల మధ్య గొడవలు జరిగినట్లు అనిపిస్తోంది.' అంటూ కామెంట్స్ చేశారు. మరొకరు రాస్తూ..'ఇద్దరి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ఒకరు చేయి ఒకరు పట్టుకోవడానికి ఇష్టంగా లేరు.' అంటూ రాసుకొచ్చారు. కాగా.. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కించిన రామ్-లీలా సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట 2018లో ఇటలీలో సన్నిహితుల వేడుకలో పెళ్లి చేసుకున్నారు. అయితే గతంలో దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్‌లు విడాకులు తీసుకోబుతున్నారంటూ ప్రచారం జరిగింది. రణ్వీర్ నగ్న ఫొటోషూట్ వివాదం నుంచి వారి వైవాహిక బంధంలో మనస్పర్థలు వచ్చాయని, అందువల్లే వీరు విడిపోతున్నారనే రూమర్స్ వినిపించాయి. అయితే విడాకుల రూమర్స్‌పై దీపికా కొట్టిపారేసింది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని.. రణ్వీర్తో అంతా బాగానే ఉందని తెలిపింది. #DeepikaPadukone #RanveerSingh weird chemistry at event pic.twitter.com/cXO6RRRvYQ — Harminder 🍿🎬🏏 (@Harmindarboxoff) March 24, 2023 -
ఢిల్లీలో 50వేల మందితో ‘కిసాన్ గర్జన’.. మరో రైతు ఉద్యమానికి సన్నాహమా?
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నెలలతరబడి వేలాది మంది రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసింది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. కానీ, కేంద్రం వైఖరిపై ఎప్పటికప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో సోమవారం సుమారు 50వేల మంది రైతులు సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్ పిలుపు ఇచ్చిన ‘కిసాన్ గర్జన’ ర్యాలీ కోసం ఢిల్లీ రామ్‌లీలా మైదానానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రైతులు. రైతుల పరిస్థితులను మెరుగుపరిచేందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రైతు రుణాల మాఫీ, పంటలకు సరైన ధర, పాడైన పంటలకు పరిహారం వంటి డిమాండ్లతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ సమావేశం రైతలు బలాన్ని సూచిస్తుందని పలువురు తెలిపారు. మరోవైపు.. సాగు చట్టాల రద్దు సమయంలో రైతుల డిమాండ్లు తీరుస్తామని కేంద్ర ప్రభుత్వ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీల అమలును గుర్తు చేసినట్లవుతోందన్నారు. బీకేఎస్ డిమాండ్లలో ప్రధానమైనవి.. ► అన్ని పంట ఉత్పత్తులపై లాభదాయకమైన ధరలు ► పంట ఉత్పత్తులపై ఎలాంటి జీఎస్టీ ఉండకూడదు ► కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్న సాయాన్ని పెంచడం ► జన్యుపరంగా మార్పు చేసిన ఆవాల విత్తనాలకు అనుమతులు ఇవ్వకూడదు ► రైతు అనుకూల ఎగుమతి, దిగుమతులు విధానాన్ని రూపొందించటం ► 15 ఏళ్ల వాహనాల తక్కు పాలసీ నుంచి రైతుల ట్రాక్టర్లకు మినహాయింపు ఇవ్వడం కాంగ్రెస్ హెచ్చరిక.. దేశ రాజధానిలో మరోసారి భారీ స్థాయిలో రైతులు సమావేశం కావడంపై హెచ్చరికలు చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. గతంలో జరిగిన విషయాల నుంచి నేర్చుకుని భవిష్యత్తులో మళ్లీ ఎదురవకుండా చూసుకోవాలన్నారు. రైతుల సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాల్సిన సమయం ఇదేనని, లేదంటే వారు మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు.. గతంలో రైతుల ఆందోళనలతో ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కిసాన్ గర్ణన వేళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రామ్‌లీలా మైదనానికి వెళ్లే దారులను మళ్లించారు. మహరాజ్ రంజీత్ సింగ్ మార్గ్, మిర్దార్ద్ చౌక్, మింటో రోడ్, అజ్మేరి గేట్, ఛమన్‌లాల్ మార్గ్, ఢిల్లీ గేట్ వంటి మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చారు. ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ తొలిరోజున సరిహద్దులో ఉద్రిక్తత.. బెళగావిలో 144 సెక్షన్ అమలు -
అట్టహాసంగా అయోధ్యలో దీపావళి వేడుకలు... హాజరుకానున్న మోదీ
న్యూఢిల్లీ: దీపావళి వేడుకలో యావత్ భారత్ ఆందహేళిలో మునిగితేలే ఒక రోజు ముందు కూడా దీపోత్సవ వేడుకలు పలు చోట్ల జరుగుతుంటాయి. ఈసారి అయోధ్యలో దీపావళి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు ఒక రోజుముందు అనగా... అదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అయోధ్యలోని దీపోత్సవ వేడుకల సన్నహాలను పరిశీలించేందుకు బుధవారం పవిత్ర నగరాన్ని సందర్శించనున్నారని సమాచారం. ఆయన రామాలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ప్రధాని మోదీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రాని పరిశీలిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి కొత్తగా నిర్మిస్తున్న భారీ రామాలయాన్ని సందర్శించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. షెడ్యూల్‌ప్రకారం ఆయన రామలీలా పాత్రలను వేసేవారిని స్వాగతించేందుకు రామ్ కథా పార్కును కూడా సందర్శించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు రామమందిర నిర్మాణ కమిటీ రెండు రోజుల సమీక్షా సమావేశం ముగియడంతో ట్రస్ట్ సభ్యలు మీడియాతో మాట్లాడుతూ...రామమందిర నిర్మాణ పనులు దాదాపు 50శాతం జరిగాయని పేర్కొన్నారు. అలాగే ఆదివారం ప్రారంభమయ్యే మూడు రోజుల దీపోత్సవ వేడుకల్లో రష్యా, మలేషియా, శ్రీలంక, ఫిజీ దేశాలకు చెందిన కళాకారుల రాంలీలా ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలవడమే గాక ఆవుపేడతో తయారు చేసిన దాదాపు 17 లక్షల మట్టి దీపాలను వెలగించి రికార్డు సృష్టించనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు సరయునది వద్ద గ్రీన్ డిజిటల్ బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు కూడా చేసినట్ల తెలిపారు. (చదవండి: విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి....) -
హీరోయిన్ను ఏడిపించిన దర్శకుడు!
దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ సినిమాల్లో పనిచేయడమంటే మాటలు కాదు. ఆయన సినిమాల్లో పనిచేసే నటులు, టెక్నీషియన్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఆయన తాజా చిత్రం 'బాజీరావు మస్తానీ'లో షూటింగ్లో ప్రియాంక చోప్రా ఏడ్చేసిందట. ఈ విషయాన్ని హీరో రణ్వీర్ సింగ్ వెల్లడించాడు. భన్సాలీ కారణంగానే ఆమె కంటతడి పెట్టిందని తెలిపాడు. 'బాజీరావు మస్తానీ' చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా విలేకరుల సమావేశంలో రణ్వీర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మొదట ప్రియాంక మాట్లాడుతూ ' చిత్రం కోసం నేనేమీ కష్టపడలేదు. చాలా కష్టపడింది దీపిక, రణ్వీర్లే. నేను సెట్స్‌కు వచ్చి తొమ్మిది అడుగుల చీరను కట్టుకోవడం, సంప్రదాయ నగలు ధరించడం చేసే దాన్ని. అది కొంచెం కష్టమే అనిపించేది' అని పేర్కొంది. ఈ సమయంలో రణ్వీర్ మైక్ అందుకొని 'నన్ను చెప్పనివ్వండి. మూడో రోజు షూటింగ్ సందర్భంగా ప్రియాంక బోరున ఏడ్చేసింది. సంజయ్‌లీలా భన్సాలీతో రెండోసారి సినిమా చేస్తున్నారు మీకేమైనా 'పిచ్చా' అని మమ్మల్ని తిట్టింది. కానీ త్వరగానే ఆమె పనితీరును ఆకళింపు చేసుకొని అత్యద్భుతంగా నటించింది' అని చెప్పాడు. 'బాజీరావ్ మస్తానీ'లో టైటిల్ రోల్స్ పోషిస్తున్న రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే గతంలో భన్సాలీతో 'రామ్‌లీలా' సినిమా చేసిన సంగతి తెలిసిందే. -
'రామ్‌లీల' టీంతో సాక్షి చిట్‌చాట్
-
రామ్ లీలలు
అమెరికాలో స్థిరపడిన తెలుగు కుర్రాడు... తెలివైన కుర్రాడు రామ్. జీవితాన్ని హ్యాపీగా, సాఫీగా ఎలా ఉంచుకోవాలో అతనికి బాగా తెలుసు. అందుకోసం ఎన్ని లీలలైనా చేస్తుంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురైన మలుపులే ఈ ‘రామ్‌లీల’ సినిమా అంటున్నారు నిర్మాత దాసరి కిరణ్‌కుమార్. హవీష్, అభిజిత్, నందిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీపురం కిరణ్ దర్శకుడు. లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో కోనేరు సత్యనారాయణ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సినిమా ఇది. హవీష్‌ను స్టార్‌గా నిలబెట్టే సినిమా అవుతుంది. అభిజిత్, నందిత పాత్రలు ఈ చిత్రానికి వెన్నుముకగా నిలుస్తాయి. ఎస్.గోపాల్‌రెడ్డి ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అలాగే విస్సు రాసిన సంభాషణలు పటాసుల్లా పేలతాయి. మా నిర్మాత చాలా పెద్ద సినిమా స్థాయిలో ఎక్కువ థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు’’ అని చెప్పారు. -
బ్రహ్మాండంగా ఉంటుంది! - దాసరి కిరణ్
‘‘మా గత చిత్రం ‘జీనియస్’కన్నా ఈ చిత్రాన్ని ఇంకా బ్రహ్మాండంగా నిర్మించాం. శ్రీపురం కిరణ్ దర్శకుడు కావాలని చాన్నాళ్లుగా కృషి చేస్తున్నాడు. ఈ చిత్రం ఆ కలను నెరవేర్చడమే కాదు... దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. నటీనటులందరూ తమ తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. మలేసియా నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఈ నెల 7న పాటలను, 20న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దాసరి కిరణ్‌కుమార్ చెప్పారు. కోనేరు సత్యనారాయణ సమర్పణలో లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో దాసరి కిరణ్ నిర్మించిన చిత్రం ‘రామ్‌లీలా’. హవీష్, అభిజిత్, నందిత, అక్ష హీరో హీరోయిన్లు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ చిత్రకథ చాలా కొత్తగా ఉంటుందని లంకాల బుచ్చిరెడ్డి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘రజనీకాంత్ నటించిన ‘నరసింహ’ చిత్రానికి పని చేసిన 20 మంది ఘోస్ట్ రైటర్స్‌లో నేనూ ఒకణ్ణి. ఆ చిత్రంతో నా కెరీర్ ప్రారంభమైంది. రాఘవేంద్రరావుగారు ‘గంగోత్రి’ సినిమా చేస్తున్న సమయంలో ఆయన్ను కలిసి, ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయన చేతుల మీదగా నా తొలి చిత్రం టీజర్ ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉంది. పధ్నాలుగా మంది కొత్త దర్శకుల చిత్రాలకు ఎస్. గోపాల్‌రెడ్డిగారు ఛాయాగ్రహణం చేశారు. నేను పదిహేనో దర్శకుణ్ణి. ఈ చిత్రానికి అవకాశం ఇచ్చిన కిరణ్‌కుమార్‌కి ధన్యవాదాలు’’ అన్నారు. పలు చిత్రాలకు రచయితగా వ్యవహరించాననీ, ఈ చిత్రానికి పూర్తి స్థాయి సంభాషణల రచయితగా చేశానని విస్సు చెప్పారు. ఈ వేడుకలో సహనిర్మాత ముత్యాల రమేశ్, ఎస్. గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూలాల్ని మరచిపోకూడదు!
యువత ఎంత ట్రెండీగా ఉన్నా, ఫార్వార్డ్‌గా ఆలోచించినా మన మూలాల్ని మాత్రం మరచిపోకూడదు. ఈ నేపథ్యంలోనే ‘రామ్‌లీల’ సినిమా ఉంటుందంటున్నారు దాసరి కిరణ్‌కుమార్. ‘జీనియస్’ తర్వాత రామదూత క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మిస్తోన్న సినిమా ఇది. హవీష్, అభిజిత్, నందిత ముఖ్యతారలు. రచయిత శ్రీపురం కిరణ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. 3 పాటలు, 5 రోజుల టాకీ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘అమెరికాలో ఓ తెలుగబ్బాయి నిజ జీవితంలో జరిగిన కథ ఇది. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. మలేసియాలోని అందమైన ప్రదేశాల్లో 21 రోజులు చిత్రీకరణ జరిపాం’’ అని తెలిపారు. ఎస్. గోపాలరెడ్డి ఛాయాగ్రహణం, విస్సు సంభాషణలు ఈ సినిమాకు హైలైట్స్ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముత్యాల రమేశ్, సమర్పణ: లంకాల బుచ్చిరెడ్డి, సారథ్యం: కోనేరు సత్యనారాయణ. -
దీపిక, రణ్‌వీర్‌లపై అరెస్టు వారంటు జారీ
రామ్ లీలా చిత్రంలో నటించిన దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ సహా దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీపై కూడా అరెస్టు వారెంటు జారీ అయ్యింది. ముజఫర్‌నగర్‌లోని ఓ కోర్టు ఈ వారంటు జారీ చేసింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ నేపథ్యంలో ఈ వారంట్లు జారీచేశారు. సినిమాకు మరో నిర్మాతగా త్యవహరించిన కిషోర్ లుల్లా, సంగీత దర్శకులు, గీత రచయితలపై కూడా వారంట్లు జారీ అయ్యాయి. వాళ్లందరినీ అరెస్టు చేసి జూన్ 4వ తేదీన కోర్టులో హాజరు పరచాలని ముంబై పోలీసు కమిషనర్‌ను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది ఈ సినిమాలో సన్నివేశాల గురించి ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. -
ఏ సినిమా ఎందుకు ఆడుతుందంటే...
ప్రతి శుక్రవారం ఏవో కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని విజయాలు, చాలా భాగం పరాజయాలు. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాపవడం, అతి తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ కొన్ని హిట్టవడం సినీసీమలో సర్వసాధారణం. దాంతో, వారం వారం సినీ దర్శక, నిర్మాతలు, తారల జాతకాలు మారిపోతుంటాయి. నిజానికి, ఎవరూ ఫ్లాప్ సినిమా తీయాలని అనుకోరు. అందరి లక్ష్యం - ప్రేక్షక జనాన్ని ఆకర్షించాలనే! బాక్సాఫీస్ వద్ద అఖండ విజయం సాధించాలనే! కానీ, కొన్ని సినిమాలకే అది సాధ్యమవుతుంటుంది. అసలు ఈ సినీ విజయాలకు తోడ్పడిన అంశాలేమిటో, అపజయాలకు కారణాలేమిటో తెలిస్తే? అవన్నీ శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే? సినిమా జయాపజయాలు అదృష్టాన్ని బట్టి ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ, శాస్త్రీయ ఆధారాలు, విశ్లేషణ ఆధారంగా సక్సెస్ రేటును ముందే పసిగట్టవచ్చన్నది నిపుణుల వాదన. బాక్సాఫీస్ విజయ సూత్రం ఏమిటన్నది సశాస్త్రీయంగా కనిపెట్టాలనీ, ఆ ఫార్ములా ఆధారంగా వరుస విజయాలను సాధ్యం చేయాలనీ చిరకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ మేనేజ్మెంట్ నిపుణుడు అరిందమ్ చౌధురి పదేళ్ళ క్రితం తన మేనేజ్మెంట్ సూత్రాలను బాలీవుడ్ చిత్ర నిర్మాణానికి తెచ్చారు. చిత్ర నిర్మాణానికి ముందే ప్రేక్షకుల సర్వేలు చేయడం లాంటి ప్రయత్నాలు చేశారు. వాటన్నిటినీ ఆధారంగా చేసుకొని ఆయన తీసిన తొలి చిత్రం ‘రోక్ సకో తో రోక్ లో’ (2004) తీశారు. తీరా, ఆ చిత్రం ఫ్లాపైంది. అయితే, అప్పటితో పోలిస్తే, ఇప్పుడు విశ్లేషణ పరికరాలు, పద్ధతులు చాలా మారాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఐ.బి.ఎం. సంస్థ ఆ టెక్నాలజీలను హిందీ చిత్ర పరిశ్రమకు తెచ్చింది. దర్శక, రచయితలు అప్పటికప్పుడు తమ మనసులో మెదిలిన ఆలోచనలను బట్టి సినిమాలకు విజయం సొంతమవుతుందని అనుకోవాల్సిన పని లేదంటోంది. అధ్యయనం ద్వారా సేకరించిన సమాచారాన్ని సృజనాత్మక ఆలోచనకు జతచేస్తే అప్పుడిక బాక్సాఫీస్ వద్ద విజయం సాధ్యమేనని ఐ.బి.ఎం. చెబుతోంది. ఎలా చేశారీ విశ్లేషణ? ఫలానా స్క్రిప్టుతో తీస్తున్న సినిమా ఆడుతుందా, ఆడదా అన్నది తెలుసుకోవడానికి ఐ.బి.ఎం. చిత్రమైన పద్ధతులను అనుసరించింది. సామాజిక సంబంధాల సైట్లలో అమితమైన ఆసక్తి రేపుతున్న ఓ పాతిక దాకా హిందీ చిత్రాలను విశ్లేషణకు స్వీకరించింది. ఫేస్బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్, రకరకాల బ్లాగులతో సహా పలు రకాల వేదికల ద్వారా వ్యక్తమయ్యే అభిప్రాయాలను సమీకరించింది. వాటి ద్వారా వచ్చిన దాదాపు 7 లక్షలకు పైగా పోస్ట్‌లను విశ్లేషించింది. అలా పరిశీలనకు ఎంచుకున్న చిత్రాల్లో ‘బర్ఫీ’, ‘ఏక్ థా టైగర్’, ‘భాగ్ మిల్ఖా భాగ్’, ‘కై పోచే’, ‘కహానీ’, ‘అగ్నిపథ్’ లాంటి పేరున్న చిత్రాలున్నాయి. ఎంచుకున్న సినిమా ఏ కోవకు చెందినది, దాని కథాంశమేమిటి, నటీనటులు ఎవరు లాంటి రకరకాల అంశాల ఆధారంగా వాటి విజయాన్ని అంచనా వేయవచ్చని ఐ.బి.ఎం. విశ్లేషకులు చెప్పారు. ఈ అంచనా పద్ధతికి వారు పెట్టిన పేరు - ‘సోషల్ సెంటిమెంట్ ఇండెక్స్’ (ఎస్.ఎస్.ఐ). ఫలించిన తొలి ప్రయత్నం? దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్‌లు నటించిన ‘(గోలియోం కీ రాస్లీలా...) రామ్‌లీలా’ చిత్రానికి ఈ ఎస్.ఎస్.ఐ. పద్ధతిని ఉపయోగించి చూసిన ఐ.బి.ఎం. నూటికి 73 పాళ్ళు ఆ సినిమా తొలివారం వసూళ్ళు బాగుంటాయని అంచనా వేసింది. ఆ ముందస్తు అంచనా నిజమైంది. తొలి వారం వసూళ్ళు బాగున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. దాంతో, ఐ.బి.ఎం. చెప్పిన ఆ ఎస్.ఎస్.ఐ. మీద అందరి దృష్టీ పడింది. హిట్టవుతుందన్న నమ్మకమెంత? 75 శాతం - ఐ.బి.ఎం. రూపొందించిన ‘సోషల్ సెంటిమెంట్ ఇండెక్స్’ (ఎస్.ఎస్.ఐ)ని బట్టి, రాజకీయ వాసనలున్న సినిమాకు బాక్సాఫీస్ వద్ద విజయావకాశాలు ఎక్కువని నూటికి 75 పాళ్ళ నమ్మకంతో చెబుతున్నారు. 69 శాతం - కామెడీ సినిమా హిట్టవుతుందని 69 పాళ్ళ మేర నమ్మకం. ఇలాంటి సినిమాల్లో పాటలు, డ్యాన్సులు, సంగీతం, పరభాషా చిత్రాల రీమేక్ కావడం లాంటివి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. 63 శాతం - చక్కటి సంగీతం ఉండి, ఇతర భాషల్లో హిట్టయిన సినిమాకు రీమేక్ అయ్యుండి, సదరు రీమేక్‌కు ఎవరైనా స్టార్ డెరైక్టర్ దర్శకత్వం వహిస్తే, అలాంటి సినిమా హిట్టవుతుందని 63 పాళ్ళ మేర నమ్మకం ఉంటోంది. 61 శాతం - యాక్షన్ సినిమా... దానికి ఓ స్టార్ డెరైక్టర్... ఈ రెండూ జత పడి, ఆ దర్శకుడే స్వయంగా నిర్మాణం కూడా చూసుకుంటే... ఇక కాసులు కురవడం ఖాయమని 61 శాతం మేర నమ్మకం వెల్లివిరుస్తోంది. 62 శాతం - చిన్న బడ్జెట్ చిత్రాలతో పోలిస్తే, భారీ బడ్జెట్ చిత్రాల విజయావకాశాలు ఎక్కువని 62 పాళ్ళు నమ్ముతున్నారు. -
దీపిక నాకు చాలా స్పెషల్
దీపికా పడుకొనే, రణ్వీర్ సింగ్ ఏ ముహూర్తంలో రాంలీలా సినిమాలో చేశారో గానీ, అప్పటినుంచి వాళ్లిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ మీదే కాదు.. బయట కూడా తెగ పండిపోతోంది. దీని గురించి ఎవరేమనుకున్నా పట్టించుకునే పరిస్థితిలో వాళ్లిద్దరూ లేరని సినీ పండితులు చెబుతున్నారు. దానికి తగ్గట్లే రణ్వీర్ సింగ్ కూడా చెబుతున్నాడు. దీపికకు తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని తాజాగా చెప్పాడు. అయితే తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమేనని అంటున్నాడు. ''దీపికకు నా జీవితంలో ప్రత్యేక స్థానముంది. నేను చాలా గౌరవించి, ఆరాధించే వ్యక్తుల్లో ఆమె ఒకరు. ఆమెకు చాలా సన్నిహితంగా నేను ఎదిగాను. ఆమె చాలా అద్భుతమైన వ్యక్తి. ఆమె అంటే నాకు చెప్పలేనంత ఆరాధన ఉంది'' అని రణ్వీర్ అన్నాడు. రాం లీలా సినిమా విడుదలైన తర్వాత నుంచి బయట ఏ పార్టీలో చూసినా వీరిద్దరి జంట తెగ కనపడుతోంది. అయితే, తమ మధ్య సంబంధం ఉన్నమాట మాత్రం వాస్తవం కాదని, బయటకు తిరగడం మామూలేనని రణ్వీర్ చెప్పాడు. ఆమెతోనే కాదు, ఇంకా చాలామందితో తాను బయటకు వెళ్తుంటానని అన్నాడు. వాళ్లందరూ దీపిక అంత ఫేమస్ కాదు కాబట్టి ఎవరికీ తెలియట్లేదని అన్నాడు. కలిసి తిరగడానికి దీపిక చాలా కూల్‌గా ఉంటుందని, ఆమె కంపెనీని తానెంతగానో ఎంజాయ్ చేస్తానని తెలిపాడు. అర్జున్ కపూర్ లాంటి స్కూలు స్నేహితులు, అసిస్టెంట్ డైరెక్టర్లతో కూడా తాను కలిసి బయటకు వెళ్తుంటానని, అందరు స్నేహితులను చాలా పట్టించుకుంటానని రణ్వీర్ అన్నాడు. ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నానని, ఎవరితోనైనా కలవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించేశాడు. తనకు లవేరియా వచ్చిందని గతంలో చెప్పిన మాట నిజమే కానీ, అది చాలా చెత్త ఇంటర్వ్యూ అని, దాన్ని పట్టించుకోవద్దని ఇప్పుడు అంటున్నాడు. -
పుల్ జోష్ మీద ఉన్న రామ్‌లీలా టీమ్
-
ఆ కిక్కే వేరు...
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం తెలివైనవాళ్ల లక్షణం అంటారు పెద్దలు. బాలీవుడ్ చిన్నది దీపికా పదుకొనే పెద్దల మాటలను అక్షరాలా ఫాలో అయిపోతుందేమో. ప్రస్తుతం టైమ్‌ని క్యాష్ చేసుకునే పని మీద ఉందట. కాక్టైల్, రేస్ 2, ఏ జవానీ హై దివానీ, చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, రామ్‌లీలా.. ఇలా వరుసగా ఐదు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన ఈ భామకు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ‘అందచందాల్లో మాత్రమే కాదు... అభినయంలోనూ దీపికా సూపర్’ అని బాలీవుడ్‌వారు తెగ కితాబులిచ్చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో భారీ నిర్మాతలు, దర్శకులకు దీపికా ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్ అయిపోయింది. తమ సినిమాలో దీపికా ఉంటే ఆ కిక్కే వేరని, తను చాలా లక్కీగాళ్ అని కూడా కొంతమంది బలంగా ఫిక్స్ అయ్యారట. ఫలితంగా దీపికా పారితోషికం అమాంతంగా పెరిగిందని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక పారితోషికం ‘కోట్’ చేస్తున్న తార దీపికాయేనట. నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని వినికిడి. ఒక్కసారిగా లైఫ్ ఇంత మంచి టర్నింగ్ తీసుకున్నందుకు దీపికా తెగ ఆనందపడిపోతోంది. ‘యజమానికి గర్వం... పొరుగువారికి అసూయ’... అనే ఓ టీవీ కంపెనీ ప్రకటన తరహాలో... దీపికా వైభవానికి ఇతర నాయికలు కుళ్లుకుంటున్నారట. కానీ, ఇదేం పట్టించుకునే స్థితిలో లేని దీపికా.. ‘‘అవకాశాల గురించి ఆలోచించాల్సిన పని లేకుండాపోయింది. ఇప్పుడు నాక్కావల్సిందల్లా నా కుటుంబంతో గడపడానికి కొంత సమయం’’ అంటోంది. -
’రామ్ లీలా’ పై నిషేదం!
-
నా వల్ల ఇతర నాయికలు లాభపడుతున్నారు
‘‘అప్పుడప్పుడు నేను తీసుకునే నిర్ణయాలకు నాలో నేనే నవ్వుకుంటాను. మనకేమైనా పిచ్చా లేక ఏదైనా ప్రాబ్లమా అని కూడా అనుకుంటాను’’ అంటున్నారు కరీనాకపూర్. ఈ అందగత్తె ఇలా తనపై తనే జోక్స్ వేసుకోవడానికి కారణం ఉంది. తన ఇంటివరకూ వచ్చిన అద్భుతమైన అవకాశాల్లో కొన్నింటిని చేతులారా వదులుకున్నారు కరీనా. వాటిల్లో ఇటీవల విడుదలైన ‘రామ్‌లీలా’ ఒకటి. ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి విజయవంతమైన చిత్రాలను వదులుకున్నప్పుడు కరీనా పై విధంగా అనుకుంటుంటారట. అలాగే మరో రకంగా కూడా అనుకుంటారామె. దాని గురించి కరీనా చెబుతూ -‘‘బంగారంలాంటి అవకాశాలను వదులుకున్నప్పుడు నేనేమాత్రం ఫీలవ్వను. ఎందుకంటే, జీవితం అప్పుడే అయిపోలేదుగా. అలాంటి అవకాశాలు భవిష్యత్తులో బోల్డన్ని వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే.. నేను వదులుకోవడం ద్వారా ఆ అవకాశాలను వేరే కథానాయికకు ఇస్తున్నాను. ఆ విధంగా వాళ్లు లాభపడుతున్నారు. ‘రామ్‌లీలా’ నేను వద్దనుకున్న తర్వాతే వేరే తారకు వెళ్లింది. సో... నాకు రావాల్సిన విజయం తనకు దక్కింది. కాబట్టి, నాకు ఆనందంగానే ఉంది’’ అని చెప్పారు. ఈ మాటలు విన్నవాళ్లు కరీనా ఓవర్‌గా మాట్లాడుతోందని అంటున్నారు. తనేదో ఉదారస్వభావంతో ఇతర నాయికలకు అవకాశం ఇచ్చినట్లుగా కరీనా మాట్లాడటంపట్ల కొంతమంది నాయికలు గరమ్ గరమ్‌గా ఉన్నారట. వారిలో దీపికా కూడా ఉన్నారని సమాచారం. సందర్భం చూసి, కరీనాకి దీపికా సమాధానం చెబుతుందని, ఆ సమయం త్వరగా వస్తే బాగుండునని ఔత్సాహికరాయుళ్లు ఎదురుచూస్తున్నారు. -
ఉత్తరప్రదేశ్ లో 'రామ్ లీలా'పై నిషేధం!
ఉత్తర ప్రదేశ్ లో 'రామ్ లీలా' ప్రదర్శనపై అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ నిషేధం విధించింది. మర్యాద పురుషోత్తం భగవాన్ రామ్ లీలా సమితి దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ అశోక్ పాల్ సింగ్, జస్టిస్ దేవి ప్రసాద్ సింగ్ లతో కూడిన బెంచ్ విచారించింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నవంబర్ 15 తేదిన విడుదలైన చిత్రంలో వివాదస్పద, అభ్యంతరకరమైన సన్నివేశాలు, డైలాగ్స్ ఉన్నాయని, ఈ చిత్రానికి సెన్సార్ బోర్బు సర్టిఫికెట్ రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కోన్నారు. అంతేకాకుండా హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ చిత్రానికి రామ్ లీలా పేరు పెట్టారని.. కావున ఈ చిత్రాన్ని నిషేధించాలని పిటిషనర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, సెన్సార్ బోర్డును, ఎరోస్ ఇంటర్నేషనల్, సంజయ్ లీలా భన్సాలీ లను పిటిషన్ లో పార్టీలను చేశారు. -
దీపికా పదుకోనె హ్యట్రిక్!
రామ్ లీలా చిత్రం విజయం సాధించడంతో బాలీవుడ్ తార దీపిక పదుకోనే హ్యట్రిక్ సాధించింది. రామ్ లీలా చిత్రంలో దీపిక నటనపై విమర్శకులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 2013 సంవత్సరంలో 'యే జవానీ హై దీవాని', 'చెన్నై ఎక్స్ ప్రెస్' సూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్న దీపిక రామ్ లీలాతో వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. యే జవానీ చిత్రంలో నైనా, చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో మీనమ్మ, రామ్ లీలాలో గుజరాతీ యువతిగా మూడు విభిన్నమైన పాత్రలతో సినీ ప్రేక్షకులను ఆలరించింది. రామ్ లీలా చిత్రంలో అందంతోనే కాక, తన అభినయంతో కూడా దీపిక మంచి మార్కులు కొట్టేసింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన రామ్ లీలా చిత్రంలో రణ్ వీర్ సింగ్ సరసన దీపిక పదుకోనె నటించింది. -
రామ్ లీలా ప్రదర్శనను అడ్డుకున్న భజరంగ్ దళ్!
బాలీవుడ్ చిత్రం రామ్ లీలా కు బజరంగ్ దళ్ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. రామ్ లీలా చిత్రంలోని సన్నివేశాలు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణంలో ప్రదర్శనను భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఐదు సినిమా హాల్స్ లో రామ్ లీలా ప్రదర్శనను అడ్డుకున్నట్టు ఇండోర్ బజరంగ్ దల్ డివిజన్ కన్వీనర్ తెలిపారు. ఈ చిత్రంలో అనేక అశ్లీల సన్నివేశాలున్నాయని, హనుమాన్ డ్యాన్స్ హిందువుల మనోభావాల్సి దెబ్బతీసే విధంగా ఉందని కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దాంతో చిత్రాన్ని ప్రదర్శిస్తున్న సినిమా హాల్స్ కు పోలీసులు భద్రత కల్పించారు. దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ లు నటించిన రామ్ లీలా చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నవంబర్ 15 తేది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
సినిమా రివ్యూ: సుందర దృశ్యకావ్యం 'రామ్ లీలా'
బాలీవుడ్ లో అద్బుతమైన సెట్టింగులు, భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా చిత్రాలు తీయాలంటే కేవలం సంజయ్ లీలా భన్సాలీకే సాధ్యమని 'హమ్ దిల్ దే చుకే సనమ్', 'దేవదాస్', 'బ్లాక్', 'గుజారిష్'లతో నిరూపించాయి. గుజరాత్ నేపథ్యంగా సుమారు 35 కోట్ల వ్యయంతో షేక్ స్పియర్ నవల 'రోమియో జూలియట్' ఆధారంగా 'రామ్ లీలా' చిత్రాన్ని భన్సాలీ రూపొందించారు. సంగీతపరంగా సినీ అభిమానులను ఆకట్టుకున్న 'రామ్ లీలా' నవంబర్ 15 శుక్రవారం విడుదలైంది. తుపాకుల శబ్దాలు, హింసాత్మక సంఘటనలు, పగ, ప్రతీకారంతో రెండు వర్గాలు రగిలిపోతున్న ఒక ఊర్లో ఓ జంట ఆకర్షణకు లోనై.. ఆకర్షణ ప్రేమగా మారితే దాని కి ఎన్నో అడ్డంకులు ఉంటాయనేది అక్షరాల నూటికి నూరుపాళ్లు కాదనలేని వాస్తవం. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఒక వర్గంలోని రామ్ అనే అబ్బాయి, మరో వర్గంలోని లీలా అనే అమ్మాయి ప్రేమించుకుంటే ఏమవుతుదంటే.. వారిద్దరిని వీడ దీయడం, అమ్మాయికి పెళ్లి ముహుర్తాలు పెట్టించడం, చివరికి వీటన్నింటిని ఎదురించి ఎలా ఒక్కటయ్యారనేది సహజసిద్ధంగా సినిమాటిక్ గా ఉండే క్లైమాక్స్. ఓ అందమైన ప్రేమకథలో ఉండే క్లైమాక్స్ కు భిన్నంగా ప్రేమలో గొప్పదన్నాన్ని అందంగా, కళాత్మకంగా, వీనులకు విందుగా ఉండే సంగీతంతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరపై మ్యాజిక్ చేయడమే 'రామ్ లీలా' కథ. రామ్ పాత్రలో రణ్ వీర్ సింగ్ ప్రేక్షకులను తన నటనతో మెస్మరైజ్ చేశాడు. గతంలో బ్యాండ్ బాజా బరాత్, లుటేరా చిత్రాలతో రణవీర్ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే రామ్ లీలా రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రణ్ వీర్ విశ్వరూపం ప్రదర్శించాడు. స్టార్ హోదాతో తాను అగ్రనటుల జాబితా, రేసులో తాను ఉన్నానని ఈ చిత్రం చెప్పకనే చెప్పాడు. 'తత్తడ్ తత్తడ్' ఈ చిత్రంలో ఎంట్రీ ఇచ్చి.. సిక్స్ ప్యాక్ దేహంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ చిత్రంతో రణ్ వీర్ కు మహిళాభిమానులను సంపాదించుకోవడం ఖాయం. రామ్ పాత్రకు రణ్ వీర్ పూర్తిగా న్యాయం చేశాడు. లీలాగా ఇక దీపిక పదుకొనే అభినయం, గ్లామర్ ను మాటల్లో ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్న దీపికాకు మళ్లీ తన ఖాతాలో సూపర్ హిట్ ను వేసుకుంది. తొలుత ఈ చిత్రంలో కరీనా కపూర్ ను, ఆతర్వాత ప్రియాంక చోప్రాను అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వారిని నిరాకరించడంతో ఆ అవకాశం దీపికాకు దక్కింది. కొన్ని సీన్లలో రణ్ వీర్ పై కూడా కూడా పైచేయి సాధించింది. రణ్ వీర్ తో కలిసి దీపికా నటించిన శృంగార భరిత సన్నివేశాలు వాహ్ అనిపించేలా ఉన్నాయి. రిచా చద్దా( గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్), సుప్రియా పాఠక్ కపూర్, అభిమన్యు సింగ్ లు గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ఈ చిత్రంలో క్యాస్ట్యూమ్స్ ప్రధాన పాత్రే ఉంది. క్యాస్ట్యూమ్స్ ద్వారా సినిమా చాలా రిచ్ గా కనిపించింది. ఓ పాటలో దీపికా పదుకొనే 30 కేజీల గాగ్రాను ధరించింది. దీపికాకు అంజు మోడీ క్యాస్టూమ్స్ డిజైన్ చేయగా, రణవీర్ సింగ్ కు మాక్సిమా బసు డిజైన్ చేశారు. గుజారీష్ చిత్రం తర్వాత మళ్లీ సంజయ్ లీలా భన్సాలీ మరోసారి మోంటీశర్మతో కలిసి సంగీత దర్శకత్వం వహించారు. భన్సాలీలో కనిపించే కళాత్మక అభిరుచి తన సన్నివేశాల్లోనే కాక సంగీతంలో కూడా ప్రతిబింబించింది. అందమైన ట్యూన్స్ కు ఆత్మను నింపి తెరపై అద్బుతాన్ని ఆవిష్కరించారు. ఈ సంవత్సరంలో వచ్చిన అన్ని ఆల్బం లన్నింటిలోనూ రామ్ లీలా సంగీతం ఓ ప్రత్యేకంగా ముందువరుసలో నిలిచింది. 'తత్తడ్ తత్తడ్', 'అంగ్ లగా దే', 'రామ్ చాహే లీలా', 'దిల్ కే ఏ గోలి చలే నైనాకు బందుక్ సే... ఇష్కియా డిష్కియా' చాలా బాగున్నాయి. ఎడిటర్ గా, నిర్మాతగా, స్ర్కీన్ ప్లే, దర్శకత్వంతో సంజయ్ లీలా భన్సాలీ అదరగొట్టారు. రామ్ లీలాను అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా ఓ దృశ్యకావ్యంగా భన్సాలీ రూపొందించారు. చిత్ర ద్వితీయార్ధంలో కొంత రొటిన్ గా అనిపించినా, క్లైమాక్స్ పై కొంత అసంతృప్తి కలిగినా.. ఎలాంటి సందేహాలు లేకుండా వీకెండ్ ను ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు రామ్ లీలా చక్కటి చాయిస్. -
'రామ్ లీలా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవు'
రామ్ లీలా చిత్ర విడుదలపై ఎలాంటి స్టే ఇవ్వలేదు అని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఆర్ఎమ్ అజీమ్ తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టం 1952 కింద సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ రామ్ లీలా కు లభించింది అని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రం విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవు అని అజీమ్ తెలిపారు. హిందువుల మనోభావాలలు దెబ్బతీసే విధంగా ఈ చిత్రంలోని సన్నివేశాలున్నాయని ప్రభు సమాజ్ ధార్మిక్ రామ్ లీలా కమిటీ ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. బాలీవుడ్ తారలు రణ్ వీర్ సింగ్, దీపికా పదుకోనెలు నటించిన రామ్ లీలా చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం నవంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. -
'రామ్‌లీలా' విడుదలపై ఢిల్లీ కోర్టు నిషేధం
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన 'రామ్‌లీలా' సినిమా విడుదలపై ఢిల్లీ కోర్టు నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు వెలువరించే వరకు సినిమా విడుదల చేయొద్దని ఆదేశించింది. ఆ సినిమా హిందువుల మత మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని ప్రభు సమాజ్ ధార్మిక్ రామ్ లీలా కమిటీ సహా ఆరు కక్షిదారులు వేసిన దావాను విచారణకు అదనపు జిల్లా కోర్టు స్వీకరించింది. ఈ సినిమాలో మితిమీరిన శృంగారం, హింస, అసభ్యత ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. హిందువుల దైవమైన శ్రీరాముని పేరు పెట్టిన ఈ సినిమా రామాయణంతో సంబంధముందన్న భావనతో ప్రేక్షకులు చూసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. రామభక్తులను తప్పుదోవ పట్టించేవిధంగా ఈ సినిమా ఉందని ఆరోపించారు. రామ్‌లీలా సినిమా పేరు మార్చాలని పిటిషన్లో కోరారు. ఈ నెల 15 దేశవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అంతకుముందు ఈ సినిమాపై ఓ స్వచ్ఛంద సంస్థ వేసిన దావాను ఢిల్లీ హైకోర్టు వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సంజయ్ లీలా బన్సాలీ, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేలపై పంజాబ్‌లో ఎఫ్ఐఆర్ నమోదమయింది. దీంతో వీరు పంజాబ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై 14లోగా వివరణ ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీచేసింది. -
‘రాంలీలాలో రణవీర్, దీపికాల కెమిస్ట్రీ అదిరింది’
ముంబై: రాంలీలా సినిమాలో ప్రధాన పాత్రధారులైన రణ్వీర్, దీపికా పదుకొణేల మధ్య కెమిస్ట్రీ బాగా కలిసిందని, ఇద్దరు సహజ ధోరణిలో నటించడం వల్ల సినిమా అనుకున్న దానికంటే బాగా వచ్చిందని దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలి పేర్కొన్నాడు. ఈ ఇద్దరు నటులకు ఒకరంటే మరొకరికి ఇష్టమని, ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభం నుంచి చివరిదాకా వారిరువురూ బాగా ఆస్వాదించారన్నాడు. ‘ట్రయలర్ హిట్ కాగానే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అందరిలోనూ ఎంతో ఆసక్తి రేకెత్తించింది. ఇది సినిమాకు ఎంతగానో ఉపయోగపడింది. ఓ ప్రేమకథా చిత్రంలో హీరో, హీరోయిన్ లమధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చినట్టయితే, వారిద్దరి ప్రేమను వీరు ఆస్వాదించినట్లయితే... అటువంటి ప్రేమకథా చిత్రాలు విజయవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి’ అని భన్సాలి అభిప్రాయపడ్డాడు. వీరిరువురి కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగా పండిందన్నాడు. అందువల్ల ఈ గొప్పదనమంతా వారిరువురికే దక్కుతుందన్నాడు. నిజజీవితంలో వారిరువురి మధ్య ఏదైనా ఉందా లేదా అనే విషయం తనకు తెలియదని, సినిమా దర్శకుడిగా అది తనకు సంబంధం లేని విషయమని అన్నాడు. వారిద్దరినీ అలా చూడడం ఎంతో ఉత్సుకత కలిగించిందన్నాడు. వారిరువురూ ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించారన్నాడు. ఏదిఏమైనప్పటికీ తప్పనిసరిగా తన దృష్టంతా సినిమాపైనే ఉండక తప్పదన్నాడు. ఈ సినిమాతో అనుసంధానం కావాల్సింది ప్రేక్షకులేనన్నాడు. అన్నిటికంటే అదే ముఖ్యమన్నాడు. ఒకే విషయాన్ని ఏ వ్యక్తి అయినా పదే పదే చెబితే విసిగించినట్లవుతుందన్నాడు. అందువల్ల వూహించినదానికంటే భిన్నంగా తీసినపుడే ప్రేక్షకులు సినిమాలను బాగా ఆదరిస్తారన్నాడు. -
బాలీవుడ్ తెరపై భారీ హంగామా!
దీపావళి పండగ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయింది. ఆ సెలబ్రేషన్ మూడ్‌లోంచి ఇప్పుడిప్పుడే బయటికొస్తున్న బాలీవుడ్ ప్రేక్షకులు, ఇప్పుడు సినిమాల పరంగా పండగ చేసుకోబోతున్నారు. ఎందుకంటే, బాలీవుడ్లో ఈ నెల మొత్తం పండగ వాతావరణమే. ఈ మధ్యకాలంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆరు భారీ బడ్జెట్ చిత్రాలు ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. అన్నీ అగ్ర తారల చిత్రాలే. ఆసక్తికరమైన కథాంశాలే. ప్రేక్షకుల చెంతకు ఇప్పటికే ‘క్రిష్ 3’ చేరి, భారీ వసూళ్లు రాబడుతోంది. మిగతా చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. సత్య-2: రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘సత్య 2’ చిత్రం వాస్తవానికి అక్టోబర్ 25న విడుదల కావాల్సి ఉండగా, చిత్ర నిర్మాతల్లో ఒకరైన అరుణ్ శర్మతో వివాదం కారణంగా ఈ చిత్రాన్ని ఈ నెల 8కి వాయిదా వేశారు. మాములుగా వర్మ సినిమా అంటేనే అంచనాలు భారీ ఎత్తున ఉంటాయి. ఇక, చాక్లెట్ బోయ్‌లా ఉండే శర్వానంద్‌తో (హిందీలో పునీత్ సింగ్) ఈ చిత్రంలో మాస్ పాత్ర చేయించడం, అతని లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండటం ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అండర్ వరల్డ్ నేపథ్యంలో వర్మ తీసిన ‘సత్య’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ కాకపోయినా కూడా, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో వర్మ రూపొందించిన ఈ ‘సత్య 2’పై భారీ అంచనాలున్నాయి. రామ్‌లీలా: చరిత్రాత్మక నేపథ్యంతో రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ‘రామ్‌లీలా’ చిత్రానికి షేక్స్పియర్ విరచిత ప్రేమకథ ‘రోమియో జూలియట్’ అధారం. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె నాయకా నాయికలు. ప్రియాంక చోప్రా ఓ ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలకు క్రేజ్ లభించింది. అలాగే, ఈ చిత్రం ఫస్ట్ లుక్, పోస్టర్స్ అంచనాలు పెంచాయి. ఫొటోల్లో రణ్వీర్, దీపికాల రొమాంటిక్ దృశ్యాలు హాట్ టాపిక్ అయ్యాయి.రియల్ లైఫ్‌లో ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ రీల్‌పై తమ కెమిస్ట్రీని అద్భుతంగా పండించారని ఈ ఫొటోలు చూసినవాళ్లు అంటున్నారు. ఇక, రొమాంటిక్ లవ్‌స్టోరీస్ తెరకెక్కించడంలో భన్సాలీ స్టయిలే వేరు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడంవల్ల, దీపికా, రణ్‌వీర్‌ల జంట కారణంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 15న రామ్లీలాల ప్రేమకహానీ వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. గోరి తేరే ప్యార్ మే: పునీత్ మల్హోత్రా దర్శ కత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన చిత్రం ‘గోరి తేరే ప్యార్ మే’. వాస్తవానికి 2011లో ఈ సినిమా ఎనౌన్స్మెంట్ జరిగింది. ముందుగా షాహిద్‌కపూర్, సోనమ్కపూర్లను హీరో హీరోయిన్లుగా ఎంపిక చేశారు. అయితే, ఈ చిత్రకథ పట్ల సంతృప్తి చెందక, ఈ ఇద్దరూ తప్పుకున్నారనే వార్త అప్పట్లో హల్చల్ చేసింది. ఆ తర్వాత సీన్లోకి ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ వచ్చారు. మరి... కథలో మార్పులు, చేర్పులు చేసిన తర్వాత ఈ ఇద్దరూ పచ్చజెండా ఊపారో లేక పునీత్ చెప్పిన కథ నచ్చే ఒప్పుకున్నారో అనే విషయం బయటికి రాలేదు. ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఈ తరహా సినిమాలకు ట్రెండ్‌తో సంబంధం లేదు. కథ బాగుంటే చాలు.. వసూళ్ల వర్షం కురిపించేస్తాయ్. మరి.. ఈ ప్రేమకథ బాక్సాఫీస్ ఖజానాని నింపగలుగుతుందో లేదో? ఈ 22న తెలిసిపోతుంది. రజ్జో: ఇటీవల బాలీవుడ్లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన చిత్రాల్లో ‘రజ్జో’ ఒకటి. దానికి కారణం ఈ చిత్రం కథాంశం. రజ్జో అనే ముస్లిం యువతి, చందు అనే బ్రాహ్మణ యువకుడి మధ్య జరిగే ప్రేమాయణమే ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి కదా అనుకుంటున్నారా? ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే.. కుర్రాడు టీనేజ్‌లో ఉంటాడు. ఆ యువతికి పాతికేళ్లు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత విశ్వాస్ పాటిల్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్, మ్యూజికల్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో కంగనా రనౌత్, పరాస్ అరోరా హీరో, హీరోయిన్లు. కీలక పాత్రలను ప్రకాశ్‌రాజ్, మహేశ్ మంజ్రేకర్, జయప్రద లాంటి అగ్రతారలు పోషించారు. 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రామ్‌లీలా’తో ఈ ‘రజ్జో’ పోటీ పడనుంది. నిందలు మిగులుతాయో, అభినందనలు దక్కుతాయో వేచి చూడాల్సిందే! సింగ్ సాబ్ ది గ్రేట్: కొంత విరామం తర్వాత సన్నీ డియోల్ నటించిన చిత్రం ‘సింగ్ సాబ్ ది గ్రేట్’. టైటిల్‌ని బట్టి ఓ శక్తిమంతమైన సింగ్ సాబ్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. సింగ్‌గా సన్నీ లుక్‌కి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. ‘గదర్’లోని సన్నీ లుక్‌ని తలపిస్తుందని బాలీవుడ్‌వారు అంటున్నారు. సంచలనాత్మక విజయం సాధించిన ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ శర్మ తాజా చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. వాస్తవానికి అనిల్ కాంబినేషన్లో సన్నీ చేసిన నాలుగో చిత్రం ఇది. ఈ కాంబినేషన్లో వచ్చిన గదర్, హీరో: లవ్‌స్టోరీ ఆఫ్ ల సై్ప, అప్నే చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ కారణంగా ‘సింగ్ సాబ్ ది గ్రేట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ 22న సింగ్ సాహెబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బుల్లెట్ రాజా: సైఫ్ అలీఖాన్, సొనాక్షి సిన్హా జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బుల్లెట్ రాజా’. తిగ్మాన్షు ధూలియా దర్శకత్వం వహించారు. వెస్ట్ బెంగాల్ బేస్డ్ మాఫియా నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఇందులో బుల్లెట్ రాజాగా సైఫ్ రఫ్ లుక్‌లో కనిపించబోతున్నారు. కాక్టైల్, గో గోవా గాన్... ఇలా ఇటీవల కాలంలో సైఫ్ నటించిన చిత్రాలు విజయాన్ని చవి చూశాయి. దాంతో ‘బుల్లెట్ రాజా’ కూడా సక్సెస్ ట్రాక్ మీదే వెళుతుందనే అంచనాలు ఉన్నాయి. 29న ఈ చిత్రం విడుదల కానుంది. మరి.. ఈ అరడజను చిత్రాల్లో అదరహో అనిపించే వసూళ్లని ఏ చిత్రం రాబడుతుందనేది వెయిట్ అండ్ సీ. - రాజాబాబు అనుముల -
‘రామ్‌లీలా’కు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా రాంలీలా విడుదలకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శృంగారం, హింస, అసభ్యత ఎక్కువగా ఉన్న ఆ సినిమాపై నిషేధం విధించాలని రాష్ట్రవాది శివసేన అనే స్వచ్ఛంద సేవా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ సినిమా హిందువుల మత మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని ఆ సంస్థ చేసిన వాదనతో ఏకీభవించలేదు. సంజమ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటించిన రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేల మధ్య కళాత్మకత అనేది ఏమీ కనపడటం లేదన్న రాష్ర్టవాది శివసేనకు రూ.50,000 జరిమానాకు కూడా విధించింది. దేవుడి రామ పేరును ఈ సినిమా టైటిల్‌గా పెట్టడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రవాది శివసేన అధ్యక్షుడు జై భగవాన్ గోయల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిన్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తోసిపుచ్చింది. రామ్ పేరు పెట్టుకోవద్దని మీరు మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారా అని ప్రశ్నించింది. ఢిల్లీ న్యాయసేవల విభాగానికి కొంత డబ్బును డిపాజిట్ చేయాలని సూచించింది. వచ్చే నెల 15న విడుదలకు సిద్ధమవుతున్న రామ్‌లీలా పురాణ శాస్త్రాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని సదరు ఎన్జీవో పిల్లో పేర్కొంది. పురాణంతో ఎలాంటి సంబంధం లేకుండా తీసిన సినిమాకు రామ్‌లీలా అని పెట్టారని పేర్కొంది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని వ్యాఖ్యానించింది. ఇందులో శృంగారం, హింస, అసభ్యత ఎక్కువగా ఉందని, కావున ఈ సినిమా విడుదలను ఆపాలని వాదించింది. -
రాం లీలాలో అదరగొట్టిన ప్రియాంకా చోప్రా
సంజయ్ లీలా భన్సాలీ తీసిన రాం లీలా చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా అదరగొట్టే ఐటెం డాన్సు చేసింది. తెల్లటి చోళీ, లుంగీతో తన వంపుసొంపులను ప్రదర్శించి ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఆమె వేసుకున్న దుస్తుల పుణ్యమాని.. పక్కటెముకల మీద వేయించుకున్న టాటూ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుదేవా సోదరుడు విష్ణుదేవా ఈ పాటకు కొరియోగ్రఫీ చేసినట్లు సమాచారం. -
దీపికా పదుకొనెతో కంగనా ఢీ
బాలీవుడ్ అందాల భామలు దీపికా పదుకొనె, కంగనా రనౌత్ ఇద్దరూ పోటీపడుతున్నారు. సినిమాలో పాత్ర కోసమో లేక ప్రియుడి కో్సమో కాదు. ఈ ముద్దుగుమ్మలు నటించిన సినిమాలు రెండూ ఒకే రోజు విడుదలవుతున్నాయి. రణవీర్ సింగ్ జోడీగా దీపిక నటించిన 'రామ్ లీలా'ను, కంగనా చిత్రం 'రజ్జో'ను నవంబర్ 15న విడుదల చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన రామ్ లీలా సినిమాపై ఇప్పటికే అంచనాలున్నాయి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా ఈ సినిమా ట్రయల్స్ చూసి బాగున్నాయంటూ ప్రశంసించారు. ఇక విశ్వాస్ పాటిల్ దర్శకత్వంలో తెరకెక్కించిన రజ్జో సినిమాలో కంగనా ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాపై కంగనా భారీ ఆశలు పెట్టుకుంది. బాక్సాఫీసు వద్ద ఏ సినిమా హిట్ కొడుతుందో చూడాలి. -
దీపికా, రణ్‌వీర్‌లు చాలా అన్యోన్యంగా...
మొన్న... క్రికెటర్లు యువరాజ్ సింగ్... ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని. నిన్న బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్... ఆ మధ్యలో సిద్దార్థ్ మాల్యా... ఇదంతా దీపికా పదుకొనే ప్రణయ జాబితా. తాజాగా ఈ జాబితాలో ‘లుటేరా’ హీరో రణ్‌వీర్‌సింగ్ చేరారంటూ బాలీవుడ్ మీడియాలో జోరుగా రూమార్లు షికారు చేస్తున్నాయి. మీడియా రూమర్లకు మరింత బలం చేకూర్చే విధంగా దీపికా, రణ్‌వీర్‌లు ఎక్కడపడితే అక్కడ చాలా అన్యోన్యంగా కనిపిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చారిత్రాత్మక ప్రేమకథా చిత్రం ‘రామ్‌లీలా’లో వీరిద్దరూ ప్రేమికులుగా నటిస్తున్నారు. తెరపైనే కాకుండా నిజజీవితంలో కూడా ప్రేమ పక్షులుగా మారారని వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల ‘రామ్‌లీలా’ చిత్రం కోసం చిత్రీకరించిన ఓ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ సోషల్ మీడియాలో కాక పుట్టించింది. అంతేకాక ఇటీవల ‘రామ్‌లీలా’ ప్రచార చిత్రం విడుదల కార్యక్రమంలో రణ్వీర్, దీపికాలు వేదికపై చెలరేగిపోవడం టాక్ ఆఫ్ ది బాలీవుడ్‌గా మారింది. -
దీపికాతో నా కెమిస్ట్రీ అదుర్స్: రణ్వీర్ సింగ్
'రాంలీలా' సినిమాలో దీపికా పదుకొనేతో తన కెమిస్ట్రీ అదిరిపోయిందని, అది ఆ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని హీరో రణ్వీర్ సింగ్ అన్నాడు. ఇటీవలి కాలంలో దీపికతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లు వార్తల్లో నిలిచిన అతగాడు రాంలీలా చిత్రం గురించి మాట్లాడాడు. తామిద్దరం ఈ చిత్రంలో కలిసి నటించాలని రాసిపెట్టి ఉందని.. రోమియో-జూలియట్ల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తమ మధ్య కూడా అలాగే ఉందని చెప్పాడు. ఇదే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని విలేకరులతో అన్నాడు. కానీ, దీపికతో అసలైన రొమాన్స్ గురించి ప్రశ్నిస్తే మాత్రం నోరు విప్పలేదు. ఈ సినిమాలో దీపిక- రణ్వీర్ పెదాలు కలిపిన సన్నివేశాలున్నాయి. ఈ సినిమా అమ్మకే అంకితం: భన్సాలీ రాం లీలా చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని, ఈ చిత్రాన్ని తాను తన తల్లి కోసమే తీశానని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చెప్పాడు. ఈ సినిమాను అమ్మకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. సినిమాలో లీల పాత్ర పోషించిన దీపిక చాలా అద్భుతంగా చేసిందంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు. సినిమా ట్రైలర్‌ను భన్సాలీ ముంబైలో విడుదల చేశాడు. రణ్వీర్ మంచి నటుడని, అతడిలో చాలా ఎనర్జీ ఉందని అన్నాడు. ఇక భన్సాలీని ఒక మెజీషియన్‌గా దీపిక అభివర్ణించింది. ''సంజయ్ కళాకారుడే కాదు.. మెజీషియన్. ఆయన ప్రతి ఒక్క సీన్‌ను చాలా అద్భుతంగా, అందంగా తీస్తారు. మహిళల దుస్తులను బాగా అర్థం చేసుకున్న ఏకైక మగ దర్శకుడు ఆయన మాత్రమే'' అని కితాబిచ్చింది. ఈ సినిమా నవంబర్ 29న విడుదల కానుంది. -
హాట్ హాట్ గా ఆ ఇద్దరి వ్యవహారం!
ముంబై: బాలీవుడ్ లో బెంగళూరు భామ దీపికా పదుకోనె, రాణ్ వీర్ సింగ్ ల మధ్య తెరమీదే కాకుండా బయటకూడా ప్రేమాయణం జోరుగానే సాగుతోందని ముంబై సినీ బజార్ లో రూమర్లు ఇటీవల కాలంలో జోరుగా షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ లో ఏ నోట విన్నా దీపికా, రణ్ వీర్ ల హల్ చల్ గురించేనని మీడియా కోడైకూస్తోంది. వీరిద్దరూ కలిసి సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న రామ్ లీలా చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల దీపికా, రణ్ వీర్ లపై హాట్ హాట్ గా లవ్ సీన్లను షూటింగ్ చేశారన్న వార్త బాలీవుడ్ లో సెన్సెషనల్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా, ఇతర సినీ వెబ్ సైట్లలో దీపికా, రణ్ వీర్ ల లవ్ సీన్లు వీరవిహారం చేస్తున్నాయి. ఓ అందమైన చారిత్రాత్మక ప్రేమకథా చిత్రంగా రూపొందిస్తున్న రామ్ లీలా చిత్రంలో రామ్ పాత్రలో రణ్ వీర్, గుజరాతీ అమ్మాయి లీలాగా దీపికా నటిస్తోంది. భారీ అంచనాలు ఈ చిత్రం నవంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ఓ ఐటమ్ సాంగ్ లో నర్తించింది. -
ఐటమ్ సాంగ్ చేయడం లేదు: ప్రియాంక చోప్రా
రామ్ లీలా చిత్రంలో ఐటమ్ సాంగ్ చేస్తోందంటూ వచ్చిన వార్తలను బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా తోసిపుచ్చింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న రామ్ లీలాలో తాను ఐటమ్ సాంగ్ చేయడం లేదు అని స్పష్టం చేసింది. గతంలో ఐటమ్ సాంగ్ కోసం ఐశ్వర్య రాయ్ తో భన్సాలీ సంప్రదింపులు జరిపారు. నిరాధారమైన వార్తలు నన్ను అప్ సెట్ చేశాయి. ఓ నటిని తొలగించారు. మరో నటి ఈ చిత్రంలో నటిస్తోంది అని మీడియాలో వచ్చే వార్తలు ఇబ్బంది కలిగిస్తాయి. స్పష్టత లేకపోతే రాయకూడదు అని మీడియాకు సూచించింది. రామ్ లీలా చిత్రంలో దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారత బాక్సర్ మేరి కోమ్ జీవిత కథ అధారంగా భన్సాలీ నిర్మిస్తున్న ప్రియాంక నటిస్తున్న సంగతి తెలిసిందే. -
‘రామ్ లీలా ’ లో ఐశ్వర్య స్పెషల్ సాంగ్ లేదు
గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న అందాల తార ఐశ్వర్యరాయ్ ఓ ఐటం సాంగ్‌తో రీఎంట్రీ ఇస్తుందన్న వార్తను దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కొట్టిపారేశారు. భన్సాలీ దర్శకత్వంలో తెర కెక్కుతున్న ‘రామ్ లీలా ’ సినిమాలో ఐష్ ఐటెం సాంగ్‌ను నర్తిస్తుందన్న వార్తలు బాలీవుడ్లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రూమర్సులో ఎలాంటి వాస్తవం లేదని భన్సాలీ స్పష్టం చేశారు. ఐశ్వర్య రాయ్ ఒక బిడ్డకు జన్మినిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దాంతో ఐష్ రీ ఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో 'రామ్ లీలా' చిత్రంలో తమ అభిమాన తార ఐటం సాంగ్ చేస్తుందనే వార్తలు వారికి సంతోషాన్ని ఇచ్చాయి. భన్సాలీ దర్శకత్వం వహించిన 'దేవదాస్', 'గుజారీష్' చిత్రాల్లో ఐశ్వర్య నటించటంతో ...ఆ సాన్నిహిత్యం, గౌరవం కారణంగానే సంజయ్ అడగ్గానే ఐశ్వర్యారాయ్ ప్రత్యేక గీతం చేసేందుకు ఒప్పేసుకుందని కథనాలు వెలువడ్డాయి. మొదటి సోనాక్షి సిన్హా అన్నారు, ఆ తర్వాత మాధురి దీక్షిత్ అన్నారు...ఇప్పుడు ఐశ్వర్యరాయ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాలు ఎలా ప్రచారంలోకి వస్తాయో అర్థం కావడం లేదంటూ భన్సాలీ వ్యాఖ్యానించారు. భన్సాలీ వివరణతో ఐశ్వర్యారాయ్ ఐటం సాంగ్ రూమర్స్‌కు తెరపడినట్లుయింది. ఇక ఐశ్వర్యారాయ్ తన సమయాన్ని అంతా కుమార్తె ఆరాధ్యకే కేటాయిస్తోంది. ప్రస్తుతం ఐష్.... ఆరాధ్యకే ప్రాధాన్యత ఇస్తుందని, ఆరాధ్య కంటే తనకు ఏదీ ముఖ్యంగా కాదని ఐశ్వర్య భావిస్తుందని ఆమె సన్నిహితులు తెలిపారు. అయితే మంచి కథ దొరికితే త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని పేర్కొన్నారు. కాగా 1983లో వచ్చిన 'మసూమ్' సినిమా రీమేక్‌లో ఐశ్వర్య రాయ్ నటించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. దాదాపు 30 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. శేఖర్ కపూర్ రూపొందించిన ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, షబానా అజ్మి జంటగా నటించారు. ఇప్పుడు వారి పాత్రల్లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ నటిస్తారని వార్తలొస్తున్నాయి. హిమేష్ రేషమ్మియా ఈ చిత్రాన్ని తాజాగా నిర్మించబోతున్నాడు. ఐశ్వర్య సౌలభ్యం మేరకు షెడ్యూల్ రూపొందించుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో త్వరలో ఐష్ రీఎంట్రీ మాత్రం ఖాయమనేది తెలుస్తోంది. -
కత్రినా ‘బికినీ’ వ్యవహారంపై దీపికా స్పందన!
తన బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి స్పెయిన్‌లో ప్రైవేట్ విహారయాత్ర చేసిన సందర్భంగా బికినీ దుస్తుల్లో బాలీవుడ్ తార కత్రినాకైఫ్ కెమెరాకు చిక్కిన ఫోటోలు మీడియాలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కత్రినాకైఫ్ మీడియాకు లేఖ రాసి వివరణ ఇచ్చుకోవడంతో ఆ దుమారం సద్దుమణిగింది. అయితే కత్రినా వ్యవహారంపై దీపికా పదుకొనే స్పందిస్తూ ‘నేను ఇప్పటి వరకు అలా ఎవరికంటా పడలేదు’ అని తెలిపింది. సెలబ్రీటిలకు, సమాజంలో ప్రముఖ వ్యక్తులకు అలాంటి సంఘటనలు ఎదురవ్వడం సహజమే అని ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ తో అఫైర్ నడుపుతున్న దీపికా అన్నారు. అందుకు మరొకరిని నిందించడం, ఆరోపణలు చేయడంలో ప్రయోజనం శూన్యం వెల్లడించింది. ఒకవేళ అలాంటి పరిస్థితులు తనకు ఎదురైతే.. కాస్తా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాను అని చెప్పింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ తర్వాత షారుక్‌తో, యే జవానీ హై దివానీ చిత్రం తర్వాత రణబీర్ కపూర్‌తో జోడి క డుతున్నారని వచ్చిన వార్తలు నిజమేనా అనే ప్రశ్నకు జవాబు దాటవేస్తూ.. ప్రతి చిత్రానికి ఓ గమ్యం ఉంటుందని.. తాను చిత్రాలను ఎంపిక చేసుకోను. సినిమాలోని పాత్రలే తనను వెదుకుంటూ వస్తాయని.. నటించడం అలా అలా జరిగిపోతుంటాయని దీపికా వేదాంతం ఒలకబోసింది. షారుఖ్ తో హ్యప్పీ న్యూ ఇయర్ అనే చిత్రంలో నటించడానికి ఓకే చెప్పినట్టు బాలీవుడ్ సమాచారం.