'రామ్ లీలా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవు'
రామ్ లీలా చిత్ర విడుదలపై ఎలాంటి స్టే ఇవ్వలేదు అని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఆర్ఎమ్ అజీమ్ తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టం 1952 కింద సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ రామ్ లీలా కు లభించింది అని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రం విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవు అని అజీమ్ తెలిపారు.
హిందువుల మనోభావాలలు దెబ్బతీసే విధంగా ఈ చిత్రంలోని సన్నివేశాలున్నాయని ప్రభు సమాజ్ ధార్మిక్ రామ్ లీలా కమిటీ ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. బాలీవుడ్ తారలు రణ్ వీర్ సింగ్, దీపికా పదుకోనెలు నటించిన రామ్ లీలా చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం నవంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది.