Sanjay Leela Bhansali
-
షూటింగ్ ప్రారంభానికి ముందే రిలీజ్ డేట్.. చివరికి వాయిదా!
ఈ మధ్య కొన్ని పెద్ద సినిమాలు ప్రకటన రోజే రిలీజ్ డేట్‌ని వెల్లడిస్తున్నాయి. తీరా షూటింగ్ అయ్యేసరికి విడుదలను వాయిదా వేస్తున్నారు. తాజాగా అలా వాయిదా పడిన చిత్రమే ‘లవ్ అండ్ వార్’. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లీడ్ రోల్స్‌లో నటించనున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘లవ్ అండ్ వార్’ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రకటించి, 2025 క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. (చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఆలియా భట్‌తో సినిమా!)ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. కానీ ‘లవ్ అండ్ వార్’ రిలీజ్‌ను మాత్రం వాయిదా వేశారు. 2026 మార్చి 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఇదో పీరియాడికల్ ఫిల్మ్ అని, ముక్కోణపు ప్రేమకథగా ఉంటుందని సమాచారం. అలాగే వివాహం తర్వాత రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కలిసి నటించనున్న చిత్రం కావడంతో ‘లవ్ అండ్ వార్’ పై అంచనాలు ఉన్నాయి. -
ప్రతిష్టాత్మక అవార్డ్ రేసులో హీరామండి
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టారు. తన తొలి వెబ్ సిరీస్‌తో అనేక సంచలనాలు సృష్టించడమే కాకుండా అవార్డులు అందుకోనున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ కావడంతో అభిమానులు భారీగానే ఆదరించారు. . ఈ సిరీస్ ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ నటించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ తమ ప్రతిభతో మెప్పించారు.తాజాగా బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (గ్లోబల్ ఓటీటీ అవార్డ్స్) ఉత్తమ ఓటీటీ ఒరిజినల్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాలకు హీరామండి నామినేట్ అయ్యింది. ఇంతటి గొప్ప అవార్డ్‌కు తన వెబ్ సిరీస్ నామినేట్ కావడంపై దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ గుర్తింపుతో చిత్ర యూనిట్ అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు.ఓటీటీల పరంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఈ అవార్డులకు హీరామండి వెబ్ సిరీస్‌కు నామినేట్ కావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఆ వార్డుల కోసం రెండు విభాగాలకు నామినేట్ అయిందని ఆయన తెలిపారు. ఈ ఏడాదిలో ఎంపికైన ఏకైక భారతీయ ప్రాజెక్ట్ కూడా ఇదే అని భన్సాలీ పేర్కొన్నారు. ఇంతటి గొప్ప విజయానికి కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. మే 1న విడుదలైన ఈ సిరీస్ మొదటి వారంలోనే 4.5 మిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. సుమారు 40కి పైగా దేశాల్లో టాప్10 ట్రెండింగ్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది. అందుకే ఈ అవార్డు హీరామండీకి దక్కుతుంది. -
అక్టోబరులో ఆరంభం
అక్టోబరులో లవ్ అండ్ వార్ అంటున్నారట రణ్‌బీర్ కపూర్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ‘లవ్ అండ్ వార్’. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటించనున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కానీ చిత్రీకరణ ప్రారంభం కాలేదు. అయితే ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను సెప్టెంబరు లోపు పూర్తి చేసి, అక్టోబరు మొదటి వారంలో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట భన్సాలీ.ముందుగా అక్టోబరులో రణ్‌బీర్ కపూర్ సోలో సీన్స్‌తో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అవుతుందట. ఆ తర్వాత రణ్‌బీర్ – విక్కీ కౌశల్‌ల కాంబినేషన్లోని ఫ్రెండ్షిప్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ – ఆలియా – విక్కీ కౌశల్ కాంబినేషన్లోని సన్నివేశాలను షూట్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్ సమాచారం. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ‘లవ్ అండ్ వార్’ని తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా 2025 క్రిస్మస్కి రిలీజ్ కానుంది. -
అందరి మీదకు అరిచే డైరెక్టర్.. అప్పట్లో ఆ హీరోయిన్ దగ్గర మాత్రం!
లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీకి కోపమెక్కువ. తనకు గానీ తిక్క రేగిందంటే అవతల ఎవరున్నా సరే ఆగ్రహంతో విరుచుకుపడతాడట! అలాంటిది గతంలో మాత్రం హీరోయిన్‌తో మాట్లాడటానికి కూడా తటపటాయించేవాడట. ఈ విషయాన్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా వెల్లడించాడు. 1942: ఎ లవ్ స్టోరీ సినిమా టైంలో విధు వినోద్‌కు సంజయ్ సహాయకుడిగా పని చేశాడు. ఆయన అసిస్టెంట్గాఆ సమయంలోనే అతడి టాలెంట్ గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఓ ఇంటర్వ్యూలో విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ.. సంజయ్ భన్సాలీ.. ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ అయ్యాడు. అతడు నాకు అసిస్టెంట్‌గా పని చేశాడు. 1942 సినిమాకు అవార్డు వచ్చినప్పుడు వెళ్లి తీసుకోమని తననే పంపించాను. ఇప్పుడేమో ఇలా..ఒకప్పుడు ఎంతో సౌమ్యంగా ఉండేవాడు.. మాధురీ దీక్షిత్‌తో మాట్లాడాలన్నా కూడా భయపడేవాడు. ఇప్పుడేమో అందరి మీదకు గట్టిగా అరుస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. కాగా సంజయ్ లీలా భన్సాలీ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ అడుగుపెట్టాడు. ప్రస్తుతం దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.చదవండి: నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత -
సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' సీజన్-2 ప్రకటన
'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించింది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపింది. తెలుగులో కూడా అందుబాటులో ఉండటంతో ఇక్కడ కూడా మంచి ఆధరణే లభించింది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్‌కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. త్వరలో రెండో సీజన్ కూడా విడుదల కానుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు.బాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడంతో ప్రేక్షకులు కూడా హీరామండి పట్ల పెట్టుకున్న భారీ అంచనాలను ఆయన నిజం చేశారు. ఇందులో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి,షర్మిన్ సెగల్,సంజీదా షేక్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించి మెప్పించారు. ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను తన సొంత నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్‌తో భన్సాలీ నిర్మించాడు. అయితే, 'హీరామండి: ది డైమండ్ బజార్' సీజన్-1 సూపర్ హిట్ కావడంతో తాజాగా సీజన్ -2 ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలో విడుదల చేస్తామని సోషల్ మీడియా ద్వారా నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
వావ్ అనిపించినప్పుడల్లా రూ.500 చేతిలో పెడ్తాడు!
సంజయ్ లీలా భన్సాలీ.. బాలీవుడ్లోనే కాదు యావత్ దేశంలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు. ఈయన సినిమాల్లో ఒక్కసారైనా నటించాలని కోరుకునే నటీనటులు ఎందరో! తను తెరకెక్కించే సినిమాలన్నీ అద్భుత కళాఖండాలుగా దర్శనమిస్తాయి. ఈ మధ్యే ఈయన హీరామండి అనే వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.ఆత్మీయంగా హత్తుకుని..ఈ సిరీస్‌లో నటించిన జయంతి భాటియా తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. 'సంజయ్ లీలా భన్సాలీ నటీనటులపై ఎంతో ప్రేమ చూపిస్తాడు. నేను ఉదయం సెట్లోకి వెళ్లగానే ఆత్మీయంగా హత్తుకుని బుగ్గన ముద్దుపెట్టుకునేవాడు. మమ్మల్ని ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. అలాగే ఏదైనా సన్నివేశంలో ఎవరైనా అద్భుతంగా నటించారంటే వారిని అభినందిస్తూ రూ.500 ఇచ్చేవాడు.మూడుసార్లు..అలా నాకు మూడుసార్లు ఇచ్చాడు. ఆ రూ.1500 భద్రంగా దాచుకున్నాను' అని చెప్పింది. నటుడు ఇంద్రేశ్ మాలిక్ కూడా ఈ సిరీస్‌లో నటించినప్పుడు ఓ సన్నివేశం అద్భుతంగా రావడంతో తనకు రూ.500 ఇచ్చాడు. అప్పటికే ఆ సీన్లో నుంచి ఇంద్రేశ్ బయటకు రాలేక ఏడుస్తూ ఉండటంతో భన్సాలీ అతడిని హత్తుకుని మరీ ఓదార్చాడు. కాగా హీరామండి సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హ, అదితిరావు హైదరి, రిచా చద్దా, సంజీదా షైఖ్, షర్మిన్ సెగల్ ప్రధాన పాత్రల్లో నటించారు.చదవండి: ప్రేక్షకులను అనుమతించని థియేటర్ యాజమాన్యం.. రంగంలోకి పోలీసులు! -
హీరామండి సిరీస్‌లో అదరగొట్టిన అందాల ముద్దుగుమ్మలు (ఫోటోలు)
-
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హీరామండి: ది డైమండ్ బజార్'. మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్‌లో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించారు. ఇందులో మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, సోనాక్షి సిన్హా లాంటి స్టార్స్ కనిపించారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్తాన్ లాహోర్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి షర్మిన్ సెగల్. సంజయ్ లీలీ మేనకోడలైన ఆమె తనదైన నటనతో మెప్పించింది. ఆడియన్స్ నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందుకుంది. అయితే తాజాగా షర్మిన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె భర్త అమన్ మెహతా ఓ బిలినీయర్ అన్న వార్త సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారింది.ప్రముఖ టోరెంట్ ఫార్మాస్యూటికల్స్‌లో అమన్ మెహతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ అంతర్జాతీయ కంపెనీకి కో-ఛైర్మన్లుగా అతని తండ్రి సుధీర్ మెహతా, మామ సమీర్ మెహతా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంస్థ బ్లూమ్‌బెర్గ్ 2024- ఇండెక్స్ ప్రకారం సుధీర్ మెహతా, సమీర్ మెహతా నికర విలువ దాదాపు రూ. 53,800 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమన్, అతని తండ్రి సమీర్ కంపెనీ ఫార్మాస్యూటికల్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఒక్క టోరెంట్ ఫార్మా దాదాపు రూ.38,412 కోట్లు రాబట్టిందని ఫోర్బ్స్ అంచనా వేసింది.కాగా.. సంజయ్ లీలా భన్సాలీకి మేనకోడలు అయిన షర్మిన్ సెగల్.. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన అమన్ మెహతాను నవంబర్ 2023లో వివాహం చేసుకుంది. షర్మిన్ సెగల్ తల్లి బేలా సెగల్ ఫిల్మ్ ఎడిటర్‌గా, ఆమె తండ్రి దీపక్ సెగల్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్లో కంటెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీకి చెల్లెలు అయిన బేలా సెగల్ 2012లో షిరిన్ ఫర్హాద్ కి తో నికల్ పాడి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Sharmin Segal Mehta (@sharminsegal) -
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఒక సినిమా నిర్మాణంలో మామూలుగా అయితే కొన్ని నగలు తెప్పిస్తారు. కాని ‘హీరామండీ’ వెబ్ సిరీస్ కోసం 300 కిలోల నగలు అవసరమయ్యాయి. అవి కూడా బ్రిటిష్ కాలం నాటివి. మొగల్ సంస్కృతీ వారసత్వానివి. ఢిల్లీలో శ్రీ పరమణి జువెలర్స్‌కు చెందిన అన్షు గుప్తా భర్త వినయ్‌తో కలిసి మూడేళ్ల పాటు శ్రమించి ఈ నగలు తయారు చేశారు. నత్, ఝూమర్, హాత్ ఫూల్, పస్సా, టీకా... ఎన్నో నగలు. అన్షు గుప్తా పరిచయం.స్త్రీలు, అలంకరణ అవిభాజ్యం. స్త్రీలు, ఆభరణం కూడా అవిభాజ్యమే. ఆభరణంతో నిండిన అలంకరణ భారతీయ స్త్రీలలో వేల సంవత్సరాలుగా ఉంది. బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు, కెంపులు, మరకతాలు, ముత్యాలు... వీటితో తయారైన ఆభరణాలు రాచరిక స్త్రీలకు ప్రీతికరమైనవి. ఐశ్వర్యవంతులకు స్థాయిని కలిగించేవి. అయితే వీరే కాకుండా కళకారులకు కూడా ఆభరణాలు కీలకమైనవి. మొగలుల కాలంలో విరాజిల్లిన తవాయిఫ్‌లు (రాజనర్తకీమణులు) తమ ప్రదర్శనల్లో ఆకర్షణ కోసం భారీ ఆభరణాలను ఉపయోగించేవారు. మరి వారి గురించిన గాథను తెరకెక్కించేటప్పుడు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని అందించడానికి ముందుకు వచ్చిన జువెలర్స్ అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తా.హీరా మండి..మొగలుల కాలంలో లాహోర్‌లోని ఒక ఏరియా పేరే హీరా మండి. దాని అంతకు ముందు పేరు షాహీ మొహల్లా. అంటే రాచవాడ. పక్కనే ఉన్న కోట నుంచి నవాబులు నడిచి వచ్చేంత దూరంలో ఉండే కొన్ని భవంతుల సముదాయమే షాహీ మొహల్లా. ఇక్కడ తవాయిఫ్‌లు ఉండేవారు. వీరు ఆట, పాటల్లో నిష్ణాతులు. సాయంత్రమైతే వీరి భవంతుల్లో ప్రదర్శనలు జరిగేవి. నవాబులు, శ్రీమంతులు, రసికులు వీటికి హాజరయ్యి తిలకించేవారు. ఈ తవాయిఫ్‌లకు విశేష పలుకుబడి ఉండేది. వీరి దగ్గర ఐశ్వర్యం ఉండేది. రాచరిక రహస్యాలు మొదట వీరికే తెలిసేవి. వీరు మంత్రాంగం నడిపేవారు. 1857 సైనిక తిరుగుబాటులో కూడా వీరు పాల్గొన్నారు. కాని బ్రిటిష్ కాలం వచ్చేసరికి ఇదంతా గతించిపోయింది. షాహీ మొహల్లా కాస్తా సరుకులు అమ్మే మండీగా హీరా మండీగా మారింది. ఆనాడు వెలిగిన వారంతా అంతరించిపోయారు. వేశ్యలుగా మారారు. వారి గాథనే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండీ’ పేరుతో భారీ వెబ్‌సిరీస్‌గా తీశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.భారీ నగలుపర్‌ఫెక్షనిస్ట్ అయిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ‘హీరామండీ’లో తవాయిఫ్‌ల కోసం నాటి మొగల్ తరహా నగలు కావాలని భావించాడు. గతంలో తన ‘బాజీరావు మస్తానీ’ కోసం పని చేసిన ఆభరణాల శిల్పులైన అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తాలను సంప్రదించాడు. వీరు ఢిల్లీవాసులు. వీరికి శ్రీ పరమణి జువెలర్స్ అనే నగల కార్ఖానా, షోరూమ్ ఉన్నాయి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కార్ఖానాలో ఖరీదైన ఆభరణాలు దొరుకుతాయి. ‘కథ విన్న వెంటనే టైటిల్ దగ్గరి నుంచి ప్రతి పాత్రా ఆభరణాలతో ముడిపడి ఉన్నందుకు ఉత్సాహం వచ్చింది. చరిత్రలోకి వెళ్లి పరిశోధించి నాటి ఆభరణాలు తయారు చేయాలి. మొగలులు కళాప్రియులు. వారి కాలంలో ఆభరణాలలో కెంపులు. ముత్యాలు, వజ్రాలు విరివిగా వాడేవారు. ఆపాదమస్తకం అలంకరించుకోవడానికి వందల రకాల ఆభరణాలు ఉండేవి. అవన్నీ మేము తయారు చేయడానికి ముందుకు వచ్చాం. నేను, నా భర్త వినయ్ మూడేళ్లు కష్టపడి ఈ నగలు తయారు చేయించాం’ అని తెలిపింది అన్షు గుప్తా.అసలు సిసలు బంగారంతో‘‘హీరామండీ కోసం కొన్ని ముఖ్యమైన నగలు అసలు బంగారంతోనూ, మిగిలినవి బంగారు పూత కలిగిన వెండితోనూ తయారు చేయించాలని నిర్ణయించాం. వజ్రాలు, ముత్యాలు అన్నీ ఒరిజినల్‌వే వాడాం. మా కార్మికులు మూడేళ్ల పాటు శ్రమపడి మూడు గదుల్లో పది వేల చిన్న, పెద్ద ఆభరణాలు తయారు చేశారు. వీటిని తూస్తే 300 కిలోలు ఉంటాయి. నథ్ (ముక్కు పుడక) దగ్గరి నుంచి నెమలి నెక్లెస్ వరకూ వీటిలో ఉన్నాయి. షూటింగ్లో ప్రత్యేక గార్డులు వీటికి కాపలా ఉన్నారు. ‘మేం చేసిన ఆభరణాలు పాత్ర కోసం ధరించి వీటితో పారిపోతే ఒక సినిమా తీసేన్ని డబ్బులొస్తాయి’ అనేది నటి రిచా చద్దా సరదాగా. హీరామండీని చూస్తే ఒక పాత్ర ధరించిన పాపిడి బిళ్లతో మరో పాత్ర ధరించిన పాపిటబిళ్లకు పోలిక ఉండదు. గాజులు, ఉంగారాలు, చెవి కమ్మలు... తెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైన తీరుతో మా కష్టం వృథా పోలేదనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది అన్షు గుప్తా. -
హీరామండి నటి షర్మిన్ సెగల్ భర్త ఎవరో తెలుసా? వేల కోట్ల ఆస్తి
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ వెబ్ సిరీస్ హీరామండి హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఈ సిరీస్‌లో కీలక పాత్రల్లో నటించిన ప్రముఖ నటీ నటుల వివరాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సంజయ్ లీలా బన్సాలీ మేనకోడలు గ్లామరస్ 'అలంజేబ్' పాత్రలో అలరించిన షర్మిన్ సెగల్ ఎవరు. ఆమె భర్త ఎవరు. అతని నెట్‌వర్త్ ఎంత అనేది ప్రధాన చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీ కోసం.ఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో 1995లో జన్మించింది షర్మిన్ సెగల్. తండ్రి, దీపక్ సెగల్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్లో కంటెంట్ హెడ్‌గా పనిచేశారు. తల్లి బేలా సెగల్ పాపులర్ ఫిల్మ్ ఎడిటర్. తల్లి సోదరుడే , బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ. ఖామోషి, దేవదాస్, బ్లాక్ లాంటి ఎన్నో చిత్రాలకు బేలా సెగల్ పనిచేశారు.అంతేకాదు బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా , మేరీ కోమ్ వంటి చిత్రాలకు షర్మిన్ మామ సంజయ్ లీలా బన్సాలీతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది షర్మిన్ సెగల్. ఆ తర్వాతే నట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. షర్మిన్ సెగల్ 'మలాల్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల విడుదలైన సంజయ్ లీలా బన్సాలీ క 'హిరామండి'లో షర్మిన్ గ్లామరస్ పాత్రను దక్కించుకుంది.రూ. 50 వేల కోట్ల ఆస్తిషర్మిన్ సెగల్ భర్త, పారిశ్రామికవేత్త అమన్ మెహతా వేల కోట్లకు యజమాని. గత ఏడాది నవంబరులో అమన్ మెహతా , షర్మిన్ సెహగల్ పెళ్లి చేసుకున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ అనుబంధ సంస్థటోరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమన్మెహతా. మెహతా కుటుంబ నికర విలువ 50000 కోట్లకు పైమాటే. అమన్ టోరెంట్ గ్రూప్‌ను అమన్ తాత యు.ఎన్. మెహతా 1959లో ప్రారంభించారు. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తోంది. ప్రస్తుతం అమన్ తండ్రి సమీర్ మెహతా సోదరుడు సుధార్ మెహతా ఇద్దరూ కంపెనీ కో-ఛైర్మెన్‌గా ఉన్నారు. టోరెంట్ గ్రూప్‌నకు టొరెంట్ ఫార్మా, టొరెంట్ పవర్, టొరెంట్ కేబుల్స్, టొరెంట్ గ్యాస్ ,టొరెంట్ డయాగ్నోస్టిక్స్ లాంటి అనుబంధ కంపెనీలున్నాయి.టోరెంట్ ఫార్మా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమన్ మెహతా 2022 నుండి టోరెంట్ ఫార్మాలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇండియతో పాటు, ఇతర దేశాలలోకంపెనీ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు.ఫోర్బ్స్ ప్రకారం, అమన్ మెహతా తండ్రి సమీర్ మెహతా నికర విలువ 6.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 50,939 కోట్లు). టోరెంట్ ఫార్మా ఆదాయం 4.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 38,412 కోట్లు). సమీర్, అమన్ ఇద్దరూ తమ కుటుంబ వ్యాపారంలో ఫార్మా రంగంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. అమన్ మెహతా విద్యార్హతలుఅమన్ మెహతా బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అమెరికాలోన కొలంబియా బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. ఎంబీఏ పూర్తికాక ముందు అమన్ 3 సంవత్సరాల పాటు టోరెంట్ పవర్లో డిస్ట్రిబ్యూషన్ మేనేజర్‌గా అనుభవం సంపాదించాడు. ఎంబీఏ పూర్తి అయిన తరువాత టోరెంట్ ఫార్మాలో సీఎంఓగా చేరి మూడేళ్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు. -
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్‌ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
మాస్ట్రో సంజయ్ లీలా బన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్‌తో డిజిటల్ ప్రపంచంలోకి ఆకట్టుకునేలా అడుగుపెట్టాడు. సంచలన టీవీ సిరీస్‌తో సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాడు. పలువురు నటీమణులు తమ అద్బుతమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా వీటన్నింటికి మించి గోల్డెన్ గర్ల్ వీడియో నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.హర్షాలీ మల్హోత్రా మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ ‘‘బజరంగీ భాయిజాన్’’లో మున్నీ పాత్రలో నటించి, ప్రశంసలందుకున్న హర్షాలీ మల్హోత్రా లేటెస్ట్ సంచలనం. హీరామండిలోని అలంజేబ్ పాత్రను రీక్రియేట్ చేసింది. ఇందులో తనదైన నటనతో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) ఈ ధారావాహికలోని ‘‘ఏక్ బార్ దేఖ్ లిజియే’’ పాటకు తనదైన అభియనంతో వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. గోల్డెన్ కలర్ లెహంగాలో మల్హోత్రా మెరిసిపోయింది. అందమైన ఆమె కళ్ళు అనేక భావోద్వేగాలను అలవోకంగా పలికించడం విశేషం. దీంతో ఒరిజినల్ సాంగ్‌తో పోలిస్తే మల్హోత్రా బాగా నటించిందంటూ అంతా కితాబిచ్చారు.1940లలోని భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యానికి వ్యతిరేకంగా, ‘‘హీరామండి’’ లాహోర్‌లోని రెడ్-లైట్ డిస్ట్రిక్ట్ హీరా మండిలో తవాయిఫ్‌ల (వేశ్యల) జీవితాల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. స్టార్-స్టడెడ్ సిరీస్‌లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ అధ్యాయాన్ వంటి ప్రఖ్యాత నటీనటులు ఉన్నారు. ఇంకా శేఖర్ సుమన్, తహా షా బదుషా, ఫరీదా జలాల్తదితరులు మరికొందరు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో వెబ్ సిరీస్ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన షోగా నిలిచిన సంగతి తెలిసిందే. -
Heeramandi సోనాక్షి లుక్స్: జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్! ఫోటోలు
-
సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
బాలీవుడ్ టాప్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మొట్టమొదటి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ హిట్ టాక్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. మే 1నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అలరిస్తుంది. ఇందులో మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ తదితరులు నటించారు.హీరామండి వెబ్ సిరీస్‌లో ఉస్తాద్‌జీ పాత్రలో మెప్పించిన ఇంద్రేష్ మాలిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఇందులో సోనాక్షి సిన్హాతో ఇంటిమేట్ సీన్ గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చాడు.‘సోనాక్షీకి, నాకు మధ్య ఉన్న ఇంటిమేట్ సీన్స్ కోసం ఎక్కువ రీటేక్‌లు తీసుకోలేదు. ఈ సీన్స్ తీస్తున్న సమయంలో నేను భయాందోళనకు గురైయాను. కాస్త సిగ్గుగా కూడా అనిపించింది. కానీ, సోనాక్షీ నాతో మాట్లాడి రిలాక్స్‌గా ఉండమని కోరారు. ఈ సీన్స్ కూడా ఆమె అమ్మగారి ముందే జరిగాయి. ఈ క్రమంలో సోనాక్షీ తల్లి ముందే నాతో మాట్లాడారు. ఈ సిరీస్‌లో ఇలాంటి సీన్లు అవసరం, కంగారు పడొద్దని చెప్పారు. సుమారు గంటకు పైగానే అందరం చర్చించుకున్నాకే షూట్ మొదలపెట్టాం. అందుకే ఎక్కువ రీటేక్‌లు తీసుకోలేదు. ఈ సిరీస్‌లో నా పాత్ర చాలా కీలకం. ఆ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇది నా కోసమే రూపొందించబడిందని నేను అనుకుంటున్నాను. సంజయ్ భన్సాలీ ప్రతీ సీన్‌ను చాలా జాగ్రత్తగా తీశారు.మరోక సన్నివేశంలో సోనాక్షి తన కాళ్లతో నా తలను టచ్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆమె తల్లి పూనమ్ సిన్హా కూడా సెట్స్‌లో ఉన్నారు. ఆ సీన్ సమయంలో కాస్త ఇబ్బంది ఉన్నా.. ఆమె నాకు కొంత ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. ఇలాంటి ఎన్నో సీన్స్ మా మధ్య ఉన్నాయి. హీరామండి సెట్ నుంచి నాకు చాలా అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి.' అని ఇంద్రేష్ మాలిక్ చెప్పాడు. -
ఓటీటీలో హీరామండి.. స్టార్ డైరెక్టర్ మేనకోడలిపై విమర్శలు!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మే 1 స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సిరీస్ ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ నటించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ నటించారు. అయితే ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా కూతురిగా మెప్పించిన షర్మిన్ సెగల్‌పై పాత్రపై విమర్శలొచ్చాయి. హీరామండిలో అలంజేబ్ పాత్రపై చాలామంది ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు.చాలా మంది ప్రేక్షకులు హీరామండిలోని నటనను ప్రశంసించగా, ఈ సిరీస్‌లో కొయిరాలా పాత్ర మల్లికా జాన్ కుమార్తె అలంజేబ్ పాత్రను పోషించిన షర్మిన్, ముఖ్యంగా ఆమె నటనకు విమర్శలను అందుకుంది. తన పాత్రలో ప్రతి సీన్లో ఓకే ఎక్స్ప్రెషన్తో కనిపించడంతో కొందరు ఆమెపై కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా తన ఇన్‌స్టా పోస్ట్‌కు కామెంట్ సెక్షన్‌ను నిలిపేసింది బాలీవుడ్ భామ. ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేయడం సంజయ్ చేసిన బిగ్ మిస్టేక్ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. అలంజేబ్ పాత్రలో నటించిన షర్మిన్ సెగల్ స్వయాన సంజయ్ లీలా బన్సాలీకి మేనకోడలు కావడం విశేషం. ఆమె సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలాల్ చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. అంతే కాకుండా గోలియాన్‌కి రాస్లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కతియావాడి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ తర్వాత హారర్ కామెడీ 'అతిథి భూతో భవ సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Sharmin Segal Mehta (@sharminsegal) -
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
స్టార్ సంజయ్ లీలా భన్సాలీ తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి, దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'హీరామండి: డైమండ్ బజార్'. ప్రపంచవ్యాప్తంగా మే1న 190 దేశాల్లో రిలీజైంది. అలానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గ్రాండియర్ విషయంలో చాలామంది నెటిజన్స్.. ఈ సిరీస్‌ని అద్భుతమైన సిరీసుల్లో ఒకటిని అభిప్రాయపడుతున్నారు.(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)8 ఎపిసోడ్లతో తీసిన ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', ది క్రౌన్, బ్రేకింగ్ బ్యాడ్ లాంటి అంతర్జాతీయంగా సిరీస్‌లతో పోటీపడుతోంది. ఈ సిరీస్ చూసిన ప్రేక్షకులు.. పలు టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ వారి ప్రశంసలను వ్యక్తం చేస్తున్నారు.ఉత్కంఠ భరితమైన విజువల్స్ నుంచి ఆకట్టుకునే కథల వరకు, ప్రతి ఫ్రేమ్ భన్సాలీ ప్రతిభకు నిదర్శనం. ఈ షోపై నెటిజన్లు ఎలా ప్రశంసలు కురిపిస్తున్నారు. "ఇది ఒక అద్భుత కళాఖండం! నేను మంత్రముగ్ధుడయ్యాను. సంజయ్ లీలా భన్సాలీ మళ్లీ మాయ చేశాడు!", "కథ, నటన, దర్శకత్వం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ సిరీస్ తప్పకుండా చూడండి!", "సంజయ్ లీలా బన్సాలీ మాస్టర్ స్టోరీ టెల్లర్. ఈ షో ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది" అని రాసుకొస్తున్నారు.(ఇదీ చదవండి: హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?) -
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
హీరామండి.. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన వెబ్ సిరీస్. పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ కళాఖండం మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ సిరీస్‌లో కొన్ని పొరపాట్లను నెటిజన్లు గుర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.జర్నలిస్టు ట్వీట్ఐదో ఎపిసోడ్లో సోనాక్షి సిన్హా వార్తా పత్రిక చదువుతున్న సమయంలోని పొరపాటను ఎత్తిచూపుతున్నారు. ఈ మేరకు పర్వేజ్ ఆలమ్ అనే జర్నలిస్టు ఓ ట్వీట్ చేశాడు. హీరామండి సిరీస్ 1920-40 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. స్వతంత్రానికి ముందు బ్రిటీష్ పాలనలో ఉన్న లాహోర్‌లో కథ సాగుతుంది. ఉర్దూ పేపర్ఐదో ఎపిసోడ్లో ఫరీదన్ (సోనాక్షి సిన్హ) ఉర్దూ పేపర్ చదువుతుంది. అందులోని హెడ్‌లైన్స్‌లో వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్: టికెట్లు ఇచ్చిన టీఆర్ఎస్ అని ఉంది. 50వేల మాస్కులను పంపిణీ చేయనున్న యూత్ కాంగ్రెస్.., కరోనాతో పోరాడాలంటే ఆత్మస్థైర్యం ఉండాలి: కరోనా రోగులకు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు సలహా.. ఇలాంటి హెడ్లైన్సే ఉన్నాయి అని రాసుకొచ్చారు. అది కూడా తెలీదా?మరో నెటిజన్.. ఉర్దూ పేపర్‌ను ఎడమ నుంచి కుడికి చదవడం మాత్రం హైలెట్ అని సెటైర్ వేశాడు. ఉర్దూని కుడి నుంచి ఎడమకు చదువుతారని కూడా తెలీకుండా ఆ పాత్రను డిజైన్ చేయడం, కనీసం ఎవరైనా భాషాజ్ఞానులను సంప్రదించకపోవడం విచారకరం అని కామెంట్లు చేస్తున్నారు. Sanjay Leela Bhansali’s epic web series Heera Mandi on Netflix is set against the Indian independence/British Raj in Lahore of the 1920s-1940s. Fareedan (Sonakshi Sinha) is supposedly reading an Urdu newspaper (EP5). Headlines say, “Warangal Municipal Elections: TRS Distributes… pic.twitter.com/EI44Z61rkt— Pervaiz Alam (@pervaizalam) May 3, 2024 -
దుమ్మురేపుతున్న ‘హీరామండి’.. భన్సాలీకి భారీ రెమ్యునరేషన్?
బాలీవుడ్లో భారీ చిత్రాలకు కేరాఫ్ సంజయ్ లీలా భన్సాలీ. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. ఎంత భారీగా ఖర్చు చేస్తాడో అంతకు మించిన కలెక్షన్స్‌ను రాబడతాడు. అందుకు ఆయన తెరెక్కించిన ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలే నిదర్శనం. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫిక్స్‌లో ఈ భారీ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించాడు భన్సాలీ. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల లాంటి భారీ తారాగణంతో పిరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించాడు.(చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ) స్వాతంత్య్రానికి పూర్వం ‘హీరామండి’ వేశ్యా వాటికలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా తెరక్కించిన ఈ వెబ్ సీరిస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. భన్సాలీ మేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం భన్సాలీ చాలా కాలంపాటు కష్టపడ్డారు. అందుకు తగ్గట్టే నెట్‌ఫ్లిక్స్ భారీ రెమ్యునేరేషన్ ఇచ్చిందట. ఈ వెబ్ సిరీస్ కోసం భన్సాలీ దాదాపు రూ. 70 కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందింట. ఈ సిరీస్‌లో ఫరిదాన్ పాత్రను పోషించిన సోనాక్షి సిన్హాకు అత్యధికంగా రూ. 2 కోట్ల పారితోషికంగా అప్పగించిందట నెట్ఫిక్స్. అలాగే మల్లికా జాన్ పాత్రలో నటించిన మనిషా కొయిరాలాకి కోటి రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మరో కీలక పాత్రను అదితిరావు హైదరి పోషించింది. ఇందుకుగాను ఆమె రూ. కోటిన్నర వరకు తీసుకుందట. అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్దా రూ. 1 కోటి, వహిదాగా నటించిన సంజీదా షేక్ రూ. 40 లక్షలు, ఆలంజేబుగా నటించిన షర్మిన్ సెగల్ రూ. 35 లక్షలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్ : హీరామండి: ది డైమండ్ బజార్ (వెబ్‌సిరీస్)నటీనటులు: మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్, తదితరులునిర్మాణ సంస్థలు: భన్సాలీ ప్రొడక్షన్స్దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీసంగీతం: సంజయ్ లీలా భన్సాలీ,బెనెడిక్ట్ టేలర్,నరేన్ చందావర్కర్కథ: మొయిన్ బేగ్జానర్: చారిత్రక నాటకంఎపిసోడ్స్: 8 భాషలు: తెలుగుతో పాటు మొత్తంగా 14 భాషల్లో స్ట్రీమింగ్'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హీరామండి టాపిక్ నడుస్తూనే ఉంది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్‌కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. బాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను తన నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. పీరియాడిక్ డ్రామా చిత్రాలకు పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఇప్పటికే పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్‌సిరీస్ 'హీరామండి' సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే... బ్రిటీష్ పాలన సమయంలో లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక 'హీరామండి'లో ఎలాంటి ఆధిపత్య పోరు జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి సంఘర్షణ జరిగింది..? హీరామండిలో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరెన్ని కుట్రలు చేశారు..? స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఎంత..? ఈ కథలోకి వెళ్లాలంటే ముందుగా పాత్రల గురించి పరిచయం తప్పనిసరి. హీరామండిలో ఉండే షాహీ మహల్ నిర్వహణ మొత్తం మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) చేతిలో ఉంటుంది. ఆ ప్రాంతంలోని నవాబులంతా ఆమె కనుసన్నలలోనే ఉంటారు. అయితే అదే ప్రాంతంలో ఖ్వాభాగ్ అనే మరో మహల్ ఉంటుంది. అక్కడ ఫరీదాన్ (సోనాక్షి సిన్హా) ఉంటుంది. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో మరో మూడు పాత్రలు కీలకంగా ఉంటాయి. వహీదా (సంజీదా షేక్) మల్లికా జాన్‌కు సోదరి. బిబోజాన్ (అదితిరావ్ హైదరి), ఆలంజేబు (షర్మిన్ సెగల్) ఇద్దరూ కూడా మల్లికా జాన్‌కు కుమార్తెలు. లజ్జో (రిచా చద్దా) మల్లికా జాన్ దత్తత తీసుకున్న కూతురు.హీరామండిలో తన మాటకి తిరుగులేదనే స్థాయిలో మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) రాజ్యమేలుతూ ఉంటుంది. ఆమె కనుసన్నల్లో ఉన్న వేశ్యలపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ఎవరైనా ప్రేమలో పడితే ప్రమాదంలో పడినట్టే అనే మాటతో హెచ్చరిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేశ్యలుగా ఉంటూనే మల్లికా జాన్ మాట వినిపించుకోకుండా 'జొరావర్' అనే నవాబుతో లజ్జో, ఫిరోజ్ అనే నవాబుతో వహీదా, వలీ ఖాన్ అనే నవాబుతో బిబోజాన్ ప్రేమలో పడతారు. కానీ, మల్లికా జాన్ చిన్న కుమార్తె ఆలంజేబును కూడా వేశ్యలా మార్చాలని చూస్తుంది. అయితే, ఆమె బాలోచి నవాబు తాజ్దార్ (తాహా షా బహదూర్ షా)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మల్లికా జాన్‌తో పాటు తాజ్దార్ తండ్రికి నచ్చదు. ఆయన ఆంగ్లేయులకు బానిసగా ఉంటాడు. వారి నుంచి విముక్తి కోసం తాజ్ దార్ పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆలంజేబును పెళ్లి చేసుకోవాలనే తాజ్ దార్ నిర్ణయాన్ని అతని తండ్రి వ్యతిరేకిస్తాడు. వేశ్య తమ ఇంటికి కోడలిగా రాలేదని తేల్చి చెబుతాడు. మరోవైపు కూతురు ప్రేమ వివాహాన్ని మల్లికా జాన్ కూడా వ్యతిరేఖిస్తుంది. ఈ క్రమంలో మల్లిక వ్యవహారశైలి నచ్చని తన సోదరి వహీదా ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. దీంతో తన అక్కకు శత్రువుగా ఉన్న ఫరీదాన్ (సోనాక్షి సిన్హా)తో చేతులు కలుపుతుంది. ఇలా హీరామండిలో అనేక సంఘటనలు జరుగుతుండగా బిబోజాన్ (అదితిరావ్ హైదరి) బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్య్ర పోరాటంలో గూఢచారిగా ఉంటుంది. ఒక వేశ్యగా ఉన్న ఆమె ఈ పోరాటం ఎందుకు చేస్తుంది..? బ్రిటీషర్లతో సత్సంబంధాలు పెంచుకుని వారి రహస్యాలను ఎందుకు తెలుసుకుంటుంది..? ఫైనల్‌గా బిబోజాన్ ఒక గూఢచారి అని తెలిసిన తర్వాత బ్రిటీష్‌వాళ్లు ఏం చేశారు..? ఇదే సమయంలో షాహీ మహల్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మల్లికా జాన్న్ అనచివేసేందుకు ఫరీదాన్ ఎలాంటి కుట్రలకు తెరలేపింది..? వేశ్య కుటుంబానికి చెందిన ఆరుగురు స్త్రీల చుట్టూ.. నవాబులు, బ్రిటీష్ పోలీస్ అధికారులు, తిరుగుబాటుదారుల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయనేది తెలియాలంటే హీరామండి సిరీస్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..పీరియాడిక్ డ్రామా చిత్రాలను డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు అంటే 1930, 1940ల కాలం బ్యాక్‌డ్రాప్‌లో హీరామండి వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. 'హీరామండిలో తెల్లదొరల పెత్తనం కాదు.. మల్లికా జాన్ నాణేలు మాత్రమే చెలామణి అవుతాయి' అని మనీషా కొయిరాలా చెప్పిన ఒక్క డైలాగ్ చాలు.. ఈ సిరీస్ డెప్త్ ఏంటో చెప్పడానికి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఎందరో మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ కొందరు చరిత్ర పుటల్లో కలిసిపోతే.. మరికొందరు మాత్రం నేటికి కూడా వినికిడిలో ఉన్నారు. లాహోర్ నగరంలోని హీరామండి ప్రాంతంలో పడుపు వృత్తి నిర్వహించే మల్లికా జాన్‌కు, బ్రిటీష్‌వాళ్లతో మొదలైన వైరాన్ని సంజయ్‌లీలా చక్కగా చూపించాడు. స్వాతంత్య్ర పోరాటంలో 'హీరామండి' పాత్ర ఎంతవరకు ఉందో చెప్పడానికి భారీగానే డైరెక్టర్ ప్లాన్ చేశాడు. మొత్తం 8 ఎపిసోడ్స్‌లలో తన విజువల్ ఫీస్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. హీరామండిలో వేశ్యలుగా ఉన్న వారి జీవితాలను తెరపైన అద్బుతంగా క్రియేట్ చేశాడు. వేశ్యావృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న ఆ మహిళలు స్వతంత్ర సంగ్రామంలోకి ఎందుకు దూకాల్సి వచ్చిందో అదిరిపోయే రేంజ్లో చూపించాడు. ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిపి వాళ్ల వెన్నులో వణుకు పుట్టించిన వేశ్యలుగా వారందరినీ తెరపై చూపించి అద్భుతాన్ని ఆవిష్కరించడంలో సంజయ్‌లీలా భన్సాలీ సూపర్ సక్సెస్ అయ్యాడు.తన టేకింగ్, విజువల్ ఫీస్ట్‌తో ప్రతి ప్రేక్షకుడినీ హీరామండి ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆ కాలంనాటి డిజైన్లను దృష్టిలో పెట్టుకుని అందంగా తీర్చిదిద్దిన భారీ సెట్లతో పాటు చక్కని ఫొటోగ్రఫీ తోడు కావడం ఆపై ప్రతి పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఈ సిరీస్‌కు ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. ఒక వెబ్ సిరీస్ అంత భారీ స్థాయిలో పాటలు అవసరమా అనేలా ఉంటాయి. ప్రారంభంలో రెండు, మూడు ఎపిసోడ్స్‌లలో కథ పరంగా కాస్త నెమ్మదించినా చివరి రెండు ఎపిసోడ్స్ మాత్రం దుమ్మురేపుతాయి. మల్లికా జాన్ పాత్ర పరిచయం చేసిన ఒక ఎపిసోడ్ కూడా మెప్పిస్తుంది. సొంత కుమార్తెలతో సహా ఎవరిపైనా దయాదాక్షిణ్యాలు లేని కఠినాత్మురాలిగా ఆ పాత్రను క్రియేట్ చేసిన విధానం అందరినీ మెప్పిస్తుంది. వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే కథనే అయినప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు. ఈ వీకెండ్లో చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఈ సిరీస్ ఉంటుంది. బ్రిటీష్ పాలనను దిక్కరించిన హీరామండి చరిత్ర పుటల్లో పెద్దగా కనిపించదు. అలా కనుమరుగైన ఒక చాప్టర్‌ను 'హీరామండి'గా సంజయ్‌లీలా తీసుకొచ్చాడు.ఎవరెలా చేశారంటేరూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌లో టాప్ హీరోయిన్లను దర్శకుడు సెలక్ట్ చేసుకున్నాడు. మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వంటి స్టార్స్ ఇందులో ఉన్నారు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం వారే అని చెప్పవచ్చు. షాహీమహల్‌కు పెద్ద దిక్కుగా మల్లికాజాన్ పాత్రలో మనీషా కొయిరాలా దుమ్మురేపిందని చెప్పవచ్చు. తన కడుపున పుట్టిన కూతుర్లను కూడా వేశ్యలుగా మార్చే అంత కఠినాత్మురాలిగా ఆమె చూపించిన నటన అద్భుతమని చెప్పవచ్చు. మరోవైపు ఫరీదాన్‌గా సోనాక్షి సిన్హా నెగెటివ్ పాత్రలో మెప్పించింది. వీరందరికీ ఏమాత్రం తగ్గకుండా అదితిరావు హైదరీ ఎలివేషన్ మామూలుగా ఉండదు. వేశ్యగా కనిపిస్తూనే గూఢచారిగా తన సత్తా ఎంటో చూపించింది. నటనలో ఆమె ఎక్కడా తగ్గలేదు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం విజువల్స్, కాస్ట్యూమ్స్,సినిమాటోగ్రఫీ. ఇవన్నీ కూడా ఓటీటీ స్థాయికి మించి ఉన్నాయి. కానీ, ఇందులో ఎక్కువగా యుద్ధ ఘట్టాలు లేకున్నా ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనాటి చరిత్రకు.. సమాజంలోని స్థితిగతులకు దర్పణం పట్టేలా సీన్స్ ఉన్నాయి. కాస్త నిడివి తగ్గించి ఉంటే బాగుండు అనే కామెట్లు కూడా వినిపిస్తున్నాయి. -
తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పీరియాడిక్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. గతంలో గంగూభాయి కతియావాడి మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన మరోసారి అలాంటి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడం మరో విశేషం.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. మే 1వ తేదీ నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వర్షన్లతో పాటు 14 భాషల్లో హీరామండి సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావు హైదరి, సంజీదా షేక్, షార్మిన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. పోషించారు.కాగా.. భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలనలోని 1940 మధ్యకాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా హీరామండిని తెరెకెక్కించారు. పాకిస్తాన్‌లోని రెడ్‌లైట్ ప్రాంతంలో జరిగే సంఘర్షణ, కుట్రల చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. హీరామండి ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటనలను ఈ సిరీస్‌లో చూపించారు. కాగా.. హీరామండి ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉంది. -
రియల్ స్టోరీతో వస్తోన్న క్రేజీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం గంగూభాయి కతియావాడి. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ముంబయిలో వేశ్యవాటిక నేపథ్యంలో వచ్చిన గంగూభాయి కతియావాడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.తాజాగా అలాంటి కథతోనే సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సంజయ్. ఏకంగా ఆరుగురు హీరోయిన్లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ క్రేజీ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమైంది. హీరామండి: ది డైమండ్ బజార్ పేరుతో వస్తోన్న వెబ్ సిరీస్ మే 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది.ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదికరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్‌లో మల్లికాజాన్‌గా మనీషా కొయిరాలా, ఫరీదాన్‌గా సోనాక్షి సిన్హా, బిబ్బోజాన్‌గా అదితి రావు హైదరీ, అలంజేబ్‌గా షర్మిన్ సెగల్, వహీదాగా సంజీదా షేక్, లజ్జోగా రిచా చద్దా నటించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పాకిస్తాన్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. పాక్‌లోని రెడ్-లైట్ ఏరియాలో నివసించే మహిళల పోరాటాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. -
నయన్‌కు మరో క్రేజీ ఆఫర్.. స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్!
దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్ నయనతార మరో బాలీవుడ్ చిత్రానికి రెడీ అవుతున్నారా? అన్న ప్రశ్నలకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఒక పక్క పిల్లలు, భర్త అంటూ సంసార జీవితంలో ఎంజాయ్ చేస్తునే మరో పక్క నటిగా బిజీగా ఉన్న ఏకై క నటి నయన్. దక్షిణాదిలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార చాలా కాలంగా తరువాత ఇటీవలే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమె నటించిన తొలి చిత్రం జవాన్ సూపర్‌హిట్ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్‌ను పూర్తి చేశారు. అందులో ఒకటి మన్నాంగట్టి సిన్స్ 1960. దర్శకుడు డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటుడు యోగిబాబు, దేవదర్శిని, గౌరి కిషన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యాన్ లోల్డన్ సంగీతం, ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది ప్రారంభమైంది. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందుతోంది. కాగా ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే నయనతార తన పోర్షన్‌ను పూర్తి చేశారట. అలాగే ఈమె నటిస్తున్న మరో చిత్రం టెస్ట్. నటుడు మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ క్రీడ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా జవాన్ చిత్రంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సక్సెస్‌ను అందుకున్న నయనతారకు అక్కడ మరో సూపర్ అవకాశం వరించినట్లు తాజా సమాచారం. సూపర్ హిట్స్ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఈమె నాయకిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్. -
Manisha Koirala: జీవితం అనే గురువు పాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది
సంజయ్‌లీలా భన్సాలి ‘హీరామండి– ది డైమండ్ బజార్’ వచ్చే నెల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ‘హీరామండి’లో మనిషా కోయిరాల నటించింది. ‘హీరామండి’ విడుదలకు ముందు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన జీవితంలోని ప్రధాన సంఘటనల గురించి సుదీర్ఘమైన నోట్ రాసింది మనిషా. క్యాన్సర్‌తో తాను పోరాడిన రోజులను గుర్తు తెచ్చుకుంది. ‘ఎన్నో మంచి పాత్రలలో నటించాను. ఎంతో మంది ఉత్తమ దర్శకులతో కలిసి పని చేశాను. ఎంతోమంది స్నేహాన్ని పొందాను. దేవుడి దయతో క్యాన్సర్‌తో పోరాడి గెలిచాను. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నా జీవితంలో ఎన్నో లోతులను చూశాను. జీవితాన్ని మించిన గురువు లేదు. ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది. కాలం విలువను తెలుసుకున్నాను’ అంటూ రాసింది. మనిషా కోయిరాల రాసిన ఈ నోట్ నెట్‌జనులను బాగా కదిలించింది. -
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
సినిమానే అనుకుంటే.. అంతకుమించి.. ఆ వెబ్ సిరీస్ రికార్డ్!
ఈ రోజుల్లో సినిమా తీయాలంటే మాటలు కాదు. కోట్లతో కూడుకొన్న వ్యవహారం. ప్రస్తుత రోజుల్లో పాన్ ఇండియా సినిమాలను కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కిస్తున్నారు. అలా రోజు రోజుకు సినిమా బడ్జెట్ పెరుగుతూనే వస్తోంది. ఇక ఓటీటీ యుగం రావడంతో వెబ్ సిరీస్‌లు సైతం పోటీపడుతున్నాయి. సినిమాలే ఎక్కువ బడ్జెట్ అనుకుంటే.. ఇప్పుడు వెబ్ సిరీస్‌లు సైతం ఆ జాబితాలో చేరిపోయాయి. తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలంటే మనకు గుర్తుచ్చే పేరు రాజమౌళినే. బాహుబాలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అత్యధిక బడ్జెట్‌తో చేసిన సినిమాలే. కానీ ఇప్పుడు సినిమా బడ్జెట్‌ను మించిపోయేలా ఓవెబ్ సిరీస్ వస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. గతంలో అలియాభట్‌తో తీసిన గంగూభాయి కతియావాడి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ బడ్జెట్‌కు సంబంధించిన నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. యానిమల్, బాహుబలి, డంకీ సినిమాల బడ్జెట్‌ను మించిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్‌గా నిలవనుంది. తాజా సమాచారం ప్రకారం హీరామండి వెబ్ సిరీస్‌ను రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రుద్రను వెనక్కి నెట్టి.. ఇప్పవరకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ నటించిన వెబ్ సిరీస్ రుద్ర:ఎడ్జ్ ఆప్ డార్క్నెస్ అత్యంత భారీ బడ్జెట్‌గా రూపొందించిన వెబ్ సిరీస్‌గా నిలిచింది. ఈ సిరీస్‌ను దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కించారు. తాజాగా హీరామండి వెబ్ సిరీస్ బడ్జెట్ మాత్రం రూ.200 కోట్లు దాటిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే బడ్జెట్లో ఎక్కువశాతం రెమ్యునరేషన్లకే వెళ్లినట్లు తెలుస్తోంది. పారితోషికం విషయాకొనిస్తే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీయే రూ.60 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా బాలీవుడ్ హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. వీరికి కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి బాహుబలి మూవీని రూ.180 కోట్లతో తెరకెక్కించగా.. యానిమల్ రూ.100 కోట్లు, డంకీ రూ.120 కోట్లతో తీశారు. ఆ లెక్కన ఈ సూపర్ హిట్ సినిమాల బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువ ఖర్చుతో హీరామండి తీస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పేరుతో టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాదే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. దేశానికి స్వతంత్రం రాకముందు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో వేశ్యల జీవితాలను ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
జాతీయ అవార్డులు అందుకున్న మూవీ.. 19 ఏళ్లకు ఓటీటీలో..
దర్శకదిగ్గజం సంజయ్‌లీలా భన్సాలీ తీసే సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలు ఎంత రిచ్‌గా ఉంటాయో అంతే ఎమోషనల్‌గా కూడా ఉంటాయి. తను తీసే ఒక్కో సినిమా ఒక్కో కళాఖండంలా ఉంటుంది. అలా ఆయన 19 ఏళ్ల క్రితం తెరకెక్కించిన ఓ మాస్టర్ పీస్ 'బ్లాక్'. టైటిల్ చూడగానే ఓ విషయం అర్థమైపోతుంది. హీరోహీరోయిన్లలో ఒకరికి అంధత్వం ఉందని తెలిసిపోతోంది. అవును, ఇందులో హీరోయిన్గా నటించిన రాణీ ముఖర్జీకి కనబడదు, వినబడదు. అంధురాలు, అల్జీమర్ టీచర్ మధ్య లవ్.. ఆమెకు టీచర్ అమితాబ్ బచ్చన్‌తో అనుబంధం ఏర్పడుతుంది. కానీ అతడికి క్రమంగా అల్జీమర్స్(మతిమరుపు) వచ్చి ఆమెను మర్చిపోతాడు. ఆ ఇద్దరి మధ్య నడిచే డ్రామానే బ్లాక్. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఎంతోమంది మనసులను మెలిపెడుతూ కంటతడి పెట్టించేలా చేసింది. అంతేకాదు, మూడు జాతీయ అవార్డులను ఎగరేసుకుపోయింది. ఇన్నాళ్లకు ఓటీటీలో అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ ఓటీటీలోకి వస్తే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నామో, ఫైనల్‌గా మా కల నెరవేరింది అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: పేరెంట్స్‌తో వెళ్లా.. నడిరోడ్డుపై అసభ్యంగా తాకుతూ, గిల్లుతూ...: హీరోయిన్ -
జవాన్‌కు రూ.10 కోట్లు తీసుకున్న స్టార్ హీరోయిన్, ఇప్పుడేకంగా..
తన వయసు నాలుగు పదులు.. అయినా ఎక్కడా తగ్గేదేలే అంటోంది నయనతార. ఇంతకుముందు వివాదాలకు ఇప్పుడు సంచలనాలకు కేంద్రం ఈ బ్యూటీ. సినిమాల్లో నటిస్తూనే ఇతర వ్యాపార రంగాల్లోనూ దూసుకుపోతోంది. మరో పక్క దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు తల్లి కూడా అయింది. అయినప్పటికీ లేడీ సూపర్‌స్టార్ పట్టం చేజారకుండా చూసుకుంటోంది. బాలీవుడ్‌లోనూ నయన్‌కు క్రేజ్ అగ్ర కథానాయికగా ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఇటీవల బాలీవుడ్లో తన లక్ పరీక్షించుకుంది. అక్కడ షారుక్ ఖాన్‌తో జత కట్టిన జవాన్ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి రికార్డులను బ్రేక్ చేయడంతో ఈ అమ్మడి క్రేజ్ అక్కడ కూడా పెరిగిపోయింది. దీంతో బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు నయనతార తలుపు తడుతున్నాయని సమాచారం. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలి తాజా చిత్రంలో నయనతార ఒక ముఖ్యపాత్రలో నటింపజేయడానికి సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న హీరోయిన్ కాగా జవాన్ చిత్రానికి రూ.10 కోట్లు పుచ్చుకున్న నయనతార ఈ చిత్రానికి ఏకంగా రూ.13 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అలా ఏ విషయంలోనూ తగ్గేదేలే అంటూ ముందుకు పోతోందన్నమాట. ప్రస్తుతం ఈమె తమిళంలో తన 75వ చిత్రంతోపాటు, క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న టెస్ట్, మన్నాంగట్టిసిన్స్ 1960 చిత్రాల్లో నటిస్తోంది. నటుడు జయం రవి సరసన మరోసారి తనీ ఒరువన్–2 చిత్రంలో నయనతార నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. చదవండి: మేము విడిపోయామంటూ శిల్పాశెట్టి భర్త ట్వీట్.. నెట్టింట వైరల్ -
సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ మేనకోడలు..!
బాలీవుడ్ చిత్రనిర్మాత, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు బీ టౌన్లో చర్చ నడుస్తోంది. నటి అయిన షర్మిన్ సెగల్ ఓ వజ్రాల వ్యాపారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో షర్మిన్ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఏడాది చివర్లో పెళ్లి కూడా చేసుకోనుంది. (ఇది చదవండి: బోల్డ్ సీన్స్‌తో ఇండస్ట్రీని తన మైకంలో పడేసిన హీరోయిన్, ఇప్పుడు పేదరికంలో! ) ఓ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం షర్మిన్ 2023 ప్రారంభంలోనే అహ్మదాబాద్‌కు చెందిన వజ్రాల వ్యాపారితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఏడాది చివర్లో ఇటలీలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఆమెకు కాబోయే భర్త గురించి ఎలాంటి వివరాలు బయటకు చెప్పలేదని తెలుస్తోంది. కాగా.. షర్మిన్ సినిమాల్లో ఎంట్రీకి ముందే భన్సాలీతో కలిసి పనిచేసింది. ఆమె 'గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా', 'బాజీరావ్ మస్తానీ', 'గంగూబాయి కతియావాడి' వంటి చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసింది. కాగా.. షర్మిన్ 2019లో 'మలాల్' చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2022లో ఆమె 'అతిథి భూతో భవ'లో నటించింది. తాజాగా ఆమె భన్సాలీ తెరకెక్కిస్తోన్న 'హీరామండి'లో కనిపించనుంది. ప్రస్తుతం ఆమె సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ 'హీరమండి' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఓటీటీలోనూ అరంగేట్రం చేస్తోంది షర్మిన్. 'హీరమండి'లో సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ కూడా ఉన్నారు. (ఇది చదవండి: 'ప్రాజెక్ట్ K' నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్) View this post on Instagram A post shared by Sharmin Segal (@sharminsegal) -
వేశ్యల జీవిత కథ ఆధారంగా హీరామండిలో..
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. మనీషా కొయిరాల, సోనాక్షీ సిన్హా, అదితీ రావ్ హైదరీ, రిచా చద్దా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్‌ను శనివారం విడుదల చేశారు. లాహోర్ బ్యాక్‌డ్రాప్‌లో ఒకప్పటి వేశ్యల జీవితాల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. త్వరలో స్ట్రీమింగ్ కానుంది. -
అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల లిస్ట్‌లో రాజమౌళి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకులు ఎవరో తెలుసా? స్క్రీన్‌పై అభిమానులకు వినోదాన్ని అందిస్తూ కోట్లు సంపాదించిన డైరెక్టర్లను వేళ్ల మీదే చెప్పొయొచ్చు. అలాంటి ఇండియాలో ధనవంతులైన దర్శకులెవరో ఓ లుక్కేద్దాం. జీక్యూ ఇండియా తాజాగా దర్శకుల జాబితాను ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్‌కు చెందిన ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ గురించి బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఆయనకు దాదాపు రూ.1640 కోట్ల ఆస్తులతో మొదటిస్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో రాజ్‌కుమార్ హిరాణీ రూ.1105 కోట్లతో నిలవగా.. రూ.940 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీ మూడోస్థానం పొందారు. ఆ తర్వాత వరుసగా రూ.720 కోట్లతో అనురాగ్ కశ్యప్, రూ.300 కోట్లతో కబీర్ ఖాన్, రూ.280 కోట్లతో రోహిత్ శెట్టి, రూ.158 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి, రూ.76 కోట్లతో జోయా అక్తర్ నిలిచారు. View this post on Instagram A post shared by GQ India (@gqindia) -
ఓటీటీకే మొగ్గు చూపుతున్న బాలీవుడ్ అగ్ర దర్శకులు
టెక్నాలజీ పెరిగిన తర్వాత డిజిటల్ ఎంటర్టైన్మెంట్ విస్తృతి పెరిగింది. దీంతో అగ్ర నటీనటులు ఓటీటీ ప్రాజెక్ట్స్‌పై మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు దర్శకులు కూడా ఓటీటీకి ఓకే చెబుతున్నారు. అలా హిందీ చిత్రసీమలో కొందరు దర్శకులు చేస్తున్న వెబ్ సిరీస్‌లు, వెబ్ ఫిల్మ్స్ గురించి తెలుసుకుందాం. ⇔ ‘దేవదాస్’, ‘బ్లాక్’, ‘రామ్‌లీల’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’, ‘గంగూబాయి కతియావాడి’ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన అగ్రదర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఎనిమిది ఎపిసోడ్స్‌గా రానున్న ఈ వెబ్ సిరీస్‌లో సోనాక్షీ సిన్హా, అదితీరావ్ హైదరీ, మనీషా కొయిరాల తదితరులు ⇔ ‘గోల్మాల్’, ‘సింగమ్’ ఫ్రాంచైజీలతో పాటు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘సింబ’ వంటి చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు రోహిత్ శెట్టి. ఇదే కమర్షియల్ క్రేజ్‌ను డిజిటల్ వరల్డ్‌లో కూడా రిపీట్ చేయాలను కుంటున్నారాయన. ఇందులో భాగంగానే ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ పోలీసుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన తారాగణం. ⇔ వెబ్ వరల్డ్‌లో ‘లస్ట్ స్టోరీస్’, ‘ఘోస్ట్ స్టోరీస్’ ఆంథాలజీకి మంచి వ్యూయర్షిప్ లభించింది. ఈ ఆంథాలజీలోని ఓ భాగానికి దర్శకత్వం వహించారు జోయా అక్తర్. ఇప్పుడు సోలోగా ఓ వెబ్‌ఫిల్మ్ చేస్తున్నారామె. అమెరికన్ కామిక్ బుక్ ‘ది అరీ్చస్’ ఆధారంగా ఈ వెబ్ ఫిల్మ్ తీస్తున్నారు. ఈ వెబ్ ఫిల్మ్‌తోనే అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యా నంద, షారుక్ ఖాన్ కుమార్తె సుహానా, బోనీకపూర్–దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ యాక్టర్స్‌గా ప్రయాణం మొదలు పెడుతున్నారు. ఇక ‘జిందగీ నా మిలేగీ దోబారా’, ‘గల్లీ బాయ్’ వంటి చిత్రాలతో జోయా అక్తర్ దర్శకురాలిగా సుపరిచితురాలే. ⇔ ‘బరేలీ కీ బర్ఫీ’, ‘పంగా’ వంటి చిత్రాలతో మంచి దర్శకురాలిగా పేరు సంపాదించుకున్నారు అశ్వనీ అయ్యర్ తివారి (ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి భార్య). ఇప్పటికే భర్త నితీష్‌తో కలిసి ‘బ్రేక్ పాయింట్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో భాగస్వామ్యులయ్యారు అశ్వని. ఇప్పుడు సోలోగా ‘ఫాదు’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో పావైల్ గులాటి, సయామీ ఖేర్ ముఖ్య తారలుగా ఈ సిరీస్ తీస్తున్నారు అశ్వనీ. రెండో సిరీస్‌తో... కొందరు దర్శకులు రెండో వెబ్ సిరీస్‌కి రెడీ అయ్యారు. ఆ వివరాల్లోకి వస్తే... ⇔ సల్మాన్ ఖాన్‌తో ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాలను తీసిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తొలిసారిగా ‘తాండవ్’ అనే వెబ్ సిరీస్ చేశారు. తాజాగా షాహిద్ కపూర్ లీడ్ రోల్లో ‘బ్లడీ డాడీ’ అనేæసిరీస్ తీశారు. ఇక ‘స్కామ్ 1992’తో ఓటీటీలో సంచలనం సృష్టించిన దర్శకుడు హన్సల్ మెహతా తాజాగా భారత జాతిపిత మహాత్మాగాంధీ జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తీస్తున్నారు. ఇందులో ప్రతీక్ గాంధీ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘కహానీ’, ‘బద్లా’ వంటి హిట్ సినిమాలు చేసిన సుజోయ్ ఘోష్ ఇప్పటికే ‘టైప్ రైటర్’ అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ దర్శకుడు ప్రస్తుతం కరీనా కపూర్‌తో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అలాగే ‘సాక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి వెళ్లిన అనురాగ్ కశ్యప్ మరో వెబ్ సిరీస్‌కు కథ రెడీ చేశారట. ఇక హిట్ చిత్రాలు ‘క్వీన్’, ‘సూపర్ 30’ ఫేమ్ దర్శకుడు వికాశ్ బాల్ రెండో వెబ్ సిరీస్‌గా ‘ది క్యాన్సర్ బిట్చ్ చేస్తున్నారు. ‘సన్ ఫ్లవర్’ అనే సిరీస్‌తో వికాశ్ వెబ్ ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు మరికొందరు దర్శకులు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లు, వెబ్ ఫిల్మ్‌లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
Oscars: ఆస్కార్ బరిలో అలియా భట్ సినిమా!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. గంగూబాయి జీవితం ఆధారంగా రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ అనే పుస్తకాన్ని బేస్ చేసుకుని ఆమె జీవిత కథనే సినిమాగా తెరకెక్కించారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆలియా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాల్లో ఒటికగా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. (చదవండి: అభిమాని కాళ్లు మొక్కిన హృతిక్ రోషన్, వీడియో వైరల్) లేటేస్ట్ సమాచారం ప్రకారం ఆస్కార్ బరిలో గంగూబాయి కతియావాడి సినిమా ఉందట. భారతీయ సినిమాల నుంచి గంగూబాయి కతియావాడి పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి విదేశాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో.. ‘గంగుబాయి’ని కచ్చితంగా ఆస్కార్ బరిలోకి దింపుతారని బాలీవుడ్ మీడియా పేర్కొంటుంది. మరో రెండు నెలల్లో ఆస్కార్ చిత్రాల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గంగూబాయి కతియావాడి కాకుండా.. ఆర్ఆర్ఆర్ , ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాలు కూడా ఆస్కార్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. -
జోయా అఖ్తర్ యాక్టర్స్‌కు సెలవులివ్వదట, కారణం?
సినిమా.. ఆన్ స్క్రీన్ .. ఆఫ్ స్క్రీన్ సంగతులు భలే సరదాగా ఉంటాయి. వినోదాన్నీ పంచుతాయి. వీటిల్లో హీరోహీరోయిన్స్ గురించిన ముచ్చట్లకు ఉండే క్రేజ్ సరే.. దర్శకుల స్టయిల్ ఆఫ్ మూవీ మేకింగ్ పట్లా ఓ ఆసక్తి ఉంటుంది సినీ అభిమానులకు. ఆ ఇంటరెస్ట్నే క్యాచ్ చేశాం. ఇలా.. ! బయటకు వెళ్లిపోతారనే.. జోయా అఖ్తర్.. దర్శకురాలిగానే కాదు.. రైటర్‌గానూ ప్రసిద్ధి. రాసుకున్నదాన్ని రాసుకున్నట్టే చిత్రీకరించాలనే పట్టుదలతో ఏమీ ఉండదు. ఏదైనా సీన్‌ను షూట్ చేస్తున్నప్పుడు కొత్త ఐడియా తడితే మార్చడానికి ఏమాత్రం వెనుకాడదు. రీటేక్స్ విషయంలో చాలా లిబరల్గా ఉంటుంది. వైవిధ్యమైన నటీనటులతో సినిమాలు చేయడం ఆమెకు ఇష్టం. సాంఘిక అంశాలు, నిజ జీవితాల్లోని అనుబంధాలను మిళితం చేసి సినిమాలు తీయడం ఆమె ప్రత్యేకత. ‘దిల్ ధడక్నే దో’లోని అక్కాతమ్ముడి బాండింగ్‌కు.. తన తోబుట్టువు ఫర్హాన్ అఖ్తర్‌తో తనకున్న అనుబంధమే ప్రేరణట. సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌లో యాక్టర్స్‌కు సెలవులివ్వదట.. నటీనటులు కథా పాత్రల్లోంచి బయటకు వెళ్లిపోతారనే భయంతో. నో డీటైలింగ్.. సంజయ్ లీలా భన్సాలీ .. సినిమాల్లో డీటైలింగ్స్ మిస్ అవడు కానీ నటీనటులకు మాత్రం ఎక్కువ డీటైల్స్ ఇవ్వడు. ఏ మూవీకైనా కొన్నేళ్ల ముందుగానే స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిపెట్టుకుంటాడు. ఆయన చిత్రాల్లోని చాలా సన్నివేశాలు.. తాను చిన్నప్పుడు ఎరిగిన మనుషులు, తిరిగిన ఊళ్లు, పెరిగిన వాతావరణాన్ని తలపించేవిగా ఉంటాయిట. డార్క్ స్టోరీ అనురాగ్ కశ్యప్ సినిమాలు ఎక్కువగా డార్క్ టాపిక్స్ మీదే ఉంటాయి. కారణం.. ఆయన చైల్డ్ అబ్యూజ్ విక్టిమ్ కావడమే. తన సినిమాల్లోని క్యారెక్టర్స్ గురించి నటీనటులకు ఎలాంటి సూచనలివ్వడు. స్క్రిప్ట్‌ను క్షుణ్ణంగా చదివి నటీనటులే ఆయా క్యారెక్టర్స్‌ను అర్థం చేసుకోవాలి. సీన్స్ బాగా రావడానికి.. తమ జీవితాల్లో జరిగిన డార్క్ ఇన్సిడెంట్స్ను గుర్తుతెచ్చుకొమ్మని నటీనటులకు చెప్తాడట. రీటేక్స్ను ఇష్టపడడు. -
గంగూభాయ్ కతియావాడి: అలియా భట్‌కు ఓ రేంజ్లో రెమ్యునరేషన్!
ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్న ‘గంగూభాయ్ కతియావాడి’ మూవీకి సంబంధించిన ఓ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాల్లో తన నటనతో అలరించిన స్టార్ హీరోయిన్ అలియా భట్ తాజా సినిమాతో మరో మెట్టు ఎక్కిందని విశ్లేషకులు చెప్తున్నారు. టాప్ హీరో అజయ్ దేవ్గన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో అలియా కళ్లు చెదిరే పారితోషికం తీసుకుందని సమాచారం. ఇండియా టుడే వార్త సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. గంగూభాయ్ సినిమాకు అలియా ఏకంగా రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. దేవ్గన్ రూ.11 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సీనియర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ బయోగ్రాఫికల్ క్రైం డ్రామా సినిమా బడ్జెట్ రూ.100 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా గంగూభాయ్ తెరకెక్కింది. (చదవండి: ఎనర్జిటిక్ హీరోకు సరైనోడు విలన్.. ఆది రోల్ రివీల్) 1960 కాలంలో ముంబైలోని కామాఠీపుర రెడ్‌లైట్ ఏరియా ప్రధానంగా కథ సాగుతుంది. ఇక స్టార్ కిడ్ అయిన అలియా.. భన్సాలీ దర్శకత్వంలో నటించాలని తొమ్మిదేళ్ల ప్రాయం నుంచి అనుకున్నట్టు చెప్పుకొచ్చింది. గతంలో భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘బ్లాక్’ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లానని, అయితే ఆ సినిమాలో అవకాశం రాలేదని ఆమె గుర్తు చేసుకుంది. ఇక దేశవ్యాప్తంగా గంగూభాయ్ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. (చదవండి: రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్) -
మాటలు సరిపోవట్లేదు, ఎప్పటికీ నా మదిలో నిలిచిపోతాయి: సమంత
Samantha Lauds Alia Bhatt Performance In Gangubai Kathiawadi: గ్లామర్ రోల్స్‌తోనే కాకుండా వైవిధ్యభరితమైన నాయికా ప్రాధాన్యత కథలు ఎంచుకుంటూ దూసుకెళ్తోంది బాలీవుడ్ క్యూట్గుమ్మ అలియా భట్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'లో అలియా సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో అలరించిన చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ప్రముఖ బీటౌన్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి తదితరులు అతిథి పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీలో అలియా వేశ్యగా నటించడం, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ నెల 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతూ విజయవంతంగా ఆడుతోంది. ముఖ్యంగా ఇందులో అలియా నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సమంత అలియా నటనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. '#గంగూబాయి కతియావాడి ఒక కళాఖండం.. అలియా మీ నటన గురించి వివరించడానికి పదాలు సరిపోవు. ప్రతీ ఒక్క డైలాగ్, హావాభావాలు నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి.' అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది సామ్. ఇంకా అనన్య పాండే, ఆదిత్య సీల్, సోఫీ చౌదరి వంటి తారలు కూడా అలియా నటనపై ప్రశంసలు కురిపించారు. -
గంగూబాయ్ కథియావాడి ట్విటర్ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆలియా భట్ తాజాగా నటించిన చిత్రం గంగూబాయ్ కథియావాడి. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సంజయ్‌లీలా భన్సాలీతో కలిసి పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతీలాల్ గడ నిర్మించారు. ఇదివరకే రిలీజైన ట్రైలర్, సినిమాపై చుట్టుకున్న వివాదాలు ఆలియా సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. అయితే ఈ సినిమాలో తన తల్లి గంగూబాయ్ కథియావాడీని వేశ్యగా చూపించారంటూ ఆమె తనయుడు బాబూ రావుజీ షా కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే! రిలీజ్‌ను సైతం అడ్డుకోవాలని చూసినప్పటికీ సినిమా విడుదలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసేసిన పలువురు నెటిజన్లు గంగూబాయ్ మూవీపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరి మెజారిటీ నెటిజన్లు గంగూబాయ్ను మెచ్చుకుంటున్నారా? ఆలియాకు మంచి మార్కులు పడ్డాయా? ఈ సినిమా తన కెరీర్‌కు ప్లస్ అయిందా? లేదా అనేది కింద చూసేయండి.. గంగూబాయ్ కథియావాడిలో ఆలియా నటన అద్భుతమని కొందరు కీర్తిస్తుంటే ఈ సినిమా పూర్తయ్యేవరకు థియేటర్లో నిద్రపోతూనే ఉన్నామని మరికొందరు అంటున్నారు. ఆ పాత్ర గాంభీర్యానికి ఆలియా గొంతు సెట్ అవ్వలేదన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీలు మాత్రం సినిమా అదిరిపోయిందని, ఆలియా పర్ఫామెన్స్‌కు మాటల్లేవ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఆ రివ్యూలపై మీరూ ఓ లుక్కేయండి.. #OneWordReview...#GangubaiKathiawadi: BRILLIANT. Rating: ⭐️⭐⭐⭐#SLB is a magician, gets it right yet again... Powerful story + terrific moments + bravura performances [#AliaBhatt is beyond fantastic, #AjayDevgn outstanding]... UNMISSABLE. #GangubaiKathiawadiReview pic.twitter.com/pIyaf1MWtv — taran adarsh (@taran_adarsh) February 25, 2022 Saw #GangubaiKathiawadi last night!!! Another magical experience.. #SanjayLeelaBhansali is an absolute master storyteller. Every frame in the film has perfection written all over it. @aliaa08 you are gold! You are a fantastic actor but you have outdone yourself as Gangubai. — Riteish Deshmukh (@Riteishd) February 24, 2022 #GangubaiKathiawadi received 7 minutes standing ovation at the Berlin International film Festival from 700-800 audiences. #AliaBhatt — Indian Box Office (@box_oficeIndian) February 24, 2022 Finally watched most over hyper movie of the decade, I was big Bhasanali movies fan but after watching this i feel like he lost his charm, what a pathetic casting in main lead. If you watch other movies of him like black, HDDCS or Bajirao casting was perfect #GangubaiKathiawadi pic.twitter.com/lqrpcxnD73 — TweetuSultanL (@TweetuSultanL) February 25, 2022 Finished #GangubaiKathiawadi Disappointed from slb Below average performance of Alia Bhatt Slow screen play Over all it was a average movie 2.5/5 — gunjanchaubayofficial (@gunjanchau1993) February 25, 2022 I just Watched A Super Duper Hit Movie #GangubaiKathiawadi What a Amazing Movie 😍😍 Loved it Thank you @aliaa08 #SanjayLeelaBhansali @ajaydevgn for Giving a Wonderful and Blockbuster Movie. My review : ⭐⭐⭐⭐ 5/5#AliaBhatt #AjayDevgn @bhansali_produc ❤️❤️ pic.twitter.com/HxMhT3l14g — Pulkit Moonat (@am_pulkit) February 25, 2022 #PriyankaChopra , the first choice for #GangubaiKathiawadi would have given a 100 times better and Convincing performance than #AliaBhatt. The way she overshadowed M@@l aunty #DeepikaPadukone in BJM despite having a supporting role speaks volume about her acting skills. — Fotia (fire) (@I_am_fighter08) February 25, 2022 #GangubaiKathiawadi Movie : @aliaa08 ’s biggest career risk pays off. She took her acting to a different level and made it tough for her contemporaries to match her standards. #AliaBhatt pic.twitter.com/qWF172pqlJ — dinesh akula (@dineshakula) February 25, 2022 The soundtrack goes well with the mood of the film, but there's a hitch... Barring #Dholida, the remaining songs of #GangubaiKathiawadi are definitely not at par when one compares it with #SLB's earlier accomplished works. #GangubaiKathiawadiReview — Olid Ahmed Razu (@BeingOlidAhmed) February 25, 2022 Don't waste your money on movie like #GangubaiKathiawadi rather save it or serve it to poor.. — ✰Şนຖ (@a12sun) February 25, 2022 #OneWordReview...#GangubaiKathiawadi: BRILLIANT. Rating: ⭐️⭐⭐⭐#SLB is a magician, gets it right yet again... Powerful story + terrific moments + bravura performances [#AliaBhatt is beyond fantastic, #AjayDevgn outstanding]... UNMISSABLE. #GangubaiKathiawadiReview pic.twitter.com/XNuxqbFt9M — Olid Ahmed Razu (@BeingOlidAhmed) February 25, 2022 #GangubaiKathiawadi.. One word review. Flop.... #aliaabhatt looks like a kid.. Wrong casting only thing good is #AjayDevgn.. Will be the biggest flop of the year 1 out 5.. only for ajays performance... — Afzal rocks (@Afzalrocks1) February 25, 2022 you all bow down to the queen! she's here to rule & she's ruling!!! everybody in the theater is clapping and cheering and what not! truly one of a kind experience! loving the vibeeee 🥵😍#GangubaiKathiawadi #AliaBhatt — saurabh (@Saurabhhh_) February 25, 2022 #OneWordReview...from Australia#GangubaiKathiawadi: Engrossing Rating: 🌟🌟🌟🌟#SanjayLeelaBhansali weaves his magic, gets it right yet again. Powerful story #AliaBhatt gives her best, #AjayDevgn is outstanding Songs are good A must watch #GangubaiKathiawadiReview @aliaa08 pic.twitter.com/gw4F3tKJqm — Nitesh Naveen (@NiteshNaveenAus) February 25, 2022 After watching the movie you all sure bow down to her talent. #AliaBhatt born to play it and be a slb heroine.Alia Bhatt helps him with her immaculate acting and attitude. You will definitely miss out on a gem if you don’t watch it on the big screen. @aliaa08 #GangubaiKathiawadi pic.twitter.com/xW1GD4OBv4 — Jeny 🌸 (@Idiotic_luv_) February 25, 2022 చదవండి: జీవితంలో కామాఠిపురను చూడలేదు, తెలీకుండానే గంగూబాయ్‌లా మారిపోయేదాన్ని: ఆలియా -
'గంగూబాయ్' కోసం కాస్ట్లీ చీరల్లో ఆలియా దర్శనం
Alia Bhatt Looks For Gangubai Kathiawadi Promotions: బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మహేష్ భట్ వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చినా తన నటనతోనే అభిమానుల్ని సంపాదించుకుంది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' వంటి సినిమాలతో పాపులారిటీ సంపాదించుకున్న ఆలియా ఇప్పుడు 'గంగూబాయి కతియావాడి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్.. ఆలియా నట విశ్వరూపాన్ని చూపించింది. డైలాగ్ డెలివరీలోనూ స్టార్ హీరోలకు సమానంగా సత్తా చాటింది. ఈ సినిమాతో ఆలియా బాలీవుడ్ నెంబర్1 హీరోయిన్గా చక్రం తిప్పుదింటూ ఇప్పటికే పలువురు ప్రముఖులు సైతం భావిస్తున్నారు. ట్రైలర్‌తోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో చీరకట్టుతో మరింత మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఈ ప్రమోషన్స్ కోసం కేవలం చీరకట్టులో తళుక్కుమంటుంది. ఒక్కో చీర ధర సుమారు 21-29వేల వరకు ఉంటుందని సమాచారం. ఈ ఫోటోలను మీరూ చూసేయండి మరి. -
ఆర్ఆర్ఆర్ హీరోయిన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
Alia Bhatt Gangubai Kathiawadi Movie Release Date Confirmed: ఆలియా భట్ మోస్ట్ అవైటెడ్ సినిమా 'గంగూబాయి కతియావాడి'. గత కొన్నాళ్లుగా వాయుదా పడుతూ వస్తున్న ఈ సినిమా రిలీజ్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి ఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంజయ్ లీలా భన్సాలీ దరకత్వం వహించిన ఈ సినిమాలో ఆలియా ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి పాత్రలో కనిపించనుంది. అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. కాగా ఆలియా ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆలియా సీతగా నటించనుంది. #GangubaiKathiawadi will rise to power in cinemas near you on 25th February, 2022 🤍#SanjayLeelaBhansali @ajaydevgn @prerna982 @jayantilalgada @PenMovies @bhansali_produc @saregamaglobal https://t.co/y0Uab2hh6W — Alia Bhatt (@aliaa08) January 28, 2022 -
ఆ డైరెక్టర్ నన్ను తిట్టేవాడు, కోపం ఎక్కువైతే కొట్టేవాడు: రణ్‌బీర్ కపూర్
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన బ్లాక్ సినిమాకు బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే భన్సాలీతో తన సినీ ప్రయాణం మొదలుపెట్టడం, అది కూడా అనుకున్నంత సులుభంగా ముందుకు సాగలేదని తెలిపాడు రణ్‌బీర్. తాజాగా ‘‘రాజ్ కపూర్: ద మాస్టర్ ఎట్ వర్క్ ’’ పుస్తకాన్ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రణ్‌బీర్ గతంలో సంజయ్‌తో పని చేసిన తన అనుభవాలను పంచుకున్నాడు. ఈ ఈవెంట్లో రణ్‌ధీర్ కపూర్ మాట్లాడుతూ.. ‘‘నేటితరం డైరెక్టర్లు కమర్షియల్ చిత్రాలకే ప్రాధాన్యతని ఇస్తున్నారు. రాజ్ కపూర్ శకం నాటి సినిమాలు ముగిశాయని అన్నారు. డబ్బు కోసం అతడు ఎన్నడూ పనిచేయలేదు. బాబీ సినిమాలో నటించినందుకు ఒక పెయింటింగ్‌ను మాత్రమే ఇచ్చారని అన్నాడు. రణ్ధీర వ్యాఖ్యలకు కొంత భాగం సమర్థించిన రణ్‌బీర్ కపూర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ప్రస్తుత దర్శకులు పూర్తిగా కమర్షిమల్ చిత్రాలకే మొగ్గుచూపుతున్నాంటే తాను నమ్మనని చెప్పాడు. గతంలో బ్లాక్ సినిమా కోసం భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేటప్పుడు తాను అనేక గంటల పాటు మోకళ్లపై కూర్చునే వాడని చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి భన్సాలీ తనని తిట్టేవాడని, మరి కోపం ఎక్కువైతే కొట్టేవాడని కూడా అప్పటి విషయాలని గుర్తుచేసుకున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీలోనే అలాంటి ఘటనలు తనకు ఎదురుకావడం బయట ప్రపంచాన్ని ఎదర్కునేలా తనని సిద్ధం చేసిందని రణ్ బీర్ చెప్పాడు. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్ హీరోయిన్గా నటిస్తోంది. చదవండి: Sara Ali Khan: ‘చాల తప్పులు చేశా, కొన్ని పబ్లిక్‌గానే జరిగాయి’ -
ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన సంజయ్ లీలా భన్సాలీ, టైటిల్ ఇదే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివతో ‘ఎన్టీఆర్ 30’, ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్‌ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కాస్తా బ్రేక్ తీసుకుంటున్నాడు. విరామం అనంతరం డిసెంబర్లో కొరటాల శివ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు తారక్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. చదవండి: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అప్పట్లో దివ్య భారతిని మైమరిపించారు దీని తర్వాత ప్రశాంత్ నీల్ చిత్రాన్ని కూడా ప్రారంభిస్తాడట. ఈ క్రమంలో ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ రెండు చిత్రాలతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ బడా దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బీ-టౌన్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. చదవండి: అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా: రీతూ వర్మ ఈ నేపథ్యంలో మరోసారి వీరి కాంబినేషన్ తెరపైకి వచ్చింది. ఈ తాజా బజ్ ప్రకారం సంజయ్ లీలా భన్సాలీ, ఎన్టీఆర్ కోసం పౌరాణిక అంశాలతో కూడిన పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ స్క్రిప్ట్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అంతేగాక దీనికి ‘జై బావ్ రే’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట. అన్నీ కుదిరి భన్సాలీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్‌కు పండగే. దీంతో భన్సాలీతో, ఎన్టీఆర్ చిత్రం అంటే.. దీనికంటే పెద్ద సంచలనం మరొకటి ఉండదంటూ ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. మరీ ఈ కాంబినేషన్ సెట్స్‌పైకి వస్తుందా? లేదా? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. చదవండి: రజనీకాంత్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన కూతురు సౌందర్య -
Lahores Heera Mandi: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు..
దాయాది దేశమైన పాకిస్థాన్‌లోని హీరామండి గురించిన ఆసక్తికర విషయాలు... ఇది లాహోర్‌లో ఉంది. హీరామండి (డైమండ్ మార్కెట్) చాలా మంది వివాదాస్పద ప్రదేశంగా పేర్కొంటారు. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. ఇక్కడ స్త్రీలు పేదరికం కారణంగా తమ కుటుంబాలను పోషించుకోవడానికి వేశ్యా వృత్తి తమ జీవనశైలిగా బతుకుతున్నారు. ఇది ఎందుకిలా మార్చబడిందో తెలుసుకోవాలంటే చరిత్రపుటల్లోకి తొంగిచూడాల్సిందే.. మిగతానగరాలు ఆధునీకరించబడినప్పటికీ ఈ నగరం మాత్రం చారిత్రక అవశేషంగా ఎందుకు మిగిలిపోయిందో తెలుసుకుందాం.. ఆ మార్కెట్ స్థాపకుడు ఇతడే.. సిక్కుల మహారాజైన రంజిత్ సింగ్ మంత్రి అయిన హీరా సింగ్ పేరు మీదనే దీనికా పేరు వచ్చింది. హీరా సింగ్ అక్కడ ఓ ధాన్యం మార్కెట్‌ను స్థాపించాడు. అంతేకాకుండా తరచుగా తవైఫ్ (నర్తకి) లను కూడా ఆ మార్కెట్ తీసుకొచ్చేవాడు. సిక్కు రాజైన రంజిత్ సింగ్ ఆ ప్రాంతాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండేవాడు. దీనికి షాహి మొహల్లా అని కూడా పేరుంది. లాహోర్ కోట పక్కనే ఉండటం వల్ల దీనికాపేరు వచ్చింది. మొగల్ రాజుల కాలంలో... మొగలుల సామ్రాజ్యంలో లాహోర్ కూడా ఒక భాగమే. దీని ఇతర నగరాల్లో హీరామండి ఒకటి. వీరికాలంలో ఆఫ్గనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ల నుంచి అందమైన మహిళలను (వేశ్యలు) ఇక్కడికి తీసుకొచ్చేవారు. వారికి ముజ్రాస్ అనే సంప్రదాయ నృత్యాన్ని కఠిన శిక్షణతో నేర్పేవారు (ఆ కాలంలో డాన్స్, సంగీతం, లలిత కళలు, పెయింటింగ్‌లకు ఈ ప్రదేశం ప్రసిద్ధి). వీరితో ధనవంతులు కచేరీలు నిర్వహించేవారు. తర్వాత కాలంలో భారతదేశం నుంచి కూడా మహిళలు ఇక్కడికి రావడం ప్రారంభించారు. వీరు మొగల్ రాజుల ముందు శాస్త్రీయ నృత్యం చేసేవారు. తర్వాత కాలంలో ఈ నృత్యం కుటుంబ సంప్రదాయంగా మారింది. చివరికి మొగలుల వైభవం మసకబారసాగింది. విదేశీ దండయాత్రల కాలంలో రాజ భవనంలో ప్రత్యేకంగా నిర్మించిన తవైఫ్ఖానా ధ్వంసమైపోయింది. కాలక్రమేణా నృత్యకారిణుల ప్రతిష్ట దెబ్బతిని వేశ్యలుగా మారారు. క్రమంగా ఇది వేశ్యా కూపంగా మారింది. ఇప్పుడు అక్కడ నపుంసకులు నృత్యం చేస్తున్నారు. ప్రస్తుతం తవైఫ్ అనేపదం వేశ్యకు పర్యాయపదంగా అక్కడ వాడబడుతుంది. రెండు రకాలైన జీవనశైలి వాస్తవానికి ఇక్కడ రెండు రకాలైన జీవనశైలి కలిగిన స్త్రీలు నివసిస్తున్నారు. నిజానికి రాత్రిళ్లు 11 నుంచి1 గంటల మధ్య సమయంలో ఈ నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. తమ కష్టమర్లు వెళ్లిపోగానే మామూలు మహిళల్లానే వారిళ్లకు చేరుకుంటారు. ముజ్రా నృత్యం చేసేవారు సాధారణంగా ఈ రొంపిలోకి దిగరు. వీరు తమ వృత్తి పట్ల నిబద్థత, అంకిత భావం, గౌరవం ప్రదర్శిస్తున్నారు. తాము ముజ్రా నృత్యకారినులని గర్వంగా చెప్పుకొంటారు కూడా. ఇక మరొక రకం కేవలం రూ. 200 నుంచి 400 లకు వేశ్యా వృత్తిని జీవనోపాధిగా బతికేవారు. ఇది చాలా బాధాకరమైన విషయమైనప్పటికీ వాస్తవం మాత్రం ఇది. ఎందుకంటే వీరి అజ్ఞానం, నిరక్ష్యరాస్యత అక్కడి పురుషుల విలాసానికి ప్రతీకగా ఎంచబడుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే ఇది ఇలాగే కొనసాగే ప్రమాదం ఉంది. ఈ కథనం ఆధారంగా.. పగలంతా ఈ ప్రదేశం మామూలు మార్కెట్లా కనిపిస్తుంది. కానీ చీకటైతే మాత్రం రెడ్‌లైట్ ఏరియాగా మారిపోతుంది. కళంక్ సినిమాలో ఇక్కడి పరిస్థితిని కొంతమట్టుకు చూపారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ హీరా మండిపై సినిమాను తెరకెక్కించనున్నాడు. చదవండి: టీచర్ దారుణం.. స్నాక్స్ ఉన్నాయని 300 గుంజిళ్లు... చివరకు.. -
షూటింగ్ సమయంలో ధోతీ జారిపోతూ ఉండేది: షారుఖ్
దేవదాస్.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం. పారూ- దేవదాస్‌ల అమర ప్రేమకు దృశ్యరూపమైన ఈ హృద్యమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. విషాదాంతంతో ముగిసే ఈ సినిమా భగ్న ప్రేమికుల హృదయానికి అద్దం పట్టింది. షారుఖ్, మాధురీదీక్షిత్(వేశ్య పాత్ర), ఐశ్వర్యారాయ్ పోటీపడి మరీ నటించి తమ తమ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్లో ఒకటిగా ఈ మూవీని పదిలం చేసుకున్నారు. ఇక సంజల్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా విడుదలై 19 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. ఈ మేరకు సోమవారం ఇన్‌స్టా వేదికగా.. ‘దేవదాస్’ సినిమా షూటింగ్ సమయం నాటి పలు ఫొటోలను షేర్ చేశాడు. ‘‘అర్ధరాత్రి వరకు షూటింగ్‌లు... పొద్దుపొద్దున్నే నిద్రలేవడం.. అబ్బో ఎన్నో కష్టాలు.. అయితే అవన్నీ మంచి అవుట్‌పుట్‌ను ఇచ్చాయి... ఇందుకు కారణం.. దిగ్గజ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, జాకీ ష్రాఫ్, కిరణ్ ఖేర్... ఇంకా టీం మొత్తం కలిసికట్టుగా పనిచేయడమే... అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని సహచర నటుల పట్ల ప్రేమను కురిపించాడు. అదే విధంగా... షూటింగ్ సమయంలో ధోతీ ఎప్పుడూ జారిపోతూ ఉండేదని, అన్నింటి కంటే తాను ఎదుర్కొన్న పెద్ద సమస్యే అదేనంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక మాధురీ దీక్షిత్ సైతం.. ‘‘19 ఏళ్లు గడిచినా ఆ జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ సంజయ్’’ అని సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. అదే విధంగా ఇటీవల మరణించిన, ‘దేవదాస్’ దిలీప్ కుమార్(1955 నాటి సినిమా)ను ఈ సందర్భంగా మరోసారి నివాళి అర్పించారు. View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
షూటింగ్ సమయంలో రెండు తుపాన్లు, లాక్డౌన్లు వచ్చాయి : ఆలియా
సంజయ్ లీలా భన్సాలీ దరకత్వంలో ఆలియా భట్ నటించిన చిత్రం ‘గంగూబాయ్ కతియావాడి’.ముంబైలోని కామాటిపురకు మకుటం లేని మహారాణిగా పేరొందిన గంగూబాయి పాత్రను అలియా పోషించింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. 2019లో మొదలైన గంగూబాయ్ షూటింగ్ నేడు ముగిసింది. ఈ సందర్భంగా రెండేళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్ చేసింది. '2019, డిసెంబర్8న గంగూబాయ్ షూటింగ్‌ను ప్రారంభించాము. రెండేళ్లకు ఈ సినిమా పూర్తయ్యింది. ఈ మధ్యలో రెండుసార్లు లాక్డౌన్, రెండు తుఫానులు కూడా వచ్చి వెళ్లాయి. షూటింగ్ టైంలో డైరెక్టర్‌తో సహా కొందరు కరోనా బారిన పడ్డారు. దాంతో పాటు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ వాటన్నింటిలోనూ సంతోషకరమైన విషయం ఏంటంటే..మీతో కలిసి పని చేయడం. భన్సాలీ సర్ దర్శకత్వలో పనిచేయడం అన్నది నా కల. అది ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు. మీతో పనిచేయడం నా జీవితాన్ని మార్చేసింది. మీలాంటి వ్యక్తి మరొకరు లేరు. ఐ లవ్ యూ సర్. ఇక సెట్‌కు ఇక గుడ్‌బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. అయితే ఈ రెండేళ్ల ప్రయాణంలో నటిగా చాలా విషయాలు నేర్చుకున్నా. షూటింగ్ అయిపోయిందంటే బాధగా కూడా ఉంది. నాలో కొంత భాగాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఫైనల్‌గా గంగూ ఐ లవ్ యూ. నిన్ను మిస్సవుతున్నాం. ముఖ్యంగా రెండేళ్ల ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నా కుటుంబం, సన్నిహితులు, క్ర్యూ, సిబ్బంది అందరికి ధన్యవాదాలు..మీరు లేకపోతే ఇది అంత సులువుగా అయ్యేది కాదు' అంటూ ఆలియా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించారు. జయంతి లాల్ గడా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్, టీజర్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాను ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేయాలనుకుంటుంది చిత్ర బృందం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) చదవండి : గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో.. ఆల్రెడీ పెళ్లైన దర్శకుడిని ప్రేమించిన హీరోయిన్! -
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ భన్సాలీతో ఎన్టీఆర్32వ సినిమా?
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా అనౌన్స్ చేసినా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్‌తో సినిమా చేయనున్నాడు. వరుసగా పాన్ ఇండియా డైరెక్టర్ల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఎన్టీఆర్ తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించి దాదాపు ఏడాది నుంచి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ‘రామ్ లీల’,‘భాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తీసిన బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం ప్రస్తుతం ఆలియాభట్‌తో గంగూబాయ్ కతియావాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత తారక్‌తో ప్రాజెక్టును పట్టాలెక్కించున్నాడని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఎన్టీఆర్ 32వ సినిమాకు డైరెక్టర్ భన్సాలీనే అంటూ టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ అభిమానుల్లో ఇప్పటికే ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తేలాల్సి ఉంది. చదవండి : Jr NTR Birthday: రేపు అభిమానులకు ఆర్ఆర్ఆర్ సర్ప్రైజ్! Pavala Syamala: పావలా శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి సాయం -
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
‘ప్లాన్ పేరు ‘టీ అండ్ ఎఫ్’ అంటే ట్యూస్ డేస్ అండ్ ఫ్రైడేస్.రూల్ నంబర్ వన్.. ఇద్దరం ప్రతి మంగళ, శుక్రవారాల్లో మాత్రమే కలుసుకోవాలి.రూల్ నంబర్ టూ.. మిగిలిన వారాల్లో ఎవరి ఇష్టం వారిది. నువ్వు వేరే అమ్మాయి తో డేట్ చేసినా.. నేను ఇంకో అబ్బాయితో డేట్ చేసినా నిలదీయొద్దు.రూల్ నంబర్ త్రీ.. థర్డ్ డేట్ వరకు నో కిసెస్, నో హగ్స్..ఇద్దరిలో ఎవరికిది వర్కవుట్ కావట్లేదు అనిపించినా తప్పుకోవచ్చు. ఎలాంటి సంజాయిషీలు, ప్రశ్నలు ఇచ్చిపుచ్చుకోవడాలు లేకుండా. తర్వాత ఎవరిదారి వారిది’ అంటూ అబ్బాయికి డేటింగ్ ప్లాన్ వినిపిస్తుంది అమ్మాయి. వెంటనే ఒప్పుకోవడానికి కాస్త తటపటాయించినా తర్వాత ఒప్పుకుంటాడు అబ్బాయి. ఆమె పేరు.. సియా (ఝటాలేకా), అతని పేరు వరుణ్ (అన్మోల్ టకారియా థిల్లాన్). సినిమా .. టీ అండ్ ఎఫ్. భన్సాలీ ప్రొడక్షన్స్ (సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణ సారథ్యం). దర్శకుడు.. తన్వీర్ సింగ్. ప్రేమ, పెళ్లి పట్ల మిల్లేనియల్స్ ఆలోచనల తీరు, భద్రతాభద్రతల భావనలు, నమ్మకం– అపనమ్మకాల ప్రయాణాన్ని చూపించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.కథ.. సియా.. వృద్ధిలోకి వస్తున్న న్యాయవాది. వరుణ్.. ఔత్సాహిక రచయిత. అతను రాసిన నవల సినిమా హక్కుల వివాదంలో ఒకరికొకరు పరిచయం అవుతారు. ఇద్దరి తల్లిదండ్రులు విడాకులతో వేరవుతారు. ఆ ఇద్దరూ తల్లుల దగ్గరే పెరుగుతారు. అయితే తన తల్లిదండ్రుల విడాకులతో ప్రేమ, పెళ్లి విషయంలో వరుణ్ ప్రతికూల అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటాడు. సియా.. కొంత ఆశావాహ ధోరణిలో ఉంటుంది. ప్రేమ, పెళ్లి తన తల్లిదండ్రుల విషయంలో విఫలమైనంత మాత్రాన అందరికీ అదే ఎదురవుతుందనే ఆలోచనలో ఉండడం తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.తప్పు అనుకుంటుంది. సియాకు పూర్తి వ్యతిరేకం వరుణ్.ప్రేమ, పెళ్లికి సంబంధించిన అనుబంధానికి ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుందనేది అతను ఏర్పర్చుకున్న నమ్మకం. అది ఏడు వారాల తర్వాత బీటలు వారి గొడవలతో సమాప్తం అవుతుందని అతనికున్న అభద్రత. అందుకే సియా అంటే ఇష్టం ఉన్నా ఆ రిలేషన్ ఏడువారాలే సాగాలని.. జీవితాంతం తోడు అనే కాన్సెప్ట్‌తో ఆమెకు దగ్గరై.. తర్వాత గొడవలతో ఆమెకు దూరమయ్యే బాధను భరించలేనంటాడు. అతని ఆ దృక్పథాన్ని మార్చాలని.. ఒకరిపట్ల ఒకరు గౌరవంతో ఉంటే ఏ అనుబంధమైనా పదికాలాపాటు పదిలంగా ఉంటుందని అతనికి చెప్పే ప్రయత్నం చేస్తుంది.అందులో భాగమే ఆ ‘టీ అండ్ ఎఫ్’ డేటింగ్ ప్లాన్. ట్యూస్ డేస్ అండ్ ఫ్రైడేస్ ప్లాన్‌తో సియాను వదులుకోలేనంత ప్రేమలో కూరుకుపోతాడు వరుణ్. అయినా గొడవలతో విడిపోతామేమోనన్న అభ్రదత, భయంతో సియాను దూరం చేసుకుంటాడు. విపరీతమైన మానసిక సంఘర్షణ తర్వాత సియాతో జీవితాంతం ఉండిపోవడానికి సిద్ధమవుతాడు. ఏడు వారాల కాన్సెప్ట్ మళ్లీ అతని మెదడును వెతుక్కోకుండా ఉండడానికి ఏడాది గడువిచ్చి.. ఆ ఏడాది డేటింగ్లో వరుణ్ అభద్రతను, ప్రేమ, పెళ్లి పట్ల ఉన్న అపనమ్మకాన్ని పూర్తిగా పోగొట్టి.. పెళ్లికి ఓకే అంటుంది సియా.కామెంట్..కొత్త కథాంశాన్ని తీసుకున్నా కథనంలో భిన్నత్వాన్ని చూపించలేకపోయింది. మహిళా సాధికారతను స్పృశించినా ఫోకస్ చేయలేకపోయింది. కథకు మించిన పాత్రలతో కొంత గందరగోళానికి గురి చేసింది. హీరోహీరోయిన్లూ కొత్తవాళ్లే. అందంతో ఆకట్టుకుంటారు తప్ప నటనతో కాదు. అన్నట్టు హీరో అన్మోల్ .. బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ పూనమ్ థిల్లాన్ కొడుకు. -
గంగూబాయి చూపు ఓటీటీ వైపు?
ఆలియా భట్ టైటిల్ రోల్లో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమాను ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే కరోనా ప్రభావంతో ప్రస్తుతం ముంబయ్‌లో థియేటర్స్ క్లోజ్ చేసి ఉండటం, ఒకవేళ మళ్లీ తెరచినా థియేటర్స్‌లో సీటింగ్ సామర్థ్యం యాభై శాతమే ఉండే అవకాశం కనిపించడంతో భన్సాలీ ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరి.. గుంగూబాయి దారి థియేటర్వైపా? ఓటీటీవైపా? అనేది వేచి చూడాల్సిందే. చదవండి: ఫేషియల్ చేయమంటే నటిని అందవిహీనంగా మార్చిన డాక్టర్ -
ఆలియా భట్‌కి షాకిచ్చిన ముంబై కోర్టు
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. ముంబై మాఫియా రారాణి గంగూబాయి జీవితం ఆధారంగా ‘గంగూభాయ్ కతియావాడీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ముంబై రెడ్ లైట్ ప్రాంతంతో పాటు కామాటిపుర చుట్టూరా కథ తిరగనుంది. గంగూబాయ్ కతియావాడి టైటిల్ రోల్లో ఆలియాభట్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కథాంశం తన తల్లిని కించపరిచేలా ఉందని ఆమె నలుగురు దత్తపుత్రుల్లో ఒకరైన బాబూజీ రాజీ షా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. సినిమా కథాంశం చనిపోయిన తన తల్లి గోప్యత హక్కును హరించేలా ఉందని షా తన పిటిషన్లో పేర్కొన్నాడు. దీనిపై విచారించిన కోర్టు..ఆలియా భట్, దర్శకుడు భన్సాలీతో పాటు మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబైఅనే పుస్తకాన్ని రచించిన హుస్సేన్ జైదీలకు సమన్లు జారీ చేసింది. దీనిపై మార్చి 21 లోగా సమాధానం చెప్పాలని ముంబై కోర్టు ఆదేశించింది. మాఫియా క్వీన్‌గా పేరు పొందిన ముంబయ్‌లోని కామాటిపురా ప్రాంత వేశ్యలకు నాయకురాలిగా వ్యవహరించిన గంగూబాయ్ కోఠేవాలీ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ముంబయ్ ఫిల్మ్‌సిటీలో కామాటిపురా సెట్ వేశారు.గంగూబాయ్ పాత్రను ఆలియా చేస్తున్నారు. అయితే ఈనెల ప్రారంభంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కరోనా సోకడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయనకు కోవిడ్ నెగిటివ్ వచ్చినందున మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. చదవండి : గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో.. పాట కోసం బ్రేక్ -
పాట కోసం షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన ఆలియా
హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు చాలా గ్రాండ్‌గా ఉంటాయి. ముఖ్యంగా కథ డిమాండ్ చేస్తే పాటల చిత్రీకరణ విషయంలో ఆయన అస్సలు రాజీపడరు. భారీ సెట్లతో బోలెడంత హంగామా ఉంటుంది. అందుకు ఓ ఉదాహరణ ‘పద్మావత్’లోని దీపికా పదుకోన్ చేసిన. ‘ఘూమర్..’ పాట ఒకటి. ప్రస్తుతం ఆలియా భట్ టైటిల్ రోల్లో భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గంగూబాయ్ కఠియావాడీ’. ఈ సినిమా కోసం రెండు పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారు. అందులో ఒకటి చాలా క్లిష్టమైన పాట అని సమాచారం. స్టెప్స్ కఠినంగా ఉంటాయట. అందుకే ఆలియాకి రెండు వారాలు ఈ సినిమా చిత్రీకరణ నుంచి బ్రేక్ ఇచ్చారని టాక్. ఈ రెండు వారాలూ స్టెప్స్ ప్రాక్టీస్ చేసి, చిత్రీకరణలో పాల్గొంటారామె. మాఫియా క్వీన్‌గా పేరు పొందిన ముంబయ్‌లోని కామాటిపురా ప్రాంత వేశ్యలకు నాయకురాలిగా వ్యవహరించిన గంగూబాయ్ కోఠేవాలీ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. గంగూబాయ్ పాత్రను ఆలియా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ముంబయ్ ఫిల్మ్‌సిటీలో కామాటిపురా సెట్ వేశారు. సెట్లో ఆలియా, 200 మంది డ్యాన్సర్లు పాల్గొనగా పాట చిత్రీకరణను ప్లాన్ చేశారు. -
దీపావళికి గంగూభాయ్
దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కొత్త చిత్రం కోసం గ్యాంగ్‌స్టర్‌గా మారారు ఆలియా భట్. ‘గంగూభాయ్ కతియావాడి’ చిత్రంలో టైటిల్ రోల్లో నటిస్తున్నారు ఆలియా. 80లలో గంగూభాయ్ మాఫియాను ఎలా నడిపారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కోవిడ్ వల్ల ఎక్కువమందితో చిత్రీకరించాల్సిన సన్నివేశాలను చిత్రీకరించడం కుదర్లేదు. తాజాగా ఆ సన్నివేశాలను ఇప్పుడు షూట్ చేస్తున్నారు. గంగూభాయ్ పవర్ఫుల్ ప్రసంగాలు ఇస్తున్న సన్నివేశాలను ముంబైలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. హ్యూమా ఖురేషీ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తారని టాక్. ఈ సినిమాను దీపావళికి థియేటర్స్‌లోకి తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
స్పెషల్ సాంగ్
సంజయ్ లీలా భన్సాలీ సినిమాలన్నీ భారీగా ఉంటాయి. స్క్రీన్ నిండుగా సెట్టింగులు ఉంటాయి. పాటల్ని చాలా కలర్ఫుల్గా తెరకెక్కిస్తుంటారాయన. అందుకే ఆయన సినిమాల్లో పాటలకు ప్రత్యేక క్రేజ్. తాజాగా భన్సాలీ కొత్త సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చిందట బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీకి. ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ‘గంగూభాయ్ కతియావాడి’. ఈ సినిమాలో ఆలియా భట్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కోసం హ్యూమా ఖురేషీ డ్యాన్స్ చేయనున్నారట. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించనున్నారని తెలిసింది. -
అలియా భట్, భన్సాలీలపై కేసు
గంగూబాయ్ కతియావాడి సినిమా చిక్కుల్లో పడింది. ఈ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో పాటు, టైటిల్ రోల్ పోషిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ మీద కేసు నమోదైంది. ముంబై మాఫియా రారాణి గంగూబాయి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇది ముంబై రెడ్ లైట్ ప్రాంతంతో పాటు కామాటిపుర చుట్టూరా కథ తిరగనుంది. ఈ నేపథ్యంలో కథపై అభ్యంతరం తెలుపుతూ గంగూబాయ్ కతియావాడి కుమారుడు బాబూజీ రాజీ షా కోర్టుకెక్కారు. అలియా, సంజయ్‌లతో పాటు 'ద మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకాన్ని రాసిన హుస్సేన్ జైదీ, సినిమాకు సహకరించిన రిపోర్టర్ జేన్ బోర్గ్స్ పైన బాంబే సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ద మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం తమ ఆత్మ గౌరవాన్ని, స్వేచ్ఛను దెబ్బ తీయడంతో పాటు పరువుకు భంగం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ పుస్తక ప్రచురణలను నిలిపివేయడంతో పాటు దీని ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాను సైతం ఆపేయాలని కోరారు. (చదవండి: ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి) ఈ విషయంపై బాబూజీ రాజీ షా తరపు న్యాయవాది నరేంద్ర దూబే మాట్లాడుతూ.. 'ఈ సినిమా ప్రోమో రిలీజైనప్పటి నుంచి షా, అతడి కుటుంబం గురించి వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. అతడు ఉంటున్న ప్రదేశంలో సైతం వేధింపులకు గురవుతున్నాడు. ఈ క్రమంలో అతడిపై దాడి జరగ్గా కాలు ఫ్రాక్చర్ అయింది. మరోవైపు వేశ్య కుటుంబం అంటూ షా, అతడి బంధువులను ఎగతాళి చేస్తున్నారు' అని పేర్కొన్నారు. సినిమాలో మహిళను అసభ్యంగా చిత్రీకరించినందుకు పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. కాగా దీనిపై స్పందించాల్సిందిగా కోరుతూ.. కోర్టు చిత్రయూనిట్‌కు జనవరి ఏడు వరకు గడువునిచ్చింది. (చదవండి: వైరల్: కలిసి నటిస్తున్న మహేశ్, రణ్వీర్!) -
13 ఏళ్లకు మళ్లీ...
రణ్‌బీర్ కపూర్‌ను ‘సావరియా’ (2007) చిత్రం ద్వారా హిందీ పరిశ్రమకు పరిచయం చేశారు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఆ తర్వాత ఈ కాంబినేషన్లో మళ్లీ సినిమా రాలేదు. పదమూడేళ్ల విరామం తర్వాత సంజయ్ లీలా భన్సాలీ, రణ్‌బీర్ కపూర్ ఓ సినిమా కోసం కలుస్తున్నారు. ‘బైజూ బావరా’ అనే సినిమా తీయబోతున్నట్టు భన్సాలీ గత ఏడాది ప్రకటించారు. తాజాగా ఇందులో రణ్‌బీర్ హీరోగా నటిస్తారని వార్తలు వచ్చాయి. హీరోయిన్లుగా దీపికా పదుకోన్, ఆలియా భట్ నటిస్తారట. ఇందులో మరో హీరో కూడా నటిస్తారని తెలిసింది. రణ్‌బీర్‌కి జోడీగా ఆలియా కనిపిస్తారు. ప్రస్తుతం ఆలియాతో ‘గంగుభాయ్ కతియావాడీ’ తెరకెక్కిస్తున్నారు భన్సాలీ. అది పూర్తయ్యాక ‘బైజూ బావరా’ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. -
గంగూభాయ్ బిజీబిజీ
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ‘గంగూభాయ్ కతియావాడీ’. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వివిధ వయసుల్లో ఉన్న పాత్రల్లో ఆలియా కనిపిస్తారు. కోవిడ్ బ్రేక్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ఇటీవలే ప్రారంభించారు. ముంబైలో నిర్మించిన ప్రత్యేక సెట్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. లాక్డౌన్ ముందు సుమారు 250 మంది యూనిట్‌తో చిత్రీకరణ జరిపారు. తాజాగా వంద కంటే తక్కువ మందితో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఏకధాటిగా రాత్రి పగలు చిత్రీకరణలో గంగూభాయ్ టీమ్ బిజీబిజీగా ఉంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ కీలక పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. -
సుశాంత్ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆత్మహత్యపై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, ఏక్తాకపూర్‌లపై బిహార్ ముజఫర్ కోర్టులో బుధవారం కేసు నమోదైంది. సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది ఈ కేసు పెట్టారు. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులే కారణమంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... సుశాంత్ ఆత్మహత్యపై నిర్మాత కరణ్ జోహార్, సంజయ్‌లీలా భన్సాలీ, ఏక్తాకపూర్, సల్మాన్ ఖాన్‌తో పాటు మరో 8 మందిపై బిహార్ ముజఫర్ కోర్టులో ఐపీసీ సెక్షన్ 306, 109, 504, 506 కింద పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ('సుశాంత్‌ని 7 సినిమాల్లో తప్పించారు') సుశాంత్‌ను 7 చిత్రాల నుంచి తొలగించారని, అంతేగాక అతడు నటించిన కొన్ని సినిమాలు విడుదలకానీయలేదని.. అందువల్లే ఒత్తిడికి గురైసుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఐసీసీ సెక్షన్ 306(ఆత్మహత్యకు పాల్పడటం), 504(ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం, అవమానించడం) 506(నేర బెదిరింపులకు శిక్ష) ప్రకారం వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు ఆయన చెప్పారు. కాగా, సుశాంత్ ఆదివారం(జూన్ 14)న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో సుశాంత్ బాధపడుతున్నాడని, దీనికి అతడు చికిత్స కూడా తీసుకుంటున్నట్లు ముంబై పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. (‘సల్మాన్ నా కెరీర్‌ను నాశనం చేశాడు’) ముసుగులు తొలగించండి -
గుంగూబాయి కష్టాలు
గుంగూబాయి ఇరుకుల్లో పడిందని బీ టౌన్ టాక్. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ముంబై మాఫియా క్వీన్, గ్యాంగ్‌స్టర్‌గా చెప్పుకోబడిన గుంగూబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. టైటిల్ పాత్రలో ఆలియాభట్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం 1970 కాలం నాటి ముంబైలోని కామాటిపుర సెట్‌ను ఓ స్టూడియోలో ఏర్పాటు చేశారు చిత్రబృందం. లాక్డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్‌కు వీలుపడలేదు. కానీ స్టూడియో నిర్వాహకులకు మాత్రం అద్దె చెల్లిస్తూనే ఉన్నారట. ఒకవేళ వచ్చే నెల లాక్డౌన్ ఎత్తివేసినా షూటింగ్స్ వెంటనే స్టార్ట్ అవుతాయన్న గ్యారంటీ లేదు. పరిస్థితులు చక్కబడి చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం అయితే అప్పటివరకు అద్దె కట్టడం, ఒకవేళ వర్షాలు పడి సెట్ పాడైపోతే రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చు చాలా అవుతుందట. అద్దె కట్టుకుంటూ వెళ్లి, చివరికి వర్షాలకు సెట్ పాడైపోతే మళ్లీ వెయ్యాల్సిందే. అందుకే సెట్‌ను ధ్వంసం చేసి, షూటింగ్ అవసరమనుకున్నప్పుడు సెట్‌ను వేసుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా అనుకుంటున్నారట భన్సాలీ. అప్పుడు అద్దె కూడా కట్టాల్సిన పని లేదన్నది ఆయన ఆలోచన అని బాలీవుడ్ వర్గాల కథనం. -
భన్సాలీ చిత్రం.. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ
పీరియాడికల్, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడంలో బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ సిద్దహస్తుడు. మరోవైపు పౌరాణిక పాత్రలు వేయడం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు మంచి నీళ్ల ప్రాయం. వీరిద్దరూ కలిస్తే కల్ట్ క్లాసిక్ చిత్రం అవడం ఖాయం. ప్రసుత్తం సిని వర్గాల సమాచారం ప్రకారం భన్సాలీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయబోతున్నట్లు టాక్. యంగ్‌టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం భారీ మల్టీస్టారర్ కావడం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో పాటు రణవీర్ సింగ్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగటీవ్ రోల్ పోషిస్తున్నట్లు మరో టాక్. పద్మావత్ చిత్రంలో ఖిల్జీ అనే నెగటీవ్ పాత్రలో పోషించిన రణవీర్‌కు హీరో షాహిద్‌కపూర్ కంటే ఎక్కువ పేరు వచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా హీరోతో ఎన్టీఆర్‌కు హీరోతో సమాంతరమైన పవర్ఫుల్ క్యారెక్టర్‌తో భన్సాలీ తన స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారట. సంజయ్ ప్రస్తుతం అలియా భట్ ప్రధాన పాత్రలో ‘గంగూభాయి’ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని టాక్. అదేవిధంగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత భన్సాలీ-ఎన్టీఆర్ చిత్రం కార్యరూపం దాల్చే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. చదవండి: బన్ని భారీ ఫైట్.. ఖర్చెంతో తెలుసా? పెళ్లిపై కామెంట్స్.. నచ్చావ్ సుబ్బరాజు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_541241401.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కొత్తగా వచ్చారు!
కేవలం మన సినిమాల ప్రభావమే కాదు.. మన సంక్రాంతి పండగ ఎఫెక్ట్ బాలీవుడ్‌పై కూడా పడినట్లుంది. కొన్ని హిందీ సినిమాల ఫస్ట్‌లుక్, కొత్త పోస్టర్స్ మన సంక్రాంతి పండగ సమయంలోనే విడుదలై హిందీ సినిమా అభిమానుల్లో ఆనందాన్ని పెంచింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. బాలీవుడ్ యువ కథానాయిక ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఈ చిత్రం విడుదల కానుంది. ‘షేర్ షా’ చిత్రం కోసం సైనికుడిగా మారి సరిహద్దుల్లో శత్రువులపై వీరోచిత పోరాటం చేస్తున్నారు సిద్దార్థ్ మల్హోత్రా. విష్ణువర్థన్ దర్శకత్వం. కార్గిల్ యుద్ధంలో సత్తా చాటిన పరమవీర చక్ర కెప్టెన్ విక్రమ్ బత్రా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. గురువారం (జనవరి 16) సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్ విడుదలయ్యాయి. ‘షేర్ షా’ చిత్రం ఈ ఏడాది జూలై 3న విడుదల కానుంది. దాదాపు 11 ఏళ్ల క్రితం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ ఆజ్ కల్’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇంతియాజ్ అలీ. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. వరుణ్ ధావన్ తర్వాతి చిత్రానికి ‘మిస్టర్ లేలే’ అనే టైటిల్ ఖరారైన సంగతి తెలిసిందే. శశాంక్ కేతన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 1న విడుదల కానుంది. మరో సినిమా ఏడేళ్ల క్రితం వచ్చిన హిందీ చిత్రం ‘గో గోవా గాన్’కి సీక్వెల్ తెరకెక్కనుంది. ఇది వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన దినేష్ విజన్ వెల్లడించారు. ఇంకా మరికొన్ని బయోపిక్‌లు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన ప్రకటనలు గత మూడు రోజుల్లో వెల్లడి కావడం విశేషం. సిద్ధార్ధ్ మల్హోత్రా అలియాభట్ -
గంగూబాయిగా ఆలియా.. పవర్ఫుల్ ఫస్ట్‌లుక్
ముంబై: క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ తొలిసారి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గంగూబాయి ఖథియావాడి’. ఈ సినిమాలోని ఆలియా ఫస్ట్‌లుక్ పోస్టర్లను తాజాగా చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లలో పవర్ఫుల్ స్టన్నింగ్ లుక్‌తో ఆలియా అదరగొట్టేసింది. ఈ పోస్టర్లలో ఆలియా యంగర్లుక్తోపాటు.. నుదుటను పెద్ద తిలకం ధరించి.. ముక్కుపుడకతో గంభీరంగా కనిపిస్తున్న లుక్‌ను కూడా చూడొచ్చు. సల్మాన్ ఖాన్‌తో అనుకున్న ‘ఇన్షా అల్లా’ సినిమా కొన్ని విభేదాల కారణంగా ఆగిపోవడంతో భన్సాలీ వెంటనే ఆలియాతో ‘గంగూబాయి ఖథియావాడి’. సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముంబై మాఫియా రారాణి గంగూబాయి కతియావాడి బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హుస్సైన్ జెదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో గంగూభాయిగా టైటిల్ రోల్ చేయడంతో ఎంతో ఆనందంగా ఉందని ఇప్పటికే ఆలియా సంతోషం వ్యక్తం చేసింది. -
బాలాకోట్ దాడులపై రెండో సినిమా..
యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో బాలీవుడ్ దర్శకనిర్మాతలు ముందంజంలో ఉంటారు. సినిమాలు తీయడమే కాకుండా వారి రికార్డులు వారే తిరగరాసుకుంటారు. ఈ క్రమంలో హిందీలో తాజాగా మరో యదార్థ ఘటనల ఆధారంగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనినే కథాంశంగా తీసుకొని సినిమా తీయనున్నట్లు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రకటించారు. భూషణ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘కేదార్నాథ్’ దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడని తెలిపారు. ఈ భారత సైన్య పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామని భూషణ్ కుమార్ తెలిపారు. భారత ఆర్మీ ధైర్యసాహసాలకు ప్రతీకగా ఈ సినిమా నిర్మితమవుతుందన్నారు. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో బాంబులు వర్షం కురిపించి ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది. అయితే ఆ సమయంలో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కగా, అనూహ్య పరిణామాల తర్వాత తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. ఆయన ధైర్యసాహసాలను మెచ్చిన భారత ప్రభుత్వం అభినందన్‌కు ‘వీర్‌చక్ర’ పురస్కారాన్ని అందించింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ‘బాలాకోట్- ది ట్రూ స్టోరీ’ సినిమా తీస్తానని ప్రముఖ నటుడు, నిర్మాత వివేక్ ఒబెరాయ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు ఒకే ఘటనపై రెండు రకాల సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది. A story that celebrates the accomplishments of The Indian Air Force🇮🇳#2019BalakotStrike @PMOIndia @DefenceMinIndia @IAF_MCC #SanjayLeelaBhansali @itsBhushanKumar @AbhisheKapoor #MahaveerJain, @PragyaKapoor_ @Tseries @gitspictures @SundialEnt @prerna982 pic.twitter.com/A5Oh8xpMyB — BhansaliProductions (@bhansali_produc) December 13, 2019 -
గంగూభాయ్ ప్రియుడు
‘గంగూభాయ్ కతియావాడి’ అనే గ్యాంగ్‌స్టర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. గంగూభాయ్ పాత్రలో ఆలియా భట్ నటించనున్నారు. 1960లో ముంబైలో ఓ బ్రోతల్ ఏరియాలో జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఆలియా కనిపిస్తారు. ఆలియా జీవితంలో కీలకంగా మారే ప్రియుడి పాత్రలో అజయ్ దేవగన్ నటించనున్నారని బాలీవుడ్ టాక్. గంగూభాయ్ పవర్‌ఫుల్‌గా మారడానికి అజయ్ ఎలా సపోర్ట్ చేశారనే అంశం ఆసక్తికరంగా ఉంటుందని టాక్. వచ్చే ఏడాది దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది. 20 ఏళ్ల తర్వాత (హమ్ దిల్ దే చుకే సనమ్, 1999) సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నటించనుండటం విశేషం. -
గ్యాంగ్‌స్టర్ గంగూభాయ్
త్వరలో ముంబై గ్యాంగ్‌స్టర్‌గా కొత్త అవతారం ఎత్తనున్నారు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ లీడ్ రోల్లో ‘గంగూభాయ్ కతియవాడి’ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా అధికారిక ప్రకటన బుధవారం వెల్లడైంది. ఓ పాత్రికేయురాలు రాసిన ఓ బుక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబరు 11న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... సల్మాన్‌ఖాన్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘ఇన్షా అల్లా’ చిత్రం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ‘ఇన్షా అల్లా’ సెట్స్‌పైకి వెళ్లకపోవడంతో ఆలియా చాలా బాధపడ్డారని, ఈ కారణం చేతనే ఆలియాతో భన్సాలీ ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కిస్తున్నారని బాలీవుడ్ టాక్. -
మాట కోసం..
బాలీవుడ్లో ప్రముఖ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా చాలా సంతోషపడుతుంది. సల్మాన్ ఖాన్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘ఇన్షా అల్లా’ సినిమాలో హీరోయిన్గా సెలక్ట్ అయినప్పుడు ఆలియా అలా ఫుల్ హ్యాపీ ఫీలయ్యారు. కానీ సల్మాన్ – భన్సాలీల మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతో ఆ సినిమా ఆగిపోయింది. దీంతో ఆలియా ఆశలు అవిరయ్యాయి. ‘ఇన్షా అల్లా’ సెట్స్‌పైకి వెళ్లకపోయినప్పటికీ తన సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం ఆలియాకు ఇస్తానన్న భన్సాలీ ఇప్పుడు ఆమె కోసం ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఆలియాలో మళ్లీ ఆశ చిగురించిందట. వీటికి తోడు ఇటీవల భన్సాలీ ఆఫీసులో ఆలియా కనిపించడంతో సినిమా కన్ఫార్మ్ అని అందరూ ఫిక్సైపోతున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందట. ఇంతకుముందు భన్సాలీ ఇదే కథను ప్రియాంకా చోప్రాకు చెబితే ఆమె తిరస్కరించారట. మరి... ఆలియాతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందా? వెయిట్ అండ్ సీ. -
మోదీ బయోపిక్ కోసం ప్రభాస్
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బయోపిక్కు సంబంధించిన ప్రకటన ఇచ్చారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొదించనున్నారు. అయితే తొలి ప్రకటనతోనే సినిమాపై అంచనాలు పెంచేందుకు తొలి పోస్టర్‌ను ఓ ప్యాన్ ఇండియా స్టార్‌తో రిలీజ్ చేయించాలనుకున్న బన్సాలీ, ఆ బాధ్యతను బాహుబలి ప్రభాస్‌కు అప్పగించారు. బాహుబలి, సాహో సినిమాలతో జాతీయ స్థాయిలో తన మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసుకున్న ప్రభాస్, తన సోషల్ మీడియా పేజ్ ద్వారా మోదీ బయోపిక్ ‘మన్ బైరాగి’ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. తెలుగు పోస్టర్‌ను ప్రభాస్రిలీజ్ చేయగా హిందీ పోస్టర్‌ను అక్షయ్ కుమార్ విడుదల చేశారు. సంజయ్ త్రిపాఠి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహావీర్ జైన్‌తో కలిసి సంజయ్ నిర్మిస్తున్నారు. -
మరో సినిమాతో వస్తా!
సల్మాన్ ఖాన్ నటించనున్న ‘ఇన్షా అల్లా’ చిత్రం విడుదల వాయిదా పడింది. దాదాపు 19 ఏళ్ల తర్వాత సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా ‘ఇన్షా అల్లా’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఈ సినిమాను ఆలస్యంగా విడుదల చేయనున్నారు. ‘‘ఇన్షా అల్లా’ చిత్రం వాయిదా పడింది. కానీ వచ్చే ఏడాది రంజాన్‌కు నేను మరో సినిమాతో మీ (ప్రేక్షకులు) ముందుకు వస్తాను’’ అన్నారు సల్మాన్. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ తాజాగా నటిస్తున్న ‘దబాంగ్ 3’ ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానుంది. దీంతో వచ్చే ఏడాది రంజాన్‌కు సల్మాన్ ఏ సినిమాతో ప్రేక్షకల ముందుకు వస్తారా? అనే చర్చ ప్రస్తుతం హాట్‌టాపిక్. పదేళ్లలో ఒక్క 2013లో తప్ప ప్రతి రంజాన్‌కి సల్మాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రెడీగా ఉంటున్న సంగతి తెలిసిందే. -
భన్సాలీ-సల్మాన్-అలియా కాంబోలో ‘ఇన్షా అల్లా’
ప్రతీ రంజాన్ పండుగకు ఓ సినిమాను రిలీజ్ చేసి అభిమానులకు కానుకగా ఇస్తున్నాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. గత రెండు చిత్రాలతో (రేస్3, ట్యూబ్‌లైట్) అభిమానులను నిరాశపరిచిన సల్లూ భాయ్.. ఈసారి ‘భారత్’గా అభిమానుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం కూడా మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. టాక్ పరంగా ఎలా ఉన్నా.. మొదటి రోజు మాత్రం రికార్డులు సృష్టించింది. కంటెంట్‌తో పనిలేకుండా.. కేవలం సల్మాన్ చరిష్మాతో సినిమాలు ఆడుతాయని మళ్లీ ‘భారత్’తో నిరూపించాడు. సల్మాన్ వచ్చే ఏడాది ఈద్‌కు కూడా మరో ప్రాజెక్ట్‌ను(ఇన్షా అల్లా) సిద్దం చేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ఇరవై యేళ్ల తరువాత మళ్లీ కలుస్తున్నానని ట్విటర్ వేదికగా తెలిపారు. 1999 లో వచ్చిన హమ్ దిల్ దే చుకే సనమ్ అనే చిత్రం కోసం సల్మాన్, సంజయ్ లీలా భన్సాలీ కలిసి పని చేశారు. 20 ఏళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ప్రాజెక్ట్ రానుండడంతో అభిమానులలో ఇప్పటినుంచే అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో అలియాభట్ హీరోయిన్గా ఎంపికైంది. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంది. Eid 2020 will be super mubarak! Inshallah, my first film with Salman and Sanjay Leela Bhansali, will release that day. @bhansali_produc @BeingSalmanKhan @prerna982 #Inshallah pic.twitter.com/jJ21nFpazI — Alia Bhatt (@aliaa08) June 6, 2019 -
ప్రేమరాగం పాడతారా?
కవి, గేయ రచయితగా మారనున్నారట బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. ఇందుకోసం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రంగం సిద్ధం చేస్తున్నారట. ప్రముఖ కవి, గేయ రచయిత సాహిర్ లుధియాన్వీ బయోపిక్‌ను తెరెకెక్కించాలని భన్సాలీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. షారుక్ ఖాన్, ఐశ్యర్యా రాయ్, దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా, ఇర్ఫాన్‌ఖాన్... తారాగణంగా ఇలా పలువురి పేర్లు పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ బయోపిక్‌లో అభిషేక్ బచ్చన్, తాప్సీల పేర్లు హీరోహీరోయిన్లుగా వినిపిస్తున్నాయి. ఇటీవల వీరిద్దరికీ ఈ సినిమా కథను నరేట్ చేశారట భన్సాలీ. సాహిర్గా అభిషేక్ బచ్చన్, ఆయన ప్రేయసి అమ్రితా ప్రీతమ్‌గా తాప్సీ కనిపిస్తారని లేటెస్ట్ బాలీవుడ్ ఖబర్. సాహిర్, అమ్రితా చాలా ఘాటు ప్రేమ అట. ఈ లవ్‌స్టోరీకి రచయిత జస్మీత్ రీన్ దర్శకత్వం వహిస్తారట. ఈ సంగతి ఇలా ఉంచితే... అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన ‘మన్మర్జియాన్’ చిత్రంలో తాప్సీ, అభిషేక్ బచ్చన్ కలిసి నటించిన విషయం తెలిసిందే. మరి.. రెండోసారి కూడా వీరి జోడి కుదిరేనా? ప్రేమరాగం పాడేనా? లెటజ్ వెయిట్ అండ్ సీ! -
చప్పక్ మొదలు
దీపికా పదుకోన్‌ను స్క్రీన్ మీద చూసి ఏడాది పైనే కావస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదామె. కొత్త సినిమా ఏం చేయాలో అని ఫిక్స్ అవ్వడానికి ఆర్నెల్లు, కొత్త సినిమా ఒప్పుకొని దాని పనులు మొదలుపెట్టేసరికి మరో ఆర్నెల్లు గడిచిపోయాయి. ఫైనల్‌గా దీపిక కెమెరా ముందుకొచ్చే టైమ్ సెట్ అయింది. ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఆమె ‘చప్పక్’ చిత్రం ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మేఘన్ గుల్జర్ దర్శకురాలు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ నడుస్తున్నాయి. ‘‘చప్పక్’ చిత్రానికి మొత్తం సిద్ధం’ అని దీపికా పేర్కొన్నారు. -
మల్టీస్టారర్ లేదట
షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ను పూర్తి స్థాయి మల్టీస్టారర్ చిత్రంలో చూపించడానికి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్లాన్ చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. 1952లో వచ్చిన ఓ సూపర్ హిట్ చిత్రానికిది రీమేక్ అని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్త విని షారుక్, సల్మాన్ అభిమానులు ఖుష్ అయిపోయారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే భన్సాలీ లేటెస్ట్ చిత్రం మల్టీస్టారర్ కాదట. అందులో సల్మాన్ ఖాన్ సోలో హీరోగా నటిస్తారట. ఇది ఏ సినిమాకీ రీమేక్ కాదని, లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు మోడ్రన్ లవ్‌స్టోరీగా ఉండబోతోందని టాక్. అలాగే ఈ సినిమాకు ‘హమ్ దిల్ దే చుకే సనమ్ 2’ (భన్సాలీ – సల్మాన్ చిత్రాల్లో ఒకటి)ను వర్కింగ్ టైటిల్‌గా ఉంచాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. -
19 ఏళ్ల తర్వాత...
‘పద్మావత్’ తర్వాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఏం చేయబోతున్నారనే ఆసక్తి బాలీవుడ్ మొత్తం నిండి ఉంది. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సల్మాన్ ఖాన్‌తో ప్లాన్ చేశారని తాజా వార్త. 19 ఏళ్ల క్రితం సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ జంటగా ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ అనే ప్రేమ కథను తెరకెక్కించారు సంజయ్ లీలా భన్సాలీ. అయితే తాజా చిత్రం కూడా ప్రేమ కథే అని ప్రచారం జరుగుతోంది. కథను పూర్తి చేసి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇందులో సల్మాన్ సరసన హీరోయిన్గా దీపికా పదుకోన్ నటిస్తారని టాక్. 19 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తున్న సల్మాన్–సంజయ్‌ల కాంబినేషన్ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి. -
హిందీలో కత్తి పట్టేదెవరు?
బాలీవుడ్లో సౌత్ సినిమాల రీమేక్ గాలి బాగా వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సౌత్ నుంచి ‘టెంపర్, ప్రస్థానం, అర్జున్ రెడ్డి, విక్రమ్ వేదా’ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో తమిళం చిత్రం ‘కత్తి’ కూడా చేరిందని బాలీవుడ్ టాక్. విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘కత్తి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. ఇప్పుడీ చిత్రం హిందీ రీమేక్ రైట్స్‌ను బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ దక్కించుకున్నారట. గతంలో సౌత్ నుంచి ‘విక్రమార్కుడు’ సినిమాను ‘రౌడీ రాథోడ్’గా, తమిళ మూవీ ‘రమణ’ (తెలుగులో ‘ఠాగూర్’గా రీమేక్ అయ్యింది) సినిమాను ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ పేరుతో హిందీలో నిర్మించి హిట్ సాధించారు భన్సాలీ. ఈ రెండు సినిమాల్లో అక్షయ్ కుమార్‌నే హీరో కావడం విశేషం. మరి.. ‘కత్తి’ రీమేక్‌లో కూడా అక్షయ్‌నే హీరోగా నటిస్తారా? లేక ఇంకో హీరో చేస్తారా? తెలియడానికి కాస్త టైమ్ ఉంది. తమిళ ‘కత్తి’ సినిమా తెలుగులో చిరంజీవి హీరోగా ‘ఖైదీ నంబర్ 150’ పేరుతో రీమేక్ అయింది. -
పాంచ్ పటాకా
స్క్రిప్ట్ నచ్చితే ఎన్ని సినిమాలనైనా పట్టాలెక్కించేస్తుంటా అంటున్నారు బాలీవుడ్ భాయ్ సల్మాన్. లేటెస్ట్ మూవీ ‘రేస్ 3’ రిలీజ్‌కి రెడీగా ఉండగానే ‘భరత్’ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాలు కాకుండా ‘కిక్’ సీక్వెల్ ‘కిక్ 2’, ‘దబాంగ్ 3’ కొరియోగ్రాఫర్,డైరెక్టర్ రెమో డిసౌజాతో ఓ డ్యాన్స్ ఫిల్మ్ కూడా ఓకే చేశారు. వరుసగా సినిమాలు ఒప్పుకోవడం గురించి సల్మాన్ మాట్లాడుతూ – ‘‘ఏదైనా స్క్రిప్ట్ వినగానే నచ్చిందంటే చేసేస్తాను. ఫస్ట్ నరేషన్లో ఎగై్జట్ చే స్తే ఓకే అనేస్తాను. కథ విన్న తర్వాత రేపు చెబుతాను, ఆ తర్వాత చెబుతాను అన్నానంటే ఆ సినిమా ఎప్పటికీ పట్టాలెక్కదు. ఈ ఫేజ్‌లో నాకు నచ్చినన్ని, వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఇవే కాకుండా సంజయ్ లీలా భన్సాలీతో కూడా ఓ సినిమా చేయడానికి అంగీకరించారట భాయ్. సో.. బాక్సాఫీస్ మీద భాయ్ పాంచ్ పటాకా పేల్చే పనిలో ఉన్నారని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. -
పి వర్సెస్ పి
టాలీవుడ్లోనే కాదు.. అటు బాలీవుడ్‌లోనూ రిలీజ్ డేట్స్ విషయంలో ‘వార్’ సహజమైంది. ‘తమ సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకునే హక్కు ప్రతి చిత్రబృందానికి ఉంటుంది’ అని అక్షయ్‌కుమార్ పేర్కొన్నారు. ‘పద్మావత్’ వర్సెస్ ‘ప్యాడ్‌మ్యాన్’ రిలీజ్ డేట్స్ విషయంలో. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య తారలుగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పద్మావత్’. సెన్సార్ చిక్కులతో రిలీజ్ డేట్స్‌ను మార్చుకుంటూ ఫైనల్‌గా జనవరి 25కి థియేటర్స్‌లో సెటిల్ అవ్వాలనుకుంది ‘పద్మావత్’ చిత్రబృందం. చెప్పిన డేట్ (జనవరి 26)కి ఒక్కరోజు ముందుకు దూకాడు ‘ప్యాడ్‌మ్యాన్’. అంటే.. రెండు సినిమాలూ ఒకేరోజున వచ్చే పరిస్థితి. అక్షయ్‌కుమార్, రాధిక ఆప్టే, సోనమ్‌కపూర్ నటించిన చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్’. పద్మావత్, ప్యాడ్‌మ్యాన్ ఒకేరోజున రిలీజ్ కావడం సరికాదని ఫైనల్‌గా ‘పద్మావత్’ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, ‘ప్యాడ్‌మ్యాన్’ హీరో అక్షయ్‌కుమార్ మాట్లాడుకున్నారు. కలిసి విలేకర్ల సమావేశం పెట్టారు. అప్పుడే ‘ప్యాడ్‌మ్యాన్’ చిత్రాన్ని ఫిబ్రవరి 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు అక్షయ్‌కుమార్. అలాగే బాలీవుడ్ మూవీ ‘అయ్యారీ’ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ క్లాష్ వద్దనుకుని ఫిబ్రవరి 16న రిలీజ్ చేశారు. అంతేకాదు అనుష్క శర్మ ‘పరి’ (మార్చి 2న విడుదల) సినిమాతో బాక్సాఫీస్ క్లాష్ వద్దనుకుని ముందుగా అనుకున్నట్లుగా ‘హేట్‌స్టోరీ 4’ చిత్రాన్ని మార్చి 2న కాకుండా వారం రోజులు ముందుకు (మార్చి 9) జరిపాడు ఆ చిత్రదర్శకుడు విశాల్ పాండ్య. -
ముక్కు వద్దు.. కాళ్లు తీసుకోండి
...ఇలాంటి ఆఫర్ ఎవరైనా ఇస్తారా? కోట్లు ఇస్తామన్నా ఇవ్వరు. కానీ దీపికా పదుకోన్ మాత్రం చాలా ధైర్యంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. బాలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్. అసలు సంగతి ఏంటంటే.. దీపికా పదుకోన్ లీడ్ రోల్లో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పద్మావత్’. ఈ సినిమా పట్టాలెక్కినప్పుడు మొదలైన వివాదాలు సినిమా విడుదలైనా ఆగడం లేదు. భన్సాలీని చంపేస్తామని, దీపిక తల.. ముక్కు నరికిన వారికి లక్షల్లో నజరానా ఇస్తామని ‘పద్మావత్’ సినిమాని వ్యతిరేకిస్తున్న వారు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపుల గురించి దీపిక స్పందించారు. ‘‘పద్మావత్’లో నటించినందుకు నా తల, ముక్కు నరికేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. నాకు నా ముక్కు అంటే చాలా ఇష్టం కాబట్టి దాన్ని కత్తిరించొద్దు. కావాలంటే పొడవైన నా కాళ్లు కత్తరించుకోండి. ఇలా బెదిరించే వాళ్లను లైట్‌గా తీసుకోకూడదు. ధైర్యంగా ఎదుర్కోవడానికి నేను భయపడను’’ అంటూ చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారీ బ్యూటీ. ‘‘నాకు 14ఏళ్ల వయసులో అమ్మానాన్నలతో కలిసి బయటికెళ్లాను. అప్పుడో వ్యక్తి కావాలనే నన్ను రాసుకుంటూ వెళ్లాడు. అతని చెంప ఛెళ్లుమనిపించా ’’ అన్నారు దీపికా పదుకోన్. -
పద్మావత్‌తో అసలేం చెప్పదల్చుకున్నావ్?
సాక్షి, సినిమా : బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై విలక్షణ నటి స్వర భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పద్మావత్ చిత్రం ద్వారా ప్రజలకు అసలేం సందేశం ఇవ్వదల్చుకున్నావంటూ భన్సాలీని ఆమె ఏకీపడేశారు. ఈ మేరకు ఆమె రాసిన ఓ బహిరంగ లేఖను ది వైర్ శనివారం ప్రచురించింది. ‘‘అత్యాచార బాధితులు, వితంతువులు, చిన్న, పెద్దా, ముసలి, గర్భవతి... ఇలా మహిళలకు ఈ సమాజంలో బతికే హక్కు ఉంటుంది. మరి అలాంటప్పుడు పద్మావత్ ద్వారా మీరు సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చారు?. చిత్రం చివరలో దీపిక చేసిన పద్మావతి పాత్ర అగ్ని ప్రవేశం చేసి ఆత్మాహుతి చేసుకుంటుందని చూపించారు. అయ్యా భన్సాలీగారు... ఇది 13వ శతాబ్దం కాదు.. 21వ శతాబ్ధం. మహిళలకు మాన-ప్రాణాల మీద అవగాహన,ఆత్మాభిమానం, గౌరవ మర్యాదలు ఉన్నాయి. వారిలో రాను రాను మనోధైర్యం కూడా చాలా పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో పద్మావత్ ద్వారా మీరు అసలు ఏం చెప్పదల్చుకున్నారు?. సతీ సహగమనం, జౌహర్(ఓడిపోయిన రాజుల కుమార్తెలు, భార్యలు, బంధువర్గంలోని స్త్రీలు సామూహికంగా, స్వచ్ఛందంగా అగ్నిలోకి దూకి మరణించటాన్ని జౌహర్ అంటారు) వంటి దురాచారాలకు ఏనాడో కాలం చెల్లిపోయింది. మరి గ్రాండియర్ పేరిట పద్మావత్‌తో ఎలాంటి సందేశం ఇచ్చారో మీ ఆత్మ సాక్షిని ఓ సారి ప్రశ్నించుకోండి?’’ అంటూ స్వర భాస్కర్ 8 పేరాల లేఖలో భన్సాలీకి ప్రశ్నల వర్షంతో చురకలు అంటించారు. అయితే భన్సాలీ మాత్రం ఆమె విమర్శలపై స్పందించేందుకు నిరాకరించారు. గతంలో కూడా స్వర భాస్కర్ భన్సాలీ చిత్రాలపై తరచూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తను వెడ్స్ మను, రాంఝ్నా, తను వెడ్స్ మను రిటర్న్స్, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి కమర్షియల్ చిత్రాలతోపాటు నీల్ బటే సన్నాటా, అనార్కలీ ఆఫ్ ఆరా వంటి ప్రయోగాత్మక చిత్రాలతో స్వర భాస్కర్ మంచి గుర్తింపు పొందారు. -
దర్శకుడిని చంపితే తక్షణమే రూ.51లక్షలు
సాక్షి, ముంబై: సంజయ్ లీలా భన్సాలీ వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’ పై తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలకు భారీ నజరానా ఇస్తామంటూ మరో గ్రూపు ప్రకటించింది. భన్సాలీ తల నరికిన వారికి రూ.51 లక్షల పారితోషికం ఇస్తామని ఆల్ ఇండియా బ్రజ్‌మండల్ క్షత్రియ రాజ్‌పుత్ మహాసభ ప్రకటించింది. భన్సాలీని హత్య చేస్తే తక్షణమే ప్రకటించిన బహుమతి అందిస్తామని బ్రజ్‌మండల్ క్షత్రియ రాజ్‌పుత్ మహాసభ ఉపాధ్యక్షుడు దివాకర్ సింగ్ వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ఆందోళనకు మద్దతు ఇవ్వకుండా ఈ సమస్యపై మౌనంగా ఉన్న రాజకీయవేత్తలకు తగిన గుణపాఠం చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్గావ్ స్కూలు పిల్లలపై దాడిగురించి ప్రశ్నించినపుడు ఆందోళనను పక్కదారి పట్టించేందుకు సినీ పరిశ్రమ అల్లిన కథ ఇది అని మండిపడ్డారు. రాజపుత్‌లు నిరాయుధులు, మహిళలు, పిల్లలపై ఎప్పటికీ దాడిచేయరని వివరణ ఇచ్చారు. కాగా అయితే చారిత్రాత్మక చిత్రం పద్మావత్ విషయంలో ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పద్మావతి పాత్రలో నటించిన దీపికా పదుకొనెను చంపేస్తామన్న బెదిరింపులొచ్చాయి. దీపికా ముక్కు చెవులు కోస్తే కోటి రూపాయలు ఇస్తామనీ, దీపికాను చంపితే రూ.5 కోట్లు ఇస్తామని కూడా కర్ణిసేన సంస్థ ప్రకటించింది. పద్మావత్ చిత్రం విడుదలను అడ్డుకుంటామని , థియేటర్స్‌లో సినిమా ఆడితే తగలబెట్టేస్తామంటూ కర్ణిసేన హెచ్చరించింది. రాజ్‌పుత్‌లను చెడ్డగా చిత్రీకరించిందని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించారంటూ మండిపడుతూ ఆందోళనకు దిగింది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి యు/ఏ సర్టిఫికేట్ పొందిన తరువాత, జనవరి 25న విడుదలైన గత రెండు రోజుల్లో ర్యాలీలు, విధ్వంసం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
భన్సాలీ గర్వపడే సినిమా తీస్తాం : కర్ణిసేన
జైపూర్ : ఎట్టకేలకు పద్మావత్ చిత్రం విడుదలైంది. అయినప్పటికీ కర్ణి సేన ఆందోళనలు మాత్రం తగ్గటం లేదు. దీనికి తోడు చిత్ర యూనిట్ సభ్యులకు తాజాగా మళ్లీ బెదిరింపులు ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తల్లి ‘లీలా భన్సాలీ’పై ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు కర్ణిసేన ప్రకటించింది. చిత్తోర్‌గఢ్ జిల్లా కర్ణి సేన అధ్యక్షుడు గోవింద్ సింగ్ కంగరౌత్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘భన్సాలీ తల్లిపై చిత్రం రాబోతుంది. అరవింద్ వ్యాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. చిత్రం టైటిల్ పేరు ‘‘లీలా కి లీలా’’ . భన్సాలీ పద్మావత్ తో మా తల్లి రాణి పద్మావతిని అవమానించారు. కానీ, మేం తీయబోయే చిత్రాన్ని తీయబోయే చిత్రం చూసి భన్సాలీ ఖచ్ఛితంగా గర్వపడతారు’’ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభకాబోతుందని గోవింద్ వెల్లడించారు. ‘దేశంలో ప్రతీ పౌరుడికి స్వేచ్ఛా హక్కు ఉంటుందన్న పాయింట్‌తో పద్మావత్‌ను భన్సాలీ తెరెక్కించారు. సరిగ్గా అదే హక్కును ఉపయోగించుకునే ఇప్పుడు మేం అంతకంటే భేషుగ్గా.. పచ్చి నిజాలను చూపిస్తాం’ అని కర్ణిసేన ప్రకటించింది. ఇదిలా ఉంటే గురుగావ్ దాడుల వెనుక భన్సాలీ ప్రమేయం ఉన్నట్లు కర్ణిసేన సంచలన ఆరోపణలకు దిగింది. -
హోరెత్తుతున్న కర్ణిసేన ఆందోళనలు
-
‘పద్మావత్’ కోసం శ్రీలంక ప్రధాని నిరీక్షణ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా గురువారం నాడు విడుదలైన వివాదాస్పద బాలివుడ్ సినిమా ‘పద్మావత్’కు వ్యతిరేకంగా దేశంలోని ఆరేడు బీజీపీ పాలిత రాష్ట్రాల్లో రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో బుధవారం కర్ణిసేన ఆందోళనలు విధ్వంసానికి దారితీయడం పట్ల దేశీయ మీడియానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మీడియా దిగ్భ్రాంతి వ్యక్తం చే సింది. ప్రపంచ మీడియా కూడా ఎక్కువగా అల్లర్లకే ప్రాధాన్యతనిస్తూ వార్తలను ప్రచురించింది. ముఖ్యంగా గుర్గావ్లో చిన్న పిల్లల స్కూల్ బస్సుపై కర్ణిసేన రాళ్ల దాడులకు దిగడం, ప్రాణభీతితో బస్సులోని బడి పిల్లలు సీట్ల కింద దాక్కున్న వీడియో దృశ్యాలను ప్రపంచ మీడియా ఎక్కువగా ప్రసారం చేసింది. ‘పౌరానిక హిందూ రాణి’కి సంబంధించిన ఇతివృత్తంతో తీసిన సినిమా పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ అహ్మదాబాద్‌లో కర్నిసేన కార్యకర్తలు విధ్వంసానకి దిగిన దృశ్యాలకు ‘పాకిస్థాన్ టుడే’ ప్రాముఖ్యతనిచ్చింది. సినిమా విడుదలకు వ్యతిరేకంగా అహ్మదాబాద్‌లో దాదాపు 200 బస్సులను దగ్ధం చేసిన సంఘటనలకు బంగ్లాదేశ్‌లోని ‘ది ఇండిపెండెంట్’, ‘ప్రోథమ్ హాలో’ పత్రికలు ప్రాధాన్యమిచ్చాయి. పాకిస్థాన్ నుంచి వెలువడుతున్న ‘ది డాన్’ పత్రిక మాత్రం అల్లర్లకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా వివిధ క్రిటిక్స్ రాసిన సినిమా రివ్యూలకు ప్రాధాన్యం ఇచ్చింది. శ్రీలంక నుంచి వెలువడుతున్న ‘ది మిర్రర్’ పత్రిక మాత్రం స్థానిక పాఠకులను ఆకట్టుకునే వార్తా కథనాన్ని ప్రచురించింది. రాణి పద్మావతిని సింహళ (శ్రీలంక) రాజ కుమారిగా చూపించారనే వార్త తెలిసి ఆ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా! అని శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే ఎదురు చూస్తున్నారని ఆ పత్రిక తన సంపాదకత్వంలోనే పేర్కొంది. ఈ సినిమా పట్ల నరేంద్ర మోదీ కూడా అంతే ఉద్విఘ్నతతో ఉన్నారని, ఆయన ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుతో కలిసి అహ్మదాబాద్‌లో ఓ సాంస్కతిక కార్యక్రమాన్ని వీక్షించినప్పుడు అక్కడ విద్యార్థులు పద్మావతి సినిమాలోని గూమర్ పాటకు నృత్య ప్రదర్శన ఇచ్చారని, ఆ సందర్భంగా ఆ పాట మోదీకి ఎంతో నచ్చిందని కూడా ఆ పత్రిక తన సంపాదకత్వంలో పేర్కొంది. మోదీ గూమర్ పాటకు ఇచ్చిన ప్రదర్శనను వీక్షించడం వివాదాస్పదం కూడా అయింది. అయితే ఆయనకు ఆ పాట నచ్చిందో, లేదో తెలియదు. పద్మావతి వివాదంపై ఆరేడు రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగుతున్నా నోరు విప్పని మోదీ ఓ పాట గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తారని భావించలేం. భారీ పెట్టుబడులతో అద్భుత సెట్టింగ్‌లతో కళాత్మకంగా తీసిన ‘పద్మావత్’ సినిమా ఎందుకు వివాదాస్పదం అయిందో, ఆ సినిమాను రాజ్‌పుత్‌లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమగ్రంగా వివరిస్తూ అమెరికా నుంచి వెలువడుతున్న ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తమ మాటలను ఖాతరు చేయకుండా గురువారం నాడు సినిమాను విడుదల చేస్తే ‘ఆత్మార్మణం’ చేసుకుంటామని రెండువేల మంది కర్ణిసేన మహిళలు హెచ్చరించడాన్ని కూడా ఆ పత్రిక ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటనలు తమ దృష్టికి రాలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని రాజస్థాన్ పోలీసులు తెలిపారు. -
పద్మావత్: సుప్రీంలో కోర్టుధిక్కారం!
సాక్షి, న్యూఢిల్లీ: ‘పద్మావత్’ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనలు హోరెత్తుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కర్ణిసేనతోపాటు ఈ సినిమాను విడుదల చేయని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. పద్మావత్ సినిమా విడుదలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. కర్ణిసేన తీవ్రంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ‘పద్మావత్’ సినిమా విడుదల నిలిచిపోయింది. మరోవైపు పలు రాష్ట్రాల్లో కర్ణిసేన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కొన్నిచోట్ల ఆందోళనకారులు దుకాణాలపై దాడులకు దిగి విధ్వంసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడటంలో ఈ రాష్ట్రాలు విఫలమయ్యాయని, కాబట్టి ఆ నాలుగు రాష్ట్రాలపై, కర్ణిసేనపై కోర్టు ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా.. కేసు తీవ్రతనుబట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. -
హోరెత్తుతున్న కర్ణిసేన ఆందోళనలు
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ‘పద్మావత్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకావడంతో ఈ సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన విధ్వంసాలకు దిగుతోంది. పలు రాష్ట్రాల్లో సినిమాకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు జరుపుతోంది. ముఖ్యంగా రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో తొలిరోజు ‘పద్మావత్’ విడుదల నిలిచిపోయింది. ఈ రాష్ట్రాలు మొదటి నుంచి సినిమా విడుదలను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్‌పుత్‌ల ప్రభావం బలంగా ఉండడం, ప్రజల సెంటిమెంట్, కర్ణిసేన హెచ్చరికలు తదితర కారణాల వల్ల అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనే భావనతో ఇక్కడ మల్టీప్లెక్స్ యజమానుల సంఘం సినిమాను ప్రదర్శించబోమని ప్రకటించింది. కర్ణిసేన ఆందోళనలు ఇలా.. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో కర్ణిసేన దుకాణాలపై విరుచుకుపడి విధ్వంసాలకు పాల్పడింది. రాజస్థాన్ జైపూర్‌లో పద్మావత్‌కు వ్యతిరేకంగా కర్ణిసేన బైక్ ర్యాలీ చేపట్టింది బిహార్ ముజఫర్‌పూర్‌లో కర్ణిసేన ఆందోళనకారులు తల్వార్లు ప్రదర్శిస్తూ.. టైర్లు తగలబెడుతూ నిరసన తెలిపారు తమిళనాడులో పద్మావత్‌కు శ్రీరామసేన ఆందోళన గుజరాత్ అహ్మదాబాద్‌లో పద్మావత్ సినిమా థియేటర్ల వద్ద భారీ భద్రత.. వారణాసిలో పద్మావత్ థియేటర్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి యత్నం చేసిన యువకుడు. అడ్డుకున్న పోలీసులు దక్షిణాది రాష్ట్రాల్లో సాఫీగా.. దక్షిణాది రాష్ట్రాల్లో పద్మావతి ప్రదర్శన సాఫీగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 400పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. కర్ణిసేన హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు థియేటర్ల వద్ద పోలీసుల బందోబస్తును ఏర్పాటుచేశాయి. బాగుందన్న టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. -
పద్మావత్ ప్రభంజనం సృష్టిస్తుంది
-
థియేటర్లలోకి పద్మావత్.. టెన్షన్.. టెన్షన్!
సాక్షి, ముంబై: వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న సంజయ్‌లీలా భన్సాలీ తాజా చిత్రం ‘పద్మావత్’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్ణిసేన ఆగ్రహావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ సినిమా విడుదలవుతోంది. దేశవ్యాప్తంగా ‘పద్మావత్’ సినిమా విడుదల అవుతున్న థియేటర్ల వద్ద భారీ భద్రత కల్పించారు. మరోవైపు ‘పద్మావత్’ సినిమా రాజ్‌పుత్‌లకు అనుకూలంగా ఉందని కథనాలు వెలువడుతున్నా.. కర్ణిసేన ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని కర్ణిసేన అంటోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో హింస చోటుచేసుకోవడం, కర్ణిసేన మూకలు దాడులకు దిగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. సినిమా విడుదలను అడ్డుకునేందుకు కర్ణిసేన ఏమైనా అవాంఛనీయ ఘటనలకు దాడులకు పాల్పడుతుందా? అన్నది టెన్షన్ రేపుతోంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ‘పద్మావత్’ మార్నింగ్‌షోలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పుణెలోని ఈస్క్వేర్ థియేటర్లో ఎలాంటి అలజడి, ఆందోళన లేకుండా మార్నింగ్ షోలు నడుస్తున్నాయి. కర్ణిసేన బెదిరింపుల నేపథ్యంలో థియేటర్ వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. చాలా నగరాల్లో మార్నింగ్‌షోలు ప్రశాంతంగా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ‘పద్మావత్’ థియేటర్ల వద్ద పోలీసులు అప్రమత్తంగా భద్రత కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కర్ణిసేన ఆందోళనల నేపథ్యంలో గురుగామ్‌లోని పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గురుగామ్‌లోని ఓ స్కూల్ బస్సుపై కర్ణిసేన దాడులు చేసి విధ్వంసానికి దిగడంతో పిల్లలను బడులకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కారణంగానే ఈ భయానక పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు అంటున్నారు. -
పాలన ఇలాగేనా?!
ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘రాణి పద్మిని’ పేరుతో ప్రారంభించిన చిత్రం ‘పద్మావతి’గా, ఆ తర్వాత ‘పద్మావత్’గా మారడమే కాదు... సెన్సార్ బోర్డు కత్తిరింపులనూ, ఆ సినిమాపై కత్తులు నూరిన కర్ణిసేన ‘మనో భావాలను’ గుర్తించి మసులుకున్నా దానికి కష్టాలు తప్పలేదు. 68వ గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు గురువారం అది దేశవ్యాప్తంగా విడుదల కాబో తుండగా అన్ని రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అల్లరి మూకలు వీధుల్లో వీరంగం వేస్తున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. థియేటర్లు, షాపింగ్ మాల్స్, బస్సులు, కార్లు, మోటారు సైకిళ్లు, ఇతర ఆస్తులు తగలబడుతున్నాయి. హర్యానాలోని గురుగ్రాంలో పసివాళ్లతో వెళ్తున్న పాఠశాల బస్సును కూడా వదలకుండా రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. అందులోని పిల్లలనూ, టీచర్లునూ భీతావహుల్ని చేశారు. మరో పాఠశాల బస్సును దహనం చేశారు. సెన్సార్ బోర్డు అనుమతి లభించిన ‘పద్మావత్’ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని, దానికి అన్నివిధాలా భద్రత కల్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పాక కూడా ఇదంతా యధేచ్ఛగా సాగుతోంది. వీధుల్లోకి వస్తున్న వేలమందిని నియంత్రించడానికి అవసరమైన పోలీసు బందోబస్తు కల్పించకుండా ఆ ప్రభుత్వాలన్నీ అటు రాజ్యాంగబద్ధమైన కర్తవ్యాన్ని, ఇటు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనూ బేఖాతరు చేశాయి. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులే కర్ణిసేనతో సమానంగా, కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువగా ఆ చిత్రానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని గుర్తుంచుకుంటే ఇలాంటి హింసాత్మక ఘటనలు అక్కడే ఎందుకు చోటుచేసుకుంటున్నాయో సులభంగానే అర్ధమవుతుంది. పైగా ఈ గొడవంతకూ బాధ్యత ‘పద్మావత్’ తీసిన సంజయ్ లీలా భన్సాలీదేనని హర్యానా మంత్రి అనిల్ విజ్ ప్రకటించి అందరినీ నివ్వెరపరిచారు. ఈసారి గణతంత్ర దినోత్సవానికి సింగపూర్, ఇండొనేసియా, మలేసియా, వియత్నాం, బ్రూనై తదితర ఆగ్నేయాసియా దేశాల(ఆసియాన్) అధినేతలు పదిమంది ముఖ్య అతిథులుగా వస్తున్నారని, వారు దేశంలో అడుగుపెట్టిన రోజున చానెళ్లన్నిటా ఈ హింసే ప్రధాన వార్తయితే దేశం పరువు పోతుందన్న కనీస జ్ఞానం కూడా అక్కడి ప్రభుత్వాలకు కొరవడింది. గురుగ్రామ్ బహుళజాతి సంస్థలకు ప్రసిద్ధి. అక్కడ అనేక భారీ పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, సాఫ్ట్వేర్ సంస్థలు పనిచేస్తున్నాయి. వేలకొలది కార్మికులు, ఉద్యో గులు ఆ నగరంలో పనిచేస్తున్నారు. పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకూ అక్కడ వందల సంఖ్యలో విద్యా సంస్థలున్నాయి. అది దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో భాగం. అలాంటిచోట అల్లరిమూకలు రోడ్లపైకొస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు... కేంద్ర ప్రభుత్వానికి సైతం అప్రదిష్ట. చిత్ర మేమంటే ఇంతచేటు హింస జరిగినా బీజేపీ ప్రతినిధులెవరూ చానెళ్లలో జరిగిన చర్చలకు రాలేదు. ఆ పార్టీ వైఫల్యాలను సొమ్ము చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించే ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మోహం చాటేసింది. ఈమధ్య వ్యంగ్యమైన ట్వీట్లు ఇవ్వడంలో ముందుంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం పత్తాలేరు. కులాల పేరిటా, మనోభావాల పేరిటా ఎవరు ఏం చేసినా దేశ ప్రజలకు దిక్కూ మొక్కూ లేదన్నమాట! మన రాజ్యాంగం పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛతో సహా ఎన్నో హక్కుల్ని కల్పించింది. చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పింది. ఏవో కొన్ని గ్రూపులు మతం పేరు చెప్పుకుని, కులం పేరు చెప్పుకుని మనోభావాలు దెబ్బ తిన్నాయని రోడ్డెక్కుతుంటే, సమాజం మొత్తంపై తమ అభిప్రాయాలను బల వంతంగా రుద్దాలని ప్రయత్నిస్తుంటే ప్రభుత్వాలన్నీ చేష్టలుడిగి చూస్తున్నాయి. తమకు నచ్చని అభిప్రాయాలను వ్యక్తం చేసిన వ్యక్తులపై, సంస్థలపై విరుచుకుపడే ఈ ప్రభుత్వాలు ఇలాంటి గ్రూపుల ముందు సాగిలపడుతున్నాయి. వాటికి వ్యతిరేకిస్తే తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందన్న భయంతో వణుకుతున్నాయి. ఆ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనైనా ధిక్కరించడానికి సాహసిస్తు న్నాయి. అది చలనచిత్రం కావొచ్చు... ఒక పుస్తకం కావొచ్చు... మరో కళాత్మక చిత్రం కావొచ్చు–దేన్నయినా నచ్చలేదని, విభేదిస్తున్నానని చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. మన రాజ్యాంగం సైతం హక్కులకు కొన్ని పరిమితులను కూడా విధించింది. కానీ ఆ పరిమితుల పేరిట భావప్రకటన హక్కునే కాలరాయాలని చూడటం ప్రభు త్వాలకైనా, ప్రైవేటు గ్రూపులకైనా తగని పని. కేజ్రీవాల్‌పై ‘యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మాన్’ పేరిట నిర్మించిన డాక్యుమెంటరీలో తనకు సంబంధించి పెట్టిన పాత్రను వక్రీకరించారని, అది న్యాయస్థానంలో తనపై ఉన్న కేసును ప్రభావితం చేసేలా ఉన్నదని ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మొన్న నవంబర్‌లో తీర్పునిస్తూ సృజనాత్మకతకు సంకెళ్లు విధించే ధోరణులను అనుమతించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. మనోభావాలు దెబ్బతిన్నాయన్న పేరిట సృజనాత్మక వ్యక్తీకరణలను శిలువ ఎక్కించడం తగదన్నది. ఆ తీర్పు వెలువడి మూడు నెలలైనా కాలేదు... ప్రభుత్వాలన్నీ ‘పద్మావత్’పై పగబట్టినట్టు వ్యవహరించాయి. ఆ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చి దాదాపు 25 రోజులవుతోంది. ఆ సినిమా చూడనే చూడం... మేం వద్దన్నాం గనుక విడుదలను ఆపాల్సిందేనని ఆగ్రహించే కర్ణిసేన సంగతలా ఉంచి ప్రభుత్వాల్లో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారో, బీజేపీ ముఖ్యులో దాన్ని వీక్షించి ఏమున్నదో తెలుసుకుంటే, వాటిపై తమకున్న అభ్యంతరాలేమిటో న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తే వేరుగా ఉండేది. నిజానికి చిత్రం చూసినవారు అది రాజపుట్ గౌరవప్రతిష్టలను, పద్మావతి పాత్రను ఉన్నతంగా చూపిందని అంటున్నారు. కనీసం నిజానిజాలేమిటో తెలుసు కోవాలన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించేవారిని అదుపు చేయలేకపోతే చట్టబద్ధ పాలన దెబ్బతింటుందని, అది అంతిమంగా అరాచకానికి దారితీస్తుందని ప్రభు త్వాలు గ్రహించాలి. -
కష్టాల్లో సినిమా.. ఆలయానికి దీపిక!
సాక్షి, ముంబై: సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చారిత్రక సినిమా ‘పద్మావత్’.. రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కినట్టు భావిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలకు సుప్రీంకోర్టు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందా? రాదా? అన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. అందుకు కారణం అడుగడుగునా కర్ణిసేన ఆధ్వర్యంలో రాజ్‌పుత్‌లు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే. ఇప్పటికే పలుచోట్ల ఈ సినిమాను ప్రదర్శిస్తారని భావించిన థియేటర్లపై కర్ణిసేన దాడులకు దిగుతోంది. ఈ వివాదాల నడుమ వచ్చే గురువారం ‘పద్మావత్’ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్ మంగళవారం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆమె ఆలయానికి వచ్చారు. ఆలయంలో వినాయకుడికి ప్రత్యేక పుజలు నిర్వహించారు. ‘పద్మావత్’ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికపై కూడా కర్ణిసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు భన్సాలీతోపాటు దీపిక తల నరికితే నజరానా ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీపిక కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయాన్ని దర్శించుకున్నారు. -
కష్టాల్లో సినిమా.. ఆలయానికి దీపిక!
-
సుప్రీంకోర్టులో పద్మావత్‌కు మరోసారి ఊరట
-
‘పద్మావత్’కే సుప్రీం మద్దతు ; రాష్ట్రాలకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ సినిమాకు అత్యున్నత న్యాయస్థానంలో మరోసారి మద్దలు లభించింది. సినిమా విడుదలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చబోనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సినిమా విడుదలను నిలిపేయాలంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు మంగళవారం కొట్టివేశారు. దీంతో జనవరి 25న ‘పద్మావత్’ యధావిధిగా విడుదలకానుంది. రాష్ట్రాలదే బాధ్యత : పద్మావత్ ప్రదర్శించలేమంటూ పిటిషన్ వేసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ‘శాంతిభద్రత పరిరక్షణ రాష్ట్రాల బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించలేమని చేతులెత్తేయడం సరికాదు. జనవరి 25న సినిమా విడుదలవుతుందన్న గత ఆదేశాల్లో మార్పుల్లేవు’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వెనక్కి తగ్గిన కర్ణిసేన? : అత్యున్నత న్యాయస్థానంలో పద్మావత్‌కు అనుకూలంగా తీర్పులు వస్తుండటంతో ఇరకాటంలోపడ్డ కర్ణిసేన పునరాలోచనలోపడ్డట్లు సమాచారం. సినిమాకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలకు నేతృత్వం వహిస్తోన్న కర్ణిసేనకు పద్మావత్ దర్శకుడు భన్సాలీ సైతం ప్రత్యేక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ‘ముందు మీరంతా సినిమా చూడండి. ఆ తర్వాత మీ ఇష్టం..’ అని భన్సాలీ కోరారు. సోమవారం కూడా ఉధృతంగా సాగిన ఆందోళనలు.. మంగళవారం నాటికి కాస్త తగ్గుముఖం పట్టడాన్ని బట్టిచూస్తే భన్సాలీ లేఖకు సానుకూలఫలితం వచ్చినట్లేనని సినీవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆందోళన విరమించే విశయమై కర్ణిసేన ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. రక్షణ కల్పిస్తాం : ముంబై, హరియాణా పోలీసులు ‘పద్మావత్’ విడుదలకు సంబంధించి సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఆ సినిమాను ప్రదర్శించబోయే థియేటర్లకు రక్షణ కల్పిస్తామని ముంబై పోలీసు శాఖ ప్రకటించింది. అటు హరియాణా ప్రభుత్వం కూడా సినిమా హాళ్ల వద్ద పహారాకు హామీ ఇచ్చింది. థియేటర్ యాజమాన్యాలు ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని పోలీసులు పేర్కొన్నారు. -
'మేం చూశాకే ఆ సినిమా భవిష్యత్ తేలుస్తాం'
సాక్షి, ముంబయి : అభ్యంతరకర అంశాలు ఏవీ కూడా పద్మావత్ చిత్రంలో లేవని కావాలంటే ఆ సినిమాను ముందే చూడొచ్చని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఇచ్చిన ఆఫర్‌కు శ్రీ రాజ్పుట్ కర్ణిసేన అంగీకరించింది. ఎట్టి పరిస్థితుల్లో పద్మావత్ చిత్రాన్ని విడుదలకానివ్వబోమని ప్రకటించిన కర్ణిసేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మరికొద్ది సేపటికే తాను పద్మావత్ చూసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తనతోపాటు తన ఉద్యమ బృందంలో పనిచేస్తున్నవారు కూడా ఈ సినిమాను చూస్తారని తెలిపారు. 'మాకు ఓ లేఖ అందింది. మేం ఆ చిత్రాన్ని చూడాలని కోరుతూ ఆ లేఖలో భన్సాలీ రాశారు. బహుశా మేం తిరస్కరిస్తామని ఆయన అనుకోవచ్చు.. కానీ మేం అంగీకరిస్తున్నాం. సినిమా చూసేందుకు సిద్ధంగా ఉన్నాం. మేం చూశాకే ఆ సినిమా దేశ వ్యాప్తంగా విడుదల చేసుకోవచ్చా లేదా కొంతమందే ఈ సినిమా చూడాలా అనే విషయం చెబుతాం. అలాగే, సెన్సార్ బోర్డు ముగ్గురు మాత్రమే ఈ సినిమా చూడాలని మరో ఆరుగురుని పక్కన పెట్టింది. అయితే, ఆ ఆరుగురితోపాటు జర్నలిస్టులు కూడా ఈ సినిమాను చూడాలి' అని కల్వి అన్నారు. -
బొమ్మ పడితే.. థియేటర్ మసే!
సాక్షి, పూణే : సంజయ్ లీలా భన్సాలీ వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’ విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో.. కర్ణిసేన తన అందోళనలను మరింత ఉధృతం చేసింది. ఇప్పటివరకూ సినిమా విడుదలను చట్టపరంగా ఆపేందుకు ప్రయత్నించిన కర్ణిసేన.. తాజాగా థియేటర్ల యజమానులపై బెదిరింపులకు దిగింది. ‘పద్మావత్’ చిత్రాన్ని ప్రదర్శిస్తే.. థియేటర్లను ధ్వంసం చేస్తామని తాజాగా పూణే కర్ణిసేన అధ్యక్షుడు ఓమ్ సింగ్ భార్తి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ‘పద్మావత్’ చిత్రం ఈ నెల 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర విడుదలను ఎలాగైనా అడ్డుకునేందుకు కర్ణిసేన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదిలావుండగా.. హర్యానా రాష్ట్రంలోని ఫరిదాబాద్‌లోని ఓ సినిమా థియేటర్ టిక్కెట్ కౌంటర్‌ను కర్ణిసేనకు చెందిన ఆందోళన కారులు తగులబెట్టారు. కర్ణిసేన బెదిరింపుల నేపథ్యంలో గుజరాత్ సినిమా థియేటర్ల యజమానులు ఈ చిత్రాన్ని విడుదల చేయలేమని చేతులెత్తేస్తున్నారు. -
'సంగీత' లీలా భన్సాలీ
ఇటీవల అత్యంత వివాదాస్పదమైన సినిమా పద్మావత్. ఎన్నో ఇబ్బందులు, ఇంకెన్నో అడ్డంకులు, లెక్కలేనన్ని బెదిరింపులతో హాట్‌టాపిక్‌గా మారిన సినిమా పద్మావత్. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సుప్రీంకోర్టు తీర్పుతో ఊరట లభించింది. అయితే ఇలాంటి వివాదాస్పద సినిమాలు తీయడం భన్సాలీకి కొత్తేమి కాదు. వినూత్న కథలతో, భారీ ఖర్చు, విజువల్ గ్రాండియర్‌తో అందరికంటే భిన్నంగా సినిమాలను తీయడం భన్సాలీకే సొంతం. దర్శకత్వ బాధ్యతలు మోస్తూ ఆ సినిమాకు సంగీతం కూడా అందించటం చాలా కష్టం. అలాంటి కష్టాన్ని ఎప్పుడు చాలెంజ్‌గా తీసుకొని సక్సెస్ సాధిస్తుంటాడు భన్సాలీ. దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్న భన్సాలీ సంగీతంలోని ఇష్టాన్ని తన సినిమాలోని పాటల ద్వారా తెలియజేశారు. తాజాగా ఆయన చిత్రీకరించిన సినిమా ‘పద్మావత్’ వివాదాస్పదమై సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు ‘గూమర్, ఏక్ దిల్ ఏక్ జాన్’ వింటే భన్సాలీ సంగీత ప్రియుడని మరోసారి రుజువైంది. ఇప్పటికే ఆ పాటలు యూట్యూబ్‌లో వైరల్‌గా మారాయి. గూమర్, ఏక్ దిల్ ఏక్ జాన్ పాటలు కేవలం సంగీతపరంగానే కాదు, దృశ్యకావ్యంగానూ అద్భుతంగా మలిచారు భన్సాలీ. బాలీవుడ్లో ఒక పాటను చూస్తే.. కచ్చితంగా ఇది భన్సాలీ పాటే అని చెప్పవచ్చు. అంతలా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. అతడు దర్శకుడిగా, సంగీత దర్శకుడిగానూ రెండు పడవలపై సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణిస్తున్నారు. భన్సాలీ సినిమా విజువల్స్ ఒక ఎత్తు, సంగీతం మరో ఎత్తు. సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతం ఇలా అన్నింటితో ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తారు క్రియేటివ్ జీనియస్. డైరెక్టర్‌గా కామోషీ నుంచి పద్మావత్ వరకు ఆయన సినీ సంగీత సాగరాన్ని ఓ సారి పలకరిద్దాం. కామోషీ , హమ్ దిల్ దే చుకే సనమ్(హెచ్డిడిసిఎస్), దేవ్‌దాస్, బ్లాక్, గుజారీష్, గోలియాన్ కి రాస్లీల : రామ్‌లీల, బాజీరావ్ మస్తానీ ఇవన్నీ మ్యూజికల్ హిట్సే. బాలీవుడ్లో ఓ పది ఆణిముత్యాల్లాంటి గీతాలను తీస్తే..అందులో భన్సాలీ సినిమాలోని పాటలకు సమున్నత స్థానం ఉంటుంది. నింబుడా నింబుడా, డోలా రే డోలా, మార్ డాలా, పింగా, నగాడా సంగ్ డోల్.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో మరుపురాని పాటలు భన్సాలీ మస్తిష్కం నుంచే పుట్టాయి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాకముందునుంచీ కూడా సినిమాలోని ప్రతీ పాటపై ఎంతో జాగ్రత్త వహించేవారనీ ఆయనతో పనిచేసిన వారంతా చెబుతారు. భన్సాలీ గురించి సింగర్ కవితా కృష్ణమూర్తి మాటల్లో.... ‘భన్సాలీ తల్లి నాట్య కళాకారిణి. తండ్రి సినిమా ఇండస్ట్రీకి చెందినవారే. దీంతో భన్సాలీకి చిన్నప్పటినుంచే కళారంగంపై మక్కువ ఏర్పడింది. సంగీత దర్శకుడు ఇస్మాయిల్‌తో భన్సాలీది ప్రత్యేక అనుబంధం. వారిద్దరు మంచి మిత్రులు. అందుకే భన్సాలీ మనసులో ఏం అనుకుంటాడో ఇస్మాయిల్ కు అర్ధమైపోయేది. అందుకు తగ్గట్టుగా సంగీతమందించేవారు ఇస్మాయిల్ తనకు కావల్సినట్టు వచ్చే వరకు వొదిలిపెట్టేవాడు కాదు. భన్సాలీ పాటలోని ప్రతి చిన్న విషయాన్ని ఎంతో నిశితంగా పరిశీలించే వారు. పాటను ఏవిధంగా చిత్రీకరించాలో ముందే ఒక అవగాహన ఉంటుంది. పాట రికార్డింగ్ జరిగేప్పుడు కూడా అక్కడే ఉండేవాడు. భన్సాలీ సినిమాల(హమ్ దిల్ వే చుకే సనమ్, దేవ్‌దాస్)కు పాడిన పాటలు నాకెంతో గుర్తింపును తెచ్చాయి’ అన్నారు. సంగీత దర్శకుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ... ‘నేను కంపోజ్ చేసిన పాటలకు భన్సాలీ మాత్రమే ప్రాణం పోయగలరు. నేను ఏ విధంగా సంగీతాన్ని ఇస్తే..దానికి మించి తను వాటిని విజువలైజ్ చేసేవారు. ఆయన పాటలోని చిన్న మ్యూజిక్ బిట్‌ను కూడా వదిలేవారు కాదు. టింగ్ అనే చిన్న శబ్దం వచ్చినా దానికి కూడా తెరపై అందంగా చూపించేవారు. మ్యూజిక్‌పై ఎంతో ఇష్టం ఉంటే గానీ ఇలా చేయలేరు. హమ్ దిల్ దే చుకే సనమ్ రోజుల్ని గుర్తు చేసుకుంటూ... నేను చేసిన పాటను అందరికీ వినిపించేవాడిని. కానీ ఏ ఒక్కరు సరిగా వినేవారుకాదు. సంజయ్ మాత్రం విని, మళ్లీ వినిపించు అనేవాడు. ‘తడప్ తడప్’ సాంగ్ విన్న తరువాత సంజయ్ నా వద్దకు వచ్చి ఇస్మాయిల్..ఈ సాంగ్ తరువాత నా సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలిసింది. ఎక్కడ ఇంటర్వెల్, క్లైమాక్స్ ఉండాలో తెలిసింది.’ అన్నారు. ఉదిత్ నారాయణ్ మాట్లాడుతూ.... ‘భన్సాలీతో పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. భన్సాలీ సినిమాల్లో ఏది తీసుకున్నా అదొక మ్యూజిక్ సెన్సెషనే. ఆ సినిమాల్లోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. ఆయన స్వయంగా రికార్డింగ్ రూంలో ఉండి ప్రతీది గమనించేవారు. నాకు వంద శాతం రిజల్ట్ కావాలి అనేవారు. హెచ్డిడిసిఎస్ సినిమా టైంలో జరిగిన ఒక సంఘటన గురించి చెపుతూ...చాంద్ చుపా బాదల్ మైన్..అనే పాట సినిమా రిలీజ్ అయిన తరువాత పదిరోజుల వరకు ప్రదర్శించారు. ఒక రోజు సంజయ్ వచ్చి ఈ పాట వద్దని కొంతమంది అంటున్నారు తీసేద్దాం అన్నారు. మళ్లీ నాలుగు రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి మళ్లీ సాంగ్ పెట్టండి అన్నారు. ఆ సాంగ్ ఎంతో పాపులర్ అయింది. ఆదిత్యనారాయణ్ మాట్లాడుతూ.... ‘పాటలోని ప్రతీ బీట్‌ను ఆయన గమనిస్తారు. ఆలాపన , తాళం ప్రతీ విషయాన్ని సూక్ష్మంగా చూస్తారు. ఆయన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కావడం వల్ల ఎక్కడ ఏ సన్నివేశానికి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో ఆయనకు బాగా తెలుస్తుంది. ఎడిటింగ్ రూంలో కూడా సంగీతం గురించి ఆలోచించేవాడు’ అని రామ్‌లీల సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవాల్ని తెలిపారు. భన్సాలీకి భారతీయ సంగీతం, జానపదాలు అంటే ఇష్టమని ఆయన సినిమాలోని పాటలను చూస్తే తెలుస్తుంది. క్లాసికల్ సాంగ్స్‘అల్బెలా సజన్’, ‘కాహే చెడ్ మోహె’.. జానపద గీతాలు.. దోలీ తారో, నింబుడా, డోలా రే డోలా, పింగా, నగడా సంగ్ డోల్, లహు ముహ్ లగ్ గయ, తాజాగా పద్మావత్ లోని గూమర్ పాటను చూస్తే భన్సాలీ పాటను చిత్రీకరించే విధానం తెలుస్తుంది. పాటకు తన ఆలోచనలతో ప్రాణం పోస్తాడు భన్సాలీ. విరహ వేదన, ప్రణయ గీతాలను కూడా అంతే అందంగా చూపిస్తారు. ‘ఆంకోన్ కి గుస్తాకియాన్, జాన్క హవా కా, బైరీ పియ, సిల్సిలా ఏ చాహత్ క, జబ్ సే తేరా నైనా, మూన్ షబ్నామీ, తోడే బద్మాష్, లాల్ ఇష్క్, ఆయత్ , దీవానీ మస్తానీ లాంటివే ఇందుకు నిదర్శనం. తన పాటలతో తన వ్యక్తిత్వం ఏంటో తెలియజేశాడు భన్సాలీ. ఆయన మ్యూజిక్‌లో సాంప్రదాయ సంగీతానికి స్థానం కల్పించాడు. జానపదాలనూ గౌరవించాడు. నింబుడా, డోలా రే డోల, ఉడి ఉడి పాటలను ప్రస్తావించకుండా బాలీవుడ్ సంగీతం గురించి చెప్పలేం. భారతీయ సినీ సంగీతంలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న భన్సాలీ మరిన్ని దృశ్యకావ్యాలను మనకందించాలని ఆశిద్దాం. -
దీపిక నడుమును కవర్ చేసి..
అనేక వివాదాలు చుట్టుముట్టిన చారిత్రక చిత్రం ‘పద్మావత్’ లో సెన్సార్ బోర్డు సూచనల మేరకు చిత్రయూనిట్ పలు మార్పులు చేసింది. ఈ సినిమాపై కర్ణిసేన అభ్యంతరాలు, ఆందోళనల నేపథ్యంలో ’ఘూమర్’ పాటలో ప్రధానంగా మార్పులు చేసింది. గత నెలలో ఆన్లైన్లో విడుదల చేసిన ఈ పాటపై కర్ణిసేన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాణి పద్మావతిగా కనిపించిన దీపికా పదుకోన్ నృత్యం చేయడం, పాటలో ఆమె నడుము కనిపించడాన్ని ఆక్షేపించింది. రాణి పద్మావతి అలా గంతులేయడం ఏమిటని కన్నెర్ర జేసింది. ఈ పాటపై నృత్య ప్రదర్శన చేసిన పలుచోట్ల విధ్వంసాలకు దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ‘ఘూమర్’ పాటలో దీపిక నడుము కనిపించకుండా.. కంప్యూటర్ జెనరేటెడ్ వస్త్రంతో కవర్ చేశారు. సీబీఎఫ్సీ సలహాల మేరకు యూ/ఏ సర్టిఫికెట్ పొందేందుకు సినిమాలో ఈమేరకు కీలక మార్పులు చేసినట్టు చిత్రయూనిట్ అనధికారికంగా మీడియాకు తెలియజేసింది. పద్మావత్ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి లభించినా ఈ నెల 25న చిత్రం విడుదల అవుతుందా? లేదా? అన్నది సందేహాస్పదంగా మారింది. ఈ సినిమా విడుదలకు అనుగుణంగా అక్షయ్‌కుమార్ తన ‘ప్యాడ్‌మన్’ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. అయినా, కర్ణిసేన దిగిరాకపోవడం.. సినిమా విడుదలైతే.. తీవ్ర విధ్వంసం, పరిణామాలు తప్పవని హెచ్చరిస్తుండటంతో ‘పద్మావత్’ ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది ఉత్కంఠకు దారితీస్తోంది. -
పద్మావత్ కోసం వెనక్కితగ్గిన ప్యాడ్‌మ్యాన్
ముంబై : వివాదాల సుడిగుండాలుదాటి విడుదలకు సిద్ధమైన ‘పద్మావత్’కు బాలీవుడ్ బాసటగా నిలిచింది. సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా విడుదల తేదీలు మారుతూ.. చివరికి జనవరి 25కు ఖరారైన నేపథ్యంలో ఆ రోజే విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదాపడ్డాయి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ప్యాడ్ మ్యాన్ సినిమా జనవరి 25న విడుదలకావాల్సి ఉండగా, భన్సాలీ అభ్యర్థన మేరకు విడుదల తేదీని ఫిబ్రవరి 9కి పోస్ట్‌పోన్ చేసుకున్నారు. బుధవారం ముంబైలో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో భన్సాలీ-అక్షయ్‌లు ఈ విషయాన్ని చెప్పారు. ‘సినిమా విడుదల కావడం వారికి(పద్మావత్ రూపకర్తలకు) ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నా సినిమాను విడుదల చేయడం భావ్యంకాదు. అందుకే ఫిబ్రవరి 9కి వాయిదావేస్తున్నాను’ అని అక్షయ్ కుమార్ చెప్పారు. అడిగినవెంటనే వాయిదాకు అంగీకరించిన అక్షయ్‌కి కృతజ్ఞుడినని పద్మావత్ దర్మకుడు భన్సాలీ అన్నారు. -
‘పద్మావత్’.. చాలా బాగుంది!
-
‘థియేటర్లు అన్నింటికి నిప్పు పెడతాం’
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్ సినిమా విడుదలైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజ్‌పుత్ గ్రూపులు గురువారం మరోమారు హెచ్చరించాయి. సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే రాజ్‌పుత్ గ్రూపులు ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. పద్మావత్ విడుదలను నిషేధించాలని, లేకపోతే సినిమా విడుదలయ్యే థియేటర్లకు నిప్పు పెడతామని రాజ్‌పుత్ శ్రేణులు తీవ్ర హెచ్చరిక చేశాయి. ఇదే తమ ఆఖరి హెచ్చరిక అని కూడా చెప్పాయి. రాణి పద్మావతి అభిమానంతో అడుకునే పనులు ఎవరైనా చేస్తే తాము చూస్తూ ఊరుకోమని పేర్కొన్నాయి. -
‘పద్మావత్’.. చాలా బాగుంది!
సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘పద్మావత్’ చిత్రం బాగుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కితాబిచ్చారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి రవిశంకర్ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘పద్మావత్’ చిత్రం చాలా బాగుందన్నారు. దీపికా పదుకునే, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్‌ల నటన అద్భుతంగా ఉందని రవిశంకర్ చెప్పారు. ఈ చిత్రంపై రాజపుత్రులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అర్థం లేనివని అన్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారంతా చిత్రాన్ని చూసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ‘పద్మావత్’ చిత్రం రాజపుత్రుల గౌరవాన్ని పెంచుతుందని, రాణీ పద్మావతి దేవి గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు. -
పద్మావత్ : సుప్రీం గ్రీన్ సిగ్నల్
పద్మావత్ చిత్ర విడుదలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిషేధించిన రాష్ట్రాల్లో కూడా విడుదల చేయాల్సిందేనని గురువారం తేల్చి చెప్పింది. సెన్సార్ సమస్యలను దాటి ఈ నెల 25న రిలీజ్‌కు రెడీ అవుతున్న క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. సెన్సార్ బోర్డ్ రిలీజ్ కు అనుమతించినా.. తాము మాత్రం అనుమతించబోమని ఆయా ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి. దీంతో నిషేదంపై చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కారణంగా సినిమాను నిషేదించారంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం నాకు ఆశ్చర్యం కలిగించింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాపై విధించిన నిషేదాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించారు. ఈ సుప్రీం తీర్పుతో ఈ నెల 25న దేశవ్యాప్తంగా పద్మావత్ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. -
సుప్రీం గడపతొక్కిన ‘పద్మావత్’ నిర్మాతలు
న్యూఢిల్లీ: దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన‘పద్మావత్’ చిత్ర వివాదం మళ్లీ మొదటికొచ్చింది. షూటింగ్ మొదలు పెట్టిన దగ్గరనుంచీ వివాదాలతో సహజీవనం చేస్తున్న ‘పద్మావత్’.. తాజాగా మరోమారు సుప్రీంకోర్టు గడపతొక్కింది. మొదట్లో చిత్ర విడుదలకు అంగీకరించని సెన్సార్ బోర్డు కొన్ని షరతులు, సీన్ల తొలగింపు తరువాత ఆమోదముద్ర వేసింది. ఈ చిత్రంపై మొదటినుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నఆందోళనకారులు.. సెన్సార్‌బోర్డు అనుమతిచ్చినా.. అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్, రాజస్తాన్, హర్యానా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు.. చిత్ర విడుదలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. సినిమా విడుదలను రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవడంపై పద్మావత్ నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయిచారు. ఎన్నో కష్టాలనోర్చి రూపొందిచిన ‘పద్మావత్’ చిత్రానికి న్యాయం చేయాలంటే.. నిర్మాతలు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చిత్ర నిర్మాతల పిటీషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా.. రేపు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధానపాత్రలలో సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన 'పద్మావత్' జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
దీపిక నడుముతో పెద్ద తలనొప్పి!
పద్మావత్ చిత్ర విడుదలకు క్లియరెన్స్ లభించినా మేకర్లకు మాత్రం చిక్కులు తప్పటం లేదు. ఓవైపు కర్ణి సేన హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన చెందుతున్న దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ.. మరోవైపు సెన్సార్ బోర్డు సూచనల మేరకు చిత్రానికి మరమ్మత్తులు పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనకు ఓ కొత్త సమస్య ఎదురైందని తెలుస్తోంది. ఈ చిత్రంలో గూమర్ సాంగ్‌లో పద్మావతిగా దీపిక వేసిన స్టెప్పులు అందరినీ ఆకర్షించాయి. కానీ, కర్ణిసేన మాత్రం ఆ పాట పై కన్నెర్ర చేసింది. రాణి పద్మావతి అలా గంతులేయటం ఏంటని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న సెన్సార్ బోర్డు ప్యానెల్ సభ్యులు ఆ పాటను కూడా ఎడిట్ చేయాల్సిందేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాటలో దీపిక నడుము కనిపించే షాట్లను తొలగించాలని సూచించింది. అయితే అది మొత్తం పాట పైనే ప్రభావం చూపే అవకాశం ఉండటంతో భన్సాలీ ఓ నిర్ణయానికి వచ్చాడు. కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ద్వారా దీపిక నడుమును కప్పిపుచ్చే యత్నం చేస్తున్నాడంట. అయితే ఈ ఎడిటింగ్ పనుల వల్ల చిత్రం జనవరి 25 తేదీన విడుదలయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తోందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముందు మాకు చూపించండి : రాజస్థాన్ హైకోర్టు పద్మావత్ చిత్రంపై దాఖలైన ఓ పిటిషన్ పై శుక్రవారం రాజస్థాన్ హైకోర్టు విచారణ చేపట్టింది. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతోపాటు దీపిక, రణ్వీర్లపైన గతేడాది మార్చిలో నగౌర్ జిల్లా దీవానా పోలీస్ స్టేషన్లో ఓ కేసు దాఖలైంది. అయితే ఆ అభియోగాలను కొట్టివేయాలంటూ భన్సాలీ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన బెంచ్.. అభ్యంతరాల నేపథ్యంలో ముందు చిత్రాన్ని తమ ముందు ప్రదర్శించాలని.. చూసి నిర్ధారించుకున్నాకే కేసును కొట్టివేస్తామని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ పై తదుపరి వాదనను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది. 17 నుంచి నిరసన ప్రదర్శనలు చిత్తోర్‌ఘడ్ వేదికగా మరో ఉద్యమానికి రాజ్‌పుత్ కర్ణిసేన సిద్ధమవుతోంది. పద్మావత్ చిత్ర విడుదలను అడ్డుకునే దిశగా పెద్ద ఎత్తున్న ప్రయత్నాలు ప్రారంభించింది. ఆదివారం కర్ణిసేన ప్రతినిధులు హోం శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. మరోవైపు కర్ణిసేన పెద్దలు 17న తేదీన పద్మావత్ చిత్రానికి దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. -
25న ‘పద్మావత్’ అయ్యారే.. వెనక్కి తగ్గారే!
అనుకున్నదే జరిగింది. ‘పద్మావత్’ ముందుకొస్తే.. కొన్ని సినిమాలు వెనక్కి తగ్గుతాయని చాలామంది అనుకున్నారు. అదే జరిగింది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘పద్మావత్’. పలుమార్లు వాయిదా పడుతూ, ఆదివారం వరకూ ఈ చిత్రం విడుదల అయోమయ పరిస్థితిలోనే ఉంది. ఈ నెల 25న విడుదల చేయాలని సోమవారం చిత్రబృందం నిర్ణయించుకుంది. అదే సమయానికి అక్షయ్‌కుమార్ ‘ప్యాడ్‌మ్యాన్’, ‘అయ్యారీ’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ‘పద్మావత్’లాంటి భారీ చిత్రం వచ్చినప్పుడు తాము రావడం శ్రేయస్కరం కాదు అనుకున్నారో ఏమో ‘అయ్యారే’ దర్శకుడు నీరజ్ పాండే తమ చిత్రం విడుదలను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. బాలీవుడ్ కథనం ప్రకారం ‘ప్యాడ్‌మ్యాన్’ వెనకడుగు వేయాలనుకోవడంలేదట. ఈ నెల 25న వచ్చేయాల్సిందేనని చిత్రబృందం అనుకుంటోందట. -
'పద్మావత్' సినిమాకు షాక్..
సాక్షి, న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్న 'పద్మావత్' సినిమాకు మరో షాక్ తగిలింది. కేంద్ర సెన్సార్ బోర్డు ఈ సినిమా విడుదలకు అంగీకరించినా.. ఇందుకు తాము అంగీకరించబోమని రాజస్థాన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ సినిమాను నిషేధించాల్సిందేనని, తమ రాష్ట్రంలో ఈ సినిమా విడుదలకు అంగీకరించబోమని రాజస్థాన్ ప్రకటించింది. మరోవైపు రాజ్‌పుత్‌లు కూడా 'పద్మావత్’ సినిమాపై కారాలు మిరియాలు నూరుతున్నారు. కేవలం సినిమా పేరును మాత్రమే మారిస్తే సరిపోదని, సినిమాలోని పాత్రధారుల పేర్లను కూడా మార్చాలని రాజ్‌పుత్ కర్ణిసేన డిమాండ్ చేసింది. ‘ఈ సినిమా విషయంలో మేం మొదటినుంచి ఒకే మాటకు కట్టుబడి ఉన్నాం. ఈ సినిమాను నిషేధించాలనే కోరుతున్నాం. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఈ సినిమా బాగా లేదని, చరిత్రని వక్రీకరించారని, కేవలం డబ్బుల కోసమే ఈ సినిమాను తీశారని నివేదించింది’’ అని కర్ణిసేన సభ్యుడు మణిపాల్ సింగ్ మకర్ణ మీడియాతో తెలిపారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని మేం ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నామని, విషయాన్ని నేను ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్తానని అన్నారు. లేదంటే సినిమా విడుదల తర్వాత జరిగే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ సినిమా విషయంలో సీబీఎఫ్సీ చైర్మన్ జోషి, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. సినిమా విడుదలైతే.. పెట్రోల్ పోసి థియేటర్లను తగులబెడతామని కర్ణిసేన సభ్యులు హెచ్చరిస్తున్నారు. -
'పద్మావత్'కు ముహూర్తం ఖరారు.. రిలీజ్ డేట్ ఇదే!
సాక్షి, ముంబై: ఇటీవల తీవ్ర వివాదాల్లో కూరుకుపోయిన సంజయ్ లీలా భన్సాలీ 'పద్మావతి' సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. వివాదాల నేపథ్యంలో 'పద్మావతి' టైటిల్‌ను 'పద్మావత్'గా మార్చుకొని ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డు 'సీబీఎఫ్సీ' అనుమతి ఇచ్చింది. మేవాడ రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిన 'పద్మావతి' సినిమాపై కర్ణిసేన నేతృత్వంలోని రాజ్‌పుత్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. రాజ్‌పుత్‌ల ఆగ్రహం నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈ సినిమా విడుదలపై నిషేధం విధించాయి. దీంతో డిసెంబర్ నెలలో రావాల్సిన ఈ సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో సినిమాపై వివాదం తలెత్తకుండా సీబీఎఫ్సీ పలు మార్పులు సూచించింది. పలుచోట్ల కత్తెరలు వేసింది. ఇందుకు చిత్ర యూనిట్ అంగీకరించింది. సినిమా టైటిల్‌ను 'పద్మావత్'గా మార్చేందుకు అంగీకరించింది. దీంతో ఈ నెల 25న సినిమా విడుదలకు లైన్ క్లియరైంది. -
‘పద్మావత్’ రిలీజ్ డేట్..!
ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమైన బాలీవుడ్ సినిమా పద్మావతి. చారిత్రక కథగా తెరకెక్కిన ఈ సినిమాలో మహారాణి పద్మావతి పాత్రను అభ్యంతరకరంగా చూపించారని కర్ణిసేన సభ్యులు ఆరోపిస్తున్నారు. షూటింగ్ సమయంలో దాడి దిగిన కర్ణిసేన రిలీజ్ ను అడ్డుకుంటామని హెచ్చరించింది. దీంతో వివాదం మరింత ముదిరింది. అదే సమయంలో సెన్సార్ బోర్డ్ నుంచి కూడా క్లియరెన్స్ రాకపోవటంతో డిసెంబర్ 1న రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడింది. అయితే ఇటీవల సెన్సార్ బోర్డ్ సినిమాకు కొన్ని మార్పులతో సెన్సార్ సర్టిఫికేట్ ను జారీ చేసేందుకు అంగీకరించింది. చిత్రయూనిట్ కూడా సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు చేసేందుకు సుముఖంగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా టైటిల్ ను పద్మావత్ గా మార్చాలన్న సూచనకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అంగీకరించినట్టుగా సమాచారం. దీంతో సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయినట్టుగానే భావిస్తున్నారు. ఈ రోజు పద్మావతిగా నటించిన దీపికా పదుకొణే పుట్టిన రోజు కావటంతో సినిమా రిలీజ్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పద్మావత్ సినిమాను ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారట. -
‘అనైతికం.. బాధ్యతారాహిత్యం’
సాక్షి, మేవార్ : సంజయ్ లీలా భన్సాలీ వివాదాస్పద చిత్రం.. పద్మావతి విడుదలకు అనుమతివ్వడంపై మేవార్ రాజకుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి చిత్ర విడుదలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై రాజవంశీకులు అసహనం వ్యక్తం చేశారు. సీబీఎఫ్సీ బృందం.. మేవార్ రాజవంశీయుల సూచనలను పరిగణలోకి తీసుకోలేదని మేవార్ వంశస్థుడు విశ్వరాజ్ సింగ్ అన్నారు. ‘పద్మావతి’ నుంచి ‘పద్మావత్’గా చిత్రం పేరును మార్చినంత మాత్రాన అందులో చూపించిన విషయాల్లో మార్పులు రావని అన్నారు. పద్మావతి చిత్రంలోని వివాదాస్పద సన్నివేశాలను తొలగించకుండా.. యూఏ సర్టిఫికెట్ ఇచ్చి విడుదలకు అనుమతించడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. సెన్సార్ బోర్డు తీసుకున్ని ఈ నిర్ణయం అనైతికమని, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని ఆయన అన్నారు. -
పద్మావతి కాదు.. పద్మావత్
శనివారం ‘పద్మావతి’ సెన్సార్ కండీషన్ల గురించి వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో ..సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి స్పందించారు. ‘‘ పద్మావతి సినిమా పై సెన్సార్ బృందం 26 కట్స్‌ను విధించింది అన్న వార్తలు అవాస్తవం. మేము ఎటువంటి కట్స్ చెప్పలేదు. కేవలం 5 మార్పులు మాత్రమే చెప్పాం’’ అని అన్నారు. ‘తి’ కాదు.. ‘త్’.. అవును ఇక ‘పద్మావతి’ కాదు.. ‘పద్మావత్’. అదేంటీ? ఎందుకీ మార్పు? సినిమా మొత్తం పూర్తయి, రిలీజ్‌కి రెడీ అయిన సమయంలో టైటిల్లో మార్పేంటి? అనేకదా మీ సందేహం. ‘సెన్సార్ బోర్డ్’ ఆజ్ఞాపన ఇది. నిజానికి ఏ ముహూర్తాన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావతి’ని మొదలుపెట్టారో కానీ..అడుగడుగునా అడ్డంకులే. షూటింగ్ స్పాట్లో దర్శకుడు భన్సాలీపై దాడి చేయటం, సెట్స్ తగులబెట్టడం, చరిత్రను వక్రీరిస్తున్నారని, చిత్రాన్ని రిలీజ్ చేయనివ్వబోమని కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుచెప్పటం, మమ్మల్ని తక్కువ చేసే అవకాశం ఉందని రాజ్‌పుత్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేయటం, చిత్ర కథానాయిక దీపికా పదుకోన్‌ని బెదిరించటం.. ఇలా ఎన్నో ఇబ్బందులు. ఈ కారణంగా ‘పద్మావతి’ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇన్ని ఇబ్బందుల మధ్య సినిమాను విడుదల చేయటం కష్టం అని భావించిన చిత్రనిర్మాణ సంస్థ వయాకామ్18 ‘పద్మావతి’ సినిమాను వాయిదా వేసింది. ఈ సినిమాను సెన్సార్ సభ్యులతో పాటు కొంతమంది చరిత్రకారులు, రాజ్‌పుత్‌లను వీక్షించమని కోరారు నిర్మాతలు. ఈ నెల 28న సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి ఆధ్వర్యంలో సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూశారు. ఆ తర్వాత కొన్ని నిబంధనలు విధించారనే సమాచారం బయటికొచ్చింది. అవేంటంటే... ► ‘పద్మావతి’ సినిమా పేరును ‘పద్మావత్’గా మార్చాలి. ► సుమారు 26 కట్స్ చేయమని కోరింది. ► సినిమా మెదలైనప్పుడు, ఇంటర్వెల్‌తో పాటు కొన్ని సీన్స్‌లో ..... హెచ్చరిక జారీ చేయమని ఆదేశించింది. సతీ సహగమనం సన్నివేశాల్లో , ఘూమర్ పాటలో ఈ డిస్క్లైమర్లు వేయాలని కోరారు. ఈ మార్పులు చేసి, మళ్లీ సెన్సార్ బోర్డ్‌కి సినిమాని సబ్మిట్ చేశాక సభ్యులందరూ వీక్షిస్తారు. ఆ తర్వాత సర్టిఫికెట్ జారీ చేస్తారు. చెప్పిన మార్పులు చేస్తే సినిమాకు యు/ఏ సర్టిఫికెట్‌ను లభిస్తుందని పేర్కొన్నారట. -
‘పద్మావతి’ పేరు మార్పు?!
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్ లీలా బన్సాలీ భారీ సెట్టింగ్‌లతో తీసిన వివాదాస్పద బాలీవుడ్ చిత్రం ‘పద్మావతి’ సినిమాకు కేంద్ర సినిమా సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెల్సింది. అలాగే సినిమా పేరును కూడా ‘పద్మావత్’గా మార్చాలని సెన్సార్ బోర్డు ఆదేశించినట్లు సమాచారం. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను సెన్సార్ బోర్డు సభ్యులకు చూపించారు. ఉదయ్‌పూర్‌కు చెందిన అర్వింద్ సింగ్, జైపూర్ యూనివర్శిటీకి చెందిన చంద్రమణి సింగ్, కేకే సింగ్‌లతో కలిసి సెన్సార్ బోర్డు ప్యానెల్ ఈ చిత్రాన్ని తిలకించి కొన్ని కత్తిరింపులతో యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెల్సింది. దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన ఈ చిత్రానికి 26 కట్లను సెన్సార్ బోర్డు సూచించినట్లు ‘న్యూస్ 18’ ఛానెల్ వెల్లడించింది. జైపూర్ నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా సినిమాలోని కొన్ని సన్నివేశాలకు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెల్సింది. సెన్సార్ బోర్డు సభ్యుల సూచనలను పాటిస్తామని సినిమా నిర్మాతలు హామీ ఇచ్చినట్లయితేనే సినిమా విడుదలకు సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు చేస్తారు. సర్టిఫికేట్ ఇచ్చేముందు ప్యానెల్ మరోసారి సమావేశమై చర్చిస్తుందని సెన్సార్ బోర్డు వర్గాలు వెల్లడించగా, సినిమా నిర్మాతలు మీడియాతోని మాట్లాడేందుకు నిరాకరించారు. -
'పద్మావతి' రిలీజ్‌పై క్లారిటీ
వివాదాలు చుట్టుముట్టి వాయిదా పడిన సంజయ్ లీలా భన్సాలి చారిత్రక దృశ్యకావ్యం పద్మావతి విడుదలపై షాహిద్ కపూర్ క్లారిటీ ఇచ్చాడు. దీపికా పదుకోన్, రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్లు నటించిన పద్మావతి డిసెంబర్ 1న విడుదల కావాల్సి ఉన్నా నిరసనకారుల ఆందోళనల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఈ సినిమా ఎపుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. తాజాగా షాహిద్ కపూర్ ఈ విషయంపై స్పందించాడు. 'పద్మావతి కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుసు. ఈ సినిమా విడుదలపై డిసెంబర్ నెలాఖరులో తప్పకుండా క్లారిటీ వస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్రిస్తున్నాం' అని తెలిపారు. కాగా, పద్మావతి చిత్రంలో దీపిక రాణి పద్మావతిగా, రావల్ రతన్ సింగ్‌గా షాహిద్ కపూర్ పాత్రలు పోషించగా, అల్లావుద్దీ ఖిల్జీగా రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. -
బీజేపీ సీఎంలపై స్వామి అగ్నివేష్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చండీఘఢ్ : సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన చిత్రం ‘పద్మావతి’పై వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా కోవలోకి ప్రమఖ సామాజిక వేత్త స్వామి అగ్నివేష్ చేరారు. అయితే స్వామి అగ్నివేష్ పద్మావతి చిత్రానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. దేశంలో సినిమా, సమాచార ప్రసార సాధనాలు, సోషల్ మీడియాపై పరిమిలు విధించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం పద్మావతిపై జరగుతున్న వివాదాన్ని.. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే చూడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. పద్మావతి చిత్ర వివాదం.. నిషేధం, వివాదాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయని.. వీటికి గుజరాత్ ఎన్నికల దృష్టిలో చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని స్వామి అగ్నివేష్ చెప్పారు. ఇటేవంటి చర్యల వల్ల బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒకేచోటకు చేరే అవకాశం ఏర్పడుతుందని.. అందుకు ‘పద్మావతి’ చిత్రం సహకరించేలా ఉందని ఆయన చెప్పారు. పద్మావతి చిత్రాన్ని ఆయా రాష్ట్రాల్లో నిషేధించిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్తాన్ ముఖ్యంత్రి వసుంధర రాజే సింధియా, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు.. ముందు సినిమా చూడాలని ఆయన హితవు పలికారు. -
కల్పితం అన్నప్పుడు ఆ పేర్లే ఎందుకు వాడావ్?
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి చిక్కులు తప్పేలా కనిపించటం లేదు. పార్లమెంట్ పానెల్ ముందు సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి, దర్శకుడు భన్సాలీ హాజరై తమ వాదనలు వినిపించారు. చిత్రం కల్పితమని భన్సాలీ చెబుతున్నప్పటికీ.. చరిత్రకారులు చిత్రాన్ని చూసి క్లియరెన్స్ ఇస్తేనే తాము ముందుకు వెళ్తామని ప్రసూన్ జోషి స్పష్టం చేస్తున్నారు. దర్శకుడిగా సతీ ఆచారం చూపించటం.. సీబీఎఫ్సీ కంటే ముందే ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకే సినిమా చూపించటం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని పానెల్ సభ్యులు అడిగిన ప్రశ్నకు భన్సాలీ తటపటాయించినట్లు తెలుస్తోంది. ఇక పానెల్ ఎదుట భన్సాలీ, సెన్సార్ సభ్యులు, కమిటీ సభ్యుల మధ్య సంభాషణలు ఇలా ఉన్నాయి... చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు లేవని నిరూపించేందుకు తన దగ్గర వేరేదారి లేదని భన్సాలీ సమాధానం ఇవ్వగా.. అలాంటప్పుడు తమ ముందు ఎందుకు హాజరయ్యారంటూ పానెల్ సభ్యులు ఆయనకు చురకలంటిచారు. చిత్ర విడుదలలో జాప్యం మూలంగా తాను నష్టపోతున్నానని భన్సాలీ వివరణ ఇస్తుండగా.. ఎమోషనల్ అంశంతో వ్యాపారం చేయాలని చూస్తున్నారా? అంటూ సభ్యులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇంతలో జోక్యం చేసుకున్న సీబీఎఫ్సీ సభ్యులు... సినిమా పూర్తి కల్పితం అని చెబుతున్నప్పుడు.. అసలు పేర్లను ఉపయోగించాల్సిన అవసరం ఏంటని భన్సాలీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో కూడా ఆ విషయాన్ని తెలియజేయలేదని వాదించారు. అయితే అలాంటప్పుడు ట్రైలర్‌కు అనుమతి ఎలా ఇచ్చారని పానెల్ కమిటీ సభ్యుడు, సీనియర్‌నేత ఎల్ కే అద్వానీ సెన్సార్బోర్డును తిరిగి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చిత్ర విషయంలో తమకన్నా.. సెన్సార్‌బోర్డు కలగజేసుకోవటమే ఉత్తమమన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం. చివరకు రెండు గంటలపాటు ఇరుపక్షాల వాదనలు విన్న అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో కమిటీ నివేదికను త్వరలో కేంద్రానికి అందజేస్తామని ప్రకటించింది. ‘‘సినిమా అనేది వినోదాలకు అందించేందిగా ఉండాలే తప్ప.. వివాదాలకు కేంద్ర బిందువు కాకూడదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేది అసలు సినిమా ఎలా అవుతుంది?. ఇది చాలా సున్నితమైన అంశం అని ఠాకూర్ ఓ ప్రకటనలో తెలిపారు. -
‘పద్మావతి’తో మహిళల వ్యక్తిత్వం హతం
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ చిత్రంపై రాష్ట్రీయ స్వయక్ సేవక్ (ఆర్ఎస్ఎస్) అనుబంధ సంస్థ అఖిల భారతీయ ఇతిహాస్ సంకలన్ యోజన (ఏబీఐఎస్‌వై) అత్యంత తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ చిత్రం భారతీయ మహిళలను కించపరిచేలా ఉందని వ్యాఖ్యానించింది. అంతేకాక ఆత్మగౌరవానికి ప్రతీకలా నిలిచే భారతీయ మహిళల వ్యక్తిత్వాన్ని ఈ చిత్రం హత్యచేసేలా ఉందని ఏబీఐఎస్‌వై అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సినిమాలు తీసేవారు.. డబ్బును సంపాదించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఏబీఐఎస్‌వై వ్యాఖ్యానించింది. డబ్బు సముపార్జనలో చరిత్రను సైతం వక్రీకరించేందుకు ఏ మాత్రం వెనుకాడ్డంలేదని ఏబీఐఎస్‌వై జాతీయ ప్రధాన కార్యదర్శి బాలముకుంద్ పాండే పేర్కొన్నారు. భారతీయ, రాజపుత్రలు చరిత్రలో రాణీ పద్మావతికి అత్యంత గౌరవనీయ స్థానం ఉందని ఆయన చెప్పారు. ఈ చిత్రం ద్వారా రాణీ పద్మావతిని మాత్రమేకాక.. యావత్ భారతీయ మహిళలను కించపరిచారని ఆయన అన్నారు. భారతీయ మహిళల గౌరవాన్ని అధఃపాతాళానికి తొక్కొలా ఈ చిత్రం ఉందని బాలముకుంద్ పాండే తీవ్రంగా విమర్శించారు. ఈ చిత్రం విడుదలను తప్పకుండా అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. -
‘పద్మావతి’ ఆర్థిక సహకారంపై ఈడీ దర్యాప్తు!?
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ సీనియర్ లీడర్ సుబ్రమణ్యస్వామి మరోసారి బాలీవుడ్ చిత్రాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్రపరిశ్రమలో.. ప్రధానంగా ’బాంబే మూవీస్‘కు దుబాయ్నుంచే ఆర్థిక సహకారం అందుతోందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావతి’ కేంద్రంగా స్వామి విమర్శల జడివాన కురిపించారు. రాణీ పద్మావతి తన ఆదర్శ వ్యక్తిత్వం, ప్రాణత్యాగంతో ఎందరికో స్ఫూర్తి ప్రదాయకంగా నిలిచారు. అటువంటి రాణీ పద్మావతిని ఈ చిత్రంలో కేవలం ఒక నృత్య కళాకారిణిగా చూపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నరహంతకుడు, కర్కోటకుడు అయిన అల్లావుద్దీన్ ఖిల్జీని.. ఈ చిత్రంలో గొప్పవ్యక్తిగా చూపించడంపై ఆయన విమర్శించారు. పద్మావతి చిత్రం చుట్టూ అల్లుకున్న ఇటువంటి అనేక అనుమానాల వల్ల.. బాంబే చిత్రాలన్నింటికీ.. దుబాయ్ నుంచి ఆర్థిక సహకారం లభింస్తోందన్న నమ్మకం కలుగుతోందని చెప్పారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆర్థిక లావాదేవీలపై సుప్రీంకోర్టు పరిశీలన చేయాలని ఆయన చెప్పారు. బాలీవుడ్ చిత్రాలన్నీ.. భారతీయుల కొరకు, భారతీయుల కోసం నిర్మించాలని ఆయన అన్నారు. ఇదిలాఉండగా.. పద్మావతి చిత్రానికి దుబాయ్ కేంద్రంగా ఆర్థిక సహకారం ఉందన్న స్వామి వ్యాఖ్యలపై సీబీఎఫ్సీ సభ్యుడు అర్జున్ గుప్తా స్పందించారు. స్వామి వ్యాఖ్యలపై ఆయన ప్రధానమంత్రి మోదీకి లేఖ రాస్తూ.. పద్మావతి చిత్ర ఆర్థిక సహకారంలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో విచారణ జరిపించాలని ఆయన కోరారు. -
'పద్మావతి'కి మరో ఝలక్
పాట్నా: ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి సినిమా విడుదలపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేయడంతో ఊరట లభించిందని భావించిన పద్మావతి యూనిట్‌కు మరో రాష్ట్రం ఝలక్ ఇచ్చింది. ఆ మూవీ దర్శక, నిర్మాతలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను సైతం న్యాయస్థానం కొట్టివేసిన రోజే పద్మావతి ప్రదర్శనను అడ్డుకుంటూ బిహార్ రాష్ట్రం నిషేధం విధించింది. పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు ఇదివరకే పద్మావతి మూవీపై నిషేధం విధించగా.. ఈ చిత్రాన్ని బిహార్‌లోనూ ప్రదర్శించొద్దని సీఎం నితీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాణి పద్మావతికి సంబంధించిన అంశాలను తప్పుగా చిత్రీకరించారంటూ కర్ణిసేన గత కొన్నిరోజులుగా సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ ధర్నాలు, నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. రాజ్‌పుత్‌కు చెందిన కొన్ని వర్గాలు దీపికా పదుకొణె, దర్శకుడు భన్సాలీల తలలు తెస్తే రూ. 10 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్‌పుత్ వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ బబ్లూ లేఖ రాయడంతో సీఎం నితీశ్ సంబంధిత అధికారులకు ఈ ఆదేశాలు జారీచేశారు. పద్మావతి దర్శకుడు భన్సాలీ మూవీ వివాదంపై వివరణ ఇచ్చుకుని, వివాదం సద్దుమణిగేలా చేసే వరకు బిహార్‌లో మూవీపై నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు. మరోవైపు పద్మావతి మూవీ డిసెంబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. -
పద్మావతికి ఊరట.. వారిపై సుప్రీం ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్‌పుత్ వర్గీయుల వ్యతిరేకతతో తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న ‘పద్మావతి’ సినిమాకు ఊరట లభించింది. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ‘పద్మావతి’ సినిమా విడుదలపై సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ‘పద్మావతి’ సినిమాను తెరకెక్కించినందుకు దర్శక, నిర్మాతలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను సైతం న్యాయస్థానం కొట్టివేసింది. ఈమేరకు అర్థంలేని వ్యాజ్యం వేసినందుకు పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘పద్మావతి’ సినిమాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం సుప్రీంకోర్టు మందలించింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి.. సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) సర్టిఫై చేయకముందే ఒక సినిమాపై ఎలా వ్యాఖ్యలు చేస్తారని తప్పుబట్టింది. సినిమా విడుదల కాకముందే ఎలా తీర్పు చెప్తారని నేతలను సుప్రీంకోర్టు నిలదీసింది. ఇలా తీర్పు చెప్పడం వల్ల సీబీఎఫ్సీ బోర్డు నిర్ణయం ఇది ప్రభావం చూపే అవకాశముందని, ఈ విషయంలో నేతలు చట్టాలు, నిబంధనలకు కట్టుబడి వ్యవహరించాలని సూచించింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాను ఇప్పటికే మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు నిషేధించాయి. ఈ సినిమాపై ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. రాణి పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ’పద్మావతి’ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమాను నిషేధించాలంటూ జోరుగా రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్‌లు ఆరోపిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు భన్సాలీ, టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్‌లను చంపేస్తామని, వారి తలలు నరికితే.. నజరానాలు ఇస్తామని బెదిరింపులకు దిగారు. అయితే, తమ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని భన్సాలీ ఇప్పటికే ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్‌సింగ్‌గా షాహీద్ కపూర్, అల్లా వుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. -
‘పద్మావతి’కి షాకిచ్చిన గుజరాత్
అహ్మదాబాద్: ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రాణి పద్మావతి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రదర్శనను ఇప్పటికే మధ్యప్రదేశ్ నిషేధించగా.. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ సైతం ఇదే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో సినిమా విడుదలను నిషేధిస్తున్నట్టు గుజరాత్ సీఎం విజయ్ రుపానీ తెలిపారు. ’గుజరాత్లో పద్మావతి సినిమా విడుదల కావడానికి ప్రభుత్వం అనుమతించబోదు. ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఈ సినిమా వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్త అవకాశముంది. ఈ సినిమా వల్ల ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. పలు వర్గాలు ఈ సినిమా విడుదలను వ్యతిరేకిస్తున్నాయి’ అని రూపానీ విలేకరులతో అన్నారు. పద్మావతి’ సినిమా వివాదం దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుపుతున్న రాజ్‌పుత్‌లు.. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్‌లను చంపేస్తామని, వారి తలలు నరికితే.. నజరానాలు ఇస్తామని బెదిరింపులకు దిగుతున్న సంగతి తెలిసిందే. -
‘సినిమాను అడ్డుకుని అన్ని థియేటర్లు తగలబెట్టాలి’
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమాపై వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇదివరకే ఈ సినిమాను పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీని తీసిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, హీరోయిన్ దీపికా పదుకొనేల తలలు తెచ్చి ఇచ్చే వారికి రూ. 10 కోట్లు వీకెండ్ ఆఫర్ అంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత సూరజ్ పాల్ అము.. మరోసారి ఏకంగా ఫిల్మ్ ఇండస్ట్రీని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలోని యువత, సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు తలుచుకుంటే ప్రతి సినిమాను అడ్డుకుని థియేటర్లను తగలబెట్టగలరు. ప్రతి సినిమా అడ్డుకోవడానికి వారిలో ఆ సామర్థ్యం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ్ భారత్‌లో భాగంగా సినిమాలను సమూలంగా నాశనం చేయాలంటూ’ బీజేపీ నేత సూరజ్ పాల్ చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి సినిమాలను మరొకరు తీయవద్దని, లేదంటే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ వర్గీయులు ఆందోళన నిర్వహిస్తుండటంతో డిసెంబర్ 1న రావాల్సి ఉన్న ఈ సినిమా విడుదల తాత్కాలికంగా నిలిచిపోయింది. పద్మావతి విడుదలకు ముందే రాజ్‌పుత్ వర్గీయులతో పాటు కర్ణిసేన బృందానికి సినిమా ప్రివ్యూ చూపించి, వివాదాలకు కేంద్ర బిందువైన సీన్లను తొలగించాలని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి పలువురు కేంద్ర మంత్రులతో పాటు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచించారు. కాగా, మూవీని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ’పద్మావతి’ విడుదలపై తాము జోక్యం చేసుకోలేమని, అది పూర్తిగా సెన్సార్ బోర్డు పరిధిలోని అంశమని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
రాణి పద్మావతి ఎవరు?
అసలు పద్మావతి ఉందా? 1540లో ఉత్తరప్రదేశ్‌లోని అవధ్ ప్రాంతానికి చెందిన సూఫీ కవి మాలిక్ మహ్మద్ జాయసీ ‘పద్మావత్’ పేరుతో రాసిన కవితలో ఈ రాణి ప్రస్తావనుంది. మాలిక్ కథ ప్రకారం.. పద్మావతి సింహళ దేశ రాజకుమారి. అందాల రాశి. 13, 14 శతాబ్దాల మధ్య జన్మించింది. ఈమెను రాజస్తాన్‌లోని చితోడ్‌గఢ్ రాజు రతన్‌సేన్ పెళ్లాడతాడు. అల్లావుద్దీన్ ఖిల్జీతో సంబంధం ఏమిటి? నాటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోతుంటాడు. పద్మావతి సౌందర్యం గురించి విని చితోడ్‌గఢ్‌పై దండెత్తుతాడు. ఆ క్రమంలో జరిగిన యుద్ధంలో రతన్‌సేన్ మరణిస్తాడు. ఖిల్జీకి దక్కకుండా పద్మావతి ఆత్మార్పణ చేసుకుంటుంది. చరిత్ర ఏం చెబుతోంది? జాయసీ కథ నిజమా కాదా అన్న విషయంలో అనేక వాదనలున్నాయి. చాలామంది చరిత్రకారులు, ప్రొఫెసర్లు దీన్ని కొట్టిపడేస్తున్నారు. చరిత్ర ప్రకారం ఖిల్జీ చితోడ్‌గఢ్‌పై దండెత్తి రతన్ సేన్‌ను 1303లో ఓడించాడు. 1316లో చనిపోయాడు. ఆ కాలంలో పద్మావతి పేరుతో రాణి ఎవరూ లేరన్నది వారి వాదన. అల్లావుద్దీన్ మరణించిన 224 ఏళ్ల తర్వాత జాయసీ కవితలో పద్మావతి గురించి రాశాడు. మరి దేన్ని నమ్మాలి..? దీనిపై చరిత్రకారులు, మేధావుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. అసలు పద్మావతిపై మనసు పడింది అల్లావుద్దీన్ ఖిల్జీ కాదని, మాల్వాకు చెందిన జియాసుద్దీన్ ఖిల్జీ అని కొందరు చెబుతారు. 14వ శతాబ్దానికి చెందిన హమిరా మహాదేవ చరిత్రపై నయన్చంద్ర సూరి అనే కవి రాసిన కథే.. జాయసీ ‘పద్మావతి కథ’కు ప్రేరణ అని చెబుతారు. ఈకథ నిజమా? కల్పితమా? ఇలాంటి కథే లేదని, అంతా కల్పితమనేవారూ ఉన్నారు. కానీ రాజ్‌పుత్‌లు మాత్రం నిజమని నమ్ముతారు. ముస్లిం చక్రవర్తికి లొంగకుండా ప్రాణార్పణ చేసుకున్న గొప్ప రాణిగా చిత్రీకరించేందుకే పద్మావతి పాత్రను తెరపైకి తెచ్చారని, మతాల రంగు అద్దారని ఇంకొందరి వాదన. ఇది కల్పనా? నిజమా? అన్నది అంతుచిక్కనిది. జాయసీ చెప్పిన కథేంటి? ఉత్తరప్రదేశ్‌లోని అవధ్ ప్రాంతానికి చెందిన సూఫీ సంత్ మాలిక్ మహ్మద్ జాయసీ 1540లో ‘పద్మావత్’ పేరుతో కథ రాశారు. ఆ స్టోరీ ప్రకారం.. పద్మావతి సింహళ రాకుమారి. ఆమెకు హీరామన్ అనే మాట్లాడే చిలుక ఉండేది. ఆమె ఎప్పుడూ ఆ చిలుకతోనే ఉండటం పద్మావతి తండ్రికి నచ్చదు. ఆ చిలుకను చంపాలని ఆదేశిస్తాడు. కానీ అది తప్పించుకుపోతుంది. చివరికి అది చితోడ్‌గఢ్ రాజు రతన్‌సేన్ చేతిలో పడుతుంది. అక్కడ ఆ చిలుక పద్మావతి అందం గురించి చెబుతుంటుంది. ఓ రోజు రతన్ భార్య రాణి నాగమతి ‘ మా ఇద్దరిలో (నాగమతి, పద్మావతి) ఎవరు మంచి అందగత్తో చెప్పు..’ అని అడగుతుంది. పద్మావతేనని చిలుక చెప్పగా.. ఆమెను పెళ్లాడాలనే కోరిక రతన్సేన్లో కలుగుతుంది. పద్మావతి కోసం సింహళదేశానికి వెళ్తాడు. ఎన్నో కష్టాలు పడి చివరికి ఆమెను పెళ్లాడతాడు. తన రాజ్యానికి తెస్తాడు. తర్వాత కొద్దికాలానికి ఓ మోసానికి సంబంధించి రాఘవ్ చేతన్ అనే బ్రాహ్మణ పండితుడిని రతన్‌సేన్ రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. రాజుపై కక్షతో అతడు దిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీని కలిసి.. పద్మావతి సౌందర్యం గురించి చెబుతాడు. తర్వాత అల్లావుద్దీన్ చితోడ్ను ముట్టడించి.. పద్మావతిని అప్పగించాలని కోరతాడు. అందుకు రతన్‌సేన్ నిరాకరిస్తాడు. ఫలితంగా జరిగిన పోరులో రతన్ మరణిస్తాడు. ఈ విషయం తెలిసి నాగమతి, పద్మావతి ఆత్మార్పణం చేసుకున్నారు. సమరంలో గెలిచిన అల్లావుద్దీన్ ఖిల్జీ... కోటలోకి ప్రవేశించగా పద్మావతి చితాభస్మం కనిపిస్తుంది. భన్సాలీ, దీపికా తల నరికితే 10 కోట్లు న్యూఢిల్లీ/భరేలీ: పద్మావతి సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నటి దీపికా పదుకునేల తల నరికిన వారికి రూ. 10 కోట్ల బహుమతి ఇస్తానని హరియాణా బీజేపీ చీఫ్ మీడియా కో–ఆర్డినేటర్ సూరజ్‌పాల్ అమూ వ్యాఖ్యానించారు. రణ్‌వీర్‌సింగ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే కాళ్లు విరగ్గొడతానన్నారు. సినిమాపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు. పద్మావతి సినిమాపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు పెరిగాయి. ఉత్తర ప్రదేశ్‌లోని భరేలీలో అఖిల భారతీయ క్షత్రియ మహాసభ(ఏబీకేఎం) కార్యకర్తలు.. దీపికా పదుకునే, భన్సాలీల 100కు పైగా దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. సినిమా విడుదలను నిషేధించాలని జిలా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. దీపికను çసజీవంగా తగులబెట్టిన వారికి రూ. కోటి బహుమతి ఇస్తామని ఏబీకేఎం యూత్ నాయకుడు భువనేశ్వర్ సింగ్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ‘సజీవంగా దహనమైతే ఎలా ఉంటుందో దీపికా తెలుసుకోవాలి. రాణి చేసిన త్యాగం దీపిక ఎన్నటికీ తెలుసుకోలేదు’ అని వ్యాఖ్యానించారు. ప్రారంభం నుంచే గొడవలు ఈ ఏడాది ప్రారంభంలో దర్శకుడు భన్సాలీ పద్మావతి సినిమా నిర్మాణాన్ని ప్రారంభించినప్పటి నుంచీ వివాదం కొనసాగుతోంది. జైపూర్‌లో సినిమా చిత్రీకరణ సమయంలో రాజ్‌పూత్ కర్ణి సేన భన్సాలీపై దాడి చేయడంతో పాటు సినిమా సెట్‌ను ధ్వంసం చేసింది. కొల్హాపూర్లోను సినిమా యూనిట్‌పై కర్ణి సేన దాడిచేసింది. భన్సాలీ,∙దీపికకు బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్‌లో సినిమా మొదటి పోస్టర్ విడుదల కాగానే రాజపూత్ గ్రూపులతో పాటు, మరికొన్ని వర్గాలు.. చరిత్రను భన్సాలీ వక్రీకరించారని ఆరోపిస్తూ మళ్లీ ఆందోళనలు మొదలుపెట్టారు. గతవారం రాజస్తాన్ కోటాలో సినిమా టీజర్‌ను ప్రదర్శించిన థియేటర్‌పై కూడా దాడికి పాల్పడ్డారు. కాగా సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా పూర్తికాకముందే ఈ సినిమా చూసేందుకు వివిధ మీడియా చానల్స్‌ను అనుమతించడాన్ని సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి శనివారం తప్పుపట్టిన సంగతి తెలిసిందే. యూపీ సర్కారు షాక్ పద్మావతి సినిమాలోని వివాదాస్పద సన్నివేశాల్ని తొలగిస్తే తప్ప ఉత్తరప్రదేశ్‌లో సినిమాను విడుదల కానివ్వమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వినోదపు పన్ను శాఖ మంత్రి కేశవ్ ప్రసాద మౌర్య మాట్లాడుతూ.. ‘ఇస్లామిక్ చొరబాటుదారులు దేశంలో ఎంతో విధ్వంసం సృష్టించారు. తన అభిమానాన్ని కాపాడుకునేందుకు ఒక రాణి తనను తాను సజీవంగా దహనం చేసుకుంది’ అని అన్నారు. -
భన్సాలీ తలకు పది కోట్లు.. దీపిక విస్మయం!
సాక్షి, ముంబై: చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమాపై వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ వర్గీయులు ఆందోళన నిర్వహిస్తుండటంతో డిసెంబర్ 1న రావాల్సి ఉన్న ఈ సినిమా విడుదల ఆగిపోయింది. మరోవైపు ‘పద్మావతి’ సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా భన్సాలీ తలకు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ వెలగట్టింది. భన్సాలీ తలను నరికి తెచ్చిస్తే రూ. 10 కోట్లు ఇస్తామంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్య చేసింది. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్ ఆందోళనలపై మరోసారి స్పందించింది. ‘పద్మావతి’ సినిమాను వివాదాస్పదం చేయడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. సినిమాలో ఎక్కడా అభ్యంతరకర సన్నివేశాల్లేవని ఆమె స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకముందని, కచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. -
‘పద్మావతిపై గర్వంగా ఉంది’
దేశవ్యాప్తంగా అత్యంత తీవ్రస్థాయిలో వివాదాలు రేపుతున్న సంజయ్‌లీలా భన్సాలీ చిత్రం ‘పద్మావతి’పై దీపికా పదుకునే స్పందించారు. ఈ చిత్రం కోసం తన జీవితంలో అత్యంత విలువైన రెండేళ్ల కాలాన్ని కేటాయించానని దీపిక అన్నారు. పద్మావతి చిత్రంపై జరుగుతులన్న అల్లర్లు, వివాదాలు, గొడవల ఆమె తీవ్రంగా ఖండించారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని అమె చెప్పారు. ఒక చిత్రంపై ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. భారత న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకముందని చెప్పిన దీపిక.. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన ముక్కు కోస్తామనే హెచ్చరికలు, చంపితే రూ. 5కోట్లు ఇస్తామన్న మాటలను దీపిక కొట్టిపారేశారు. పద్మావతి చిత్రంలో నటించినందుకు చాలా గర్వపడుతున్నట్లు దీపిక స్పష్టం చేశారు. -
కష్టాల్లో ‘పద్మావతి’!
మన చలనచిత్రాలనూ, డాక్యుమెంటరీలనూ చూసి అవి ఆమోదయోగ్యమో కాదో తేల్చడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఉంది. అది గీసే సవాలక్ష ‘లక్ష్మణరేఖల’పైనా, కత్తిరింపులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్న తరు ణంలో ఆ పనుల్ని అంతకంటే మూర్ఖంగా, మొరటుగా చేయడానికి దేశంలో ఎక్కడి కక్కడ మూకలు పుట్టుకొస్తున్నాయి. సినిమాల్లో కథలెలా ఉండాలో, సంభాషణలెలా సాగాలో, పాటల్లో ఏం పదాలుండాలో ఇవి నిర్ణయిస్తున్నాయి. వాటిని అమలు చేస్తారా చస్తారా అని బెదిరింపులకు దిగుతున్నాయి. ‘పద్మావతి’ చిత్రం ఇప్పుడు అలాంటి మూకల బారిన పడింది. సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా పేరు ప్రఖ్యా తులున్న సంజయ్‌లీలా భన్సాలీ నిర్మించిన ‘పద్మావతి’కి షూటింగ్ మొదలైనప్పటి నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వేసిన సెట్లోకి చొరబడి ఆ సెట్‌నూ, విలువైన పరికరాలనూ ధ్వంసం చేయడంతోపాటు భన్సాలీపై దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత షూటింగ్‌ను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు మార్చు కుంటే అక్కడ సైతం సెట్‌కు నిప్పు పెట్టారు. షూటింగ్ ప్రారంభించడానికి చాలా ముందే నిరుడు నవంబర్లోనే భన్సాలీ తన సినిమా ఇతివృత్తం గురించి వచ్చిన కథనాల తర్వాత ఏర్పడ్డ అపోహలను తొలగించడానికి ప్రయత్నించారు. పద్మావతి పాత్రను కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రకూ, ఆ పాత్రకూ మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలూ ఉండబోవని ఆయన వివరించాడు. చిత్రం పేరు సైతం ముందనుకున్నట్టు ‘రాణి పద్మిని’ అనికాక ‘పద్మా వతి’ అని మార్చాడు. కానీ నిరసనలకు దిగేవారికి ఇదంతా పట్టలేదు. వారి బాణీలో బెదిరింపులు, హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే ముక్కు కోస్తామని ఒకరు... భన్సాలీ, దీపికల తలలు తెచ్చిస్తే రూ. 5 కోట్ల బహు మతి ఇస్తామని మరొకరు రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారు. కావాలంటే క్షత్రి యుల శౌర్యపరాక్రమాలు చూపుతూ సినిమాలు తీసుకోమని సలహాలిస్తున్నారు. వచ్చే నెల 1న చిత్రం విడుదల చేయాలని సన్నాహాలు చేసుకుంటుంటే దాన్ని అడ్డు కోవడానికి ఈ బృందాలు సర్వవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇంత వివాదానికి కారణమైన చిత్రం ఇతివృత్తానికి ఆధారం చరిత్రలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని ఆధారం చేసుకుని పుట్టుకొచ్చిన కాల్పనిక గాథేనని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. 1250లో బెంగాల్‌లోని బీర్భూం జిల్లాలో పుట్టి 1316లో మరణించిన ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ రాజస్థాన్‌లోని చిత్తోర్ రాజ్యంపై దండెత్తడం, దాని పాలకుడు రాణా రతన్‌సింగ్ ఓటమిపాలవడం, రాజ్యం ఖిల్జీ వశం కావడం చరిత్ర. కాలగర్భంలో కలిసిపోయిన ఆ చరిత్రకు జవ జీవాలు పోసిందీ... దాని చుట్టూ కమనీయమైన కాల్పనికతను అల్లి మహత్తర కావ్యంగా తీర్చిదిద్దిందీ మాలిక్ మహమ్మద్ జయాసి అనే ఒక ముస్లిం సూఫీ కవి. 1540లో... అంటే యుద్ధం జరిగిన 224 ఏళ్లకు ఆయన ఈ కావ్య రచనకు ఉప క్రమించాడు. మొదటిసారిగా అందులో రాణా రతన్‌సింగ్ భార్య పద్మావతి ప్రస్తా వన వచ్చింది. అంతకుముందు లిఖిత, అలిఖిత చరిత్రలో ఎక్కడా పద్మావతికి సంబంధించిన ఆధారాలు లేవు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవి అమీర్‌ఖుస్రో చిత్తోర్ కోట ముట్టడి గురించిన రాసిన పత్రాల్లో ఎక్కడా పద్మావతి గురించిన ప్రస్తావన లేదు. రాజస్థాన్ నుంచి బెంగాల్ వరకూ దాదాపు అయిదువందల సంవత్సరాల వ్యవధిలో మాలిక్ కావ్యానికి ఉర్దూ, పర్షియన్ భాషల్లో అనేక అనువాదాలొచ్చాయి. అనువదించే కవుల సృజనాత్మక శక్తి మేరకు ఆ కావ్యంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదేమీ కొత్తగాదు. రామాయణ గాథ ఎన్ని దేశాల్లో ఎన్నెన్ని విధా లుగా ఉన్నదో... అందులోని పాత్రలు, వాటి మధ్య సంబంధాలు ఎలా మార్పు చెందాయో వివరిస్తూ సుప్రసిద్ధ కవి ఆరుద్ర ‘రాముడికి సీత ఏమవుతుంది?’ పేరుతో చాన్నాళ్లక్రితం పుస్తకం రాశారు. ఇప్పుడు ‘పద్మావతి’ సినిమాపై నిప్పులు చెరుగుతున్న సంఘ్ పరివార్ పెద్దలు, రాజ్పుట్ కులానికి చెందిన కర్ణి సేన సభ్యులు పద్మావతి సృష్టికర్త ఒక ముస్లిం సూఫీ కవి అన్న సంగతిని మరుస్తున్నారు. రాజస్థాన్ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మంత్రులు చేసిన ప్రకటనల సంగతలా ఉంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ సైతం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. తమ రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినే అవకాశం ఉన్నందున చిత్రం విడుదలను వాయిదా వేయాలని యోగి కేంద్రాన్ని కోరు తున్నారు. గడ్కరి అయితే సినిమాలు నిర్మించేవారు స్వేచ్ఛ నిరపేక్షమైనదేమీ కాదని, దానికి కూడా హద్దులుంటాయని తెలుసుకోవాలని హితవు చెబుతున్నారు. అకారణంగా నోరు పారేసుకోవడానికి, బెదిరింపులకు దిగడానికి ఎలాంటి హద్దులూ ఉండవు కాబోలు! ‘పద్మావతి’పై ఇంత పెద్దయెత్తున వివాదం చెల రేగుతున్న వేళ సుప్రీంకోర్టు వేరే కేసులో చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిర్మించిన ‘యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మాన్’ పేరిట నిర్మించిన డాక్యుమెంటరీ విడుదల కాకుండా స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేస్తూ ఏ రకమైన సృజనాత్మక వ్యక్తీకరణలకైనా అడ్డుతగిలే ప్రయత్నం చేయరాదని సుప్రీంకోర్టు కింది కోర్టులకు సూచించింది. భావప్రకటనా స్వేచ్ఛ అత్యంత పవిత్రమైనదని, ఆ హక్కులో ఆషామాషీ జోక్యం తగదని పిటిష నర్కు స్పష్టం చేసింది. చట్టపరిధిలో ఏ కళాకారుడైనా తనకు నచ్చిన రూపంలో తన భావాలను వ్యక్తపరచవచ్చునని తెలిపింది. సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టులు ఇంత స్పష్టంగా చెప్పడం ఇది మొదటిసారేమీ కాదు. అయినా వీధుల్లో ఛోటా నేతల వీరంగం ఆగడం లేదు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న నాయకులకు జ్ఞానోద యమూ కలగటం లేదు. ఇప్పుడు ‘పద్మావతి’ విషయంలో కేంద్రం స్పందన ఎలా ఉంటుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. విజ్ఞతతో వ్యవహరించి ఈ అనవసర వివాదానికి ముగింపు పలకాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పాలకులు గ్రహించాలి. -
‘హీరోయిన్ను చంపితే రూ.5 కోట్లు ఇస్తాం’
సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ’పద్మావతి‘ చిత్రం విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ వివాదాలు, విమర్శలు తీవ్రమవుతున్నయి. పద్మావతి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన దీపికా పదుకునే ముక్కు కోస్తామని కొందరు అంటుంటే.. ఆమెను చంపితే రూ. 5 కోట్లు ఇస్తామని మరో సంస్థ ప్రకటించింది. పద్మావతి చిత్రంపై ఎవరూ ఊహించని స్థాయిలో కర్ణిసేన ప్రతిస్పందిస్తోంది. సినిమా విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని సంస్థ తేల్చి చెప్పింది. సంజయ్‌లీలా భన్సాలీ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని కర్ణిసేన ఆరోపించింది. సినిమా విడుదల ఆపకపోతే దీపిక ముక్కు కత్తిరిస్తామని కర్ణిసేన బహిరంగంగా ప్రకటించింది. థియేటర్లను ధ్వంసం చేస్తామని స్పష్టం చేసింది. మరికొందరు మాత్రం దీపికను చంపితే రూ. 5 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఆదిత్యనాథ్ లేఖ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న పద్మావతి చిత్రాన్ని నిలపాలని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ చిత్రం విడుదలను ఆపకపోతే.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని ఆదిత్యనాథ్ కేంద్రానికి తెలిపారు. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని సెన్సార్ బోర్డు వ్యహరించాలని యూపీ ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉండగా.. పద్మావతి చిత్ర వివాదంపై జోక్యం చేసుకోలేమని కేంద్రం స్పష్టం చేసింది. అదే సమయంలో శాంతి భద్రతల విషయాన్ని రాష్ట్రాలే చూసుకోవాలని కేంద్రం తెలిపింది. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకి, నాయిక దీపికా పదుకునేకు తగినంత భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీపికకు ఉమాభారతి అండ పద్మావతి చిత్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై కేంద్ర మంత్రి ఉమాభారతి మండిపడ్డారు. భన్సాలీ హిందువుల ఆత్మస్థైర్యాన్ని రాజపుత్రుల సెంటిమెంట్లను అవమానిస్తున్నారని అన్నారు. అదే సమయంలో దీపికపై వస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోలేం : సుప్రీం కోర్టు పద్మావతి చిత్రంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టిస్టులకు తమ అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా.. సినిమా పరిశ్రమను భయపెట్టడం, బెదిరించడం, దాడులకు పాల్పడడం కల్చరల్ టెర్రరిజం కిందకు వస్తుందని ఐఎఫ్‌టీడీ అధ్యక్షుడు అశోక్ పండిట్ వ్యాఖ్యానించారు. 4. The director and his associate as the scriptwriter of #Padmavati are responsible for its story. They should have taken care of the sentiments and the historical facts. — Uma Bharti (@umasribharti) November 16, 2017 -
డిసెంబర్ 1న భారత్ బంద్.. పద్మావతి విడుదల అయ్యేనా!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ.. ఈ సినిమా వివాదం మరింత ముదురుతోంది. ఈ సినిమాకు వత్యిరేకంగా రాజ్‌పుత్ వర్గీయుల ఆధ్వర్యంలోని కర్ణిసేన ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. డిసెంబర్ 1న పద్మావతి సినిమా విడుదల కావాల్సి ఉండగా.. సినిమా విడుదలకు వ్యతిరేకంగా 'భారత్ బంద్'కు కర్ణిసేన పిలుపునిచ్చింది. ఈ సినిమాను విడుదలను ఆపాల్సిందేనని, ఒకవేళ సినిమాను విడుదల చేస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవని కర్ణిసేనకు చెందిన లోకేంద్ర సింగ్ కల్వి హెచ్చరించారు. ఒకవేళ 'పద్మావతి' సినిమా విడుదలైతే.. నిరసన జ్వాలలతో దేశం తగలబడుతుందని, దీనిని అడ్డుకుంటే అడ్డుకోండి అని ఆయన సవాల్ విసిరారు. మరోవైపు బెంగళూరులో సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది. రాణి పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ’పద్మావతి’ సినిమాను వివాదాలు విడిచిపెట్టడం లేదు. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమాను నిషేధించాలంటూ జోరుగా రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకుండా నిషేధించాలంటూ హర్యానా మంత్రి విపుల్ గోయెల్ ఇప్పటికే కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మరోవైపు జోరుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్‌సింగ్‌గా షాహీద్ కపూర్, అల్లా వుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్‌లు ఆరోపిస్తున్నారు. అయితే, తమ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇప్పటికే ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. -
‘పద్మావతి’ రిలీజ్‌ను ఏదీ ఆపలేదు : దీపిక
డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న పద్మావతి సినిమాపై ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పద్మావతి, అల్లావుద్ధీన్ ఖిల్జీ మధ్య చరిత్రను వక్రీకరిస్తూ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని పలు రాజ్‌పుత్ సంఘాలు ఈ చిత్రయూనిట్‌పై ఆరోపణలు చేస్తున్నాయి. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ.., అలాంటి సన్నివేశాలేవి లేవని, చరిత్రను ఏమాత్రం వక్రీకరించలేదని చెపుతున్నా నిరసనలు మాత్రం సద్దుమనగటం లేదు. తాజాగా ఈ వివాదంపై పద్మావతి పాత్రలోనటించిన దీపిక పదుకొణే స్పందించారు. ‘ఒక స్త్రీగా ఈ సినిమాలో భాగమైనందుకు, ఈ చరిత్రను చెప్పే అవకాశం వచ్చినందుకు నేను గర్వపడుతున్నా. మేము కేవలం సెన్సార్‌బోర్డ్‌కు మాత్రమే సమాధానం చెప్పుకోవాలి.. అంతేకాదు ఏదీ పద్మావతి సినిమా రిలీజ్ ను అడ్డుకోలేదని నేను నమ్ముతున్నా’ నన్నారు. గతంలో ఇదే వివాదం పై స్పందించిన హీరో షాహిద్ కపూర్, తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని.. సినిమా చూసిన తరువాత తమకు అభ్యంతరాలు ఉంటే తెలపాలిగానీ ముందుగానే ఊహగానాలతో సినిమాను అడ్డుకోవటం సరికాదని విజ్ఞప్తి చేశారు. -
'పద్మావతి' సినిమాను నిషేధించండి!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాను వివాదాలు విడిచిపెట్టడం లేదు. రాణి పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమాను నిషేధించాలంటూ జోరుగా రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల కాకుండా నిషేధించాలంటూ ఏకంగా బీజేపీ ఎంపీ ఒకరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. చరిత్రను వక్రీకరించి.. రాజ్‌పుత్‌లో మనోభావాలు దెబ్బతీసేవిధంగా తెరకెక్కిన 'పద్మావతి' సినిమాను నిషేధించాలంటూ హర్యానా మంత్రి విపుల్ గోయెల్ కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మరోవైపు జోరుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కర్ణిసేన ఆధ్వర్యంలో ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన సభలో దాదాపు లక్ష మంది రాజ్‌పుత్ వర్గీయులు హాజరయ్యారు. పద్మావతిని నిలిపివేయాలంటూ వేలాది మంది సూరత్ లోనూ ఆందోళనలు నిర్వహించారు. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్‌సింగ్‌గా షాహీద్ కపూర్, అల్లా వుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్‌లు ఆరోపిస్తున్నారు. ‘చారిత్రక అంశాల్లోని వాస్తవాల ఆధారంగానే భన్సాలీ చిత్రం తీస్తే..తొలుత ఇచ్చిన మాట ప్రకారం మాకు సినిమాను చూపించడానికి ఎందుకు జంకుతున్నారు? ఈ సినిమాలో రాణి పద్మిని, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ప్రేమ గీతం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. పద్మావతి విడుదలైతే.. రాజపుత్రులు ఏం చేయగలరో చూపిస్తాం’ అని కర్ణిసేనకు చెందిన వీరేంద్రసిన్హ్ భాటి హెచ్చరించారు. ఈ చిత్రంపై నిషేధం విధించకుంటే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తీవ్ర పర్యావసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు: భన్సాలీ ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇప్పటికే ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. 'ఎంతో నిజాయితీతో, బాధ్యతతో, అకుంఠిత దీక్షతో ఈ సినిమాను తెరకెక్కించాను. రాణి పద్మావతి కథ నాలో ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. ఆమె వీరోచిత పోరాటం, త్యాగానికి ఘననివాళిగా ఈ చిత్రాన్ని రూపొందించాను. కొన్ని వందతుల వల్ల ఈ సినిమాపై వివాదం తలెత్తింది’ అని భన్సాలీ పేర్కొన్నారు. ’రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య డ్రీమ్‌సీక్వెన్స్ సినిమాలో ఉన్నట్టు వచ్చిన వదంతులను నేను ఇప్పటికే ఖండించాను. వారిద్దరి మధ్య అలాంటి సన్నివేశాలు ఉండవని రాతపూర్వకంగా హామీ ఇచ్చాను. ఈ వీడియో ద్వారా నేను మరోసారి స్పష్టం చేస్తున్నా.. ఎవరి మనోభావాలు దెబ్బతీసేవిధంగా రాణి పద్మావతి, ఖిల్జీ మధ్య సన్నివేశాలు ఉండబోవు’ అని భన్సాలీ తెలిపారు. -
‘పద్మావతి’ని ఆపాల్సిందే!?
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందించిన ’పద్మావతి‘ చిత్ర వివాదాలు అనూహ్య మలుపులు తిరిగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో చరిత్రలను వక్రీకరించారని ఉదయ్‌పూర్ మేవార్ రాజవంశస్థులు ఆరోపిస్తున్నారు. తమ రాజపుత్రలు చరిత్రలను వక్రీకరించిన.. ఈ చిత్ర విడుదలను నిలిపివేయాలంటూ.. ప్రధాని నరేంద్ర మోదీకి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఛైర్మన్ ప్రసూన్ జోషికి మేవార్ రాజవంశస్థుడు ఎంకే విశ్వరాజ్ సింగ్ లేఖ రాశారు. వారితో పాటు సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీ, మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియాలకు కూడా లేఖ రాశారు. పద్మావతి చిత్రంలో రాజపుత్రలు చరిత్రను పూర్తిగా వక్రీకరించారని విశ్వరాజ్ సింగ్ ఆరోపించారు. హిందువుల చరిత్రను, భారతదేశ చరిత్రను కాపాడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందని సింగ్లేఖలో పేర్కొన్నారు. రాణీ పద్మావతి చరిత్రకు గురించి పరిశోధనలు చేసి చిత్రాన్ని రూపొందించానన్న భన్సాలీ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాణీ పద్మావతి గురించి భన్సాలీ.. నన్ను కానీ, మా రాజపుత్రులను కానీ సంప్రదించలేదని సింగ్ స్పష్టం చేశారు. చరిత్రను వక్రీకరించే ఇటువంటి చిత్రాలతో దేశానికి ప్రమాదమని ఆయన తెలిపారు. -
భన్సాలీ రాయని డైరీ
డిసెంబర్ 1కి ‘పద్మావతి’ రిలీజ్ పెట్టుకున్నాం. డిసెంబర్ 9కి, 14కి బీజేపీ గుజరాత్ ఎన్నికల్ని పెట్టుకుంది. అవి అయ్యేవరకు ‘పద్మావతి’ రిలీజ్ అయ్యేలా లేదు! ‘మా డేటు మాది, మీ డేట్లు మీవి. మా సినిమా మాది. మీ ఎన్నికలు మీవి’ అని మా వాళ్లు అంటే.. ఆ పార్టీ వాళ్లకు కోపం వచ్చింది! ‘‘సినిమాల్లో మీవీ మావీ అని ఉంటాయి కానీ, ఎన్నికలు ప్రతి భారతీయ పౌరుడివి. గుజరాత్లో ఎన్నికలు జరుగుతుంటే, మహారాష్ట్ర వాళ్లు అవి మావి కాదు అనుకోవడం దేశద్రోహం’’ అన్నాడు గుప్తా. ‘‘ఎవరు సార్ ఈ గుప్తా?’’ అన్నాడు మా ప్రొడక్షన్ మేనేజర్. ‘‘నాకూ తెలీదు’’ అన్నాను. ‘‘ఎక్కడ ఎన్నికలు జరిగినా అవి ప్రతి భారతీయుడివీ అన్నాడంటే’’ తప్పకుండా అతను బీజేపీ లీడరే అయి ఉంటాడు సార్’’ అన్నాడు. మా మేనేజర్ లాజిక్ నాకు నచ్చింది. ఆ గుప్తా అనే ఆయన ఆల్రెడీ సెంటర్‌కి లెటర్ కూడా పెట్టేశాడు.. ‘రాజ్‌నాథ్‌జీ.. ఆ పద్మావతి సంగతేంటో చూడండి’ అని! పద్మావతిని చూస్తే సంగతేంటో తెలుస్తుంది కానీ, పద్మావతిని చూడనివ్వకుండా చేస్తే సంగతేంటో తెలుస్తుందా! తలకు గుడ్డ చుట్టుకున్న వాళ్లెవరో కొన్నాళ్లుగా మా ఇంటికి వస్తున్నారు. సినిమా రిలీజ్ చెయ్యడానికి వీల్లేదని చెప్పి వెళ్తున్నారు. ‘‘మీరు రాజ్పుట్లా?’’ అని అడిగాను. ‘‘కాదు భారతీయులం’’ అన్నారు! ‘‘ఇదీ భారతీయుల సినిమానే కదా’’ అన్నాను. ‘‘కాదు, నువ్వు తీసింది రాజ్పుట్ల సినిమా’’ అన్నారు! వచ్చినవాళ్లెవరో నాకు అర్థమైంది. పిక్చర్లో రాణీ పద్మావతి ఉంటుంది. ఆమె భర్త రతన్‌సింగ్ ఉంటాడు. వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఉంటుంది. రాజులు, రాణుల కథలో రాజూ రాణీ ఇద్దరే ఉంటారా! వాళ్లదొక్క రాజ్యమే ఉంటుందా! ‘పద్మావతి’లో అల్లాఉద్దీన్ ఖిల్జీ కూడా ఉంటాడు. అతడి భార్య ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య మౌనం ఉంటుంది. ఖిల్జీ తన భార్యతో ఎప్పుడూ మౌనంగా ఉంటాడు కాబట్టి, రాణీ పద్మావతితో ఎప్పుడైనా ప్రేమలో పడతాడేమోనని వీళ్ల భయం. ఎప్పుడూ ప్రేమలో మునిగి ఉండే పద్మావతి.. ఖిల్జీ మౌనాన్ని ఇష్టపడుతుందేమోనని ఇంకో భయం. ‘‘అలాంటిదేమీ లేదు. ఊరికే.. రాణిగారి నగలు, రాజుగారి కత్తులు చూపించి ఇంటికి పంపించేస్తాను’’ అని చెప్పినా నమ్మట్లేదు మా ఇంటికి వస్తున్న భారతీయులు. ‘‘వాళ్లిద్దర్నే చూపిస్తున్నప్పుడు మధ్యలో ఆ ఖిల్జీ ఎందుకు?’’ అన్నారు. ‘‘చిన్న ఫైట్ సీను పెట్టుకున్నాను’’ అని చెప్పాను. ‘‘ఒక రాజు ఇంకో రాజుతో ఫైట్ చెయ్యడం ఆ రాజు భార్య కోసమే కదా’’ అన్నారు!! ‘‘నమ్మండి. మీక్కావలసినవేమీ ఇందులో లేవు’’ అన్నాను. - మాధవ్ శింగరాజు -
అసలు ‘పద్మావతి’ లో ఏముందో తేలుస్తాం
రాజస్థాన్: వివాదాలతో నిత్యం వార్తల్లో నలుగుతున్న పద్మావతి మూవీపై రాజస్థాన్ ప్రభుత్వం కమిటీని నియమించనుంది. సంజయ్‌లీలా భన్సాలి నిర్మించిన పద్మావతి చిత్రంపై మొదటి నుంచి వివాదాలు ముసురుకున్నాయి. దీంతో వివాదాల నేపధ్యంలో సినిమాపై కమిటీ వేయాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే నిర్ణయం తీసుకున్నారు. రాజ్పుట్లు, ఇతర సంఘాలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి. దర్శకుడు భన్సాలీ చరిత్రను వక్రీకరించారంటూ దీనిపై నిషేధం విధించాలని డిమాండ్లు కూడా చేస్తున్నాయి. దీంతో కమిటీ నియమించాలని.. ఆ విషయంపై అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం మంత్రి గులాబ్‌చంద్ కటారియా తెలిపారు. కమిటీ పద్మావతి సినిమాను చూస్తుందని, మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు చిత్రంలో ఉన్నాయో లేదో చూస్తామని తెలిపారు. ఆ తర్వాత చిత్ర దర్శక నిర్మాతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కమిటీ చరిత్రకారులతో ఉండే అవకాశం ఉందన్నారు. కాగా పద్మావతి మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. -
ఎంతో కష్టపడి తీశాను.. ఆ రూమర్స్ నమ్మకండి!
-
ఎంతో కష్టపడి తీశాను.. ఆ రూమర్స్ నమ్మకండి!
తన తాజా సినిమా ’పద్మావతి’పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని ఆయన భరోసా ఇచ్చారు. ’ ఎంతో నిజాయితీతో, బాధ్యతతో, అకుంఠిత దీక్షతో ఈ సినిమాను తెరకెక్కించాను. రాణి పద్మావతి కథ నాలో ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. ఆమె వీరోచిత పోరాటం, త్యాగానికి ఘననివాళిగా ఈ చిత్రాన్ని రూపొందించాను. కొన్ని వందతుల వల్ల ఈ సినిమాపై వివాదం తలెత్తింది’ అని భన్సాలీ పేర్కొన్నారు. ’రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య డ్రీమ్‌సీక్వెన్స్ సినిమాలో ఉన్నట్టు వచ్చిన వదంతులను నేను ఇప్పటికే ఖండించాను. వారిద్దరి మధ్య అలాంటి సన్నివేశాలు ఉండవని రాతపూర్వకంగా హామీ ఇచ్చాను. ఈ వీడియో ద్వారా నేను మరోసారి స్పష్టం చేస్తున్నా.. ఎవరి మనోభావాలు దెబ్బతీసేవిధంగా రాణి పద్మావతి, ఖిల్జీ మధ్య సన్నివేశాలు ఉండబోవు’ అని భన్సాలీ తెలిపారు. ఈ మేరకు పద్మావతి సినిమా అధికారిక ట్విట్టర్ పేజీలో ఆయన ఒక వీడియోను పోస్టు చేశారు. రాణి పద్మావతి చరిత్రను వక్రీకరించేలా భన్సాలీ ఈ సినిమా తీశారంటూ రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సైతం ఈ సినిమాకు వ్యతిరేకంగా గొంతెత్తుతోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ)కి లేఖ రాయాలని బీజేపీ భావిస్తున్న సంగతి తెలిసిందే. క్షత్రియ సామాజికవర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమా ఉందని ఆరోపణలు వస్తున్నాయని, రాణి పద్మావతికి, దురాక్రమణకు దిగిన సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీకి మధ్య లింక్స్ ఉన్నట్టు ఈ సినిమాలో చరిత్ర వక్రీకరించారని ఆరోపణలు వినిపిస్తుండటంతో వివాదం ముదురుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలతోపాటు రాజ్‌పుత్ వర్గంవారు ఈ సినిమాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
కత్తి గురూ!
దీపికా పదుకోన్ ఎలాగుంటారు? కత్తిలా... అందంలోనూ, అభినయంలోనూ! ఎన్ని గుండెల్లో దిగిందో... కత్తిలాంటి ఆమె అందం, అభినయం! అటువంటి కత్తి చేతికి కత్తి ఇచ్చారు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఆయన తీసిన ‘గోలియోంకి రాసలీలా రామ్‌లీలా’లో... బొమ్మ సూపర్‌హిట్! మళ్లీ దీపికతో యుద్ధాలు, కత్తులు... ‘రామ్‌లీలా’ వంటి బొమ్మే (‘పద్మావతి’) తీశారు భన్సాలీ. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ బొమ్మ గురించి బోల్డంత రచ్చ జరుగుతోంది! ఈ రచ్చ సంగతి పక్కన పెడితే, ‘కత్తిలాంటి దీపిక చేత్తో కత్తి పట్టుకుంటే... బొమ్మ సూపర్‌హిట్టే’ అని ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానికి ఐడియా వచ్చినట్టుంది! ఆలస్యం చేయకుండా... ఆయన క్యాలెండర్ కోసం ఇలా ఫొటోషూట్ చేశారు. కత్తిలా ఉంది కదూ! -
‘మీరు భార్యలను మార్చుకుంటారా?!’
ఇండోర్ : బాలీవుడ్ చిత్రం పద్మావతి విడుదలకు ముందే వివాదాలకు దారి తీస్తోంది. తాజాగా ఈ చిత్రంపై ఉజ్జయిని బీజేపీ ఎంపీ చింతమని మణివీయ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కథాంశాలన్ని ఇష్టారీతిగా మారుస్తున్న బాలీవుడ్ దర్శకులు.. తమ భార్యలను కూడా ఇలాగే మార్చుకుంటారా? అంటూ అత్యంత తీవ్ర పదజాలంతో ఆయన విమర్శలకు దిగారు. నాకు ఇప్పటికీ ‘జుహార్’ అంటే అర్థం తెలియడం లేదని ఆయన చెప్పారు. పద్మావతి చిత్రాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సినిమా పరిభాషలోనే మాట్లాడాలంటే.. ఒకరి భార్య.. మరొకరితో సినిమాకు వెళితో ఎంత దారుణంగా ఉంటుందో.. జుహార్కు అర్థం వెతకడం అంతే దారుణంగా ఉంటుందని ఆయన చెప్పారు. మా చరిత్రను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తే.. వారికి చేతులతోనే సమాధానం చెబుతామని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. -
ఆ సినిమా ప్రదర్శిస్తే ధియేటర్లు తగలబెడతాం
హైదరాబాద్: చరిత్రను వక్రీకరించి ‘పద్మావతి’ సినిమా తీశారని బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ లోథ మండిపడ్డారు. ఈ సినిమాను ప్రదర్శిస్తే ధియేటర్లు తగలబెడతామని హెచ్చరించారు. రాజ్‌పుత్‌ల గౌరవానికి ఎవరు భంగం కలిగించినా సహించబోమన్నారు. సికింద్రాబాద్‌లో మంగళవారం జరిగిన రాజస్థాన్ రాజ్‌పుత్ సమాజ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మహ్మద్ ప్రవక్త, జౌరంగజేబుపై సినిమా తీయాలని సంజయ్‌లీలా భన్సాలీకి సవాల్ విసురుతున్నా. ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నార’ని ధ్వజమెత్తారు. ఈ సినిమాను బహిష్కరించడమే కాకుండా విడుదల కాకుండా అడ్డుకోవాలని హిందూధర్మ పరిరక్షకులకు పిలుపునిచ్చారు. భాగ్యనగరం పరిధిలో ‘పద్మావతి’ సినిమాను అడ్డుకుని అరెస్టైన వారి తరపున తాను బాధ్యత తీసుకుంటానని, బెయిల్ ఇప్పిస్తానని ఆయన హామీయిచ్చారు. దేశసంస్కృతిని భ్రష్టు పట్టించే కుట్రలో భాగంగానే ఈ సినిమా తీశారని ఆరోపించారు. దేశ ప్రతిష్ఠ, హిందూ మతం, హిందూ సమాజం గౌరవాన్ని కాపాడుకునేందుకు యువత పోరాడాలన్నారు. ‘పద్మావతి’ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
భన్సాలీ ‘పద్మావతి’కి భారీ షాక్!
బాలీవుడ్ సినీ ప్రేమికులు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ’పద్మావతి’... ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే రాణి పద్మావతి చరిత్రను వక్రీకరించేలా సినిమా తీశారంటూ రాజ్‌పుత్‌లు చిత్రయూనిట్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ సైతం ఈ సినిమాకు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ)కి లేఖ రాసేందుకు సిద్ధమవుతోంది. భన్సాలీ తెరకెక్కించిన ఈ చారిత్రక సినిమా విడుదలను వాయిదా వేయాలని కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ అధికారి ప్రతినిధి ఐకే జడ్డేజా తెలిపారు. క్షత్రియ సామాజికవర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమా ఉందని ఆరోపణలు వస్తున్నాయని, రాణి పద్మావతికి, దురాక్రమణకు దిగిన సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీకి మధ్య లింక్స్ ఉన్నట్టు ఈ సినిమాలో చరిత్ర వక్రీకరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఈ వివాదం పరిష్కారం అయ్యేవరకు సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఎన్నికల సంఘాన్ని, సెన్సార్ బోర్డును కోరనున్నామని ఆయన చెప్పారు. భన్సాలీ కళాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌కు ఇప్పటికే విశేషమైన ఆదరణ లభించింది. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. -
పద్మావతి మూవీ స్టిల్స్
-
’పద్మావతి’ ట్రైలర్ వచ్చేసింది..
అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ చిత్రం ’పద్మావతి’ . చారిత్రక నేపథ్యంతో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ’పద్మావతి’గా దీపికా పదుకోన్ నటిస్తుండగా.. ఆమె భర్త, చిత్తోర్‌గఢ్ రాజ రతన్ సింగ్‌గా షాహిద్ కపూర్, విలన్ సుల్తాన్ అల్లావుద్దీ ఖిల్జీగా రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ట్రైలర్ సోమవారం మధ్యాహ్నం సరిగ్గా.. 13.03 గంటలకు విడుదల చేశారు. భన్సాలీ మార్క్ గ్రాండ్ విజువలైజేషన్.. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఆనాటి రాచరిక వైభవానికి ప్రతిరూపంగా సినిమా మలిచినట్టు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఈ ట్రైలర్లో ఖిల్జీగా రణ్వీర్ సింగ్ భయానక రౌద్రరూపంతో ఆకట్టుకోగా.. అతనితో వీరోచితంగా పోరాడే పాత్రల్లో షాహిద్, దీపిక అభినయం ట్రైలర్లో చూడొచ్చు. ఈ సినిమా ట్రైలర్‌ను సరిగ్గా 13.03 గంటలకు విడుదల చేయడం వెనుక ఒక కారణముంది. చారిత్రకంగా సరిగ్గా 1303లోనే చిత్తోర్‌గఢ్‌పై అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర విజయవంతమైంది. గుహిలాసింగ్ రత్నసింహా (లేదా రతన్‌సింగ్) ఆధ్వర్యంలో రాజ్‌పుత్ సేనతో ఎనిమిది నెలలు యుద్ధంచేసిన ఖిల్జీ.. చివరకు 1303లో ఈ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకసున్నాడు. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగా 13.03 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. -
ఫస్ట్ లుక్ కే మూడున్నర కోట్లు..?
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాణమే కాదు ఆ సినిమాను ప్రమోట్ చేయటం కూడా చాలా ముఖ్యం. అందుకే నిర్మాతలు నిర్మాణ ఖర్చులతో పాటు ప్రచార కార్యక్రమాలకు కూడా ప్రత్యేకం గా బడ్జెట్ కేటాయిస్తున్నారు. అయితే భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో ఈ ఖర్చు మరింత భారీగా ఉంటోంది. తాజాగా అలాంటి వార్త ఒకటి బాలీవుడ్ సర్కిల్స్ లో ప్రముఖం వినిపిస్తోంది. శరన్నవరాత్రుల తొలి రోజు, బాలీవుడ్ ప్రస్టీజీయస్ ఫిలిం పద్మావతి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీపికా పదుకొనే పద్మావతి గా నటించిన ఈ సినిమాలో ఆమె లుక్ తో పాటు టైటిల్ లోగోను కూడా ఈ పోస్టర్ లో రివీల్ చేశారు. అయితే లుక్ ను ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ చేసేందుకు చిత్రయూనిట్ భారీగానే ఖర్చుపెట్టిందట. వెబ్ మీడియా ప్రమోషన్ తో పాటు ప్రింట్ మీడియాలో యాడ్స్ కోసం మూడున్నన కోట్లు కేటాయించిందన్న టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పద్మావతి సినిమా ప్రమోషన్ కోసం కూడా అదే స్థాయిలో ఖర్చు చేస్తున్నారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ ప్రమోషన్ కే కోట్లల్లో ఖర్చు చేశారంటే ముందు ముందు పద్మావతి ప్రమోషన్ కోసం నిర్మాతలు ఏ స్థాయిలో ఖర్చుపెడతారో చూడాలి. -
రాణి పద్మావతి ఫస్ట్‌లుక్!
ప్రఖ్యాత దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన మరో చారిత్రక సినిమా 'రాణి పద్మావతి'. మేవాడ రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో టైటిల్ రోల్లో దీపికా పదుకొనే నటించింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను గురువారం ఉదయం విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో రాణిపద్మావతిగా దీపికా పదుకొనే అదరగొట్టింది. రాజస్థానీ రాచరిక ఆహార్యంతో.. రాజసం, ధీరత్వం, దృఢనిశ్చయం గల రాణిగా దీపిక ఈ ఫస్ట్‌లుక్‌లో ఆకట్టుకుంటోంది. బన్సాలీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ సినిమా చుట్టూ పలు వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. రాజ్‌పుత్ వంశానికి చెందిన పద్మావతిని తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ కొన్ని గ్రూపులు షూటింగ్ జరుగుతున్నప్పుడు సినిమా యూనిట్‌పై దాడి చేశాయి. ఎన్ని వివాదాలు ఎదురైనా వెనుకకు తగ్గని బన్సాలీ తాను అనుకున్న రీతిలో సినిమాను తెరకెక్కించారు. దుర్గానవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా దీపికా పదుకొనే 'రాణి పద్మావతి' ఫస్ట్‌లుక్ ఫొటోలను తన ట్విట్టర్ పేజీలో పోస్టుచేశారు. ఈ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్వీర్ సింగ్ నటిస్తుండగా.. పద్మావతి భర్త రాజా రతన్‌సింగ్‌గా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. #Padmavati @FilmPadmavati pic.twitter.com/MenI9N7qFz — Deepika Padukone (@deepikapadukone) September 21, 2017 देवी स्थापना के शुभ अवसर पर मिलिए रानी पद्मावती से #Padmavati @FilmPadmavati pic.twitter.com/hYJonZCEEH — Deepika Padukone (@deepikapadukone) September 21, 2017 -
బాలీవుడ్లో నాని సినిమా..!
నాని , ఆది, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ నిన్నుకోరి. డి.వి.వి దానయ్య , కోన వెంకట్ సంయుక్తగా నిర్మించిన ఈ సినిమా జులై 07 తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు ప్రేక్షకునలు ఆకట్టుకున్న ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్నాలీ నిన్ను కోరి సినిమాను రీమేక్ చేయ్యాలని డిసైడ్ అయ్యాడట. అయితే కథ మీద ఉన్న నమ్మకంతో తెలుగులో నిర్మించిన డివివి దానయ్య, కోన వెంకట్ లు బాలీవుడ్ చిత్రానికి కూడా భాగస్వాములుగా ఉంటామని చెప్పారు. అందుకు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఓకె చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. యంగ్ హీరో వరుణ్ ధావన్ అయిన నాని పాత్రకు సూట్ అవుతాడని సంజయ్ భావిస్తున్నాడు. అయితే ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. -
నగలు... కష్టాలు!
రాణి పద్మిని జీవితం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పద్మావతి’. ఈ చిత్రం షూటింగ్‌కి ఇప్పటికే పలు ఆటంకాలు ఎదురయ్యాయి. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సినిమాని ఆపివేయాలని కొందరు వివాదం రేపారు. ఆ తర్వాత ఈ చిత్రం లొకేషన్లో ఓ ప్రమాదం జరిగింది. ఇప్పుడు టైటిల్ రోల్ చేస్తోన్న దీపికా పదుకొనె కారణంగా షూటింగ్‌కి ఆటంకం ఏర్పడింది. మహరాణి పాత్ర కాబట్టి బరువైన ఆభరణాలు ధరిస్తున్నారు దీపిక. సుకుమారి శరీరం ఈ నగలను మోయలేకపోతోందట. నగలు మాత్రమే కాదు.. ఈ చిత్రం కోసం ఆమె ధరిస్తున్న కాస్ట్యూమ్స్ బరువు కూడా ఎక్కువేనట. ఈ భారం మోయలేక దీపిక నానా అవస్థలు పడుతున్నారని సమాచారం. దీపిక మెడ దగ్గర నొప్పి మొదలైందని వినికిడి. భరించలేనంత నొప్పి కావడంతో షూటింగ్లో పాల్గొనలేకపోయారట. దాంతో సంజయ్ లీలా భన్సాలీ దగ్గర అనుమతి తీసుకుని, రెస్ట్ తీసుకుంటున్నారని బాలీవుడ్ టాక్. -
అంకితభావం అదుర్స్
‘‘అబ్బబ్బబ్బా.. మేడమ్ చాలా సిన్సియర్. ఏమి డెడికేషన్... ఆ అంకితభావం అదుర్స్’’ అంటూ దీపికా పదుకొనేని ‘పద్మావతి’ యూనిట్ తెగ పొగిడేస్తోంది. అంతలా దీపికా పదుకొనే ఏం చేశారంటే... సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనె టైటిల్ రోల్ చేస్తోన్న చిత్రం ‘పద్మావతి’. రాణి పద్మిని జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ పాత్ర కోసం దీపిక బాగానే కసరత్తులు చేస్తున్నారట. రాణి పద్మిని పాత్రలో ఒదిగిపోవడానికి చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదువుతున్నారట. ఎక్కడికెళ్లినా దీపిక బ్యాగులో హిస్టరీ బుక్స్ ఉండాల్సిందేనట. షూటింగ్ షాట్ గ్యాప్‌లో, ప్రయాణాల్లో ఆ పుస్తకాలతో బిజీగా ఉంటున్నారని చిత్రబృందం అంటోంది. ఈ సినిమా తప్ప మరో ధ్యాస లేదన్నట్లుగా దీపికా వ్యవహరిస్తున్నారని, ఆమె అంకితభావం చూస్తే ముచ్చటేస్తోందని కూడా ‘పద్మావతి’ బృందం ఈ బ్యూటీని కొనియాడుతోంది. ఈ సినిమాకి దీపిక ఎంతగా డెడికేట్ అయ్యారనేదానికి మరో నిదర్శనం కూడా ఉంది. ఈ షూటింగ్‌కి సెలవు పెట్టడం ఇష్టంలేక ప్రతిష్టాత్మక ‘కాన్స్ చలన చిత్రోత్సవాల’ను సైతం వదులుకున్నారట. నాలుగైదేళ్లుగా దీపిక ఓ సౌందర్య సాధనాన్ని ప్రమోట్ చేయడం కోసం అక్కడికెళుతున్నారు. ‘పద్మావతి’ షూటింగ్ కారణంగా ఈసారి వెళ్లడంలేదని దీపిక తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అప్పటివరకూ వేరే సినిమాలు అంగీకరించకూడదని దీపిక నిర్ణయించుకున్నారట. దాన్నిబట్టే ఈ సినిమాని ఎంతగా ప్రేమించి చేస్తున్నారో ఊహించుకోవచ్చు. -
టాప్ డైరెక్టర్ దిష్టిబొమ్మ దహనం!
-
టాప్ డైరెక్టర్ దిష్టిబొమ్మ దహనం!
ముంబై: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం 'పద్మావతి' విషయంలో ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పటికే ఆందోళనకారులు జైపూర్‌లో 'పద్మావతి' షూటింగ్‌పై దాడి చేసి.. దర్శకుడిని కొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మహారాష్ట్ర కొల్హాపూర్‌లో 'పద్మావతి' చిత్రం కోసం భారీస్థాయిలో వేసిన సెట్టింగ్స్‌ను తగలబెట్టారు. జైపూర్‌లో భన్సాలీపై దాడి చేసిన రాజ్‌పుత్‌లకు చెందిన కర్ణిసేన తాజాగా శనివారం రాత్రి ముంబై సమీపంలోని నల్లసోపరా వద్ద ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా కర్ణిసేన కార్యకర్తలు దర్శకుడు భన్సాలీ దిష్టిబొమ్మను తగలబెట్టారు. దర్శకుడికి, పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్‌పుత్ రాకుమారి అయిన 'పద్మావతి' జీవితకథను వక్రీకరించి సినిమాగా తెరకెక్కిస్తున్నారని ఆరోపిస్తూ కర్ణిసేన భన్సాలీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. -
మంటలు చల్లారడం లేదు!
ఏ ముహూర్తాన ‘రాణీ పద్మావతి’ సినిమాని ప్రారంభించారో గానీ... ఎక్కడికక్కడ ఏవో చిక్కులు తప్పడం లేదు. చిత్రీకరణ సజావుగా సాగడం లేదు. పద్మావతిపై చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారేట్లు కనిపించడం లేదు. పద్మావతి చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ... జైపూర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై కొందరు దాడి చేశారు. అప్పుడు హిందీ ప్రముఖులందరూ ముక్త కంఠంతో సంజయ్‌పై దాడిని ఖండించారు. ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ మంటలు చల్లారకముందే ‘రాణీ పద్మావతి’ సెట్లో మరో ఘటన చోటు చేసుకుంది. ఈసారి కొల్హాపూర్‌లోని షూటింగ్ సెట్లో చొరబడిన కొందరు వ్యక్తులు కాస్ట్యూమ్స్‌ను తగలబెట్టేశారు. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో సెట్లో మంటలు చెలరేగే వరకూ ఎవరూ గమనించలేదట! అదృష్టవశాత్తూ... ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు. కానీ, జూనియర్ ఆర్టిస్టుల కాస్ట్యూమ్స్ మాత్రం పూర్తిగా నాశనమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో పద్మావతిగా నటిస్తున్న దీపికా పదుకొనే గానీ... హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్‌లు గానీ సెట్లో లేరు. ఈ ఘటనపై భన్సాలీ ప్రొడక్షన్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమా పూర్తయ్యేలోపు ఇంకెన్ని ఘటనలు చోటు చేసుకుంటాయో! -
పద్మావతి చిత్ర యూనిట్‌పై మరోసారి దాడి
-
పద్మావతి చిత్ర యూనిట్‌పై మరోసారి దాడి
దీపిక పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న పద్మావతి సినిమా యూనిట్ పై మరోసారి దాడి జరిగింది. ప్రస్తుతం కొల్హాపూర్ పరిసర ప్రాంతాల్లో వేసిన సెట్ లో పద్మావతి చిత్ర షూటింగ్ జరుగుతోంది. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో కొంత మంది వ్యక్తులు దాడి చేసి సెట్ ను తగలబెట్టారు. అదే సమయంలో లొకేషన్ లోఉన్న వాహనాలు ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. అయితే ఈ దాడి అర్ధరాత్రి సమయంలో జరగటంతో యూనిట్ సభ్యులెవరు అక్కడ లేరు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. గతంలో జైపూర్‌లో షూటింగ్ జరుపుకుంటుండగా ఈ చిత్రయూనిట్‌పై రాజ్‌పుత్ కర్నిసేన సభ్యులు దాడి చేశారు. పద్మావతి చరిత్రను వక్రీకరించారంటూ డైరెక్టర్‌తో పాటు యూనిట్ సభ్యులపై దాడికి దిగారు. దీంతో ఆ ప్రాంతాల్లో షూటింగ్ అర్ధాంతరంగా ముగించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం జరిగిన దాడికి కారకులెవరన్న విషయం ఇంత వరకు తెలియరాలేదు. ఈ సంఘటనపై స్పందించిన మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కార్ యూనిట్ సభ్యులు కంప్లైయిట్ ఇస్తే రాత్రి సమయం కూడా సెక్యూరిటీ ఇస్తామని తెలిపారు. -
రాణి పద్మిని వాడిన చారిత్రక అద్దాలు బద్దలు
చిత్తోర్‌గఢ్: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా ఆయన చిత్ర బృందంపై దాడి చేసిన కర్నిసేనా అనే గ్రూపు తిరిగి మరోసారి దాడికి పాల్పడింది. రాజస్థాన్‌లోని 13వ శతాబ్దానికి చెందిన కోటలో నాటి రాణి పద్మిని ఉపయోగించిన అద్దాలను ధ్వంసం చేసింది. పద్మిని ప్యాలెస్‌లో ఉన్న రెండు పెద్ద చారిత్రక అద్దాలను పూర్తిగా ధ్వంసం చేసింది. అంతేకాదు, స్వయంగా ఆ దాడిని తామే చేశామని ప్రకటించుకోవడమే కాకుండా ఆ అద్దాలను పూర్తి తొలగించాలని తాము పాలన వర్గాన్ని డిమాండ్ చేస్తున్నామని, వాటి ద్వారా తమ ప్రముఖ రాణి చరిత్రను హీనంగా చెబుతున్నారని మండిపడ్డారు. పద్మిని మహల్‌లోని గతంలో పద్మిని ఉన్న గదిలో రెండు పెద్ద అద్దాలు ఎదురెదురుగా ఉన్నాయి. తన భర్త రాణా రతన్ సింగ్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాక ఆ అద్దాల్లోనే అందాల రాణి పద్మినిని నాటి ముస్లిం పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకి చూపించారని అక్కడికి వచ్చిన పర్యాటకులకు టూరిస్టు గైడ్లు చెబుతుంటారు. గొప్ప చరిత్ర కలిగిన తమ వారసురాలిని ఇలాంటి కట్టుకథలతో తప్పుబడుతున్నారని, అందుకు ఈ అద్దాలను ఉపయోగించుకుంటున్నారని, ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని పగులగొట్టినట్లు దాడికి పాల్పడినవారు చెబుతున్నారు. ఇదే గ్రూపు గతంలో సంజయ్ లీలా బన్సాలీపై ఆయన చిత్ర బృందంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
పద్మావతి ఎవరు..?
-
పద్మావతి ఎవరు..?
న్యూఢిల్లీ: ‘పద్మావతి’ బాలివుడ్ సినిమా షూటింగ్ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై రాజ్‌పుత్ కర్ణి సేన కార్యకర్తలు దాడి జరపడంపై నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వారెందుకు దాడి చేశారు? అసలు పద్మావతి ఎవరు? ఆమెపై బన్సాలీ తీస్తున్న సినిమా ఏమిటీ? అది చారిత్రక సినిమానా, చరిత్రను వక్రీకరించే సినిమానా? అసలు వివాదం ఏమిటీ? నిజానికి సమస్త చరిత్రలు సైతం వివాదాస్పదమే. చరిత్రలో నిలిచిపోయేటివి ఎక్కువగా విజేతలు రాసిన లేదా రాయించిన చరిత్రలవడమే అందుకు కారణం. రాజ్‌పుత్ రాజకుటుంబానికి చెందిన ‘పద్మావతి’ క్యారెక్టర్ కేవలం కల్పిత గాధనేది మెజారిటీ చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తు శకం 13–14 శతాబ్దానికి చెందిన శక్తివంతమైన ముస్లిం రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ, చిత్తార్ నేటి చిత్తార్‌గఢ్ రాజు రావల్ రతన్ సింగ్ భార్య పద్మావతి అందచందాల గురించి కథకథలుగా విని ఆమెను మోహిస్తారు. ఆమెను పెళ్లి చేసుకోవడం కోసమే 1303లో చిత్తార్‌గఢ్ రాజ్యంపై దాడి చేసి రాజ్యాన్ని కైవసం చేసుకుంటారు. తన భర్తతో సహా తన రాజకుటుంబీకులు మరణించారన్న వార్త తెలిసి, తోటి అంత:పుర స్త్రీలతో కలసి రాణి పద్మావతి సామూహిక ఆత్మాహుతికి (నాడు సతి, జవహర్‌గా వ్యవహరించేవారు) పాల్పడుతుంది. పద్మావతి తెల్సిందిలా... ఈ కథ ముహమ్మద్ జయసీ 1540లో రాసిన కవిత్వం ద్వారా మొదటి సారి ప్రపంచానికి తెల్సింది. ఆ తర్వాత ఆమె గీతా చిత్రాలు కూడా వెలువడ్డాయి. రమ్య శ్రీనివాస్ రాసిన ‘ది మెనీ లైవ్స్ ఆఫ్ రాజ్‌పుత్ క్వీన్: హిరాయిక్ పార్ట్స్ ఆఫ్ ఇండియా’ అన్న పుస్తకంలో కూడా పద్మావతి గురించి కొంత ప్రస్తావన ఉంటుంది. అయితే పద్మావతి కథ నిజమైనదనడానికి చారిత్రక ఆధారాలేవి దొరకలేదు. ఖిల్జీ లాంటి ముస్లిం రాజును దిక్కరించిన ధీరవనితగా ఆమె కథ మాత్రం ప్రచారంలో ఉంది. రాజ్‌పుత్‌లు బయటి కులాల వారికి పిల్లనివ్వరు, తెచ్చుకోరు. ఆ కుల కట్టుబాటుకు కట్టుబడే పద్మావతి సామూహిక ఆత్మాహుతికి పాల్పడిందన్నది రాజ్‌పుత్‌ల విశ్వాసం. తెగింపు, ధైర్య సాహసాలకు రాజ్‌పుత్‌లు మారుపేరని ‘అమర్ చిత్ర కథలు’ కూడా తెలియజేస్తాయి. అయినా మొగల్ రాజులకు లొంగారు... కాలమాన పరిణామాల్లో రాజ్‌పుత్‌లు కూడా మొగల్స్ రాజులకు లొంగిపోవాల్సి వచ్చింది. అక్బర్ నుంచి ఫారుక్సియర్, అంటే మధ్య 16వ శతాబ్దం నుంచి 18 శతాబ్దం వరకు వారు ఆడ పిల్లలను మొగల్ రాజులకు ఇచ్చారు. వారిచేత మామలు, బావలు అని పిలిపించుకున్నారు. మొగల్ చక్రవర్తులకు వియ్యంకులవడం ద్వారా తమ రాజ్యాలను రక్షించుకోవడమే కాకుండా ఇతర రాజులు తమమై దాడులు జరపకుండా కొంత కాలం నివారించుకోకలిగారు. చరిత్ర గమనంలో రాజ్‌పుత్‌లు టర్కీలు, మొగల్స్ రాజులే కాకుండా మరాఠీలు, పిండారీలు చేతుల్లో కూడా ఓడిపోయారు. ఎలాంటి యుద్ధం చేయకుండానే బ్రిటీష్ పాలకులకు లొంగిపోయారు. అయితే ముస్లింల రాజులకు లొంగకుంగా నిలబడింది తామేనని వారు చెప్పుకుంటారు. పద్మావతంటే బన్సాలీకి ఎంతో ఇష్టం.... సంజయ్ లీలా బన్సాలీకి పద్మావతి కథంటే చచ్చేంత ఇష్టం. అందుకే ఆయన 2008లో పారిస్‌లోని ‘డూ చాట్లెట్’ థియేటర్లో ప్రదర్శించిన ఒపేరాకు దర్శకత్వం వహించారు. పద్మావతిపై 1923లో ప్రెంచ్ కంపోజర్ ఆల్బర్ట్ రసెల్ రూపొందిచన ఒపెరాను బన్సాలీ దర్శకత్వం వహించి తనదైన శైలిలో ప్రదర్శించారు. 2002లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్లో బన్సాలీ తీసిన ‘దేవదాస్’ చిత్రాన్ని చూసి ముగ్ధుడైన పారిస్ ఒపేరా థియేటర్ యజమాని జీన్ లక్ చాప్లిన్ ఆహ్వానం మేరకు బన్సాలీ తొలిసారిగా ఒపేరాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. కరీనా కపూర్‌తో తీయాలకున్న బన్సాలీ... స్థానిక నటీనటులతో పారిస్‌లో ప్రదర్శించిన పద్మావతి ఒపేరాకు మంచి పేరు రావడంతో నాడే హిందీలో పద్మావతి సినిమాను తీయాలనుకున్నారు బన్సాలీ. కరీనా కపూర్‌ను పద్మావతిగా పరిచయం చేయాలనుకున్నారు. గుజారిష్ లాంటి చారిత్రక సినిమాలు బాక్సాఫీసు వద్ద పల్టీకట్టడంతో సినిమాను వాయిదా వేసుకున్నారు. బాజీరావు మస్తాని, గోలియోంకి రాస్లీలా–రామ్‌లీలా సినిమాలు హిట్టవడంతో పద్మావతిని కూడా తెరపైకి ఎక్కించాలనుకున్నారు. చిత్ర నిర్మాణాన్ని ముగించి వచ్చే నవంబర్ 17వ తేదీన విడుదల చేయాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే పద్మావతిపై చిత్రాలు... పద్మావతిపై జస్వంత్ జావరి 1961లో జై చితోడ్ను, మహారాణి పద్మావతి సినిమాను 1964లో తీసి విడుదల చేశారు. పద్మావతిపై మొహమ్మద్ జయసీ రాసిన కవిత్వాన్నే జై చితోడ్లో పాటలుగా ఉపయోగించారు. తొలి చిత్రంలో పద్మావతిగా నిరుపమా రాయ్ నటించగా, తర్వాత చిత్రంలో అనితా గుహ నటించారు. పద్మావతిగా వైజయంతిమాల, ఖిల్జీగా శివాజీ గణేష్ నటించిన ‘చిత్తోర్ రాణి పద్మిణి’ అనే తమిళ చిత్రం 1963లో విడుదలైంది. దీనికి చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించారు. అంతకుముందు 2009లో ‘చిత్తోడ్కీ రాణి పద్మినీ కా జోహుర్’ పేరుతో సోనీ టీవీలో సీరియల్ కూడా వచ్చింది. తమిళ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫెయిల్‌కాగా, జస్వంత్ జావరి దర్శకత్వం వహించిన మహారాణి పద్మావతి సక్సెస్ అయింది. అప్పుడు ప్రభుత్వం సహకరించింది... జస్వంత్ జావరి తీసిన ‘మహారాణి పద్మావతి’ చిత్రానికి నాడు రాజస్థాన్ ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. రాజ్‌పుత్‌ల ధైర్య సాహసాలను, తెగింపుకు ఆ సినిమా అద్దం పట్టిదంటూ రాజ్‌పుత్‌లు కూడా సినిమాను ఎంతో ఆదరించారు. మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ‘జోద్ అక్బర్’లో కూడా చరిత్రను వక్రీకరించారని, పద్మావతిలో కూడా బన్సాలీ చరిత్రను వక్రీకరిస్తారన్నది రాజ్‌పుత్‌ల అనుమానం. అందుబాటులోవున్న చరిత్ర ప్రకారం పద్మావతి, ఖిల్జీలు ఒకరినొకరు చూసుకోరు. మహారాణి పద్మావతి సినిమాలో మాత్రం చివరలో పద్మావతిని చూసి ఆమె అందానికి ఖిల్జీ మరింత ముగ్ధుడవుతారు. ఇలాంటి కథల మధ్య ఖిల్జీలు, పద్మావతి కలలో కలసుకొని పాటలు పాడుకున్నట్లు బన్సీలీ సినిమా తీస్తున్నారన్నది రాజ్‌పుత్‌ల అనుమానం. అందుకే దాడి చేశారు. అసలు బాధ వేరేనేమో..... ఖిల్జీ, పద్మావతి మధ్య ఎలాంటి డ్రీమ్ సీక్వెన్సీలు లేవంటూ బన్సాలీ బహిరంగంగా ప్రకటించారు. పైగా తాను తీస్తున్నది విషాదాంత చిత్రం కాదని, రాజ్‌పుత్‌లకు చెందిన ఓ ధీరవనిత మనోధైర్యాన్ని స్ఫూర్తిగా చూపిస్తున్నానని చెప్పారు. ‘నేను చనిపోయేంత పిరికిదాన్ని కాదు. నేను శత్రువలకు చిక్కకుండా మంటల్లోకి నడిచిపోయే మరింత ధైర్యం కావాలి. రాజ్‌పుత్‌ల పరువు, ప్రతిష్టలు చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోవాలి’ అంటూ పద్మావతి అగ్నికి ఆహుతవుతూ చెప్పేమాటలను కూడా కొన్నేళ్ల క్రితమే ఒపేరా ప్రదర్శన సందర్భంలో బన్సాలీ వినిపించడం ఆయన స్ఫూర్తిని తెలియజేస్తోంది. చరిత్రలో పద్మావతి ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఆమెపై చిత్రం తీస్తే రాజ్‌పుత్‌ల పరువు ఎందుకు పోతుందో అర్థం కాదు. వారి పేరుతో వచ్చిన రాజస్థాన్ ఉన్నంతకాలం చరిత్రలో వారు మిగిలే ఉంటుంది కదా, ముస్లిం రాజుల చేతుల్లో ఓడిపోయామన్న బాధ! -
దర్శకుడిపై దాడిని సమర్థించిన గాయకుడు
ముంబై: దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై బాలీవుడ్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య దూషణలకు దిగాడు. సినిమా పరిశ్రమపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. బాలీవుడ్ లో హిందూ వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తాడు. హిందీ చిత్రపరిశ్రమలో హిజ్రాలు, స్వలింగ సంపర్కులు(గే) ఆధిపత్యం చెలాయిస్తున్నారని మండిపడ్డాడు. సంజయ్ లీలా భన్సాలీపై రాజ్ పుత్ లు దాడి చేయడాన్ని అభిజీత్ సమర్థించాడు. ‘హిందు అతివాదుల చర్యలతో హిందువులంతా గర్విస్తున్నారు. ఎవరైనా హిందువులను అగౌరవపరచాలని ప్రయత్నిస్తే దాడులు తప్పవ’ని ట్విటర్ లో హెచ్చరించాడు. అభిజీత్ దూషణలకు దిగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు పలువురిపై ఆయన నోరు పారేసుకున్నాడు. పద్మావతి సినిమా షూటింగ్ సందర్భంగా జైపూర్ లో సంజయ్ లీలా భన్సాలీపై రాజ్‌పుత్ కర్నిసేన దాడి చేసిన సంగతి తెలిసిందే. దీపిక పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
ఇంటిపేరు పీకేసి.. నిరసన తెలిపిన హీరో!
ముంబై: ప్రఖ్యాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై రాజ్‌పుత్ కర్ణిసేన దాడి చేయడంపై బాలీవుడ్ చిత్రసీమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మేవార్ రాణి పద్మావతి విషయంలో చరిత్రను వక్రీకరిస్తూ.. ఆయన 'పద్మావతి' సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ కర్ణిసేన ఆయనపై, చిత్రయూనిట్‌పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బాలీవుడ్ అంతా భన్సాలీకి మద్దతుగా నిలిచింది. దాడిని తీవ్రంగా ఖండించింది. తాజాగా భన్సాలీకి బాలీవుడ్ నటుడు, 'ధోనీ' సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మద్దతుగా నిలిచాడు. భన్సాలీపై రాజ్‌పుత్‌ల దాడిని ఖండిస్తూ ఆయన తనదైన శైలిలో నిరసన తెలిపాడు. ట్విట్టర్లో ప్రొఫైల్ పేరులో తన కులాన్ని సూచించే ఇంటిపేరును తొలగించాడు. భన్సాలీకి సంఘీభావంగా ఆయన తన పేరులోని 'సింగ్ రాజ్‌పుత్'ను తొలగించి.. ట్విట్టర్లో సుశాంత్ అని మాత్రమే ఉంచారు. 'ఇంటిపేర్లపై మమకారం పెంచుకున్నంతకాలంతో మనం ఇలా బాధపడకతప్పదు. మీకు ధైర్యముంటే 'పద్మావతి'కి మద్దతుగా ఇంటిపేరును మాకు ఇచ్చేయండి' అంటూ ఆయన ట్వీట్ చేశారు. -
నా సినిమాలో ఆ సీన్లు లేవు!
ఎవరి సెంటిమెంట్లను దెబ్బతీయను మేవార్ వర్గం గర్వించేలా తెరకెక్కిస్తాను స్పష్టం చేసిన భన్సాలీ తాను రూపొందిస్తున్న 'పద్మావతి' సినిమా రాజస్థాన్‌లోని మేవార్ వర్గం గర్వించేలా ఉంటుందని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్పష్టం చేశారు. ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా సినిమాను తెరకెక్కించాలని భావించడం లేదని ఆయన తెలిపారు. మేవార్ రాణి 'పద్మావతి' చరిత్ర ఆధారంగా భన్సాలీ తాజాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించి అభ్యంతరకరంగా తెరకెక్కిస్తున్నారని రాజ్‌పుత్ కర్ణిసేన చిత్రయూనిట్‌పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఏకంగా దర్శకుడు భన్సాలీపై కర్ణిసేన కార్యకర్తలు చేయి చేసుకొని కొట్టడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన భన్సాలీ.. రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ఎలాంటి అభ్యంతరకరమైన సీన్లుగానీ, డ్రీమ్ సీక్వెన్స్గానీ ఉండవని ఆయన స్పష్టం చేశారు. రాజస్థాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అయినా చిత్రయూనిట్ భద్రతను దృష్టిలో పెట్టుకొని షూటింగ్ నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎంతో పరిశోధన చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, స్థానికులు ఇందుకు సహకరించి ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు. దాడి ఘటన నేపథ్యంలో జైపూర్ నుంచి ముంబైకి పద్మావతి చిత్ర యూనిట్ తిరుగుప్రయాణమైన సంగతి తెలిసిందే. -
‘ఆయన సినిమాలన్నీ చరిత్ర వక్రీకరణలే’
-
‘పద్మావతి చరిత్రను వక్రీకరిస్తే చూస్తు ఊరుకోం’