
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాణమే కాదు ఆ సినిమాను ప్రమోట్ చేయటం కూడా చాలా ముఖ్యం. అందుకే నిర్మాతలు నిర్మాణ ఖర్చులతో పాటు ప్రచార కార్యక్రమాలకు కూడా ప్రత్యేకం గా బడ్జెట్ కేటాయిస్తున్నారు. అయితే భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో ఈ ఖర్చు మరింత భారీగా ఉంటోంది. తాజాగా అలాంటి వార్త ఒకటి బాలీవుడ్ సర్కిల్స్ లో ప్రముఖం వినిపిస్తోంది.
శరన్నవరాత్రుల తొలి రోజు, బాలీవుడ్ ప్రస్టీజీయస్ ఫిలిం పద్మావతి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీపికా పదుకొనే పద్మావతి గా నటించిన ఈ సినిమాలో ఆమె లుక్ తో పాటు టైటిల్ లోగోను కూడా ఈ పోస్టర్ లో రివీల్ చేశారు. అయితే లుక్ ను ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ చేసేందుకు చిత్రయూనిట్ భారీగానే ఖర్చుపెట్టిందట.
వెబ్ మీడియా ప్రమోషన్ తో పాటు ప్రింట్ మీడియాలో యాడ్స్ కోసం మూడున్నన కోట్లు కేటాయించిందన్న టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పద్మావతి సినిమా ప్రమోషన్ కోసం కూడా అదే స్థాయిలో ఖర్చు చేస్తున్నారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ ప్రమోషన్ కే కోట్లల్లో ఖర్చు చేశారంటే ముందు ముందు పద్మావతి ప్రమోషన్ కోసం నిర్మాతలు ఏ స్థాయిలో ఖర్చుపెడతారో చూడాలి.