![Heeramandi The Diamond Bazaar Enter In Global OTT Awards](/styles/webp/s3/article_images/2024/08/31/he.jpg.webp?itok=EtazO5Li)
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టారు. తన తొలి వెబ్ సిరీస్‌తో అనేక సంచలనాలు సృష్టించడమే కాకుండా అవార్డులు అందుకోనున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ కావడంతో అభిమానులు భారీగానే ఆదరించారు. . ఈ సిరీస్ ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ నటించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ తమ ప్రతిభతో మెప్పించారు.
తాజాగా బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (గ్లోబల్ ఓటీటీ అవార్డ్స్) ఉత్తమ ఓటీటీ ఒరిజినల్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాలకు హీరామండి నామినేట్ అయ్యింది. ఇంతటి గొప్ప అవార్డ్‌కు తన వెబ్ సిరీస్ నామినేట్ కావడంపై దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ గుర్తింపుతో చిత్ర యూనిట్ అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/3_0.jpg)
ఓటీటీల పరంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఈ అవార్డులకు హీరామండి వెబ్ సిరీస్‌కు నామినేట్ కావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఆ వార్డుల కోసం రెండు విభాగాలకు నామినేట్ అయిందని ఆయన తెలిపారు. ఈ ఏడాదిలో ఎంపికైన ఏకైక భారతీయ ప్రాజెక్ట్ కూడా ఇదే అని భన్సాలీ పేర్కొన్నారు. ఇంతటి గొప్ప విజయానికి కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. మే 1న విడుదలైన ఈ సిరీస్ మొదటి వారంలోనే 4.5 మిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. సుమారు 40కి పైగా దేశాల్లో టాప్10 ట్రెండింగ్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది. అందుకే ఈ అవార్డు హీరామండీకి దక్కుతుంది.
Comments
Please login to add a commentAdd a comment