బాక్సాఫీస్ వద్ద రిలీజయ్యే పెద్ద సినిమాలన్నీ కచ్చితంగా ఏదో ఒక ఓటీటీలోకి రావాల్సిందే! ఈ పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతున్నాయి. వీటిమీదే ఆధారపడకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను తీసుకువస్తున్నాయి.
సినిమాలు, సిరీస్‌లు, రియాలిటీ షోలతో కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. అలా ఈ ఏడాది బోలెడన్ని చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేశాయి. మరి ఈ ఆరు నెలల్లో (జనవరి- జూన్) ఎక్కువమంది చూసిన సినిమాలేంటో చూసేద్దాం..
ఆర్మాక్స్ నివేదికల ప్రకారం.. ఎక్కువ మంది చూసిన హిందీ ఓటీటీ కంటెంట్ ఇదే..
1. పంచాయత్- సీజన్ 3 (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 2.82 కోట్లమంది వీక్షించారు.
2. హీరామండి (నెట్‌ఫ్లిక్స్) -2.30 కోట్ల మంది చూశారు.
3. ఇండియన్ పోలీస్ ఫోర్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 1.95 కోట్ల మంది వీక్షించారు.
4. కోట ఫ్యాక్టరీ సీజన్ 3 (నెట్‌ఫ్లిక్స్) - 1.57 కోట్ల మంది చూశారు.
5. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 & 4 (హాట్‌స్టార్) -1.48 మంది చూశారు.
6. షో టైమ్ (హాట్‌స్టార్) - 1.25 కోట్ల మంది వీక్షించారు.
7. గుల్లక్ సీజన్ 4 (సోనిలివ్) -1.21 కోట్ల మంది చూశారు.
8.మహారాణి సీజన్ 3 (సోనీలివ్) - 1.02 కోట్ల మంది వీక్షించారు.
9. కిల్లర్ సూప్ (నెట్‌ఫ్లిక్స్) - 92 లక్షల మంది చూశారు.
10. జంనపార్ (అమెజాన్ మినీ టీవీ) - 92 లక్షల మంది చూశారు.
11. కర్మ కాలింగ్ (హాట్‌స్టార్) - 91 లక్షల మంది వీక్షించారు.
12. రైసింఘని వర్సెస్ రైసింఘని (సోనిలివ్) - 85 లక్షల మంది చూశారు.
13. మామ్లా లీగల్ హై (నెట్‌ఫ్లిక్స్)- 81 లక్షల మంది వీక్షించారు.
14. లూటెర్ (హాట్‌స్టార్) - 80 లక్షల మంది చూశారు.
15. బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హాట్‌స్టార్) - 80 లక్షల మంది చూశారు.
చదవండి: సింగర్‌కు అధ్భుతమైన టాలెంట్.. ట్రాన్స్‌జెండర్ అంటూ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment