Heeramandi
-
ఆరు నెలల పోరాటం.. చనిపోవడం ఖాయం అనుకున్నా: హీరామండి నటి
బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా తెలుగువారికి సైతం సుపరిచితమే. చివరిసారిగా హీరామండి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గతంలో మనీషా కొయిరాలా క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనీషా క్యాన్సర్ చికిత్స రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను భరించలేని బాధను అనుభవించినట్లు తెలిపారు. చికిత్స తీసుకునే సమయంల తాను చనిపోతానని భావించినట్లు వెల్లడించింది. కొన్ని నెలల పాటు అమెరికాలో శస్త్రచికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నారు. తన తల్లి నేపాల్ నుంచి రుద్రాక్షను తీసుకొచ్చి వైద్యునికి ఇచ్చిందని మనీషా చెప్పుకొచ్చింది. కాగా.. మనీషా కొయిరాలా 2012లో అండాశయ క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు.మనీషా మాట్లాడుతూ..'2012లో నాకు క్యాన్సర్ నిర్ధారణ జరిగింది. ఆ సమయంలో నేను చాలా భయపడ్డాను. నేను వైద్యులతో మాట్లాడినప్పుడు చనిపోతానని భావించా. ఇక లైఫ్‌కు ముగిసినట్లే అనిపించింది. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నా. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ సమయంలో భరించలేని బాధ, నొప్పి అనుభవించా. ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. చివరి స్టేజ్‌లో ఉందని తెలిసింది. న్యూయార్క్‌లో ఉన్న గొప్ప వైద్యులు నాకు చికిత్స అందించారు. దాదాపు 11 గంటలు ఆపరేషన్ చేశారు. కీమో థెరపీ గురించి నా కుటుంబానికి కూడా వైద్యులు వివరించారు. వైద్యం కొనసాగుతున్న సమయంలో అమ్మ నాకోసం ఎన్నో పూజలు చేసింది. ఆమె ధైర్యంతోనే నేను ఆ మహమ్మారిని జయించాను. ఈ జీవితం నాకు దేవుడిచ్చిన పునర్జన్మ' అని అన్నారు. -
ప్రతిష్టాత్మక అవార్డ్ రేసులో హీరామండి
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టారు. తన తొలి వెబ్ సిరీస్‌తో అనేక సంచలనాలు సృష్టించడమే కాకుండా అవార్డులు అందుకోనున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ కావడంతో అభిమానులు భారీగానే ఆదరించారు. . ఈ సిరీస్ ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ నటించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ తమ ప్రతిభతో మెప్పించారు.తాజాగా బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (గ్లోబల్ ఓటీటీ అవార్డ్స్) ఉత్తమ ఓటీటీ ఒరిజినల్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాలకు హీరామండి నామినేట్ అయ్యింది. ఇంతటి గొప్ప అవార్డ్‌కు తన వెబ్ సిరీస్ నామినేట్ కావడంపై దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ గుర్తింపుతో చిత్ర యూనిట్ అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు.ఓటీటీల పరంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఈ అవార్డులకు హీరామండి వెబ్ సిరీస్‌కు నామినేట్ కావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఆ వార్డుల కోసం రెండు విభాగాలకు నామినేట్ అయిందని ఆయన తెలిపారు. ఈ ఏడాదిలో ఎంపికైన ఏకైక భారతీయ ప్రాజెక్ట్ కూడా ఇదే అని భన్సాలీ పేర్కొన్నారు. ఇంతటి గొప్ప విజయానికి కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. మే 1న విడుదలైన ఈ సిరీస్ మొదటి వారంలోనే 4.5 మిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. సుమారు 40కి పైగా దేశాల్లో టాప్10 ట్రెండింగ్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది. అందుకే ఈ అవార్డు హీరామండీకి దక్కుతుంది. -
Aditi Rao Hydari: హీరామండి బ్యూటీ ఆదితిరావు హైదరీ స్టన్నింగ్ లుక్స్.. (ఫోటోలు)
-
2024 OTT ఫస్టాఫ్: ఎక్కువమంది చూసిన సిరీస్, సినిమాలివే!
బాక్సాఫీస్ వద్ద రిలీజయ్యే పెద్ద సినిమాలన్నీ కచ్చితంగా ఏదో ఒక ఓటీటీలోకి రావాల్సిందే! ఈ పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్నాయి. వీటిమీదే ఆధారపడకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను తీసుకువస్తున్నాయి. సినిమాలు, సిరీస్‌లు, రియాలిటీ షోలతో కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. అలా ఈ ఏడాది బోలెడన్ని చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేశాయి. మరి ఈ ఆరు నెలల్లో (జనవరి- జూన్) ఎక్కువమంది చూసిన సినిమాలేంటో చూసేద్దాం..ఆర్మాక్స్ నివేదికల ప్రకారం.. ఎక్కువ మంది చూసిన హిందీ ఓటీటీ కంటెంట్ ఇదే..1. పంచాయత్- సీజన్ 3 (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 2.82 కోట్లమంది వీక్షించారు.2. హీరామండి (నెట్‌ఫ్లిక్స్) -2.30 కోట్ల మంది చూశారు.3. ఇండియన్ పోలీస్ ఫోర్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 1.95 కోట్ల మంది వీక్షించారు.4. కోట ఫ్యాక్టరీ సీజన్ 3 (నెట్‌ఫ్లిక్స్) - 1.57 కోట్ల మంది చూశారు.5. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 & 4 (హాట్‌స్టార్) -1.48 మంది చూశారు.6. షో టైమ్ (హాట్‌స్టార్) - 1.25 కోట్ల మంది వీక్షించారు.7. గుల్లక్ సీజన్ 4 (సోనిలివ్) -1.21 కోట్ల మంది చూశారు.8.మహారాణి సీజన్ 3 (సోనీలివ్) - 1.02 కోట్ల మంది వీక్షించారు.9. కిల్లర్ సూప్ (నెట్‌ఫ్లిక్స్) - 92 లక్షల మంది చూశారు.10. జంనపార్ (అమెజాన్ మినీ టీవీ) - 92 లక్షల మంది చూశారు.11. కర్మ కాలింగ్ (హాట్‌స్టార్) - 91 లక్షల మంది వీక్షించారు.12. రైసింఘని వర్సెస్ రైసింఘని (సోనిలివ్) - 85 లక్షల మంది చూశారు.13. మామ్లా లీగల్ హై (నెట్‌ఫ్లిక్స్)- 81 లక్షల మంది వీక్షించారు.14. లూటెర్ (హాట్‌స్టార్) - 80 లక్షల మంది చూశారు.15. బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హాట్‌స్టార్) - 80 లక్షల మంది చూశారు.చదవండి: సింగర్‌కు అధ్భుతమైన టాలెంట్.. ట్రాన్స్‌జెండర్ అంటూ కామెంట్స్ -
పెళ్లి చేసుకోబోతున్న హీరామండి నటి.. వరుడు ఎవరంటే?
బాలీవుడ్ భామ, హీరామండి నటి సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. నటుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నారు. ముంబయిలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. కాగా..కొన్నేళ్లుగా సోనాక్షి, జహీర్ డేటింగ్లో ఉన్నారు. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పకుండా జాగ్రత్తపడ్డారు.ఇటీవల సోనాక్షి సిన్హా బర్త్ డే సందర్భంగా ప్రియుడు జహీర్ ఇక్బాల్ విషెస్ తెలిపారు. ఇన్‌స్టా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరి పెళ్లికి సన్నిహితులు, కుటుంబ సభ్యులతో హాజరు కానున్నారు. వీరితో పాటు హీరామాండి నటీనటులను కూడా వివాహానికి ఆహ్వానించారు. కాగా.. సోనాక్షి సిన్హా చివరిసారిగా సంజయ్ లీలా భాన్సాలి తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించింది. View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' సీజన్-2 ప్రకటన
'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించింది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపింది. తెలుగులో కూడా అందుబాటులో ఉండటంతో ఇక్కడ కూడా మంచి ఆధరణే లభించింది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్‌కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. త్వరలో రెండో సీజన్ కూడా విడుదల కానుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు.బాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడంతో ప్రేక్షకులు కూడా హీరామండి పట్ల పెట్టుకున్న భారీ అంచనాలను ఆయన నిజం చేశారు. ఇందులో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి,షర్మిన్ సెగల్,సంజీదా షేక్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించి మెప్పించారు. ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను తన సొంత నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్‌తో భన్సాలీ నిర్మించాడు. అయితే, 'హీరామండి: ది డైమండ్ బజార్' సీజన్-1 సూపర్ హిట్ కావడంతో తాజాగా సీజన్ -2 ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలో విడుదల చేస్తామని సోషల్ మీడియా ద్వారా నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
హీరామండి నటితో డేటింగ్.. స్పందించిన నటుడు..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మనీషా కొయిరాలా, ఆదితిరావు హైదరీ, సోనాక్షి సిన్హా ప్రధానపాత్రల్లో నటించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పాకిస్తాన్లో లాహోర్‌లో జరిగిన స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. అయితే సిరీస్‌లో షర్మిన్ సెగల్(ఆలంజేబ్) ప్రియుడిగా తహా షా బాద్షా నటించారు.అయితే తాజాగా అతను మరో నటితో డేటింగ్లో ఉన్నట్లు బాలీవుడ్లో రూమర్స్ మొదలయ్యాయి. హీరామండి నటి ప్రతిభా రంతాతో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో తనపై వస్తున్న వార్తలపై హీరామండి నటుడు తహా షా బాద్షా స్పందించారు. ఆమెతో పరిచయం కేవలం నటన వరకు మాత్రమేనని అన్నారు. ఆమెతో నా రిలేషన్ కేవలం షూట్ వరకే ఉంటుందని బాద్షా అన్నారు. ముందుగా నేను జీవితంలో స్థిరపడాలని.. ఆ తర్వాతే ప్రేమ, కుటుంబం గురించి ఆలోచిస్తానని వెల్లడించారు. కాగా.. ముంబయిలో ఇద్దరు కలిసి డిన్నర్ డేట్లో కనిపించడంతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా వీటికి క్లారిటీ ఇచ్చేశాడు. హీరామండిలో తాజ్దార్ పాత్రలో మెప్పించాడు. షర్మిన్ సెగల్ ప్రియుడిగా.. స్వాతంత్ర్య ఉద్యమ కారుడిగా ఈ సిరీస్‌లో మెప్పించారు. ఇటీవల జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తాహా షా బాదుషా సందడి చేశారు. ప్రతిభా రంతా హీరామండిలో షామా పాత్రలో కనిపించింది. -
ఆ పాత్రలో.. మెప్పించడానికి చాలానే కష్టపడింది!
శర్మిన్ సహగల్.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘హీరామండీ’ సిరీస్ చూసినవాళ్లు ఇట్టే గుర్తుపట్టేస్తారు.. ‘ఆలమ్జేబ్’ అని! అవును.. ఆ పాత్రలో మెప్పించడానికి చాలానే కష్టపడింది శర్మిన్. అయినా నెపోటిజమ్ కామెంట్స్, విమర్శలను ఎదుర్కోక తప్పలేదు. నెపోటిజమ్ ఏంటీ? అని కనుబొమలు ముడిపడ్డాయా? అయితే వివరాలు తెలుసుకోవాల్సిందే!శర్మిన్ పుట్టిపెరిగింది ముంబైలో. అమ్మ .. బేలా సహగల్.. ఫిల్మ్ ఎడిటర్ అండ్ డైరెక్టర్. నాన్న.. దీపక్ సహగల్.. ఫిల్మ్ ప్రొడ్యూసర్. శర్మిన్ సినిమా నేపథ్యం తల్లిదండ్రులతో కాదు తాత మోహన్ సహగల్ (దీపక్ వాళ్ల నాన్న. రేఖను బాలీవుడ్‌కి పరిచయం చేసింది ఈయనే!), మేనమామ.. సంజయ్‌లీలా భన్సాలీతో మొదలైంది. భన్సాలీ చెల్లెలే శర్మిన్ వాళ్లమ్మ బేలా. ఇప్పుడర్థమైంది కదా శర్మిన్ విషయంలో నెపోటిజమ్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో!తను ట్వల్త్ క్లాస్ వచ్చేవరకు డాక్టర్ కావాలనే కలలు కన్నది. ట్వల్త్ క్లాస్ సెలవుల్లో తన మేనమామ తీసిన ‘దేవ్‌దాస్’ సినిమాను చూసి షారూఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్‌ల నటనకు, తన మేనమామ స్టయిల్ ఆఫ్ మూవీ మేకింగ్‌కి ఫిదా అయిపోయి యాక్టర్ కావాలని నిశ్చయించుకుంది.అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడే శర్మిన్లో ఉన్న యాక్టింగ్ స్కిల్స్‌ని గుర్తించాడు భన్సాలీ. అందుకే మంగేశ్ హదావ్లే దర్శకత్వంలో జావేద్ జాఫ్రీ కొడుకు మీజాన్ జాఫ్రీ, శర్మిన్లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ‘మలాల్’ అనే సినిమాను నిర్మించాడు. అందులో శర్మిన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ‘అతిథి భూతో భవ’లోనూ నటించింది. పలువురి ప్రశంసలు అందుకుంది.న్యూయార్క్ వెళ్లి థియేటర్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో డిగ్రీ చదివింది. తిరిగొచ్చి సంజయ్‌లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరింది. అలా గోలియోంకీ రాస్లీలా రామ్‌లీలా, మేరీ కోమ్, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కాఠియావాడీ సినిమాలకు పనిచేసింది.‘హీరామండీ’తో వెబ్ ప్రయాణం మొదలుపెట్టింది. మనీషా కోయిరాలా, సొనాక్షీ సిన్హా, రిచా చడ్డా, అదితీ రావ్ హైదరీ, ఫరీదా జలాల్ వంటి ఉద్దండులతో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అందుకే ‘ఆలమ్జేబ్’గా ఆమె నుంచి మరింత పెర్ఫార్మెన్స్ని ఆశించారు ప్రేక్షకులు. సీనియర్స్ ముందు శర్మిన్ తేలిపోయిందని నిరాశచెందారు. అయితే ఆ విమర్శలను పాజిటివ్‌గానే తీసుకుని తన ప్రతిభను మరింత మెరుగుపరచుకుంటుందని ఆమె అభిమానుల అభిప్రాయం.సంజయ్‌లీలా భన్సాలీని నేను మామయ్య అని పిలవను. సర్ అనే పిలుస్తాను. దేవ్‌దాస్ సినిమా చూస్తే కానీ ఆయన టాలెంట్ ఏంటో తెలీలేదు. ఆ టాలెంటే నేను ఆయన్ని‘ సర్’ అని పిలిచేలా చేస్తోంది. ఆ లెజెండ్ నాకు మామయ్య అవడం నా అదృష్టం! – శర్మిన్ సహగల్ -
హీరామండి సిరీస్‌లో అదరగొట్టిన అందాల ముద్దుగుమ్మలు (ఫోటోలు)
-
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హీరామండి: ది డైమండ్ బజార్'. మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్‌లో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించారు. ఇందులో మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, సోనాక్షి సిన్హా లాంటి స్టార్స్ కనిపించారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్తాన్ లాహోర్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి షర్మిన్ సెగల్. సంజయ్ లీలీ మేనకోడలైన ఆమె తనదైన నటనతో మెప్పించింది. ఆడియన్స్ నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందుకుంది. అయితే తాజాగా షర్మిన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె భర్త అమన్ మెహతా ఓ బిలినీయర్ అన్న వార్త సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారింది.ప్రముఖ టోరెంట్ ఫార్మాస్యూటికల్స్‌లో అమన్ మెహతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ అంతర్జాతీయ కంపెనీకి కో-ఛైర్మన్లుగా అతని తండ్రి సుధీర్ మెహతా, మామ సమీర్ మెహతా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంస్థ బ్లూమ్‌బెర్గ్ 2024- ఇండెక్స్ ప్రకారం సుధీర్ మెహతా, సమీర్ మెహతా నికర విలువ దాదాపు రూ. 53,800 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమన్, అతని తండ్రి సమీర్ కంపెనీ ఫార్మాస్యూటికల్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఒక్క టోరెంట్ ఫార్మా దాదాపు రూ.38,412 కోట్లు రాబట్టిందని ఫోర్బ్స్ అంచనా వేసింది.కాగా.. సంజయ్ లీలా భన్సాలీకి మేనకోడలు అయిన షర్మిన్ సెగల్.. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన అమన్ మెహతాను నవంబర్ 2023లో వివాహం చేసుకుంది. షర్మిన్ సెగల్ తల్లి బేలా సెగల్ ఫిల్మ్ ఎడిటర్‌గా, ఆమె తండ్రి దీపక్ సెగల్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్లో కంటెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీకి చెల్లెలు అయిన బేలా సెగల్ 2012లో షిరిన్ ఫర్హాద్ కి తో నికల్ పాడి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Sharmin Segal Mehta (@sharminsegal) -
కళ్ళు చెదిరే అద్భుత జ్యుయలరీ కలెక్షన్ (ఫోటోలు)
-
Aditi Rao Hydari HD Photos: పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
-
మనిషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా!
ఓటీటీలో ‘హీరామండి’ వెబ్ సిరీస్ దూసుకెళ్తోంది. ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ గురించే చర్చిస్తున్నారు. వేశ్యల జీవితాల ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. మే 1 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. లాహోర్‌లోని హీరామండిలో ఉండే వేశ్యల జీవితాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించాడు భన్సాలీ. (చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ)మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్ధా, సంజీదా షేక్ కీలక పాత్రలు పోషించారు. రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్‌కి ఓటీటీ ప్రేక్షకులను అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఫరీదాన్ పాత్రలో సోనాక్షి సిన్హా అద్భుతంగా నటించింది.మనీషా కొయిరాల, సోనాక్షి మధ్య వచ్చే సన్నివేశాలు వెబ్ సిరీస్‌కే హైలెట్. కొన్ని సీన్లలో మనిషాతో సోనాక్షి దురుసుగా ప్రవర్తిస్తుంది. తాజాగా సోనాక్షి ఆ సీన్ల గురించి మాట్లాడుతూ.. మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పింది. ‘నాకు మనీషా అంటే చాలా ఇష్టం. హీరామండి వెబ్ సిరీస్ మొత్తం చూశాక ఆమెకు సారీ చెప్పాను. కొన్ని సీన్లలో ఆమెతో దురుసుగా ప్రవర్తించాను. సిరీస్ చూశాక..నేను అలా ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే మనీషాకు క్షమాపణలు చెప్పాను. ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. మమ్మల్ని ఎంతో ప్రోత్సహించింది. షూటింగ్ మొత్తం సరదాగా గడిపాం. అవకాశం వస్తే మళ్లీ ఆమెతో కలిసి నటించాలని ఉంది’ అని అన్నారు. ఇక భన్సాలి గురించి మాట్లాడుతూ..‘ఆయన సినిమాలో నటించేవారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సీన్ షూటింగ్‌కి ముందే అన్ని విషయాలు చర్చిస్తారు. ఆయన నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. హీరామండి లాంటి వెబ్ సిరీస్‌లో ఇంతగొప్ప పాత్ర ఇచ్చినందుకు భన్సాలిగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’అని సోనాక్షి చెప్పారు. -
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఒక సినిమా నిర్మాణంలో మామూలుగా అయితే కొన్ని నగలు తెప్పిస్తారు. కాని ‘హీరామండీ’ వెబ్ సిరీస్ కోసం 300 కిలోల నగలు అవసరమయ్యాయి. అవి కూడా బ్రిటిష్ కాలం నాటివి. మొగల్ సంస్కృతీ వారసత్వానివి. ఢిల్లీలో శ్రీ పరమణి జువెలర్స్‌కు చెందిన అన్షు గుప్తా భర్త వినయ్‌తో కలిసి మూడేళ్ల పాటు శ్రమించి ఈ నగలు తయారు చేశారు. నత్, ఝూమర్, హాత్ ఫూల్, పస్సా, టీకా... ఎన్నో నగలు. అన్షు గుప్తా పరిచయం.స్త్రీలు, అలంకరణ అవిభాజ్యం. స్త్రీలు, ఆభరణం కూడా అవిభాజ్యమే. ఆభరణంతో నిండిన అలంకరణ భారతీయ స్త్రీలలో వేల సంవత్సరాలుగా ఉంది. బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు, కెంపులు, మరకతాలు, ముత్యాలు... వీటితో తయారైన ఆభరణాలు రాచరిక స్త్రీలకు ప్రీతికరమైనవి. ఐశ్వర్యవంతులకు స్థాయిని కలిగించేవి. అయితే వీరే కాకుండా కళకారులకు కూడా ఆభరణాలు కీలకమైనవి. మొగలుల కాలంలో విరాజిల్లిన తవాయిఫ్‌లు (రాజనర్తకీమణులు) తమ ప్రదర్శనల్లో ఆకర్షణ కోసం భారీ ఆభరణాలను ఉపయోగించేవారు. మరి వారి గురించిన గాథను తెరకెక్కించేటప్పుడు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని అందించడానికి ముందుకు వచ్చిన జువెలర్స్ అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తా.హీరా మండి..మొగలుల కాలంలో లాహోర్‌లోని ఒక ఏరియా పేరే హీరా మండి. దాని అంతకు ముందు పేరు షాహీ మొహల్లా. అంటే రాచవాడ. పక్కనే ఉన్న కోట నుంచి నవాబులు నడిచి వచ్చేంత దూరంలో ఉండే కొన్ని భవంతుల సముదాయమే షాహీ మొహల్లా. ఇక్కడ తవాయిఫ్‌లు ఉండేవారు. వీరు ఆట, పాటల్లో నిష్ణాతులు. సాయంత్రమైతే వీరి భవంతుల్లో ప్రదర్శనలు జరిగేవి. నవాబులు, శ్రీమంతులు, రసికులు వీటికి హాజరయ్యి తిలకించేవారు. ఈ తవాయిఫ్‌లకు విశేష పలుకుబడి ఉండేది. వీరి దగ్గర ఐశ్వర్యం ఉండేది. రాచరిక రహస్యాలు మొదట వీరికే తెలిసేవి. వీరు మంత్రాంగం నడిపేవారు. 1857 సైనిక తిరుగుబాటులో కూడా వీరు పాల్గొన్నారు. కాని బ్రిటిష్ కాలం వచ్చేసరికి ఇదంతా గతించిపోయింది. షాహీ మొహల్లా కాస్తా సరుకులు అమ్మే మండీగా హీరా మండీగా మారింది. ఆనాడు వెలిగిన వారంతా అంతరించిపోయారు. వేశ్యలుగా మారారు. వారి గాథనే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండీ’ పేరుతో భారీ వెబ్‌సిరీస్‌గా తీశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.భారీ నగలుపర్‌ఫెక్షనిస్ట్ అయిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ‘హీరామండీ’లో తవాయిఫ్‌ల కోసం నాటి మొగల్ తరహా నగలు కావాలని భావించాడు. గతంలో తన ‘బాజీరావు మస్తానీ’ కోసం పని చేసిన ఆభరణాల శిల్పులైన అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తాలను సంప్రదించాడు. వీరు ఢిల్లీవాసులు. వీరికి శ్రీ పరమణి జువెలర్స్ అనే నగల కార్ఖానా, షోరూమ్ ఉన్నాయి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కార్ఖానాలో ఖరీదైన ఆభరణాలు దొరుకుతాయి. ‘కథ విన్న వెంటనే టైటిల్ దగ్గరి నుంచి ప్రతి పాత్రా ఆభరణాలతో ముడిపడి ఉన్నందుకు ఉత్సాహం వచ్చింది. చరిత్రలోకి వెళ్లి పరిశోధించి నాటి ఆభరణాలు తయారు చేయాలి. మొగలులు కళాప్రియులు. వారి కాలంలో ఆభరణాలలో కెంపులు. ముత్యాలు, వజ్రాలు విరివిగా వాడేవారు. ఆపాదమస్తకం అలంకరించుకోవడానికి వందల రకాల ఆభరణాలు ఉండేవి. అవన్నీ మేము తయారు చేయడానికి ముందుకు వచ్చాం. నేను, నా భర్త వినయ్ మూడేళ్లు కష్టపడి ఈ నగలు తయారు చేయించాం’ అని తెలిపింది అన్షు గుప్తా.అసలు సిసలు బంగారంతో‘‘హీరామండీ కోసం కొన్ని ముఖ్యమైన నగలు అసలు బంగారంతోనూ, మిగిలినవి బంగారు పూత కలిగిన వెండితోనూ తయారు చేయించాలని నిర్ణయించాం. వజ్రాలు, ముత్యాలు అన్నీ ఒరిజినల్‌వే వాడాం. మా కార్మికులు మూడేళ్ల పాటు శ్రమపడి మూడు గదుల్లో పది వేల చిన్న, పెద్ద ఆభరణాలు తయారు చేశారు. వీటిని తూస్తే 300 కిలోలు ఉంటాయి. నథ్ (ముక్కు పుడక) దగ్గరి నుంచి నెమలి నెక్లెస్ వరకూ వీటిలో ఉన్నాయి. షూటింగ్లో ప్రత్యేక గార్డులు వీటికి కాపలా ఉన్నారు. ‘మేం చేసిన ఆభరణాలు పాత్ర కోసం ధరించి వీటితో పారిపోతే ఒక సినిమా తీసేన్ని డబ్బులొస్తాయి’ అనేది నటి రిచా చద్దా సరదాగా. హీరామండీని చూస్తే ఒక పాత్ర ధరించిన పాపిడి బిళ్లతో మరో పాత్ర ధరించిన పాపిటబిళ్లకు పోలిక ఉండదు. గాజులు, ఉంగారాలు, చెవి కమ్మలు... తెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైన తీరుతో మా కష్టం వృథా పోలేదనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది అన్షు గుప్తా. -
హీరామండి నటి షర్మిన్ సెగల్ భర్త ఎవరో తెలుసా? వేల కోట్ల ఆస్తి
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ వెబ్ సిరీస్ హీరామండి హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఈ సిరీస్‌లో కీలక పాత్రల్లో నటించిన ప్రముఖ నటీ నటుల వివరాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సంజయ్ లీలా బన్సాలీ మేనకోడలు గ్లామరస్ 'అలంజేబ్' పాత్రలో అలరించిన షర్మిన్ సెగల్ ఎవరు. ఆమె భర్త ఎవరు. అతని నెట్‌వర్త్ ఎంత అనేది ప్రధాన చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీ కోసం.ఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో 1995లో జన్మించింది షర్మిన్ సెగల్. తండ్రి, దీపక్ సెగల్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్లో కంటెంట్ హెడ్‌గా పనిచేశారు. తల్లి బేలా సెగల్ పాపులర్ ఫిల్మ్ ఎడిటర్. తల్లి సోదరుడే , బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ. ఖామోషి, దేవదాస్, బ్లాక్ లాంటి ఎన్నో చిత్రాలకు బేలా సెగల్ పనిచేశారు.అంతేకాదు బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా , మేరీ కోమ్ వంటి చిత్రాలకు షర్మిన్ మామ సంజయ్ లీలా బన్సాలీతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది షర్మిన్ సెగల్. ఆ తర్వాతే నట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. షర్మిన్ సెగల్ 'మలాల్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల విడుదలైన సంజయ్ లీలా బన్సాలీ క 'హిరామండి'లో షర్మిన్ గ్లామరస్ పాత్రను దక్కించుకుంది.రూ. 50 వేల కోట్ల ఆస్తిషర్మిన్ సెగల్ భర్త, పారిశ్రామికవేత్త అమన్ మెహతా వేల కోట్లకు యజమాని. గత ఏడాది నవంబరులో అమన్ మెహతా , షర్మిన్ సెహగల్ పెళ్లి చేసుకున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ అనుబంధ సంస్థటోరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమన్మెహతా. మెహతా కుటుంబ నికర విలువ 50000 కోట్లకు పైమాటే. అమన్ టోరెంట్ గ్రూప్‌ను అమన్ తాత యు.ఎన్. మెహతా 1959లో ప్రారంభించారు. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తోంది. ప్రస్తుతం అమన్ తండ్రి సమీర్ మెహతా సోదరుడు సుధార్ మెహతా ఇద్దరూ కంపెనీ కో-ఛైర్మెన్‌గా ఉన్నారు. టోరెంట్ గ్రూప్‌నకు టొరెంట్ ఫార్మా, టొరెంట్ పవర్, టొరెంట్ కేబుల్స్, టొరెంట్ గ్యాస్ ,టొరెంట్ డయాగ్నోస్టిక్స్ లాంటి అనుబంధ కంపెనీలున్నాయి.టోరెంట్ ఫార్మా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమన్ మెహతా 2022 నుండి టోరెంట్ ఫార్మాలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇండియతో పాటు, ఇతర దేశాలలోకంపెనీ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు.ఫోర్బ్స్ ప్రకారం, అమన్ మెహతా తండ్రి సమీర్ మెహతా నికర విలువ 6.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 50,939 కోట్లు). టోరెంట్ ఫార్మా ఆదాయం 4.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 38,412 కోట్లు). సమీర్, అమన్ ఇద్దరూ తమ కుటుంబ వ్యాపారంలో ఫార్మా రంగంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. అమన్ మెహతా విద్యార్హతలుఅమన్ మెహతా బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అమెరికాలోన కొలంబియా బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. ఎంబీఏ పూర్తికాక ముందు అమన్ 3 సంవత్సరాల పాటు టోరెంట్ పవర్లో డిస్ట్రిబ్యూషన్ మేనేజర్‌గా అనుభవం సంపాదించాడు. ఎంబీఏ పూర్తి అయిన తరువాత టోరెంట్ ఫార్మాలో సీఎంఓగా చేరి మూడేళ్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు. -
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్‌ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
మాస్ట్రో సంజయ్ లీలా బన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్‌తో డిజిటల్ ప్రపంచంలోకి ఆకట్టుకునేలా అడుగుపెట్టాడు. సంచలన టీవీ సిరీస్‌తో సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాడు. పలువురు నటీమణులు తమ అద్బుతమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా వీటన్నింటికి మించి గోల్డెన్ గర్ల్ వీడియో నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.హర్షాలీ మల్హోత్రా మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ ‘‘బజరంగీ భాయిజాన్’’లో మున్నీ పాత్రలో నటించి, ప్రశంసలందుకున్న హర్షాలీ మల్హోత్రా లేటెస్ట్ సంచలనం. హీరామండిలోని అలంజేబ్ పాత్రను రీక్రియేట్ చేసింది. ఇందులో తనదైన నటనతో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) ఈ ధారావాహికలోని ‘‘ఏక్ బార్ దేఖ్ లిజియే’’ పాటకు తనదైన అభియనంతో వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. గోల్డెన్ కలర్ లెహంగాలో మల్హోత్రా మెరిసిపోయింది. అందమైన ఆమె కళ్ళు అనేక భావోద్వేగాలను అలవోకంగా పలికించడం విశేషం. దీంతో ఒరిజినల్ సాంగ్‌తో పోలిస్తే మల్హోత్రా బాగా నటించిందంటూ అంతా కితాబిచ్చారు.1940లలోని భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యానికి వ్యతిరేకంగా, ‘‘హీరామండి’’ లాహోర్‌లోని రెడ్-లైట్ డిస్ట్రిక్ట్ హీరా మండిలో తవాయిఫ్‌ల (వేశ్యల) జీవితాల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. స్టార్-స్టడెడ్ సిరీస్‌లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ అధ్యాయాన్ వంటి ప్రఖ్యాత నటీనటులు ఉన్నారు. ఇంకా శేఖర్ సుమన్, తహా షా బదుషా, ఫరీదా జలాల్తదితరులు మరికొందరు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో వెబ్ సిరీస్ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన షోగా నిలిచిన సంగతి తెలిసిందే. -
ఆమెతో బ్రేకప్‌కు కారణం అదే.. హీరామండి నటుడు!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన హిస్టారికల్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ నెల 1న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. పాక్‌లోని లాహోర్‌లో స్వాతంత్య్రానికి ముందు జరిగిన చారిత్రాత్మక కథనంతో ఈ సిరీస్‌ను తీసుకొచ్చారు. హీరామండి ప్రాంతంలో ఉండే వేశ్యల ఇతివృత్తమే ప్రధానంగా చూపించారు.అయితే ఈ సిరీస్‌లో బ్రిటీష్ పోలీస్ అధికారి పాత్రలో మెప్పించిన నటుడు జాసన్ షా. ఈ వెబ్ సిరీస్‌లో కార్ట్‌రైట్ పాత్రలో మెప్పించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాసన్ షా.. నటి అనూషా దండేకర్‌తో బ్రేకప్ గురించి మాట్లాడారు. ఆమెతో విడిపోవడానికి గల కారణాలను జాసన్ షా పంచుకున్నారు. అనూషతో విడిపోవడం పెద్ద ఆధ్యాత్మిక మార్పునకు దారితీసిందని జాసన్ చెప్పుకొచ్చారు. ఆమె తనను సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. నన్ను తన నియంత్రణలో పెట్టుకునేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు. అది జరగని పని కావడంతో విడిపోవాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒకరి మాట మరొకరు వినకపోవడమే బ్రేకప్‌కు కారణమని జాసన్ షా తెలిపారు. అవతలి వ్యక్తి చెప్పేది.. మీరు వింటే మీ రిలేషన్ ఎక్కువ కాలం ఉంటుందని సూచించారు. తనను తప్పుగా అర్థం చేసుకోవడంతోనే తమ బంధం విచ్ఛిన్నానికి కారణమని తెలిపారు. కాగా.. హీరామండి కంటే ముందు జాన్సీకి రాణి, బిగ్ బాస్ వంటి టీవీ షోలలో జాసన్ కనిపించాడు. అతను 2021లో అనూషా దండేకర్‌తో విడిపోయారు. -
శృతి శర్మ : ‘హీరామండి’లో మెరిసిన ‘ఏజెంట్’ హీరోయిన్
-
భయంకరమైన వ్యాధి.. అందరూ నన్ను దూరం పెట్టారు: హీరోయిన్
క్రిమినల్ మూవీతో తెలుగువారికి పరిచయమైంది మనీషా కొయిరాలా. ఒకే ఒక్కడు సినిమాలోని నెల్లూరి నెరజాణ.. పాటతో ప్రేక్షకులు విపరీతంగా నచ్చేసింది. తెలుగులో కన్నా బాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా రాణించింది. కెరీర్ టాప్‌లో ఉన్న సమయంలో నేపాల్‌కు చెందిన సామ్రాట్ దహల్‌ను పెళ్లాడింది. పెళ్లయిన ఆరునెలలకే ఈ బంధం కొనసాగదని అర్థమైంది. ప్రేమంచిన భర్తే శత్రువుగా మారడంతో విడాకులు తీసుకోక తప్పలేదు.తాగుడుకు బానిసఅప్పటికే బిజీ సినిమా షెడ్యూల్స్ వల్ల ఒత్తిడికి లోనై తాగుడుకు బానిసైంది. దీనికి తోడు విడాకులు తీసుకోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఈ బాధలు చాలదన్నట్లు 2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడింది. అప్పటిదాకా తనతో కలిసిమెలిసి ఉన్న స్నేహితులు సైతం తమకు సంబంధం లేదన్నట్లు వదిలి వెళ్లిపోయారట.ఒంటరిగా..'జనాలకు ఎవరి బాధనూ పంచుకోవడం ఇష్టముండదు. కష్టాల్లో ఉన్నారనగానే వారిని ఒంటరిగా వదిలేసి పోతారు. స్నేహితులే కాదు నా బంధువులు కూడా ఎవరూ నాకు అండగా నిలబడలేదు. నేనెలా ఉన్నాను? ఏంటనేది కూడా పట్టించుకోలేదు. నా పేరెంట్స్, సోదరుడు-వదిన.. వీళ్లు మాత్రమే సపోర్ట్‌గా నిలబడ్డారు. అప్పుడే నాకు మనుషుల వ్యక్తిత్వాల గురించి బోధపడింది. అందుకే ఇంత స్ట్రాంగ్అన్నింటినీ దాటుకుని వచ్చాను కాబట్టే ఈ రోజు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాను. కేవలం నా కుటుంబం వల్లే ఈరోజు ఇలా మీ ముందు నిలబడగలిగాను' అని చెప్పుకొచ్చింది. రెండేళ్లపాటు క్యాన్సర్‌తో పోరాడిన మనీషా 2014లో ఆ భయంకరమైన వ్యాధిని జయించింది. ఇటీవల హీరామండి అనే వెబ్ సిరీస్‌లో మల్లికా జాన్ అనే పాత్రలో నటించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.చదవండి: నీలి రంగు చీరలో కేక పుట్టిస్తున్న కేరళ బ్యూటీ.. సారీ ధరెంతో తెలుసా? -
Heeramandi సోనాక్షి లుక్స్: జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్! ఫోటోలు
-
రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
శృంగార సన్నివేశాలు చేసేసిన తర్వాత వాటి గురించి మాట్లాడటానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఈ మధ్య మాత్రం పలువురు హీరోయిన్లు ఆయా సీన్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. మొన్నామధ్య సోనాక్షి సిన్హా, దివ్య పిళ్లై ఇలా మాట్లాడారు. ఇప్పుడు యువ హీరోయిన్ శృతి శర్మ కూడా రొమాంటిక్ సీన్స్ వల్ల వచ్చిన కష్టనష్టాల్ని బయటపెట్టింది.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.. రీసెంట్గా 'హీరామండి' సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. స్వాత్రంత్ర్యం రాకముందు పాకిస్థాన్‌లోని హీరామండి అనే వేశ్యవాటికని స్ఫూర్తిగా తీసుకుని ఈ సిరీస్ తీశాడు. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీ రావ్ హైదరీ తదితరులు నటించారు. 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' హీరోయిన్ శృతి శర్మ కూడా ఈ సిరీస్‌లో సైమా అనే పాత్ర చేసింది. నటిగా తన అనుభవాల్ని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త)'ఈ సిరీస్‌లో రజత్ కౌల్‌తో కొన్ని రొమాంటిక్ సీన్స్ చేశాను. ఇందులో ఇద్దరం చాలా సహజంగా నటించాం. ఇలాంటి సన్నివేశాలు ఇప్పటివరకు చేయలేదు. అయితే ఇవి చేస్తున్నప్పుడు నా శరీరంపై దద్దుర్లు వచ్చాయి. దుమ్ము, ధూళి ఉన్నప్పటికీ ఓ రోజంతా కష్టపడి ఈ సీన్స్ పూర్తి చేశాం. ప్రతిదీ ఫెర్ఫెక్ట్గా వచ్చేవరకు షూటింగ్ జరిగింది. అందుకే వెబ్ సిరీసులో ఈ సీన్లు చాలా అద్భుతంగా అనిపించాయి' అని శృతి శర్మ చెప్పింది.అయితే సైమా పాత్ర చేయడం పట్ల సంతోషంగానే ఉన్నానని, భన్సాలీ ఊహించుకున్న రోల్ కోసం బాగానే కష్టపడ్డానని శృతి శర్మ చెప్పింది. ఇకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ 'హీరామండి' వెబ్ సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. అయితే కంటెంట్ కాస్త ల్యాగ్ ఉండటంతో తెలుగోళ్లకు పెద్దగా నచ్చలేదు కానీ హిందీ ఆడియెన్స్ మాత్రం బాగానే చూస్తున్నారు.(ఇదీ చదవండి:పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?) -
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం 1920 నుంచి 1940 ల మధ్య కాలంలో లాహోర్‌లో రెడ్‌లైట్ ప్రాంతంగా పేరున్న హీరామండిలోని వేశ్యల జీవితాల నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు భన్సాలీ. (చదవండి: హీరామండి రివ్యూ)మనీషా కోయిరాలా , అదితిరావ్ హైదరీ, సోనాక్షి సిన్హా , ఫర్ధీన్ ఖాన్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ప్రతి ఒక్కరు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సోనాక్షి సిన్హా పోషించిన ఫరీదాన్ పాత్ర వెబ్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ పాత్ర పోషించినందుకుగాను సోనాక్షిపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే కొంతమంది మాత్రం ఆమె పాత్రను తప్పుపట్టారు. దానికి కారణం ఆమె మరో మహిళతో కలిసి శృంగారంలో పాల్గొనడమే. ఆ ఇంటిమేట్ సీన్స్, దానికి గల కారణం సరిగ్గా చూపించలేదంటూ కొంతమంది విమర్శించారు. తాజాగా దీనిపై సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. ఫరీదాన్ అనే పాత్ర స్వలింగ సంపర్కురాలు అని.. అందుకే ఆమె మరో మహిళతో రొమాన్స్ చేసిందని చెప్పుకొచ్చింది. ‘భన్సాలీ నాకు కథ చెప్పినప్పుడే ఫరీదాన్ పాత్ర గురించి పూర్తిగా వివరించాడు. కథ విని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇందులో నేను స్కలింగ సంపర్కురాలు పాత్ర పోషించాను. అందుకే అలాంటి సీన్స్ ఉన్నాయి’ అని సోనాక్షి చెప్పుకొచ్చింది.అలాగే ఇందులో నటుడు ఇంద్రేష్ మాలిక్‌తో కలిసి సోనాక్షి ఇంటిమేట్ సీన్స్‌లో నటించింది. ఈ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో అసౌకర్యానికి గురయ్యాయని, సోనాక్షినే తనకు ధైర్యం చెప్పి,సపోర్ట్ చేసిందని ఓ ఇంటర్వ్యూలో ఇంద్రేష్ చెప్పాడు.