ఓటీటీలో ‘హీరామండి’ వెబ్ సిరీస్ దూసుకెళ్తోంది. ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ గురించే చర్చిస్తున్నారు. వేశ్యల జీవితాల ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. మే 1 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. లాహోర్‌లోని హీరామండిలో ఉండే వేశ్యల జీవితాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించాడు భన్సాలీ.
(చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ)
మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్ధా, సంజీదా షేక్ కీలక పాత్రలు పోషించారు. రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్‌కి ఓటీటీ ప్రేక్షకులను అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఫరీదాన్ పాత్రలో సోనాక్షి సిన్హా అద్భుతంగా నటించింది.మనీషా కొయిరాల, సోనాక్షి మధ్య వచ్చే సన్నివేశాలు వెబ్ సిరీస్‌కే హైలెట్. కొన్ని సీన్లలో మనిషాతో సోనాక్షి దురుసుగా ప్రవర్తిస్తుంది. తాజాగా సోనాక్షి ఆ సీన్ల గురించి మాట్లాడుతూ.. మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పింది.
‘నాకు మనీషా అంటే చాలా ఇష్టం. హీరామండి వెబ్ సిరీస్ మొత్తం చూశాక ఆమెకు సారీ చెప్పాను. కొన్ని సీన్లలో ఆమెతో దురుసుగా ప్రవర్తించాను. సిరీస్ చూశాక..నేను అలా ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే మనీషాకు క్షమాపణలు చెప్పాను. ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. మమ్మల్ని ఎంతో ప్రోత్సహించింది. షూటింగ్ మొత్తం సరదాగా గడిపాం. అవకాశం వస్తే మళ్లీ ఆమెతో కలిసి నటించాలని ఉంది’ అని అన్నారు.
ఇక భన్సాలి గురించి మాట్లాడుతూ..‘ఆయన సినిమాలో నటించేవారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సీన్ షూటింగ్‌కి ముందే అన్ని విషయాలు చర్చిస్తారు. ఆయన నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. హీరామండి లాంటి వెబ్ సిరీస్‌లో ఇంతగొప్ప పాత్ర ఇచ్చినందుకు భన్సాలిగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’అని సోనాక్షి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment