బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హీరామండి: ది డైమండ్ బజార్'. మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్‌లో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించారు. ఇందులో మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, సోనాక్షి సిన్హా లాంటి స్టార్స్ కనిపించారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్తాన్ లాహోర్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
అయితే ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి షర్మిన్ సెగల్. సంజయ్ లీలీ మేనకోడలైన ఆమె తనదైన నటనతో మెప్పించింది. ఆడియన్స్ నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందుకుంది. అయితే తాజాగా షర్మిన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె భర్త అమన్ మెహతా ఓ బిలినీయర్ అన్న వార్త సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారింది.
ప్రముఖ టోరెంట్ ఫార్మాస్యూటికల్స్‌లో అమన్ మెహతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ అంతర్జాతీయ కంపెనీకి కో-ఛైర్మన్లుగా అతని తండ్రి సుధీర్ మెహతా, మామ సమీర్ మెహతా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంస్థ బ్లూమ్‌బెర్గ్ 2024- ఇండెక్స్ ప్రకారం సుధీర్ మెహతా, సమీర్ మెహతా నికర విలువ దాదాపు రూ. 53,800 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమన్, అతని తండ్రి సమీర్ కంపెనీ ఫార్మాస్యూటికల్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఒక్క టోరెంట్ ఫార్మా దాదాపు రూ.38,412 కోట్లు రాబట్టిందని ఫోర్బ్స్ అంచనా వేసింది.
కాగా.. సంజయ్ లీలా భన్సాలీకి మేనకోడలు అయిన షర్మిన్ సెగల్.. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన అమన్ మెహతాను నవంబర్ 2023లో వివాహం చేసుకుంది. షర్మిన్ సెగల్ తల్లి బేలా సెగల్ ఫిల్మ్ ఎడిటర్‌గా, ఆమె తండ్రి దీపక్ సెగల్ అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కంటెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీకి చెల్లెలు అయిన బేలా సెగల్ 2012లో షిరిన్ ఫర్హాద్ కి తో నికల్ పాడి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment