హీరామండి.. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన వెబ్ సిరీస్. పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ కళాఖండం మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ సిరీస్‌లో కొన్ని పొరపాట్లను నెటిజన్లు గుర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
జర్నలిస్టు ట్వీట్
ఐదో ఎపిసోడ్‌లో సోనాక్షి సిన్హా వార్తా పత్రిక చదువుతున్న సమయంలోని పొరపాటను ఎత్తిచూపుతున్నారు. ఈ మేరకు పర్వేజ్ ఆలమ్ అనే జర్నలిస్టు ఓ ట్వీట్ చేశాడు. హీరామండి సిరీస్ 1920-40 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. స్వతంత్రానికి ముందు బ్రిటీష్ పాలనలో ఉన్న లాహోర్‌లో కథ సాగుతుంది.
ఉర్దూ పేపర్
ఐదో ఎపిసోడ్‌లో ఫరీదన్ (సోనాక్షి సిన్హ) ఉర్దూ పేపర్ చదువుతుంది. అందులోని హెడ్‌లైన్స్‌లో వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్: టికెట్లు ఇచ్చిన టీఆర్ఎస్ అని ఉంది. 50వేల మాస్కులను పంపిణీ చేయనున్న యూత్ కాంగ్రెస్.., కరోనాతో పోరాడాలంటే ఆత్మస్థైర్యం ఉండాలి: కరోనా రోగులకు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు సలహా.. ఇలాంటి హెడ్‌లైన్సే ఉన్నాయి అని రాసుకొచ్చారు.
అది కూడా తెలీదా?
మరో నెటిజన్.. ఉర్దూ పేపర్‌ను ఎడమ నుంచి కుడికి చదవడం మాత్రం హైలెట్ అని సెటైర్ వేశాడు. ఉర్దూని కుడి నుంచి ఎడమకు చదువుతారని కూడా తెలీకుండా ఆ పాత్రను డిజైన్ చేయడం, కనీసం ఎవరైనా భాషాజ్ఞానులను సంప్రదించకపోవడం విచారకరం అని కామెంట్లు చేస్తున్నారు.
Sanjay Leela Bhansali’s epic web series Heera Mandi on Netflix is set against the Indian independence/British Raj in Lahore of the 1920s-1940s. Fareedan (Sonakshi Sinha) is supposedly reading an Urdu newspaper (EP5). Headlines say, “Warangal Municipal Elections: TRS Distributes… pic.twitter.com/EI44Z61rkt
— Pervaiz Alam (@pervaizalam) May 3, 2024
Comments
Please login to add a commentAdd a comment