రియల్ స్టోరీతో వస్తోన్న క్రేజీ వెబ్ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Sanjay Leela Bhansali Crazy Web Series Streaming On This OTT | Sakshi
Sakshi News home page

Heeramandi OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తోన్న హీరామండి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published Mon, Apr 29 2024 4:08 PM | Last Updated on Mon, Apr 29 2024 4:08 PM

Sanjay Leela Bhansali Crazy Web Series Streaming On This OTT

బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం గంగూభాయి కతియావాడి. స్టార్ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ముంబయిలో వేశ్యవాటిక నేపథ్యంలో వచ్చిన గంగూభాయి కతియావాడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

తాజాగా అలాంటి కథతోనే  సరికొత్త వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సంజయ్. ఏకంగా ఆరుగురు హీరోయిన్లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ క్రేజీ వెబ్ సిరీస్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేందుకు సిద్ధమైంది. హీరామండి: ది డైమండ్ బజార్ పేరుతో వస్తోన్న  వెబ్ సిరీస్ మే 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది.

ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదికరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్‌లో మల్లికాజాన్‌గా మనీషా కొయిరాలా, ఫరీదాన్‌గా సోనాక్షి సిన్హా, బిబ్బోజాన్‌గా అదితి రావు హైదరీ, అలంజేబ్‌గా షర్మిన్ సెగల్, వహీదాగా సంజీదా షేక్, లజ్జోగా రిచా చద్దా నటించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పాకిస్తాన్‌లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ రూపొందించారు. పాక్‌లోని రెడ్-లైట్ ఏరియాలో నివసించే మహిళల పోరాటాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement