Sanjay Leela Bhansali Heeramandi The Diamond Bazar Released In OTT, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Heeramandi Web Series: ఓటీటీకి వచ్చేసిన హీరామండి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published Wed, May 1 2024 6:09 PM | Last Updated on Thu, May 2 2024 11:57 AM

Sanjay Leela Bhansali Heeramandi The Diamond Bazar Streaming In Telugu

బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పీరియాడిక్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. గతంలో గంగూభాయి కతియావాడి మూవీతో సూపర్  హిట్‌ కొట్టిన ఆయన మరోసారి అలాంటి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడం మరో విశేషం.

ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మే 1వ తేదీ నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్‌ ఇదివరకే వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వర్షన్లతో పాటు 14 భాషల్లో హీరామండి సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‍లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావు హైదరి, సంజీదా షేక్, షార్మిన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 
పోషించారు.

కాగా.. భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలనలోని 1940 మధ్యకాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా హీరామండిని తెరెకెక్కించారు. పాకిస్తాన్‌లోని  రెడ్‍లైట్‍ ప్రాంతంలో జరిగే సంఘర్షణ, కుట్రల చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. హీరామండి ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటనలను ఈ సిరీస్‌లో చూపించారు. కాగా.. హీరామండి ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‍లోని లాహోర్‌లో ఉంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement