
పాతాళ్ లోక్-2 (Paatal Lok-2) వెబ్ సిరీస్ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ సిరీస్‌కు ఫిదా అవుతున్నారు. 2020లో వచ్చిన మొదటి సీజన్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. జనవరి 17న రెండో సీజన్ విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ టెన్‌లో ఈ సిరీస్ కొనసాగుతోంది. అనుష్క శర్మ నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌లో ఓ కేసును దర్యాప్తు చేసే పోలీసు అధికారి హాథీరామ్ చౌదరి పాత్రకు మంచి పేరొచ్చింది. మన తెలుగు దర్శకుడు, నటుడు నగేష్ కుకునూర్ (Nagesh Kukunoor) కూడా ఇందులో ఓ బిజినెస్ మ్యాన్‌గా కనిపించాడు. ఆయన పాత్రకు కూడా మంచి గుర్తింపు దక్కుతోంది. దీంతో ఆయన గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
హైదరాబాద్‌లో జన్మించిన నగేశ్ కుకునూర్.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత విద్యనభ్యసించేందుకు యునైటెడ్ స్టేట్స్‌లోని అట్లాంటా వెళ్లి తన చదువు పూర్తి అయిన తర్వాత కొన్నాళ్లు అక్కడే ఉద్యోగం చేశారు. తనకు ఉద్యోగం కంటే సినిమాలపై ఉన్న ఆసక్తితో అక్కడే నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ తీసుకున్నారు. అక్కడే ఉంటూ ఉద్యోగం ద్వారా సంపాధించిన డబ్బుతో 1998లోనే 'హైదరాబాద్ బ్లూస్' అనే ఆంగ్ల చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయుల గురించి అట్లాంటాలో వ్రాసిన స్క్రిప్ట్ ఆధారంగా రూపొందించబడింది.

హైదరాబాద్ బ్లూస్ (1998), రాక్‌ఫోర్డ్ (1999), ఇక్బాల్ (2005), దోర్ (2006), ఆశేయిన్ (2010), లక్ష్మి (2014), ధనక్ (2016) చిత్రాలకు గాను ఏడు అంతర్జాతీయ అవార్డులతో పాటు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో ‘గుడ్‌లక్ సఖి’ అనే తెలుగు చిత్రాన్ని కూడా ఆయన డైరెక్ట్ చేశారు. నగేశ్ ఇప్పటికే అక్షయ్ కుమార్, అయేషా టాకియా,జాన్ అబ్రహం, సోనాల్ సెహగల్ వంటి బాలీవుడ్ స్టార్స్‌ను డైరెక్ట్ చేశారు.
‘పాతాళ్ లోక్-2’లో నగేశ్ వ్యాపారవేత్త పాత్రలో మెప్పించారు. అనుష్క శర్మ మొదటిసారి నిర్మాతగా ఈ వెబ్ సిరీస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఫస్ట్ సీజన్‌కు వచ్చిన రెస్పాన్స్ రెండో సీజన్‌కు కూడా వచ్చింది. ఇందులో జైదీప్ అహ్లావత్, నగేశ్ కుకునూర్, గుల్ పనాగ్, ఇశ్వక్ సింగ్ ముఖ్యపాత్రలు పోషించారు. అనివాష్ అరుణ్ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment