బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడికి పాల్పడిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు(Mumbai Police) అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి మహారాష్ట్రలోని థానే జిల్లాలో అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సైఫ్‌పై దాడికి పాల్పడిన వ్యక్తి విజయ్ దాస్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కేసు ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు పలు బృందాలుగా విడిపోయి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో థానే జిల్లాలోని హీరానందని వద్ద జరుగుతున్న మెట్రో నిర్మాణ సమీపంలో ఉన్న ఒక లేబర్ క్యాంప్‌లో దాస్ ఆశ్రయం పొందాడు.
ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ నివాసి అయిన విజయ్ దాస్ గతంలో సైఫ్-కరీనా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పబ్‌లో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేశాడని వారు తెలిపారు. నిందితుడు మొదట అక్కడి పరిసర ప్రాంతాల్లో పని చేయడం వల్ల సులువుగా ఇంట్లోకి వెళ్లే మార్గాలను తెలుకున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. అతని అరెస్టు తరువాత, తదుపరి విచారణ కోసం దాస్‌ను ముంబైకి తరలించారు.
అంధేరీ వెస్ట్ స్టేషన్ వెలుపల దొరికిన అతని సీసీటీవీ ఫుటేజీ సహాయంతో నిందితుడిని చేరుకోగలిగామని క్రైమ్ బ్రాంచ్ వర్గాలు వెల్లడించాయి. అక్కడ అతని స్నేహితుడు తీసుకెళ్లారు. ఆ ఫుటేజీ సహాయంతో, పోలీసులకు మొదటి క్లూ లభించింది. అంటే దాస్ స్నేహితుడిని తీసుకెళ్లడానికి స్టేషన్ వెలుపలికి వచ్చిన అతని మోటారుసైకిల్ నంబర్ సాయంతో అతని వాహనాన్ని కనిపెట్టారు. అతన్ని విచారించిన తర్వాత దాస్‌ను పోలీసులు చేరుకోగలిగారు. దాస్‌ను పట్టుకునేందుకు కాసర్వదలి పోలీసులు ముంబై టీమ్‌కు సహకరించారు.
ప్రాథమిక విచారణలో నిందితుడు తక్కువ వ్యవధిలో త్వరగా డబ్బు సంపాదించాలనుకుంటున్నట్లు పోలీసులకు వెల్లడించాడు. నిందితుడు పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడు. అయితే, ముంబైలో వర్లీ కోలివాడ సమీపంలో ఉండేవాడు. సైఫ్‌పై దాడి వల్ల అరెస్టు భయంతో ఇటీవలే థానే హీరానందానీకి అతను మకాం మార్చాడు. వెస్ట్ రీజియన్ అదనపు పోలీసు కమిషనర్ పరంజిత్ దహియా, డీసీపీ జోన్ 09 దీక్షిత్ గెడం ఆధ్వర్యంలో దయా నాయక్ నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ టీమ్ యూనిట్ -9 నిందితుడిని కనిపెట్టింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ముంబయి డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆపై ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment