బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తాప్సి ప్రధాన పాత్రలో మదస్సర్ అజీజ్ తెరకెక్కించిన కామెడీ డ్రామా చిత్రం 'ఖేల్ ఖేల్ మే'. టీ-సిరీస్ నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీలో ఫర్దీన్ ఖాన్, వాణీ కపూర్, ప్రగ్యా జైస్వాల్, ఆదిత్య సీల్ కీలక పాత్రల్లో నటించారు.
దసరా కానుకగా అక్టోబర్ 09 నుంచి 'ఖేల్ ఖేల్ మే' చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. సుమారు రూ. 100 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 60 కోట్ల వరకు రాబట్టింది.
మూడు జంటల చుట్టూ తిరిగే కథతో, నవ్వులు పూయించే సన్నివేశాలతో ఉండే ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకుంది. 2016లో పర్‌ఫెక్ట్ స్ట్రేంజర్స్ పేరుతో మొదట ఇటాలియన్‌లో విడుదలైంది. ఈ ఎనిమిదేళ్లలో 26సార్లు ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఫ్రెంచ్, కొరియన్, మాండరిన్, రష్యన్, ఐస్‌ల్యాండిక్, తెలుగులో (రిచి గాడి పెళ్లి), మలయాళం (12th మ్యాన్), కన్నడలో (లౌడ్ స్పీకర్) పలు భాషల్లో ఈ చిత్రం రీమేక్ చేశారు. హిందీలో 'ఖేల్ ఖేల్ మే'గా ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment