ఓటీటీలోనే టాప్‌ వెబ్‌ సిరీస్.. కొత్త సీజన్‌పై ప్రకటన | The Family Man 3 Web Series Update | Sakshi
Sakshi News home page

ఓటీటీలోనే టాప్‌ వెబ్‌ సిరీస్.. కొత్త సీజన్‌పై ప్రకటన

Published Mon, Dec 30 2024 7:41 AM | Last Updated on Mon, Dec 30 2024 9:46 AM

The Family Man 3 Web Series Update

ఓటీటీలో సూపర్ సక్సెస్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌ నుంచి మూడో భాగం తర్వలో విడుదల కానుంది. 2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్‌లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. అయితే, రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ విభాగంలో పనిచేసే వ్యక్తికి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయో ఇప్పటి వరకు  దర్శకులు చూపించారు.

'ఫ్యామిలీ మ్యాన్‌ 3'లో మనోజ్‌ బాజ్‌పేయీ  ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ చిత్రీకరణ పూర్తి అయినట్లు మనోజ్‌ తాజాగా ప్రకటించారు. ఈమేరకు తన సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. విజయవంతంగా మూడో సీజన్‌ షూటింగ్‌ ముగిసిందని తెలిపిన ఆయన త్వరలో సరికొత్తగా ఈ ఫ్యామిలీ మ్యాన్‌  మీ ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు,తమిళ్‌,కన్నడ,మలయాళం,హిందీలో విడుదల కానుంది. అయితే, రిలీజ్‌ డేట్‌ను చిత్ర యూనిట్‌ ప్రకటించలేదు.

ఈ సిరీస్ తొలి సీజన్‌ భారత్‌పై ఉగ్రవాదులు పన్నిన కుట్రలు, దాడులను అడ్డుకోవడం వంటి అంశాల చుట్టూ సాగుతుంది. రెండో సీజన్ తమిళ్ టైగర్స్‌పై చేసే ఆపరేషన్‍ వంటి కాన్సెప్ట్‌ ఉంటుంది. ఇందులో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు.  దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్‌ తివారీగా  మనోజ్‌ ప్రేక్షకులను మెప్పించగా. ఆయన సతీమణిగా  ప్రియమణి ఆకట్టుకున్నారు. మూడో సీజన్‌లో ఈ జోడి మళ్లీ కనిపించనుంది. ఆపై ఇందులో షరీబ్‌ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్‌ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement