Manoj Bajpayee
-
'ది ఫ్యామిలీ మ్యాన్-3' గురించి గుడ్ న్యూస్
ఓటీటీలో భారీ విజయం అందుకున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ నుంచి మూడో భాగం త్వరలో విడుదల కానుంది. ఓటీటీలో భారీగా ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీమ్యాన్’ తప్పకుండా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో సీజన్ షూటింగ్ పనులను గతేడాదిలో ప్రారంభించారు. అయితే, తాజాగా ‘ఫ్యామిలీమ్యాన్ సీజన్3’ గురించి ఒక శుభవార్తను మేకర్స్ పంచుకున్నారు.ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ మ్యాన్-3 షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి అని మేకర్స్ అధికారికంగ ప్రకటించారు. అందుకు సంబంధించి వారు సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రాజ్ అండ్ డీకేతో పాటు మనోజ్ బాజ్‌పాయ్,గుల్‌పనాగ్, ప్రియమణి, సమంత పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో వారు పంచుకున్నారు.ఈ సిరీస్ తొలి సీజన్ భారత్‌పై ఉగ్రవాదులు పన్నిన కుట్రలు, దాడులను అడ్డుకోవడం వంటి అంశాల చుట్టూ సాగుతుంది. రెండో సీజన్ తమిళ్ టైగర్స్‌పై చేసే ఆపరేషన్ వంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు. దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ ప్రేక్షకులను మెప్పించగా. ఆయన సతీమణిగా ప్రియమణి ఆకట్టుకున్నారు. మూడో సీజన్లో ఈ జోడి మళ్లీ కనిపించనుంది. ఆపై ఇందులో షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్‌లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. అయితే, రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. 'ఫ్యామిలీ మ్యాన్ 3'లో కూడా మనోజ్ బాజ్పేయీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తి అయింది. కానీ, విడుదల తేదీని ప్రకటించలేదు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో విడుదల కానుంది. It's a wrap on Season 3 of The Family Man! Thank you to the wonderful crew and cast for going through with the toughest shoot yet! ❤️#TFM #TheFamilyMan3 pic.twitter.com/WXogsICE6v— Raj & DK (@rajndk) January 23, 2025 -
ఓటీటీలోనే టాప్ వెబ్ సిరీస్.. కొత్త సీజన్‌పై ప్రకటన
ఓటీటీలో సూపర్ సక్సెస్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుంచి మూడో భాగం తర్వలో విడుదల కానుంది. 2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్‌లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. అయితే, రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విభాగంలో పనిచేసే వ్యక్తికి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయో ఇప్పటి వరకు దర్శకులు చూపించారు.'ఫ్యామిలీ మ్యాన్ 3'లో మనోజ్ బాజ్పేయీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తి అయినట్లు మనోజ్ తాజాగా ప్రకటించారు. ఈమేరకు తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. విజయవంతంగా మూడో సీజన్ షూటింగ్ ముగిసిందని తెలిపిన ఆయన త్వరలో సరికొత్తగా ఈ ఫ్యామిలీ మ్యాన్ మీ ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో విడుదల కానుంది. అయితే, రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించలేదు.ఈ సిరీస్ తొలి సీజన్ భారత్‌పై ఉగ్రవాదులు పన్నిన కుట్రలు, దాడులను అడ్డుకోవడం వంటి అంశాల చుట్టూ సాగుతుంది. రెండో సీజన్ తమిళ్ టైగర్స్‌పై చేసే ఆపరేషన్ వంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు. దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ ప్రేక్షకులను మెప్పించగా. ఆయన సతీమణిగా ప్రియమణి ఆకట్టుకున్నారు. మూడో సీజన్లో ఈ జోడి మళ్లీ కనిపించనుంది. ఆపై ఇందులో షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రూ.9 కోట్ల ఇంటిని అమ్మేసిన 'ఫ్యామిలీ మ్యాన్' హీరో
తెలుగులో పలువురు హీరోహీరోయిన్లకు రెస్టారెంట్స్, పబ్బులు ఉన్నాయి. యాక్టింగ్ కాకుండా ఇలా బిజినెస్‌లోనూ కాలు పెడుతున్నారు. బాలీవుడ్లో మాత్రం యాక్టర్స్ చాలామంది కొత్త తరహా బిజినెస్‌లు చేస్తున్నారు. ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనడం.. కొన్నేళ్ల తర్వాత దాన్ని అమ్మడం, తద్వారా కోట్లలో లాభాలు అర్జించడం పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్)ప్రేమకథ, హ్యాపీ, పులి, వేదం తదితర తెలుగు సినిమాల్లో నటించిన మనోజ్ బాజ్‌పాయ్.. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీని తర్వాత హిందీలో సోలోగా మూవీస్ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. అయితే పదేళ్ల క్రితం ముంబైలోని మినర్వా ప్రాంతంలో భార్యతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌ని రూ.6 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇప్పుడు దీన్నే రూ.9 కోట్లకు విక్రయించాడు.కొన్నిరోజుల క్రితమే విక్రయం జరిగిందని, ఈ అపార్ట్మెంట్ అమ్మడం ద్వారా మనోజ్ బాజ్‌పాయ్‌కి దాదాపు రూ.3 కోట్లు లాభమొచ్చినట్లే. ఇదిలా ఉండగా రీసెంట్గా హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా తన ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఇంటిని రూ.25 కోట్ల అమ్మకానికి పెట్టింది. ఖరీదైన బాంద్రా ఏరియాలో ఈ ఫ్లాట్ ఉంది. ఇదంతా చూస్తుంటే బాలీవుడ్ స్టార్స్ రెండు చేతులా సంపాదించేస్తున్నారు అనిపిస్తోంది. (ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
కూరగాయల దగ్గర బేరాలు ఆడితే తిడుతున్నారు: బాలీవుడ్ నటుడు
బేరం (బార్కేనింగ్) ఆడటం అందరికీ చేత కాదు. అమ్మేవాళ్లు ఎంత చెప్పినా సరే కొనేవాళ్లు మాత్రం బేరమాడి వారు అనుకున్న తక్కువ ధరకు ఆయా వస్తువులను సొంతం చేసుకుంటారు. ఈ బేరమాడే క్రమంలో కొన్నిసార్లు సఫలమైనా మరికొన్నిసార్లు అక్షింతలు పడుతుంటాయి. అయితే తాను కూరగాయలు అమ్మేవారి దగ్గర బేరమాడానంటున్నాడు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్.బేరాలు..తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతడికి ఎప్పుడైనా కూరగాయల దగ్గర బేరమాడారా? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకతడు స్పందిస్తూ నేను బేరాలడితే తిడుతున్నారు. ఇది మీకు సూటవదని చెప్తున్నారు. నేనేమో.. బేరమాడటం ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పాను. నేనెవరో తెలీదన్నట్లు..నా భార్య షబానా అయితే నేనెవరో తెలీదన్నట్లు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తనకు బేరాలడటమనేది అస్సలు నచ్చదు. అలాగే మేము ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా జనపనారతో చేసిన క్యారీ బ్యాగులు వాడుతున్నాం. ఏ సరుకులు కొనడానికి వెళ్లినా ఆ బ్యాగునే తీసుకెళ్తాం అని మనోజ్ బాజ్‌పాయ్ చెప్పుకొచ్చాడు.చదవండి: తెలివితక్కువదానిలా ఉన్నావంటూ ఆ హీరో తిట్టాడు: సీనియర్ హీరోయిన్ -
నాన్నను బతికుండగానే కాలం చేయమని కోరా!: నటుడు
పేరెంట్స్‌ను బతికుండగానే కాటికి వెళ్లిపోమని చెప్పడం ఎంతటి నేరం, ఘోరం..! కానీ తనకు అలా చెప్పక తప్పలేదంటున్నాడు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్. తన తండ్రి ఆర్కే బాజ్‌పాయ్ మంచం మీద చివరి స్టేజీలో ఉన్నప్పుడు ఆయన అవస్థ చూడలేక వెళ్లిపోమని చెప్పాడట.. ఈ బాధాకర విషయాన్ని మనోజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.అత్యంత విషాదకరమైన సంఘటన'నా జీవితంలోనే అత్యంత విషాదకరమైన సంఘటన నాన్న మరణం. ఒక రోజు నా సోదరి ఫోన్ చేసి నాన్న జీవితం పూర్తయిందని చెప్పింది. డాక్టర్లు మాత్రం ఆయన ఇంకా ఈ ప్రపంచంలోనే ఇరుక్కుపోయాడన్నారు. నాకు, నాన్నకు మధ్య ఎక్కువ ఆప్యాయత ఉండేది. అందుకని నన్నే అతడిని విముక్తి చేయాలని చెప్పారు. అప్పుడు నేను కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ సెట్స్‌లో ఉన్నాను. ప్లీజ్ వెళ్లిపో..నా వ్యాన్‌లో ఓ బాయ్ ముందే నాన్నతో ఫోన్లో మాట్లాడాను. నాన్న, నొప్పి భరించింది చాలు.. ప్లీజ్ వెళ్లిపో.. అందరినీ వదిలి వెళ్లిపోయే సమయం వచ్చేసింది అని చెప్పాను. అలా మాట్లాడినందుకు నా మనసు ఎంత కుంగిపోయిందో! నా మాటల్ని విన్న బాయ్ ఏడ్చేశాడు. ఆ రోజులు ఎంత కష్టంగా గడిచాయో నాకు మాత్రమే తెలుసు. నేను అలా మాట్లాడిన తర్వాతి రోజు తెల్లవారుజామున నాన్న చనిపోయాడు. నాన్న నన్ను చూడాలనే తన శరీరాన్ని వదిలి వెళ్లిపోలేదు. Father’s Day 🙏🙏 pic.twitter.com/SMScmr038r— manoj bajpayee (@BajpayeeManoj) June 18, 2023 ఆ మరుసటి రోజేఎప్పుడైతే నా గొంతు విన్నాడో అప్పుడు ఆయన మనసు తేలికపడింది. ఆయన చనిపోయారన్న వార్త వినగానే కన్నీళ్లాగలేదు. ఆ తర్వాత కొంతకాలానికి మా అమ్మకు క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టింది. తను ఊరిలో ఉండి సొంత వైద్యం ప్రయత్నించింది. అయితే నా సోదరి మెరుగైన వైద్యం కోసం అమ్మను సిటీకి తీసుకొచ్చింది. కానీ ఆమెకు మా మీద ఆధారపడటం ఎంతమాత్రం ఇష్టం లేదు. చావే నయం!ఒకరి మీద ఆధారపడటం కన్నా చావే నయమని డాక్టర్స్‌తో చెప్పింది. నాన్న చనిపోయిన మరుసటి ఏడాదే ఆమె కూడా మరణించింది' అని మనోజ్ బాజ్‌పాయ్ చెప్పుకొచ్చాడు. కాగా నటుడి తండ్రి ఆర్కే బాజ్‌పాయ్ 2021 అక్టోబర్‌లో చనిపోగా తల్లి 2022 డిసెంబర్లో మరణించింది. View this post on Instagram A post shared by Manoj Bajpayee (@bajpayee.manoj) చదవండి: ఎన్టీఆర్ షర్ట్‌పై రచ్చ -
హమ్మయ్యా.. బ్లాక్ బస్టర్ సిరీస్ మూడో సీజన్ మొదలైంది
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్ల కంటే ఓటీటీల్లో మూవీస్-వెబ్ సిరీసులు చూసేవాళ్లే ఎక్కువయ్యారు. అందుకు తగ్గట్లే ఆయా సంస్థలు సరికొత్త సిరీసులు తీసుకొస్తున్నాయి. అలానే కొన్ని హిట్ సిరీస్‌లకు తర్వాత భాగాల్ని కూడా మొదలుపెడుతున్నాయి. అలా ఓటీటీలో సెన్షేషన్ సృష్టించిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది.దేశభక్తి అనేది ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. ఇప్పటికే వందలాది సినిమాలు వచ్చాయి. పదుల సంఖ్యలో సిరీసులు వస్తున్నాయి. అయితే దేశభక్తి ప్లస్ ఓ మధ్య తరగతి వ్యక్తి నేపథ్యంగా తీసిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్.. ఈ జానర్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకే తీసిన ఈ సిరీస్‌లో మనోజ్ భాజ్‌పాయ్-ప్రియమణి జంటగా నటించారు.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్‌లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రిపీట్స్‌లో చూశారు. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. తొలి భాగమంతా కానప్పటికీ మంచి స్పందన దక్కించుకుంది. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు.అయితే రెండో సీజన్ వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ అప్డేట్ లేకపోయేసరికి చాలామంది దీని గురించి మర్చిపోయారు. సరిగ్గా ఇలాంటి టైంలో మూడో సీజన్ షూటింగ్ మొదలైందని డైరెక్టర్స్ ప్రకటించారు. లొకేషన్ నుంచి ఓ పిక్ కూడా రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది దీని రిలీజ్ ఉంటుంది.(ఇదీ చదవండి: ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా) View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతున్న 'మిస్టరీ థ్రిల్లర్' సినిమా
మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్లో నటించిన 'సైలెన్స్' (Silence... Can You Hear It?) అనే మిస్టరీ థ్రిల్లర్ సినిమా 2021లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అది కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్నడం విశేషం. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి సైలెన్స్ చిత్రం మెప్పించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'సైలెన్స్ 2 ది నైట్ ఔల్ బార్ షూటౌట్' మీ ముందకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అబన్ బరూచా దేవ్‌హన్స్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయీ, ప్రాచీ దేశాయ్ కలిసి నటించారు. ఏప్రిల్ 16 నుంచి సైలెన్స్ 2 సినిమా జీ5లో డైరెక్ట్‌గా విడుదల కానుంది. ప్రస్తతం హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులోకి రానుంది. ఈమేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. జీ స్టూడియోస్, క్యాండిడ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నగరంలో జరుగుతున్న వరుస హత్యల వెనకున్న హంతకులను పట్టుకునే మిస్టరీని ఏసీపీ అవినాష్ వర్మగా నటించిన మనోజ్ ఏ విధంగా చేదించాడనేది కథకు ప్రధాన మూలం. కథలో ఎన్నో ట్విస్ట్‌లతో పాటు థ్రిల్లింగ్‌ను పంచే సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 16న విడుదల కానున్న సైలెన్స్ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందన జీ5 ప్రకటించింది. -
'ఫ్యామిలీ మ్యాన్' కాదు ఇకపై 'భయ్యాజీ'
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి హీరోగా నటిస్తున్న తాజా హిందీ చిత్రానికి ‘భయ్యాజీ’ అనే టైటిల్ ఖరారైంది. ‘సిర్ఫ్ ఏక్ బందా కఫీ హై’ (2023) సినిమా తర్వాత మనోజ్ బాజ్‌పేయి, దర్శకుడు అపూర్వ్సింగ్ కర్కీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని బాలీవుడ్ సమాచారం. కాగా ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 20న, సినిమాను మే 24న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కాగా ‘భయ్యాజీ’ చిత్రం మనోజ్ బాజ్‌పేయి కెరీర్లో వందో చిత్రం కావడం విశేషం. -
ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
పలు అవార్డులు గెలుచుకున్న సూపర్‌హిట్ థ్రిల్లర్ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. గత కొన్నాళ్ల నుంచి సినీ ప్రేమికులు ఈ చిత్రం తెగ ఎదురుచూస్తూ వచ్చారు. తెలుగు మూవీ కానప్పటికీ దీని కోసం వెయిట్ చేశారు. ఇప్పుడు వాళ్ల ఎదురుచూపులు ఫలించాయి. డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే చిన్న కండీషన్. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం. సినిమా సంగతేంటి? బాలీవుడ్లో గతేడాది రిలీజైన విభిన్నమైన సినిమాల్లో 'జొరమ్' ఒకటి. ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా.. డిసెంబరు 8న థియేటర్లలో రిలీజైంది. కానీ అంతకంటే ముందే సిడ్నీ, డర్బన్, షికాగో, ఎడిన్‌బరో లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో దీన్ని ప్రదర్శించారు. అలానే బెస్ట్ యాక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ తదితర విభాగాల్లో అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ మధ్య కాలంలో అయితే ఫిలింఫేర్-2024లో ఉత్తమ చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా) కథేంటి? జార్ఖండ్ అడవుల్లో నివసించే దస్రు-వాను అనే గిరిజన జంటకు జొరమ్ అనే మూడు నెలల కూతురు ఉంటుంది. ఊళ్లో పనిలేక పొట్టచేత పట్టుకుని ముంబై వస్తారు. బిల్డింగ్ కట్టే చోట రోజూవారీ కూలీలుగా పనిచేస్తుంటారు. అయితే తన కొడుకుని దస్రు చంపేశాడని అతడిని పట్టుకునేందుకు ముంబై వస్తుంది. భార్య వానుని చంపేయడంతో మూడు నెలల కూతురితో కలిసి దస్రు పారిపోతాడు. పోలీసుల నుంచి దాక్కుని మరీ సొంతూరికి పయనమవుతాడు. మరి నెలల కూతురితో కలిసి దస్రు ఊరికి చేరుకున్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఏ ఓటీటీలో? ఆదివాసులకు ఉండే సమస్యలు, అడవులు విధ్వంసం లాంటి స్టోరీ లైన్‌తో తీసిన 'జొరమ్'.. దాదాపు రెండు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. హిందీలో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతానికి అయితే రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. కాబట్టి ఈ వీకెండ్ సమ్‌థింగ్ డిఫరెంట్ ఉంటే సర్వైవల్ థ్రిల్లర్ చూద్దామనుకుంటే 'జొరమ్' ట్రై చేయొచ్చు. రియాలిటీకి దగ్గరగా ఉండే ఈ చిత్రం మరి ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) -
ఆస్కార్ లైబ్రరీలో జోరమ్
హిందీ చిత్రం ‘జోరమ్’ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ లైబ్రరీలో ఈ సినిమాకు చోటు దక్కింది. దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో మనోజ్ బాజ్‌పాయ్, మొహమ్మద్ జీషన్ అయ్యూబ్, తన్నిష్ఠ ఛటర్జీ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా రూపొందింది. జీ స్టూడియోస్, మఖిజా ఫిలింస్ ఈ సినిమాను నిర్మించాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రోటర్‌డామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, జూన్‌లో సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్, జూలైలో డర్బన్ ఫిల్మ్ ఫెస్టివల్, అక్టోబరులో 28వ బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 59వ చికాగో ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శితమైంది. థియేటర్స్‌లో గత ఏడాది డిసెంబరు 8న విడుదలైంది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మెరుగైన ఫలితం దక్కలేదు. అయితే తాజాగా ఈ సినిమా వందేళ్ల చరిత్ర ఉన్న ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో షేర్ చేశారు మనోజ్ బాజ్‌పాయ్. ‘‘నా చిత్రానికి ఇలాంటి గౌరవం దక్కడం సంతోషంగా ఉంది. ఇది యూనిట్ సమష్టి విజయం. మనం ఎంత చేయగలమో మనకే తెలుసు’’ అని పేర్కొన్నారు మనోజ్. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే.. తన కుమార్తె ప్రాణాలను కాపాడటం కోసం ఓ తండ్రి చేసే పోరాటం నేపథ్యంలో సాగే సర్వైవల్ డ్రామాగా ‘జోరమ్’ తెరకెక్కింది. 2016లో ‘తాండవ్’ షార్ట్ ఫిల్మ్, 2020 జూన్‌లో ‘భోంస్లే’ (ఇండియా రిలీజ్) చిత్రాల తర్వాత హీరో మనోజ్ బాజ్‌పాయ్, దర్శకుడు దేవాశిష్ మఖిజా కాంబినేషన్లో రూపొందిన మూడో చిత్రం ‘జోరమ్’. -
ఆ నటుడు పిచ్చోడిలా ప్రవర్తించాడు.. అందరూ పారిపోయారు!
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ సెట్స్‌లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించేవాడంటున్నాడు ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా. 'దిల్ పే మత్ లె యార్' సినిమా సెట్స్‌లో మనోజ్‌ను చూసి ఇతరులు భయపడేవారని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ.. 'దిల్ పే మత్ లె యార్ సినిమా 2000వ సంవత్సరంలో రిలీజైంది. ఆ సినిమా షూటింగ్లో మనోజ్ చాలా వింతగా ప్రవర్తించేవాడు. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. తనకు చాలా మూడ్ స్వింగ్స్ ఉండేవి. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలిసేది కాదు. చెప్పాలంటే ఆ సమయంలో అతడు మాకు తలనొప్పిలా మారాడు. అలా అని చెడ్డవాడు కాదు! అలా అని అతడు చెడ్డవాడు కూడా కాదు. మంచివాడు. కానీ ఊరికే చికాకు తెప్పించేవాడు. ఒకసారి నాకు కోపమొచ్చి ఎందుకిలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నావని అడిగేశా. అప్పుడు అతడు ఏం సమాధానమివ్వకుండా తన పాత్ర డైలాగ్స్‌కు సంబంధించి పేపర్ తీసుకుని ప్రిపేర్ అయ్యాడు. అతడు చేయాల్సిన రోల్ ఇలా ఇరిటేటింగ్‌గా ఉండాలని ఎవరు చెప్పకపోయినా అలాగే ప్రవర్తించేవాడు. అందరి మీదా అరిచేవాడు. చాలామంది అతడికి దూరంగా పారిపోయేవాళ్లు. కిల్లర్ సూప్‌లో మనోజ్ సౌరభ్ శుక్లా అయితే.. నేను తనతో మాట్లాడటానికి ప్రయత్నించా.. నిజంగా పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడు.. అసలేం జరుగుతోంది అని జుట్టు పీక్కునేవాడు. అలా మనోజ్ సెట్స్‌లో అందరినీ ఆగం చేశాడు' అని చెప్పుకొచ్చాడు. కాగా మనోజ్, సౌరభ్ శుక్ల 'సత్య' సినిమాలో కలిసి పని చేశారు. అలాగే డైరెక్టర్ హన్సల్తో కలిసి అలీఘర్ సినిమాకు పని చేశాడు. ఇకపోతే మనోజ్ ప్రస్తుతం కిల్లర్ సూప్ అనే కామెడీ సిరీస్‌లో నటించాడు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 11న రిలీజ్ కానుంది. అలాగే హన్సల్ మెహతా తెరకెక్కించిన ద బకింగ్‌హామ్ మర్డర్స్ విడుదలకు రెడీ అవుతోంది. చదవండి: అమ్మ జీవితంలో చాలా మిస్సయింది.. రెండో పెళ్లి.. మేము ఏమంటామోనని.. -
ఆర్జీవీలోని విలక్షణతకు ఈ చిత్రం నిదర్శనం
ఆర్జీవీ.. రాం గోపాల్ వర్మ. సంచలనాలను, వివాదాలకు, అన్నింటికి మించి బోల్డ్‌కు కేరాఫ్. ఈ మధ్యకాలంలో వర్మ సినిమాల ఆడడం మాట ఏమోగానీ.. కెరీర్ తొలినాళ్లలో ఆయన ప్రదర్శించిన విలక్షణతను మరే దర్శకుడు కనబర్చలేదన్నది ఒప్పుకోవాల్సిన విషయం. అప్పటిదాకా మూస ధోరణితో సాగిపోతున్న కమర్షియల్ సినిమాకు సత్య అనే గ్యాంగ్‌స్టర్ అనే డ్రామాను అందించి బాలీవుడ్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించడమే కాదు.. ఆ రియలిస్టిక్ సబ్జెక్టుతోనూ సంచలన విజయం అందుకున్నారాయన. 🎥 రియల్ ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకుని వర్మ చేసిన తొలి గొప్ప ప్రయత్నంగా సత్యను అభివర్ణిస్తుంటారు చాలామంది సినీ క్రిటిక్స్. అప్పటికే పదిదాకా సినిమాలు తీసిన అనుభవం.. మంచి సక్సెస్ రేటు అందుకున్న ఘనత కూడా ఉంది. అయితే.. బాలీవుడ్‌కు పెద్దగా పరిచయం ఉండని కొత్త ముఖాలతోనే సినిమా తీయాలనుకున్న వర్మ.. జేడీ చక్రవర్తిని గా తీసుకున్నారు. ఉర్మిళ హీరోయిన్ కాగా.. మనోజ్ బాజ్‌పాయితో పాటు సౌరభ్ శుక్లా లాంటి మెథడ్ యాక్టర్లు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. అలాగే సీఐడీ ఫేమ్ ఆదిత్యా శ్రీవాస్తవ, తెలుగు నటుడు బెనర్జీకి మంచి గుర్తింపు దక్కింది. 🎥 ఓ కంప్లీట్ యాక్షన్ సినిమా తీయాలనుకున్న వర్మ.. కొందరు రియల్ క్రిమినల్స్‌ను కలుసుకున్నాక తన ఆలోచన మార్చేసుకున్నారట. అలా వాస్తవ జీవితాల నుంచి పుట్టిందే సత్య కథ. అలాగని సత్య కథ అల్లింది వర్మ కాదు. అందులో కల్లుమామ పాత్రధారి సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్‌లు రైటర్లు. అంతకు మించి.. పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసం ముంబైకి వచ్చి.. అక్కడి నుంచి అండర్ వరల్డ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకునే సత్యది. 🎥 కోటి కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే సత్యకు భీకూతో స్నేహం, విద్యతో ప్రేమ బంధం.. మాఫియా మేఘాలు అలుముకుని చివరకు విషాద ముగింపు తీసుకోవడం.. ఇలా చాలా రియల్స్టిక్గా వర్మ చూపించిన విధానాన్ని ఆడియొన్స్ ఆదరించారు. 🎥 వాస్తవానికి.. కొత్త వాళ్లతో సినిమా వర్మ అనౌన్స్ చేయగానే చాలామంది ఆశ్చర్యపోయారట. అందుకు తగ్గట్లే.. సినిమా షూటింగ్ మొదలైన మూడు రోజులకే కొన్ని కారణాల వలన ఆగిపోయిందట. నిజానికి ఈ సినిమాలో సాంగ్స్ లేకుండా ప్లాన్ చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి కారణంగా వర్మ, విశాల్ భరద్వాజ్, సందీప్ చౌతలతో(బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) మ్యూజిక్ కంపోజ్ చేయించాడు. Video Credits: Mango Music 🎥 రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం.. 1998 జులై 3వ తేదీన విడుదల అయ్యింది. ఐదు రెట్ల కలెక్షన్ల వసూలుతో భాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో పాటు.. 1998లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలో నిలిచింది కూడా. 🎥 వర్మలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సత్య.. ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు ఓ జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. మనోజ్ బాజ్పాయికి నేషనల్ అవార్డు దక్కింది. 🎥 మొత్తంగా వర్మ కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమాగా.. కల్ట్ హోదాను దక్కించుకుని భారతీయ చలన చిత్ర రంగంలో గొప్ప చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది. 🎥 2008 ఆస్కార్ అవార్డు అందుకున్న స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రానికి సత్య ఒక స్ఫూర్తి. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు డానీ బోయల్ స్వయంగా చెప్పాడు. సత్య సినిమా షూటింగ్ మూడో రోజు విన్న ఒక వార్త బాధాకరంగా అనిపించింది. టీ సిరీస్ గుల్షన్ కుమార్‌ను కాల్చి చంపారనే వార్త. ఆ తర్వాత అండర్‌వరల్డ్‌పై సినిమా తీయొద్దంటూ మా మీద ఒత్తిడి పెరిగింది. ఆ పరిణామం ఒకవైపు ఇబ్బందికరంగా, మరోవైపు బాధగా అనిపించింది. కానీ, వర్మ అనుకున్నది ఓ పట్టాన వదిలే రకం కాదు. తనకు రైట్ అనిపిస్తే చేసేస్తాడంతే. అదే సమయంలో.. తాను అనుకున్నది అండర్‌వరల్డ్‌ను గొప్పగా చూపించడం కాదని వర్మ తేల్చేశాడు. ఇంకేం.. అలా మాఫియా ప్రపంచంలో ఉండే భావోద్వేగాల్ని ప్రధానంగా చేసుకుని కథ తెరకెక్కింది.. మంచి విజయం అందుకుంది: జేడీ చక్రవర్తి ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో.. -
అల్లు అర్జున్, సమంతని కలవాలనుకున్నా.. ఆర్జీవీ డెన్‌కి వెళ్లాలనుంది, కానీ..?
-
కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్
మనోజ్ భాజ్‌పేయి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులోనూ అగ్రహీరోల సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. మనోజ్ భాజ్‌పేయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ 'ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్' గురించి మాట్లాడారు. (ఇది చదవండి: అలాంటి సీన్స్ చూసి నా భార్య ఫీలైంది: మనోజ్ భాజ్‌పేయి) దర్శకద్వయం రాజ్, డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు మనోజ్ బాజ్‌పేయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సిరీస్‌లో శ్రీకాంత్ తివారీగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. అయితే ఈ సిరీస్‌లో నటించడానికి మనోజ్ మొదట్లో ఆసక్తి చూపించలేదట. మరోవైపు ఆయన భార్య కూడా ఈ సిరీస్ గురించి విని కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావు? అని అడిగిందట. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. మనోజ్ మాట్లాడుతూ.. 'ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కోసం రాజ్ అండ్ డీకే నన్ను ఫోన్లో సంప్రదించేందుకు యత్నించారు. ఆ సిరీస్‌లో శృంగారం, హింస మితిమీరి ఉంటాయని భావించి ఇలాంటి ప్రాజెక్ట్‌లు చేయనని వారికి చెప్పేశా. మీరు అనుకున్నట్టుగా ఆ సిరీస్ ఉండదు. ఒక్కసారి వచ్చి కలవండి అని చెప్పారు. వారి మాటపై నమ్మకం ఉంచి వాళ్లను కలిశా. స్క్రిప్ట్ విన్నాక నాలో ఆసక్తి పెరిగింది. దీంతో ఒకే చెప్పేశా. ఎనిమిది నెలలపాటు ఈ ప్రాజెక్ట్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నా.' అని తెలిపారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత) ఆ తర్వాత ఈ విషయం నా భార్యకు తెలిసి వెబ్‌సిరీస్ అంటే టీవీ సీరియల్ అనుకుని నటించవద్దని చెప్పింది. ఇలాంటి వాటిల్లో నటించి నీ కెరీర్ నాశనం చేసుకుంటావు? అని ప్రశ్నించింది. అయితే సిరీస్ విడుదలయ్యాక వచ్చిన ఆదరణ చూసి ఆమె ఆనందించిందని తెలిపారు. మనోజ్ బాజ్‌పేయి నటించిన చిత్రం సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై. కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వం వహించారు. -
అలాంటి సీన్స్ చూసి నా భార్య ఫీలైంది: మనోజ్ భాజ్‌పేయి
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి తెలుగువారికి కూడా సుపరిచితమే. అల్లు అర్జున్ హీరోగా నటించిన హ్యాపీ సినిమాతో తన హావభావాలతో అదరగొట్టాడు. టాలీవుడ్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం తాను నటించిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హైని మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనోజ్ తన భార్య గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (ఇది చదవండి: అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ) అయితే తన భార్య షబానా తన సినిమా చూసి అవమానంగా భావించిందని మనోజ్ తెలిపారు. తెరపై హీరోయిన్లతో రొమాన్స్ చేసే సీన్స్ చేయడం తనకు ఇష్టం లేదని.. డబ్బు కోసం సినిమాలు చేయడం మానేయండని సలహా కూడా ఇచ్చిందని వెల్లడించారు. తన భార్య సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లగా.. కొంతమంది అమ్మాయిలు ఇదొక చెత్త సినిమా అన్నారని చెబుతూ బాధపడిందన్నారు. (ఇది చదవండి: అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!) దయచేసి మీరు ఇలాంటి పాత్రలు చేయవద్దని.. కేవలం మంచి పాత్రలనే ఎంచుకోవాలని సూచించింది. కాగా.. మనోజ్ సత్యమేవ జయతే, బాఘీ 2 వంటి చిత్రాలలో కూడా కనిపించాడు. సత్యమేవ జయతే సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో తన ఫన్నీ క్యారెక్టర్ చూసి భార్య నవ్విందని మనోజ్ చెప్పుకొచ్చారు. -
రామ్ గోపాల్ వర్మ నన్ను మోసం చేశాడు: బాలీవుడ్ నటుడు
రామ్ గోపాల్ వర్మ.. చిక్కడు, దొరకడు. ఎవరికీ ఓ పట్టాన అర్థం కాని వర్మ గతంలో ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చాడు. కానీ ఈ మధ్యే రియల్ ఇన్సిడెంట్లను రీల్ మీద చూపిస్తానని ప్రయత్నిస్తూ బొక్కబోర్లా పడుతున్నాడు. ఇకపోతే వర్మ తెరకెక్కించిన హిట్ చిత్రాల్లో సత్య మూవీ ఒకటి! ఇందులో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ముఖ్య పాత్రలో నటించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వర్మ తనను మోసం చేశాడని చెప్పాడు. 'సత్య సినిమాలో పరేశ్ రావల్ గ్యాంగ్‌లో మెయిన్ రోల్ కోసం రాము (ఆర్జీవీ) వెతుకున్నారని తెలిసి నేను వెళ్లాను. రాము ఉన్న గదిలోకి వెళ్లగానే ఆయన కూర్చోమన్నారు. ఇంతకుముందు ఏం చేశావు? అన్నాడు. మహేశ్ భట్ సినిమాలో ఓ ముఖ్య పాత్ర అలాగే బందిత్ క్వీన్ చేశానని బదులిచ్చాను. వెంటనే ఆయన ముఖం వెలిగిపోయింది. బందిత్ క్వీన్ సినిమాకు ఆయన వీరాభిమాని. ఆ చిత్రాన్ని మూడు,నాలుగు సార్లు చూశాడట! అందులో ఏ పాత్ర చేశావని అడిగితే మాన్ సింగ్ రోల్ అని చెప్పాను. వెంటనే అతడు లేచి నిలబడి నువ్వసలు మాన్ సింగ్‌లానే కనిపించడం లేదు. చూస్తే చిన్నవాడిలా ఉన్నావు. కానీ మాన్ సింగ్ పాత్రలో బాగా కనిపించావని మెచ్చుకున్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'నీకోసం ఐదేళ్లుగా వెతుకుతున్నాను. నాకంతా ఆశ్చర్యంగా ఉంది. నా సినిమాలో నీకు లీడ్ రోల్ ఇస్తా.. ఇంకేం ఆలోచించకు, నువ్వు మరే సినిమాకు ఒప్పుకోకు. ప్రధాన పాత్రలో నువ్వు మాత్రమే నటిస్తున్నావంతే' అని చెప్పుకొచ్చాడు. అప్పటికే దౌడ్ సినిమా మధ్యలో ఉన్న నేను అది ముగించేసరికి ఆర్జీవీ సత్య స్క్రిప్ట్ పూర్తి చేశాడు. ఓ రోజు ఫోన్ చేసి నువ్వు సెకండ్ లీడ్ అన్నాడు. నా మనసు ముక్కలైంది. అతడు మాట తప్పాడు. మోసం చేశాడు. సెకండ్ లీడ్‌గా చేయాలా? ఏం లాభం? అని అడిగాను. అతడు ఇంటికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాడు. హీరో పాత్ర కోసం ఎవరినైనా తీసుకోవచ్చు. కానీ బికు మాత్రే పాత్రకు మాత్రం ఓ గొప్ప వ్యక్తి కావాలి. అది నువ్వే అన్నాడు. కానీ సినిమా షూటింగ్‌లోనూ, రిలీజయ్యాక కూడా నాకు మంచి గుర్తింపు వచ్చింది' అన్నాడు మనోజ్ బాజ్‌పాయ్. ఇకపోతే సత్య సినిమాలో జేడీ చక్రవర్తి, ఊర్మిళ మటోండ్కర్, సౌరభ్ శుక్లా సహా పలువురు నటించారు. చదవండి: ప్రముఖ నటి ఇంటి మోగనున్న పెళ్లి బాజాలు కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య నివాళులు -
14ఏళ్లుగా భోజనం చేయడం లేదు : బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఫ్యామిలీ మ్యాన్-2తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించారు. సుమంత్ హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథ’ చిత్రంలో విలన్‌గా నటించారు. అల్లు అర్జున్ మూవీ హ్యాపీలో తనదైన నటనతో మెప్పించారు. చదవండి: అహంకారమా? అజ్ఞానమా? పవన్ పోస్టర్‌పై పూనమ్ ఫైర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత జీవితంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాల విషయం పక్కన పెడితే కొన్నేళ్లుగా నా లైఫ్‌స్టైల్ మొత్తం మారిపోయింది. గత 13-14ఏళ్లుగా నేను రాత్రిపూట భోజనం చేయటం లేదు. దీనివల్ల నా బరువు చాలా అదుపులో ఉంది. దీన్ని నేను మా తాత దగ్గర్నుంచి చూసి నేర్చుకున్నాను. ఆయన రాత్రుళ్లు భోజనం చేసేవారు కాదు. సన్నగా, ఫిట్‌గా, ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించేవారు. అందుకే నేను కూడా ఆయన్ను ఫాలో అయ్యాను. డిన్నర్ మొత్తం మానేయడం అంటే మొదట్లో చాలా కష్టంగా అనిపించేది. ఆకలిని కంట్రోల్ చేయడానికి బిస్కెట్లు లాంటివి తినేవాడిని. కానీ క్రమక్రమంగా అలవాటు చేసుకున్నా. ఈ రొటీన్ వల్ల నా బరువు అదుపులో ఉండటంతో పాటు చాలా వరకు ఎనర్జీతో ఉండగలుగుతున్నా అంటూ మనోజ్ బాజ్‌పాయ్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ షూటింగ్లో ఆయన పాల్గొంటారు. చదవండి: సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం హరోం హర, గ్లింప్స్ చూశారా? -
ఆ విషయం తెలియక మందు తాగలేదు: మనోజ్
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ బీ టౌన్లో పరిచయం అవసరం లేదు. ఆయన టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించారు. సుమంత్ హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథ’ చిత్రంలో విలన్‌గా నటించారు. అల్లు అర్జున్ మూవీ హ్యాపీలో తనదైన నటనతో మెప్పించారు. ఆయన నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో సక్సెస్ అందుకున్నారు. అయితే తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను మొదటిసారి ఫారిన్‌కు వెళ్లినపుడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. మనోజ్ మాట్లాడుతూ..'నేను థియేటర్ ఆర్టిస్టుగా ఉన్నపుడు పారిస్ వెళ్లా. అదే నాకు ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ జర్నీ. ఇండియా నుంచి వెళ్లేటపుడు ఆల్కహాల్ తీసుకోలేదు. దానికి డబ్బులు తీసుకుంటారనుకున్నా. కానీ ఫ్లైట్‌లో మందు ఫ్రీగా సర్వ్ చేస్తారని నాకు తెలియదు. అక్కడికి వెళ్లిన తర్వాతే తెలిసింది. ఆ తర్వాత రిటర్న్ జర్నీలో ఫుల్‌గా తాగేసి పడిపోయా.' అని చెప్పుకొచ్చాడు. కాగా.. మనోజ్ చివరగా గుల్మోహర్ చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో డెస్పాచ్, సూప్, జోరమ్ చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. -
ఆ నటుడు నా చెప్పులు దొంగిలించాడు: బాలీవుడ్ యాక్టర్
మనోజ్ బాజ్‌పాయ్, పంకజ్ త్రిపాఠి.. ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో తమ టాలెంట్ నిరూపించుకున్నవాళ్లే! కానీ ఓసారి పంకజ్ త్రిపాఠి.. మనోజ్ చెప్పులు దొంగిలించాడట. ఆ తర్వాత కొంతకాలానికి తనే స్వయంగా వెళ్లి వాటిని దొంగిలించింది తానేనని నిజం అంగీకరించాడట. తాజాగా ఈ విషయాన్ని మనోజ్ బాజ్‌పాయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'ఓసారి హోటల్‌కు వెళ్లినప్పుడు నా చెప్పులు పోయాయి. నేనే ఎక్కడైనా విడిచిపెట్టి మర్చిపోయాననుకున్నా. కానీ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా షూటింగ్ సమయంలో పంకజ్ నా దగ్గరకు వచ్చి ఆ విషయం గుర్తుచేశాడు. పాట్నా హోటల్లో మీ చెప్పులు కనిపించకుండా పోయాయి కదా, వాటిని తనే తీసుకెళ్లినట్లు చెప్పాడు' అని మాట్లాడుతుండగా మధ్యలో పంకజ్ అందుకుని ఆరోజు ఏం జరిగిందో వెల్లడించాడు. 'ఆ రోజుల్లో నేను కిచెన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నేను పని చేస్తున్న హోటల్‌కు మనోజ్ బాజ్‌పాయ్ వచ్చాడని తెలిసింది. దీంతో అతడు ఏ చిన్న అవసరం కోసం పిలిచినా నాకే చెప్పండి, నేనే వెళ్తాను అని మిగతా సిబ్బందికి చెప్పాను. అలా తన గదికి వెళ్లాను, కలిసి మాట్లాడాను. తర్వాత అక్కడి నుంచి వచ్చేశాను. ఆయన హోటల్ నుంచి వెళ్లిపోయేటప్పుడు చెప్పులు మర్చిపోయాడని తెలిసింది. వెంటనే నేను వాటిని ఆయనకు అప్పజెప్పకుండా నాకివ్వమని చెప్పాను' అని చెప్పుకొచ్చాడు పంకజ్ త్రిపాఠి. -
ప్రముఖ నటుడి ట్విటర్ హ్యాక్..!
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. దయచేసి ఎవరూ కూడా తన అభిమానులు ఆందోళనకు గురి కావొద్దని తెలిపారు. అకౌంట్ తిరిగి సరిచేసేంత వరకు అభిమానులు దాని జోలికి వెళ్లొద్దని కోరారు. నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు దయచేసి అభిమానులు ఎవరూ నా అకౌంట్వెళ్లొద్దు. నా అకౌంట్ నుంచి వచ్చిన ఎటువంటి పోస్టులను అంగీకరించొద్దు. సమస్య పరిష్కరించాక నేను మీకు అప్ డేట్స్ ఇస్తా.' ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఇటీవలే శాండల్‌వుడ్‌లోనూ ఓ స్టార్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. కాంతార ఫేమ్ కన్నడ స్టార్ కిశోర్ కుమార్‌కు ట్విట్టర్లో ఓ సమస్య ఎదురయ్యింది. ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఓ ఈ సందేశం కనిపించింది. దీంతో ఆయన ట్విట్టర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని అందుకే తన ఖాతాను నిలిపివేశారని అన్నారు. కానీ.. తన ఆ తర్వాత అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేయడం వల్లే ఇలా జరిగిందని కిశోర్ ఇన్‌స్టాలో తెలిపారు. -
‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడు మనోజ్ భాజ్‌పాయి ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఫ్యామిలీ మ్యాన్ ఫేం మనోజ్ భాజ్‌పాయి ఇంటి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి గీతాదేవి(80) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా వయోభారంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. కాగా గతేడాది ఆయన తండ్రి రాధాకాంత్ భాజ్‌పాయి మృతి చెందిన సంగతి తెలిసిందే. తండ్రి మరణం నుంచి కోలుకోకముందే తాజాగా తల్లి కన్నుమూయడంతో మనోజ్ భాజ్‌పాయి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక గీతాదేవి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ బాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. అలాగే మనోజ్ భాజ్‌పాయి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. తన తల్లి ప్రతి విషయంలో సలహాలు సూచనలు ఇస్తూ ఉండేదని.. తల్లిదండ్రులు అంటే తనకు ఎంతో ఇష్టమని మనోజ్ బాజ్‌పాయ్ పలు ఇంటర్వ్యూ చెబుతూ తల్లితో ఉన్న అనుబంధాన్ని పంచుకునేవారు. కాగా మనోజ్ భాజ్‌పాయి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అక్కినేని హీరో సుమంత్ నటించిన ప్రేమకథ చిత్రంతో ఆయన టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత హ్యాపీ, వేదం వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. Manoj Bajpayee's mother Geeta Devi passes away Read @ANI Story | https://t.co/oiNOwqeVmt#ManojBajpayee #mother pic.twitter.com/I7VWU8rDW0 — ANI Digital (@ani_digital) December 8, 2022 Manoj Bajpayee's mother Geeta Devi passes away at 80 after a prolonged illness. @BajpayeeManoj #ManojBajpayee #ManojBajpayeeMother pic.twitter.com/xxrEZVjyVM — Sandeep Kumar 🇮🇳 (@sandeepravi55) December 8, 2022 చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘సూర్య’ వెబ్ సిరీస్ బ్యూటీ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..! నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత! ఆ స్టార్ హీరోకి అక్కగా? -
ఆటోలో సిటీ అంతా చుట్టేసిన ప్రముఖ నటుడు!
ఫ్యామిలీ మ్యాన్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే అతడు రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడి ఆటోలో ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'జోధ్‌పూర్‌లో చివరి షూటింగ్.. రిక్షాలో తిరుగుతూ ఈ రిచ్ సిటీ గొప్పతనాన్ని ఆస్వాదిస్తున్నాం. మమ్మల్ని ఆహ్వానించిన సోలంకిగారికి ధన్యవాదాలు. జోధ్‌పూర్‌లో గొప్ప ఆతిథ్యాన్నిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. త్వరలో మళ్లీ వస్తాను' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం అతడు చేస్తున్న సినిమా కథ గురించి మనోజ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'వినోద్ భన్సాలీ, సుపర్ణ్ ఎస్ వర్మ నాకు కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే చెప్పాను. కోర్ట్ రూమ్ డ్రామా జనాలకు ఎంతగానో నచ్చుతుంది. డైరెక్టర్ అపూర్వ్ కార్కి సినిమాను అద్బుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఇది తప్పకుండా అందరి మనసుల్లో నిలిచిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది' అన్నాడు. కాగా మనోజ్ త్వరలో సూప్ అనే వెబ్ షోలో కనిపించనున్నాడు. అలాగే డిస్పాచ్ అనే థ్రిల్లర్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. Last day of shoot in #Jodhpur & we explored this culturally rich city as it should be, in a RICKSHAW 🛺 💯. Thank you, Solanki Ji for inviting us & to the lovely people of Jodhpur for your hospitality 🙏🏼. I'll be back soon 😍 @apoorvkarki88 @Suparn @vinodbhanu @sharmamatvipin pic.twitter.com/hjXBCt9iTR — manoj bajpayee (@BajpayeeManoj) October 26, 2022 చదవండి: విజయ్ రిలేషన్‌షిప్‌పై జాన్వీ కపూర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ కలిసిపోయిన 'సునయ', కెప్టెన్ ఎవరంటే? -
పుష్ప 2లో నేనా? ఎవరు చెప్పార్రా నాయనా?: నటుడు
పుష్ప స్వాగ్ ఇంకా తగ్గలేదు. పుష్ప డైలాగ్స్, సాంగ్స్, మేనరిజమ్ తరచూ వినిపిస్తూ, కనిపిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో పుష్ప 2లో ఇతర స్టార్స్ నటించబోతున్నారంటూ వార్తలు ఊరిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ నటుడు మనోజ్ భాజ్‌పాయ్ కూడా పుష్ప: ది రూల్‌లో భాగం కానున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే! తాజాగా ఈ రూమర్స్‌పై మనోజ్ స్పందించాడు. మీకిలాంటి వార్తలు ఎవరు చెప్తార్రా నాయనా? అంటూ ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చేశాడు. దీంతో మనోజ్ పుష్ప సీక్వెల్లో భాగం కాలేదని స్పష్టమైంది. ఇక మనోజ్ భాజ్‌పాయ్ విషయానికి వస్తే అతడు చివరగా సైలెన్స్.. కెన్ యు హియర్ ఇట్, డయల్ 100 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం అతడి చేతిలో గుల్మొహర్ సినిమా, సూప్, ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ ఉన్నాయి. कहाँ कहाँ से समाचार लातें हैं आप लोग ? 😂😂 https://t.co/O6RBDwMUAK — manoj bajpayee (@BajpayeeManoj) July 20, 2022 చదవండి: రూ.1000 కోట్లు చాలా మామూలు విషయం అంటున్న హీరో ప్రాణాంతక వ్యాధి బారిన హీరోయిన్, 2 సార్లు చావు అంచుల వరకు.. -
పుష్ప-2లో పాపులర్ బాలీవుడ్ నటుడు
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పుష్ప-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పుష్ప-2లో బాలీవుడ్ విలక్షణ నటుడు, ఫ్యామిలీ మ్యాన్ ఫేం మనోజ్ భాజ్‌పాయి నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సుకుమార్ ఆయనకు స్క్రిప్ట్ వినిపించగా, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. ఇక గతంలో అల్లు అర్జున్-మనోజ్ భాజ్‌పాయి కలిసి హ్యాపీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు ఒకే స్క్రీన్‌పై వీరు కనిపించనున్నట్లు సమాచారం. -
సౌత్ సినిమాలను చూసి భయపడుతున్నారు: బాలీవుడ్ నటుడు
సౌత్ సినిమాలపై బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుష్ప, కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ సినిమా విజయాలు బాలీవుడ్ దర్శకనిర్మాతలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని వ్యాఖ్యానించాడు. కరోనా వైపరీత్యం తర్వాత రిలీజైన 'పుష్ప' డబ్బింగ్ వర్షన్ హిందీలో రూ.106 కోట్ల గ్రాస్ సాధిస్తే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2.. బాలీవుడ్లో తలా రూ.300 కోట్లను అవలీలగా రాబట్టాయి. కానీ అక్కడి హిందీ సినిమాలు మాత్రం వందల కోట్లను వసూళ్లు చేయడంలో వెనకబడుతున్నాయి. దీనిపై మనోజ్ బాజ్‌పాయ్ ఢిల్లీ టైమ్స్‌తో మాట్లాడుతూ.. 'ఈమధ్య కాలంలో ఎన్నో బ్లాక్బస్టర్లు వచ్చాయి. ఇది చూసి హిందీ ఇండస్ట్రీలో పనిచేసే ఫిలింమేకర్స్ భయపడిపోతున్నారు. వాళ్లకు ఏం చేయాలో కూడా తోచడం లేదు. కానీ ఒకరకంగా ఇది బాలీవుడ్‌కు గుణపాఠం నేర్పింది. దీన్నుంచి తప్పకుండా ఎంతో కొంత నేర్చుకోవాలి. సౌత్ వాళ్లు సినిమా పట్ల ఎంతో ప్యాషన్‌తో పని చేస్తారు. తీసే ప్రతి సన్నివేశం కూడా ఈ ప్రపంచంలోనే బెస్ట్ సీన్‌గా ఉండాలన్న తపనతో తీస్తారు.' 'పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు చూసినట్లయితే ఎలాంటి లోటుపాట్లు లేకుండా క్లీన్‌గా కనిపిస్తాయి. ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో నిబద్ధతతో తీసినట్లు సులువుగా అర్థమవుతుంది. ఈ అంకితభావం మనదగ్గర(హిందీలో) లేదు. మనం ఎప్పుడూ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఆలోచించామే తప్ప మనల్ని మనం విమర్శించుకోలేదు. అందుకే ఆ సినిమాలు విభిన్నమైనవి అని వేరు చేసి మాట్లాడుతున్నాము. కానీ ఇది కచ్చితంగా ఒక గుణపాఠం. తప్పకుండా దీన్నుంచి మెళకువలు నేర్చుకోవాల్సిందే' అని చెప్పుకొచ్చాడు. చదవండి: అప్పుడే ఓటీటీకి సమంత ‘కణ్మనీ రాంబో ఖతీజా’!, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ఏంటి, పుష్ప 2 సినిమాకు బన్నీ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా? -
సరిగ్గా చెప్పావ్ ఫ్యామిలీమ్యాన్.. రైతుల కోసం చేయాల్సిందే..
ప్రముఖ బిజినెస్‌మేన్ ఆనంద్ మహీంద్రా, ఫ్యామిలీమ్యాన్ మనోజ్ బాజ్‌ల మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్డర్ చేసిన ముప్పై నిమిషాల్లో కోరుకున్న ఫుడ్ దొరుకుతుంది. కానీ అదే టెక్నాలజీ ఆహార ధాన్యాలు పండించే రైతులకు ఎందుకు అండగా ఉండలేకపోతుందనే ఆశ్చర్యపోయేవాడిని. కానీ కృషి ఫార్మింగ్ యాప్‌తో తిరిగి నా మూలాల్లోకి వెళ్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ యాప్‌తో రైతుల ఆదాయాలు పెరుగుతాయంటూ మనోజ్ బాజ్‌పాయ్ ట్విట్ చేశారు. మనోజ్ బాజ్‌పాయ్ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. సరిగ్గా చెప్పావ్ మనోజ్ బాజ్‌పాయ్. మనకు ఎవరైనే అన్నం పెడుతున్నారో వాళ్లను వృద్ధిలోకి తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఈ పనిలో కృషి ఫార్మింగ్ పని చేస్తోంది. ఇది చమత్కారం చేయదు ఆవిష్కారం చేస్తుందంటూ కామెంట్ చేశారాయన. అగ్రిటెక్ బిజినెస్‌లో భాగంగా మహీంద్రా గ్రూపు కృషి యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తూ రైతులకు విలువైన సూచనలు చేస్తోంది కృషి యాప్. దీనికి ప్రచారకర్తగా మనోజ్‌బాజ్‌పాయ్ పని చేస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య రైతుల శ్రేయస్సు లక్ష్యంగా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. Well said @BajpayeeManoj It’s time Tech empowered those who feed us. Enabling farmers to #Rise has been our obsession. Kudos to @KrisheFarming for showing that we walk the talk. #ChamatkarNahiYehHaiAvishkar https://t.co/qfuWRozpzN — anand mahindra (@anandmahindra) March 26, 2022 -
ప్రముఖ బాలీవుడ్ నటుడికి దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన కేన్ మామ..!
Kane Williamson With Manoj Bajpayee: ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ మనోజ్ బాజ్‌పేయికి.. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అదిరిపోయే రేంజ్లో షాకిచ్చాడు. కేన్ మామ ఎంటి.. మనోజ్ బాజ్‌పేయికి షాకివ్వడమేంటి అనుకుంటున్నారు. అయితే ఈ స్టోరీ చదవండి. అమెజాన్ ప్రైమ్ వేదికగా బాలీవుడ్ సూపర్ స్టార్ మనోజ్ బాజ్‌పేయి, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో ముచ్చటించాడు. ఈ ఇద్దరి మధ్య క్రికెట్, సినిమా, వెబ్ సిరీస్ వంటి పలు అంశాలపై సరదా సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ మ్యాన్.. కేన్ మామకు పలు ప్రశ్నలు వేశాడు. దీనికి కివీస్ కెప్టెన్ కూడా ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. సంభాషణలో భాగంగా అమెజాన్ ప్రైమ్‌లో నీకు నచ్చిన వెబ్ సిరీస్ ఏంటని మనోజ్ బాజ్‌పేయి.. కేన్‌ను అడిగాడు. ఇందుకు బదులుగా కేన్ తన "ఫ్యామిలీ మ్యాన్" పేరు చెప్తాడేమోనని బాజ్‌పేయి ఆసక్తిగా చూశాడు. కానీ కేన్.. ఫ్యామిలీ మ్యాన్‌కు షాకిస్తూ.. ‘మీర్జాపూర్’ అని చెప్పాడు. మీర్జాపూర్ రెండు సీజన్లను చూసానని.. మూడో పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని బదులిచ్చాడు. కేన్ సమాధానంతో బాజ్‌పేయి అవాక్కయ్యాడు. అతని ముఖం మాడిపోయింది. 'బై కేన్' అంటూ సంభాషణను ముగించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అమెజాన్ ప్రైమ్ యూట్యూబ్‌లో విడుదల చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్ నటించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ప్రకంపనలు సృష్టించింది. అభిమానులు మూడో సీజన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: ICC Rankings: రూట్‌ను వెనక్కునెట్టి టాప్కు చేరిన ఆసీస్ బ్యాటర్ -
విడాకుల తర్వాత మరింత పెరిగిన సామ్ క్రేజ్.. దక్షిణాది తొలి భారత నటిగా గుర్తింపు
నాగ చైతన్యతో విడాకుల అనంతరం సినిమాల పరంగా సమంత మరింత స్పీడు పెంచారు. వరుసగా ప్రాజెక్ట్స్ సంతకం చేయడమే కాకుండా రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచారు. ఇవే కాకుండా పలు ఈవెంట్స్‌కు కూడా ఆమె స్పెషల్ గెస్ట్‌గా హాజరవుతున్నారు. ఇలా విడాకుల బాధ నుంచి బయట పడేందుకు సామ్ కూడా తన షెడ్యూల్ బిజీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సామ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల గోవాలో జరిగే ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’(ఐఎఫ్ఎఫ్ఐ) కార్యక్రమానికి స్పీకర్‌గా సమంతకు ఆహ్వానం అందింది. చదవండి: మెగా కోడలు ఉపాసన దీపావళి వేడుకలో సమంత సందడి, ఫొటోలు వైరల్ ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఐఎఫ్ఎఫ్ఐ నిర్వాహకులు సమంతను ఎంపిక చేశారు. దీంతో ఈ ఈవెంట్లో స్పీకర్‌గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది భారత నటిగా సమంత గుర్తింపు పొందింది. ఇక వ్యాఖ్యాతగా సమంతతో పాటు బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్‌పాయిను కూడా ఎంపిక చేశారు నిర్వాహకులు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఆహ్వానం అందింది. కాగా ఈ కార్యక్రమం నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది. చదవండి: ఆ విషయంలో సామ్‌ను ఫాలో అవుతున్న చై! -
‘ధూమ్ 2’ నటుడు మృతి.. హన్సల్ మెహతా ఎమోషనల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు, వెలరన్ యాక్టర్ యూసుఫ్ హుస్సేన్ అక్టోబర్ 30న మృతి చెందాడు. 73 ఏళ్ల వయస్సులో కరోనా కారణంగా లీలావతి హాస్పిటల్లో కన్నుమూశాడు. ఆయన ‘ధూమ్ 2’, ‘రాయిస్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. ఈ నటుడికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళి తెలిపారు. యూసుఫ్ అల్లుడు ‘స్కామ్ 1992’ ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా ట్వీట్ చేసి నివాళి అర్పించాడు. ఆయన నాకు మామ కాదు నాన్నలాంటి వాడని ఎమోషనల్ అయ్యాడు. అంతేకాకుండా ‘ధూమ్ 2’ మూవీలో ఆయనతో నటించిన అభిషేక్ బచ్చన్, ‘ఫ్యామీలీ మ్యాన్’ స్టార్ మనోజ్ బాజ్‌పాయ్, నటి పూజా భట్ సైతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ మృతి, సినీ ప్రముఖుల నివాళి RIP Yusuf Husain. pic.twitter.com/laP0b1U732 — Hansal Mehta (@mehtahansal) October 29, 2021 #RIP Yusuf ji. We worked together in several films starting with Kuch na kaho and lastly on Bob Biswas. He was gentle, kind and full of warmth. Condolences to his family. 🙏🏽 pic.twitter.com/6TwVnU0K8y — Abhishek Bachchan (@juniorbachchan) October 30, 2021 Sad News!!! Condolences to @safeenahusain @mehtahansal & the entire family!!! Rest in peace Yusuf saab🙏 https://t.co/q7CFbbEo95 — manoj bajpayee (@BajpayeeManoj) October 30, 2021 This brought tears to my eyes Hansal. Can’t begin to imagine what you’ll are feeling. My deepest condolences to all! 🙏 — Pooja Bhatt (@PoojaB1972) October 30, 2021 -
‘ఫ్యామిలీ మ్యాన్’ హీరో మనోజ్ బాజ్‌పేయి ఇంట తీవ్ర విషాదం
బాలీవుడ్ నటుడు, ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఫేం మనోజ్ బాజ్‌పేయి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆర్కే బాజ్‌పేయి (83) ఆదివారం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెల్వా అనే చిన్న గ్రామంలో జన్మించిన మనోజ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరడానికి ఢిల్లీకి మకాం మార్చాడు. తర్వాత అవకాశాల కోసం ముంబైకి చేరాడు. ఈ 52 ఏళ్ల నటుడు ప్రస్తుతం ఓటీటీల్లో విజయాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. -
విషమంగా ‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడి తండ్రి ఆరోగ్యం
బాలీవుడ్ నటుడు, ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఫేం మనోజ్ బాజ్‌పేయి తండ్రి ఆర్కే బాజ్‌పేయి (83) అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలిసిన ఈ యాక్టర్ హుటాహుటిన కేరళలో షూటింగ్ నుంచి అక్కడికి చేరుకున్నాడు. నిజానికి ఈ నటుడు తన తండ్రితో ఎంతో సన్నిహితంగా ఉండడమే కాకుండా ఆయన చేసే వంటల గురించి ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కాగా ఆర్కే బాజ్‌పేయి పరిస్థితి విషమంగా ఉందని, అందుకే మనోజ్ తన కమిట్మెంట్స్ అన్నింటిని వదిలేసి వచ్చేశాడని సన్నిహితుడు ఒకరు తెలిపాడు. (చదవండి: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఫ్యామిలీ మ్యాన్ 2) కాగా, బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెల్వా అనే చిన్న గ్రామంలో జన్మించిన మనోజ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరడానికి ఢిల్లీకి మకాం మార్చాడు. తర్వాత అవకాశాల కోసం ముంబైకి చేరాడు. ఈ 52 ఏళ్ల నటుడు ప్రస్తుతం ఓటీటీల్లో విజయాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. కాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు రావడం వల్ల ఇండస్ట్రీలో ఎంతో మార్పు వచ్చిందని, మంచి రచయితలు, దర్శకులకి డిమాండ్ పెరిగిందని కొన్ని ఇంటర్వూల్లో ఈ ‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. My gr8 father!dicussing the mutton that he cooks very well.yumyum pic.twitter.com/vKBCoBTU — manoj bajpayee (@BajpayeeManoj) October 5, 2012 -
‘ఫ్యామిలీమ్యాన్’పై విమర్శలు.. కేఆర్కేకు షాకిచ్చిన నటుడు
Manoj Bajpayee- Kamaal Rashid Khan: సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే విమర్శకుడు కమాల్ రషీద్‌ఖాన్ (కేఆర్కే)కు విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి గట్టి షాకిచ్చాడు. కేఆర్కేపై పరువు నష్టం దావా వేశాడు. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా కోరాడు. ఈ మేరకు మనోజ్ బాజ్‌పేయి తరఫు న్యాయవాది పరేశ్ ఎస్ జోషి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కాగా మనోజ్ నటించిన ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ఎంతగా హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కేఆర్కే మాత్రం అదొక సాఫ్ట్‌పోర్న్ సిరీస్ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్ అతడిని ఉద్దేశించి.. ‘‘ఒక్క అడల్ట్ సీన్ ఉన్నందుకే సిరీస్‌ను సాఫ్ట్ పోర్న్ అంటావా. నువ్వొక క్రిటిక్. ఇదో పెద్ద జోక్’’ అంటూ విమర్శించాడు. ఇందుకు బదులుగా.. ‘‘నేనేమీ చెత్త పనులు చేయను. కాబట్టి వెబ్ సిరీస్‌లు చూడను. కాబట్టి సునీల్ పాల్ లాంటి వాళ్లను నువ్వు ఇలాంటి విషయాలు అడగాలి. అయినా, చార్సీ, గంజేదీ(ఎప్పుడూ గంజాయి మత్తులో జోగే) మనోజ్‌ను ఎలా చూడగలుతారో? మత్తు బానిసల వల్ల బాలీవుడ్‌ను ద్వేషించే వాళ్లు.. అలాంటి అందరి వ్యక్తులను ద్వేషించాలి కదా’’ అని కేఆర్కే ట్విటర్ వేదికగా స్పందించాడు. గత నెల 26న చేసిన ఈ ట్వీట్‌పై మనోజ్ బాజ్‌పేయి.. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఐపీసీ సెక్షన్ 500 కింద పరువు నష్టం దావా దాఖలు చేశాడు. ఈ విషయం గురించి మనోజ్ లాయర్ పరేశ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే మనోజ్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. సెప్టెంబరు 4న తదుపరి విచారణ జరుగనుంది’’ అని పేర్కొన్నారు. ఇక కేఆర్కేకు కేసులేమీ కొత్త కాదు. గతంలో సల్మాన్ ఖాన్ రాధే మూవీ రివ్యూలో భాగంగా.. హీరోపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అతడి లీగల్ టీం కేఆర్కేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే విధంగా.. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ మృతి నేపథ్యంలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... ఫ్యామిలీమ్యాన్ సిరీస్‌లో.. ‘‘భార్యకు వివాహేతర సంబంధం, భర్తకు మరో మహిళతో ఎఫైర్, మైనర్ బాలికకు బాయ్‌ఫ్రెండ్, చిన్న పిల్లాడు తన వయసుకు మించి ప్రవర్తించడం.. ఓ కుటుంబం అంటే ఇలాగే ఉంటుందా? ఇవా మీరు చూపించేది? మనోజ్ సభ్యత లేని వాడు’’ అంటూ కమెడియన్ సునీల్ పాల్ విమర్శించిన సంగతి తెలిసిందే. చదవండి: Manoj Bajpayee: నేను పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు -
నా కష్టాలు ఒక ఇంటర్వ్యూలో చెప్తే అయిపోయేవి కావు
Manoj Bajpayee: మనోజ్ బాజ్‌పాయ్.. ఈ పేరు చెప్పగానే అందరికీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీసే గుర్తొస్తుంది. ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లో నిలిచిన వెబ్ సిరీస్ ఇది. ఇందులో ఓ వైపు మధ్యతరగతి భర్తగా, మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు మనోజ్. సుమారు 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తోన్న ఈ నటుడు తనేమీ పూలబాటలో నడుచుకుంటూ రాలేదంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నా జర్నీ గురించి చెప్పడానికి చాలా ఉంది. అది ఒక్క ఇంటర్వ్యూలో అయిపోయేది కాదు. తప్పకుండా ఏదో ఒకరోజు నా ఆటోబయోగ్రఫీ రాస్తాను. అప్పుడు మీరు నా గురించి పూర్తిగా తెలుసుకుంటారు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను చూశాను. నా ప్రయాణం ఒక రోలర్ కోస్టర్ రైడ్ వంటిది. ఈ 25 ఏళ్లలో మంచి సినిమాల కోసం, మంచి పాత్రల కోసం ఎంతగానో కష్టపడ్డాను, పోరాడాను. నేను నడిచిన దారి గుండా మరొకరు రావాలని నేను కోరుకోను. జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇండస్ట్రీలో చాలా పోటీ ఉంది. ఎన్నో కలలతో, ఆత్మ గౌరవంతో ఇక్కడకు రావాలని ప్రయత్నించేవారిని తొక్కేసేందుకు కొత్త శత్రువులు తయారవుతుంటారు. వాళ్లు మనద్వారా వారి కలలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. కానీ నేను ఎదుటివారి కలలను నిజం చేయడానికి రాలేదు. నా కాళ్ల మీద నేను, సొంతంగా బతకడానికి వచ్చాను. అలా ఎన్నో సంఘర్షణల మధ్య 25 ఏళ్లు ఈ ఇండస్ట్రీలో ఉండగలిగాను' అని మనోజ్ చెప్పుకొచ్చాడు. -
పోర్నోగ్రఫీ కేసు: మనోజ్ బాజ్‌పాయ్ నీచుడు, సభ్యత లేనివాడు
Sunil Pal: నీలి చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడంపై కమెడియన్ సునీల్ పాల్ స్పందించాడు. పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టు రట్టు చేయడమే కాక అతడిని అరెస్ట్ చేసినందుకు పోలీసులను అభినందించాడు. అయితే ఈ పోర్న్ అనేది రకరకాల రూపాల్లో విస్తరిస్తోందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడాడు. 'రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయడం సబబైనదే. ఇదిప్పుడు అవసరం కూడా! ఎందుకంటే పలుచోట్ల సెన్సార్ లేకపోవడంతో కొందరు పెద్ద తలకాయలు అడ్డగోలు వెబ్‌సిరీస్‌లు తీస్తున్నారు. అవి ఇంట్లోవాళ్లతో కలిసి చూడలేనంత ఘోరంగా ఉంటున్నాయి. ఉదాహరణకు మనోజ్ బాజ్‌పాయ్‌ను తీసుకుందాం. అతడు పెద్ద నటుడే కావచ్చు. కానీ అతడిలాంటి సభ్యత లేని వ్యక్తిని, నీచుడిని నేనింతవరకు చూడలేదు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న అతడు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఏం చేస్తున్నాడు? అతడు నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో.. భార్యకు వివాహేతర సంబంధం, భర్తకు మరో మహిళతో ఎఫైర్, మైనర్ బాలికకు బాయ్‌ఫ్రెండ్, చిన్న పిల్లాడు తన వయసుకు మించి ప్రవర్తించడం.. ఓ కుటుంబం అంటే ఇలాగే ఉంటుందా? ఇవా మీరు చూపించేది? ఇక పంకజ్ త్రిపాఠి నటించిన మీర్జాపూర్ పనికిరాని వెబ్‌సిరీస్. అందులో చేసినవాళ్లంటేనే నాకు అసహ్యం. పోర్న్‌పై నిషేధం విధించినట్లుగానే ఈ పనికిరాని వెబ్‌సిరీస్‌లను కూడా బ్యాన్ చేయాలి. కేవలం కళ్లకు కనిపించేదే కాదు, ఆలోచనల్ని చెడగొట్టేది కూడా పోర్న్ కిందకే వస్తుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా సునీల్ పాల్ 2005లో ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్‌లో విజేతగా నిలిచాడు. 2010లో 'భవ్నావో కో సమజో' అనే కామెడీ సినిమాకు దర్శకత్వం వహించాడు. -
సమంత కలర్‌పై విమర్శిస్తారని తెలుసు
రాజ్ అండ్ డీకే.. ఫ్యామిలీమ్యాన్ 2 సక్సెస్‌తో ఈ దర్శక ద్వయం క్రేజ్ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. హిందీలో వరుసగా సూపర్ హిట్ కథల్ని అందిస్తున్న ఈ తెలుగువాళ్లు.. బాలీవుడ్లో కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతూ జెట్ స్పీడ్‌తో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఓ మీడియాహౌజ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు. ప్రస్తుతం అమెజాన్ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీమ్యాన్ 3’ కోసం కథ సిద్ధం చేస్తున్న రాజ్ అండ్ డీకే.. ఇందుకోసం వ్యూయర్స్ దగ్గరి నుంచే ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలనే అనుకుంటున్నారట. తద్వారా లోటు పాట్లను పూడ్చుకోవచ్చనే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ‘ఫ్యామిలీమ్యాన్ 2లో వర్కవుట్ కానీ విషయాల్లో.. సమంతను తెరపై చూపించిన విధానం ఒకటి. ఆమె ముఖం రంగును అలా చూపించడంపై చాలామంది విమర్శించారు. కానీ, ఇది ముందే ఊహించగలిగాం. తెల్లగా ఉండే ఒక నటి, నలుపు రంగు క్యారెక్టర్ చేసినప్పుడు.. రేసిజం విమర్శలు రావడం సహజమే. ఇది మాకూ తెలుసు. కానీ, ఒక ప్రయోగం విఫలమైనప్పుడు.. ఎందుకు వర్కవుట్ కాలేదు.. ఎక్కడ తప్పు జరిగిందో అని గుచ్చిగుచ్చి వెతుకుతారు. ఒకవేళ అది సక్సెస్ అయినా.. ఊరుకోరు’ అని డీకే(కృష్ణ డీకే) తెలిపాడు. (ఫ్యామిలీమ్యాన్ 2 రివ్యూ) ఫ్యామిలీమ్యాన్ విషయంలో మాకో కాన్సెప్ట్ ఉంది. ఐడియా ఉంది. కానీ, దానిని ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. అందుకోసమే జనాల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని అనుకుంటున్నాం. ఆ ఫీడ్‌బ్యాక్‌పై ఓ కూర్పునకు వచ్చాక కథను డెవలప్ చేస్తాం’ రాజ్ (రాజ్ నిడిమోరు) తెలిపాడు. ఇక సీజన్ 2 ముగింపులో చైనా-వైరస్ ట్విస్ట్‌తో.. తర్వాతి సీజన్ హింట్ ఇచ్చారని వ్యూయర్స్ అనుకున్నారు. అయితే మనోజ్ వాజ్‌పాయి లీడ్ రోల్లో సీజన్ 3కి ఇంకా రెండేళ్లు టైం పట్టొచ్చని, ఈ లోపు రాజ్ అండ్ డీకేలు షాహిద్ కపూర్‌తో ఓ సిరీస్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. చదవండి: ఫ్యామిలీమ్యాన్ కోసం ఎవరెంత రెమ్యునరేషన్ అంటే.. -
ఆర్జీవీకి తెగ నచ్చేసిందట
విలక్షణ దర్శకుడు రాం గోపాల్ వర్మ చేష్టలే కాదు.. సోషల్ మీడియాలో చేసే కామెంట్లు కూడా ఒక్కోసారి అర్థం కావు. అలాగని ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో.. పొగడ్తల వంకతో తిడతాడో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమూ కాదు. అయితే ఫ్యామిలీమ్యాన్ 2 పై మనస్ఫూర్తిగా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఓ ట్వీట్ చేశాడు ఆర్జీవీ. ఒక రియలిస్టిక్ జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజీ దూసుకుపోవడానికి ఫ్యామిలీమ్యాన్ 2 మంచి అవకాశం ఇచ్చిందన్న వర్మ, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కలగలిసి ఉందని, ఫ్యామిలీమ్యాన్‌ను రియలిస్టిక్‌గా, డ్రమటిక్‌గా గొప్పనటుడు తన నటనతో అద్భుతంగా మలిచాడంటూ మనోజ్ వాజ్‌పాయి పై ప్రశంసలు గుప్పించాడు. FAMILY MAN 2 gives rise to a realistic James Bond franchise which can go on forever .Mixing family drama/action/entertainment is complex and can only be pulled off by an incredible actor like @bajpayeemanoj as he treads the very fine line between realistic and dramatic 👏👏👏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) June 12, 2021 కాగా, వర్మ తీసిన సత్య(1998) మూవీతోనే మనోజ్ వాజ్‌పాయికి నేషనల్ అవార్డు(సపోర్టింగ్)తో పాటు మంచి గుర్తింపు కూడా దక్కింది. రాజ్ అండ్ డీకేలు డైరెక్ట్ చేసిన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వివాదాల నడుమే స్ట్రీమ్ అయ్యి సూపర్‌హిట్ టాక్ దక్కించుకుంది. మనోజ్ వాజ్‌పాయితో పాటు సమంత నటనకు క్రిటిక్స్, వ్యూయర్స్ నుంచి మంచి స్పందన దక్కింది. చదవండి: ఫ్యామిలీమ్యాన్ 2 రివ్యూ -
‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3.. ఈ సారి చైనా టార్గెట్
మనోజ్ బాజ్‌పాయ్, సమంత అక్కినేని, ప్రియమణి కీలక పాత్రలో దర్శకులు రాజ్నిడిమోరు- కృష్ణ డీకేలు తాజాగా తెరకెక్కించిన వెబ్ సీరిస్ ‘ప్యామిలీ మ్యాన్ 2. ఇటీవల ఆమెజాన్ ప్రైమ్‌లో ల విడుదలైన ఈ సిరీస్ కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఒక వెబ్ సిరీస్‌కు ఇంత ఫాలోయింగ్ ఉంటుందా?.. ఒక్కరోజులోనే కోట్ల వ్యూస్ తెచ్చిపెట్టె సత్తా ఉంటుందా? సినిమాలను మించిన పారితోషికం అందుకునే సీన్ ఉందా అని ప్రశ్నించే వారందరికి ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ ఒక సమాధానంగా నిలిచింది. డిజిటల్ ప్లాట్‌ఫాంలో అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ సిరీస్‌ను.. అంతే రేంజ్లో వివాదాలు కూడా చూట్టుముట్టాయి. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సీరిస్ కాంట్రవర్సీల కారణంగా మూడు నెలలు ఆలస్యంగా విడుదలైంది. అయినా కానీ ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైంలో అత్యధిక వ్యూస్ రాబట్టిన వెబ్ సిరీస్‌గా రికార్డు నెలకొల్పింది. అయితే తొలి సీజన్ 2018లో విడుదల కాగా రెండవ సీజన్‌ను రూపొందించడానికి దర్శకుడు మూడేళ్ల సమయం తీసుకున్నాడు. కానీ ఈ సారి అంత ఆలస్యం చేయకుండా వెంటనే సీజన్ 3 కోసం కథను సిద్దం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి సీజన్ ఇండియా- పాకిస్తాన్ టెర్రరిజం చూట్టూ కథ సాగగా, సెకండ్ సీజన్ ఇండియా-శ్రీలంక టెర్రరిజం చూట్టూ కథ అల్లుకుంది. అయితే 3వ సీజన్ కోసం దర్శకుడు చైనాను టార్గెట్ చేయనున్నాడని వినికిడి. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్యామిలీ మ్యాన్ 3 ఉండబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండో సీజన్ చివర్లో ఒక చైనీస్ వ్యక్తి కంప్యూటర్లో ఏదో చైనా భాషలో టైప్ చేస్తూ కనిపిస్తాడు. దీన్ని బట్టి మూడో భాగం అంతా ఇండియా-చైనా నేపథ్యంలో ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సీజన్లో కూడా మనోజ్ బాజ్‌పాయ్ కీలకపాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. చదవండి: ఫ్యామిలీ మ్యాన్ 2: సమంత ఎంత తీసుకుందో తెలుసా? -
ఫ్యామిలీ మ్యాన్ 2: సమంత ఎంత తీసుకుందో తెలుసా?
ఈ మధ్య వెబ్ సిరీస్‌లకు డిమాండ్ పెరిగింది. పెద్దగా కొత్త చిత్రాలేవీ లేకపోవడంతో సినీప్రియులు సిరీస్‌ల మీద పడ్డారు. కొత్తగా ఏ వెబ్ సిరీస్ వచ్చినా చూసేవరకు వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్‌సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సమంత, మనోజ్ బాజ్పాయ్ల నటనకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఇదిలా వుంటే ఇందులోని నటీనటులకు ఎంతమేరకు పారితోషికం ముట్టిందనే దాని మీద సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమంత కంటే మనోజ్ బాజ్‌పాయ్‌కు ఎక్కువ ముట్టిందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో శ్రీకాంత్ తివారీ పాత్రలో కనిపించిన మనోజ్ మొత్తం ఎపిసోడ్లకు కలిపి రూ.10 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. రాజీ పాత్రతో రిలీజ్‌కు ముందే సిరీస్మీద బజ్ క్రియేట్ చేసిన సామ్ రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. మనోజ్‌కు భార్యగా నటించిన ప్రియమణి రూ.80 లక్షల మేర పారితోషికం పుచ్చుకున్నట్లు టాక్. ఇక షరీఫ్ హష్మీ రూ.65 లక్షలు, దర్శన్ కుమార్ ఒక కోటి, ఆశ్లేష ఠాకూర్ అర కోటి, శరద్ కేల్కర్ రూ.1.6 కోటి, సన్నీ హిందూజ రూ.60 లక్షల మేర అందుకున్నట్లు ఫిల్మీదునియాలో టాక్ నడుస్తోంది. చదవండి: నేను మనసుపడ్డ బ్యాగ్ ధర ఎంతో తెలుసా?: సమంత వెబ్ సిరీస్: ఫ్యామిలీమ్యాన్ 2 రివ్యూ -
ట్రైలర్ టాక్: నాలుగు స్తంభాలాట
ఓటీటీ కంటెంట్‌లో అంథాలజీ(నాలుగైదు కథల సమూహారం) సిరీస్‌లకు ఈమధ్య ఫుల్ క్రేజ్ ఉంటోంది. ఈ తరుణంలో నెట్‌ఫ్లిక్స్ మరోక దానితో రాబోతోంది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే రాసిన కథల సమూహారం నుంచి నాలుగు కథలను తీసుకుని వాటి ఆధారంగా.. హిందీలో ‘రే’ సిరీస్‌ను నిర్మించింది నెట్‌ఫ్లిక్స్. ఈ సిరీస్ ట్రైలర్ ఇవాళే రిలీజ్ అయ్యింది. ఏదైనా గుర్తు పెట్టుకునే కంప్యూటర్ లాంటి బ్రెయిన్ ఉన్న ఒక వ్యక్తి, ఒక యువ నటుడు, ఒక ఫేమస్ కవి, ఒక మేకప్ ఆర్టిస్ట్.. ఈ నలుగురి జీవితాల కథాంశమే రే(కిరణం). కవిగా మనోజ్ వాజ్‌పాయి, సూపర్ మెమరీ ఉన్న వ్యక్తిగా మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్(గుడ్డూ), మేకప్ ఆర్టిస్ట్‌గా కయ్ కయ్ మీనన్, నటుడి రోల్లో హర్షవర్దన్ కపూర్లు యాక్ట్ చేశారు. సాఫీగా సాగిపోయే ఆ నలుగురి జీవితాల్లో కల్లోలం, వాళ్ల చీకటి గతం, ఆ నలుగురి కథలకు ఊహించని ముగింపుల హింట్‌తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు. అహం, అసూయ, వెన్నుపోటు, ప్రతీకారం.. చుట్టే ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఇక సత్యజిత్ రే కథల సమూహారంలో ‘హంగామా హై క్యోన్ బార్పా, ఫర్ గెట్ మీ ఆనట్, బహురూపియా, స్పాట్లైట్ ప్రామిస్’.. రే ఆంథాలజీ సిరీస్‌గా రాబోతోంది. గజ్రాజ్ రావ్, శ్వేతా బసు ప్రసాద్, అనిందితా బోస్, బిదితా బాగ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ చౌబే, శ్రీజిత్ ముఖర్జీ, వాసన్ బాల దీనిని తెరకెక్కించారు. జూన్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. చదవండి:ఫ్యామిలీమ్యాన్ 2 రివ్యూ -
వెబ్ సిరీస్: ఫ్యామిలీమ్యాన్ 2 రివ్యూ
లాంగ్వేజ్ : హిందీ(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) ఎపిసోడ్స్ : మొత్తం 9 ఎపిసోడ్స్ (ఒక్కొక్కటి 40 నిమిషాలపైనే) ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో కాస్టింగ్ : మనోజ్ వాజ్‌పాయి, సమంత అక్కినేని, షరీబ్ హష్మీ, షహబ్ అలీ, దర్శన్ కుమార్, అశ్లేష థాకూర్, మైమ్ గోపీ, దేవదర్శిని, అలగమ్ పెరుమాల్ తదితరులు క్రియేటర్స్ : డీకే & రాజ్ సొసైటీలో అసాంఘిక శక్తులు అలజడుల కోసం ప్రయత్నించడం.. సీక్రెట్ ఏజెంట్ అయిన హీరో సాధారణ వ్యక్తి ముసుగులో ఆ కుట్రలను అడ్డుకుని, ఆ అసాంఘిక శక్తుల్ని మట్టుపెట్టడం ఇప్పటివరకు మన సినిమాల్లో చూస్తున్నదే. అయితే దానికి వెబ్ సిరీస్‌గా మలిచి.. డీకే అండ్ రాజ్‌లు చేసిన ప్రయత్నమే ఫ్యామిలీమ్యాన్. లోకల్ జేమ్స్ బాండ్ ట్యాగ్ లైన్‌తో ఫ్యామిలీమ్యాన్ ఫస్ట్ సీజన్ హిట్ కావడంతో.. రెండో సిరీస్‌పై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు సౌతిండియన్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కీ రోల్ పోషిస్తుండడంతో సౌత్‌లోనూ ఈ అమెజాన్ ప్రైమ్ సిరీస్ పట్ల ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయి.ఈ తరుణంలో తొలుత కేవలం హిందీ భాషలోనే ఫ్యామిలీమ్యాన్ 2 ను రిలీజ్ చేసి వ్యూయర్స్‌ని నిరుత్సాహపరిచింది అమెజాన్ ప్రైమ్. అయినప్పటికీ రెండో సీజన్ ఏమేర ఆకట్టుకుందో చూద్దాం. కథ.. ఉత్తర శ్రీలంకలో కొన్నేళ్ల క్రితం.. తమిళ రెబల్స్ శిబిరంపై అక్కడి ఆర్మీ దాడి చేయడం, కీలక నేతల పారిపోయే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. కట్ చేస్తే.. ఆలస్యంగా ఆఫీస్‌కు వెళ్లి బాస్‌తో క్లాస్‌లు పీకించుకునే ఐటీ జాబ్‌లో చేరతాడు శ్రీకాంత్ తివారి. అయితే, గతంలో టాస్క్ (థ్రెట్ అనాలసిస్ అండ్ సర్వైవలెన్స్ సెల్)లో సీనియర్ ఏజెంట్ అయిన శ్రీకాంత్ ఆ జాబ్‌ను ఆస్వాదించలేకపోతాడు. ఇక టాస్క్‌లో తన కొలీగ్, ఆప్తుడు అయిన జేకే తల్పాడే ఒక సీక్రెట్ ఆపరేషన్ మీద చెన్నై వెళ్తాడు. అప్పటిదాకా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న శ్రీలంక తమిళ రెబల్స్ ఓ భారీ కుట్రకు పాల్పడుతున్నారని తల్పాడేకు తెలుస్తుంది. ఇదే విషయాన్ని శ్రీకాంత్‌తో చెప్పడం, అదే టైంలో ఇంట్లో గొడవ కారణంగా శ్రీకాంత్ టాస్క్‌లో చేరడం చకచకా జరుగుతాయి. మరోవైపు తమిళ రెబల్ కమాండర్ రాజ్యలక్ష్మి శేఖరన్ అలియాస్ రాజీ తాను అనుకున్న పనిని సీక్రెట్‌గా చేసుకుంటూ పోతుంటుంది. ఈ క్రమంలో ఆమె ఉనికిని పసిగట్టిన పోలీసులు, టాస్క్ టీం ఆమెను బంధిస్తారు. అయితే మెరుపుదాడితో ఆమెను రెబల్స్ విడిపించుకునే ప్రయత్నంలో రాజీ గాయపడుతుంది. మరోవైపు శ్రీకాంత్ కూతురిని ఓ కుర్రాడి సాయంతో ట్రాప్ చేసి.. కిడ్నాప్ చేసి రెబల్స్ తాము అనుకుంటున్న పని చేసుకుపోవాలనుకుంటారు. చివరికి శ్రీకాంత్ తన కూతురిని కాపాడుకోగలుగుతాడా? తమిళ రెబల్స్-రాజీ కుట్రను శ్రీకాంత్ టీం ఎలా అడ్డుకుంటుంది? అనేది కథ. విశ్లేషణ శ్రీకాంత్ పున పరిచయం, ఫ్యామిలీ డ్రామాతో తొలి రెండు ఎపిసోడ్స్ నిదానంగా నడుస్తాయి. రెండో ఎపిసోడ్ తర్వాతి నుంచి అసలు కథ మొదలవుతుంది. నాలుగో ఎపిసోడ్ చివరి నుంచి కథ పరుగులు పెడుతుంది. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకూ బిగి సడలని కథనంతో ఆకట్టుకుంది. తమిళ రెబల్స్ కుట్రలకు ప్లాన్, ట్రేస్ చేయడం, మధ్యలో లీడర్ క్యారెక్టర్ ఫ్యామిలీకి ఇబ్బందులు, ఆ కుట్రలు శ్రీకాంత్ టీం భగ్నం చేయడం, చివరికి రిస్క్ చేసి శత్రువుల్ని మట్టుపెట్టడం.. ఇలా కథలో అంశాలున్నాయి. అయితే ఇవేవీ స్పై తరహా కథల్లోలాగా థ్రిల్ చేయకపోయినప్పటికీ.. వ్యూయర్స్‌ను ఎంగేజ్ మాత్రం చేస్తాయి. నటనపరంగా.. ఏజెంట్ శ్రీకాంత్ తివారి పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ మరోసారి ఆకట్టుకుంటాడు. కుటుంబం కోసం, దేశం కోసం.. నలిగిపోయే పాత్రలో ఆయన నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా మిలింద్ చనిపోయాక భార్యతో ఫొన్లో మాట్లాడుతూ ఏడ్చేసే సీన్ హైలైట్. ఇక సమంతది ప్రతినాయిక పాత్రే. అయినప్పటికీ సామూహిక అత్యాచారానికి గురై, తమ్ముడ్ని కోల్పోయిన బాధితురాలిగా, జాతి గౌరవం కోసం పోరాడే రెబల్ కమాండర్‌గా రాజీ క్యారెక్టర్ అలరిస్తుంది. డేరింగ్ అండ్ బోల్డ్ పాత్రలో రాజ్యలక్ష్మి అలియాస్ రాజీగా సమంత నటన కొత్తగా అనిపించినా.. గుర్తుండిపోతుంది. ఇక శ్రీకాంత్ కుడిభుజంగా జేకే రోల్లో షరీబ్ నటన మెప్పిస్తుంది. కిందటి సీజన్ మాదిరే ఇద్దరి మధ్య పంచ్‌లు పేలాయి. శ్రీకాంత్ కూతురి రోల్లో అశ్లేష థాకూర్ మెప్పించింది. నటి దేవదర్శికి, షరీబ్కి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఫర్వాలేదు. ప్రియమణి, శరద్ ఖేల్కర్ ఫర్వాలేదనిపించారు. కోలీవుడ్ తారాగణం రవీంద్ర విజయ్, మైమ్ గోపి, అజగమ్ పెరుమాళ్ తమదైన నటనతో మెప్పించారు. టెక్నీషియన్స్ పనితనం.. ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2 హంగులు లేకున్నా ఆకట్టుకోవడానికి కారణం బ్రిసన్ అందించిన సినిమాటోగ్రఫ్రీ. ఈ కథలో చాలా సీన్లను(క్లైమాక్స్‌తో సహా) సింగిల్ టేక్‌లో షూట్ చేశారంటే అతిశయోక్తి కాదు. ఇక సచిన్ జిగార్, కేతన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది. యాక్షన్ పార్ట్‌లో శ్రీకాంత్ టీం, రాజీ టీం మధ్య సహజమైన యాక్షన్ సన్నివేశాలు.. రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. కథలో భాగమైన ‘ఫ్యామిలీ’ డ్రామా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినప్పటికీ తొలి సీజన్‌తో పోలిస్తే ఇందులో తక్కువే ఉందని చెప్పొచ్చు. ఇక దేశ భక్తి, పంచ్ డైలాగులతో పాటు కథ, కథనాలు, తమిళ సీక్వెన్స్‌ను మేళవించి తొలిసీజన్ మాదిరిగానే ఫ్యామిలీమ్యాన్ 2ను ఆసక్తిిగా తీర్చిదిద్దారు రాజ్ అండ్ డీకే. -
నా మాటలు దొంగిలించకండి: సమంత
సమంత, మనోజ్ భాజ్‌పాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ "ద ఫ్యామిలీ మ్యాన్ 2". ట్రైలర్ రిలీజ్ అయిననాటి నుంచి ఈ సిరీస్ మీద నీలినీడలు కమ్ముకున్నాయి. దీన్ని నిషేధించాలంటూ తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సమంత పాత్రపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు ఫ్యామిలీ మ్యాన్ యూనిట్ మాత్రం ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు. You had to pull up your socks 😱omg @BajpayeeManoj .. don’t steal my lines sir 🙏🙏🙏 .. you are the greatest 🤗❤️And I can’t wait to for everyone to see what you have done in #familymanseason2 https://t.co/GU3oCJ4viO — Samantha Akkineni (@Samanthaprabhu2) May 26, 2021 ఈ సందర్భంగా నటుడు మనోజ్ భాజ్‌పాయ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతను ఆకాశానికెత్తాడు. 'చెన్నైలో షూటింగ్ కోసం అడుగుపెట్టే సమయానికి సమంత అన్ని రకాలుగా రెడీ అయి ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, ఫిజికల్‌గానూ ట్రైన్ అయి ఉన్నారు. అప్పుడు నాకు కొద్దిగా భయమేసింది. ఆమె సిద్ధంగా ఉన్నారు. నేనింకా ఏమీ మొదలుపెట్టనే లేదు అని! మళ్లీ నేను రిహార్సల్స్ చేయాల్సి ఉంటుందేమోనని అనుకున్నా' అని మనోజ్ చెప్పుకొచ్చాడు. దీనిపై సమంత స్పందిస్తూ.. 'ఓ మై గాడ్.. అవన్నీ నామాటలే. వాటిని మీరు దొంగిలిస్తున్నారు. మీరు గొప్ప నటులు. ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్లో మీరు ఎంత అద్భుతంగా నటించారనేది ప్రేక్షకులు చూసి తీరాల్సిందే. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను' అని సమంత ట్వీట్ చేసింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి ముఖ్య పాత్రలు పోషించారు. ఇది జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. చదవండి: The Family Man 2: వాళ్లను చంపేస్తానంటోన్న సామ్ -
The Family Man 2: వాళ్లను చంపేస్తానంటోన్న సామ్
శ్రీకాంత్(మనోజ్ భాజ్‌పాయ్).. జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన స్పెషల్ సెల్లో పని చేసే ఓ మధ్యతరగతి వ్యక్తి. అతడు తన రహస్య ఉద్యోగం, అధిక ఒత్తిడి ప్రభావం కుటుంబం మీద పడకుండా జాగ్రత్త పడాలి. కానీ ఈ క్రమంలో అతడికి ఇంటా బయటా మొండిచేయి ఎదురవుతూ ఉంటుంది. ఆఫీసులో శ్రీకాంత్ ఏ పనీ చేయడని.. ఇంట్లోనేమో సరిగా మాట్లాడడు అని అతడిని నిందిస్తారు. ఈ క్రమంలో శ్రీకాంత్ మీద వచ్చే సన్నివేశాలు వినోదభరితంగా ఉన్నాయి. అదే సమయంలో ఉగ్రవాదులను తుద ముట్టించే సీన్లలో శ్రీకాంత్ ఒక సైనిక వీరుడిగా కనిపిస్తున్నాడు. మరోవైపు సమంత సూసైడ్ బాంబర్‌గా కనిపించింది. డీగ్లామర్ లుక్‌లో కనిపించిన సామ్.. వాళ్లను నేను చంపుతా అంటూ సవాలు విసురుతోంది. కళ్లలో ఫైర్, యాక్టింగ్‌లో తీవ్రత చూస్తుంటే సామ్ తన పాత్రను ఇరగదీసినట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ జనాలకు తెగ నచ్చేసింది. పనిలో పనిగా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించేసారు. ఈ సిరీస్ జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. చదవండి: ఆర్సీబీ అభిమానినే కానీ, కోహ్లికి కాదు: రష్మిక -
జాతీయ ఉత్తమ నటి కంగన.. తెలుగు చిత్రం జెర్సీ
న్యూఢిల్లీ: 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను సోమవారం ప్రకటించారు. జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్(మణి కర్ణిక), ఉత్తమ నటుడిగా భోంస్లే చిత్రానికి గానూ మనోజ్ బాజ్‌పాయ్, అసురన్ సినిమాకు గానూ ధనుష్‌లను పురస్కారాలు వరించాయి. ఇక జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నాని నటించిన జెర్సీ నిలిచింది. కాగా ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో ఈసారి 461, నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 220 చిత్రాలు పోటీపడ్డాయి. 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితా ►మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్: సిక్కిం ►ఉత్తమ సినీ విమర్శకులు: సోహిని ఛటోపాధ్యాయ ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీ ఉత్తమ చిత్రాలు ఉత్తమ తులు చిత్రం: పింగారా ఉత్తమ పనియా చిత్రం: కెంజీరా ఉత్తమ మిషింగ్ చిత్రం: అను రువాడ్ ఉత్తమ ఖాసీ చిత్రం: లూద్ ఉత్తమ హర్యాన్వీ చిత్రం: చోరియాన్ చోరోంసే కమ్ నహీ హోతీ ఉత్తమ ఛత్తీస్‌గఢీ చిత్రం: భులన్ ది మేజ్ ఉత్తమ తెలుగు చిత్రం: జెర్సీ ఉత్తమ తమిళ చిత్రం: అసురన్ ఉత్తమ పంజాబీ చిత్రం: రబ్ దా రేడియో 2 ఉత్తమ ఒడియా చిత్రం: సాలా బుధార్ బద్లా అండ్ కలీరా అటీటా ఉత్తమ మణిపురి చిత్రం: ఈగీ కోనా ఉత్తమ మలయాళ చిత్రం: కల్లా నోట్టం ఉత్తమ మరాఠీ చిత్రం: బార్దో ఉత్తమ కొంకణి చిత్రం: కాజ్రో ఉత్తమ కన్నడ చిత్రం: అక్షి ఉత్తమ హిందీ చిత్రం: చిచోరే ఉత్తమ బెంగాళీ చిత్రం: గుమ్నామీ ఉత్తమ అస్సామీ చిత్రం: రొనువా- హూ నెవర్ సరెండర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ►పాటలు: విశ్వాసం(తమిళం) ►మ్యూజిక్ డైరెక్టర్: యేష్తోపుట్రో ►మేకప్ ఆర్టిస్టు: హెలెన్ ►బెస్ట్ స్టంట్: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ) ►బెస్ట్ కొరియోగ్రఫి: మహర్షి(తెలుగు) ►బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్: మరాక్కర్ అరబికాదలింతే సింహం(మలయాళం) ►స్సెషల్ జ్యూరీ అవార్డు: ఒత్త సెరుప్పు సైజ్-7(తమిళం) ►బెస్ట్ లిరిక్స్: కొలాంబీ(మలయాళం) తెలుగు చిత్రాలు: ఉత్తమ తెలుగు చిత్రం - జెర్సీ ఉత్తమ వినోదాత్మక చిత్రం - మహర్షి ఉత్తమ దర్శకుడు - గౌతమ్ తిన్ననూరి ఉత్తమ కొరియోగ్రాఫర్ - రాజు సుందరం (మహర్షి) ఉత్తమ ఎడిటర్ - నవీన్ నూలి (జెర్సీ) -
వాళ్ల నిర్లక్ష్యం వల్లే నాకు కరోనా వచ్చింది: నటుడు ఫైర్
అందరూ జాగ్రత్తలు పాటిస్తే షూటింగ్ సులువే అని, కాని ఒక్కరి తప్పిదం వల్ల తనకు కరోనా రావడమే కాక తాను నటిస్తున్న ‘డిస్పాచ్’ షూటింగ్ ఆగిపోయిందని నటుడు మనోజ్ బాజ్‌పాయ్ మొత్తుకుంటున్నాడు. తాజాగా మనోజ్ బాజ్‌పాయ్ కరోనా బారిన పడ్డాడు. అతడు షూటింగ్ చేస్తున్న ‘డిస్పాచ్’ సినిమా డైరెక్టర్ కాను భెల్‌కు మొదట కరోనా వచ్చింది. తర్వాత మనోజ్ బాజ్‌పాయ్ దాని బారిన పడ్డాడు. 51 ఏళ్ల ఈ ‘సత్య’ బీకూ మాత్రే ప్రస్తుతం ఇంట్లో క్వారంటైన్లో ఉన్నాడు. డిస్పాచ్ షూటింగ్ రెండు నెలలు వాయిదా పడింది. ‘కరోనా జాగ్రత్తలు సరిగ్గా తీసుకుంటే షూటింగ్ చాలా సులభం. కానీ ఆ యూనిట్లో ఒకరి నిర్లక్ష్యం వల్ల కరోనా వచ్చింది’ అని అతడు మండిపడ్డాడు. ‘కరోనాతో జీవించక చుట్టూ కరోనా పెట్టుకుని పని చేయక పరిస్థితులు వచ్చాయి. దీనిలోని వాస్తవాన్ని స్వీకరించి జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఎలా ఉండగలం’ అని ఫైర్ అయ్యాడు. ‘నెమ్మదిగా కోలుకుంటున్నా’ అని సమాచారం ఇచ్చాడు. మనోజ్ నటించిన తాజా సినిమా ‘సైలెన్స్... కెన్ యూ హియర్ ఇట్’ జీ5లో మార్చి 26 నుంచి స్ట్రీమ్ కానుంది. ‘హటాత్తుగా అదృశ్యమైపోయిన ఒక స్త్రీని వెతకడం ఈ కథ. చాలా ఆసక్తిగా ఉంటుంది’ అని మనోజ్ బాజ్‌పాయ్ అన్నాడు. ఏమైనా కరోనా గతించి పోయింది అన్న సమయంలో మళ్లీ చెలరేగుతూ హీరో ఆడియెన్స్ అనే తేడా లేకుండా ఆడుకుంటోంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చదవండి: అక్కినేని అభిమానులకు ఆర్జీవీ సర్ప్రైజ్ నరేష్‌తో లిప్‌లాక్‌పై నటి ఆమని కామెంట్ -
బాలీవుడ్లో కరోనా టెన్షన్
సాక్షి,ముంబై: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఆందోళన రేపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్లో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇప్పటికే యంగ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కరోనా బారినపడగా, తాజాగా విలక్షణ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. సినిమా షూటింగ్ సమయంలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. ఈయనతోపాటు చిత్ర దర్శకుడికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వీరిద్దరు హోం ఐసోలేషన్‌లో ఉంటూ, వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందుతున్నారు. దీంతో షూటింగ్ వాయిదా పడింది. మరోవైపు గతవారం రోజులుగా వీరితో సన్నిహితంగా మెలిగిన వారిలో కరోనా టెన్షన్ మొదలైంది. తిత్లీ ఫేమ్ కను బెహ్ల్ దర్శకత్వంలో వస్తున్న ‘డెస్పాచ్’ మూవీ షూటింగ్లో మనోజ్ బిజీగా ఉండగా వైరస్ బారినపడ్డారు. రోనీ స్క్రూవాలా మూవీని నిర్మిస్తున్నారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే దర్శక దిగ్గజం రాజమౌళి, హీరో రామచరణ్, హీరోయిన్ తమన్నా తదితరులకు కరోనా సోకింది. తాజాగా తెలుగు, హిందీ సినిమాలలో విలన్ పాత్రలతో ఆకట్టుకున్నంటున్ ఆశిష్ విద్యార్ధి కూడా కరోనా బారిన పడ్డట్టు వీడియో ద్వారా తెలియజేశారు. కాగా గత ఏడాది చాలా మంది బాలీవుడ్ నటులు కోవిడ్-19 బారిన పడ్డారు. ముఖ్యంగా సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, హీరో అభిషేక్, ఐశ్వర్య రాయ్ దంపతులు, వారి కుమార్తెతోపాటు, అర్జున్ కపూర్, మలైకా అరోరా, కృతి సనన్, వరుణ్ ధావన్, జెనెలియా డిసౌజా ఇతర ప్రముఖులు కరోనానుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. -
బాలీవుడ్లో ఒకే.. సౌత్‌లో కుదరదు
టాప్ హీరోయిన్గా.. హోస్ట్‌గా రెండు రంగాల్లో దూసుకుపోతున్నారు సమంత. పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్‌కి బ్రేక్ పడుతుందనే అభిప్రాయాన్ని తప్పని నిరూపించారు సమంత. పెళ్లి తర్వాతే జెస్సీ కెరీర్ పీక్స్‌కు వెళ్లిందని చెప్పవచ్చు. ఇక తాజాగా బాలీవుడ్ గురించి సమంత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో ఒక్క జోనర్ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయవచ్చు కానీ సౌత్‌లో ఆ పరిస్థితి లేదన్నారు సామ్. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘బాలీవుడ్లో ఒక్క జోనర్ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరిని సంతృప్తిపర్చల్సిన అవసరం లేదు. కానీ సౌత్‌లో ఇలాంటి పరిస్థితులు లేవు. థియేటర్‌కు వచ్చే ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీయాల్సి ఉంటుంది’ అన్నారు. (108 సార్లు సూర్య నమస్కారాలు: సమంత) ‘అయితే ఓటీటీ వచ్చాక పరిస్థితి మారింది. రిస్క్ తీసుకునే అవకాశం పెరిగింది. ప్రపంచ స్థాయి సినిమాలు తీసే అవకాశం లభించింది’ అన్నారు సమంత. తాజాగా సామ్ ఫ్యామిలి మ్యాన్-2 సిరీస్‌లో నటిస్తున్నారు. మనోజ్ బాజ్‌పేయ్ దీనిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. మాలో చాలా మంది వేర్వేరు పరిశ్రమల్లోకి వెళ్లి అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆశిస్తారు. సౌత్‌లో సినిమా చెప్పే విధానం, తెరకెక్కించే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. వారి పద్దతి మాకు చాలా నచ్చుతుంది’ అన్నారు. ఇక వీరిద్దరు త్వరలో జీ కేఫ్‌లో ప్రసారం కానున్న ‘రాయల్ స్టాగ్ బారెల్ సెలక్ట్ లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ ’గురించి కూడా మాట్లాడారు. -
విక్కీ డోనర్ నటుడు మృతి
ముంబై: విక్కీ డోనర్ సినిమా నటుడు భూపేష్ కుమార్ పాండ్యా బుధవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పాండ్యా మరణాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. సీనియర్ నటులు మనోజ్ బాజ్‌పేయి, గజ్రాజ్ రావు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తన భర్త స్టేజి 4 లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని పాండ్యా భార్య ఛాయ ఇటీవల మీడియాకు తెలిపారు. అహ్మదాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ జరగుతోందని వెల్లడించారు. భర్త ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఖర్చులతో పాండ్యా కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. దీంతో ఆ కుంటుంబాన్ని ఆదుకునేందుకు పాండ్యా స్నేహితుడొకరు నిధులు సమీకరించే యత్నం చేశాడు. మనోజ్ బాజ్‌పేయి కూడా పాండ్యాకు ఆర్థిక సాయం చేసి నిధులు సమకూర్చేందుకు ముందుకొచ్చారు. నటుడు గజ్రాజ్ రూ.25 వేలు, సిఖియా ఎంటర్టైన్మెంట్స్ రూ. 2 లక్షలు సాయమందించినట్టు సమాచారం. (చదవండి: మేమెప్పుడూ ఇలానే ఉండాలి) -
క్రేజీ రైడ్‌కి రెడీయా?
ఇప్పటివరకూ ఎన్నో విభిన్నమైన పాత్రలతో అలరించారు సమంత. తాజాగా తనలోని విలనీ యాంగిల్ చూపించడానికి రెడీ అయ్యారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో రాజ్, డీకే దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’. ఈ షోకి విపరీతమైన స్పందన లభించింది. సెకండ్ సీజన్లో సమంత కూడా భాగమయ్యారు. ఇందులో విలన్ పాత్రలో నటించారు సమంత. ఆమెది టెర్రరిస్ట్ పాత్ర అని తెలిసింది. షూటింగ్ పూర్తయింది. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను గురువారం మొదలుపెట్టారు సమంత. ‘‘ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 2’కు డబ్బింగ్ ప్రారంభించాను. సిరీస్ చాలా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులందరూ రెడీగా ఉండండి. మిమ్మల్నందర్నీ ఓ క్రేజీ రైడ్‌కు తీసుకెళ్లనుంది మా ‘ఫ్యామిలీ మ్యాన్’ టీమ్. ఇలాంటి పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు థ్యాంక్యూ రాజ్, డీకే’’ అన్నారు సమంత. త్వరలోనే అమేజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. -
ప్రముఖ దర్శకుడు మృతి
బాలీవుడ్‌కు ఈ ఏడాది అస్సలు బాగోలేదు. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సరోజ్ ఖాన్, వాజిద్ ఖాన్, జగదీప్ వంటి స్టార్లను కోల్పోయింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడటం ఊహించని విషాదం. ఈ మధ్యే బాలీవుడ్ సినీ, టీవీ నటుడు రాజన్ సెహగల్, ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చోక్సీ కూడా కన్నుమూశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజత్ ముఖర్జీ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన జైపూర్‌లోని తన నివాసంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని నటుడు మనోజ్ భాజ్‌పాయ్ అన్నారు. మరోవైపు ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా 'రోడ్' సినిమా.. రాజత్ ముఖర్జీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. వీటితోపాటు ప్యార్ తునే క్యా కియా, లవ్ ఇన్ నేపాల్, ఇష్క్ కిల్స్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. (బాలీవుడ్లో మరో విషాదం) -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను: నటుడు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో పలువురు నటీనటులు ఒకానొక సమయంలో తాము కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి అవార్డ్ విన్నింగ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి కూడా చేరారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబేకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ సామన్య రైతు కుటుంబంలో పుట్టిన పిల్లాడు నటుడిగా ఎదిగిన క్రమాన్ని చెప్పుకొచ్చారు. ఈ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న కష్టాలను, విమర్శలను వెల్లడించారు. వీటన్నింటిని భరించలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు మనోజ్ బాజ్‌పేయి తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. తొమ్మిదేళ్ల వయసులో కల కన్నాను ‘నేను ఓ సాధారణ రైతు కొడుకును. బిహార్‌లోని ఓ చిన్న గ్రామంలో జన్మించాను. మేం ఐదుగురు తోబుట్టువులం ఓ గుడిసెలో నడిచే స్కూల్లో చదువుకున్నాం. పట్టణం వెళ్లేవరకు నాది సాధారణ జీవితమే. అయితే నా తొమ్మిదో ఏట మొదటి సారి పట్నం వెళ్లాను. థియేటర్లో సినిమా చూశాను. అమితాబ్ బచ్చన్ అంటే ఆరాధన పెరిగింది. నేను తనలానే కావాలని నిర్ణయించుకున్నాను. నటనే నా జీవిత గమ్యం అని నాకు తెలిసింది. అయితే అది ఎంత కష్టమైన కలో నాకు తెలుసు. అందుకే చదువు కొనసాగించాను. కానీ నా బుర్ర మాత్రం దేని మీద ఏకాగ్రత కుదరనిచ్చేది కాదు. దాంతో నా 17వ ఏట డీయూ వెళ్లాను. అక్కడ థియేటర్లో చేరాను. దీని గురించి నా కుటుంబానికి ఏం తెలియదు. చివరకు మా నాన్నకు ఉత్తరం రాశాను. అయితే ఆయన నా కోరికను అర్థం చేసుకున్నారు. నా మీద కోప్పడలేదు. ఫీజు కట్టడం కోసం రూ.2 వేలు పంపారు’ అని గుర్తు చేసుకున్నారు మనోజ్ బాజ్‌పేయి. (ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నాడు) ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను ‘నేను పెరిగిన వాతావరణానికి.. ఇక్కడి పరిస్థితులు పూర్తిగా భిన్నం. ఇక్కడ నేను బయట వ్యక్తిని. ఇందులో ఇమడాలని ప్రయత్నిస్తున్నాను. అందుకే ఇంగ్లీష్, హిందీ, భోజ్‌పూరి భాషలను నేర్చుకున్నాను. నేను వాటిల్లో మాట్లాడటం ఇంకా పెద్ద పరీక్ష. అప్పుడు నేను ఎన్ఎస్డీకి అప్లై చేశాను. కానీ మూడు సార్లు తిరస్కరించారు. చాలా బాధపడ్డాను. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. విషయం తెలిసి నా స్నేహితులు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఒంటరిగా వదిలేవారు కారు. రాత్రి నాతో పాటే పడుకునేవారు. పరిస్థితులను అంగీకరించే దాక వారు నాకు తోడుగా ఉన్నారు. ఆ ఏడాది టిగ్మాన్షు తన ఖతారా స్కూటర్లో నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను చాయ్ షాపులో ఉన్నాను. అతడు వచ్చి శేఖర్ కపూర్ నన్ను ‘బండిట్ క్వీన్’లో నటింపజేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. సరే అని చెప్పి వెంటనే ముంబైకి బయల్దేరాను’ అన్నారు మనోజ్ బాజ్‌పేయి. (బై ముంబై.. వెళ్లిపోతున్నా: హీరోయిన్) ఒక్క రోజే 3 ప్రాజెక్ట్‌ల్లోంచి తీసేశారు ఆయన మాట్లాడుతూ.. ‘ముంబై వెళ్లిన తొలి నాళ్లలో చాలా కష్టపడ్డాను. ఐదుగురితో కలిసి ఒక గది అద్దెకు తీసుకున్నాను. పని కోసం ఎదురు చూసేవాడిని. అవకాశాలు లేవు. ఒకసారి ఓ కంపెనీ నా ఎదురుగానే ఫోటోలు చించేసింది. ఒకే రోజు నన్ను మూడు ప్రాజెక్ట్‌ల్లోంచి తీసేశారు. ఓ సన్నివేశం షూటింగ్ పూర్తికాగానే వెళ్లిపొమ్మని చెప్పిన వాళ్లు కూడా ఉన్నారు. నా ముఖం హీరోకు సూట్ కాదని.. నేను బిగ్ స్క్రీన్‌పై పనికిరానని వారు భావించారు. అవకాశాలు లేక.. చేతిలో డబ్బు లేక చాలా ఇబ్బంది పడ్డాను. అద్దే కట్టడం కాదు కదా.. కనీసం పావ్‌బాజీ తినాలన్నా చాలా ఖరీదైన విషయంగా అనిపించేది. అయితే నా ఆకలిమంటలు.. విజయాన్ని చేరడానికి అడ్డంకి కాలేదు. 4 సంవత్సరాల పోరాటం తరువాత, నాకు మహేష్ భట్ టీవీ సిరీస్‌లో ఓ అవకాశం వచ్చింది. ప్రతి ఎపిసోడ్‌కు నాకు రూ .1500 ఇచ్చేవారు. అదే నా మొదటి స్థిరమైన ఆదాయం. ఆ తర్వాత నాకు మొదటి చిత్రం ఆఫర్ దొరికింది. ఆ తర్వాత ‘సత్య’ తో పెద్ద బ్రేక్ వచ్చింది’ అన్నారు. ‘ఆ తర్వాత అవార్డులు వచ్చాయి. నేను ఇళ్లు కొన్నాను. నేను ఇక్కడే ఉన్నాను. 67 సినిమాల తరువాత, ఇప్పుడు కూడా నేను ఇక్కడ నేను ఉన్నాను. ఇక కలల విషయానికి వస్తే.. వాటిని నిజం చేసుకునే ప్రయత్నంలో వచ్చే కష్టాలను నేను పట్టించుకోలేదు. తొమ్మిదేళ్ల బిహార్ కుర్రాడి కల మాత్రమే ఇక్కడ స్థిరంగా నిలిచింది’ అన్నారు మనోజ్ బాజ్‌పేయి. -
‘మిసెస్ సీరియల్ కిల్లర్’ రివ్యూ
తన అందచందాలతో కట్టిపడేసే బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ "మిసెస్ సీరియల్ కిల్లర్". ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సిరీస్ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. హీరోయిన్ నటన, నటుడు మనోజ్ బాజ్‌పాయి మ్యాజిక్ ఏవీ సినిమాను ముందుకు తీసుకెళ్లలేకపోయాయి. మొదటి 80 నిమిషాలు ఎందుకు చూస్తున్నామా అన్న సందేహం తలెత్తక మానదు. కానీ చివరి 26 నిమిషాలు అప్పటివరకు చూపించిన ప్రశ్నల చిక్కుముడులను విప్పే ప్రయత్నం చేస్తాయి. కానీ అప్పటికే ఆలస్యం అవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అక్షయ్ కుమార్‌కు "జోకర్" సినిమాతో డిజాస్టర్ అందించిన శిరీష్ కుందర్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించి మరోసారి ఫెయిల్ అయ్యాడు. కథా విశ్లేషణ: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన మహిళలు దారుణంగా హింసకు గురవుతూ చనిపోతుంటారు. దీనికి డా.మృత్యుంజయ్ ముఖర్జీ(మనోజ్ బాజ్‌పాయ్) కారణమని పోలీసులు భావిస్తారు. దీంతో మర్డర్ కేస్‌లో చిక్కుకున్న భర్త మృత్యుంజయ్ను కాపాడటం కోసం అతని భార్య సోనా ముఖర్జీ(జాక్వెలిన్ ఫెర్నాండేజ్) బయలు దేరుతుంది. సీరియల్ కిల్లర్ తరహాలో మరో హత్య చేసి భర్తను కాపాడుకుంటుంది. ఈక్రమంలో భర్త కోసం ఏదైనా చేసే భార్య పాత్రలో జాక్వెలిన్ అద్భుతంగానే రాణించింది. అయితే ఈ సిరీస్‌లో కొన్ని సంఘటనలు అర్థం పర్థం లేనివిగా ఉన్నాయి. ఉదాహరణకు సోనా తన భర్త ఆఫీసుకు వెళ్లి కంప్యూటర్ పాస్వర్డ్ కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆ పాస్వర్డ్ మరేంటో కాదు.. షోనా(Shona) అని ఈజీగా తెలిసిపోతుంది. ఇందులో ప్రేక్షకుడు పెద్దగా ఆశ్యర్యపోవడానికి ఏమీ ఉండదు. యాక్షన్ సన్నివేశాలు కూడా నిదానంగా సా..గుతాయి. కామెడీ గురించి చెప్పాలంటే కొన్ని డైలాగులు, సన్నివేశాలు నవ్విస్తాయి. మరికొన్ని చోట్ల సన్నివేశాలు పెద్ద లాజిక్‌గా అనిపించవు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో అంచనాలతో ఈ సిరీస్ చూడటానికి వచ్చిన అభిమానుల ఆశలను జాక్వెలిన్, మనోజ్ బాజ్‌పాయి అడియాశలు చేశారనడం కంటే హత్య చేశారనడమే కరెక్ట్. (‘గతంలో ఎప్పుడూ చూడని విధంగా జాక్వలిన్’) ప్రేక్షకుడి వాయిస్: ఈ సిరీస్‌ను అందించినందుకు నెట్‌ఫ్లిక్స్‌పై బూతుల వర్షం కురిపిస్తున్నారు. చెత్త కంటెంట్ ఉన్న సినిమా అని తిట్టిన తిట్టు తిట్టకుండా బూతులు అందుకుంటున్నారు. దీనికన్నా హాలీవుడ్ బీ గ్రేడ్ సినిమాలు వంద రెట్లు నయమని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. జాక్వెలిన్ డైలాగ్ డెలివరీ, చెత్త కథనం పూర్తిగా నిరాశకు గురి చేశాయని పెదవి విరుస్తున్నారు. మొత్తంగా ఇది ఒక్కసారి చూడటమే ఎక్కువని వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. సిరీస్ ప్రారంభంలో జాక్వలిన్ నోట "టార్చర్ అంటే మీకిప్పటివరకు తెలియదు.. ఇకపై చూస్తారు" అని డైలాగ్ చెబుతుంది. నిజంగానే ఈ సిరీస్ చూడటం అంటే టార్చరే అని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా చూసిన వారికి భారీ నిరాశ తప్పదు. -
రెబల్‌స్టార్ సామ్!
డిజిటల్ ప్లాట్ఫామ్లో తొలి అడుగును విజయవంతంగా ముగించారు సమంత. ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ సీజన్ 2లో నటించారామె. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ తొలి సీజన్‌కు గత ఏడాది డిజిటల్ ఎంటర్టైన్ మీడియమ్‌లో మంచి ఆదరణ లభించింది. తొలి సీజన్లో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, షరీబ్ హష్మీ, నీరజ్ మాధవ్‌లు కీలక పాత్ర పోషించారు. రెండో సీజన్లో సమంత ఓ లీడ్ చేశారు. ఆమె పాత్ర చిత్రీకరణ ముగిసింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ– ‘‘ది ఫ్యామిలీమేన్’ సీజన్ 2’ షూటింగ్‌కి సంబంధించిన ఏ రోజునీ నేను మర్చిపోలేను. ఇదివరకు నేను వెండితెరపై నటించిన పాత్రలకు ఇది పూర్తి విభిన్నమైనది. అవకాశం ఇచ్చిన రాజ్ అండ్ డీకేలకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మేము యాక్షన్ అని చెప్పిన ప్రతిసారీ మిమ్మల్ని మీరు (సమంత) మలచుకున్న విధానం అద్భుతం. ఇప్పుడు ఉన్న ప్రతిభావంతులైన నటీమణుల్లో మీరూ ఒకరు. ఈ పాత్ర మీ కంఫర్ట్ జోన్లోది కాకపోయినప్పటికీ అద్భుతంగా నటించారు’’ అని సమంతను ఉద్దేశించి రాజ్ అండ్ డీకే అన్నారు. అది మాత్రమే కాదు.. ‘రెబల్‌స్టార్ సామ్!’ అని కేక్‌పై రాయించి సెట్లో కట్ చేయించారు యూనిట్. మరోవైపు సమంత ఓ టాక్ షో కూడా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. శర్వానంద్, సమంత నటించిన ‘జాను’ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. -
నా కూతురికోసం ఆ అవార్డు గెలవాలనుకున్నా
బ్రిస్బేన్: హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మనోజ్ బాజ్ పాయ్. గతేడాది విడుదలైన ‘భోంస్లే’ చిత్రంలో మనోజ్ నటనకు గానూ అంతర్జాతీయ అవార్డు వరించింది. ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో అంతర్జాతీయ నటులను వెనక్కు నెట్టి ఉత్తమ నటుడిగా మనోజ్ బాజ్ పాయ్ అవార్డు దక్కించుకున్నారు. ‘గోల్డ్ లాడెన్ షీప్ అండ్ ద సాక్రెడ్ మౌంటెయిన్’ చిత్రానికిగానూ నూతన దర్శకుడు రిధమ్ జాన్వే ‘యంగ్ సినిమా’ అవార్డును అందుకున్నారు. శుక్రవారం బ్రిస్బేన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో మనోజ్ మాట్లాడుతూ.. ‘ కేవలం నా కూతురి కోసం ఈ అవార్డును గెలవాలనుకున్నాను. ఎందుకంటే నేను ఈ రోజు అవార్డు గెలుస్తానని నా చిన్ని కూతురు ఎంతో ఆశ పెట్టుకుంది. అది నెరవేరింద’ని సంతోషం వ్యక్తం చేశారు. ఇక నటుడిగా సినీ జీవితం ప్రారంభించిన మనోజ్ తర్వాత నిర్మాతగానూ మారారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న భోంస్లే చిత్రానికి మనోజ్ సహనిర్మాతగా కూడా వ్యవహరించారు. -
‘సంతోషం.. ఎవరూ తిట్టలేదు’
ఎవరూ విమర్శించలేదు.. అదే సంతోషం అంటున్నారు నటుడు మనోజ్ బాజ్‌పేయ్. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను ప్రభుత్వం మనోజ్‌కు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవార్డును ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో కానీ.. బయట కానీ ఎలాంటి ట్రోలింగ్ జరగలేదు. దాంతో చాలా సంతోషంగా ఫీలయ్యాను’ అన్నారు. అంతేకాక ‘గతంలో ప్రభుత్వం అవార్డులు ప్రకటించినప్పుడు ఏ అర్హత ఉందని ఇచ్చారు అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసేవారు. సదరు నటుడు నటించిన సినిమాల గురించి ప్రస్తావిస్తూ దారుణంగా విమర్శించేవారు. ఈసారి నాకు అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. అందుకు సంతోషంగా ఉంది. నాతో పాటు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా చాలా సంతోషంగా ఉన్నార’ని తెలిపారు. పద్మ అవార్డు వచ్చిందని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడగ్గా.. ‘ఆ రోజు రాత్రి పడుకునే ముందు అనుపమ్ ఖేర్ నాకు ఫోన్ చేసి అవార్డు వచ్చిందని చెప్పారు. ఇది విన్న వెంటనే నేను ఫ్రీజ్ అయిపోయాను. ఎలా స్పందించాలో నాకు తెలియలేదు. నాకు ఈ గౌరవం దక్కుతుందని అనుకోలేదు’ అని వెల్లడించారు మనోజ్. ప్రస్తుతం మనోజ్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా తెరకెక్కుతున్న ‘సోన్ చిడియా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. -
పాట పరవశించింది
శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగులో ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికు ‘పద్మశ్రీ’ అవార్డు ప్రకటించారు. నృత్యదర్శకుడు ప్రభుదేవా, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, గాయకులు శంకర్ మహదేవన్‌లకు పద్మశ్రీలను ప్రకటించారు. అలాగే మలయాళ నటుడు మోహన్ లాల్‌కు ‘పద్మభూషణ్’ ప్రకటించారు. ‘అవును.. ఆలస్యం అయింది. అవార్డు అనేది విలువను గుర్తించేది, గౌరవించేది మాత్రమే కానీ విలువను నిరూపించేది కాదు’ అని ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఓ సందర్భంలో అన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన 35 ఏళ్లకు పద్మశ్రీ అందుకున్న ఆయన ఇండస్ట్రీకు రాకముందే తన పేరు ముందు పద్మను కలుపుకున్నారు. సిరివెన్నెల భార్య పేరు పద్మ. ఆ మధ్య ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసినప్పుడు పద్మ అవార్డు రాకపోవడం గురించి ప్రస్తావిస్తే ... ‘నా పేరులోనే పద్మ ఉంది’ అని చమత్కరించారు సిరివెన్నెల. సిరి శక్తి సమస్యను ఎదుర్కోమంటూ పాట ద్వారా ప్రేరేపించగలిగే శక్తి సిరివెన్నెల. మాట సైతం తన వెన్నెల ప్రసరించమని విన్నవించుకునే విన్నపం సిరివెన్నెల. ఆత్రేయ, వేటూరి తర్వాత తెలుగు పాట అంతలా పొంగిపోయేలా చేసింది సిరివెన్నెల. కాకినాడ ఆంధ్రా యూనివర్శిటీలో బికామ్ పూర్తి చేసిన íసీతారామశాస్త్రి 1984లో సినిమా సాహిత్యం వైపు అడుగులేశారు. మొట్టమొదట రాసింది జననీ జన్మభూమి(1984) సినిమాకే అయినా ఆ తర్వాత రాసిన ‘సిరివెన్నెల’ సినిమా పాటలు ఆయనకు ఇండస్ట్రీలో స్థానం ఇచ్చాయి. చెంబోలు సీతారామశాస్త్రి నుంచి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మార్చింది ఆ చిత్రం. ‘సిరివెన్నెల’ తర్వాత శాస్త్రి వెనక్కు చూసుకునే పనిలేకుండా పోయింది. ఆ సినిమాలో రాసిన ప్రతీ పాట ఓ ఆణిముత్యం. అంత అర్థవంతంగా ఉండబట్టే ఆ ఏడాది బంగారు నంది శాస్త్రి ఇంటికి పరుగుతీసింది. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్న రికార్డు నెలకొల్పారాయన. ఆ తర్వాత అద్భుతమైన పాటలు రాస్తూ ఇండస్ట్రీలో తన మాటను పాటలా విస్తరిస్తూ సుస్థిరం చేసుకున్నారు. ‘స్వయంకృషి, స్వర్ణకమలం, శ్రుతిలయలు, రుద్రవీణ, గాయం, సింధూరం, ప్రేమ కథ, నిన్నే పెళ్లాడతా, చక్రం, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారాయన. ‘సింధూరం’లో అర్ధ శతాబ్దపు అజ్ఞానమే స్వాతం త్య్రం అనుకుందామా? అని ప్రశ్నను సంధిస్తే దానికి సమాధానం నంది అవార్డు అయింది. ‘దేవుడు కరుణిస్తాడనీ వరములు కురిపిస్తాడని..’ ప్రేమ పాట రాయడం రాష్ట్ర ప్రభుత్వం నంది కురిపించడం జరిగిపోయింది. ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అని ‘చక్రం’ సినిమాలో రాశారాయన. ‘ఆయువనేది ఉండేవరకూ ఇంకేదో లేదని అనకూ’ అనే జీవిత సారాన్ని చాలా తేలికైన పదాలతో కమర్షియల్ సినిమాలో చెప్పగల శక్తి, సామర్థం ఉన్నది సిరివెన్నెలకే. ‘సాహిత్యం అనేది అర్థం అయ్యేలానే రాయక్కర్లేదు. అర్థం చేసుకోవాలనే కుతూహలం రేకెత్తించేలా కూడా రాయొచ్చు. అలాంటి రచయిత సిరివెన్నెలగారు’ అంటారు దర్శకుడు త్రివిక్రమ్. 3 వేలకు పైగా పాటలు, 11 రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు. 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు. 1986, 87, 88 సంవత్సరాలలో వరుసగా నంది అవార్డులను అందుకొని హ్యాట్రిక్ సృష్టించారు. ప్రస్తు తం ఉన్న అగ్ర పాటల రచయితలు కూడా సిరివెన్నెలను ‘గురువు’గా భావిస్తారన్న సంగతి తెలిసిందే. కళ, కళ యొక్క ముఖ్య ఉద్దేశం రేపటి మీద ఆశ కలిగించడం. సిరివెన్నెల పాటల్లో అది కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది. చాలా సులువుగానే లోతుగా రాయడం ఆయన సొంతం. ఎన్ని అవార్డులు వరించినా ప్రేక్షకుడి పెదవి మీద కూనిరాగమే పెద్ద అవార్డు అంటారు సిరివెన్నెల. ఇప్పుడాయన పేరులో రెండు ‘పద్మ’లున్నాయి. సతీమణి ‘పద్మ’... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మశ్రీ’. పాట ఆనందపడిన వేళ ఇది. పాట పరవశించిపోయిన వేళ ఇది. -
ఆ సినిమా మా మనోభావాలు దెబ్బతీసింది!
సాక్షి, హైదరాబాద్: జాన్ అబ్రహం, మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ సినిమా ‘సత్యమేవ జయతే’పై నగరంలో కేసు నమోదైంది. తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని షియా వర్గం సోమవారం కేసు నమోదు చేసింది. ఆన్లైన్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌పై గతంలోనూ అభ్యంతరాలు వచ్చాయి. ముస్లింలు పవిత్రంగా భావించే మొహర్రం ఊరేగింపును మతమనోభావాలు దెబ్బతీసేవిధంగా చిత్రం ట్రైలర్లో చూపించారని, ఈ సనివేశాలను వెంటనే తొలగించి.. చిత్ర దర్శకుడు, హీరోపై చర్యలు తీసుకోవాలని పలు వర్గాలు గతంలో కోరాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో కేసు నమోదు కావడం గమనార్హం. మిలాప్ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సత్యమేవ జయతే’ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్ అబ్రహం సరసన అమృత ఖన్విల్కర్ నటించారు. ఆన్లైన్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు, పాటలకు మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
వివాదంలో ‘సత్యమేవ జయతే’
బాలీవుడ్ నటులు జాన్ అబ్రహం, మనోజ్ బాజ్‌పాయ్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సత్యమేవ జయతే. మిలాప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ వివాదాస్పదమయ్యింది. ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయంటు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పవిత్ర మొహరం సంతాప దినాల్లో హీరో (జాన్ అబ్రహం) ఓ వ్యక్తిని హత్య చేసినట్టుగా ట్రైలర్లో చూపించారు. ఈ సీన్స్ తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఉన్నాయంటూ హైదరాబాద్, పాతబస్తీ డబీర్ పురాకు చెందిన అడ్వకేట్ జాఫర్ నదీం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సినిమాటోగ్రఫి యాక్ట్ 5బి ప్రకారం సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని.. చిత్ర దర్శక, నిర్మాతలతో పాటు ఆ సన్నివేశంలో నటించిన జాన్ అబ్రహంపై చర్యలు తీసుకోవాలని జాఫర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
న్యాయం ధ్వనిస్తుంది
‘నేరగాళ్లకు శిక్ష తప్పదు. అవినీతికి అంతం తప్పదు’ అంటున్నారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం. మిలప్ జవేరి దర్శకత్వంలో జాన్ అబ్రహాం కథానాయకుడిగా నటించిన సినిమా ‘సత్యమేవ జయతే’. మనోజ్ బాజ్‌పేయి, అమృత కవిల్వర్, ఐషా శర్మ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున న్యాయం ధ్వనిస్తుంది’’ అని సినిమాను ఉద్దేశించి సోషల్ మీడియాలో పేర్కొన్నారు జాన్. అయితే ఇదే రోజున అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన హాకీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా ‘గోల్డ్’ రిలీజ్ కానుంది. సో.. బాక్సాఫీస్ వద్ద అక్షయ్ వర్సెస్ జాన్ తప్పదన్నమాట. -
‘ఇర్ఫాన్‌ఖాన్ చాంపియన్‌లా తిరిగివస్తాడు’
విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయ్, బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ అనారోగ్యంపై మీడియాలో వస్తున్న కథనాలపై ట్విటర్ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఏదో తెలియని జబ్బుతో బాధపడుతున్నఇర్ఫాన్ ఆ వ్యాధి గురించి తెలిసిన తరువాత తనే చెబుతానని సోమవారం ట్విటర్లో పేర్కొన్నాడు. అరుదైన వ్యాధి అని, దాని గురించి ఇంకా వివరాలు తెలియలేదని, ఇంకో వారం పది రోజుల్లో వివరాలు ప్రకటిస్తానని పోస్ట్ చేశాడు. అయితే దీనిపై మీడియా తనకు తోచిన విధంగా కథనాలు ప్రచురిస్తుండటంతో నటుడు మనోజ్ బాజ్‌పేయ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ...‘‘అందరినీ దయ చేసి వేడుకుంటున్నాను, మీరు ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేయకండి. తన వైపు నుంచి అధికారికంగా విషయం వెల్లడించేవరకు వేచి చూడండి. తను ఆ వ్యాధిని కనిపెట్టి, ఎదురించి చాంపియన్‌లా తిరిగివస్తాడు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. మనమంతా అతని ప్రైవసీని గౌరవిద్దాం’’ అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. -
భ్రాంతి కాదు నిజం అయారి
‘‘దేశ్ బేచ్ దేంగే తో బచేగా క్యా?’’ (దేశాన్నే అమ్మేస్తే ఇంకేం మిగిలి ఉంటుంది?) అంటూ దేశమంతా అలుముకున్న అవినీతి మీద ఆలోచనను రేకెత్తించేదే ‘అయారి’ సినిమా! ‘ఎ వెడ్నెస్ డే’, ‘స్పెషల్ చబ్బీస్’, ‘బేబీ’ తీరులో ఈ సినిమా ఉత్కంఠను రేకెత్తించలేకపోయినా.. దర్శకుడు నీరజ్ పాండే మార్క్నైతే చూపిస్తుంది. అయారి.. అంటే భ్రాంతి.. తాంత్రికత.. మాంత్రికత! అన్నీ బాగున్నట్టు అనిపించే, ఫీల్ గుడ్ ఫీల్ భ్రాంతిని కలిగించే పరిస్థితుల వెనక ఉన్న అసలు కథను చూపించే సినిమా. ఇది కేవలం కల్పితం. ఎవరినీ, దేనినీ ఉద్దేశించి కాదు అంటూ ప్రారంభంలో డిస్క్లేమర్ వేసినా.. రక్షణ శాఖలో జరుగుతున్న అవినీతిని సెల్యూలాయిడ్ మీద చూపించిన చిత్రం ఇది. అందుకే పైన చెప్పిన మాట అంటాడు ఆర్మీ చీఫ్ ‘‘దేశ్ బేచ్ దేంగే తో బచేగా క్యా?’’ అని! ఆహారధాన్యాల దగ్గర నుంచి ఆయుధాల దాకా అన్ని శాఖల్లో అంతటా అవినీతే. ఎక్కడికక్కడ దేశాన్ని అమ్ముకుంటూ పోతే ఇంకేం మిగులుతుంది? మనకన్నా ముందు తరం.. తర్వాత తరాలకు ఏం స్ఫూర్తిని పంచుతారు? సంపాదన ఆశలో పడి ఈ తరం ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్తుంది? అంటూ తరాల ఆలోచనల అంతరాలనూ ప్రశ్నిస్తుంది? చర్చకు చోటిస్తుంది. దేశ భక్తి అనే పెద్ద మాటలు వద్దు కాని.. ఆరోగ్యకరమైన వాతావరణమైతే దేశంలో ఉండాలికదా! మన దేశంలో మనం భద్రంగా ఉన్నామనే భావనైతే కలగాలి కదా! దేశానికి కంచెలా ఉన్న రక్షణ శాఖ ఆ నమ్మకాన్నివ్వాలి కదా! అదే అమ్మకానికి తయారైపోతే? విశ్వాసాన్ని కోల్పోతాడు ఓ యంగ్ సోల్జర్, మేజర్ జయ్ బక్షి (సిద్ధార్థ్ మల్హోత్రా). రక్షణ శాఖలోని పెద్ద తలకాయలైతే ఆయుధాలు అమ్మే డీలర్స్‌తో డీల్ కుదుర్చుకొని నిజాయితీగా పనిచేస్తున్న టీమ్‌ను పణంగా పెట్టాలనుకున్నప్పుడే మొత్తం మిలటరీ వ్యవస్థ మీదే గౌరవాన్ని తుడిచేసుకుంటాడు. ఆ డీల్‌లో తానూ వాటా పంచుకోవాలనుకుంటాడు. డ్యూటీని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన కల్నల్ అభయ్ సింగ్ (మనోజ్ బాజ్‌పాయ్)ను స్ఫూర్తిగా తీసుకుని.. విధి నిర్వహణలో అతనంతటివాడిని కావాలని కలలు కని ఆర్మీలోకి వస్తాడు. కల్నల్ అభయ్‌సింగ్ నేతృత్వంలోని కోవర్ట్ ఆపరేషన్స్ (స్పెషల్)లో సభ్యుడిగా ఉంటుంటాడు జయ్ భక్షి. ఒకరకంగా కల్నల్‌కు ఏకలవ్య శిష్యుడు జయ్. ఆపరేషన్స్ నిర్వహణలో ఆలోచన దగ్గర్నుంచి, వ్యూహప్రతివ్యూహాలు, ఆచరణ అన్నీ తన గురువులాగే చేస్తుంటాడు. ట్యాపింగ్.. రేటింగ్ ఈ స్పెషల్ టీమ్ అసైన్‌మెంట్‌లో ఉన్నప్పుడే తెలుస్తుంది ఓ మిలిటరీ ఆఫీసర్ ఆర్మీ చీఫ్ దగ్గరకు ఓ డీల్ తీసుకుని రావడం గురించి. ఓ ఆర్మ్స్ డీలర్ తరపున ఓ ఆఫర్ తీసుకొని వస్తాడు ఆ ఆఫీసర్ ఆర్మీ చీఫ్ దగ్గరకు. ఆ డీల్‌ను మన్నించి వాళ్ల దగ్గర ఆయుధాలు కొంటే అమరవీరుల వితంతువులకు సంక్షేమ ఫండ్‌నూ ఇస్తారనే తాయిలాన్నీ చూపిస్తాడు. ఆ ఆఫర్‌కు తల వంచని చీఫ్ ‘‘చివరకు దేశాన్నీ అమ్మేస్తున్నామన్న మాట’’ అంటూ చురకా అంటిస్తాడు. ‘‘అనధికారికంగా.. 20 కోట్ల ఫండ్‌తో మీరు నిర్వహిస్తున్న స్పెషల్ టీమ్ కోవర్ట్ ఆపరేషన్స్ మాటేంటి?’’ అని అప్పటిదాకా రహస్యంగా ఉన్న విషయాన్ని బయటపెట్టి బ్లాక్‌మెయిలింగ్‌కు తలపడ్తాడు ఆ ఆఫీసర్. ఆ స్పెషల్ టీమ్ ఓ కాజ్ కోసం.. ఎవరికీ తెలియకుండా నియమించింది. అది బయటపడేసరికి ఖంగు తింటాడు ఆర్మీ చీఫ్. వాళ్ల సంభాషణను ట్యాప్ చేస్తున్న జయ్ కూడా విస్మయం చెందుతాడు. అయినా తలవంచడు ఆర్మీ చీఫ్. దేశానికి రక్షణగా నిలవాల్సిన ఆ శాఖలోని అవినీతి మొత్తం మిలటరీ మీదే విశ్వాసాన్ని పోగొడ్తుంది జయ్‌కు. ఆ టీమ్‌లోంచి ఈ ఆఫీసర్ టీమ్‌లోకి మారుతాడు జయ్.. డబ్బు సంపాదించుకోవడానికి. అప్పటికే ఈ కోవర్ట్ ఆపరేషన్స్ కోసం ఓ ఎథికల్ హ్యాకర్ సోనియా (రకుల్‌ప్రీత్ సింగ్)తో పరిచయం పెంచుకొని ప్రేమలో పడ్తాడు జయ్. ఇప్పుడు ఈ ఆఫీసర్ టీమ్‌లో చేరి తన కోవర్ట్ టీమ్ రహస్యాలను చెప్పేందుకు పదికోట్లకు డీల్ కుదుర్చుకుని తన ప్రియురాలితో దేశాన్ని వదిలిపోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో ఉంటాడు కూడా. ఈ విషయం కల్నల్ అభయ్సింగ్కు తెలుస్తుంది. జయ్ కోసం వేట మొదలుపెడ్తాడు. ఇందులో భాగంగానే లండన్ చేరతారు ఇద్దరూ. అప్పటికే సోనియా లండన్ చేరుకుని ఉంటుంది జయ్ ప్లాన్‌లో భాగంగా. గురువు దగ్గర నేర్చుకున్న విద్యతో అతనికి దొరక్కుండా జాగ్రత్త పడ్తుంటాడు జయ్. ఇంకా పై ఎత్తులు వేసి దగ్గరకు రప్పిస్తాడు కల్నల్. ఇందులో ఇంటర్నేషనల్ ఆర్మ్స్ డీలర్ ముఖేష్ కపూర్ (అదిల్ హుస్సేన్)ను పావులా వాడుకుంటాడు అభయ్. ఆర్మ్స్ డీలర్ ముఖేష్ కపూర్ కూడా ఒకప్పుడు ఇండియన్ ఆర్మీలో ఆఫీసరే. ఇండియన్ ఆర్మీలో ఉన్న లొసుగులు, విధివిధానాలన్నిటినీ ఔపోసన పట్టిన అతను ఆయుధాల వ్యాపారంతో కోట్లకు పడగలెత్తొచ్చని ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ వ్యాపారం మొదలుపెడ్తాడు. విదేశీ కంపెనీల ఆయుధాలకు డీలర్‌గా మారి మన దేశంలోని మిలటరీ అధికారులకు లంచాలిస్తూ అసలు ధరకన్నా నాలుగు రెట్ల ధరతో ఆయుధాలను కొనిపిస్తుంటాడు. అలా రిటైరయ్యి, మళ్లీ ఉద్యోగంలో చేరిన ఓ ఆర్మీ ఆఫీసర్‌నూ పట్టి.. ఆయన ద్వారా చీఫ్‌కు తన వర్తమానం పంపిస్తాడు అలా. ఆర్మీ చీఫ్ వద్దనేసరికి జయ్ భక్షి సహాయంతో ఆ చీఫ్ నియమించిన కోవర్ట్ ఆపరేషన్స్ గుట్టు రట్టు చేసి టీఆర్పీలో నంబర్ మూడులో ఉన్న ఓ చానల్ రిపోర్టర్‌కు ఇస్తాడు టెలికాస్ట్ చేయమని. దాంతో చానల్ రేటింగ్‌ను పెంచుకొని నంబర్‌వన్ చానల్‌గా అయిపోమ్మని. మోసం.. దగా అయితే కల్నల్ అభయ్ సింగ్ ఆ పాచిక పారనివ్వడు. జయ్‌ను పట్టుకునే క్రమంలో జయ్ ద్వారా తెలుసుకున్న, అందుకున్న సమాచారంతో ఆ చానల్ రిపోర్టర్‌ను కలుసుకొని ఇంకో రికార్డర్ ఇస్తాడు టెలికాస్ట్ చేసుకొమ్మని. ఆఫీసర్ ఇచ్చినది వేసుకోవాలో.. ఇప్పుడు తాను ఇచ్చింది వేసుకోవాలో విచక్షణ నీదే అంటాడు. అది అమరవీరుల వితంతువుల కోసం ముంబైలో కట్టిన నివాస సముదాయంలో జరిగిన అవినీతికి సంబంధించిన వార్తాకథనం. ఆ రిపోర్టర్ అభయ్‌సింగ్ ఇచ్చిన కథనాన్నే టెలికాస్ట్ చేయిస్తుంది. ఆ ఆఫీసర్ తుపాకితో పేల్చుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే ఆ నిర్మాణం అవినీతిలో ప్రధాన హస్తం ఆ ఆఫీసర్‌దే. ఈ మొత్తం వ్యవహారం... రక్షణ శాఖ పట్ల అభయ్‌సింగ్, జయ్ల మ«ధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి ఆ ఇద్దరినీ ఒక్కటిచేసే దిశగా సాగి సినిమాను ఎండ్ చేస్తుంది. కశ్మీర్ ఓ ప్రదేశం కాదు.. రక్షణ శాఖ, అంతర్జాతీయ ఆయుధ వ్యాపారులు, డీలర్లు, దేశీ మీడియా.. ఇవన్నీ కలిసి ఎలాంటి గిమ్మిక్కులు చేస్తున్నాయి? ఆ లాబీ ముసుగులో ఎవరి ప్రయోజనాలను వాళ్లు ఎంతెంత నెరవేర్చుకుంటున్నారు? ఈ నేపథ్యంలో దేశ రక్షణ, దానిపట్ల ప్రజలకున్న నమ్మకాన్ని ఎలా పణంగా పెడ్తున్నారు? అనేదాన్ని కళ్లకు కట్టినట్టు చూపెడుతుందీ సినిమా. ‘‘ఇండియా, పాకిస్తాన్ ఈ రెండు దేశాల వైపు ఎందరో మేధావులు, విద్యావేత్తలు ఉన్నారు. అయినా కశ్మీర్ సమస్యకు ఎందుకు పరిష్కారం చూపట్లేదు?’’ అని ప్రశ్నిస్తాడు జయ్.. కల్నల్ అభయ్సింగ్ను. ‘‘కశ్మీర్ ఓ ప్రదేశంకాదు.. ఓ ఇండస్ట్రీ. దానివల్ల వ్యాపారుల దగ్గర్నుంచి రాజకీయనాయకుల దాకా అందరికీ లాభాలున్నాయి. ఓ సమస్య లాభాలను పంచుతున్నంత కాలం దాన్ని కాలం చెల్లనివ్వకుండా చూసుకుంటారు ’’ అంటాడు కల్నల్. ఎంత నిజం? అదే నిజం దేశంలోని అన్ని సమస్యలకు వర్తిస్తుంది. అదే చెప్తుంది.. చూపిస్తుంది ‘అయారి’ సినిమా. పాలకులు, కార్పోరేట్ శక్తులు కలిసి సమస్యలతో ప్రయోజనాలను పిండుకుంటే ప్రజలకు అంతా బాగుందనే భ్రాంతి కలగజేస్తూ జోకొడ్తుంటారు. చైతన్యం కాకపోతే అయారి (భ్రాంతే) మిగుల్తుంది. మనోజ్‌భాజ్‌పాయ్ ఈ సినిమాకు ఊపిరి. ఆదిల్ హెస్సేన్, నసీరుద్దీన్ షా, అనుపమ్ఖేర్ల నటన గురించి ప్రతేక్యంగా చెప్పేదేముంటుంది? పాత్రలను పండిస్తారు. వీళ్లకు సమ ఉజ్జీగా సిద్ధార్థ్ మల్హోత్రా శక్తియుక్తులను కూడదీసుకున్నాడు. రకుల్‌ప్రీత్.. డాన్సింగ్ డాల్‌గా మిగల్లేదు. దర్శకుడు నీరజ్‌పాండే ఇంతకుముందు తీసిన సినిమాలను దృష్టిలో పెట్టుకొని వెళితే నిరాశపడ్తారు. కాబట్టి ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ‘అయారి’ అలరిస్తుంది. – శరాది -
షార్ట్‌ఫిలింలో నటిస్తున్న సూపర్ స్టార్లు!
ముంబై: ఒకప్పుడు షార్ట్ఫిలింలంటే చులకన భావం ఉండేది. సినిమాల కంటే నిడివి తక్కువగా ఉండే వీటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. షార్ట్ ఫిలింలు అంటే డాక్యుమెంటరీలు అన్న భావన ఉండేది. ఇంటర్నెట్, సోషల్ మీడియా రాకతో ఇది పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ హీరోయిన రాధికా ఆఫ్టే ఇటీవల షార్ట్ ఫిలిం 'అహల్య'తో సంచలనం సృష్టించింది. ఈ ష్టార్ఫిలిం ఇటు వీక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలందుకుంది. తాజాగా డైరెక్టర్ శిరీష్ కుందర్ కూడా ఇలాంటి ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నాడు. మనోజ్ బాజ్‌పేయి, రాధికా ఆఫ్టే వంటి బాలీవుడ్ స్టార్లతో 'క్రితి' అనే చిన్న సినిమాను ఆయన నిర్మిస్తాడు. 15 నిమిషాల నిడిమి మాత్రమే ఉండే ఈ సినిమా ఓ సైకాలజికల్ థ్రిల్లర్. ఇందులో హీరోయిన్ నేహా శర్మ కూడా ఓ పాత్రలో కనిపిస్తుంది. 2006లో జానేమన్ సినిమా తీసిన శీరిష్.. ఈ పొట్టి చిత్రంతో షార్ట్‌ఫిలిం రంగంలోకి అడుగుపెడుతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కన్నా షార్ట్ఫిలింలోనే సబ్జెక్ట్‌ను నేరుగా చెప్పే స్కోప్ ఎక్కువగా ఉంటుందని ఆయన అంటున్నాడు. ఉత్కంఠ కలిగించే ఎక్సైటింగ్ స్టోరీలను చెప్పడానికి షార్ట్‌ఫిలింలు ఎంతోగానో ఉపయోగపడతాయని, ఇందుకు అందుబాటులో ఉన్న డిజిటల్ స్పేస్ ఎంతగానో తోడ్పాటు అందిస్తోందని ఆయన అంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు నిర్మించేందుకు, వాటిని విడుదలచేసేందుకు ఎంతగానో సమయం పడుతుందని, ఇబ్బందులూ ఎదురవుతాయని, షార్ట్‌ఫిలింలకు ఆ చిక్కులు లేవని ఆయన చెప్పారు. గతంలో పలు షార్ట్ ఫిలింలలో నటించిన రాధిక, మనోజ్ తొలిసారి ఈ ప్రాజెక్టు కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ షార్ట్ ఫిలిం సెట్‌పైకి వెళ్లనుంది. ఏప్రిల్ 22న విడదల కానుంది. -
గే పాత్ర వేసినా మావాళ్లు ఏమీ అనరు!
తాను సినిమాలో 'గే' పాత్రలో నటించినా.. తన కుటుంబ సభ్యులు మాత్రం ఏమీ అనరని విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి చెప్పారు. 'అలీగఢ్' అనే సినిమాలో ఆయన శ్రీనివాస రామచంద్ర సిరస్ అనే గే ప్రొఫెసర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రొఫెసర్ మరో మగాడితో సన్నిహితంగా ఉన్నప్పటి వీడియో బయటపడటంతో అతడు సస్పెండ్ అవుతాడు. అయితే మళ్లీ ఉద్యోగం ఎలా సాధిస్తాడు.. ఆ ప్రయత్నంలో ప్రాణాలు ఎలా కోల్పోతాడన్నదే సినిమా కథ. ఈ సినిమాకు హన్సల్ మెహతా దర్శకుడు. ఇందులో రాజ్‌కుమార్ రావు జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నారు. గే పాత్ర గురించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారని అడిగినప్పుడు.. తాను సినిమాలోనే చేస్తున్న విషయం వాళ్లందరికీ తెలుసని, అలాగే తాను సంప్రదాయ పాత్రలు పోషించనన్న విషయం కూడా తెలుసని, అలాంటప్పుడు వాళ్లకు తాను ఏ పాత్ర చేసినా సమస్య ఉండదని చెప్పారు. తన తల్లిదండ్రులు, భార్య, పిల్లాడు అంతా ఎంతగానో ప్రేమిస్తారని, తాను చేసే పనిని కూడా వాళ్లు ప్రేమిస్తారని చెప్పారు. -
షార్ట్ ఫిలింలో రవీనా టాండన్
బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పేయి, రవీనా టాండన్ ఓ షార్ట్ ఫిలింలో నటించారు. దేశ స్వాతంత్ర్య గొప్పదనాన్ని వివరిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ షార్ట్ ఫిలిం తీశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకపోయి ఉంటే ప్రస్తుతం మన జీవితాలు ఎలా ఉండేవి? 1940 నాటి పరిస్థితుల కంటే మెరుగ్గా ఉండేవా? స్వాతంత్ర్యం రాకుంటే ఇప్పటికీ మన బతుకులు దుర్భరంగా ఉండేవి.. ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతకాల్సి వచ్చేది.. మన దేశంలో మనకే గౌరవం ఉండేది కాదు.. బ్రిటిషర్ల కింద బానిసలుగా బతికేవాళ్లం.. ఈ ఊహాజనిత పరిస్థితులకు అద్దం పట్టేలా షార్ట్ ఫిలింను రూపొందించారు. స్వాతంత్ర్యం వచ్చాక మన భద్రత, సమాజంలో లభిస్తున్న గౌరవం వంటి విషయాలను తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పిస్తూ.. వారి త్యాగఫలం వల్లే మనం 'రెస్టారెంట్లలోకి భారతీయులకు, కుక్కులకు ప్రవేశం లేదు' అన్న బోర్డులు చూసే దుస్థితి రాలేదని 6 నిమిషాల నిడివిగల ఈ షార్ట్ ఫిలింలో చక్కగా చూపించారు. -
ఓటుహక్కు వినియోగించుకోండి
ముంబై: ఎన్నికలపై బాలీవుడ్ నటీనటులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. మార్పు కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలని తమ అభిమానులకు శనివారం విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలని, అది మన ప్రాథమిక హక్కు అని మనోజ్ బాజ్‌పాయ్, ప్రీతీ జింతా, నిఖిల్ చిన్నప్ప తదితర నటులు సామాజిక వెబ్సైట్ ట్వీటర్లో ట్వీట్ చేశారు. మార్పు ప్రక్రియను ముందుగా ఆప్ ప్రారంభిస్తుందనే ఆశాభావాన్ని హన్సల్ మెహతా వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ ప్రజలందరూ ఈ రోజు ఓటు వేస్తారని ఆశిస్తున్నా. మీరు ఓటు వేసిన తర్వాత వేలిపై ఇంకు గుర్తు చూపిస్తూ సెల్ఫీ తీసుకుని ట్వీటర్లో పోస్టు చేయండి’ అని నిఖిల్ చిన్నప్ప అన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు పోలింగ్‌లో పాల్గొని ఓటు వేయాలని మనోజ్ బాజ్‌పాయ్ అన్నారు. ‘ఢిల్లీలో ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారని ఆశిస్తున్నా. ఇది జాతీయ రాజధాని నగరంలో నివసించే వారందరికీ ముఖ్యమైన రోజు’ అని ప్రీతి జింతా చెప్పారు. ‘అందరూ ఈ రోజు బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? ఇప్పుడు ఓటు వేయకుండా తర్వాత రాష్ట్ర పాలన మీద ఫిర్యాదు చేయకండి’ అని శేఖర్ కపూర్ పేర్కొన్నారు. -
ప్రతీ వారం 'ఎన్ కౌంటర్' లో ఓ గ్యాంగ్ స్టర్
ముంబై: వీక్షకులకు గ్యాంగ్ స్టర్ల కథలంటే ఎప్పడూ ఆసక్తి కరమే. అది వెండి తెరపై కావచ్చు. బుల్లి తెరపై కావచ్చు. ఇప్పటికే ఇటువంటి కథలతో వచ్చిన సినిమాలు ప్రేక్షక్షుల్ని అమితంగా ఆకర్షించడమే కాకుండా, బుల్లి తెరను కూడా ఈ తరహా కథలు ఆకట్టుకుంటూనే ఉంటున్నాయి. తాజాగా సోనీ ఎంటర్ టైనమెంట్ టెలివిజన్ ' ఎన్ కౌంటర్' కార్యక్రమం పేరుతో శుక్రవారం నుంచి వీక్షకుల ముందుకు రానుంది. దీనికి బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు ఎన్ కౌంటర్ కార్యక్రమంలో కనిపిస్తాయని మనోజ్ తెలిపారు. ముంబై నగరంలో పోలీసులకు, గ్యాంగ్ స్టర్లకు మధ్య జరిగిన పోరాట సన్నివేశాలను ఈ కార్యక్రమంలో ప్రసారం చేయనున్నట్లు ఆయన స్ఫష్టం చేశారు. దీనిలో భాగంగా ప్రతీ వారం ఒక గ్యాంగ్ స్టర్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.ఇక్కడ ఫలానా వారే చూడాలనే నియమాలు ఏమీ లేవని, ఏ వయసులో వారైనా ఎన్ కౌంటర్ కార్యక్రమాన్ని చూడవచ్చన్నారు.