![Netflix Ray Starring Manoj Bajpayee Trailer Out - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/8/Ray_Trailer_Review.jpg.webp?itok=OwcAzeEW)
ఓటీటీ కంటెంట్‌లో అంథాలజీ(నాలుగైదు కథల సమూహారం) సిరీస్‌లకు ఈమధ్య ఫుల్ క్రేజ్ ఉంటోంది. ఈ తరుణంలో నెట్‌ఫ్లిక్స్ మరోక దానితో రాబోతోంది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే రాసిన కథల సమూహారం నుంచి నాలుగు కథలను తీసుకుని వాటి ఆధారంగా.. హిందీలో ‘రే’ సిరీస్‌ను నిర్మించింది నెట్‌ఫ్లిక్స్. ఈ సిరీస్ ట్రైలర్ ఇవాళే రిలీజ్ అయ్యింది.
ఏదైనా గుర్తు పెట్టుకునే కంప్యూటర్ లాంటి బ్రెయిన్ ఉన్న ఒక వ్యక్తి, ఒక యువ నటుడు, ఒక ఫేమస్ కవి, ఒక మేకప్ ఆర్టిస్ట్.. ఈ నలుగురి జీవితాల కథాంశమే రే(కిరణం). కవిగా మనోజ్ వాజ్‌పాయి, సూపర్ మెమరీ ఉన్న వ్యక్తిగా మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్(గుడ్డూ), మేకప్ ఆర్టిస్ట్‌గా కయ్ కయ్ మీనన్, నటుడి రోల్లో హర్షవర్దన్ కపూర్లు యాక్ట్ చేశారు. సాఫీగా సాగిపోయే ఆ నలుగురి జీవితాల్లో కల్లోలం, వాళ్ల చీకటి గతం, ఆ నలుగురి కథలకు ఊహించని ముగింపుల హింట్‌తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు. అహం, అసూయ, వెన్నుపోటు, ప్రతీకారం.. చుట్టే ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది.
ఇక సత్యజిత్ రే కథల సమూహారంలో ‘హంగామా హై క్యోన్ బార్పా, ఫర్ గెట్ మీ ఆనట్, బహురూపియా, స్పాట్లైట్ ప్రామిస్’.. రే ఆంథాలజీ సిరీస్‌గా రాబోతోంది. గజ్రాజ్ రావ్, శ్వేతా బసు ప్రసాద్, అనిందితా బోస్, బిదితా బాగ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ చౌబే, శ్రీజిత్ ముఖర్జీ, వాసన్ బాల దీనిని తెరకెక్కించారు. జూన్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. చదవండి:ఫ్యామిలీమ్యాన్ 2 రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment