మద్దాలి శివారెడ్డి గుర్తున్నాడా?.. సరికొత్త వెబ్ సిరీస్‌తో వచ్చేస్తున్నాడు! | Race Gurram Villain Ravi Kishan Web Series Maamla Legal Hai Trailer Out - Sakshi
Sakshi News home page

Ravi kishan: అలాంటి వెబ్ సిరీస్‌తో రేసుగుర్రం విలన్ ఎంట‍్రీ..!

Published Fri, Feb 16 2024 5:07 PM | Last Updated on Fri, Feb 16 2024 6:52 PM

Race Gurram Villan Ravi kishan Web Series Maamla Legal Hai trailer Out - Sakshi

రవి కిషన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అల్లు అర్జున్‌ రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా ప్రేక్షకులను అలరించాడు. తనదైన నటనతో, కామెడీతో టాలీవుడ్‌ అభిమానులను మెప్పించారు. ఆ తర్వాత కిక్-2, సుప్రీమ్, 90 ఎంఎల్, లై చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో చిత్రాలతో బిజీగా ఉన్న రవికిషన్.. గతేడాది  మిషన్‌ రాణిగంజ్‌ చిత్రంలో నటించారు. 

తాజాగా ఆయన ఓటీటీలోనూ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రవి కిషన్, నైలా గ్రేవాల్, అనంత్ విజయ్ జోషి ప్రధాన పాత్రల్లో మామ్లా లీగల్ హై అనే కామెడీ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కోర్టు రూమ్‌ నేపథ్యంలో వస్తోన్న ఈ సిరీస్‌ను ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను రాహుల్ పాండే దర్శకత్వంలో రూపొందించారు. కాగా.. ఈ సిరీస్‌ మార్చి 1న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement