
ఓటీటీలోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. 'ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్' పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఇందులో జీత్, ప్రసేన్‌జిత్ ఛటర్జీ, శాశ్వత, పరంబ్రత ఛటర్జీ వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీతో భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ నటుడిగా తెరంగేట్రం చేయనున్నారనే వార్తలు ఇప్పటికే వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ట్రైలర్ ఈవెంట్‌లో నిర్మాత నీరజ్ పాండే పరోక్షంగా గంగూలీ ఉండొచ్చు అనే కామెంట్ చేశారు.
'ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్' నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో అందుబాటులో ఉండనుంది.2000 సంవత్సరంలో బెంగాల్‌లోని పరిస్థితులను చూపిస్తూ ఈ సిరీస్‌ను దర్శకుడు దేబాత్మ మండల్ తెరకెక్కించారు. గ్యాంగ్‌స్టర్లు, రాజకీయ నాయకులలో అధికార దాహం ఉంటే.. అక్కడి నగరంలో శాంతిని కాపాడటానికి పోలీసు అధికారులు చాలా కష్టపడుతుంటారు. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఐపీఎస్ అర్జున్ మైత్రా చట్టాన్ని కాపాడేందుకు ఎలాంటి పరిస్థితిలను ఎదుర్కొన్నారనేది ఇందులో చూపారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఖాకీ ది బిహార్ చాప్టర్’కు కొనసాగింపుగా ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ తెరకెక్కించారు. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. బిహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా జీవితం ఆధారంగా ఖాకీ: ది బిహార్ చాప్టర్ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది కూడా. వాస్తవానికి ఐపీఎస్ అధికారి అమిత్ ఒక గ్యాంగ్‌స్టర్ అశోక్ మెమతోను పట్టుకోవడానికి చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కించిందే ఈ వెబ్ సీరిస్.
Comments
Please login to add a commentAdd a comment