khakee
-
ఖాకీ వెబ్ సిరీస్‌తో ఫేమస్.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్
బిహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా జీవితం ఆధారంగా ఖాకీ: ది బిహార్ చాప్టర్ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది కూడా. వాస్తవానికి ఐపీఎస్ అధికారి అమిత్ ఒక గ్యాంగ్‌స్టర్ అశోక్ మెమతోను పట్టుకోవడానికి చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కించిందే ఈ వెబ్ సీరిస్. ఇది ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది కూడా. కానీ ఇప్పుడూ ఆ వెబ్ సిరీస్ కారణంగానే ఐపీఎస్ అధికారి అవినీతి అరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక స్వలాభం కోసం తన పదవిని ఉపయోగించుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్షన్ హౌస్ ఫ్రైడే స్టోరీ టెల్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు అమిత్. ఐతే ప్రొడక్షన్ హౌస్‌తో అతని డీల్ విలువ రూ.1 కానీ అతని భార్య అకౌంట్లోకి సుమారు రూ.48 లక్షల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. అసలు ఈ ఒప్పందం కుదరక మునుపే భార్య ఖాతాలో కొంత సొమ్ము జమ అయినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో సదరు ఐపీఎస్ అధికారి అమిత్‌పై మనీలాండరింగ్ కింద పలు కేసులు నమోదు చేశారు. వాస్తవానికి ఆయన తీసిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఖాకీ ఐపీఎస్ అధికారి తన కెరియర్లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి రాసిన పుస్తకం బిహార్ డైరీస్: 'ది ట్రూ స్టోరీ ఆఫ్ హౌ బిహార్స్ మోస్ట్' ఆధారంగా రూపొందించింది. ఇదిలా ఉండగా, సదరు అధికారి అమిత్ గయాలో ఐపీఎస్‌గా నియమితులైనప్పటి నుంచే అక్రమంగా సంపాదిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అతను రచయిత కాదని పుస్తకాలు రాసి వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే అధికారం అమిత్‌కు లేదని ఆర్థిక నేరాల విభాగం పేర్కొంది. (చదవండి: పాముని కాపాడేందుకు బ్రేక్ వేయడంతో.. ఏకంగా ఐదు వాహనాలు) -
‘రీమేక్ కాదు.. స్ట్రయిట్ సినిమానే’
కార్తీ హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ఖాకీ (తమిళ్లో ధీరన్ అధిగరం ఒండ్రు) సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి ఈ రీమేక్ ప్లాన్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నట్టుగా, నార్త్ నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేస్తున్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాకు సూర్యవంశీ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై స్పందించిన దర్శక నిర్మాత రోహిత్ శెట్టి అవన్ని రూమర్స్ అంటూ కొట్టి పారేశారు. తాను అక్షయ్ కుమార్ హీరోగా చేయబోయే సూర్య వంశీ స్ట్రయిట్ సినిమా అని రీమేక్ కాదని క్లారిటీ ఇచ్చారు. -
మరోసారి ‘ఖాకీ’ జోడి
రకుల్‌ప్రీత్ సింగ్‌కు కోలీవుడ్ లో బిజీ అవుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం స్పైడర్‌లో నటించే అవకాశం రావడంతో తమిళంలో పాగా ఖాయం అనే నిర్ణయానికి వచ్చేసింది. ఈ చిత్ర నిర్మాణంలోనే విజయ్, సూర్య, కార్తీలతో నటించే అవకాశాలు చుట్టుముట్టి రకుల్‌ను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే స్పైడర్ పరాజయం ఈ అమ్మడి ఆశలపై నీళ్లు చల్లింది. అంతేకాదు విజయ్‌తో రొమాన్స్ చేసే అవకాశం చేజారింది. సూర్య చిత్రంలోనూ రకుల్‌ను తొలగించారనే ప్రచారం జోరందుకుంది. దీంతో పూర్తిగా డీలా పడిపోయిన రకుల్‌కు కార్తీతో జతకట్టిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అంతేకాదు సూర్యకు జంటగా నటించే అవకాశం తిరిగి రకుల్ చెంతకు చేరింది. ఇక బాలీవుడ్‌లోనూ రెండో అవకాశాన్ని చేజిక్కించుకుంది. రకుల్ ప్రస్తుతం హిందీలో నటిస్తున్న ఆయ్యారీ చిత్రం ఫిబ్రవరిలో తెరపైకి రానుంది. ఈ స్థితిలో అజయ్‌దేవ్‌గన్‌తో జత కట్టే మరో లక్కీచాన్స్ రకుల్ తలుపు తట్టింది. ఇలా మళ్లీ హ్యాపీ మూడ్‌లోకి వచ్చేసిన ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో మరో అవకాశం వరించిందన్నది తాజా సమాచారం. ధీరన్ అధికారం ఒండ్రుతో విజయానందాన్ని పంచిన నటుడు కార్తీతో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం రకుల్‌ను వరించిందట. కార్తీ ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నిర్మిస్తున్న కడైకుట్టి సింగం చిత్రంలో నటిస్తున్నారు. ఈయన తదుపరి చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారట. రజత్ దర్శకత్వం వహించినున్న ఇందులో కార్తీకు జంటగా నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ నిర్మించనున్నారు. హారీష్ జయరాజ్ సంగీతబాణీలు కట్టనున్నారని కోటీవుడ్ వర్గాల సమాచారం. -
సీన్ రివర్స్.. ఛాన్స్ మిస్
వరుస విజయాలతో దూసుకెళ్తున్న రకుల్ ఇన్నాళ్లు కూల్‌గానే ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్టుంది. ఈ అందాల భామకు అదృష్టంతో పాటు అందం కూడా బోలెడంత ఉంది. ఇప్పుడు ఈ భామకు వచ్చిన కష్టం ఏంటని అనుకుంటున్నారా? స్పైడర్ సినిమాతో తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తరువాత కార్తీ సరసన ధీరన్ అధిగరం ఒండ్రు (తెలుగులో ఖాకీ)తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ఈ భామకు అవకాశాలు బాగా వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వచ్చిన అవకాశాలు ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. తెలుగులో మొదటి సినిమా కెరటం నిరాశపరిచినా..రెండో సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది. తరువాత చిన్న హీరోలతో నటిస్తూనే...పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి. అవి వరుసగా హిట్స్ అవడంతో లక్కి హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తన క్యూట్ లుక్స్‌తో, అందాల ఆరబోతతో కుర్రకారుకు మత్తెక్కించింది రకుల్ కూల్‌గా. లౌక్యం, పండుగచేస్కో, కిక్2 , నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ లాంటి వరుస హిట్లతో ఉన్న రకుల్ స్పీడుకి స్పైడర్ అడ్డుకట్ట వేసింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో చెప్పుదగ్గ సినిమాలేవి లేవు. తమిళంలో వచ్చిన అవకాశాలు సైతం చేజారిపోతున్నాయి. విజయ్, మురుగదాస్‌ల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో మొదట రకుల్‌ని హీరోయిన్గా అనుకున్నారు. తర్వాత ఆ అవకాశం కీర్తిసురేశ్‌కు దక్కింది. అంతేకాదు సూర్య, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలోనూ రకుల్‌నే మొదట హీరోయిన్గా అనుకున్నా.. ఆ ప్లేస్ లో సాయి పల్లవిని తీసుకున్నారు. ఇలా ర‘కూల్’గా ఉండాల్సింది పోయి ఇప్పుడు టెన్షన్ పడాల్సి వస్తోంది. సౌత్ లో నిరాశపరిచినా. త్వరలో ఓ బాలీవుడ్ సినిమాతో ఉత్తరాదిలో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది రకుల్. -
కార్తీ దర్శకత్వంలో సూర్య హీరోగా..!
ఖాకీ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న కోలీవుడ్ హీరో కార్తీ ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సక్సెస్ మీట్ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్న ఈ యంగ్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు దర్శకత్వం చేసే ఆలోచన ఉందని తెలిపిన కార్తీ, సూర్య హీరోగా ఓ సినిమా చేయాలనుందన్న కోరికను బయట పెట్టాడు. సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న సమయంలో సూర్య కోసం ఓ కథ రెడీ చేసుకున్నానని తెలిపిన కార్తీ, సూర్యను ఒప్పించి ఆ కథను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో కార్తీ బిజీగా ఉన్నారు. సయేషా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2డి ఎంటర్ టైన్మెంట్స్ పై సూర్య నిర్మిస్తున్నారు. -
తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు – కార్తీ
‘‘తెలుగు ప్రేక్షకులకు నేను ‘ఆవారా’ కార్తీ, ‘ఊపిరి’ శ్రీనుగా గుర్తుండి పోయా. కానీ, ఈ ‘ఖాకి’ నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. నా గత చిత్రాలతో పోల్చితే తెలుగులో ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైన చిత్రమిది. ఈ సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో కార్తీ అన్నారు. కార్తీ, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖాకి’. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘వినోద్‌గారి స్క్రీన్‌ప్లేను అందరూ అభినందిస్తున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ చూసి ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. ఈ సినిమాతో చాలా మందిలో పోలీసులపై మంచి అభిప్రాయం ఏర్పడింది. నా భార్య కూడా పోలీసులు మన కోసం ఎంతో కష్టపడుతున్నారంటూ కితాబిచ్చింది. మా సినిమాను పోలీస్ డిపార్ట్మెంట్కి అంకితం ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘తెలుగు, తమిళంలో ‘ఖాకి’ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు’’ అన్నారు రకుల్. ‘‘నిర్మాతలుగా మా తొలి చిత్రమిది. సినిమా రెండోవారంలోకి ఎంటర్ అయినా పాజిటివ్ టాక్ ఉంది. కలెక్షన్స్ బాగున్నాయి’’ అన్నారు సుభాష్ గుప్తా. సహ నిర్మాత శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. -
అవసరమైతే డే అండ్ నైట్ వర్క్ చేస్తా!
‘‘నేనెప్పుడూ పోటీ ఫీలవ్వలేదు. ఈ సినిమా నేను చేయకుండా.. వేరే పర్సన్ చేస్తే వాళ్లకి పేరొస్తుందన్న ఐడియా రాంగ్. అలా కాంప్రమైజ్ అయి, కమిట్ అయితే సినిమా ఫ్లాప్ అవ్వొచ్చు. స్క్రిప్ట్ నచ్చితేనే ఓకే చేస్తాను’’ అన్నారు రకుల్ ప్రీత్‌సింగ్. హెచ్. వినోద్ దర్శకత్వంలో కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా తమిళంలో రూపొందిన చిత్రం ‘ధీరమ్ అధిగారమ్ ఒండ్రు’. ఈ సినిమాని ‘ఖాకి’ పేరుతో ‘ఆదిత్య’ ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియా వారితో రకుల్ చెప్పిన విశేషాలు. ► ‘ఈ సినిమాలో మీది హౌస్‌వైఫ్ క్యారెక్టర్’ అని దర్శకుడు వినోద్ అన్నప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను. స్క్రిప్ట్ విన్నాక ఎగై్జట్ అయ్యాను. చాలా రీసెర్చ్ చేసి, ఈ సినిమా తీశారు. రొమాంటిక్ సీన్స్‌ను డైరెక్టర్ బాగా తీశారు. కార్తీ మంచి వ్యక్తి మాత్రమే కాదు.. హార్డ్‌వర్కర్ కూడా. ► ఈ సినిమా చేశాను కాబట్టి పోలీసాఫీర్లపై గౌరవం పెరిగిందని కాదు.. నాకు మొదట్నుంచే అపారమైన గౌరవం ఉంది. రీల్ లైఫ్‌లో యాక్షన్.. కట్ ఉండవు. కానీ, రియల్ లైఫ్‌లో ఉండవు. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ మాది. సైనికులు బోర్డర్ వద్ద ఎంత కష్టపడతారో నాకు తెలుసు. నాన్నగారు రాజస్తాన్ బోర్డర్లో వర్క్ చేసినప్పుడు నేను కూడా బంగర్‌లో ఫోర్, ఫైవ్ డేస్ ఉన్నాను. గన్‌ఫైరింగ్ చుశాను. సో..నాకు డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ అంటే చాలా ఇష్టం. ► నా గురించి వచ్చే గాసిప్స్‌ని నేనంతగా పట్టించుకోను. కొంచెం రెస్ట్ కోసం నేను గ్యాప్ తీసుకున్నాననుకోండి.. చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంది అంటారు. నాకు క్వాంటిటీ కాదు. క్వాలిటీ ముఖ్యం. స్క్రిప్ట్ నచ్చితే సినిమాను వదులుకోను. అవసరమైతే డే అండ్ నైట్ వర్క్ చేస్తాను. ‘రారండోయ్..’ సినిమా టైమ్‌లో ఫోర్ మంత్స్ డేట్స్ ఖాళీగా లేవు. మిగతా సినిమాలకు కష్టపడి డేట్స్ అడ్జెట్ చేసుకున్నాను. ► హిందీలో ‘అయ్యారి’ అనే సినిమాలో చేస్తున్నా. తమిళంలో రెండు సినిమాలు చేయబోతున్నాను. తెలుగులో మరో రెండు సినిమాలు ఉన్నాయి. మహేశ్‌బాబు, సూర్య సినిమాల్లో హీరోయిన్గా సెలక్ట్ అయ్యారంటగా అన్న ప్రశ్నకు.. డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఓకే అవ్వగానే చెబుతా. ► సెక్స్‌వల్ అబ్యూజింగ్ మీద డిఫరెంట్ ఓపీనియన్ ఏముంటుంది. దేశంలో రేప్స్ జరుగుతున్నాయి. లైంగిక వేధింపులకు ఫుల్స్టాప్ పడటం లేదు. ‘కోర్టులో కేసు చాలా రోజులు సాగుతుంది. ఏదో ఒకటి చేసి బయటికి వచ్చేయొచ్చు’ అని దోషులు అనుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనలను ఆపాలంటే కఠినమైన చట్టాలను రూపొందించి అమలు చేయాలి. మహిళలను వేధించిన వారి ఫేస్‌ను టీవీల్లో కవర్ చేయకూడదు. అందరికీ చూపించాలి. పబ్లిక్‌లో శిక్షించాలి. దోషులకు శిక్షలు విధిస్తే భవిష్యత్‌లో ఇంకొందరు మహిళల జీవితాలు నాశనం అవ్వవు. అదే అరబ్ కంట్రీస్‌లో అయితే చేతులు నరికేస్తారు. ► సినిమా ఫీల్డ్‌లో లైంగిక వేధింపులు ఉంటాయని చాలామంది చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి నేను కూడా వింటున్నాను. వేధించే వారు ఉంటారో లేదో నాకు తెలీదు. కానీ, నా లైఫ్‌లో ఇంతవరకు అలాంటి సమస్యను ఎదుర్కోలేదు. కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో మీడియా ఇంటరాక్షన్ ఉంది కాబట్టి మేం మాట్లాడగలుతున్నాం. అదే కొన్ని ఆఫీసుల్లో మహిళల బాధలను ఎవరు పట్టించుకుంటారు? వారి ఇంటర్వ్యూస్‌ను ఎవరూ తీసుకోరు కదా? అందరూ నయనతార అవుదామనుకుంటే కుదరదు నయనతారకు, నాకు చాలా తేడా ఉంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలైంది. సినిమాను ఆమె ఒకత్తే ముందుకు తీసుకెళ్లగలదు. అందరూ నయనతార అవుదామనుకుంటే కుదరదు. ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ చేయాలంటే అనుభవం రావాలి. టైమ్ పడుతుంది. నేను ఇంకా డిఫరెంట్ రోల్స్ చేయాలి. ఇండస్ట్రీలో చాలా దూరం ముందుకెళ్లాలి. అప్పుడు తప్పకుండా లేడీ ఓరియంటెడ్ మూవీస్ ప్రయత్నిస్తాను. నయనతార నటించిన ‘ఆరమ్’ సినిమా ఇంకా చూడలేదు. తెలుగులో రిలీజ్ అయితే తప్పకుండా చూస్తాను. -
'ఖాకీ' మూవీ రివ్యూ
టైటిల్ : ఖాకీ జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యూ సింగ్, బోస్ వెంకట్ సంగీతం : గిబ్రాన్ దర్శకత్వం : హెచ్ వినోద్ నిర్మాత : ప్రభు ఎస్ ఆర్, ప్రకాష్ బాబు ఎస్ ఆర్ తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న కార్తీ తన ప్రతీ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అదే బాటలో తాజా చిత్రం ఖాకీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. పూర్తి స్థాయి క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఖాకీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా..? టాలీవుడ్ ప్రేక్షకులకు ఎక్కువగా లవర్ బాయ్ గానే పరిచయం ఉన్న కార్తీ ఈ సినిమాతో యాక్షన్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడా..? కథ : ధీరజ్ హరి ప్రసాద్ (కార్తీ)1999 బ్యాచ్ లో ట్రైన్ అయిన డీఎస్పీ. ట్రైనింగ్ లో ఉండగానే ఇంటి ఎదురుగా అద్దెకు వచ్చిన వాళ్ల అమ్మాయి ప్రియ(రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. డీఎస్పీగా చార్జ్ తీసుకున్న దగ్గర నుంచి తన సిన్సియారిటీ కారణంగా ట్రాన్స్ ఫర్ అవుతూ ఉంటాడు. ఆ సమయంలో ఓ ఆసక్తికరమైన కేసు ధీరజ్ కంట పడుతుంది. చెన్నై హైవే పై ఉన్న ఇంట్లోకి చొరబడిన కొందరు దొంగలు అతి కిరాతకంగా ఇంట్లో వాళ్లను చంపి వారిని దోచుకెళుతుంటారు. (సాక్షి రివ్యూస్)ఒక్క ఆధారంగా కూడా లేకుండా హత్యలు చేస్తున్న ఆ ముఠాను ఎలాగైన పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు ధీరజ్. అంత రాక్షసంగా హత్యలు చేసే వారిగురించి విచారించి వాళ్లు ఉత్తర భారతం నుంచి వచ్చే వాళ్లని, ఎక్కువగా హైవే మీదే దొంగతనాలకు పాల్పడుతున్నారంటే లారీలపై తిరిగే వారు అయి ఉంటారని ఆ దిశగా విచారించటం ప్రారంభిస్తాడు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు శ్రమించి ఆ దొంగల ముఠాను అంతం చేస్తాడు. ఈ ప్రయత్నం ధీరజ్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు..? అంత కిరాతకంగా మనుషులను చంపే ఆ దొంగల ముఠా నేపథ్యం ఏంటి..? ఈ ఇన్వెస్టిగేషన్ కారణంగా ధీరజ్ ఏం కోల్పోయాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న కార్తీ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు యాక్షన్ స్టార్ గా పరిచయం అయ్యాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన కార్తీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్,ఎమోషనల్ సీన్స్ లో కార్తీ నటన కట్టి పడేస్తుంది. హీరోయిన్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ సీన్స్ కే పరిమితమైంది. ఉన్నంతలో తనదైన నటనతో మెప్పించింది. (సాక్షి రివ్యూస్)హీరోకు ప్రతీ ఆపరేషన్ లో సాయం చేసే పోలీస్ ఆఫీసర్ సత్య పాత్రలో బోస్ వెంకట్ ఆకట్టుకున్నాడు. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలోనూ డ్యూటీ చేసే సిన్సియర్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. మెయిన్ విలన్ గా అభిమన్యూ సింగ్ తన మార్క్ చూపించాడు. కిరాతకంగా హత్యలు చేసే రాజస్థాన్ దొంగల ముఠా నాయకుడి పాత్రలో ఒదిగిపోయాడు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో పాటు ఆ పాత్రల్లో తెలుగు వారు నటించకపోవటంతో పెద్దగా కనెక్ట్ అవ్వారు. విశ్లేషణ : ఎక్కువగా లవర్ బాయ్ తరహా పాత్రలో ఫ్యామిలీ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న కార్తీ, ఖాకీ సినిమాతో యాక్షన్ హీరోగా ఆకట్టుకున్నాడు. నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ ను తయారు చేసుకున్న దర్శకుడు వినోద్ అంతే ఎఫెక్టివ్ గా తెరమీద ఆవిష్కరించటంలో సక్సెస్ సాధించాడు. అయితే తొలి భాగంలో దొంగలముఠా హత్యలు చేసే సన్నివేశాలు వయలెన్స్.. దండుపాళ్యం లాంటి సినిమాలను గుర్తుకు తెస్తుంది. ఓ కేసు విచారణలో పోలీసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిజాయితీ గల పోలీసులకు ఎలాంటి సమస్యలు వస్తాయి లాంటి అంశాలను అద్భుతంగా చూపించారు. అయితే పూర్తిగా క్రైం జానర్ లో సాగటం.. ఫ్యామిలీ ఆడియన్స్ కు యూత్ కు నచ్చే ఎమోషన్స్ లేకపోవటం కాస్త నిరాశ కలిగిస్తుంది. యాక్షన్ మోడ్ లో మొదలైన సినిమాలో వెంటనే రొమాంటిక్ సీన్స్ రావటంతో సినిమా స్లోగా నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం అలాంటి సన్నివేశాలు లేకుండా పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ లా సినిమాను తెరకెక్కించటం.. ఆసక్తికరమైన సన్నివేశాలు.. విలన్ వేసే ఎత్తులను హీరో చిత్తు చేయటం లాంటివి ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాకు అదే స్థాయి విజువల్స్ తో మరింత హైప్ తీసుకువచ్చాడు కెమెరామేన్ సత్యన్ సూర్యన్. గిబ్రన్ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. (సాక్షి రివ్యూస్) ముఖ్యంగా తొలి భాగంలో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. డ్రీమ్ వారియర్ ఫిలింస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కార్తీ నటన యాక్షన్ సీన్స్ కథ మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
డ్యూటీలో సీరియస్.. ఇంటిలో కూల్
‘‘డ్రెస్‌లో ఉండే పోలీసులను చూసి చిన్నప్పటి నుంచి సూపర్మేన్స్ అనుకునేవాణ్ణి. కానీ, ‘ఖాకి’ సినిమా చేశాక వారి కష్టం ఏంటో తెలిసింది. అప్పటి నుంచి వారిని సోదరుల్లా భావిస్తున్నా’’ అని హీరో కార్తీ అన్నారు. కార్తీ, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా వినోద్ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ తమిళంలో నిర్మించిన చిత్రం ‘ధీరన్ అధికారం ఒండ్రు’. ఈ సినిమాని ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ‘ఖాకి’ పేరుతో ఈ శుక్రవారం తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ– ‘‘తమిళనాడులో జరిగిన ట్రూ స్టోరీ ఇది. ఈ కథ కోసం దర్శకుడు రెండేళ్లు రీసెర్చ్ చేశారు. క్రైమ్ రీసెర్చ్ నేపథ్యంలో సినిమా సాగుతుంది. పదేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనలో ఎటువంటి సాక్ష్యాలు ఉండవు. ఆ నేరంలోని నిందితులను ఆంధ్ర, తమిళనాడు, రాజస్థాన్ పోలీసుల సహాయంతో ఎలా పట్టుకున్నారన్నదే కథ. ఒక రోజుకి మనం మామూలుగా ఎనిమిది నుంచి పన్నెండు గంటలు కష్టపడతాం. మా రీసెర్చ్‌లో పోలీసులు ఇరవై రెండు గంటలు కష్టపడతారని తెలిసి ఆశ్చర్యపోయా. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రమిది. బ్యూటిఫుల్ ఎమోషన్ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో కొత్త రకుల్‌ని చూస్తారు. ఎంతో మోడ్రన్‌గా ఉండే తను ఇల్లాలిగా సెట్ అవుతుందా? అనుకున్నాం. కానీ, తను చాలా బాగా చేసింది. ఈ చిత్రంలో నేను డీఎస్పీ పాత్ర చేశా. డ్యూటీలో ఎంత సీరియస్‌గా ఉన్నా ఇంటికి రాగానే భార్యతో కూల్ కూల్‌గా ఉంటాను’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. కార్తీ ఈ చిత్రం కోసం బాగా కష్టపడ్డారు. కార్తీ, రకుల్ బ్యూటిఫుల్ జోడీ. ‘ఖాకి’ తెలుగులో మంచి హిట్ అవుతుందని మేము, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు నిర్మాత ఉమేష్ గుప్తా. రకుల్‌ప్రీత్ సింగ్, సహ నిర్మాత శ్రీధర్‌రెడ్డి, నటుడు నర్రా శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కార్తీ 'ఖాకీ' ఆడియో విడుదల
-
.7...7...7 వస్తున్నాడీ ఖాకి!
ఈ నెల 27న టీజర్‌తో, వచ్చే నెల (అక్టోబర్) 17న ట్రైలర్‌తో, నవంబర్ 17న సినిమాతో వస్తున్నాడీ ‘ఖాకి’. ఈ సెవెన్ సెంటిమెంట్ ఏంటో మరి!? మధ్యలో పాటలతోనూ ఓసారి వస్తాడు. అదెప్పుడనేది త్వరలో తెలుస్తుంది. కార్తీ, రకుల్ జంటగా నటించిన తమిళ సినిమా ‘ధీరన్ అదిగారమ్ ఒండ్రు’. హెచ్. వినోద్ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఖాకి’గా తీసుకొస్తున్నారు ‘ఆదిత్యా మ్యూజిక్’ అధినేత ఉమేశ్ గుప్తా. ద పవర్ ఆఫ్ పోలీస్... అనేది ఉపశీర్షిక. ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ– ‘‘2005లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. పవర్ఫుల్ పోలీస్‌గా కార్తీ నటన, ఆయన ఫిజిక్ సిన్మాకి హైలైట్స్‌గా నిలుస్తాయి. కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూపించాలని రైట్స్ తీసుకున్నాం. జిబ్రాన్ మంచి పాటలతో పాటు రీ–రికార్డింగ్‌ను అద్భుతంగా చేస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూరన్, సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా. -
ఖాకీ కాళ్లకు సంకెళ్లు!
- క్రిమినల్స్‌ను వెనుకేసుకొస్తున్న రాజకీయ నేతలు - పోలీసు విధుల్లో జోక్యం - అధికారులకు తలనొప్పిగా మారిన వైనం - తాజాగా రేషన్ దొంగల అరెస్టు వద్దంటూ ఒత్తిళ్లు నెత్తిన టోపీ.. చేతిలో లాఠీ.. నడుముకు బెల్టు.. దానికో గన్.. వీడేరా పోలీసు అన్నట్లు కనిపించే నాలుగో సింహం రాజకీయ చట్రంలో నలిగిపోతోంది. పేరుకే పోలీసు.. పవర్ అంతా రాజకీయ నేతల చేతుల్లో ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పోలీసు సిబ్బంది ధైర్యసాహసాలను ప్రదర్శించి నిందితులను పట్టుకొచ్చి జైలుకు పంపక ముందే ‘ వాడు మా వాడే వదిలేయండి’ అంటూ ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు..ఽ లేదంటే అంతో ఇంతో ఇచ్చేందుకు డబ్బు ఎర.. అదీ కాదంటే మరుసటి రోజు బదిలీపై పంపుతానంటూ బెదిరింపు. పక్షపాతంగా విధులు నిర్వర్తించే పోలీసు కాళ్లకు ప్రజాప్రతినిధులు బంధాలు వేస్తున్నారు. క్రిమినల్స్‌ను వెనుకేసుకొస్తూ.. అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా జిల్లాలో వంద మందికిపైగా డీలర్లు అక్రమాలకు పాల్పడ్డారు. వీరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతుండగా పోలీసులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో రాజకీయ నేతల వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పట్టే సంఘటనలు మచ్చుకకు కొన్ని.. - కర్నూలు - కర్నూలు నగరం పాతబస్తీకి చెందిన ఇద్దరు వ్యక్తులు నగర శివారుల్లోని కొండల్లో జంతు కలేబరాలతో నూనెను తయారే చేసే పరిశ్రమను నెలకొల్పి భారీ ఎత్తున వ్యాపారం ప్రారంభించారు. విజిలెన్స్ అధికారులు నిఘా వేసి, దాడి చేసి కల్తీ నూనెతోపాటు పరిశ్రమను సీజ్ చేశారు. నిర్వాహకులు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధిని ఆశ్రయించడంతో వారు అలాంటి వారు కాదు, వదిలేయండంటూ ఫోన్లో హుకుం జారీ చేశారు. ప్రస్తుతం మరో చోట అదే వ్యాపారాన్ని వారు కొనసాగిస్తున్నారు. - కర్నూలు శివారుల్లోని డోన్ రహదారి పక్కన ఓ కోళ్ల ఫారంలో హైదరాబాద్‌కు చెందిన జగదీష్, గజేంద్ర, సిద్ధారెడ్డి అనే వ్యక్తులు బయో కెమికల్స్ పేరుతో నకిలీ మందులు తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారం నిర్వహించారు. 2015 సెప్టెంబరులో విజిలెన్స్ అధికారులు నిఘా వేసి దాడి చేసి సుమారు రూ.6 కోట్లు విలువచేసే మందులను సీజ్ చేశారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జోక్యం చేసుకొని కేసు తీవ్రతను నీరుగార్చారు. - ఆరు నెలల క్రితం కార్భైడ్ ప్యాక్టరీకి ఎదురుగా ఉన్న ఆర్టీసీ కాలనీలో ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తి కూడా బయో ఉత్పత్తుల పేరుతో నకిలీ ఎరువుల వ్యాపారం ప్రారంభించాడు. విజిలెన్స్ అధికారులు నిఘా వేసి నకిలీ మందులను సీజ్ చేసి కేసును పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఓ ప్రజాప్రతినిధి జోక్యంతో పోలీసులు రూ.3 లక్షలు మామూళ్లు దండుకొని కేసు తీవ్రతను తగ్గించారన్న చర్చ జరుగుతోంది. – అనంతపురం జిల్లా విజిలెన్స్ డీఎస్పీ రాజేశ్వరరెడ్డికి సంబంధించిన బంధువులు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా, కార్భైడ్ ఫ్యాక్టరీ దొంగలు బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసులో సుమారు 10 మంది యువకులను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అయితే దోపిడీ ముఠాకు నాయకత్వం వహించిన యువకుడు తన అనుచరుని కుమారుడు. అతను అలాంటి వ్యక్తి కాదు. వదిలేయండంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి తీవ్ర వత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. - శివారుల్లోని కొత్త కాలనీలో నివాసం ఉంటున్న ఓ ఇంట్లో దొంగలుపడి అందినమటుకు దండుకొని పరారయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు అప్రమత్తమై అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిని ఆశ్రయించడంతో అతను అలాంటి వాడు కాదు. వదిలేయండంటూ పోలీసు అధికారికి ఫోన్ చేసి హుకుం జారీ చేశాడు. – కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త శివాజీ రావు ఎల్లెల్సీ కాల్వ ద్వారా నాన్ఆయకట్టుకు నీళ్లు తీసుకెళ్తుండగా లస్కర్ అడ్డగించాడు. అతనిపై దాడి చేసి తల పగులగొట్టాడు. మాజీ మంత్రి టీడీపీ నేత జోక్యంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేయకుండా కాలయాపన చేసి కేసును నీరుగార్చారు. – కోడుమూరు మండలం అమ్మడగుంట్ల గ్రామంలో నాలుగు నెలల క్రితం వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేశారు. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ నాయకుడి జోక్యంతో పోలీసులు కేవలం పీటీ కేసు నమోదు చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై కూడా కౌంటర్ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. రేషన్ దొంగల అరెస్టులో కాలయాలపన: రేషన్ పంపిణీలో ఈ-పాస్ మిషన్ల ట్యాంపరింగ్ కేసును రాజకీయ నేతల ఒత్తిళ్లతో పోలీసులు నీరుగారుస్తునే విమర్శలు ఉన్నాయి. చౌక దుకాణాల్లో అవినీతిని అడ్డుకోవడానికి ఈ -పాస్ మిషన్లను గత ఏడాది ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ-పాస్ మిషన్ సాప్ట్వేర్ ట్యాంపరింగ్‌తో క్లోజింగ్ బ్యాలెన్స్‌లో తక్కువ చూపించి, చౌక డిపో డీలర్లు ప్రభుత్వానికి రూ.లక్షల్లో గండి కొట్టారు. పౌరసరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసును దర్యాప్తు చేసి 149 మంది అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. వారిపై పోలీస్ స్టేషన్ల వారీగా కేసులు కూడా నమోదయ్యాయి. డీలర్లపై ఫిర్యాదు చేసి మూడు వారాలు గడుస్తున్నా అరెస్టుకు జాప్యం జరుగుతుంది. ఈ విషయంలో నగరంలోని ఇద్దరు కీలక నేతలు పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కర్నూలు అర్బన్‌లో 100 మంది డీలర్లు అక్రమాలకు పాల్పడ్డారంటూ గతనెల 19వ తేదీన ఏఎస్ఓ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫిర్యాదు చేశారు. వెంటనే చౌక డిపో డీలర్లు నగరంలోని రాజకీయ నాయకులను ఆశ్రయించారు. విచారణ చేయండి కానీ, అరెస్టు మాత్రం మేము చెప్పేంత వరకు చేయవద్దని పోలీసులకు హుకుం జారీ చేశారు. జన చైతన్య యాత్రలు జరుగుతున్నాయి. అప్పటి వరకు ఆగండి అంటూ నేతలు ఆదేశించడంతో ఖాకీ సార్లు కూడా కాలయాపనే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేసులు నమోదు చేసినప్పటికీ నేతల జోక్యంతో అరెస్టులకు పోలీసులు విరామం ప్రకటించారన్న విమర్శలు వినిపస్తున్నాయి. కేసులు నమోదు చేసిన సమయంలో సానుకూలంగా స్పందించిన పోలీసులు తదనంతర పరిణామాల నేపథ్యంలో అరెస్టులకు ఉత్సాహం చూపడం లేదు. అంతేకాకుండా కొందరు డీలర్లు అరెస్ట్ కాకుండా స్టే తెచ్చుకునేలా వెసలుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. 100 మంది డీలర్లలో కర్నూలులో ఐదుగురు, నందవరంలో ఐదుగురు డీలర్లు మాత్రమే ఈ కేసులో అరెస్టు చేయడం ఇందుకు బలం చేకూరుతుంది.