కార్తీ దర్శకత్వంలో సూర్య హీరోగా..! | Kollywood Hero karthi wants to direct suriya | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 29 2017 11:59 AM | Last Updated on Wed, Nov 29 2017 12:18 PM

Kollywood Hero karthi wants to direct suriya - Sakshi

ఖాకీ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న కోలీవుడ్ హీరో కార్తీ ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సక్సెస్ మీట్ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్న ఈ యంగ్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు దర్శకత్వం చేసే ఆలోచన ఉందని తెలిపిన కార్తీ, సూర్య హీరోగా ఓ సినిమా చేయాలనుందన్న కోరికను బయట పెట్టాడు. 

సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న సమయంలో సూర్య కోసం ఓ కథ రెడీ చేసుకున్నానని తెలిపిన కార్తీ, సూర్యను ఒప్పించి ఆ కథను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో కార్తీ బిజీగా ఉన్నారు. సయేషా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2డి ఎంటర్ టైన్మెంట్స్  పై సూర్య నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement