
ఒకప్పుడు సినిమా 50, 100 రోజుల పాటు థియేటర్లలో ఆడేది. దానిబట్టి హిట్టా ఫ్లాప్ అనేది నిర్ణయించేవాళ్లు. కానీ ఇప్పుడు సినిమా ఎలా ఉన్నా సంబంధం లేదు. కోట్లకు కోట్లు వచ్చాయా.. మా మూవీ హిట్ అయిపోయిందో అని నిర్మాతలు చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడంతా వసూళ్ల బట్టే ఫలితాన్ని నిర్ణయిస్తున్నారు. ఫ్యాన్స్ గొడవలు పడేది కూడా ఈ వసూళ్ల గురించే.
మా హీరో సినిమాకు తొలిరోజు ఇన్ని కోట్లు వచ్చాయని ఒకడంటే.. మా హీరో చిత్రానికి తొలిరోజు మీ వాడికంటే ఎక్కువనే వచ్చాయని మరో ఫ్యాన్ అంటాడు. ఇలాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి అభిమానులపై తమిళ హీరో సూర్య కౌంటర్లు వేశాడు. మూవీకి వచ్చే కలెక్షన్స్ గురించి మీకెందుకు అని అడిగాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)
కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మెయిళగన్'. సూర్య-జ్యోతిక నిర్మించారు. తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో థియేటరలో రిలీజ్ చేస్తున్నారు. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా తమిళనాడులో జరిగింది. ఇందులో మాట్లాడిన సూర్య.. 'సినిమాలోని స్టోరీ, కంటెంట్, పాత్రల గురించి మాట్లాడుకోండి. వాటి గురించి సెలబ్రేట్ చేసుకోండి. వసూళ్ల గురించి మీకు(ఫ్యాన్స్) ఎందుకు? వాటి గురించి ఆలోచించడం ఆపండి' అని చెప్పాడు.
వసూళ్ల గురించి ఫ్యాన్స్ గొడవ పడుతుంటారని దాదాపు అందరు హీరోలకు తెలుసు. కానీ ఏ ఒక్కరూ దాని గురించి మాట్లాడరు. సూర్య మాత్రం మరీ కొట్టినట్లు చెప్పనప్పటికీ చెప్పాల్సిన విషయాన్ని అయితే చెప్పాడు. మరి దీన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారో చూడాలి?
(ఇదీ చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?)
This is to all the fans who fight day in and day out about the Box Office numbers. pic.twitter.com/YPqdDAi6wb
— Aakashavaani (@TheAakashavaani) September 23, 2024