డిల్లీతో రోలెక్స్‌ | Suriya and Karthi To Act Together For Khaidi Movie Sequel | Sakshi
Sakshi News home page

డిల్లీతో రోలెక్స్‌

Published Mon, Nov 4 2024 1:18 AM | Last Updated on Mon, Nov 4 2024 1:18 AM

Suriya and Karthi To Act Together For Khaidi Movie Sequel

తమిళ చిత్ర పరిశ్రమలోని స్టార్‌ హీరోల్లో సూర్య, కార్తీలకు ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ములైన వీరు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఎదురు చూపులు ఫలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ‘ఖైదీ 2’ సినిమాలో ఈ అన్నదమ్ములిద్దరూ తెరని పంచుకోనున్నారు. కార్తీ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ఖైదీ’. 

లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో తొలి మూవీగా వచ్చిన ‘ఖైదీ’ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో 2019 అక్టోబరు 25న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని కార్తీ, లోకేష్‌ కనగరాజ్‌ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా తెరకెక్కిస్తున్నారు లోకేశ్‌ కనగరాజ్‌. ఈ చిత్రం తర్వాత లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా ‘ఖైదీ 2’ మూవీ చేస్తారట లోకేశ్‌. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్‌ మొదలుకానుంది.

అయితే ఈ సినిమాలో హీరో సూర్య కీలక పాత్రలో నటించనున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్  హీరోగా వచ్చిన ‘విక్రమ్‌’ చిత్రంలో రోలెక్స్‌ అనే డాన్ గా అతిథి పాత్రలో మెరిశారు సూర్య.  ‘ఖైదీ 2’ లోనూ రోలెక్స్‌ పాత్రలో సూర్య కనిపిస్తారని టాక్‌. పైగా ‘ఖైదీ 2’లో రోలెక్స్‌ను డిల్లీ     (’ఖైదీ’ చిత్రంలో కార్తీ చేసిన పాత్ర పేరు డిల్లీ) నేరుగా కలవాల్సి ఉందని ఇటీవల కార్తీ చెప్పడంతో వీరిద్దరూ కలిసి నటించడం పక్కా అని ఖుషీ అవుతున్నారు అభిమానులు. తమ్ముడు కార్తీతో కలిసి ‘ఖైదీ– 2’లో తాను నటిస్తానని సూర్య కూడా ఇటీవల ఓ సందర్భంలో చెప్పడంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలో ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement