Lokesh Kanagaraj
-
జైపూర్‌కు కూలీ
జైపూర్ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో జరగనుందని, ఈ షెడ్యూల్లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. -
లోకేష్ కనకరాజ్-ప్రభాస్ మూవీ ఓకే చెప్పిన యంగ్ రెబల్ స్టార్..
-
'జైలర్' అభిమానులకు శుభవార్త
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈయన ఇటీవల జ్ఞానవేల్ దర్మకత్వంలో వేట్టైయన్‌లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా మెప్పించారు. అయితే, ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా కూలీ చిత్రం తరువాత రజనీకాంత్ కోసం మరో చిత్రం ఎదురు చూస్తోంది. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన అందులో నటి రమ్యకృష్ణ రజనీకాంత్‌కు భార్యగా నటించగా, నటి తమన్నా ప్రత్యేక పాత్రలో మెరిశారు. కాగా జైలర్ చిత్రం నిర్మా ణ దశలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ పేర్కొన్నారు. దీంతో ఈయన జైలర్– 2 చిత్ర కథను తయారు చేసే పనిలో ఉన్నారు. తా జాగా కథను రెడీ చేసి నెల్సన్ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధం అయ్యారని సమాచారం. ఈ చిత్రానికి 'హుకూమ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలు ఇంకా వెల్లడికాకపోయినా ప్రస్తుతం 'హుకూమ్' చిత్రం గురించి అప్ డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రం డిశంబర్ తొలి వారంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన పనులు స్థానిక పూందమల్లిలోని ఈవీపీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో వీడియోను రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే నిజం అయితే రజనీకాంత్ అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
లోకేష్ కనకరాజ్ చిత్రానికి కొత్త సంగీత దర్శకుడు
మాస్టర్, విక్రమ్,లియో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో స్టార్ దర్శకుడిగా మారిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా 'కూలీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ కనకరాజ్ ఇంతకు ముందే నిర్మాతగా మారి ఒక చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసేశారు. కాగా తాజాగా రాఘవ లారెన్స్ కథానాయకుడిగా 'బెంజ్' అనే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ కథను అందించినప్పటికీ ఈ చిత్రానికి రెమో (శివకార్తికేయన్), సుల్తాన్ (కార్తి) చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియోను నటుడు లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రం ద్వారా నూతన సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ను పరిచయం చేస్తున్నారు. గతంలో ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాష్ కుమార్, సత్య.సీ వద్ద పలు చిత్రాలకు ఆయన పనిచేశారు. అదే విధంగా కట్చిచేర, ఆశ కూడ వంటి ప్రైవేట్ ఆల్బమ్‌లో పాడి సంగీతాన్ని అందించి పాపులర్ అయ్యారనేది గమనార్హం. లోకేష్ కనకరాజ్ నిర్మిస్తున్న బెంజ్ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా సీనీ రంగప్రవేశం చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇంతకంటే మంచి అవకాశం తనకు రాదన్నారు. దీంతో ఉత్సాహంతో, మరింత బాధ్యతగా పని చేస్తున్నానన్నారు. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయి సంగీతాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. -
డిల్లీతో రోలెక్స్
తమిళ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో సూర్య, కార్తీలకు ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ములైన వీరు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఎదురు చూపులు ఫలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ‘ఖైదీ 2’ సినిమాలో ఈ అన్నదమ్ములిద్దరూ తెరని పంచుకోనున్నారు. కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఖైదీ’. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో తొలి మూవీగా వచ్చిన ‘ఖైదీ’ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో 2019 అక్టోబరు 25న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని కార్తీ, లోకేష్ కనగరాజ్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా తెరకెక్కిస్తున్నారు లోకేశ్ కనగరాజ్. ఈ చిత్రం తర్వాత లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ‘ఖైదీ 2’ మూవీ చేస్తారట లోకేశ్. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది.అయితే ఈ సినిమాలో హీరో సూర్య కీలక పాత్రలో నటించనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా వచ్చిన ‘విక్రమ్’ చిత్రంలో రోలెక్స్ అనే డాన్ గా అతిథి పాత్రలో మెరిశారు సూర్య. ‘ఖైదీ 2’ లోనూ రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తారని టాక్. పైగా ‘ఖైదీ 2’లో రోలెక్స్‌ను డిల్లీ (’ఖైదీ’ చిత్రంలో కార్తీ చేసిన పాత్ర పేరు డిల్లీ) నేరుగా కలవాల్సి ఉందని ఇటీవల కార్తీ చెప్పడంతో వీరిద్దరూ కలిసి నటించడం పక్కా అని ఖుషీ అవుతున్నారు అభిమానులు. తమ్ముడు కార్తీతో కలిసి ‘ఖైదీ– 2’లో తాను నటిస్తానని సూర్య కూడా ఇటీవల ఓ సందర్భంలో చెప్పడంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలో ఫుల్ క్రేజ్ నెలకొంది. -
'ఖైదీ' సీక్వెల్లో మరో పాన్ ఇండియా హీరో
కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన కెరియర్లో రెండవ సినిమాగా ఖైదీ విడుదలైంది. నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు లోకేష్ కనకరాజ్, నటుడు కార్తీ చెప్పారు. అయితే ఆ చిత్రం తర్వాత ఈ ఇద్దరూ తమ చిత్రాలతో బిజీ అయ్యారు. అదే విధంగా లోకేష్ కనకరాజ్ నటుడు కమలహాసన్ కథానాయకుడిగా తెరకెక్కించిన విక్రమ్ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది ఆ చిత్రం చివరిలో నటుడు సూర్య రోలెక్స్ పాత్రలో డాన్‌గా మెరిశారు. అదేవిధంగా ఖైదీ చిత్రంలో కార్తీ పాత్ర పేరు ఢిల్లీ. కాగా అన్నదమ్ములైన సూర్య, కార్తీ కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. దీంతో సూర్య, కార్తీలను ఎప్పుడు చూసినా రోలెక్స్, డిల్లీ కలిసి నటించే విషయం గురించే అడుగుతుంటారు. ఇటీవల నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలో జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో కార్తీ అతిథిగా పొల్గొన్నారు. దీంతో అభిమానులు మరోసారి రోలెక్స్, డిల్లీ కలిసి ఎప్పుడు నటిస్తారు అంటూ ప్రశ్నించారు. దీంతో సూర్య త్వరలోనే ఖైదీ – 2 చిత్రం ప్రారంభం అవుతుందని అందులో తమ్ముడు కార్తీతో కలిసి తాను నటిస్తానని చెప్పారు. అదేవిధంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా వచ్చే ఏడాది ఖైదీ– 2 చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని ఒక భేటీలో చెప్పారు. దీంతో సూర్య, కార్తీ కలిసి నటించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ నటుడు రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఆయన చేసే చిత్రం ఖైదీ– 2 నే అవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
'ఖైదీ' సీక్వెల్‌పై లోకేశ్ కనకరాజ్ ట్వీట్
ఖైదీ–2 చిత్రం గురించి తాజా అప్డేట్ వచ్చేసింది. కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం అప్పట్లో భారీ విజయం అందుకుంది. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తన కెరియర్లో రెండో చిత్రంగా డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2019లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. విశేషం ఏమిటంటే..? ఈ చిత్రంలో కథానాయకి లేదు, డ్యూయెట్లు ఉండవు, ఇంకా చెప్పాలంటే అసలు గ్లామర్ వాసన లేని చిత్రం ఖైదీ. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తి నటన హైలెట్. ఖైదీ చిత్రానికి సీక్వెల్‌గా ఉంటుందని అటు దర్శకుడు లోకేశ్ కనకరాజ్, ఇటు కార్తి చెబుతూనే ఉన్నారు. దీంతో ఖైదీ–2 చిత్రం కోసం కార్తి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖైదీ చిత్రం విడుదలై 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తన ఎక్స్ మీడియాలో పోస్ట్చేస్తూ.. ‘అంతా ఇక్కడ నుంచే ప్రారంభమైంది. కార్తి, ఎస్ఆర్ ప్రభులకు ధన్యవాదాలు. వీరి వల్లే లోకేశ్ యూనివర్శల్ సాధ్యమైంది. త్వరలోనే ఢిల్లీ (ఖైదీ చిత్రంలో కార్త్తి పాత్ర పేరు) తిరిగి రానున్నారు అని పేర్కొన్నారు. అలా ఆయన త్వరలోనే ఖైదీ–2 చిత్రం తెరకెక్కనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో కార్తి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఖైదీ–2కు సిద్ధమయ్యే అవకాశం ఉందని భావించవచ్చు. It all started from here! 💥💥Grateful to @Karthi_Offl sir, @prabhu_sr sir and the ‘universe’ for making this happen 🤗❤️Dilli will return soon 🔥#5YearsOfKaithi pic.twitter.com/Jl8VBkKCju— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 25, 2024 -
'లియో'కు ఏడాది.. మేకింగ్ వీడియో చూశారా..?
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియో చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ చిత్రం విడుదలై సరిగ్గా ఏడాది పూర్తి అవుతుంది. దీంతో అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఒక కానుకను అందించింది. లోకేశ్- విజయ్ కాంబోలో మాస్టర్ తర్వాత ఈ చిత్రం గతేడాది అక్టోబర్ 19న విడుదలైంది. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లియో రూ. 620 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతటి విజయం సాధించిన సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తి కావడంతో 'లియో క్రానికల్స్' పేరుతో సుమారు 8 నిమిషాల నిడివి ఉన్న వీడియోను మేకర్స్ పంచుకున్నారు. సినిమాలో ట్రెండ్ అయిన సీన్స్‌ను ఎలా తెరకెక్కించారో చూపించారు. నెట్టింట వైరల్‌గా మారిన మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి. -
కాంబినేషన్ సెట్?
బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ , తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ కథ విషయమై ఇటీవల ఆమిర్ ఖాన్ , లోకేష్ పలుమార్లు చర్చించుకున్నారట. ప్రస్తుతం వీరిద్దరికి ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావచ్చని, 2026లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఈ సినిమా సూపర్‌హీరో జానర్లో ఉంటుందట. మరి.. ఆమిర్, లోకేష్ కాంబినేషన్ సెట్ అవుతుందా? వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారనే టాక్ కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. -
ఎల్‌సీయూపై లోకేశ్ కనగరాజ్ ప్రకటన
కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానులు ఉన్నారు. త్వరలో రజనీకాంత్ 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్, లియో తదితర సినిమాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. సరికొత్త కథలకు గత చిత్రాల్లోని పాత్రలను ముడిపెడుతూ 'సినిమాటిక్ యూనివర్స్' (LCU) అనే కాన్సెప్ట్‌తో విజయాలను అందుకున్నారు.కూలీ సినిమా గురించి లోకేశ్ కనగరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రం సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సీయూ)లో భాగం కాదన్నారు. కానీ, కూలీ సినిమా తర్వాత అదిరిపోయే ప్రాజెక్ట్ రానుందని ఆయన ప్రకటించారు. సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగమైన స్టార్ హీరోలందరితో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని రివీల్ చేశారు.ప్రస్తుతం కూలీ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చామని లోకేశ్ చెప్పారు. రజనీకాంత్‌కు ఇటీవల సర్జరీ జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి తలైవా సెట్స్‌లో ఎంట్రీ ఇస్తారని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నీ కూడా కేవలం ఆరు నెలల్లోనే పూర్తిచేశానని, ఇప్పుడు కూలీ చిత్రాన్ని ఈ సమయంలోపే ముగిస్తానని ఆయన పేర్కొన్నారు.సినిమాటిక్ యూనివర్స్ (LCU) ప్లాన్ ఇదేలోకేశ్ కనగరాజ్ రాబోయే సినిమాల గురించి కూడా మాట్లాడారు. రాబోయే ఐదేళ్లపాటు తన సినిమాల్లో బ్లడ్,గన్స్,డ్రగ్స్ ఉంటాయని చెప్పారు. ఆ తర్వాతే మరో భిన్నమైన సినిమాలు తీస్తానన్నారు. ఈ క్రమంలోనే ఖైదీ, విక్రమ్, లియోతో సినిమాటిక్ యూనివర్స్ కథ ప్రారంభమైందన్నారు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనే కీలకమైన పాత్ర ఉందని రివీల్ చేశారు. దానిని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రజనీతో కూలీ సినిమా పూర్తి చేసిన వెంటనే LCUలో భాగమైన హీరోలందరితో ఈ భారీ ప్రాజెక్ట్ ప్రారంభమౌతుంది. అంటే ఖైదీ, విక్రమ్, లియో ఈ మూడు సినిమాలను లింక్ చేస్తూ ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఉండనుంది. అయితే, 'లియో2' కోసం విజయ్ ఒప్పుకుంటే 'పార్తిబన్' పేరుతో తెరకెక్కిస్తానని లోకేశ్ కనగరాజ్ చెప్పారు. -
ఒక్క వీడియోతో రెండు నెలల కష్టం బూడిదలో పోసినట్లైంది: డైరెక్టర్ ఆవేదన
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం రజినీకాంత్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీని భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో సైమన్ పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వైజాగ్‌లో నాగార్జున్పై ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట లీకైంది. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేశారు. అది కాస్తా వైరల్ కావడంతో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్పందించారు. దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.లోకేశ్ తన ట్వీట్లో రాస్తూ..' మేము దాదాపు రెండు నెలల పాటు కష్టపడ్డాం.. ఈ ఒక్క వీడియోతో మా కష్టం వృథా అయింది. మీ అందరికీ నాదొకటే విజ్ఞప్తి.. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు.. దీని వల్ల మేం పడిన కష్టమంతా వృథా అవుతుంది.. ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: రజినీకాంత్- కనగరాజ్ 'కూలీ'.. నాగార్జున వీడియో లీక్!) కాగా.. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ దేవాగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో జరుగుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Two months of hard work by many people have gone in vain because of one recording. I humbly request everyone not to engage in such practices, as they spoil the overall experience. Thank you.— Lokesh Kanagaraj (@Dir_Lokesh) September 18, 2024 -
రజినీకాంత్- కనగరాజ్ 'కూలీ'.. నాగార్జున వీడియో లీక్!
టాలీవుడ్ హీరో, కింగ్ నాగార్జున ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్-8కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది అంతా సరికొత్తగా బిగ్‌బాస్ షో ప్రారంభమైంది. ఇప్పటికే హౌస్ నుంచి బేబక్క, ఆర్జే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం మూడోవారంలో నామినేషన్స్ ప్రక్రియ హోరాహోరీగా సాగుతోంది. అయితే నాగార్జున.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తోన్న కూలీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ప్రస్తుతం నాగార్జున ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నాగ్ యాక్షన్ సీన్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కింగ్ ఫైట్ చేస్తోన్న సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జున్ సైమన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు తమ అభిమాన హీరోను చూసి థ్రిల్ అవుతున్నారు. ఇందులో నాగార్జున పాత్రను విక్రమ్ సినిమాలోని కమల్ హాసన్ రోల్లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు శృతి హాసన్‌ని, సత్యరాజ్, ఉపేంద్ర నటిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ దేవాగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో జరుగుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. #Nagarjuna as SIMON in #coolie 🔥💥 ... heavy coat pota #rolex vibes...there's a reason y loki said he'll retire soon. His style of making is gonna get saturated among audiences soon 😢#LokeshKanagaraj #Rajinikanth𓃵 #Suriya #kanguva pic.twitter.com/j7aB1x07zL— Shalzz (@shalu_achar) September 18, 2024 #COOLIE : #Nagarjuna Scenes Leaked🔥This is Gonna Be Bigger This Time🥶#Rajinikanth | #LokeshKanagaraj pic.twitter.com/CqvWZ9SQBT— Prasanna Zone (@JiPrasanna) September 18, 2024 #COOLIE : #Nagarjuna Scenes Leaked🔥This is Gonna Be Bigger This Time🥶#Rajinikanth | #LokeshKanagaraj #GucciIstante#Balochistan #pagers #SB19pic.twitter.com/coFtlcE5WV pic.twitter.com/YBG7GG3QtD— Suresh choudhary (@Sureshrewar03) September 18, 2024 -
'కూలీ' షూటింగ్.. కొద్దిలో తప్పిన అగ్ని ప్రమాదం
తమిళ స్టార్ హీరో రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తీస్తున్న సినిమా 'కూలీ'. ప్రస్తుతం వైజాగ్ పోర్ట్ ఏరియాలో షూటింగ్ జరుగుతోంది. దాదాపు 40 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే చిత్రబృందానికి ఇప్పుడు కొద్దిలో భారీ అగ్ని ప్రమాదం తప్పింది. చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశానికి దగ్గరలో కంటైనర్ టెర్మినల్‌లో మంటలు చెలరేగాయి. చైనా నుంచి గత నెలలో వచ్చిన లిథియం బ్యాటరీల లోడ్ కంటైనర్ ఇది. తొలుత కంటైనర్ లోపల నుంచి పొగ వస్తున్నట్లు గుర్తించిన టెర్మినల్ సిబ్బంది.. వెంటనే పోర్ట్ ఫైర్ విభాగానికి సమాచారం అందించారు. అలా ఫైరింజన్లు వచ్చే సమయానికి కంటైనర్ లోని చాలా బ్యాటరీలని బయటకు లాగేశారు. కానీ కొన్ని బ్యాటరీలు దగ్ధమయ్యాయి. ప్రస్తుతం ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి దెబ్బ)అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే రజినీకాంత్ 'కూలీ' షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఊహించని ప్రమాదం జరగడంతో సెట్లో ఉన్నవాళ్లందరూ భయబ్రాంతులకు గురయ్యాడు. కాకపోతే ఎవరికీ ఏం కాలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఇకపోతే 'కూలీ' సినిమాలో రజినీకాంత్ హీరో కాగా నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్, అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. 'విక్రమ్', 'లియో' చిత్రాలతో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్ ఈసారి అదరగొట్టేస్తాడనే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఇది థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: పెళ్లి పనులు మొదలుపెట్టేసిన హీరోయిన్.. మెహందీ ఫొటోలు) -
రజనీకాంత్ సినిమాలో మరో స్టార్ హీరో ఎంట్రీ..?
సూపర్ స్టార్ రజనీకాంత్- డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కూలీ'. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల గురించి పలు రూమర్స్ వచ్చాయి. తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో తెరపైకి వచ్చింది. భారీ అంచనాలున్న ఈ సినిమాపై సినీ అభిమానులు ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాలో నటిస్తున్న తారల గురించీ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇదొక మల్టీస్టారర్ సినిమా తరహాలో తెరకెక్కబోతోందని, ఇందులో టాలీవుడ్ హీరో నాగార్జునతో పాటు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించనున్నారని తమిళ సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే, తాజాగా కన్నడ సూపర్ స్టార్ 'ఉపేంద్ర' ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు సమాచారం. ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కొద్దిరోజుల క్రితమే కూలీ సినిమా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. దాదాపు 25రోజుల పాటు ఈ షెడ్యూల్ ఇక్కడే కొనసాగింది. బంగారం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలిసింది. -
భారతీయుడు-2 మూవీపై అలాంటి ట్వీట్.. డైరెక్టర్‌పై నెటిజన్స్ ఫైర్!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. 1996లో సూపర్ హిట్‌గా నిలిచిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా తీసుకొచ్చారు. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతోంది. ఈ చిత్రంలో శంకర్ మార్క్ కనిపించలేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.అయితే తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇండియన్-2 సినిమాపై ట్వీట్ చేశారు. శంకర్ సార్ నిబద్ధతకు.. కమల్ హాసన్ నటనకు భారతీయుడు-2 చిత్రం నిదర్శనమన్నారు. అద్భుతమైన బీజీఎం అందించిన అనిరుధ్ రవిచందర్‌కు నా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ఇండియన్-3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రాసుకొచ్చారు.అయితే ఇది చూసిన నెటిజన్స్ లోకేశ్ కనగరాజ్ ట్వీట్‌పై మండిపడుతున్నారు. మీరు ఇలాంటి రివ్యూ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఇలాంటి జోకులు వేయడం అపండి సార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇండియన్-3 కోసం తాము సిద్ధంగా లేమని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మీరు కమల్ సార్ ఫ్యాన్ అయినప్పటికీ.. ఇలా చెప్పడం తగదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దయచేసి కూలీ మూవీ, ఖైదీ, విక్రమ్ లాంటి సీక్వెల్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండని లోకేశ్‌కు సూచిస్తున్నారు. కాగా.. ఇప్పటికే నిడివి ఎక్కువైందంటూ బాక్సాఫీస్ వద్ద విమర్శలు ఎదుర్కొంటున్న ఇండియన్-2పై పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో నెటిజన్స్ ఇలా రియాక్ట్ అయ్యారు. #Indian2 is proof of our #Ulaganayagan @ikamalhaasan sir’s commitment to his craft. Kudos to @shankarshanmugh sir for bringing grand visions to life on a massive scale with @anirudhofficial’s scintillating background score for the film! 🤗❤️Can’t wait for #Indian3 🔥🔥— Lokesh Kanagaraj (@Dir_Lokesh) July 13, 2024 -
స్టార్ హీరో క్రేజీ ప్రాజెక్ట్‌లో పుష్ప విలన్.. ఓకే చెప్పేస్తారా?
పుష్ప సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్న నటుడు ఫాహద్ ఫాజిల్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఫాహద్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలోనూ కనిపించనున్నారు. పుష్ప-2తో పాటు రజినీకాంత్ వెట్టాయన్ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఆయనకు మరో క్రేజీ ఆఫర్ తలుపు తట్టినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ఫహద్ ఫాసిల్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కూలీ మేకర్స్ ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మరోసారి రజినీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటికే దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న వెట్టాయన్లో రజినీకాంత్, ఫాహద్ ఫాజిల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.మరోవైపు ఫాహద్ ఫాజిల్ ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రజినీకాంత్ 'వెట్టాయన్', అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్‌తో పాటు తమిళంలో మారీసన్, మలయాళంలో 'ఒడుమ్ కుతిర చదుమ్ కుతిరా', 'బౌగెన్‌విల్లా' 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాల్లో నటిస్తున్నారు. మరీ ఈ చిత్రాన్ని అంగీకరిస్తాడో లేదో తెలియాల్సి ఉంది. కాగా.. లోకేష్ కనగరాజ్ 'కూలీ' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. -
సామజవరగమన హీరోయిన్‌కు సూపర్ ఛాన్స్?
‘సామజవరగమన’ సినిమాలో మంచి నటన కనబరచి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందారు హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ . అయితే ఈ బ్యూటీకి తాజాగా ఓ సూపర్ చాన్స్ లభించిందట. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలోని ఓ కీలక పాత్రకు రెబ్బా మౌనికా జాన్ ను లోకేష్ కనగరాజ్ ఎంపిక చేశారని కోలీవుడ్ సమాచారం. రజనీకాంత్‌తో స్క్రీన్ స్పేస్ అంటే ఆమెకు కెరీర్ పరంగా ఓ సూపర్‌చాన్స్ కావొచ్చు. ప్రస్తుతం ‘కూలీ’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. రజనీకాంత్, శ్రుతీహాసన్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. సత్యరాజ్, మహేంద్రన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘కూలీ’ వచ్చే ఏడాది విడుదల కానుంది. -
కోలీవుడ్‌కు కూలి 1000 కోట్లు.. పక్కనా..?
-
Lokesh Kanagaraj: కూలీ ఆగలేదు
రజనీకాంత్ ‘కూలీ’ ఆగలేదు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా ఇటీవల ఓ సందర్భంలో ‘కూలీ’ చిత్రీకరణ జూన్ 10న ప్రారంభం కానున్నట్లు రజనీకాంత్ వెల్లడించారు. కానీ ఈ తేదీకి ‘కూలీ’ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ తర్వాత దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ‘ఎక్స్’ బయోలో ‘కూలీ’ సినిమా పేరు కనిపించలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనే పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ విషయంపై తాజాగా లోకేశ్ కనగరాజ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘కూలీ’ చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ జరుగుతోందని, జూలైలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని లుక్ టెస్ట్ సెషన్‌లోని ఫొటోను షేర్ చేశారు లోకేశ్. -
'లియో' పార్ట్ 2 కథ రెడీ అంటూ షాకింగ్ కామెంట్ చేసిన డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా 'లియో' గతేడాదిలో విడుదలైంది. సినిమాపై విమర్శలు వచ్చినా కూడా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించగా సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించారు. ఇప్పుడు లియో సీక్వెల్ కథ రెడీ అంటూ లోకేష్ కనగరాజ్ తెలిపాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్‌లో ఈ బిగ్ ప్రాజెక్ట్‌పై అధికారికంగా ప్రకటన ఏమైనా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రంలో విజయ్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్లో రానున్న ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత కార్తీక్ సుబ్బరాజుతో తన 69వ ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. రాజకీయాల కారణంగా ఇదే విజయ్‌కి చివరి సినిమా అవుతుందని కూడా నెట్టింట వైరల్ అయింది. దీనికి తెలుగు నిర్మాతలు తెరకెక్కించనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ బిగ్ ప్రాజెక్ట్ డీల్‌కు ఫుల్స్టాప్ పడిందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రాలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో లోకేష్ కనగరాజ్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ లియో-2 చిత్రం కథ రెడీ అని, విజయ్ ఓకే అంటే వెంటనే ప్రారంభమవుతుందని పేర్కొనడం చర్చినీయాంశంగా మారింది. ఈ ప్రకటనతో విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది.ప్రస్తుతం రజనీకాంత్‌తో లోకేష్ కనకరాజ్ కూలీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సింది స్క్రీన్ ప్లే ఆలస్యం కావడంతో జూలై నెలలో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
లోకేశ్ కనకరాజ్‌పై రజనీ ఆగ్రహం?
సినిమా రంగంలో కోపతాపాలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు సహజం. ఈ మధ్య నటుడు అజిత్ దర్శకుడు విఘ్నేశ్శివన్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారనే ప్రచారం జరిగింది. అందుకు కారణం చిత్ర కథను అనుకున్న టైంలో రెడీ చేయడంలో దర్శకుడు విఘ్నేశ్‌శివన్ విఫలం అయ్యారన్నదే. దీంతో ఆ చిత్రం నుంచి విఘ్నేశ్‌శివన్‌ను తొలగించారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ చిత్రమే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విడాముయర్చి. ఇదే పరిస్థితిని దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఎదుర్కొంటున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకుముందు ఈయన చేసిన చిత్రాలన్నీ(లియో చిత్రం మినహా) సంచలన విజయాలను సాధించాయన్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ నుంచి, టైటిల్ ప్రకటన వరకూ అనూహ్య క్రేజ్‌ను తెచ్చుకున్నాయి. కూలీ చిత్రాన్ని జూన్ రెండవ వారంలో ప్రారంభించనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ తన 170వ చిత్రం వేట్టైయాన్‌ను త్వరగా పూర్తిచేసినట్లు సమాచారం. అయితే కూలీ చిత్రం అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవడంతో దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌పై రజనీకాంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కూలీ చిత్ర కథనాన్ని మూడు నెలలుగా రాస్తున్నారట. ఇంకా పూర్తికాకపోవడంతో షూటింగ్ ఆలస్యమైందని సమాచారం. ఆయన స్క్రిప్ట్ పక్కాగా పూర్తి అయిన తరువాతనే సెట్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో కూలీ చిత్రం జూలైలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
వారం తర్వాత కూలీగా...
‘కూలీ’గా మారిపోవడానికి రెడీ అవుతున్నారు రజనీకాంత్. ఆయన హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో సత్యరాజ్, శోభన కీలక పాత్రల్లో నటించనున్నారని, కమల్‌హాసన్ ఓ అతిథి పాత్రలో కనిపిస్తారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. కాగా ‘కూలీ’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 10న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఆధ్యాత్మిక గురువు దగ్గర పేర్కొన్నారు రజనీకాంత్.తొలి షెడ్యూల్ చిత్రీకరణ చెన్నైలో ప్రారంభం కానుందని తెలిసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ‘కూలీ’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే రజనీకాంత్ హీరోగా నటించిన మరో చిత్రం ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అక్టోబరులో విడుదల చేయనున్నట్లుగా చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. కాగా ‘వేట్టయాన్’ను అక్టోబరు 10న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా రజనీకాంత్ పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక ప్రయాణం
ఒక సినిమా షూటింగ్ ఆరంభించే ముందు... లేదా సినిమా పూర్తయ్యాక ఆధ్యాత్మిక యాత్ర చేస్తుంటారు రజనీకాంత్. ఆయన ఎక్కువగా హిమాలయాలకు వెళ్లే విషయం తెలిసిందే. అక్కడి మహావతార్ బాబాజీ గుహలో రజనీ ధ్యానం చేస్తుంటారట. తాజాగా రజనీకాంత్ మరోసారి ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. దాదాపు పది రోజులు హిమాలయాల్లో గడిపి, తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారట. చెన్నై చేరుకున్న వెంటనే తన తాజా చిత్రం ‘కూలీ’ చిత్రీకరణలో పాల్గొంటారు రజనీకాంత్.లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. మరోవైపు రజనీకాంత్ నటించిన చిత్రం ‘వేట్టయాన్’. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘వేట్టయాన్’లో రజనీకాంత్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ ఏడాది అక్టోబరులో ఈ చిత్రం విడుదల కానుంది. -
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఏం చెప్పినా చేస్తా: యువ నటుడు
అర్జున్ దాస్.. ఈ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది అతడి గొంతు. బయపెట్టేలా ఉండే బేస్ వాయిస్ తనకు చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. 'ఖైదీ' మూవీలో విలన్‌గా చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. ఇప్పుడు హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అలా తన కొత్త మూవీ 'రసవాది' రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా)ఎక్కడో దుబాయ్‌లో పనిచేసే అర్జున్ దాస్.. చైన్నెకి వచ్చి డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ తీసిన 'ఖైదీ'తో యాక్టర్ అయ్యాడు. దీని తర్వాత 'మాస్టర్'లోనూ లోకేశ్ ఇతడికి ఛాన్స్ ఇచ్చాడు. అందుకే ఆయనంటే అర్జున్‌దాస్‌కు ప్రత్యేక అభిమానం. తాజాగా తన కొత్త మూవీ రిలీజ్ సందర్భంగా అర్జున్ దాస్ పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. విలన్‌గా చేసే మీరు ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. మళ్లీ విలన్‌గా నటించే అవకాశమొస్తే చేస్తారా? అన్న ప్రశ్నకు బదిలిస్తూ.. లోకేశ్ కనకరాజ్ విలన్‌గా చేయమని చెబితే కచ్చితంగా నటిస్తానని అన్నాడు.డైరెక్టర్ లోకేశ్ తనకు మంచి మిత్రుడని, ఆయన అవకాశమిస్తే రజనీకాంత్ 'కూలీ'లో నటించడానికి రెడీ అని అర్జున్ దాస్ అన్నాడు. మళ్లీ డబ్బింగ్ చెప్పే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటి అవకాశం లేదని, లోకేశ్ కనకరాజ్ తన సినిమాలో డబ్బింగ్ చెప్పమంటే మాత్రం ఎలాంటి పాత్రకై నా చెబుతానని క్లారిటీ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?) -
రజినీకాంత్ కూతురిగా ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్
సూపర్‌స్టార్ రజినీకాంత్ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలు శృతిహాసన్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. రజినీకాంత్ ప్రస్తుతం జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వేట్టైయాన్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా దీని తరువాత తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి 'కళుగు' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ నెల 22వ తేదీన చిత్ర టైటిల్‌ను, టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల దర్శకుడు లోకేష్ కనకరాజ్ చెప్పారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుందన్నారు. కాగా తాజాగా ఇందులో రజినీకాంత్ కూతురిగా శృతిహాసన్ నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. కోలీవుడ్‌లో సినీ దిగ్గజాలైన కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించి 25 ఏళ్లు అవుతోంది. అలాంటిది ఇప్పుడు కమల్ హాసన్ కూతురు రజినీకాంత్ తాజా చిత్రంలో ఆయనకు కూతురుగా నటించనున్నడం విశేషమే. మరో విషయం ఏమిటంటే శృతిహాసన్ తమిళంలో నటించి చాలా కాలం అవుతోంది. లాభం చిత్రం తరువాత ఈమె ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. కాగా సుమారు మూడేళ్ల తరువాత ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చిందన్న మాట. అయితే ఇటీవల ఈమె తన తండ్రి కమల్ హాసన్ రాసి, రూపొందించిన ఇనిమేల్ అనే పాట ఆల్బమ్‌లో దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. కాగా శృతిహాసన్, రజినీకాంత్ 171 చిత్రంలో నటించే విషయమై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.