దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం లియో (సింహం). నటి త్రిష, ప్రియాఆనంద్ హీరోయిన్‌లుగా నటించిన ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్‌మీనన్, మిష్కిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 7స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్‌ఎస్ లలిత్‌కుమార్ భారీ ఎత్తున నిర్మించారు.
(ఇదీ చదవండి: దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్)
అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. లియో చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐమాక్స్ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర వర్గాలు శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సాధారణంగా విజయ్ చిత్రం విడుదలవుతుందంటే అభిమానుల హంగామా మాములుగా ఉండదు. ఆలయాల్లో పూజలు, థియేటర్ల వద్ద కటౌట్లకు పాలాభిషేకాలు బాణసంచా మోత మోగుతుంటుంది.
అయితే విజయ్ ఆదేశాల మేరకు ఉత్తర చైన్నె అభిమానులు ఇప్పుడు ఎలాంటి హంగామాలు చేయడం లేదంటున్నారు. లేకపోతే చిత్ర విడుదలకు మరో ఆరు రోజులు ఉండగా శుక్రవారం నుంచే చైన్నె, మదురై, కోయంబత్తూర్ వంటి ప్రధాన నగరాల్లో చిత్రం అడ్వాన్‌న్స్ బుకింగ్ ప్రారంభమైనట్టు తెలిసింది. సాధారణంగా రెండు మూడు రోజులముందు అడ్వాన్‌న్స్ బుకింగ్ ప్రారంభమవుతుంది అలాంటిది ఆరు రోజుల ముందే బుకింగ్ మొదలు అన్నది అరుదైన విషయమే అవుతుంది.
లియోకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్
తమిళనాడు ప్రభుత్వం లియో సినిమా స్పెషల్ షోలపై ఆంక్షలు విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో విజయ్ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. తమిళనాడులో లియో చిత్రం ప్రదర్శనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అముత IAS అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లను ఆదేశించారు.లియో స్పెషల్ షోలకు ఎలాంటి అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా బెదిరింపులకు దిగి ప్రత్యేక షోలు వేయాలని థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగితే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అముత ఆదేశించారు. థియేటర్లలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధ్యయనం చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో విజయ్ అభిమానులు నిరాశకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment