దసరా బరిలో ఈసారి మూడు సినిమాలు ప్రధానంగా బరిలో ఉన్నాయి. తెలుగుతో పాటు, తమిళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'లియో' అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమా పూర్తి రన్ టైమ్ 2 గంటల 44 నిమిషాలు కాగా మొత్తం 13 సన్నివేశాల్లో సెన్సార్ కోత పెట్టింది. ముఖ్యంగా వాటిలో రక్తం, హింస కనిపించే వంటి సీన్స్ తొలగించారు. కానీ ఇవన్నీ కూడా ఒక నిమిషం లోపే ఉన్నాయని సమాచారం.
(ఇదీ చదవండి: దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగిలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్)
ఇదంతా ఒకపక్క అయితే ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. లియో సినిమాలో మొదటి 10 నిమిషాలు సినిమా ఎవరూ మిస్ అవ్వకండి అంటూ అలర్ట్ ఇచ్చారు. లియో విజయం కోసం తిరుమలకు విచ్చేసిన లోకేష్ కనగరాజ్ ఇప్పటికే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. లియో సినిమా ఆడియో ఆవిష్కరణ ఈసారి జరగకపోగా, నటుడు విజయ్ ఇంటర్వ్యూ కూడా చివరి వరకు విడుదల కాకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. నటుడు అజిత్ లాగా ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా సినిమా ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి అనే నిర్ణయానికి విజయ్ వచ్చినట్లు సమాచారం.
మొదటి 10 నిమిషాల్లో హైనా సీన్?
లియో సినిమాలో మొదటి 10 నిమిషాలు ఎవరూ మిస్ కాకూడదని లోకేష్ కనగరాజ్ చెబుతుండగా, గత అక్టోబర్ నుంచి ఈ అక్టోబర్ వరకు ఆ 10 నిమిషాల సీన్ కోసం సుమారు వెయ్యి మందికి పైగా పనిచేశారని లోకేశ్ తెలిపాడు. హైనాతో విజయ్ ఫైట్ చేసిన సీన్ అందరినీ మెప్పిస్తుందని ఆయన చెప్పాడు. సినిమాలో తన కుటుంబాన్ని రక్షించడానికి విజయ్ ఆ ఫైట్ చేసినట్లు సమాచారం. ఈ ఒక్క సీన్ కోసం సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ 10 నిమిషాల సీన్ అభిమానులను మరొసారి థియేటర్‌కి రప్పించేలా మ్యాజిక్ చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు.
(తమిళ్‌లో నా రెడీ అంటూ.. వచ్చి మంచి హిట్ అయ్యిన సాంగ్ తాజాగా తెలుగులో విడుదల అయింది. ఇక్కడ చూడండి)
Comments
Please login to add a commentAdd a comment