Leo Movie
-
'లియో'కు ఏడాది.. మేకింగ్ వీడియో చూశారా..?
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియో చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ చిత్రం విడుదలై సరిగ్గా ఏడాది పూర్తి అవుతుంది. దీంతో అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఒక కానుకను అందించింది. లోకేశ్- విజయ్ కాంబోలో మాస్టర్ తర్వాత ఈ చిత్రం గతేడాది అక్టోబర్ 19న విడుదలైంది. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లియో రూ. 620 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతటి విజయం సాధించిన సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తి కావడంతో 'లియో క్రానికల్స్' పేరుతో సుమారు 8 నిమిషాల నిడివి ఉన్న వీడియోను మేకర్స్ పంచుకున్నారు. సినిమాలో ట్రెండ్ అయిన సీన్స్‌ను ఎలా తెరకెక్కించారో చూపించారు. నెట్టింట వైరల్‌గా మారిన మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి. -
ఎల్‌సీయూపై లోకేశ్ కనగరాజ్ ప్రకటన
కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానులు ఉన్నారు. త్వరలో రజనీకాంత్ 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్, లియో తదితర సినిమాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. సరికొత్త కథలకు గత చిత్రాల్లోని పాత్రలను ముడిపెడుతూ 'సినిమాటిక్ యూనివర్స్' (LCU) అనే కాన్సెప్ట్‌తో విజయాలను అందుకున్నారు.కూలీ సినిమా గురించి లోకేశ్ కనగరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రం సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సీయూ)లో భాగం కాదన్నారు. కానీ, కూలీ సినిమా తర్వాత అదిరిపోయే ప్రాజెక్ట్ రానుందని ఆయన ప్రకటించారు. సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగమైన స్టార్ హీరోలందరితో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని రివీల్ చేశారు.ప్రస్తుతం కూలీ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చామని లోకేశ్ చెప్పారు. రజనీకాంత్‌కు ఇటీవల సర్జరీ జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి తలైవా సెట్స్‌లో ఎంట్రీ ఇస్తారని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నీ కూడా కేవలం ఆరు నెలల్లోనే పూర్తిచేశానని, ఇప్పుడు కూలీ చిత్రాన్ని ఈ సమయంలోపే ముగిస్తానని ఆయన పేర్కొన్నారు.సినిమాటిక్ యూనివర్స్ (LCU) ప్లాన్ ఇదేలోకేశ్ కనగరాజ్ రాబోయే సినిమాల గురించి కూడా మాట్లాడారు. రాబోయే ఐదేళ్లపాటు తన సినిమాల్లో బ్లడ్,గన్స్,డ్రగ్స్ ఉంటాయని చెప్పారు. ఆ తర్వాతే మరో భిన్నమైన సినిమాలు తీస్తానన్నారు. ఈ క్రమంలోనే ఖైదీ, విక్రమ్, లియోతో సినిమాటిక్ యూనివర్స్ కథ ప్రారంభమైందన్నారు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనే కీలకమైన పాత్ర ఉందని రివీల్ చేశారు. దానిని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రజనీతో కూలీ సినిమా పూర్తి చేసిన వెంటనే LCUలో భాగమైన హీరోలందరితో ఈ భారీ ప్రాజెక్ట్ ప్రారంభమౌతుంది. అంటే ఖైదీ, విక్రమ్, లియో ఈ మూడు సినిమాలను లింక్ చేస్తూ ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఉండనుంది. అయితే, 'లియో2' కోసం విజయ్ ఒప్పుకుంటే 'పార్తిబన్' పేరుతో తెరకెక్కిస్తానని లోకేశ్ కనగరాజ్ చెప్పారు. -
'లియో' పార్ట్ 2 కథ రెడీ అంటూ షాకింగ్ కామెంట్ చేసిన డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా 'లియో' గతేడాదిలో విడుదలైంది. సినిమాపై విమర్శలు వచ్చినా కూడా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించగా సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించారు. ఇప్పుడు లియో సీక్వెల్ కథ రెడీ అంటూ లోకేష్ కనగరాజ్ తెలిపాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్‌లో ఈ బిగ్ ప్రాజెక్ట్‌పై అధికారికంగా ప్రకటన ఏమైనా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రంలో విజయ్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్లో రానున్న ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత కార్తీక్ సుబ్బరాజుతో తన 69వ ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. రాజకీయాల కారణంగా ఇదే విజయ్‌కి చివరి సినిమా అవుతుందని కూడా నెట్టింట వైరల్ అయింది. దీనికి తెలుగు నిర్మాతలు తెరకెక్కించనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ బిగ్ ప్రాజెక్ట్ డీల్‌కు ఫుల్స్టాప్ పడిందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రాలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో లోకేష్ కనగరాజ్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ లియో-2 చిత్రం కథ రెడీ అని, విజయ్ ఓకే అంటే వెంటనే ప్రారంభమవుతుందని పేర్కొనడం చర్చినీయాంశంగా మారింది. ఈ ప్రకటనతో విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది.ప్రస్తుతం రజనీకాంత్‌తో లోకేష్ కనకరాజ్ కూలీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సింది స్క్రీన్ ప్లే ఆలస్యం కావడంతో జూలై నెలలో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
రొమాన్స్‌తో రెచ్చిపోయిన స్టార్ డైరెక్టర్.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా!
లియో మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. తాజాగా నటుడి అవతారమెత్తాడు. తన తొలి వీడియోలోనే రొమాన్స్‌తో రెచ్చిపోయారు. హీరోయిన్ శృతి హాసన్‌తో కనగరాజ్ చేసిన రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. వీరిద్దరు ఇనిమేల్ పేరుతో ఓ మ్యూజిక్ వీడియో తీసుకురానుండగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో ఈ జంట రొమాన్స్‌లో మునిగితేలారు. తాజాగా రిలీజైన ఇనిమేల్ ప్రోమో చూస్తే లోకేశ్, శృతి రెచ్చిపోయి నటించినట్లు అర్థమవుతోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఈ వీడియోను రూపొందిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మ్యూజిక్ పెద్దగా లేకపోయినా.. వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమో చూసిన ఫ్యాన్స్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి వీడియోలోనే లోకేశ్ రెచ్చిపోయాడంటూ పోస్టులు పెడుతున్నారు. కేవలం 18 సెకన్లు మాత్రమే ఉన్న ప్రోమో తెగ వైరలవుతోంది. కాగా.. ఇనిమేల్ ఫుల్ సాంగ్ మార్చి 25న రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. లోకేశ్ కనగరాజ్ తన తదుపరి చిత్రాన్ని రజినీకాంత్‌తో తెరకెక్కించనున్నారు. #Inimel the game begins from 25th March. Mark the Moment! Streaming exclusively on https://t.co/UXpv3RSFt6#Ulaganayagan #KamalHaasan #InimelIdhuvey #Inimelat25th@ikamalhaasan @Dir_Lokesh @shrutihaasan #Mahendran @RKFI @turmericmediaTM @IamDwarkesh @bhuvangowda84 @philoedit… pic.twitter.com/LCAju1D2eq — Raaj Kamal Films International (@RKFI) March 21, 2024 -
విజయ్‌పై త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తమిళసినిమా: నాలుగు పదుల వయసులోనూ ప్రేక్షకులను అలరిస్తుస్తూ కథానాయిక రాణిస్తున్నారు నటి త్రిష. అంతే కాకుండా ఇప్పుటికీ పలు భాషల్లో అగ్ర కథా నాయకుల సరసన నటిస్తూ బిజీగా ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈమె. అన్నీ కుదిరితే 10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుని పిల్లలు, భర్త అంటూ సంసార జీవితంలో మునిగిపోయేవారు. ఇక నిర్మాత, వ్యాపారవేత్త అయిన అరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం, పెళ్లి పీటల వరకూ వెళ్లి ఆగిపోయింది. ఆ తరువాత పెళ్లి మాట ఎత్తని త్రిష నటనపైనే దృష్టి సారించారు. అలా మధ్యలో నటిగా వెనుకబడినా, చిన్న గ్యాప్ తరువాత గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఫుల్‌ఫామ్‌లోకి వచ్చారు. అందుకు కారణం దర్శకుడు మణిరత్నం అని చెప్పకతప్పదు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో ఆయన ఓ అవకాశం ఇచ్చి నటిగా త్రిషకు పునర్జన్మనే ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఈ చైన్నె చిన్నది కూడా సద్వినియోగం చేసుకున్నారు. యువరాణి కుందవైగా రాజఠీవీని ప్రదర్శించి ఆ పాత్రకు వన్నె తెచ్చారు. ఆ తరువాత విజయ్‌కు జంటగా లియో చిత్రంలో నటించి తన పూర్వ వైభవాన్ని చాటుకున్నారు. ఈమె ఇంతకు ముందు విజయ్ సరనన గిల్లీ, ఆదీ, తిరుపాచ్చి, కురువి చిత్రాల్లో నటించారు. మళ్లీ 14 ఏళ్ల తరువాత లియో చిత్రం ఈ జంట కలిసి నటించారు. దీంతో వీరిద్దరి గురించి వదంతులు దొర్లుతున్నాయి. అయితే వాటిలో నిజమెంత అన్నది తెలియదు కానీ, ఇటీవల ఒక భేటీలో విజయ్ గురించి నటి త్రిష మాట్లాడుతూ విజయ్ తానూ పలు చిత్రాల్లో కలిసి నటించినట్లు చెప్పారు. అయితే గిల్లీ చిత్రానికి ముందు వరకూ అందరూ చెప్పుకుంటున్నట్లు కాదన్నారు. విజయ్ చాలా నెమ్మదస్తుడని పేర్కొన్నారు. గిల్లీ చిత్రం తరువాత తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యామని చెప్పారు. కాగా ఈ చైన్నె బ్యూటీ ప్రస్తుతం అజిత్‌కు జంటగా విడాముయర్చి, కమలహాసన్ సరసన థగ్ లైఫ్ చిత్రాలతో 40 ఏళ్ల వయసులోనూ బిజీబీజీగా ఉన్నారు. -
రాజకీయాల్లో విజయ్.. లియో సీక్వెల్‌పై లోకేశ్ వ్యాఖ్యలు వైరల్
లియో మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం గతేడాది దసరాకు విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే లియో హిట్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్‌తో లోకేశ్ ఒక సినిమా తీస్తున్నారు. అయితే తాజాగా లోకేశ్ కనగరాజ్ లియో పార్ట్ -2 గురించి పలు ఆసక్తి విషయాలు పంచుకున్నాడు. లియో సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ఆయన తెలిపారు. కానీ ప్రస్తుతం హీరో విజయ్ ఆశయాలు వేరుగా ఉన్నాయి. ఈ విషయం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాలి కూడా.. విజయ్ ఒప్పుకుంటే లియో 2 తప్పకుండా వస్తుంది. అందుకు సమయం కూడా అనుకూలిస్తుందని ఆశిస్తున్నాను. విజయ్ ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. లియో సినిమా విడుదల సమయం నుంచి సెకండాఫ్ పట్ల పలు వమర్శలు వచ్చాయి. అవన్నీ నేను కూడా విన్నాను. రాబోయే సినిమాల్లో ఆ తప్పులు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటాను.' లోకేష్ కనగరాజ్ అన్నారు. విజయ్ ఇప్పటికే ఒప్పుకున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' ప్రాజెక్ట్‌లో ఉన్నాడు. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించడంతో ఇదే చివరి చిత్రం అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో లియో సీక్వెల్ ఉంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబోలో తలైవర్ 171 సిద్ధం అవుతుంది. -
స్టార్ డైరెక్టర్‌తో శృతిహాసన్.. అసలు సెట్ అవుతుందా?
కోలీవుడ్ భామ శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ సెట్ అయిందా? ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ ఇదే. మల్టీ టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్. నటిగా మాత్రమే కాదు.. సింగర్, సంగీత దర్శకురాలు అనే విషయం తెలిసిందే. బహుభాషా కథానాయకిగా రాణిస్తున్న భామ తెలుగులో వరుసగా విజయాలను అందుకుంటున్నారు. తమిళంలో మాత్రం మంచి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. అదేవిధంగా లియో డైరక్టర్ లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే మా నగరం చిత్రంతో దర్శకుడుగా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన 171వ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. ఆ తర్వాత ఖైదీ–2, విక్రమ్–2 చిత్రాలు చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి ఉన్న పోస్టర్ సామాజిక మాద్యమాల్లో వైరలవుతోంది. వీరి కాంబినేషన్లో ఒక చిత్రం రాబోతుందా అన్న చర్చ కోలీవుడ్‌లో మొదలైంది. అయితే ఆ పోస్టర్లో ఇనిమే మాయెమే తీర్వాగుమ్ ఇదువే ఉరువు, ఇదువే సూల్ నిల్ ఇదువే మాయై ( ఇకపై మాయనే పరిష్కారం ఇదే బంధం ఇదే పరిస్థితి ఇదే మాయ) అని పేర్కొన్నారు. దీంతో ఇది చిత్రంగా రూపొందుతుందా? లేక కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై శ్రుతిహాసన్‌తో దర్శకుడు లోకేష్ మ్యూజికల్ ఆల్బమ్‌ను రూపొందించబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని గురించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
లియో ఎఫెక్ట్.. లోకేష్ కనగరాజ్‌పై విజయ్ తండ్రి విమర్శలు
కోలీవుడ్‌లో సీనియర్ దర్శకుడు, విజయ్ తండ్రి అయిన ఎస్ఏ చంద్రశేఖర్ ఒక డైరెక్టర్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యాలు చేశారు. విమర్శలను అంగీకరించే ధైర్యం ఈ కాలంలో దర్శకులకు లేదని ఎస్ఏ చంద్రశేఖర్ అన్నారు. తన కుమారుడు హీరో విజయ్‌కు సంబంధించిన కథ వస్తే ఒక తండ్రిలా కాకుండా అభిమానిగా, ఒక దర్శకుడిగా వింటానని ఆయన చెప్పాడు. ప్రస్తుత రోజుల్లో స్క్రీన్‌ప్లేకి ఎవరూ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆయన చెప్పాడు. స్టార్ హీరో దొరికితే చాలు. కథ లేకపోయినా ఫర్వాలేదనుకునే దర్శకులు ఇప్పటిరోజుల్లో ఉన్నారని చెప్పారు. దర్శకుడి ప్రతిభలో లోపాలు ఉన్నా.. హీరో ఇమేజ్‌తో సినిమా హిట్ అయితే అది తన గొప్పతనమే అనుకుంటున్నారు. కథతో పాటు స్క్రీన్‌ప్లే ఉంటే ఆ సినిమా మరింత హిట్ సాధిస్తుందని తన అభిప్రాయం అంటూ ఎస్ఏ చంద్రశేఖర్ అన్నారు. ఒక సినిమా విషయంలో ఇటీవల ఓ దర్శకుడికి ఫోన్ చేసి అభినందించానని ఆయన ఇలా చెప్పారు.' సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు ఆ సినిమా చూశాను. వెంటనే ఆ డైరెక్టర్‌కు కాల్ చేశాను. ఫస్ట్ హాఫ్ బాగుందని చెబుతున్నంత సేపు బాగానే నా మాటలు విన్నాడు. కానీ సెకండాఫ్‌లో కొంత భాగం బాగాలేదని చెప్పాను. కథలో భాగంగా కన్న కుమారుడినే తండ్రి చంపాలనుకోవడం, మూఢనమ్మకాలు వంటి సన్నివేశాలు అంతగా కనెక్ట్ కావడం లేదని సలహా ఇచ్చాను. దీంతో వెంటనే అతను సార్.. భోజనం చేస్తున్నాను.. కొంత సమయం తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు. కనీసం తర్వాత కూడా కాల్ చేయలేదు. సినిమా విడుదలయ్యాక నేను ఏదైతే అభిప్రాయపడ్డానో ప్రేక్షకల నుంచి కూడా అలాంటి రెస్పాన్సే వచ్చింది. నేను చెప్పినప్పుడే కొంత సమయం పాటు ఆలోచించి మార్పులు చేసి ఉంటే ఆ సినిమా ఇంకా మరోస్థాయికి చేరుకునేది. విమర్శలను కూడా తీసుకునేంత పరిణీతి అతనిలో లేవు.' అని ఆయన చెప్పారు. విజయ్ తండ్రి చేసిన వ్యాఖ్యలు లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించే అని కోలీవుడ్‌లో వైరల్ అవుతుంది. ఆయన చెప్పిన అంశాలన్నీ ఆ చిత్రానికి కనెక్ట్ అవుతుండటంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై తమిళనాట పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. లియోలో విజయ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అతని ఇమేజ్‌తోనే సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. సుమారు రూ. 650 కోట్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది, కానీ కథలో కొన్ని లోపాలు ఉన్నాయని మొదటిరోజు నుంచే ప్రచారం జరిగింది. దీంతో కొంతమేరకు కలెక్షన్స్ తగ్గాయని చెప్పవచ్చు. -
విజయ్ పొలిటికల్ ఎంట్రీకి బ్రేకులు.. అడ్డుపడుతుంది ఆమేనా..?
హీరో విజయ్ సౌత్ ఇండియాలో పరిచయం అక్కరలేని పేరు. రీజనల్ సినిమాతోనే కలెక్షన్స్ సునామీ సృష్టిస్తాడు. పాన్ ఇండియా రేంజ్ హీరోలకు ధీటుగా తన సినిమా కలెక్షన్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన లియో సినిమా కూడా సుమారుగా రూ. 630 కోట్లు రాబట్టింది. ఒక రీజనల్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం అంటే సులభం కాదు. కోలీవుడ్‌లో ఆయనకు భారీగా ఫ్యాన్స్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఆపదలో ఉన్న తన అభిమానులకు ఎలాంటి సాయం చేసేందుకు అయినా విజయ్ ముందుంటాడు. రీసెంట్గా తమిళనాడులో తుపాన్ వల్ల రోడ్డున పడిన పలు కుటుంబాలను ఆయన ఆదుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే విజయ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా కోలీవుడ్‌లో వార్తలు వస్తూనే ఉన్నాయి. రాబోయే ఎలక్షన్స్‌ల్లో తమళనాట తనొక రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికలబరిలోకి దిగాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తు ఉన్నాడు. దీంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ దాదాపు ఖాయం అని టాక్ ఉంది. కానీ విజయ్ రాజకీయ ఎంట్రీని ఆయన సతీమణి సంగీత అడ్డుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అందుకే రాజకీయ పార్టీని ప్రకటించడంలో విజయ్ ఆలస్యం చేస్తున్నాడని టాక్ ఉంది. (ఇదీ చదవండి: మారుమూల గ్రామంలో లెజండరీ కమెడియన్ కుమారుడు.. పెళ్లి ఫోటో వైరల్) రాజకీయాల్లోకి విజయ్ రావాలని కోరుకుంటున్నా.. దానిని ఆయన సతీమణి సంగీతతో పాటు వారి కుమారుడు జాసన్ సంఝా కూడా వ్యతిరేకిస్తున్నారట. విజయ్ రాజకీయ నిర్ణయాన్ని ఆయన భార్య, కుమారుడు వ్యతిరేకించడం వల్లే వారి మధ్య మనస్పర్థలకు ప్రధాన కారణమని తమిళ మీడియా పేర్కొంటుంది. రాజకీయాల్లోకి వస్తే వ్యక్తిగత జీవితం దెబ్బతింటుందని ఆమె అభిప్రాయపడుతుందట. కానీ విజయ్ మాత్రం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందేనని పట్టబట్టి ఉన్నారట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. సంగీత ఒక డాక్టర్.. విజయ్‌తో వివాహం అయిన తర్వాత గృహిణిగా కొనసాగుతుంది. తన కుమార్తెతో కలిసి ఆమె లండన్‌లో ఉంటున్నారు. సుమారు గత రెండేళ్లుగా విజయ్, సంగీత కలిసి ఏ ఈవెంట్లో కనిపించలేదు. గతంలో విజయ్ కూడా తన సినిమా పూర్తి అయిన తర్వాత లండన్ వెళ్లేవారు.. ఈ మధ్య కాలంలో ఆయన కూడా అక్కడకు వెళ్లలేదు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ కారణం వల్లే వారిద్దరి మధ్య పలు సమస్యలు వచ్చాయని.. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయని తెలుస్తోంది. విజయ్- సంగీత మధ్య ఎలాంటి గొడవలు లేవని విజయ్ సన్నిహితులు పలుమార్లు తెలిపారు. కొద్దిరోజుల క్రితం లియో నటి జనని కూడా విజయ్ విడాకుల గురించి రియాక్ట్ అయింది. విడాకుల వార్త ఉట్టి పుకారే అని ఆమె తెలిపింది. -
లియో డైరెక్టర్‌కు షాక్.. సినిమాను నిషేధించాలంటూ!
లియో మూవీతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. లియో తర్వాత లోకేశ్ తదుపరి చిత్రాన్ని సూపర్‌స్టార్ తలైవాతో చేయనున్నారు. ప్రస్తుతం ఆ మూవీ స్క్రిప్ట్ తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. (ఇది చదవండి: OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!) ఇదిలా ఉండగా.. తాజాగా లోకేశ్ కనగరాజ్‌పై ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. ఆయనకు మానసిక పరీక్షలు చేయాలని కోరుతూ మధురై హైకోర్టు బెంచ్‌లో మదురైకి చెందిన రాజు మురుగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రంలో హింసాత్మక కంటెంట్ ఉన్నందున లియోని నిషేధించాలని.. అంతే కాకుండా కనగరాజ్‌కు మానసికంగా పరీక్షలు నిర్వహించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. లియో చిత్రంలో హింసను ప్రేరేపించేలా సన్నివేశాలు ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఆయుధాల వినియోగం, మతపరమైన చిహ్నాలు, మాదకద్రవ్యాల వినియోగం, మహిళలు, పిల్లలపై హింస లాంటి సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్ ప్రస్తావించారు. లియో చిత్రంపై పూర్తిగా నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ కేసును కనగరాజ్ న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో వాయిదా వేశారు. (ఇది చదవండి: ఆ నటుడు పిచ్చోడిలా ప్రవర్తించాడు.. అందరూ పారిపోయారు!) -
జైలర్, బాహుబలి రికార్డ్స్‌ను కొట్టేసిన సలార్ కలెక్షన్స్
ప్రపంచవ్యాప్తంగా సలార్ అన్నీ థియేటర్లలో సందడి చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ మువీ బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్ రాబడుతుంది. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.650 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సౌత్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా మొదటి వారాంతం తర్వాత కలెక్షన్స్ పరంగా కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా మళ్లీ కాస్త పుంజుకుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 'లియో' సినిమా మొత్తం కలెక్షన్లను సలార్ అధిగమించింది. ప్రభాస్ 'బాహుబలి: ది బిగినింగ్' రికార్డును బద్దలు కొట్టేందుకు కూడా సలార్ సిద్ధమైంది. అలాగే తలైవా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా రికార్డు కూడా మరో రెండు రోజుల్లో బద్దలయ్యే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం, సలార్ 11వ రోజు (సోమవారం) రూ.15.5 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టోటల్ కలెక్షన్ రూ.400 కోట్లు రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 650 కోట్ల రూపాయలను రాబట్టింది. బాహుబలి పార్ట్ వన్ సినిమా టోటల్ కలెక్షన్ 650 కోట్లు. ప్రభాస్ తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే సూపర్ స్టార్ విజయ్ 'లియో' చిత్రాన్ని 'సాలార్' అధిగమించింది. లియో ప్రపంచవ్యాప్తంగా 605 కోట్ల రూపాయలు సంపాదించింది. అలాగే రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్’ మొత్తం కలెక్షన్స్ దాదాపు రూ. 655 కోట్ల రూపాయలు. మరో రెండు రోజుల్లో జైలర్, బాహుబలి రికార్డ్స్‌ను సలార్ బీట్ చేయడం దాదాపు ఖాయమని చెప్పవచ్చు. ఖాన్సార్ అనే కల్పిత ప్రపంచంలో జరిగే స్నేహితుల కథ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఈ చిత్రానికి డంకీ పోటీ లేకపోతే బాలీవుడ్లో ఇంకాస్త మెరుగ్గా ఆడేది కానీ కుదరలేదు. అంతేకాకుండా కార్పోరేట్ బుకింగ్స్ పేరుతో కూడా సలార్ కలెక్షన్స్ కొంతమేరకు దెబ్బతిన్నాయి. ఏదేమైనా సలార్ పార్ట్-2 మీద భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు. -
లియో డైరెక్టర్ సంచలన నిర్ణయం.. ఎందుకంటే?
లియో మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే లియో హిట్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్‌తో జత కట్టనున్నారు. అయితే తాజాగా లోకేశ్ కనగరాజ్ చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. ఇటీవల తన జీ స్క్వాడ్ బ్యానర్లో తెరకెక్కించిన మొదటి చిత్రం ఫైట్ క్లబ్‌ను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు. తన రాబోయే ప్రాజెక్ట్ కోసం లోకేశ్ కనగరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తదుపరి సినిమా కోసం సోషల్ మీడియాతో పాటు మొబైల్‌కు కూడా విరామం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్లో ఓ నోట్ రాసుకొచ్చారు. ప్రాజెక్ట్‌పై పూర్తిస్థాయిలో పని చేసేందుకు ఈ నిర్ణయమని పేర్కొన్నారు. దయచేసి ఈ సమయంలో ఎవరికీ అందుబాటులో ఉండనని చెప్పుకొచ్చారు. నా కెరీర్ ప్రారంభం నుంచి అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం లోకేశ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 🤗❤️ pic.twitter.com/0EL6PAlbdQ — Lokesh Kanagaraj (@Dir_Lokesh) December 16, 2023 -
Trisha: 20 ఏళ్ల కెరీర్.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గానే..
వెండితెర మీద తిరుగులేని నటీనటులు కూడా వెబ్‌తెర మీద ఫోకస్ పెడుతున్నారు. ఆ జాబితాలోకి ఇప్పుడు త్రిష కూడా చేరింది. యాక్టింగ్ కెరీర్ ముఖ్యంగా నటీమణుల విషయంలో.. వయసు మీద కాదు ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుందని గ్లామర్ క్వీన్‌గానూ పేరుతెచ్చుకున్న ఆమెను చూస్తే తెలుస్తుంది. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా ఆమె గ్రాఫ్ అయితే పడిపోలేదు. తన అందం, అభినయంతో ఇటు సిల్వర్ స్క్రీన్‌నూ అటు వెబ్ స్క్రీన్‌నూ మెరిపిస్తోంది! ► త్రిష సొంతూరు చెన్నై. బీబీఏ పూర్తి చేసింది. క్రిమినల్ సైకాలజీ చదవాలనుకుంది. పదహారేళ్ల వయసులో ‘మిస్ చెన్నై’ టైటిల్ గెలిచింది. ‘మిస్ ఇండియా’ పోటీల్లోనూ పాల్గొంది. మరెన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. ► ఇరవై ఏళ్ల క్రితం ‘జోడీ’లో నటి సిమ్రన్‌కు స్నేహితురాలిగా నటించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ఆమే ఊహించి ఉండదు.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్నవుతానని! ► ‘మౌనం పేసియదే’ తమిళ చిత్రంతో హీరోయిన్గా మారింది. ‘సామి’, ‘గిల్లి’ చిత్రాలు త్రిషను స్టార్ హీరోయిన్గా నిలబెడితే, తెలుగులో చేసిన ‘వర్షం’, ‘నీ మనసు నాకు తెలుసు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలు ఆమె క్రేజ్‌ను పెంచాయి. ► అందరిలాగే త్రిషకూ కొంతకాలం కష్టంగానే సాగింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఆమెకు అచ్చి రాలేదు. కానీ మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్‌లో త్రిషకు దొరికిన గోల్డెన్ చాన్స్‌గా చెప్పొచ్చు. అందులో యువరాణి కుందవైగా మెప్పించి తన ఫామ్‌ను నిలబెట్టుకుంది. ►ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది. ఆమె తాజా చిత్రం ‘లియో’ నెట్‌ఫ్లిక్స్‌లో, ‘ద రోడ్’ ఆహాలో స్ట్రీమ్ అవుతున్నాయి. విహార యాత్రలు చేయడంలో ముందుంటా. న్యూయార్క్ బాగా నచ్చుతుంది. ఇప్పటికే పలు దేశాలు తిరిగొచ్చాను. ప్రపంచం మొత్తం చుట్టిరావాలన్నదే నా కోరిక. – త్రిష -
రెండు దశాబ్దాలు దాటినా తగ్గేదెలా అంటున్న త్రిష
కథానాయికగా రెండు దశాబ్దాలకు పైగా రాణించడం అంత సులభం కాదు. ఈ విషయంలో నటి త్రిష అచీవ్ చేశారనే చెప్పాలి. ప్రశంసలు, విమర్శలు, వ్యతిరేకత, ప్రేమ విఫలం ఇలా అన్నిటిని ఎదురొడ్డిన ఈ చైన్నె చిన్నది 21 ఏళ్లుగా అగ్ర కథానాయికగా రాణిస్తోంది. మొదట్లో జోడి వంటి చిత్రాల్లో సహాయక నటిగా చేశారు. 2002లో అమీర్ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా నటించిన మౌనం పేసియదే చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అలా విక్రమ్ సరసన సామి, విజయ్‌కు జంటగా గిల్లి సూర్యతో ఆరు వంటి చిత్రాల విజయాలు త్రిషను స్టార్ హీరోయిన్ను చేశాయి. ఆ తర్వాత తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ అవకాశాలు ఈ బ్యూటీని వెతుక్కుంటూ వచ్చాయి. ముఖ్యంగా తమిళం తర్వాత తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు ఈమె ఖాతాలో చేరాయి. మధ్యలో కొన్ని లేడి ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించిన అవి త్రిషను నిరాశపరిచాయనే చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో త్రిష కెరియర్ ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఒక్కసారిగా ఆమెకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. దీంతో మళ్లీ విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు తలుపు తట్టాయి. అలా విజయ్‌కు జంటగా నటించిన లియో చిత్రం కమర్షియల్‌గా హిట్ అయింది. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న థగ్స్ లైఫ్ చిత్రంలోని త్రషనే కథానాయికిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా నటిగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్నా అభినయంలో తన అభిమానులను అలరించడంలో త్రిష తగ్గేదెలా అంటున్నారు. అందుకే ఈమె నటిగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోలు విడుదల చేశారు. అందుకు నటి త్రిష వారికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. -
విజయ్‌తో ఛాన్స్ కొట్టేసిన తెలుగు సినిమా హీరోయిన్
కోలీవుడ్‌లో దళపతి విజయ్ సరసన నటించే అవకాశం రావడం ఏ హీరోయిన్ కైనా లక్కీ చాన్సే అవుతుంది. ఆయనతో ఒక చిత్రంలో నటిస్తే చాలు పాపులర్ అయిపోతారు. అలాంటి లక్కీ అవకాశం ఓ యువ నటికి వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతుంది. విజయ్ కథానాయకుడిగా నటించిన లియో చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా కుమ్మేసింది అనే చెప్పాలి. కాగా ప్రస్తుతం ఈయన తన 68వ చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ నిర్మిస్తోంది. నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్ జీ, నటి స్నేహ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో నటి మీనాక్షి చౌదరి కథానాయకిగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ముందుగా చెన్నైలో కొంత భాగాన్ని చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర ఆ తర్వాత థాయ్ ల్యాండ్ లో కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా ఇందులో మరో ముఖ్య పాత్రలో నటి మాళవిక శర్మ నటించబోతున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. ఈమె ఇంతకుముందు తెలుగులో రామ్ సరసన రెడ్, రవితేజతో నేల టిక్కెట్టు చిత్రాలలో నటించారు. అదేవిధంగా సుందర్.సి దర్శకత్వంలో కాఫీ విత్ ఖాదల్ చిత్రంలో నటించారు. కాగా ఈమె పేరుతో సామాజిక మాధ్యమాల్లో విజయ్ 68వ చిత్రంలో నటిస్తున్నట్లు పోస్ట్ చేశారు. దీంతో మాళవిక శర్మ విజయ్ సరసన నటించబోతున్నట్లు ప్రచారం హల్ చల్ చేస్తోంది. ఇదే దీనికి సంబంధించి చిత్ర వర్గాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా విజయ్ 68వ చిత్రం సన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తరెకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అది వాస్తవం కాదని ఈ చిత్రం పక్కా కమర్షియల్ అంశాలతో మాస్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలిసింది. -
విజయ్ 68వ చిత్రం అప్డేట్
కోలీవుడ్‌లో అభిమానులు అందరూ విజయ్ను దళపతిగా పిలుచుకుంటారు. ఆ పేరుకు తగినట్లు ఆయన నుంచి బ్లాక్‌బస్టర్ చిత్రం వచ్చి చాలా కాలమైంది. మాస్టర్ చిత్రం తరువాత ఈయన నటించిన 'బీస్ట్' చిత్రం అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత నటించిన 'వారసుడు' మిశ్రమ స్పందననే తెచ్చుకుంది. ఇక తాజాగా విజయ్ నటించిన 'లియో' చిత్రం ఆయనకున్న స్టామినాతో వసూళ్ల వర్షం కురిపించినా, మంచి రిజల్ట్‌ను మాత్రం పొందలేకపోయింది. ఈయన తాజాగా నటిస్తున్న తన 68వ చిత్రం పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు బిగిల్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని నిర్మించిన ఏజీఎస్ సంస్థ రూపొందిస్తోంది. మీనాక్షి చౌదరి నాయకిగా నటిస్తున్న ఇందులో నటి స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్‌జీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చైన్నెలో ప్రారంభమై తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని, ఆ తరువాత థాయ్‌లాండ్‌లో ఫైట్ సీక్వెన్స్, కొన్ని కీలక సన్నివేశాలను జరుపుకుని ప్రస్తుతం మళ్లీ చైన్నెలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇలా బ్రేక్ లేకుండా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.త్వరలోనే చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా తెరపైకి రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం యువన్ శంకర్ రాజా కొన్ని ట్యూన్స్ సిద్ధం చేస్తున్నట్లు, అవి ఊరా మాస్‌గా వచ్చాయని సమాచారం. మరో విషయం ఏమిటంటే సీనియర్ దర్శకుడు, సంగీత దర్శకుడు, గీత రచయిత గంగై అమరన్ ఈ చిత్రం కోసం ఒక పాట రాసినట్లు తెలిసింది. -
ఆ రంగంలోకి లియో డైరెక్టర్.. అభిమానుల్లో ఆసక్తి!
ఇటీవలే లియో మూవీ సూపర్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. కోలీవుడ్‌లో ఇప్పుడు ఆయన పేరే సక్సెస్‌కు కేరాఫ్‌గా మారింది. మానగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన లోకేశ్ కనగరాజ్.. తొలి చిత్రమే పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తరువాత కార్తీ కథానాయకుడిగా ఖైదీ చిత్రాన్ని తెరకెక్కించారు. అదీ కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత విజయ్‌తో మాస్టర్, కమలహాసన్‌తో విక్రమ్ చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఇలా ఇప్పటికి అదే చిత్రాలు చేసిన లోకేష్ కనకరాజ్ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా లోకేష్ కనకరాజ్ ఇప్పుడు నిర్మాతగా మారనున్నారు. అవును ఈ విషయాన్ని ఆయనే తెలుపుతూ మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తాను జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ బ్యానర్లో తన శిష్యులకు, మిత్రులకు అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. దర్శకుడిగా తనకు అందించిన ఆదరాభిమానాలను తన చిత్రాలకు అందించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కాగా తన సంస్థలో నిర్మించనున్న చిత్రం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు. దీంతో లోకేశ్ కనగరాజ్ చిత్రాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. Need all your love and support 🤗❤️@GSquadOffl pic.twitter.com/9NWou59tuE — Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 27, 2023 -
ఓటీటీలోకి వచ్చేసిన పెద్ద సినిమాలు, స్ట్రీమింగ్ అక్కడే!
థియేటర్లో సినిమాల సందడి ఎలా ఉన్నా ఓటీటీలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లతో కళకళలాడుతున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త కంటెంట్‌ను అందించడంలో ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ ఆడియన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. సినీప్రేమికుల కోసం ప్రతివారం కొత్త సినిమాలను మోసుకొస్తుంది ఓటీటీ. మరీ ముఖ్యంగా సినిమాలకు సెంటిమెండ్ డేగా చెప్పుకునే ఫ్రైడే రోజు భారీ చిత్రాలను రిలీజ్ చేస్తుంది. అలా ఈరోజు (నవంబర్ 24) నాలుగు పెద్ద సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. అవేంటో చూసేద్దాం.. లియో దళపతి విజయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లియో. బాక్సాఫీస్ దగ్గర రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అభిమానులు తెగ ఎదురుచూశారు. అదిగో.. ఇదిగో.. అంటూ ఊరించిన లియో ఎట్టకేలకు నేడు ఓటీటీలో అడుగుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. భగవంత్ కేసరి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. యాక్టింగ్‌తో పాటు యాక్షన్ సీన్స్‌లోనూ అదరగొట్టింది. దసరాకు రిలీజైన ఈ మూవీ ఓటీటీ డేట్ గురించి అనేక పుకార్లు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ది విలేజ్ తమిళ స్టార్ ఆర్య తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ది విలేజ్ అనే హారర్ వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: ‘సౌండ్ పార్టీ’ మూవీ రివ్యూ -
మన్సూర్ అలీఖాన్‌కు సమన్లు.. నేడు విచారణ
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్‌కు థౌజండ్ లైట్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు. గురువారం తమ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వివరాలు.. సినీ నటి త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదుతో డీజీపీ శంకర్‌జివ్వాల్ ఆదేశాల మేరకు మన్సూర్‌పై రెండు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఆయన్ని విచారించేందుకు థౌజండ్ లైట్స్ పోలీసులు సిద్ధమయ్యారు. విచారణకు రావాలని ఆదేశిస్తూ ఆయనకు సమన్లు పంపించారు. ఇదిలా ఉండగా మన్సూర్ అలీఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో నటి ఖుష్భు ‘చేరి’(స్లం) భాష గురించి తనకు తెలియదని, తాను మాట్లడలేనని ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ చేరి భాష మద్దతు దారులు కుష్భుకు వ్యతిరేకంగా గళాన్ని విప్పే పనిలో పడ్డాడు. దర్శకుడు పా రంజిత్ , నటి గాయత్రి రఘురాం కుష్భు వ్యాఖ్యలను ఖండించారు. ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కుష్భుకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో స్వరాన్ని పెంచిన వాళ్లు ఎక్కువే. మన్సూర్ వ్యవహారంలో ఆగమేఘాలపై స్పందించిన కుష్భు మణిపూర్ వ్యవహారంలో ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించడం గమనార్హం. -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు
మరో వీకెండ్‌కి అంతా సిద్దమైపోయింది. కాకపోతే ఈసారి థియేటర్లలోకి వచ్చేవాటిలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాల్లేవు. కాబట్టి ఆటోమేటిక్‌గా అందరి చూపు ఓటీటీలపై పడుతుంది. దాన్ని క్యాష్ చేసుకునేలా ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 మూవీస్-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి. లిస్టులో చాలా ఉన్నప్పటికీ రెండు మూడు మాత్రమ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?) దసరా కానుకగా బిగ్ స్క్రీన్‌పై రిలీజైన దళపతి విజయ్ 'లియో' సినిమా.. ఈ శుక్రవారమే ఓటీటీలోకి రానుంది. దీంతో పాటే డీమన్(తమిళ), చావెర్(మలయాళ), పులిమడ, ఒడియన్ లాంటి తెలుగు డబ్బింగ్ లాంటి చిత్రాలు కూడా ఉన్నాయండోయ్. ఇవన్నీ పక్కనబెడితే శ్రీలీల కొత్త మూవీ 'భగవంత్ కేసరి' కూడా ఈ వీకెండ్లోనే ఓటీటీలోకి రానుందని అంటున్నారు. దిగువన లిస్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది అని ఉన్న చిత్రాలు గురువారం రిలీజైనవి, మిగతావన్నీ మాత్రం శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యేవని అర్థం. ఈ శుక్రవారం రిలీజయ్యే మూవీస్ జాబితా (నవంబరు 24th) అమెజాన్ ప్రైమ్ ద విలేజ్ - తమిళ వెబ్ సిరీస్ ఎల్ఫ్ మీ - ఇటాలియన్ మూవీ భగవంత్ కేసరి - తెలుగు సినిమా ఆహా డీమన్ - తమిళ సినిమా అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్ - ఎనిమల్ టీమ్ ఎపిసోడ్ సోనీ లివ్ సతియా సోతనాయ్ - తమిళ చిత్రం చావెర్ - మలయాళ మూవీ జియో సినిమా ద గుడ్ ఓల్డ్ డేస్ - తెలుగు వెబ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్‌ఫ్లిక్స్ లియో - తెలుగు డబ్బింగ్ సినిమా ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ - స్వీడిష్ వెబ్ సిరీస్ ఐ డోన్ట్ ఎక్స్పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ - స్పానిష్ సినిమా లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ - టర్కిష్ మూవీ గ్రాన్ టరిష్మో - ఇంగ్లీష్ చిత్రం ద మెషీన్ - ఇంగ్లీష్ సినిమా (నవంబరు 26) పులిమడ - తెలగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) మై డామెన్ - జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) మై లిటిల్ పోని మేక్ యూవర్ మార్క్: చాప్టర్ 6 (స్ట్రీమింగ్) ఈ విన్ ఒడియన్ - తెలుగు డబ్బింగ్ మూవీ బుక్ మై షో యూఎఫ్ఓ స్వీడన్ - స్వీడిష్ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద నాటీ నైన్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) జీ5 ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 - హిందీ వెబ్ సిరీస్ ఎమ్ఎక్స్ ప్లేయర్ జోహ్రి - హిందీ సిరీస్ సైనా ప్లే కుడుక్కు 2025 - మలయాళ సినిమా (ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) -
విజయ్ 'లియో' ఓటీటీ విడుదల తేదీని ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
విజయ్- లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో లియో సినిమా తెరకెక్కింది. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదలైంది. టాలీవుడ్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కోలీవుడ్‌లో మాత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. విజయ్ కెరియర్లో మరో హిట్ సినిమాగా నిలిచింది. విడుదలకు ముందు నుంచే ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలిచింది. అలాగే కోలీవుడ్‌లో తొలిరోజు తెల్లవారుజామున ప్రదర్శనలకు కూడా ప్రభుత్వం అనుమతులివ్వలేదు. వీటన్నింటి మధ్య కూడా ఈ చిత్రం రికార్డులు సృష్టించడంతో లియో మేకర్స్ గ్రాండ్‌గా అభిమానుల మధ్య విజయోత్సవ వేడుకను కూడా జరుపుకున్నారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదల విషయంలో అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో లియో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు లియో చిత్రాన్ని చూడని ప్రేక్షకులు ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. కథేంటి? పార్తిబన్(విజయ్).. భార్య పిల్లలతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటాడు. కాఫీ షాప్ నడుపుతుంటాడు. ఆ షాప్‌కి వచ్చిన కొందరు రౌడీలు.. తన కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తారు. దీంతో వాళ్లని చంపేస్తాడు. మరోవైపు ఆంటోనీ దాస్ (సంజయ్ దత్).. పార్తిబన్ దగ్గరకొచ్చి తాను తండ్రినని చెప్తాడు. నువ్వు పార్తిబన్ కాదు.. లియో దాస్ అని అంటాడు. ఇంతకీ పార్తిబన్ ఎవరు? లియో ఎవరు? అసలు వీళ్లిద్దరికీ సంబంధం ఏంటనేది సినిమా కథ -
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్‌గా వివరణ ఇచ్చిన మన్సూర్!
దక్షిణాది నటుడు మన్సూర్ అలీ ఖాన్ తాజాగా 'లియో' చిత్రంలో కనిపించాడు. అందులో ఆయనతో పాటు నటించిన హీరోయిన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం చేశాడు. ఈ విషయంపై ఇప్పటికే త్రిషతో పాటు తమిళనాడులోని చాలామంది ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. మన్సూర్ అలీ ఖాన్ క్లారిఫికేషన్: నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఈ వివాదం గురించి తన సోషల్ మీడియాలో ఇలా తెలిపాడు. తన మాటలను తప్పుగా చూపించినందుకు నటుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నటి త్రిష కృష్ణన్‌ను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని మీడియా సమావేశంలో అన్నారు.. లియోలో నటి త్రిష కృష్ణన్ పాత్రను 'పర్వతాన్ని ఎత్తుకున్న హనుమాన్'తో పోల్చారు. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. ఆమెకు కాంప్లిమెంట్స్ ఇచ్చాను. 'దురదృష్టవశాత్తూ, ఆ స్టేట్మెంట్ తీసివేయబడింది. కొన్ని స్టేట్మెంట్లు మాత్రమే ఆక్కడ ఎడిట్ చేసి ఎవరో కావాలనే వైరల్ చేశారు. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందన్నారు. ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు. సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదు. తాను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. అంటూ మన్సూర్ అలీ ఖాన్ తమిళంలో ఇలా రాశారు. 'నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పుగా చూపించి నాపై రాజకీయాలు చేస్తున్నారు. నా సినిమాల గమనాన్ని ప్రభావితం చేసేందుకే ఇలా చేస్తున్నారు. స్త్రీల పట్ల నాకెంతో గౌరవం ఉంది. నేను గతంలో చాలా మంది నటీమణులతో పనిచేశాను. నేనెప్పుడూ ఎవరితోనూ అసభ్యకరంగా ప్రవర్తించలేదు.' అని తెలిపాడు. ఏం జరిగిందంటే..? కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ‘లియో’ సినిమాలో త్రిషతో ఓ సీన్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నేను గతంలో ఎన్నో చిత్రాల్లో రేప్ సీన్లలో నటించాను. ‘లియో’లో కూడా త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నా. కానీ అలాంటి సీన్ లేకపోవడంతో చాలా బాధగా అనిపించింది.' అని మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశాడు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సినీ పరిశ్రమ నుంచి తీవ్ర అసంతృప్తి వచ్చింది. నటి ఖుష్బూ సుందర్, దర్శకుడు లోకేష్ కనకరాజ్, గాయని చిన్మయి శ్రీపాద తదితరులు ఆయన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. View this post on Instagram A post shared by Mansoor Ali Khan (@mansoor_alikhan_offl) -
ఇలాంటి నీచమైన వ్యక్తితో ఇకపై నటించను: త్రిష
లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి అలా మాట్లాడటంపై కోలీవుడ్ సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండి చేస్తున్నారు. అంతే కాకుండా ఇలాంటి వారికి సినిమాల్లో అవకాశాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. త్రిష ట్వీట్లో రాస్తూ.. 'మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరంగా అనిపిస్తోంది. అతని లాంటి నీచమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్‌ను ఇకపై ఎప్పుడూ పంచుకోను. నా మిగిలిన సినిమా కెరీర్లో కూడా ఇలా జరగకుండా చూసుకుంటాను. అతని లాంటి వారి వల్ల మానవాళికే చెడ్డపేరు వస్తుంది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సైతం మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను ఖండించారు. లోకేశ్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. "మేమంతా ఒకే టీమ్‌లో పనిచేశాం. మన్సూర్ అలీ ఖాన్ చేసిన స్త్రీల పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చూస్తే చాలా కోపంగా ఉంది. ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళలు, తోటి నటీనటులను మనం గౌరవించాలి. ఏ పరిశ్రమలోనైనా ఇలాగే ఉండాలి. ' అని పోస్ట్ చేశారు. కాగా.. లియో చిత్రంలో ఖాన్ మరణశిక్ష విధించబడిన దోషి పాత్రలో కనిపించారు. తమన్నా సాంగ్‌పై మన్సూర్ కామెంట్స్ అయితే గతంలో జైలర్ సినిమాలోని కావాలయ్యా.. అనే పాటపై లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ పాట మ్యూజిక్, స్టెప్పులు ఏవీ బాగోలేదని మాట్లాడాడు. 'కావాలయ్యా పాటలో తమన్నా వేసే స్టెప్పు చాలా దరిద్రంగా ఉంటుంది. కావాలా.. అంటూ తన చేతిని ఓరకంగా ఆడించడం అస్సలు బాగోలేదు. చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఇటువంటి పాటకు, స్టెప్పులకు సెన్సార్ వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని మన్సూర్ అలీ ఖాన్ విమర్శలు చేశారు. A recent video has come to my notice where Mr.Mansoor Ali Khan has spoken about me in a vile and disgusting manner.I strongly condemn this and find it sexist,disrespectful,misogynistic,repulsive and in bad taste.He can keep wishing but I am grateful never to have shared screen… — Trish (@trishtrashers) November 18, 2023 Disheartened and enraged to hear the misogynistic comments made by Mr.Mansoor Ali Khan, given that we all worked in the same team. Respect for women, fellow artists and professionals should be a non-negotiable in any industry and I absolutely condemn this behaviour. https://t.co/PBlMzsoDZ3 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 18, 2023 The thing about men like Mansoor Ali Khan - they have always been talking like this. Never been condemned, with other men in power, money and influence laughing along; eeyy aamaa da macha correct ra maccha sorta thing. Robo Shankar said something on how he wants allowed to touch… pic.twitter.com/ZkRb2qxmMl — Chinmayi Sripaada (@Chinmayi) November 18, 2023 -
త్రిషపై సంచలన కామెంట్స్.. లియో నటుడిపై సినీతారల ఆగ్రహం!
నటి త్రిషై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్‌పై కోలీవుడ్ తారలు ఫైరవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలసుకుందాం. విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలో కనిపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మన్సూర్ త్రిషపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతను చేసిన అసభ్యకరమైన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. 'లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటించా. కానీ సినిమాలో ఒక్క బెడ్రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నా. నేను ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్రూమ్కు తీసుకెళ్తానని అనుకున్నా. ఇంతకుముందు సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. సినిమాల్లో ఇది నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు.' అంటూ కామెంట్స్ చేశారు. దీంతో మన్సూర్ అలీ ఖాన్‌పై పలువురు తారలు మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి సినిమాల్లో ఎందుకు అవకాశాలిస్తున్నాంటూ నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. The thing about men like Mansoor Ali Khan - they have always been talking like this. Never been condemned, with other men in power, money and influence laughing along; eeyy aamaa da macha correct ra maccha sorta thing. Robo Shankar said something on how he wants allowed to touch… pic.twitter.com/ZkRb2qxmMl — Chinmayi Sripaada (@Chinmayi) November 18, 2023 -
లియో రీ రిలీజ్.. కారణం ఇదేనా..?
ఈ ఏడాదిలో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం లియో... అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో మాత్రం పర్వాలేదు అనిపించినా మిగిలిన అన్ని భాషల్లో అంతగా మెప్పించలేదు. కమల్ హాసన్‌తో 'విక్రమ్' సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తీసిన సినిమా కావడంతో అందరిలో భారీ అంచనాలు పెరిగాయి. కానీ లియో సినిమా చూసిన తర్వాత చాలామంది నుంచి డివైడ్ టాక్ వచ్చింది. లియో విడుదలైన రోజు నుంచి నిత్యం వార్తల్లోనే నిలుస్తుంది. సినిమా విడుదలైన రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇదంతా యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న పని అంటూ విజయ్ అభిమానులు ఫైర్ అయ్యారు. సినిమా విడదలైన రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 600 కోట్లుకు పైగా కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ ప్రకటిచారు. కానీ అందులో నిజం లేదని నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. రజనీకాంత్, అజిత్ ఫ్యాన్స్ కావాలనే సినిమాపై నెగటివ్ ప్రచారం చేశారని విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. లియో విడుదలై ఇప్పటికే 5 వారాలు దాటింది. త్వరలో ఓటీటీలోకి రాబోతుందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ సినిమాను తమిళనాడులో రీ రిలీజ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. సుమారు 100 థియేటర్స్‌లలో లియోను మళ్లీ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం గత రెండు వారులుగా తమిళనాట విడుదలైన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ సినిమాల కోసం లియోను చాలా చోట్ల తొలగించేశారు. ఇప్పుడా సినిమాలు కూడా డిజాస్టర్ బాట పట్టడంతో థియేటర్లకు ప్రేక్షకులు కరవయ్యారు. దీంతో లియో సినిమాను రీరిలీజ్ చేస్తే మళ్లీ థియేటర్లు కలెక్షన్స్ బాట పట్టే ఛాన్స్ ఉందని వారు అంచనా వేస్తున్నారు.