లియో ట్రైలర్ .. వారందరికీ షాకిచ్చిన సెన్సార్‌ బోర్డ్! | Censor Board Issues Notice To Theatres Owners For Screening Leo Trailer In Chennai - Sakshi
Sakshi News home page

Leo Trailer: లియో ట్రైలర్ .. వారందరికీ షాకిచ్చిన సెన్సార్‌ బోర్డ్!

Published Tue, Oct 10 2023 12:31 PM | Last Updated on Tue, Oct 10 2023 12:43 PM

Sensor Board Gives Notices To Leo Trailer Released Theatres In Chennai - Sakshi

దళపతి విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న  చిత్రం లియో. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. అయితే ఈ ట్రైలర్‌లో విజయ్ చెప్పిన ఓ డైలాగ్ అభిమానులకు షాక్‌కు గురి చేసింది. ఆ బూతుపదం ఉండడంపై సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున చర్చ జరిగింది. కానీ.. ఆ డైలాగ్‌ను అలాగే ఉంచడంపై డైరెక్టర్ లోకేశ్ వివరణ కూడా ఇచ్చారు.  

(ఇది చదవండి: ఈడీ ముందుకు హాజరైన హీరో నవదీప్‌.. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు)

అయితే ఈ ట్రైలర్‌ విడుదల రోజు చెన్నైలోని కొన్ని థియేటర్లలో ప్రదర్శించారు. దీంతో తాజాగా ఆ థియేటర్లకు సెన్సార్‌ బోర్డు లీగల్‌ నోటీసులు జారీ చేసింది. అభ్యంతరమైన పదాలతో  ట్రైలర్‌ను అలాగే చూపించారంటూ సెన్సార్‌ బోర్డు థియేటర్లకు లీగల్‌ నోటీసులు పంపింది. నిబంధనల ప్రకారం అలాంటి ట్రైలర్‌ను పబ్లిక్‌లో ప్రదర్శించకూడదని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ యాజమాన్యాలను కోరింది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, గౌతమ్‌ మేనన్‌, మిస్కిన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement