Sensor Board
-
సెన్సార్ పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్ మట్కా.. రన్ టైమ్ ఎంతంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా. ఈ ఫుల్ యాక్షన్ సినిమాకు కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా.. చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మెగాహీరో వరుణ్ తేజ్.. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలన్ని పెట్టుకున్నాడు. 'మట్కా' అనే గేమ్ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వరుణ్ తేజ్ మూడు విభిన్న గెటప్స్‌లో వరుణ్ కనిపించనున్నాడు.రన్ టైమ్ ఎంతంటే..మట్కా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 33 నిమిషాలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టైటిల్స్‌తో కలిసి దాదాపు 2 గంటల 39 నిమిషాల రన్‌టైమ్ ఉండనుంది. ఈ ఫుల్ మాస్ ఎంటర్టైనర్లో చివరి 20 నిమిషాలు క్లైమాక్స్ హైలెట్‌గా ఉండనుందని ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ వెల్లడించారు. -
ఎమర్జెన్సీకి లైన్ క్లియర్.. విడుదల తేదీపై ఉత్కంఠ!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా 'ఎమర్జెన్సీ'. ఇప్పటికే జూలైలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. గతనెల సెప్టెంబర్ 6న థియేటర్లలోకి వస్తుందని భావించినప్పటికీ.. ఊహించని విధంగా మరోసారి పోస్ట్‌పోన్ అయింది. దీంతో ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు.తాజాగా తన అభిమానులకు కంగనా రనౌత్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసినట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. మా చిత్రబృందం సెన్సార్ పూర్తి చేసుకుందని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ విషయంలో మీ సహనానికి, మద్దతుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది.(ఇది చదవండి: కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్‌కు మోక్షం అప్పుడేనా?)కాగా.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై ఓ వర్గం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను చెడుగా చిత్రీకరించారంటూ ఈ చిత్రంపై ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా సెన్సార్ బోర్డ్ సైతం కొన్ని సీన్స్ కట్ చేయాలని చిత్రబృందానికి సూచించింది. అందువల్లే ఎమర్జెన్సీ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకోవడంతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. We are glad to announce we have received the censor certificate for our movie Emergency, we will be announcing the release date soon. Thank you for your patience and support 🇮🇳— Kangana Ranaut (@KanganaTeam) October 17, 2024 -
దేవరకు సెన్సార్ బోర్డ్ షాక్.. ఆ నాలుగు సీన్స్ మార్చాల్సిందే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలన నెలకొన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల దేవర ట్రైలర్ రిలీజ్ కాగా.. రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది.తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాకు సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసేందుకు సెన్సార్ బోర్డ్ ఓకే చెప్పింది. అయితే ఈ చిత్రంలో నాలుగు మార్పులు చేయాలని మేకర్స్‌కు సెన్సార్ బోర్డ్ సూచించింది. ఇందులో ప్రధానంగా భార్య, తల్లిని కడుపులో తన్నడం లాంటి రెండు సీన్స్‌ను మార్చాలని ఆదేశించింది. అంతేకాకుండా మరో ఫైట్ సీక్వెన్స్‌లో కత్తిపై మనిషి వేలాడుతున్న సీన్ మార్పులు చేయాలని కోరింది. చివరిగా జూనియర్ ఎన్టీఆర్ సముద్రంలో సొరచేపను స్వారీ చేస్తున్న సీన్‌కు మేడ్ విత్ సీజీఐ అనే డిస్క్లైమర్ వేయాలని దేవర టీమ్‌కు తెలిపింది. ఈ సన్నివేశంలో ఎలాంటి జంతుహింస జరగలేదని టిక్కర్ వేయాలని వివరించింది. ఈ మార్పులతో దేవర మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు సెన్సార్ బోర్డు వెల్లడించింది. కాగా.. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 58 నిమిషాలు ఉండనుంది. కాగా.. ఈ యాక్షన్ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో విలన్‌గా అభిమానులను మెప్పించనున్నారు. నందమూరి కళ్యాణ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. యూఎస్‌లో రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయి. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. -
నేను ఎవ్వరికి భయపడనని నీకు మట్టుకే తెలుసు: ఆర్జీవీ ట్వీట్ వైరల్!
అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం వ్యూహం. ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వ్యూహం చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. అయితే ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదని వెల్లడించారు. (ఇది చదవండి: నాకున్న జబ్బు ఇదే, ఎక్కువ రోజులు బతకనని చెప్పారు: నటి) ఇప్పటికే ఆర్జీవీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 'అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఎన్ని వ్యూహాలు పన్నినా మా ‘వ్యూహం’ను ఆపలేరు అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప సినిమాలోని ఓ డైలాగ్‌తో ఆర్జీవీ ట్వీట్ చేశారు. అందులో అల్లు అర్జున్, సునీల్ మధ్య జరిగిన సీన్ మీమ్‌ను షేర్ చేశారు. అందులో పుష్ప క్యారెక్టర్లో ఆర్జీవీని చూపించారు. ఆర్జీవీ షేర్ చేసిన ట్వీట్లో.. 'శీనప్ప.. నేను ఎవ్వడికి భయపడనని నీకు మట్టుకే తెలుసు. కానీ మార్కెట్ మొత్తం తెలియాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా? అన్నో.. ఇది ఒకటి తలలో పెట్టుకో ఎప్పటికీ.. నేను నా వ్యూహంతో నీ కెరీర్‌ను గెలకడానికి రాలే. నా వ్యూహంతో నీ వ్యూహం బయటపెట్టడానికి వచ్చినా.. తగ్గేదేలే' అన్న డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. త్వరలోనే వ్యూహం మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వెల్లడించారు. (ఇది చదవండి: దయా వెబ్ సిరీస్ నటి.. మరి ఇంత బోల్డ్‌గా ఉందేంటి బ్రో!) pic.twitter.com/RehuN6PGPk — Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2023 -
లియో ట్రైలర్ .. వారందరికీ షాకిచ్చిన సెన్సార్ బోర్డ్!
దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం లియో. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. అయితే ఈ ట్రైలర్లో విజయ్ చెప్పిన ఓ డైలాగ్ అభిమానులకు షాక్‌కు గురి చేసింది. ఆ బూతుపదం ఉండడంపై సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున చర్చ జరిగింది. కానీ.. ఆ డైలాగ్‌ను అలాగే ఉంచడంపై డైరెక్టర్ లోకేశ్ వివరణ కూడా ఇచ్చారు. (ఇది చదవండి: ఈడీ ముందుకు హాజరైన హీరో నవదీప్.. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు) అయితే ఈ ట్రైలర్ విడుదల రోజు చెన్నైలోని కొన్ని థియేటర్లలో ప్రదర్శించారు. దీంతో తాజాగా ఆ థియేటర్లకు సెన్సార్ బోర్డు లీగల్ నోటీసులు జారీ చేసింది. అభ్యంతరమైన పదాలతో ట్రైలర్‌ను అలాగే చూపించారంటూ సెన్సార్ బోర్డు థియేటర్లకు లీగల్ నోటీసులు పంపింది. నిబంధనల ప్రకారం అలాంటి ట్రైలర్‌ను పబ్లిక్‌లో ప్రదర్శించకూడదని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ యాజమాన్యాలను కోరింది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, గౌతమ్ మేనన్, మిస్కిన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఒక్క రాత్రిలో జరిగే కథే 'రారా సరసకు రారా'!
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రంలోని రారా సరసకు రారా అనే పాటలోని పల్లవినే టైటిల్‌గా చేసుకొని రూపొందిన చిత్రం 'రారా సరసకు రారా'. స్కై లాండర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఏ జయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ద్వారా కేశవ్ దబర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ తదితర భాషల్లో సుమారు 350కి పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. (ఇది చదవండి: వరుణ్- లావణ్య పెళ్లి వేడుక.. వేదిక ఎక్కడో తెలుసా?) ఈ చిత్రంలో కార్తీక్, గాయత్రి పటేల్, బాల, మారి, వినోద్, కాట్పాడి రాజన్, విశ్వ, రవివర్మ, అభిషేక్, బెంజిమిన్, సిమ్రాన్, దీపిక, గాయత్రి, జేపీ, జయవాణి అక్షిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర వివరాలను నిర్మాత ఏ.జయలక్ష్మి తెలుపుతూ ఓ రాత్రిలో జరిగే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. బళ్లారి రాజా, దామోదరం అనే ఇద్దరు రాజకీయాల్లో కలిసి ఉంటూ ఆ తర్వాత శత్రువులుగా మారుతారన్నారు. కాగా బళ్లారి రాజా చేసిన పనికి ఒక యువతి చూసిందన్నారు. దీంతో ఆమెను చంపటానికి బళ్లారి రాజా తన మనుషులను పురమాయిస్తాడన్నారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి ఒక హాస్టల్లో తలదాచుకుంటుందన్నారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నదే చిత్రం కథ అని చెప్పారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏకంగా 60 కట్స్ ఇచ్చిందన్నారు. ఆ కట్స్‌కు అంగీకరిస్తేనే ఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారన్నారు. తాము ముంబైలోని రివైజింగ్ కమిటీకి వెళ్లి తక్కువ కట్స్‌తో ఏ సర్టిఫికెట్ పొందినట్లు చెప్పారు. చిత్రాన్ని నవంబర్ 3వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. (ఇది చదవండి: కష్టాల్లో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడిచాడు: ఇలియానా) -
సెంట్రల్ సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన ఆరోపణలు
-
దయచేసి పిల్లలతో కలిసి సినిమా చూడకండి:స్టార్ హీరో
లేడీ సూపర్ స్టార్ నయనతార, జయం రవి జంటగా నటించిన చిత్రం ఇరైవన్. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని గాడ్ పేరుతో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ లాంఛ్‌లో పాల్గొన్న జయం రవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చారు. (ఇది చదవండి: కలర్స్ స్వాతితో పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన నవీన్ చంద్ర!) జయం రవి మాట్లాడుతూ..' అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదం అందించే లక్ష్యంతో సినిమాలు చేస్తున్నాం. అయితే ఇరైవన్ (గాడ్) చిత్రాన్ని మాత్రం పిల్లలతో కలిసి చూడొద్దు. ఎందుకంటే సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసి చిన్న పిల్లలు భయపడే అవకాశం ఉంది. మా సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్లోనే చూపించాం. కొంతమంది ప్రేక్షకులు ఇలాంటి క్రైమ్ అండ్ సస్పెన్స్ చిత్రాలను ఇష్టపడతారు. వాళ్లు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నా.' అని అన్నారు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గతంలో నాకు ఓ కథ చెప్పారు. అది అనివార్య కారణాలతో చేయలేకపోయాను. అతనికి మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా. ఇకపోతే నాకు డైరెక్షన్ చేయాలనే ఉంది.. భవిష్యత్తులో అవకాశం వస్తే విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని తెలిపారు. (ఇది చదవండి: 800 మూవీ విజయ్ సేతుపతి చేయాల్సింది, కుటుంబాన్ని బెదిరించడంతో..) -
విజయ్ సినిమాకు షాకిచ్చిన సెన్సార్ బోర్డ్.. ఆ సీన్లు కట్!
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లియో. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా త్రిష, ప్రియా ఆనంద్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 19వ తేదీన విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (ఇది చదవండి: ఫైర్ మీదున్న అమర్.. రెండో వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?) అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలోని నాన్ రెడీ వరవా అనే పాటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. అయితే ఈ పాట మొదటి నుంచి వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ పాటలో విజయ్ పొగ తాగే సన్నివేశాలతో పాటు వివాదాస్పద పదాలు చోటు చేసుకోవడంతో పలు తమిళ సంఘాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా అనొచ్చు మక్కళ్ కట్చి నిర్వాహకురాలు రాజేశ్వరి ప్రియ చిత్రంలోని నాన్ రెడీ పాటకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో సెన్సార్ సభ్యులు ఆ పాటలోని కొన్ని అభ్యంతర సన్నివేశాలను.. పాటలోని వివాదాస్పద పదాలను కట్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా విజయ్ సిగరెట్ పట్టుకుని క్లోజప్ సన్నివేశాలను తొలగించినట్లు తెలిసింది. అయితే ఈ పని పాట విడుదలకు ముందే చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ , దర్శకుడు మిష్కిన్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. (ఇది చదవండి: స్టైలిష్ లుక్‌లో ఉపాసన.. డ్రెస్ ధరెంతో తెలుసా?) -
సెన్సార్ పూర్తి చేసుకున్న మెగాస్టార్ భోళాశంకర్..!
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'భోళా శంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహానటి కీర్తిసురేశ్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుండగా.. హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. ఈ చిత్రాన్ని తమిళంలో వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కించారు. (ఇది చదవండి: 'ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్) తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కూడా పూర్తయింది. భోళాశంకర్ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆగస్టు 11 నుంచి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు భోళాశంకర్ సిద్ధమైంది అంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. (ఇది చదవండి: 'భోళాశంకర్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..) Experience Mega 🌟 @KChiruTweets's MASSive Euphoria on the Big screens worldwide💥💥#BholaaShankar Certified with U/A 🔥& All set to entertain you all in Theatres from AUGUST 11th ❤️🔥 A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA… pic.twitter.com/TQC37G0GK0 — AK Entertainments (@AKentsOfficial) August 2, 2023 -
చైనాకు వంత పాడుతున్నారా?.. సెన్సార్ బోర్డుపై నిర్మాత సంచలన కామెంట్స్!
ప్రముఖ రచయిత, ప్రేమకథా చిత్రాల స్పెషలిష్ట్ దీన్ రాజ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్’. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో నిర్మించారు. శంకర్ నాయుడు అడుసుమిల్లి మాట్లాడుతూ..'మన దేశంపై చైనా దురాగతాలను వెల్లడిస్తూ రూపొందిన మొదటి సినిమా ఇది. భారతీయ మూలాలు కలిగి, అమెరికాలో స్థిరపడిన తెలుగువాడిని. అతి త్వరలో మీ ముందుకు "భారతీయన్స్" చిత్రాన్ని తీసుకొస్తాం. సెన్సార్ బోర్డు ఉన్నతాధికారులు చైనాకు భయపడి ఈ సినిమాలో మన గొంతును మూయించే ప్రయత్నం చేస్తున్నారు. చైనా దాడులు, బ్యాక్‌స్టాబ్‌లు చాలావరకు మీకు తెలిసి ఉండవచ్చు.' అని అన్నారు. చైనా వక్రబుద్ధిపై మాట్లాడుతూ.. 'చైనా మనతో ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దులలో ఒకటిగా ఉంది. చైనా ఎల్లప్పుడూ మన వెనుక కత్తితో దాడి చేసే శత్రువు. అత్యంత ప్రమాదకరమైన, మోసపూరిత, దుర్మార్గమైన చైనా... కొన్ని శతాబ్దాల క్రితం బ్రిటీష్ వారిలాగే సాధ్యమైన ప్రతి దేశాన్ని వలసరాజ్యం చేయడానికి ప్రయత్నిస్తూ అధికారంలో ఉండటానికి దాని స్వంత ప్రజలను సైతం చంపుతుంది. ఈ దుర్మార్గపు, నిరంకుశం గురించి మా సినిమా భారతీయన్స్లో ఎండగట్టాం.' అని అన్నారు. దురదృష్టవశాత్తు సెన్సార్ బోర్డు నన్ను సినిమాలో చైనా పేరును ఉపయోగించవద్దని కోరిందని తెలిపారు. మరింత విచారంగా గాల్వాన్ వ్యాలీ పేరును కూడా తొలగించమని అడిగారు. ఇది ఎంత అరాచకం? ఎంత అవమానకరం? గాల్వాన్ వ్యాలీని చైనాకు అప్పగిస్తున్నామా? మనం చైనాకు లొంగిపోతున్నామా? మీ అందరికీ ఇదే నా విజ్ఞప్తి. మీ అందరూ భారతీయన్స్ చిత్రానికి మద్దతు ఇవ్వాలని శంకర్ నాయుడు కోరారు. -
'ఆర్ఆర్ఆర్' సెన్సార్ పూర్తి.. ఆ విషయంలో బాహుబలి-2 కంటే ఎక్కువే..!
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇక ఈ చిత్రం ఇంకో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తవడంతో దాని రిపోర్ట్ బయటకు వచ్చింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్ర రన్‌టైమ్ విషయంలో ఏకంగా 'బాహుబలి-2'ను మించిపోయినట్టు తెలుస్తోంది. ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమా రన్‌టైమ్ 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు కాగా రాజమౌళి గత చిత్రం 'బాహుబలి ది కంక్లూజన్' రన్‌టైమ్ 2 గంటల 47 నిమిషాలు. అంటే మధ్యలో ఇంటర్వెల్‌తో కూడా కలుపుకుని మూడున్నర గంటలు 'ఆర్ఆర్ఆర్' చిత్రం థియేటర్లలో ప్రదర్శితం కానుంది. ఇక మెత్తంగా చూస్తే 'బాహుబలి-2' కంటే 'ఆర్ఆర్ఆర్' రన్‌టైమ్ ఎక్కువగా ఉండటం గమనార్హం. -
ఏక్తా కపూర్ నిర్మించిన వెబ్ సిరీస్ కారణంగానే..?
సాక్షి, సిటీబ్యూరో: ఒక్కసారి కూడా పోలీసుల వద్దకు వెళ్లని వారికంటే కనీసం ఒక్కసారైనా వారి సహాయం పొందిన వారికే డిపార్ట్‌మెంట్‌పై సద్భావన ఉంటోంది. అయితే 70 శాతం సాధారణ ప్రజలు జీవితంలో ఒక్కసారి కూడా పోలీసులను ఆశ్రయించట్లేదు. – జాతీయ స్థాయిలో జరిగిన అనేక సర్వేలు వెల్లడించిన విషయమిది. ఈ సర్వేలకు తోడు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో పోలీసు పాత్రల్ని చిత్రీకరిస్తున్న తీరు వారిపై మరింత ప్రతికూల భావన కలిగేందుకు కారణమవుతోంది. ఇప్పటి వరకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వంటి భద్రతాదళాల నేపథ్యంలో సాగే చిత్రాలు ఇష్టం వచ్చినట్లు నిర్మితమయ్యేవి. అందులో అధికారులు, సిబ్బంది తీరుతెన్నుల్ని అవగాహన రాహిత్యంతో చిత్రీకరించడం, పూర్తి నెగిటివ్ రోల్లో నడిపించడం జరిగేవి. ఈ విధానాలకు చెక్ పెడుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏక్తా కపూర్ నిర్మించిన ఓ వివాదాస్పద వెబ్ సిరీస్ కారణంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసు విభాగం విషయంలోనూ ఇలాంటి విధానపరమైన చర్యలు అవసరమని అధికారులు కోరుతున్నారు. ఇవీ కేంద్రం ఉత్తర్వులు... భద్రతా బలగాల నేపథ్యంలో వస్తున్న అనేక చిత్రాలు, వాటి వల్ల తలెత్తిన వివాదాలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వంటి బలగాలపై, ఆయా అధికారుల పాత్రల నేపథ్యంలో సాగే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలు ఇష్టం వచ్చినట్లు తెరకెక్కించడానికి ఆస్కారం లేదు. వీటి నిర్మాణం పూర్తయిన తర్వాత కచ్చితంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రదర్శించాల్సి ఉంటుంది. వాటిని వీక్షించి, అందులో ఉన్న అంశాలను పరిశీలించే ఈ విభాగం అభ్యంతరకమైన వాటిని తొలగించాలని స్పష్టం చేస్తుంది. అలాంటివి ఏమీ లేకపోతే చిత్రం విడుదలకు అనుమతిస్తూ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) జారీ చేస్తుంది. దీన్ని సమర్పిస్తేనే సెన్సార్ బోర్డు చిత్రం/వెబ్‌సిరీస్/డాక్యుమెంటరీ విడుదలకు అనుమతి ఇస్తుంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ కేంద్ర సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. పోలీసుల పాత్రలు మరీ దారుణం... రాష్ట్రంలో విడుదలయ్యే తెలుగు/హిందీ చిత్రాల్లో దాదాపు ప్రతి దాంట్లోనూ పోలీసుల పాత్రలు ఉంటాయి. కానిస్టేబుల్ నుంచి డీఐజీ, డీజీపీ వరకు వివిధ హోదాల్లో ఈ పాత్రలు సాగుతూ ఉంటాయి. వీటిలో దాదాపు 90 శాతం నెగెటివ్ షేడ్స్‌లోనే నడుస్తుంటాయి. ఆయా పాత్రలతో లంచాలు, బెదిరింపులు, కబ్జాలు, హత్యలు సహా అనేక వ్యవహారాలు చేయిస్తూ ఈ క్యారెక్టర్లను తెరకెక్కిస్తూ ఉంటారు. వీటికి తోడు వారి డైలాగ్స్, వారిని ఉద్దేశించి ఎదుటి వారు చెప్పే మాటలు పోలీసులు అంటే నరరూప రాక్షసులన్న భావన కలిగిస్తూ సాగుతాయి. మరోపక్క పోలీసు యూనిఫామ్‌కు ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఒక్కో హోదాలో ఉండే అధికారి ఒక్కో తరహా స్టార్స్, బ్యాడ్జ్‌లు, టోపీలు ధరిస్తూ ఉంటాయి. సినిమాల్లోని పాత్రలు చెప్పే హోదా ఒకటి ఉంటే.. వారి యూనిఫాంపై కనిపించే స్టార్స్ తదితరాలు మరో హోదాకు సంబంధించినవి ఉంటాయి. అత్యంత క్రమశిక్షణ కలిగిన పోలీసు విభాగాన్ని ప్రతిబింబించే ఆయా నటీనటులు దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీటిని వీక్షించే ప్రజలు పాటు కొన్ని సందర్భాల్లో కొందరు పోలీసులు చేసే తప్పుల్నీ అందరికీ ఆపాదిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పోలీసులపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడటానికి కొంత వరకు దోహదపడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక మారిన పరిస్థితులు... రాష్ట్ర పోలీసు విభాగంలో ఇప్పుడు ఒకప్పటి పరిస్థితులు లేవు. ప్రధానంగా 2014 తర్వాత విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పోలీసు విభాగానికి కీలక ప్రాధాన్యం ఇచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్న అధికారులు ప్రతి స్థాయిలోనూ సాంతికేతికత, జవాబుదారీతనం పెంచుతూ పోయారు. ప్రత్యేక యాప్‌లు, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే విధానాలను ప్రవేశపెట్టారు. అధికారులతో పాటు పోలీసుస్టేషన్లకూ ర్యాకింగ్స్ ఇస్తున్నారు. ఫలితంగా పోలీసుల ప్రవర్తన, బాధితుల్ని రిసీవ్ చేసుకునే విధానం సహా అనేక అంశాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ప్రజల్లో పెరిగిన అవగాహన, చైతన్యం సైతం దీనికి ప్రధాన కారణంగా మారింది. ఆరోపణలు వచ్చిన వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ‘సినిమా పోలీసు’ల్లో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించట్లేదు. నానాటికీ ఈ పాత్రలు దిగజారుతున్నాయి. ఇది చాలదన్నట్లు కొన్ని సినిమాల్లో ఆయా పోలీసుస్టేషన్ల పేర్లు, వాహనాలపై కమిషనరేట్ల లోగోలు సైతం కనిపించేలా చిత్రీకరిస్తున్నారు. ఇవన్నీ మారాలంటే రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రం మాదిరిగా ‘పోలీసు–సినిమా’లపై ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఉన్నతాధికారులకు నివేదిస్తాం పోలీసు విభాగాన్ని కించ పరుస్తూ వచ్చిన చిత్రాలు, సినిమా పేర్లపై ఇప్పటికే సెన్సార్ బోర్డును ఆశ్రయిస్తున్నాం. ‘మెంటల్ పోలీస్’, ‘పోలీసోడు’ టైటిల్స్‌పై లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపాం. ‘గబ్బర్‌సింగ్’ చిత్రంలో యూనిఫాంను అవమానించడాన్నీ తప్పుపట్టాం. పోలీసు విభాగంలో తప్పులు చేసే వారి శాతం 5 కంటే తక్కువే ఉంటుంది. వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని అహర్నిశలు శ్రమిస్తూ, అంకిత భావంతో పని చేసే 95 మందిని అవమానించడం సరికాదు. పోలీసు యూనిఫాంకు ఒక కోడ్ ఉంటుంది. అనేక సినిమాల్లో దీని ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఇప్పుడు డిఫెన్స్ మినిస్ట్రీ తీసుకున్న చర్యల్ని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. పోలీసు విభాగానికి సంబంధించీ ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చేలా ప్రభుత్వాని కోరమని వారి దృష్టికి తీసుకువెళ్తాం. – గోపిరెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం -
వలస కార్మికుడే హీరో
‘పండుగాడు ఫొటో స్టూడియో’ ఫేమ్ దర్శకుడు దిలీప్‌రాజా ‘లాక్డౌన్’ అనే టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ‘లాక్డౌన్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు కేంద్ర సెన్సార్ బోర్డ్ ఆమోదం ఇచ్చినట్లుగా దిలీప్‌రాజా తెలిపారు. ఈ సినిమాను విజయ బోనెల, ప్రదీప్ దోనూపూడి నిర్మించనున్నారు. ఈ ‘లాక్డౌన్’ సినిమా గురించి దిలీజ్ రాజా మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం. ఒకవైపు కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకుంటూ మరోవైపు గమ్యస్థానానికి బయలుదేరిన వలసకూలీల బతుకు చిత్రమే ‘లాక్డౌన్’. ఈ చిత్రంలో వలస కార్మికుడే హీరో. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలనే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. అలాగే ‘యూత్: కుర్రాళ్ళ గుండె చప్పుడు’ అనే చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు దిలీప్‌రాజా. -
అలా చూస్తే ఏ సినిమా విడుదల కాదు
‘‘సెన్సార్ బోర్డ్ రూల్ ప్రకారం చూస్తే ఏ సినిమా కూడా విడుదల కాదు. సెన్సార్ వాళ్లు అన్ని రూల్స్‌ను నా సినిమా మీదే ప్రయోగిస్తున్నారు. ఎందుకో అర్థం కావడం లేదు. ఓటు వేసి మనకు కావాల్సిన నాయకులను ఎన్నుకునే జ్ఞానం ఉన్న మనకు ఏ సినిమా చూడాలో? చూడకూడదో తెలియదా? ఆ విషయాన్ని ఇద్దరు, ముగ్గురు సెన్సార్ వాళ్లు చూసి చెప్పాలా? నా దృష్టిలో సెన్సార్ అనేది అవుట్ డేటెడ్’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ అందిస్తున్న చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించారు. టి. అంజయ్య సమర్పణలో అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నా, సెన్సార్ కారణాల వల్ల కాలేదు. ఈ సినిమా పేరును ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’గా మార్చారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘ఏ విషయాన్నీ సీరియస్‌గా తీసుకోవద్దనే సందేశంతో ఈ సినిమా రూపొందించాం. ఇందులో ఏ కులాన్ని, ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపలేదు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేశాను. ఎవరినైనా ప్రేమించడానికి లేదా ద్వేషించడానికి నా దగ్గర సమయం లేదు. నన్ను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా పైకి లేస్తాను.. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. చిత్ర సహనిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ –‘‘మా సినిమాను నవంబర్ 29న విడుదల చేయాలంటే అర్జెన్సీ సర్టిఫికెట్ కావాలన్నారు. దాన్ని పొందుపరిచి నవంబర్ 14న సెన్సార్‌కి పంపించాం. ఎలాంటి కారణం చూపకుండా సెన్సార్ వారు ఇంతవరకూ సినిమా చూడలేదు. అందుకే కోర్టును ఆశ్రయించడంతో వారంలోపు సినిమా చూసి, ఎగ్జామినేషన్ చేయాలని ఆదేశాలిచ్చారు’’ అన్నారు. ‘‘నిర్మాతగా నా తొలి చిత్రమిది. ఎవర్నీ కించపరిచేలా ఉండదు’’అన్నారు అజయ్ మైసూర్. ఈ చిత్రానికి సహ నిర్మాత: నట్టి కరుణ. -
'డిగ్రీ కాలేజీ'లో విశృంఖలత్వం..
ముషీరాబాద్: ప్రస్తుతం విడుదలవుతున్న కొన్ని సినిమాలలో ఆశ్లీల దృశ్యాలు చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయిని, అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100 లాంటి సినిమాలతో మరింత అశ్లీలత పెరిగిందని, నేడు ‘డిగ్రీ కాలేజీ’ పేరుతో వస్తున్న సినిమాలో మరింత విశృంఖలత్వంతో కూడిన దృశ్యాలున్నాయని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సినిమా ఇటీవల ట్రైలర్ మూడు నిమిషాలే ఉందని, దానిని చూస్తేనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోందన్నారు. బుధవారం పీవైఎల్ నాయకులు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, రీజినల్ ఆఫీసర్ రాజశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రదీప్ మాట్లాడుతూ... సినిమాలలో వస్తున్న శృంగార విశృంఖలత్వం చూసి యువత చెడిపోయే ప్రమాదముందన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని సెన్సార్ బోర్డును డిమాండ్ చేశారు. పీవైఎల్ నాయకులు కె.రాజేందర్, డివిఎస్.కృష్ణ, ఎం.ఆంజనేయులు, రాకేశ్‌రెడ్డి, అశోక్, సమీర్, సాయి, సందీప్ పాల్గన్నారు. -
స్ట్రెయిట్ ఫ్రమ్ స్టవ్
పొయ్యి మీద నుంచి డైరెక్ట్‌గా కంచంలో పడిన వంటకం ఎలా ఉంటుంది? అలాగే ఉంటున్నాయి ఈ వెబ్ చానెల్స్ షోస్ కూడా. మధ్యలో చల్లారబెట్టే సెన్సార్‌బోర్డ్ లాంటి వ్యవస్థ ఏదీ వీటికి లేదు. ఇదివరకు ఇంగ్లిష్ ‘ఎ’ సర్టిఫికెట్ సినిమాలు ఊరవతల ఉన్న టాకీసుల్లో రిలీజ్ అయ్యేవని చెప్పుకునేవారు. ఎవరికీ తెలియకుండా ఆ సినిమాలు చూడాలి అనుకునేవారు. సీక్రెట్‌గా పొలిమేరలకు వెళ్లేవాళ్లు. ఆ తర్వాత పదేళ్లకు ఊళ్లోనే సెంటర్లో ఉన్న సినిమా హాళ్లకే ట్రాన్స్ఫర్ అయ్యాయి అవి. కాకపోతే కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్‌లోనే స్క్రీనింగ్ ఉండేది. అనంతరం పదేళ్లకు ప్రైవేట్ చాన్సల్ రాకతో ఇంగ్లిష్ సినిమాలు ఇంట్లోకే వచ్చేశాయి. ఇప్పుడు.. ఇంగ్లీష్ సినిమాలే కాదు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, హిందీ ఎట్సెట్రా భాషల సినిమాలతోపాటు సీరియల్స్ కూడా అరచేతిలో షో చేస్తున్నాయి. యెస్.. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అది. వాడుక భాషలో వెబ్ చానెల్స్. ఈ యేటి సాంకేతిక ఉప్పెన! ఇవి చూపించేవన్నీ ‘ఎ’ సర్టిఫికెట్ చిత్రాలే. సేక్రెడ్ గేమ్స్, లస్ట్ స్టోరీస్, ఇన్సైడ్ ఎడ్జ్.. వంటివి కొన్ని ఉదాహరణలు. ఆడియెన్స్ క్రేజ్‌ను క్యాచ్ అండ్ క్యాష్ చేసుకుంటున్న బొమ్మలు. పొయ్యి మీద నుంచి డైరెక్ట్‌గా కంచంలో పడిన వంటకం ఎలా ఉంటుంది? అలాగే ఉంటున్నాయి ఈ వెబ్ చానెల్స్ షోస్ కూడా. మధ్యలో చల్లారబెట్టే సెన్సార్‌బోర్డ్ లాంటి వ్యవస్థ ఏదీ వీటికి లేదు. గల్లీలో గాలియా (వీధిలో తిట్లు) నుంచి గోలియోంకి రాస్లీలా దాకా.. అన్నీ ఉన్నవి ఉన్నట్టే.. వినిపిస్తూ కనిపిస్తాయి. సిల్వర్ స్క్రీన్ పాటించే సోకాల్డ్ మర్యాద, పట్టింపుల గ్రామర్ బెడద వెబ్ చానెల్స్‌కు లేదు. తూటాలు కణతల్లోంచి దూసుకుపోయే సీన్.. ట్రాన్స్‌జెండర్ న్యూడ్ లుక్, డ్రెస్సింగ్ రూమ్‌లో చీర్ గర్ల్‌తో సెక్స్.. ఎలాంటి పరదా, బ్లర్ ఇమేజ్ లేకుండా చాలా సామాన్య దృశ్యాలుగానే రోల్ అవుతాయి. సినిమాల కన్నా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటున్నాయి. అందుకే సినిమా బడ్జెట్కేమీ తీసిపోకుండా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా స్టార్స్‌ను పెట్టీ మరీ వెబ్ మూవీస్‌ను, వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి వెబ్ చానెల్స్. క్రైమ్ అయినా, శృంగారం అయినా.. అనురాగం అయినా.. ముసుగు లేకుండా చూపించడమే వీటి సిగ్నేచర్. సిల్వర్ స్క్రీన్.. ప్రేక్షకుల చాయిస్. కాని టీవీ.. నట్టింటి వినోదం. ఇలాంటి షోస్ పాస్వర్డ్ రక్షణతో పరిణతి లేని వాళ్లకు ఇన్విజబుల్గా ఉండే అవకాశం ఉందా? ఒక ఒరవడి 24 గంటల ఆయువునే రాసుకుని వస్తున్న కాలంలో ఉన్నాం. అవకాశాలు ఎప్పుడు ప్రమాదాలవుతాయో.. ప్రమాదాలు ఎలాంటి ప్రమోదాలుగా మారుతాయో తెలియని.. గ్రహించలేని వేగంలో కొట్టుకుపోతున్నాం. ఫలితాలను బేరీజు వేసుకొని సమీక్షించేంత టైమ్ కూడా ఉండట్లేదు. అన్నిటికీ వీక్షకులమే.. వెబ్ చానెల్స్కైనా.. రేపు వచ్చే ఇంకో కొత్త ట్రెండ్ మీడియానికైనా! – సరస్వతి రమ -
రజనీకాంత్‌కు ఒక న్యాయం, మాకో న్యాయమా?
తమిళ సినిమా: రజనీకాంత్‌కు ఒక న్యాయం, తమకో న్యాయమా అని సెన్సార్‌బోర్డు సభ్యులను ప్రశ్నిస్తున్నారు నటుడు, దర్శక నిర్మాత వారాహి. ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించి నిర్మించిన చిత్రం శివ మనసుల పుష్పా. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు పలు కట్స్‌తో పాటు చిత్ర టైటిల్‌నే మార్చమని చెప్పడంతో అవాక్కు అయిన వారాహి సెన్సార్ బోర్డు సభ్యుల తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను రూపొందించిన శివ మనసుల పుష్ప చిత్రం సమకాలీన రాజకీయాలతో కూడిన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర నిడివి గంట 45 నిమిషాలు ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు రెండు గంటల పాటు చర్చించి పలు రాజకీయపరమైన సంభాషణలను, గ్లామర్ సన్నివేశాలను కట్ చేయడంతో తాను వారితో వాగ్వాదం చేశానన్నారు. దీంతో చిత్రాన్ని ఢిల్లీలోని చైర్మన్‌కు పంపారన్నారు. ఆయన చిత్ర టైటిల్‌నే మార్చమని చెప్పారన్నారు. అసలు టైటిల్ మార్చమని చెప్పడానికి సెన్సార్ సభ్యులెవరని ప్రశ్నించారు. ఇంతకు ముందు శివ మనసుల శక్తి, ఇటీవల ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు వంటి చిత్రాల టైటిల్‌కు అభ్యంతరం చెప్పని సెన్సార్ సభ్యులు తన చిత్రానికి చెప్పడంలో పక్షపాత ధోరణి స్పష్టంగా తెలుస్తోందన్నారు. అదే విధంగా రజనీకాంత్ చిత్రాలు కూడా పలు రకాల పేర్లతో వచ్చాయన్నారు. వాటికి అభ్యంతరం చెప్పలేదే అని ప్రశ్నించారు. పెద్ద నటులకో న్యాయం, చిన్న నటులకో న్యాయమా మాదిరిగా పక్షపాతం చూపుతున్నట్లు సందేహం కలుగుతోందన్నారు. తన చిత్ర టీజర్‌కు శివ మనసుల పుష్ప అనే టైటిల్ సర్టిఫికెట్ పొందానని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. తాను సామాజిక పరమైన సమస్యలపై తరచూ ఫిర్యాదులు చేస్తుంటానని, అందుకే తన చిత్రం విషయంలో రాజకీయ జోక్యం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. తాను దక్షిణ భారత నటీనటుల సంఘంలో సభ్యుడిగా ఉన్నానని, తన చిత్రం టైటిల్ విషయాల్లో సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలుసని అన్నారు. ఫిర్యాదు చేస్తేనే ఈ సమస్యపై సంఘం జోక్యం చేసుకుంటుందా అని ప్రశ్నించారు. సర్టిఫికెట్ ఇవ్వడం సెన్సార్ బోర్డు బాధ్యత అని, దాన్ని నిలిపివేయడానికి వారికి అధికారం లేదని అన్నారు. శివ మనసుల పుష్ప చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు వారాహి తెలిపారు. -
ప్రజలంటే భయం ఉండాలి
‘‘నా ‘అన్నదాత సుఖీభవ’ సినిమా సెన్సార్‌కు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఫైనల్‌గా సెన్సార్ రివైజింగ్ కమిటీ అన్నదాత సుఖీభవ అని ప్రకటించింది’’ అన్నారు దర్శక– నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి. స్నేహ చిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఆయన రూపొందిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. సెన్సార్ రివైజింగ్ కమిటీ ‘యు’ సర్టిఫికెట్‌ను అందజేసింది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘అన్నం పెట్టే రైతు పరిస్థితి నేడు దారుణంగా ఉంది. అన్నదాత సుఖీభవలా లేదు.. దుఃఖీభవ అనేలా ఉంది. పాలకులకు ప్రజలంటే భయం ఉండాలి. అప్పుడే వ్యవస్థ బాగుంటుంది. ఈ చిత్రానికి రైతు సంక్షేమ సంఘాలు, వామపక్షాలు సహకరించాయి. ఈ నెల 14న పాటలను విడుదల చేసి జూన్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. -
అన్ని ఉండవు.. సెన్సార్ బోర్డు కట్ చేస్తుంది
తమిళసినిమా : అలాంటి వాటి గురించి అస్సలు పట్టించుకోను అంటోంది నటి రెజీనా కాసాండ్రా. ఈ అమ్మడికి నటిగా సక్సెస్‌లు ఉన్నా, రావలసిన పేరు తెచ్చుకోలేకపోయిందనే చెప్పాలి. తమిళం, తెలుగు అంటూ బహుభాషా నటిగా రాణిస్తున్నా, స్టార్ హీరోయిన్ స్థాయికి ఇంకా ఎదగలేదు. దీంతో ఇక లాభం లేదనుకుందో ఏమో నటి కంటే గ్లామర్‌నే నమ్మకున్నట్లు ఈ అమ్మడి తాజా చిత్రం చూస్తే తెలుస్తోంది. రెజీనా నటించిన తాజా చిత్రం మిస్టర్ చంద్రమౌళి. ఇందులో సీనియర్ నటుడు కార్తీక్, ఆయన కొడుకు గౌతమ్ కార్తీక్‌లతో కలిసి నటించింది. తిరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెజీనా అందాలారబోత విషయంలో రెచ్చిపోయిందనే చెప్పాలి. ఈత దుస్తులు, బికినీలు అంటూ ఎన్ని విధాలుగా శృంగారాన్ని ఒలకబోయాల్లో అన్ని విధాలు శక్తివంచన లేకుండా చేసేసిందనే చెప్పాలి. ఏ స్థాయిలో నటించిందంటే ఆ పాట దృశ్యాలను చూసిన దర్శకుడు సుశీంద్రన్ పాటలో అన్ని దృశాలు ఉండవు. సెన్సార్ బోర్డు కట్ చేస్తుంది అని చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపైనే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రెజీనా ఇచ్చిన భేటీ చూద్దాం. ప్ర: మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో తండ్రీకొడుకులు కార్తీక్, గౌతమ్ కార్తీక్‌లతో కలిసి నటించిన అనుభవం గురించి? జ: సూపర్ జాలీ. కార్తిక్ స్పాట్లో ఉంటే సందడే సందడి. సాధారణంగా సీనియర్ నటులతో నటిస్తున్నప్పుడు కాస్త సంక ట పరిస్థితిని ఎదుర్కొం టాం.అలాంటిది కార్తీక్‌తో నటించడం చాలా జాలీ అని పించింది. మేమంతా ఆయన చుట్టూ కూర్చుంటాం. ఆయన తన చిత్రాల గురించి, అనుభవాల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను చెప్పేవారు. కార్తీక్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నటన కంటే కూడా జీవి తాన్ని ఎలా సంతోషంగా గడపాలన్నది కార్తీక్ నుంచి తెలుసుకున్నా ను. ఆయన కొడుకు గౌతమ్ కార్తీక్‌తో నీపై చా లా బాధ్యతఉందని చాలా సార్లు చెప్పాను. ప్ర: హీరోయిన్గా నటిస్తూ తెలుగు చిత్రం ‘అ’ లో చాలా చిన్న పాత్రలో నటించడానికి అంగీకరించారే? జ: నిజం చెప్పాలంటే నేను హీరోయిన్గా నటించడం మొదలు పెట్టినప్పటి నుంచి చిత్రంలో నా పాత్ర చిన్నదా, పెద్దదా అని ఆలోచించలేదు. కథలో నా పాత్రకు ఏ మేరకు ప్రాధాన్యత ఉందన్నది గ్రహించే ప్రతిభ నాకుంది అ చిత్రంలో అలాంటి పాత్రనే లభించింది. చిత్రం చూసిన పలువురు నా నటనను ప్రశంసించారు. అలాంటి ప్రశంసలు విన్నప్పుడు పడ్డ కష్టాలు మరిచిపోతాను. ఆ చిత్రం కోసం ముక్కుకు రింగ్ పెట్టుకున్నాను. జుట్టు కట్ చేసుకున్నాను. వీపు వెనుక టాట్టు పొడిపించుకున్నాను. ఒక్కసారి మేకప్ వేసుకుంటే 24 గంటల తరువాతే తీసేదాన్ని అంత కష్టపడి నటించాను. భవిష్యత్‌తో ఇలాంటి ఒక పాత్రలో నటించాను చూడండి అని ధైర్యంగా చెప్పుకోవచ్చు. ప్ర:దక్షిణ సినిమా చాలా మారుతోందని ఇటీవల పేర్కొన్నారు. ఆ మార్పులేమిటో వివరిస్తారా? జ:మూడేళ్ల ముందు కంటే ఇప్పుడు విభిన్న కథలు, కథనాలను వింటున్నాం. స్క్రీన్‌ప్లేతో సహా కథను పూర్తిగా ఈ మెయిల్లో పంపి చదవమంటున్నారు. మేము బాగా నటించగలిగినా రిహార్సల్స్‌కు రాగలరా అంటూ మర్యాదగా పిలుస్తున్నారు. టీమ్ వర్క్, ప్రమోషన్, ప్రణాళిక అంటూ అదరగొడుతున్నారు. ఇవన్నీ మంచి పరిణామాలేగా. ప్ర: సరే. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హీరోహీరోయిన్లపై విమర్శలు, ఎగతాళి చేయడాలు అధికం అవుతుండడం గురించి? జ: నేను అన్ని కామెంట్స్‌ను చదవను. సమయం లభిస్తే అప్పుడప్పుడు చూస్తుంటాను. ఒక్కొక్కరి దృష్టి ఒక్కోలా ఉంటుంది. ఒక మహిళ రోడ్డులో వెళుతుంటే ఆమె ధరించిన దుస్తులు నాకు సూపర్‌గా ఉన్నాయనిపించవచ్చు. మరొకరికి అసభ్యంగా అనిపించవచ్చు. అది చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది కాబట్టి విమర్శలను, వెటకారాలను నేను పట్టించుకోను. ప్ర: హీరోయిన్లకు గ్లామర్ చాలా ముఖ్యం. దాన్ని కాపాడుకోవడానికి ఎలాంటివి పాటిస్తుంటారు? జ: ఇప్పుడు అందరికీ ఫిట్నెస్ చాలా ముఖ్యం. నేను కొన్ని సమయాల్లో షూటింగ్ పూర్తి అయిన తరువాత సంతోషంగా ఉంటే ఇంటికెళ్లగానే వర్కౌట్స్ చేస్తాను. నాకు జిమ్‌కు వెళ్లడం అస్సలు నచ్చదు. ఇంటి పక్కన ఉన్న పార్క్‌లోకి వెళ్లి జాగింగ్ చేస్తాను. అక్కడ నన్నెవ్వరూ గుర్తుపట్టరు. -
రివైజింగ్ కమిటీకి వెళతా
‘‘బడా పారిశ్రామికవేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు. కానీ రైతు అప్పు కట్టకపోతే పొలాల్ని, ఇంటిని జప్తు చేస్తారు. వాటిని నా ‘అన్నదాత సుఖీభవ’ చిత్రంలో చూపించా. సినిమాకి కీలకమైన ఆ సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డ్ చెప్పడం బాధ కలిగించింది. అసలు రైతుల బాధలను చూపించాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రం తీశా’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. ఈ నెల 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు చెప్పిన సన్నివేశాల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘దేశానికి వెన్నెముక రైతు అంటారు. అన్నం పెట్టే అన్నదాత పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. నోట్ల రద్దు వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీఎస్టీ వల్ల వేల కోట్ల ధనం ప్రజలు కోల్పోతున్నారు. ఈ అంశాలన్నింటినీ మా సినిమాలో ప్రస్తావించా. ఈ నెల 14న సినిమాను విడుదల చేయాలని మార్చిలో సెన్సార్‌కు అప్లై చేశా. వారం క్రితం సినిమా చూసిన సెన్సార్ బోర్డు నోట్ల రద్దు, జీఎస్టీ సన్నివేశాలను తొలగించాలని చెప్పడంతో ఒప్పుకున్నా. కానీ, సినిమాకి కీలకమైన రైతు సన్నివేశాలను తొలగించాలని చెప్పడంతో ఒప్పుకోలేదు. అందుకే నా సినిమాకు సెన్సార్ చేయలేదు. సెన్సార్ బోర్డు తీరుకు నిరసనగా నేను రివైజింగ్ కమిటీకి వెళ్తున్నా. 30 ఏళ్లుగా నేను ప్రజా సమస్యలపై మాత్రమే సినిమాలు తీస్తున్నా. సెన్సార్ విషయంలో శ్యామ్ బెనగల్ సూచనలను అమలు చేయాలని అన్ని ఇండస్ట్రీల నిర్మాతలు పోరాటాలు చేయాలి’’ అన్నారు. -
14 కాదు.. కొన్నే!
అవును. పధ్నాలుగు కాదు.. కొన్నే! ఏంటీ కన్ఫ్యూజ్ అవుతున్నారా? మరేం లేదు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 14 కట్స్ ఇచ్చిందని, ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిందనే వార్త జోరుగా ప్రచారమవుతోంది. పా. రంజిత్ దర్శకత్వంలో వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై హీరో, రజనీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వండర్‌బార్ ఫిల్మ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినోద్ స్పందిస్తూ – ‘‘మా సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ రావడం వాస్తవమే. కానీ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారనీ, సెన్సార్ బోర్డ్ 14 కట్స్ చెప్పారని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. సెన్సార్ బోర్డ్ సభ్యులు కొన్ని కట్స్ చెప్పారు కానీ 14 మాత్రం కాదు’’ అని పేర్కొన్నారాయన. ‘కాలా’ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. మరోవైపు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ బ్యానర్‌కు రజనీకాంత్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని కోలీవుడ్ టాక్. ఇది నిజం కాదని కార్తీక్ సుబ్బరాజ్ స్పష్టం చేశారు. ‘‘తలైవర్‌తో (రజనీకాంత్) నేను చేయబోయే సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఉండదు. అది పూర్తి ఫిక్షన్ స్టోరీ. ఫ్యాన్స్ రజనీసార్ నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ సినిమాలో ఉంటాయి’’ అని పేర్కొన్నారు కార్తీక్ సుబ్బరాజ్. -
‘కృష్ణార్జున యుద్ధం’కు యు/ఎ సర్టిఫికెట్
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. గురువారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్న్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని ద్విపాత్రాభినయం చేస్తుండగా, అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ య్యూటూబ్‌లో మంచి వ్యూస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. హిప్ హాప్ తమిళ సంగీతం సమకూర్చాడు. -
పాలన ఇలాగేనా?!
ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘రాణి పద్మిని’ పేరుతో ప్రారంభించిన చిత్రం ‘పద్మావతి’గా, ఆ తర్వాత ‘పద్మావత్’గా మారడమే కాదు... సెన్సార్ బోర్డు కత్తిరింపులనూ, ఆ సినిమాపై కత్తులు నూరిన కర్ణిసేన ‘మనో భావాలను’ గుర్తించి మసులుకున్నా దానికి కష్టాలు తప్పలేదు. 68వ గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు గురువారం అది దేశవ్యాప్తంగా విడుదల కాబో తుండగా అన్ని రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అల్లరి మూకలు వీధుల్లో వీరంగం వేస్తున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. థియేటర్లు, షాపింగ్ మాల్స్, బస్సులు, కార్లు, మోటారు సైకిళ్లు, ఇతర ఆస్తులు తగలబడుతున్నాయి. హర్యానాలోని గురుగ్రాంలో పసివాళ్లతో వెళ్తున్న పాఠశాల బస్సును కూడా వదలకుండా రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. అందులోని పిల్లలనూ, టీచర్లునూ భీతావహుల్ని చేశారు. మరో పాఠశాల బస్సును దహనం చేశారు. సెన్సార్ బోర్డు అనుమతి లభించిన ‘పద్మావత్’ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని, దానికి అన్నివిధాలా భద్రత కల్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పాక కూడా ఇదంతా యధేచ్ఛగా సాగుతోంది. వీధుల్లోకి వస్తున్న వేలమందిని నియంత్రించడానికి అవసరమైన పోలీసు బందోబస్తు కల్పించకుండా ఆ ప్రభుత్వాలన్నీ అటు రాజ్యాంగబద్ధమైన కర్తవ్యాన్ని, ఇటు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనూ బేఖాతరు చేశాయి. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులే కర్ణిసేనతో సమానంగా, కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువగా ఆ చిత్రానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని గుర్తుంచుకుంటే ఇలాంటి హింసాత్మక ఘటనలు అక్కడే ఎందుకు చోటుచేసుకుంటున్నాయో సులభంగానే అర్ధమవుతుంది. పైగా ఈ గొడవంతకూ బాధ్యత ‘పద్మావత్’ తీసిన సంజయ్ లీలా భన్సాలీదేనని హర్యానా మంత్రి అనిల్ విజ్ ప్రకటించి అందరినీ నివ్వెరపరిచారు. ఈసారి గణతంత్ర దినోత్సవానికి సింగపూర్, ఇండొనేసియా, మలేసియా, వియత్నాం, బ్రూనై తదితర ఆగ్నేయాసియా దేశాల(ఆసియాన్) అధినేతలు పదిమంది ముఖ్య అతిథులుగా వస్తున్నారని, వారు దేశంలో అడుగుపెట్టిన రోజున చానెళ్లన్నిటా ఈ హింసే ప్రధాన వార్తయితే దేశం పరువు పోతుందన్న కనీస జ్ఞానం కూడా అక్కడి ప్రభుత్వాలకు కొరవడింది. గురుగ్రామ్ బహుళజాతి సంస్థలకు ప్రసిద్ధి. అక్కడ అనేక భారీ పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, సాఫ్ట్వేర్ సంస్థలు పనిచేస్తున్నాయి. వేలకొలది కార్మికులు, ఉద్యో గులు ఆ నగరంలో పనిచేస్తున్నారు. పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకూ అక్కడ వందల సంఖ్యలో విద్యా సంస్థలున్నాయి. అది దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో భాగం. అలాంటిచోట అల్లరిమూకలు రోడ్లపైకొస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు... కేంద్ర ప్రభుత్వానికి సైతం అప్రదిష్ట. చిత్ర మేమంటే ఇంతచేటు హింస జరిగినా బీజేపీ ప్రతినిధులెవరూ చానెళ్లలో జరిగిన చర్చలకు రాలేదు. ఆ పార్టీ వైఫల్యాలను సొమ్ము చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించే ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మోహం చాటేసింది. ఈమధ్య వ్యంగ్యమైన ట్వీట్లు ఇవ్వడంలో ముందుంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం పత్తాలేరు. కులాల పేరిటా, మనోభావాల పేరిటా ఎవరు ఏం చేసినా దేశ ప్రజలకు దిక్కూ మొక్కూ లేదన్నమాట! మన రాజ్యాంగం పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛతో సహా ఎన్నో హక్కుల్ని కల్పించింది. చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పింది. ఏవో కొన్ని గ్రూపులు మతం పేరు చెప్పుకుని, కులం పేరు చెప్పుకుని మనోభావాలు దెబ్బ తిన్నాయని రోడ్డెక్కుతుంటే, సమాజం మొత్తంపై తమ అభిప్రాయాలను బల వంతంగా రుద్దాలని ప్రయత్నిస్తుంటే ప్రభుత్వాలన్నీ చేష్టలుడిగి చూస్తున్నాయి. తమకు నచ్చని అభిప్రాయాలను వ్యక్తం చేసిన వ్యక్తులపై, సంస్థలపై విరుచుకుపడే ఈ ప్రభుత్వాలు ఇలాంటి గ్రూపుల ముందు సాగిలపడుతున్నాయి. వాటికి వ్యతిరేకిస్తే తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందన్న భయంతో వణుకుతున్నాయి. ఆ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనైనా ధిక్కరించడానికి సాహసిస్తు న్నాయి. అది చలనచిత్రం కావొచ్చు... ఒక పుస్తకం కావొచ్చు... మరో కళాత్మక చిత్రం కావొచ్చు–దేన్నయినా నచ్చలేదని, విభేదిస్తున్నానని చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. మన రాజ్యాంగం సైతం హక్కులకు కొన్ని పరిమితులను కూడా విధించింది. కానీ ఆ పరిమితుల పేరిట భావప్రకటన హక్కునే కాలరాయాలని చూడటం ప్రభు త్వాలకైనా, ప్రైవేటు గ్రూపులకైనా తగని పని. కేజ్రీవాల్‌పై ‘యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మాన్’ పేరిట నిర్మించిన డాక్యుమెంటరీలో తనకు సంబంధించి పెట్టిన పాత్రను వక్రీకరించారని, అది న్యాయస్థానంలో తనపై ఉన్న కేసును ప్రభావితం చేసేలా ఉన్నదని ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మొన్న నవంబర్‌లో తీర్పునిస్తూ సృజనాత్మకతకు సంకెళ్లు విధించే ధోరణులను అనుమతించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. మనోభావాలు దెబ్బతిన్నాయన్న పేరిట సృజనాత్మక వ్యక్తీకరణలను శిలువ ఎక్కించడం తగదన్నది. ఆ తీర్పు వెలువడి మూడు నెలలైనా కాలేదు... ప్రభుత్వాలన్నీ ‘పద్మావత్’పై పగబట్టినట్టు వ్యవహరించాయి. ఆ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చి దాదాపు 25 రోజులవుతోంది. ఆ సినిమా చూడనే చూడం... మేం వద్దన్నాం గనుక విడుదలను ఆపాల్సిందేనని ఆగ్రహించే కర్ణిసేన సంగతలా ఉంచి ప్రభుత్వాల్లో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారో, బీజేపీ ముఖ్యులో దాన్ని వీక్షించి ఏమున్నదో తెలుసుకుంటే, వాటిపై తమకున్న అభ్యంతరాలేమిటో న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తే వేరుగా ఉండేది. నిజానికి చిత్రం చూసినవారు అది రాజపుట్ గౌరవప్రతిష్టలను, పద్మావతి పాత్రను ఉన్నతంగా చూపిందని అంటున్నారు. కనీసం నిజానిజాలేమిటో తెలుసు కోవాలన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించేవారిని అదుపు చేయలేకపోతే చట్టబద్ధ పాలన దెబ్బతింటుందని, అది అంతిమంగా అరాచకానికి దారితీస్తుందని ప్రభు త్వాలు గ్రహించాలి. -
కోరెగావ్ ఓ శౌర్య ప్రతీక
సందర్భం మహర్ తెగ ప్రజలు యుద్ధవీరులు. శివాజీ సైన్యంలో వీరి శౌర్యం దేదీప్యమానంగా వెలిగింది. కశ్మీర్‌పై పాక్ దండయాత్రను వీరోచితంగా అడ్డుకున్న చరిత్ర వీరిది. కానీ దాన్ని సమాజంలో చీలికలకు ఉపయోగించుకోవడం కూడనిపని. రెండువందల సంవత్సరాల క్రితం పూనాకు 40 కి.మీ.ల దూరంలో భీమానది ఒడ్డున ఆంగ్లేయుల సైన్యానికి, పీష్వా సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. 1818 సం‘‘లో కోరేగావ్ వద్ద జరిగిన యుద్ధంవల్ల మరాఠా సామ్రాజ్యం పూర్తిగా పరాజితం అయింది. ఆనాటి ఆంగ్లసైన్యంలో ‘మహర్’లు గణనీయంగా ఉన్నారు. ఆ యుద్ధంలో చనిపోయిన మహర్ సైనికులను స్మరిస్తూ అంబేడ్కర్ అనుయాయులు గత అనేక సంవత్సరాలుగా శౌర్యదినంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ శౌర్యదినాన్ని నిర్వహించడానికి వేలాదిమంది అంబేడ్కర్ అనుయాయులు కోరేగావ్ వద్దగల స్మారకం వద్ద కలుస్తుంటారు. ఈ ఉత్సవాలను ఇంతకాలం మిగిలిన సమాజం పెద్దగా పట్టించుకోలేదు. జనవరి 2వ తేదీన నిర్వహించిన ప్రదర్శనపై రాళ్ళురువ్వటం, 3వ తారీఖున నిర్వహించిన బంద్‌తో జరిగిన దుర్ఘటనలవల్ల కోరేగావ్ చరిత్ర మహారాష్ట్రలోని ఇంటింటికీ తెలిసింది. మహర్ తెగ ప్రజలు యుద్ధవీరులు. శివాజీ సైన్యంలో వీరి పరాక్రమం దేదీప్యమానంగా వెలిగింది. 1947లో పాకిస్తాన్ కశ్మీర్‌పై దండయాత్ర చేసినపుడు డా‘‘బాబా సాహెబ్ అంబేడ్కర్ సలహా మేరకు పాకిస్తాన్ దురాక్రమణను ఎదుర్కొనడానికి మహర్ బెటాలి యన్ని పంపారు. అక్కడ మహర్ సైనికులు చేసిన వీరోచిత యుద్ధం స్వర్ణాక్షరాలతో రాయగలిగిన చరిత్ర. భారత సేనాపతి, తదితర ఉన్నత అధికారులు, ‘‘హిందూ సైన్యంలో మహర్ సైనికులు అత్యంత శ్రేష్ఠవీరులు’’ అని బహిరంగంగా అనేకసార్లు కొనియాడారు. 1947 డిసెం బర్ 24న ఝాంగర్ వద్ద భీషణ సంగ్రామం జరిగింది. మహర్ సైనికుల వద్ద గల తుపాకులలో గుండ్లు అయిపోయాయి. అయినా మహర్ సైనికులు ముష్ఠి యుద్ధంతోనే పాక్ సైన్యం ఆక్రమణను విజయవంతంగా ఎదుర్కొన్నారు. తర్వాత మహర్ సైనికులలో ఒకరిని ‘మహావీరచక్ర,’ మరొక 5 మందిని ‘వీరచక్ర’ లతో సన్మానించారు. డిసెంబర్ 24ని మహర్లు, మొత్తం భారత సమాజం నిజమైన శౌర్యదినోత్సవంగా జరుపుకోవాలి. ప్రకాశ్ అంబేడ్కర్, వామపక్ష భావజాల మేధావులకు 24 డిసెంబర్‌ని శౌర్యదినంగా నిర్వహించటం ఇష్టం ఉండదు. పీష్వాలు జన్మతః బ్రాహ్మణులు. కానీ వీరు స్వయంగా రాజులు కాదు, శివాజీ అనుయాయులకు ప్రతినిధులుగా వారు యుద్ధం చేశారు. పీష్వాల పరాజ యమంటే మరాఠా మహాసామ్రాజ్యపు పతనమే. ఇంత సరళమైన విషయాన్ని ‘బ్రాహ్మణ పరాజయం’గా పేర్కొనడం వామపక్ష చరిత్రకారుల ప్రత్యేకత. జనవరి 2న కోరేగావ్ ప్రదర్శనపై రాళ్లురువ్విన సంఘటనలు, దాడులు అత్యంత ఖండనీయం. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని ప్రకాశ్ అంబేడ్కర్ మహారాష్ట్ర 3 రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ ప్రారంభమైన పదిగంటలకే ప్రకాశ్ అంబేడ్కర్ బంద్‌ను ఉపసంహరించుకోవలసి వచ్చింది. ప్రభుత్వ బస్సులపై, ప్రైవేటు వాహనాలపై నీలం జెండాలతో ఉద్యమకారులు రాళ్లు రువ్వారు, దాడులు చేశారు. పలువురు అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదుపు తప్పిన ఉద్యమ కారుల వ్యవహారశైలి కారణంగా సామాన్య మహారాష్ట్ర ప్రజానీకంలో ఒక అసంతృప్తి ఏర్పడింది. డా‘‘ బాబాసాహేబ్ అంబేడ్కర్ బంధుభావనకు (సోదర భావనకు) అత్యంత ప్రముఖస్థానం ఇచ్చారు. ‘బంధుభావం అంటే మానవత్వం, ధర్మానికి మరోపేరు’ అని వారు పేర్కొన్నారు. పౌరులందరిలో బంధుభావన అనుభూతిని కలిగించాలి. భారతీయులమందరమూ మన మొక్కటే, మనమందరం సమానులం అనే భావన ఆలోచనలో, ఆచరణలో వ్యక్తం కావాలి, ఇది అత్యంత కష్టమైన పనే అని పేర్కొన్నారు. ఈ అనుభూతిని, సమరసతను నిర్మాణం చేయటంకోసం వివిధ వర్గాల ప్రజలమధ్య సద్భావన కోసం గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఈ బంద్ కారణంగా ప్రకాశ్ అంబేడ్కర్‌వంటి కొద్దిమంది అంబేడ్కర్‌వాదులకు రాజకీయ లబ్ధి లభించవచ్చునేమో, సాధారణ అంబేడ్కర్ వాదులకు ఈ సంఘటనలు మింగుడుపడని ఘటనలుగా మిగిలిపోయాయి. అంబేడ్కర్ అనుయాయులకు మిగిలిన సమాజం మధ్య అగాధాన్ని ఇవి మరింతగా పెంచాయి. ఒకనాడు మరాఠా విశ్వవిద్యాలయం పేరును డా‘‘ బాబా సాహెబ్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పేరుగా మార్చే ప్రతిపాదన పెద్ద వివాదం లేవదీసింది. ఈ వివాదం చాలాకాలం కొనసాగింది. సామాజిక సమరసతా మంచ్ కార్యకర్తగా ‘‘డా‘‘అంబేడ్కర్ జాతీయ నాయకుడు, ఒక కులనాయకుడు కాదు’’ అంటూ మహా రాష్ట్ర సమాజంలోని అన్ని కులాలు, వర్గాల ప్రజలను కలిసి నచ్చచెప్పి, మరాఠా విశ్వవిద్యాలయం పేరును డా‘‘ అంబేడ్కర్ మరాఠా విశ్వవిద్యాలయంగా ప్రజలం దరి ఏకాభిప్రాయంతో మార్పుచేయించిన ఘటనలో నేను ఒక కార్యకర్తగా పనిచేయటం నా జీవితంలో మర్చిపోలేని ఆనందకరమైన సంఘటన. ప్రకాశ్ అంబేడ్కర్ వంటి కొద్దిమంది నాయకుల ధోరణివల్ల నేడు మహా రాష్ట్ర సమాజం రెండుముక్కలైంది. దీనికి ఎవరు బాధ్యులు? ఫడ్నవిస్, మోదీ, భాగవత్‌లను కొత్త పీష్వా లుగా బ్రాహ్మణ ద్వేషంతో దూషించటం ప్రకాష్ అంబేడ్కర్ తదితర నాయకులకు ఆనందం కలిగి ఉండవచ్చును. కానీ ఈ దుర్ఘటన సందర్భంగా ఏర్పడిన పరిణామాలపై వీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. - రమేష్ పతంగే వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యులు