రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రంలోని రారా సరసకు రారా అనే పాటలోని పల్లవినే టైటిల్‌గా చేసుకొని రూపొందిన చిత్రం 'రారా సరసకు రారా'. స్కై లాండర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఏ జయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ద్వారా కేశవ్ దబర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ తదితర భాషల్లో సుమారు 350కి పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు.
(ఇది చదవండి: వరుణ్- లావణ్య పెళ్లి వేడుక.. వేదిక ఎక్కడో తెలుసా?)
ఈ చిత్రంలో కార్తీక్, గాయత్రి పటేల్, బాల, మారి, వినోద్, కాట్పాడి రాజన్, విశ్వ, రవివర్మ, అభిషేక్, బెంజిమిన్, సిమ్రాన్, దీపిక, గాయత్రి, జేపీ, జయవాణి అక్షిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర వివరాలను నిర్మాత ఏ.జయలక్ష్మి తెలుపుతూ ఓ రాత్రిలో జరిగే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు.
బళ్లారి రాజా, దామోదరం అనే ఇద్దరు రాజకీయాల్లో కలిసి ఉంటూ ఆ తర్వాత శత్రువులుగా మారుతారన్నారు. కాగా బళ్లారి రాజా చేసిన పనికి ఒక యువతి చూసిందన్నారు. దీంతో ఆమెను చంపటానికి బళ్లారి రాజా తన మనుషులను పురమాయిస్తాడన్నారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి ఒక హాస్టల్లో తలదాచుకుంటుందన్నారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నదే చిత్రం కథ అని చెప్పారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏకంగా 60 కట్స్ ఇచ్చిందన్నారు. ఆ కట్స్‌కు అంగీకరిస్తేనే ఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారన్నారు. తాము ముంబైలోని రివైజింగ్ కమిటీకి వెళ్లి తక్కువ కట్స్‌తో ఏ సర్టిఫికెట్ పొందినట్లు చెప్పారు. చిత్రాన్ని నవంబర్ 3వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
(ఇది చదవండి: కష్టాల్లో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడిచాడు: ఇలియానా)
Comments
Please login to add a commentAdd a comment