Kollywood movies
-
కోలీవుడ్ సినిమాలపై టాలీవుడ్ అభ్యంతరం
-
నయన్‌కు మరో క్రేజీ ఆఫర్.. స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్!
దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్ నయనతార మరో బాలీవుడ్ చిత్రానికి రెడీ అవుతున్నారా? అన్న ప్రశ్నలకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఒక పక్క పిల్లలు, భర్త అంటూ సంసార జీవితంలో ఎంజాయ్ చేస్తునే మరో పక్క నటిగా బిజీగా ఉన్న ఏకై క నటి నయన్. దక్షిణాదిలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార చాలా కాలంగా తరువాత ఇటీవలే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమె నటించిన తొలి చిత్రం జవాన్ సూపర్‌హిట్ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్‌ను పూర్తి చేశారు. అందులో ఒకటి మన్నాంగట్టి సిన్స్ 1960. దర్శకుడు డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటుడు యోగిబాబు, దేవదర్శిని, గౌరి కిషన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యాన్ లోల్డన్ సంగీతం, ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది ప్రారంభమైంది. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందుతోంది. కాగా ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే నయనతార తన పోర్షన్‌ను పూర్తి చేశారట. అలాగే ఈమె నటిస్తున్న మరో చిత్రం టెస్ట్. నటుడు మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ క్రీడ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా జవాన్ చిత్రంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సక్సెస్‌ను అందుకున్న నయనతారకు అక్కడ మరో సూపర్ అవకాశం వరించినట్లు తాజా సమాచారం. సూపర్ హిట్స్ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఈమె నాయకిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్. -
సడన్‌గా ఓటీటీ వచ్చేసిన స్టార్ కమెడియన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం, మేఘా ఆకాష్ జంటగా నటించిన వడక్కుపట్టి రామసామి. పీరియాడికల్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు కార్తిక్ యోగి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 1960-70 కాలంలో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందించారు. మంగళవారం నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. స్టార్ కమెడియన్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అభిమానుల అంచనాలను అందుకోవడంపై బోల్తా కొట్టింది. కానీ గతంలో సంతానం - కార్తిక్ యోగి కాంబినేషన్లో వచ్చిన డిక్కీలోనా అనే మూవీ కమర్షియల్ సక్సెస్ కావడంతో వడక్కుపట్టి రామసామిపై అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. కేవలం రూ.5.5 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు సాధించింది. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ సినిమాతోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం త్వరలోనే తెలుగులోనూ అందుబాటులోకి రానుందని టాక్. After a thundering response for the theatrical release, Fun-filled social drama #VadakkupattiRamasamy is now available on @PrimeVideoIN #VadakkupattiRamasamyOnPrime @karthikyogidir @akash_megha @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @RajaS_official @Sunilofficial… pic.twitter.com/rqAoormWfu — Santhanam (@iamsanthanam) March 12, 2024 -
కెప్టెన్ విజయ్‌కాంత్.. కుటుంబం నేపథ్యమిదే!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. కుటుంబ నేపథ్యమిదే.. విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. విజయ్‌కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్‌గా పేరు మార్చుకున్నారు. కె.ఎన్. అళగర్స్వామి, ఆండాళ్ ఆయన తల్లిదండ్రులు. 1990లో జనవరి 31న ఆయన ప్రేమలతను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి విజయ్ ప్రభాకర్, విఘ్నేష్ పాండియన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండియన్ సగప్తం, మధుర వీరన్ చిత్రాల్లో నటించారు. విజయ్ కుటుంబం చాలా పెద్దది. విజయ్‌కాంత్‌కు ఐదుగురు సోదరులు, ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌కాంత్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు. ఆయన డీఎండీకే పార్టీ ఎన్నికల సమయంలో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోకపోవడం విశేషం. -
ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. టీజర్‌తోనే భయపెట్టేశాడు!
కోలీవుడ్ హీరో ఆర్య తెలుగువారికి కూడా సుపరిచితమే. తన సినిమాలతో టాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ రోజుల్లో సినీ తారలు ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆర్య తొలి వెబ్ సిరీస్ 'ది విలేజ్' లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు మిలింద్ రాజు దర్శకత్వంలో.. బి.ఎస్. రాధాకృష్ణన్ నిర్మించారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ది విలేజ్ అనే గ్రాఫిక్ నవల ఆధారంగా హారర్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. టీజర్ రిలీజ్ చేసిన టీమ్.. రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది. ఈ నెల 24 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన టీజర్ ఈ సిరీస్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో దివ్య పిళ్లై, ఆడుకాలం నరేన్, జార్జ్ మయన్, పూజా రామచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా.. ఆర్య ప్రస్తుతం తెలుగులో సైంధవ్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వెంకటేశ్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. ఈ మూువీ 2024 జనవరి 13న విడుదల కానుంది. dare to venture into ‘the village' where darkness holds the secrets! 🌙#TheVillageOnPrime, Nov 24#Arya @milindrau #KiranKonda @thespcinemas @DivyaPillaioffl @ActorMuthukumar @Aazhiya_ @highonkokken @Poojaram22 @theabishekkumar #NaveenGeorgeThomas @ashwin_kkumar @arjunchdmbrm… pic.twitter.com/3muX5zC29w — prime video IN (@PrimeVideoIN) November 9, 2023 -
నటి రోహిణి చిత్రానికి అరుదైన ఘనత..!
లెన్స్, మస్కిటో ఫిలాసఫీ, తలైకూత్తల్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్ తెరకెక్కించిన చిత్రం కాదల్ ఎంబదు పొదువుడమై. ఈ చిత్రాన్ని ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్ర దర్శకుడు జియో బేబీ సమర్పణలో మెన్ కైండ్ సినిమాస్, నితీష్ ప్రొడక్షన్స్, సిమెట్రీ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి రోహిణి కీలకపాత్రలో నటించారు. ఆమెతో పాటు లిజోమోల్, వినీత్, కలేశ్ రామనాథ్, అనుష్క, దీప ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా కాదల్ ఎంబదు పొదువుడమై మూవీ 54వ ఇండియన్ పనోరమ అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైనట్లు మేకర్స్ తెలిపారు. తమిళ చిత్రం కాదల్ ఎంబదు పొదువుడమై ఎంపిక కావడం విశేషం. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరగనున్నాయి. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఈ ఆధునికకాలంలో మనుషుల భావాలు, దురాలోచనలు, సామాజిక పరిస్థితి, విజ్ఞానం వంటి అంశాలతో కూడిన ఆధునిక ప్రేమను ఆవిష్కరించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. కాగా 2023 ఏడాదిగానూ ఇండియన్ పనోరమ చిత్రోత్సవాలకు 408 చిత్రాలు నామినేట్ కాగా.. అందులో 25 చిత్రాలు మాత్రమే ఎంపికై నట్లు చెప్పారు. ఆ 25 చిత్రాల్లో తమ కాదల్ ఎంబదు పొదువుడమై చిత్రం చోటుచేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. ఈ సినిమాకు కన్నన్ నారాయణన్ సంగీతమందించగా.. శరవణన్ సినిమాటోగ్రఫీ అందించారు. -
ఒక్క రాత్రిలో జరిగే కథే 'రారా సరసకు రారా'!
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రంలోని రారా సరసకు రారా అనే పాటలోని పల్లవినే టైటిల్‌గా చేసుకొని రూపొందిన చిత్రం 'రారా సరసకు రారా'. స్కై లాండర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఏ జయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ద్వారా కేశవ్ దబర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ తదితర భాషల్లో సుమారు 350కి పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. (ఇది చదవండి: వరుణ్- లావణ్య పెళ్లి వేడుక.. వేదిక ఎక్కడో తెలుసా?) ఈ చిత్రంలో కార్తీక్, గాయత్రి పటేల్, బాల, మారి, వినోద్, కాట్పాడి రాజన్, విశ్వ, రవివర్మ, అభిషేక్, బెంజిమిన్, సిమ్రాన్, దీపిక, గాయత్రి, జేపీ, జయవాణి అక్షిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర వివరాలను నిర్మాత ఏ.జయలక్ష్మి తెలుపుతూ ఓ రాత్రిలో జరిగే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. బళ్లారి రాజా, దామోదరం అనే ఇద్దరు రాజకీయాల్లో కలిసి ఉంటూ ఆ తర్వాత శత్రువులుగా మారుతారన్నారు. కాగా బళ్లారి రాజా చేసిన పనికి ఒక యువతి చూసిందన్నారు. దీంతో ఆమెను చంపటానికి బళ్లారి రాజా తన మనుషులను పురమాయిస్తాడన్నారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి ఒక హాస్టల్లో తలదాచుకుంటుందన్నారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నదే చిత్రం కథ అని చెప్పారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏకంగా 60 కట్స్ ఇచ్చిందన్నారు. ఆ కట్స్‌కు అంగీకరిస్తేనే ఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారన్నారు. తాము ముంబైలోని రివైజింగ్ కమిటీకి వెళ్లి తక్కువ కట్స్‌తో ఏ సర్టిఫికెట్ పొందినట్లు చెప్పారు. చిత్రాన్ని నవంబర్ 3వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. (ఇది చదవండి: కష్టాల్లో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడిచాడు: ఇలియానా) -
విశాల్ అలా అనడం కూడా సనాతనమే : నిర్మాత
తమిళసినిమా: సనాతనం గురించి రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలు మరో రకం సనాతనం అని నిర్మాత, నటుడు కార్తికేయన్ వెంకట్రామన్ అన్నారు. ఈయన అంగ్రి ఎంటర్టైన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎల్ఏల్పీ పతాకంపై నిర్మిస్తూ కథానాయకుడిగా నటించిన చిత్రం ఎనక్కు ఎండే కిడైయాదు. నూతన దర్శకుడు విక్రమ్ రమేష్ కథా, కథనం, దర్శకత్వం వహిస్తూ కథానాయికుడిగా నటిస్తున్న ఇందులో నటి స్వయం సిద్ధా నాయకిగా నటించారు. దళపతి రత్నం ఛాయాగ్రహణం, కళాచరణ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 6వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత, నటుడు కార్తికేయన్ వెంకట్రామన్ మాట్లాడుతూ తాను స్వతహాగా న్యాయవాదినని, అయితే సినిమాపై ఆసక్తితోనే నటుడినవ్వాలని థియేటర్ ఆర్టిస్టుగా శిక్షణ పొందినట్లు తెలిపారు. విక్రమ్ రమేష్ చెప్పిన కథ నచ్చడంతో చిత్ర నిర్మాణం చేపట్టానని, పలు సమస్యలకు ఎదురొడ్డి నిలిచి పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురు యువకుల మధ్య చిన్న పోరాటమే ఈ చిత్ర కథ అని తెలిపారు. కాగా ఇటీవలి కాలంలో నటుడు విశాల్ మూడు నాలుగు కోట్ల రూపాయలతో చిత్రం చేద్దామంటూ కొందరు వస్తున్నారని, అలా ఎవరూ రావద్దని అనడం కూడా ఒక రకమైన సనాతనమే అని అభిప్రాయపడ్డారు. ఇక్కడ అలా చెప్పే హక్కు ఎవరికీ లేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
విజయ్ సినిమాకు షాకిచ్చిన సెన్సార్ బోర్డ్.. ఆ సీన్లు కట్!
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లియో. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా త్రిష, ప్రియా ఆనంద్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 19వ తేదీన విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (ఇది చదవండి: ఫైర్ మీదున్న అమర్.. రెండో వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?) అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలోని నాన్ రెడీ వరవా అనే పాటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. అయితే ఈ పాట మొదటి నుంచి వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ పాటలో విజయ్ పొగ తాగే సన్నివేశాలతో పాటు వివాదాస్పద పదాలు చోటు చేసుకోవడంతో పలు తమిళ సంఘాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా అనొచ్చు మక్కళ్ కట్చి నిర్వాహకురాలు రాజేశ్వరి ప్రియ చిత్రంలోని నాన్ రెడీ పాటకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో సెన్సార్ సభ్యులు ఆ పాటలోని కొన్ని అభ్యంతర సన్నివేశాలను.. పాటలోని వివాదాస్పద పదాలను కట్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా విజయ్ సిగరెట్ పట్టుకుని క్లోజప్ సన్నివేశాలను తొలగించినట్లు తెలిసింది. అయితే ఈ పని పాట విడుదలకు ముందే చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ , దర్శకుడు మిష్కిన్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. (ఇది చదవండి: స్టైలిష్ లుక్‌లో ఉపాసన.. డ్రెస్ ధరెంతో తెలుసా?) -
వినూత్న కథాంశంతో తెరకెక్కిస్తోన్న 'రావెన్'!
అజయ్ కార్తీక్, అంజనా జంటగా నటిస్తోన్న చిత్రం 'రావెన్'. ఈ చిత్రం ద్వారా దర్శకుడు గణేష్ కె బాబు శిష్యుడు కళ్యాణ్ కె జగన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీని ఎంజీ స్టూడియోస్ అధినేత ఏపీవీ.మారన్‌తో కలిసి సంయక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నిర్మాత కలైపులి ఎస్ ధాను ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. వినూత్న కథాంశంతో కొత్త తరానికి చెందిన కథా చిత్రంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్త షూటింగ్ చైన్నె పరిసర ప్రాంతాల్లో ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈ చిత్రంలో దర్శకుడు భాగ్యరాజ్, ఈటీవీ గణేష్, వీర, హిందూమతి, పి.అరుణాచలేశ్వరన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి శక్తి చాయాగ్రహణం, మనం రమీశన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ లలిత్ కుమార్, ఫైవ్ స్టార్ కదిరేసన్, ఫైవ్ స్టార్ సెంథిల్, రాక్ ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్ మురుగానందం, అరుణ్ విశ్వ, డిస్ట్రిబ్యూటర్ కోవై అరవింద్, పోర్ తొళిల్ చిత్ర దర్శకుడు విగ్నేష్ రాజా, యాత్తిశై చిత్ర దర్శకుడు ధరణి రాజేంద్రన్, గుడ్ నైట్ చిత్ర దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. #Dada fame director #GaneshKBabu has penned the story and screenplay of a film called #Raven, which went on floors today! The film features newcomer Ajay Karthik and actor Nethra 's daughter Anchana in the lead. The film is being directed by Kalyan K Jegan. Produced by :-… pic.twitter.com/wsEZyUenfM — Cineobserver (@cineobserver) August 21, 2023 -
యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!
దర్శకుడు కేఎస్ రవికుమార్ తన ఆర్కే సెల్యులాయిడ్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం 'హిట్ లిస్ట్'. నటుడు శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కనిష్క హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీకి రవికుమార్ శిష్యులు సూర్య, కార్తికేయన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను విజయ్ సేతుపతి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. (ఇది చదవండి : ఆ కుటుంబం నుంచి కొత్త హీరో ఎంట్రీ.. ట్రైలర్ చూశారా?) పూర్తి యాక్షన్ ఎంటర్టైన్గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపుకుంటోంది. టీజర్ చూస్తే ఇది మంచి యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత కేఎస్ రవికుమార్ వెల్లడించారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, సముద్ర ఖని, మునీశ్కాంత్, నటి సితార, శతి వెంకట్, ఐశ్వర్య దత్త, బాలా సరవణన్, రెడిన్ కింగ్స్ లీ, అభినక్షత్ర, కేజీఎఫ్ చిత్రం ఫేమ్ గరుడ రామచంద్రా, అనుపమా కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సి. సత్య సంగీతాన్ని అందిస్తుండగా.. రాం చరణ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. (ఇది చదవండి : జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు) -
అతీంద్రియ శక్తులే కథాంశంగా వస్తున్న 'చిరో'
ప్రముఖ నిర్మాత ఎంఎస్ మంజూర్ రెండవ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. విభిన్న కథా చిత్రాలను నిర్మించాలన్న ఆసక్తితో ఈయన ప్రస్తుతం మిలియన్ స్టూడియోస్ పతాకంపై సత్యరాజ్ కథానాయకుడిగా వెపన్ అనే వైవిధ్య భరితమైన కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలోనే పరిశ్రమ వర్గాల్లో మంచి అటెన్షన్‌కు గురిచేస్తోంది. చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్ర నిర్మాత తదుపరి నిర్మిస్తున్న మరో చిత్రం చిరో. ఇంతకు ముందు పలు యాడ్ ఫిలిమ్స్ చేసిన వివేక్ రాజారామ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది ఫాంటసీ నేపథ్యంలో సాగే వైవిద్య భరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర కథలు చెప్పగానే నిర్మాతలు మంజూర్, అబ్దుల్ చాలా ఇంప్రెస్స్ అయ్యారన్నారు. ఇది ఒక్క జానర్లో సాగే కథాచిత్రంగా ఉండదని.. ప్రతి 20, 25 నిమిషాలకు జానర్ మారుతుందని ఆయన చెప్పారు. అతీంద్రియ శక్తులు కలిగిన యువతి కథే అతీంద్రియ శక్తులు కలిగిన ఓ యువతి ఇతివృత్తమే ఈ చిత్రం అన్నారు. ఇందులో కథానాయకిగా ప్రార్థనా చాబ్రియ నటించనున్నారని చెప్పారు. ఈమెది ఫాంటసీతో కూడిన ఫిక్షన్ కథా పాత్రగా ఉంటుందన్నారు. నటి ప్రార్థనా చాబ్రియను కలిసినప్పుడు ఆమె మాత్రమే ఈ పాత్రను చేయగలరని భావించారన్నారు. చిత్ర షూటింగ్‌ను సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కిషన్ సీవీ ఛాయాగ్రహణం అందించనున్న ఈ చిత్రం పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. View this post on Instagram A post shared by Million Studio (@millionstudioss) -
అర్ధరాత్రి తమిళుల ఊచకోత.. అసలేంటి 'వైట్ వ్యాన్ స్టోరీ'!
శ్రీలంకలోని తమిళులపై ఆ దేశ సైన్యం జరిపిన యుద్ధ కాండ గురించి ఇప్పటికే పలు చిత్రాలు రూపొందాయి. వాటికి మరో కోణంలో తెరకెక్కిన చిత్రం పెరల్ ఇన్ ది బ్లెడ్. దీన్ని దర్శకుడు కెన్ కందయ్య రూపొందిస్తున్నారు. లండన్‌లో నివసిస్తున్న శ్రీలంక తమిళుడైన ఈయన ఇంతకు ముందు రోమిమో రొమాన్స్ అనే ఆంగ్ల చిత్రానికి దర్శకత్వం వహించారు. దీనికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ రొమాంటిక్ డ్రామా కేటగిరీలో అమెరికా దేశ అవార్డులను గెలుచుకుందని దర్శకుడు చెప్పారు. (ఇది చదవండి: ఆయన వల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా.. కంటతడి పెట్టుకున్న హీరోయిన్) ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. 'శ్రీలంకలో తమిళుల ఊచకోత గురించి ఇంతకు ముందు చాలా చిత్రాలు రూపొందాయన్నారు. వాటిలో కొన్ని విజయవంతం అయినా, చాలా చిత్రాలు విడుదలే కాలేదని అన్నారు. కారణం అనేక రకాల సమస్యలేనని అన్నారు. తాను తెరకెక్కించిన పెరల్ ఇన్ ది బ్లెడ్ చిత్రం ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని అంశాలతో ఉంటుందన్నారు. ఇది శ్రీలంకలోని తమిళ ప్రజల వేదనలను ఆవిష్కరించే కథాంశంతోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న జాతి సమస్యలను తెలిపే కథా చిత్రంగా ఉంటుందన్నారు. అక్కడ జరిగే వైట్ వ్యాన్ స్టోరీని ఈ చిత్రంలో చెప్పినట్లు తెలిపారు. అర్ధరాత్రుల్లో ఎలాంటి నెంబర్లు లేని అనధికారిక వ్యానుల్లో దుండగులు వచ్చి శ్రీలంకలోని తమిళ ప్రజలను తీసుకుపోయి కర్కశంగా చంపే సంఘటనలే వైట్ వ్యాన్ స్టోరి అని తెలిపారు. వారు ఎవరూ? ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? వంటివి ఎక్కడా నమోదు కావన్నారు. (ఇది చదవండి: హీరోయిన్గా డైరెక్టర్ కూతురు.. మరీ ఇంత చీప్ రెమ్యునరేషనా?) ఇందులో నటుడు సంపత్‌రామ్ శ్రీలంక మిలటరీ అధికారిగా నటించారని.. ఆయనే ఈ చిత్రానికి బలం అని పేర్కొన్నారు. అదే విధంగా నటుడు జయసూర్య ముఖ్య పాత్రలో నటించినట్లు చెప్పారు. కాగా సెవెన్హిల్ పిక్చర్స్ యూనివర్శల్ మూవీ టోన్ పతాకంపై ఈయన నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో ఒక ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. -
హాఫ్ సెంచరీ కొట్టేందుకు ధనుష్ రెడీ.. ఈసారి స్పెషల్ అదే!
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. ఆయన తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా నటుడు, గాయకుడు, నిర్మాత, దర్శకుడు ఇలా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. అలా నటుడిగా 50 చిత్రానికి రెడీ అయిపోయారు. ఇటీవలే తన 49వ చిత్రం కెప్టెన్ మిల్లర్ షూటింగ్ పూర్తి చేసిన ధనుష్ తాజాగా మరో చిత్రానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైనట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. (ఇది చదవండి: 'సలార్' టీజర్ ఓకే.. కానీ డైరెక్టర్ని ఓ విషయంలో మెచ్చుకోవాలి!) ఆ పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న నటుడు ధనుష్ తనే దర్శకత్వం వహించనుండడం మరో విశేషం. నటుడు ఎస్జే సూర్య ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో నటి అపర్ణ బాలమురళి, నటుడు విష్ణు విశాల్, సందీప్ కిషన్, నటి దుషార విజయన్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఇందులో ధనుష్ సరసన నటి అమలాపాల్ నటించనున్నట్లు సమాచారం. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. (ఇది చదవండి: ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి) #D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5 — Dhanush (@dhanushkraja) July 5, 2023 -
ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!
కోలీవుడ్ హీరో విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం 'తంగలాన్'. ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్నారు. వినూత్నమైన కథా నేపథ్యంలో ఈ మూవీ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా మాళవిక మోహనన్ కనిపించనుండగా.. పార్వతి, పశుపతి, డేనియల్ కాల్టకిరోన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. (ఇది చదవండి: ఉప్పెన హీరోయిన్‌కు వేధింపులు.. ఏకంగా స్టార్ హీరో! ) అయితే ఈ ఏడాది తమిళంలో తెరకెక్కుతోన్న సినిమాల్లో భారీ అంచనాలు నెలకొన్న చిత్రమిది. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో లేదా సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ధనంజయన్ ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్‌లో తంగలాన్ చోటు దక్కించుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నాడు. అయితే ఆస్కార్ రేసుకు సంబంధించిన ఇంకా ఎలాంటి వివరాలు ఆయన వెల్లడించలేదు. ఆస్కార్ బరిలో నిలిచేందుకు ఈ సినిమాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం కోలార్ గోల్డ్ తవ్వకాల్లోని కార్మికులు తమ అధికారం కోసం పోరాడే నేపథ్యంలో సాగే కథా చిత్రం అన్నది తెలిసిందే. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ స్వరాలు సమకుర్చారు. (ఇది చదవండి: గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్‌తో మళ్లీ కనిపించిన హీరోయిన్!) -
వెయ్యి కోట్లు నమోదు చేసే సినిమా ఏదీ?
ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి అందరూ మాట్లాడుకునే వారు. బాహుబలి దెబ్బతో హిందీ ఇండస్ట్రీ వెనకపడి పోయింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ..చిన్న ఇండస్ట్రీ అయినా కన్నడ పరిశ్రమ నుండి కెజియఫ్ వచ్చింది. బాలీవుడ్లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. పఠాన్‌తో హిందీ పరిశ్రమ కూడా కోలుకునే ప్రయత్నం చేస్తుంది. దాదాపుగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. (చదవండి: మైసూర్ నవాబ్ మనవరాలిని సజీవసమాధి చేసిన భర్త.. 30 ఏళ్లుగా..) ఇలా అన్ని అన్ని వుడ్‌లలో భారీ హిట్లు నమోదు అవుతున్నాయి. మరి కోలీవుడ్ ఇండస్ట్రీ సంగతి ఎంటీ? వెయ్యి కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు? విక్రమ్ ,పొన్నియిన్ సెల్వన్ లాంటి మూవీస్ కోలీవుడ్‌లోనే భారీ వసూళ్లు రాబట్టాయి. తర్వాత ఇతర భాషల్లో విజయం సాధించిన కూడా అనుకున్నంత వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయాయి. మరి ఆ లోటు తీర్చే సినిమాలు కోలీవుడ్ నుండి ఎప్పుడు వస్తాయి? (చదవండి: మణిరత్నం మాటలకు ఐశ్వర్య ఎమోషనల్..కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు) పొన్నియిన్‌సెల్వన్ సినిమా ఐదు వందల కోట్లు కొల్లగొట్టింది. రెండో బాగం మీద అన్ని భాషల్లో బజ్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టే మూవీ టీం కూడా ప్రమోషన్లు చేస్తున్నారు. దాంతో ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ రాబడుతుందా లేదా అనే చర్చలు నడుస్తున్నాయి. ఏప్రిల్ 28 న మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక శివ దర్శకత్వంలో సూర్య హీరోగా కంగువ మూవీ రూపొందుతుంది. భారీ బడ్జెట్లో ఈ పిరియాడిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా బహుబలి మాదిరిగా రెండు బాగాలుగా తీసుకురావాలి అనుకుంటున్నారట మేకర్స్. కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ మూవీ మీద బాగానే ఆశలు పెట్టుకుంది. మరి ఫ్యూచర్లో తమిళ్ పరిశ్రమనుంచి..రాబోతున్న భారీ హిట్ సినిమా ఏది? పాన్ ఇండియా విజయం సాధించి వెయ్యి కోట్లు కొల్లగొట్టే మూవీ ఏదో తెలుగుసుకోవాలి అంటే కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. -
2022 నాకెంతో స్పెషల్.. విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్
సంచలన నటి నయనతార, దర్శకుడు విగ్నేశ్ శివన్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 2016 నుంచి సహజీవనం చేసిన జంట 2022 జూన్‌లో వివాహం చేసుకున్నారు. అయితే నయనతార విజయ్ సేతుపతి జంటగా నటించిన నానుమ్ రౌడీదాన్ చిత్రానికి విగ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. అప్పుడే నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఈ జంటకు సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. తాజాగా విఘ్నేశ్ శివన్ 2022కు గుడ్ బై చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. గతేడాదిలో జరిగి విషయాలను విఘ్నేశ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తనకు 2022 ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందన్నారు. నయనతారతో పెళ్లి, సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆశీస్సులు మరిచిపోలేనివని తెలిపారు. 2022లోనే ఇద్దరు పిల్లలు జన్మించడం దేవుడిచ్చిన వరమన్నారు విఘ్నేశ్. అలాగే 'కాతువాక్కుల రెండుకాదల్' మూవీ రిలీజ్, తమిళనాడు ప్రభుత్వం చెస్ ఒలిపింయాడ్ ఆహ్వానం, నయనతార 'కనెక్ట్' మూవీ, తన తదుపరి ప్రాజెక్ట్ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఏకే62 ఇందులో ప్రస్తావించారు. మధురమైన క్షణాలను మిగిల్చిన 2022కు గుడ్‌బై చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు శివన్. ఈ ఏడాది మరింత సంతోషంగా సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
సూపర్ స్టార్ బర్త్‌డే స్పెషల్... 9నుంచి రజనీ చిత్రోత్సవాలు
తమిళసినిమా: రజనీకాంత్ పుట్టినరోజు అంటే ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులకు పండగే. రజినీకాంత్ పుట్టినరోజున అభిమానులు ఆలయాల్లో పూజలు, అనాథాశ్రమాల్లో అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అలాంటిది ఈసారి ఇంకొంత స్పెషల్యాడ్ అవ్వడం విశేషం. రజనీకాంత్ ఈనెల 12న 71వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన గత 20 ఏళ్ల క్రితం కథ, కథనాన్ని సమకూర్చి నటించి నిర్మించిన చిత్రం బాబాను కొంత మార్పులు, చేర్పులతో సరికొత్త హంగులు చేర్చి విడుదల చేయడం ప్రత్యేకత అయితే రజనీకాంత్ చిత్రోత్సవాలు పేరుతో పీవీఆర్ సంస్థ ఈ నెల 9వ తేదీ నుం 15వ తేదీ వరకు ఆయన నటించిన హిట్ చిత్రాలను చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో రీ రిలీజ్ చేయడం మరో విశేషం. బాబా, శివాజి, 2.ఓ, దర్బార్ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. కాగా సరికొత్త హంగులతో రూపొందిన బాబా చిత్ర ప్రీమియర్ చెన్నైలోని సత్య థియేటర్లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకు నిర్మాత కలైపులి ఎస్.థాను, లతా రజనీకాంత్, గీత రచయిత వైరముత్తు పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు. లతా రజనీకాంత్ మాట్లాడుత 20 ఏళ్ల క్రితం చూసిన దానికంటే పదిరెట్లు సంతృప్తిని బాబా చిత్రం కలిగింందని పేర్కొన్నారు. థియేటర్లో అభిమానుల చప్పట్లతో చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారన్నారు. వారికి తమ కుటుంబంపై ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని అన్నారు. -
తమిళ్, తెలుగులో నాన్ యార్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం
క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రాలు కోలీవుడ్‌లో మినిమం గ్యారెంటీగా మారాయి. దీంతో ఈ తరహా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా రపొందుతున్న నాన్ యార్ చిత్రం ఈ కోవకే చెందుతుంది. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, బాధ్యతలను నిర్జన్ పల్నాటి నిర్వహిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో రపొందుతున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ వారసుడు కోలా బాలకృష్ణ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. నటి సాక్షి చౌదరి నాయకి. బాహుబలి ప్రభాకర్, తనిష్క్ రాజన్, నీరజా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఆర్జే శక్తి సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది క్రైమ్ నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రం అని చెప్పారు. నిత్యం జరిగే హత్యల వార్తలను పత్రికల్లో హెడ్లైన్లో చూస్తుంటామన్నారు. అలాంటి వాటి గురిం చిత్ర కథానాయకుడు అనలైజ్ చేస్తుంటాడని, అలాంటి సమయంలో అతని ప్రేయసిని ఒక ముఠా కిడ్నాప్ చేస్తారని చెప్పారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మరో పక్క కథానాయకుడు తన ప్రేయసి కోసం వెతుకుతుంటారన్నారు. ఇలా పలు ఆసక్తికరమైన సంఘటనలతో రెండు కోణాల్లో జరిగే కథే నాన్ యార్ చిత్రం అని చెప్పారు. -
చివరిగా మమతా మోహన్ దాస్‌ను ఎంపిక చేశాం: డైరెక్టర్
Mamta Mohandas Plays As Kanmani In Thangar Bachan Film: భారతీరాజా, యోగిబాబు, గౌతం మీనన్ ప్రముఖ పాత్రలతో తంగర బచ్చాన్ దర్శకత్వం ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ నెల 25 నుంచి కుంభకోణంలో షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'కరుమేగంగల్ కలైకిండ్రన్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. చెన్నై, రామేశ్వరం ప్రాంతాల్లో షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇంతకు ముందు ఎప్పుడూ తెరపై చూడనటువంటి వైవిధ్యభరిత అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడా రాజీ పడకుండా సహజత్వానికి దగ్గరగా ఈ చిత్రం ఉంటుందన్నారు. కణ్మణి అనే పాత్ర కోసం ఇండియాలోని పలు నటీమణులతో ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించిన చివరికి నటి మమతా మోహన్‌దాస్‌ను ఎంపిక చేసినట్టు తెలిపారు. అలాగే ఈ చిత్రంలో నటించడం గర్వంగా ఉందని మమతా మోహన్‌దాస్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్, ఆర్వీ ఉదయ్‌కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని శుక్రవారం (జులై 29) మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు వెల్లడించారు. -
బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్ చేయించారు: డైరెక్టర్
Selvaraghavan Says I Was Forced To Act In Naane Varuven: దర్శకుడిగా, నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్. ఇటీవలే మంచి పాత్రలో 'మహానటి' కీర్తి సురేశ్‌తో కలిసి 'చిన్ని' మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా 'సాని కాయిదమ్'కు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌గా ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 6న విడుదలైంది. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. నటుడిగా కీలక పాత్రలు చేస్తున్న సెల్వ రాఘవన్ ఇంతకుముందు సూర్య హీరోగా 'ఎన్జీకే' మూవీని డైరెక్ట్ చేశాడు. తాజాగా 'నానే వరువెన్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా ఈ మూవీలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'ఎవరి ఊహకందని విధంగా ఈ మూవీ ఉంటుంది. మీరు జరిగేది ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆడియెన్స్ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. అయితే ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర చేయాల్సిన యాక్టర్ చివరి నిమిషంలో రాలేదు. దీంతో మా యూనిట్ మొత్తం నన్ను ఆ పాత్ర చేయమని ఫోర్స్ చేశారు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం నుంచే చిత్రీకరణ జరగాలి. అంతేకాకుండా అది చాలా ముఖ్యమైన పాత్ర. మళ్లీ ఆ రోల్ చేసేందుకు వేరే ఎవరు లేరు. అందుకే ఎలాంటి ప్లాన్ లేకుండా ఇందులో నటించాల్సి వచ్చింది.' అని తెలిపాడు సెల్వ రాఘవన్. కాగా ఈ సినిమాలో ధనుష్ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. చదవండి: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు.. -
విజయ్ 'బీస్ట్'గా వచ్చేది అప్పుడే..
Vijay Pooja Hegde Starrer Beast Movie Release Date Out: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జోడిగా నటించిన చిత్రం 'బీస్ట్'. ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ బీస్ట్ మూవీ విడుదల తేది ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా పంచుకుంది. ఈ పోస్టర్లో విజయ్ గన్ పట్టుకుని సీరియస్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన అరబిక్ కుతు, జాలీ ఓ జింఖానా పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. అరబిక్ కుతు సాంగ్ అయితే యూట్యూబ్‌లో ఏకంగా 210 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకోగా జాలీ ఓ జింఖానా సాంగ్ 20 మిలియన్ వ్యూస్ సాధించింది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ 'బీస్ట్'కు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్లో కళానిధి మారన్ నిర్మాతగా బాధ్యతలు చెపట్టగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇదివరకు విడుదలైన పాటలతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే సినీ లవర్స్ ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం 'కేజీయఫ్ 2' మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. మరీ ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఎలా ఉంటుందో వేచి చూడాలి. #BeastFromApril13@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @selvaraghavan @manojdft @Nirmalcuts @anbariv #Beast pic.twitter.com/htH6dTPX2q — Sun Pictures (@sunpictures) March 22, 2022 -
వాళ్లని ఆడియో ఫంక్షన్‌కు పిలిస్తే బిజీ అన్నారు.. మాకు టైం వస్తుంది: ప్రముఖ దర్శకుడు
తమిళ సినిమా: గూగుల్ కుట్టప్ప చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ నటులను ఆహ్వానించినా షూటింగ్ ఉందంటూ వారెవరు రాలేమని చెప్పారని దర్శకుడు, నటుడు కేఎస్ రవికుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఇది వారి సీజన్ అని తమకూ ఒక సీజన్ వస్తుందని అన్నారు. తన ఆర్.కె. సెల్యూలాయిడ్ పతాకంపై నిర్మించి, ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గూగుల్ కుట్టప్ప. బిగ్‌బాస్ ఫేమ్ దర్శన్ , లాస్లియా హీరో హీరోయిన్ గా నటించిన ఇందులో యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కేశవ కుమార్ శిష్యులు శబరి, గుణ శరవణ్ కలిసి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ట్రైలర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం చెన్నైలో నిర్వహించారు. ఫెఫ్సీ, దర్శకుల సంఘాల అధ్యక్షుడు ఆర్.కె సెల్వమణి, విక్రమన్, ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, తంగర్ బచ్చన్ పాల్గొన్నారు. -
కిల్లర్ లుక్‌లో కమల్ హాసన్.. విక్రమ్ వచ్చేది అప్పుడే !
Kamal Haasan Vikram Movie New Poster Released: సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో విక్రమ్ ఒకటి. ఇందులో యూనివర్సల్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇదీవరకూ ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ తెగ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదిన ఎప్పుడూ ప్రకటిస్తారో ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ స్పెషల్ పోస్టర్లో కమల్ హాసన్ ఇంటెన్సివ్‌గా కిల్లర్ లుక్‌లో అదిరిపోయాడు. సూట్ ధరించి, చేతిలో కత్తి పట్టుకుని వైల్డ్‌గా కనిపిస్తున్నాడు. అలాగే ఈ పోస్టర్లో మార్చి 14న ఉదయం 7 గంటలకు విక్రమ్ సినిమా విడుదల తేదిని ప్రకటిస్తామని వెల్లడించారు. విక్రమ్ మూవీ నుంచి విడుదలైన ఈ స్పెషల్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట్ల తెగ వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్షెషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 110 రోజులపాటు షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీ చిత్రీకరణ కోసమే తమిళ బిగ్‌బాస్ అల్టిమేట్ నుంచి కమల్ హాసన్ తప్పుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న విక్రమ్ మూవీలో కమల్ హాసన్ పూర్తిగా యాక్షన్ రోల్ పోషించనున్నారు. ఇందులో అర్జున్ దాస్, శివానీ నారయణన్, నరేన్, కాళీదాస్ జయరామ్, ఆంటోనీ వర్గీస్ తదితరులు నటిస్తున్నారు. Vikram theatrical release date to be announced on MARCH 14th, 2022 at 7 Am@ikamalhaasan @VijaySethuOffl #fafa@anirudhofficial @RKFI @turmericmediaTM#KamalHaasan#VikramReleaseAnnouncement#Vikram pic.twitter.com/CvFNholC78 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 11, 2022 -
మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న బొద్దుగుమ్మ..
Poonam Bajwa Again Back To Kollywood Movies: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. లేదంటే ఎంట్రీ ఇచ్చిన వెంటనే లేదా కొన్ని రోజులకు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో చాలా మంది ముద్దుగుమ్మలే ఉన్నారు. ఈ జాబితాలో చెప్పుకోదగిన వాళ్ల వరుసలో ముందుంటుంది పూనమ్ బజ్వా. టాలీవుడ్లో ‘మొదటి సినిమా’తో తన మొదటి సినిమాను ప్రారంభించింది ఈ అమ్మడు. ఆ తర్వాత బాస్, పరుగు వంటి చిత్రాలతో నటించి మెప్పించింది కూడా. అప్పట్లో అందానికి, అభినయానికి ఏ మాత్రం కొదవ లేకపోవడంతో ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికింది అనుకున్నారంతా. కానీ తరువాత ఏం జరిగిందే ఏమో గానీ సీన్ రివర్స్ అయింది. మెలి మెల్లిగా వెండితెరకు దూరమైంది పూనమ్ బజ్వా. తర్వాత తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో అడపదడపా నటిస్తూ వచ్చిన ఈ బొద్దుగుమ్మ కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చదవండి: హాట్ టాపిక్‌గా శ్రుతిహాసన్ రెమ్యునరేషన్.. చిరు సినిమాకు అన్ని కోట్లా ? ఈ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ 'గురుమూర్తి' అనే చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమతోంది. నటరాజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ టాకీస్ పతాకంపై శివ చలపతి, సాయి శరవణన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేటీ ధనశేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిజాయితీపరుడైన పోలీసు అధికారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఆయన ఎలా ఛేదించి తన నిజాయితీని నిరూపించుకున్నారు. వంటి పలు ఆసక్తికరమైన ఘటనలతో ఈ చిత్రం రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. చదవండి: 100 కోట్ల క్లబ్లో అలియా చిత్రం.. ఎలా ఎంజాయ్ చేస్తుందంటే ?