
Poonam Bajwa Again Back To Kollywood Movies: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. లేదంటే ఎంట్రీ ఇచ్చిన వెంటనే లేదా కొన్ని రోజులకు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో చాలా మంది ముద్దుగుమ్మలే ఉన్నారు. ఈ జాబితాలో చెప్పుకోదగిన వాళ్ల వరుసలో ముందుంటుంది పూనమ్ బజ్వా. టాలీవుడ్‌లో ‘మొదటి సినిమా’తో తన మొదటి సినిమాను ప్రారంభించింది ఈ అమ్మడు. ఆ తర్వాత బాస్, పరుగు వంటి చిత్రాలతో నటించి మెప్పించింది కూడా. అప్పట్లో అందానికి, అభినయానికి ఏ మాత్రం కొదవ లేకపోవడంతో ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికింది అనుకున్నారంతా. కానీ తరువాత ఏం జరిగిందే ఏమో గానీ సీన్ రివర్స్ అయింది. మెలి మెల్లిగా వెండితెరకు దూరమైంది పూనమ్ బజ్వా. తర్వాత తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో అడపదడపా నటిస్తూ వచ్చిన ఈ బొద్దుగుమ్మ కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
చదవండి: హాట్ టాపిక్‌గా శ్రుతిహాసన్ రెమ్యునరేషన్.. చిరు సినిమాకు అన్ని కోట్లా ?
ఈ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ 'గురుమూర్తి' అనే చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమతోంది. నటరాజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ టాకీస్ పతాకంపై శివ చలపతి, సాయి శరవణన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేటీ ధనశేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిజాయితీపరుడైన పోలీసు అధికారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఆయన ఎలా ఛేదించి తన నిజాయితీని నిరూపించుకున్నారు. వంటి పలు ఆసక్తికరమైన ఘటనలతో ఈ చిత్రం రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.
చదవండి: 100 కోట్ల క్లబ్‌లో అలియా చిత్రం.. ఎలా ఎంజాయ్ చేస్తుందంటే ?
Comments
Please login to add a commentAdd a comment