Kamal Haasan: Vikram Movie New Poster Released: Release Date Announce Soon - Sakshi
Sakshi News home page

Vikram Movie: కిల్లర్‌ లుక్‌లో అదరగొడుతున్న కమల్‌ హాసన్‌..

Published Sat, Mar 12 2022 11:52 AM | Last Updated on Sat, Mar 12 2022 12:25 PM

Kamal Haasan Vikram Movie New Poster Released - Sakshi

Kamal Haasan Vikram Movie New Poster Released: సౌత్‌ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో విక్రమ్‌ ఒకటి. ఇందులో యూనివర్సల్‌ హీరో, లోకనాయకుడు కమల్‌ హాసన్‌, ఫహాద్ ఫాజిల్‌, విజయ్ సేతుపతి లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇదీవరకూ ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ తెగ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ సినిమా విడుదల తేదిన ఎప్పుడూ ప్రకటిస్తారో ప్రత్యేకమైన పోస్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ స్పెషల్‌ పోస్టర్‌లో కమల్‌ హాసన్‌ ఇంటెన్సివ్‌గా కిల్లర్‌ లుక్‌లో అదిరిపోయాడు. సూట్‌ ధరించి, చేతిలో కత్తి పట్టుకుని వైల్డ్‌గా కనిపిస్తున్నాడు. అలాగే ఈ పోస్టర్‌లో మార్చి 14న ఉదయం 7 గంటలకు విక్రమ్‌ సినిమా విడుదల తేదిని ప్రకటిస్తామని వెల్లడించారు. 

విక్రమ్‌ మూవీ నుంచి విడుదలైన ఈ స్పెషల్‌ పోస్టర్‌ ప్రస్తుతం నెట్టింట్ల తెగ వైరల్‌ అవుతోంది. లోకేష్‌ కనగరాజు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కోలీవుడ్‌ మ్యూజిక్ సెన్షెషన్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 110 రోజులపాటు షూటింగ్‌ జరుపుకుంది. ఈ మూవీ చిత్రీకరణ కోసమే తమిళ బిగ్‌బాస్‌ అల్టిమేట్‌ నుంచి కమల్‌ హాసన్‌ తప్పుకున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న విక్రమ్‌ మూవీలో కమల్‌ హాసన్‌ పూర్తిగా యాక్షన్‌ రోల్‌ పోషించనున్నారు. ఇందులో అర్జున్‌  దాస్‌, శివానీ నారయణన్, నరేన్‌, కాళీదాస్‌ జయరామ్‌, ఆంటోనీ వర్గీస్ తదితరులు నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement