మెటావర్స్‌ వెర్షన్‌లో 'విక్రమ్‌'.. తొలి మూవీగా రికార్డ్‌ | Kamal Haasan Launch Metaverse Experience Of Vikram Movie | Sakshi
Sakshi News home page

Vikram Movie: మెటావర్స్‌ వెర్షన్‌లో 'విక్రమ్‌'.. తొలి మూవీగా రికార్డ్‌

Published Wed, May 25 2022 1:36 PM | Last Updated on Wed, May 25 2022 1:47 PM

Kamal Haasan Launch Metaverse Experience Of Vikram Movie - Sakshi

Kamal Haasan Launch Metaverse Experience Of Vikram Movie: యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ కలిసి నటించిన చిత్రం 'విక్రమ్‌'. లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. నలుగురు సూపర్‌ టాలెంటెడ్‌ హీరోలు కలిసి నటించిన ఈ మూవీపై అంచనాలు మాములుగా లేవు. 

అయితే నటనతో ఆకట్టుకోవడమే కాదు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారు కమల్‌ హాసన్‌. ఈ సినిమాను మెటావర్స్‌ వెర్షన్‌లో రిలీజ్‌ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్‌ఎఫ్‌టీలు, వర్చువల్‌ రియాలిటీ టెక్నాలజీ మెటావర్స్‌ ద్వారా ఆడియెన్స్‌ ముందుకు వస్తున్న తొలి చిత్రంగా 'విక్రమ్‌' నిలవనుంది. దీనికి సంబంధించిన వివరాలను 'విస్టావర్స్‌' వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తేనున్నారు. ఈ వెబ్‌సైట్‌లో పోస్టర్లు, ఇంటర్వ్యూలు, లేటేస్ట్‌ అప్‌డేట్స్‌ తదితర అన్ని విషయాలు ఉంటాయి. 

చదవండి: 👇
రజనీ కాంత్‌తో ఇళయరాజా భేటీ.. కారణం ?
బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్‌ చేయించారు: డైరెక్టర్‌


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement