'విక్రమ్‌' రిలీజ్‌ డేట్‌ అదే.. అదరగొడుతున్న మేకింగ్‌ వీడియో | Kamal Haasan Vikram Movie Release Date With Making Video | Sakshi
Sakshi News home page

Vikram Movie: 'విక్రమ్‌' రిలీజ్‌ డేట్‌ అదే.. అదరగొడుతున్న మేకింగ్‌ వీడియో

Published Mon, Mar 14 2022 6:24 PM | Last Updated on Mon, Mar 14 2022 6:28 PM

Kamal Haasan Vikram Movie Release Date With Making Video - Sakshi

Kamal Haasan Vikram Movie Release Date With Making Video: సౌత్‌ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో 'విక్రమ్‌' ఒకటి. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీకి 'ఖైదీ' ఫేమ్‌ లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ తెగ ఆకట్టుకుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను సోమవారం (మార్చి 14) ప్రకటిస్తామని కమల్‌ హాసన్‌తో ఉన్న పోస్టర్‌ విడుదల చేశారు. అందుకు తగినట్లుగానే ఈ సినిమా విడుదల తేదిని సోమవారం ఉదయం చిత్రృందం అధికారికంగా ప్రకటించింది. సమ్మర్‌ కానుకగా జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నారు. 

ఈ రిలీజ్‌ డేట్‌తోపాటు విక్రమ్‌ మేకింగ్‌ వీడియోను ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంది మూవీ యూనిట్. ఇందులో యాక్షన్‌ సీన్స్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను చూపించారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్లిల్లర్‌గా సాగే ఈ మూవీలో తమిళ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి, మలయాళీ పాపులర్‌ యాక్టర్‌ ఫహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రల్లో అలరించనున్నారు. ఈ వీడియోలో వీరిద్దరిని చూపించిన తీరు ఆకట్టుకుంది. చూస్తుంటే చాలా రోజుల తర్వాత కమల్‌హాసన్‌ పవర్‌ఫుల్‌లో రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు కోలీవుడ్‌ మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement