Vikram: Lokesh Kanagaraj Confirms Suriya Cameo With Kamal Haasan - Sakshi
Sakshi News home page

Suriya In Vikram: 'విక్రమ్‌' మూవీలో హీరో సూర్య.. డైరెక్టర్‌ క్లారిటీ..

Published Mon, May 16 2022 2:10 PM | Last Updated on Mon, May 16 2022 3:14 PM

Vikram: Lokesh Kanagaraj Confirms Suriya Cameo With Kamal Haasan - Sakshi

Vikram: Lokesh Kanagaraj Confirms Suriya Cameo With Kamal Haasan: యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ కలిసి నటించిన చిత్రం 'విక్రమ్‌'. ఈ చిత్రానికి లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహించారు. కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం (మే 15) ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2 నిమిషాల 38 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్‌లో కమల్, విజయ్, ఫాహద్‌ ఫాజిల్‌ తమ నటనతో అదరగొట్టారు.  కాగా ఈ మూవీలో స్టార్‌ హీరో సూర్య కూడా నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. 

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజు స్పందించారు. విక్రమ్‌ మూవీలో ఈ మూగ్గురు స్టార్‌ హీరోలతోపాటు సూర్య కూడా నటిస్తున్నాడని స్పష్టం చేశారు. సూర్య ఒక కీలక పాత్రలో అలరించనున్నాడని తెలిపారు. మే 15న చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ట్రైలర్ రిలీజ్‌తో పాటు మూవీ ఆడియో లాంచ్‌ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలోనే విక్రమ్‌ చిత్రంలో సూర్య నటిస్తున్నాడని డైరెక్టర్ లోకేష్‌ తెలిపారు. ఇక ఈ నలుగురు స్టార్‌ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూస్తే ప్రేక్షకులకు, అభిమానులకు పూనకాలే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement