Confirmed
-
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు నిజమే: ఇటలీ
క్యాప్రి ఐలాండ్: పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్లో శుక్రవారం(ఏప్రిల్ 19) సంభవించిన పేలుళ్లు ఇజ్రాయెల్ పనేనని అమెరికా చెబుతోంది. ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి నిమిషంలో సమాచారం అందిందని జీ7 దేశాలకు అమెరికా తెలిపింది. ఈ విషయాన్ని ఇటలీలోని క్యాప్రి ఐలాండ్‌లో జరుగుతున్న జీ7 మీటింగ్‌లో ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంలోని న్యూక్లియర్ స్థావరాల సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. డ్రోన్ల కూల్చివేత కారణంగానే పేలుళ్ల శబ్దాలు వెలువడ్డాయని వెల్లడించింది. ఇటు ఇరాన్‌పై దాడుల సమయంలోనే అటు సిరియాపైనా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. కాగా, ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసింది. అయితే ఈ డ్రోన్లు, మిసైళ్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇరాన్ దాడుల వల్లే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ఇదీ చదవండి.. ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్‌లో మానవ బాంబు కలకలం -
ప్రిగోజిన్ మృతి.. రష్యా అధికారిక ప్రకటన..
పుతిన్ ప్రభుత్వంపై తిరుగుబాటుదారుడు, వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మరణించినట్లు రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. ఈ మేరకు జన్యు పరీక్షల రిపోర్టును బహిర్గతం చేసింది. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించాడనే వార్తల అనంతరం అనేక పుకార్లు వెలుగులోకి వచ్చాయి. ప్రిగోజిన్ మరణం వెనక రష్యానే కుట్ర పన్నిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల అనంతరం క్రెమ్లిన్ జన్యు పరీక్షలకు అనుమతినిచ్చింది. 'విమాన ప్రమాద ఘటన ద్యర్యాప్తులో భాగంగా జన్యు పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో ప్రిగోజిన్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఆయన విమాన ప్రమాదంలో మరణించారు.' అని ఇన్వెస్టిగేటివ్ కమిటీ అధికార ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో తెలిపారు. విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌తో పాటు మరో తొమ్మిది మంది అనుయాయులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ తొమ్మిది మందిలో డిమిత్రి ఉట్కిన్ ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా ఇంటెలిజెన్స్‌లో పనిచేసి, ప్రస్తుతం వాగ్నర్ గ్రూప్ నిర్వహణలో ప్రధాన వ్యక్తిగా అయన్ను చెప్పుకుంటారు. విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ట్రాఫిక్ ఉల్లంఘణలపై రష్యా దర్యాప్తు చేపట్టింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. విమాన ప్రమాదం.. పుతిన్‌పై తిరుగుబాటు చేసిన రెండు నెలల తర్వాత వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్.. రష్యాలోని మాస్కో నుంచి ప్రైవేట్ విమానంలో బయలుదేరగా ప్రమాదం జరిగింది. ఉన్నట్లుండి విమానం గాల్లో నుంచి కూలిపోయింది. ఈ ఘటనలో చెలరేగిన మంటల్లో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని రష్యా మీడియా వెల్లడించింది. ఇందులో ప్రిగోజిన్‌తో పాటు ఆయన అనుచరులు మొత్తం పది మంది ఉన్నట్లు మీడియా తెలిపింది. "The plane will fall apart in mid-air", a video of Prigozhin predicting his death has appeared. 💬"You better kill me, but I won't lie. I have to be honest: Russia is on the brink of disaster. If these cogs are not adjusted today, the plane will fall apart in mid-air", Prigozhin… pic.twitter.com/sG8beb2HLp — Anton Gerashchenko (@Gerashchenko_en) August 27, 2023 పుకార్లపై క్రెమ్లిన్ రియాక్షన్.. తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్‌ను రష్యానే హతమార్చిందని పశ్చిన దేశాల నాయకులు ఆరోపణలు చేశారు. దీనిపై క్రెమ్లిన్ ఇటీవల స్పందించింది. అదంతా పచ్చి అబద్దం అని తెలిపింది. ప్రిగోజిన్ ఖచ్చితంగా చనిపోయాడనే విషయాన్ని తెలపడానికి నిరాకరిచింది. ప్రస్తుతం ఆ వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఇదీ చదవండి: Biden On Yevgeny Prigozhin Death: యెవ్గెనీ ప్రిగోజిన్ మృతిపై బైడెన్ షాకింగ్ కామెంట్స్ -
ఇండియా - పాక్ మెగా ఫైట్‌కి స్పాట్ ఫిక్స్
-
గాలోడు పెళ్ళికొడుకాయనే..సుధీర్ పెళ్లి కన్ఫర్మ్...
-
'గంధర్వ' రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఆ రోజే..
Sandeep Madhav Gandharva Movie Release Date Confirmed: సందీప్ మాధవ్, గాయత్రి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం 'గంధర్వ'. ఈ సినిమాను ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించగా ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ సమర్పిస్తోంది. ఇక ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని కృష్ణమురళి, బాబు మోహన్ , సురేష్ తదితరులు నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు, ట్రైలర్ మూవీపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. దీంతోపాటు ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా గురించి దర్శకుడు అప్సర్, హీరో సందీప్ మాధవ్ చెప్పిన విశేషాలు టాలీవుడ్లో చిత్రంపై మంచి బజ్ ఏర్పడేలా చేశాయి. అద్భుతమైన కొత్త పాయింట్‌తో అందరి దృష్టిని ఆకర్షించడానికి దర్శకుడు అప్సర్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ జూలై 8 న థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాప్ రాక్ షకీల్ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ జవహర్ రెడ్డి అందించగా ఎడిటర్‌గా బసవా పైడి రెడ్డి వ్యవహరించారు. చదవండి:👇 చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. -
కమల్ హాసన్ చిత్రంలో సూర్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Vikram: Lokesh Kanagaraj Confirms Suriya Cameo With Kamal Haasan: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించిన చిత్రం 'విక్రమ్'. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించారు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం (మే 15) ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2 నిమిషాల 38 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్లో కమల్, విజయ్, ఫాహద్ ఫాజిల్ తమ నటనతో అదరగొట్టారు. కాగా ఈ మూవీలో స్టార్ హీరో సూర్య కూడా నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై డైరెక్టర్ లోకేష్ కనగరాజు స్పందించారు. విక్రమ్ మూవీలో ఈ మూగ్గురు స్టార్ హీరోలతోపాటు సూర్య కూడా నటిస్తున్నాడని స్పష్టం చేశారు. సూర్య ఒక కీలక పాత్రలో అలరించనున్నాడని తెలిపారు. మే 15న చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ట్రైలర్ రిలీజ్‌తో పాటు మూవీ ఆడియో లాంచ్ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలోనే విక్రమ్ చిత్రంలో సూర్య నటిస్తున్నాడని డైరెక్టర్ లోకేష్ తెలిపారు. ఇక ఈ నలుగురు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూస్తే ప్రేక్షకులకు, అభిమానులకు పూనకాలే. -
'కేజీఎఫ్ 3'పై క్లారిటీ.. మార్వెల్ ఫ్రాంచైజీ తరహాలో సినిమా
KGF Producer Vijay Kiragandur About KGF 3: కేజీఎఫ్ 2.. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించింది. కలెక్షన్ల పరంగానే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక బాలీవుడ్లో అయితే రూ. 400 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాకుండా వెయ్యి కోట్ల క్లబ్లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి మరో సీక్వెల్ కూడా వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలోనే గుడ్ న్యూస్ తెలిపారు చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్. ఒక ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 3 సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విజయ్ కిరంగదూర్. 'కేజీఎఫ్ 3 మూవీ తెరకెక్కించాలనే అనుకుంటున్నాం. ఈ ఫ్రాంచైజీని మార్వెల్ తరహాలో రూపొందించాలని భావిస్తున్నాం. అక్టోబర్ తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుంది. 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ మూవీతో బిజీగా ఉన్నారు. దాదాపు 30-35% షూటింగ్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ వచ్చే వారం స్టార్ట్ అవుతుంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి పూర్తి చేయాలనుకుంటున్నాం. కాబట్టి అక్టోబర్ తర్వాత కేజీఎఫ్ 3 షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాం.' అని హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరంగదూర్ పేర్కొన్నారు. చదవండి: కేజీఎఫ్ మేకర్స్ భారీ సర్ప్రైజ్.. యువరాజ్ కుమార్ తెరంగేట్రం! సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్ తదితరులు కేజీఎఫ్ 2లో నటించారు. ఈ కేజీఎఫ్ 3లో నటీనటుల గురించల విజయ్ను అడగ్గా 'మేము ఒక మార్వెల్ మల్టీవర్స్ తరహాలో తెరకెక్కించాలనుకుంటున్నాం. విభిన్న చిత్రాల నుంచి విభిన్న పాత్రలను తీసుకురావాలనుకుంటున్నాం. అలాగే డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్ సినిమా తరహాలో రూపొందించాలని అనుకుంటున్నాం. దీని ద్వారా ఎక్కువ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు.' అని తెలిపారు. చదవండి: హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్‌పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఏప్రిల్‌లోనే అలియా-రణ్‌బీర్ వివాహం !.. ఆ కారణం వల్లే ముహుర్తం
Alia Bhatt Ranbir Kapoor Wedding On April 17: బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌లో పెళ్లి విషయం ప్రస్తుతం బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వారి పెళ్లి కోసం అభిమానులు, ఫాలోవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అది ఎంతలా అంటే.. ఇటీవల వారికి వివాహం జరిగినట్లు ఫేక్ ఫొటోలు క్రియేట్ చేసేంతా. అయితే వీరి వివాహం 2020 డిసెంబర్లోనే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా అలియా భట్-రణ్‌బీర్ కపూర్లు వివాహ మహోత్సవం తేది ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని అనుకూలిస్తే వారు ఈ ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలో పెళ్లి పీటలు ఎక్కనున్నారట. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఏప్రిల్ 17న వారి పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయిందని ఈ జంటకు అతి సన్నిహితులైన వారు తెలిపినట్లు సమాచారం. అయితే వీరు ఇలా ఆకస్మికంగా పెళ్లి చేసుకునేందుకు అలియా భట్ తాత ఎన్ రజ్దాన్ కారణమట. ఆయన ఆరోగ్యం అంతగా బాలేదని, తాను చనిపోయేలోపు అలియా వివాహం చూడాలనుకుంటున్నారని సమాచారం. 'అలియా తాత ఎన్ రజ్దాన్ ఆమె వివాహం రణ్‌బీర్‌తో జరగాలని కోరుకుంటున్నారు. అందుకే ఆకస్మికంగా ఏప్రిల్ 17న వివాహ ముహుర్తం ఖరారు చేశారు. కుటుంబ సమేతంగా ఆర్కే స్టూడియోస్‌లో జరగనుంది. ఆడంబరంగా ఏం ప్లాన్ చేయలేదు.' అని ఈ జంట సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారమని ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ తెలిపింది. అలియా భట్ తాత రజ్దాన్ ఆరోగ్య స్థితిని బట్టి ఏప్రిల్ 17న లేదా ఏప్రిల్ రెండు, మూడో వారంలో వారి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక కపూర్ వంశానికి చెందిన పురాతన వారసత్వ నివాసం ఆర్కే హౌస్‌లో రణ్‌బీర్- ఆలియా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. కాగా కపూర్ కుటుంబ సభ్యులు ముంబైలోని ఆర్కే హౌస్‌ను సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. అంతేకాదు రణ్‌బీర్ తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్ల పెళ్లి కూడా అక్కడే జరిగిందట. అలియా-రణ్‌బీర్ వివాహానికి అతి సన్నిహితులు మాత్రమే హాజరవనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రణ్‌బీర్ తన బ్యాచ్‌లర్ పార్టీని అర్జున్ కపూర్, అయాన్ ముఖర్జీ, ఆదిత్య రాయ్ కపూర్లతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోనున్నట్లు సమాచారం. -
'ఆడవాళ్లు మీకు జోహార్లు' విడుదల ఎప్పుడంటే ?
Sharvanand Aadavallu Meku Joharlu Movie 2022 Release In February: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతుంది. ఒక పాట మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో సినిమా ప్రమోషన్స్ చేయనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ పక్కింటి కుర్రాడి పాత్రలో నటిస్తుండగా, రష్మిక పాత్ర మంచి అనుభూతిని ఇస్తుందని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యతను టైటిల్ తెలియజేసేలా ఉంది. ఖుష్బు, రాధిక శరత్ కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సౌండ్‌ట్రాక్‌లు అందించగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. #AadavalluMeekuJohaarlu Releasing in Theaters on February 25 💥💥#AMJOnFEB25 @iamRashmika @DirKishoreOffl @realradikaa @khushsundar #Urvashi @ThisIsDSP @sujithsarang @SLVCinemasOffl pic.twitter.com/Z8I7ssvapf — Sharwanand (@ImSharwanand) January 28, 2022 -
వైరల్ వీడియో: సీరియల్ హీరోయిన్ పెళ్లి పుకార్లు నిజమేనా !.. కన్ఫర్మ్ చేసిందా ?
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ హీరోయిన్గా మారింది హాట్ బ్యూటీ మౌనీ రాయ్. ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న వార్తలు ఎప్పటినుంచో బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తన ప్రియుడు, వ్యాపార వేత్త సూరజ్ నంబియార్‌ను జనవరి 27న వివాహం చేసుకోనున్నట్లు గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలు నిజమే అని నిరూపించేలా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో గింగిరాలు తిరుగుతోంది. ఇటీవల మౌనీ రాయ్ ఫొటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కింది. వారి కెమెరాలకు ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగింది మౌని. ఈ క్రమంలోనే ఒక ఫొటోగ్రాఫర్ మౌనీకి 'అభినందనలు' అని తెలిపాడు. దానికి మౌనీ నవ్వుతూ 'థ్యాంక్యూ' అని చెప్పింది. అంతేకాకుండా ఆ ఫొటోగ్రాఫర్ 'పెళ్లి తర్వాత కలుద్దాం' అని కూడా చెప్పడం విశేషం. ఈ సంఘటన బట్టి మౌనీ రాయ్ పెళ్లి పుకార్లు నిజమే అని సూచిస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ల వివాహం జనవరి 27న జరగనుందని సమాచారం. వీరిద్దరూ బెంగాలీ వివాహ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. ఎందుకంటే సూరజ్ దుబాయ్‌కి చెందిన ఓ బ్యాంకర్, వ్యాపారవేత్త. అతడు బెంగళూరులో జైన్ కుటుంబానికి చెందిన వాడని సమాచారం. అందుకే వరుడి మత సాంప్రదాయాల ప్రకారం వివాహం జరగనున్నట్లు బాలీవుడ్ టాక్. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
గుడ్ న్యూస్.. ఎట్టి పరిస్థితుల్లో 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ అప్పుడే!
దర్శక ధీరుడు జక్కన్న ప్రతిష్టాత్మకంగా చెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). వాస్తవానికి ఈ మూవీ ఈపాటికి విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగలేదు. అందుకు దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరగడం, థియేటర్ ఆక్యుపెన్సీ, పలు రాష్ట్రాల్లో స్వల్ప లాక్డౌన్ వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాను పోస్ట్‌పోన్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదల తేది ఏమై ఉంటుందన్న ఆసక్తి ప్రేక్షకులను ఇంకా వీడలేదు. ఎప్పుడూ రిలీజ్ చేస్తారా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. (చదవండి: 'ఆర్ఆర్ఆర్'కు అమెజాన్ భారీ ఆఫర్.. కానీ) ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రేక్షకులకు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కలకలం తొలగిపోయి అన్ని పరిస్థితులు అనుకూలించి పూర్తి ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభమైతే మార్చ్ 18న విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని మేకర్స్ తెలిపారు. ఒకవేళ అలా జరగకుంటే ఎలాంటి పరిస్థితులున్నా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఇన్నేళ్ల ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడినట్లు ఉంది. ఈ ప్రకటనతో ఆర్ఆర్ఆర్ సుమారు 14 భాషల్లో విడుదలకానుంది. ఈ ఒక్క న్యూస్‌తో అభిమానులు పండుగ చేసుకోనున్నారు. (చదవండి: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ స్పూఫ్.. అదరగొట్టేశారుగా..!) Breaking : #RRRMovie on March 18th 2022 or April 28th 2022. @tarak9999 @AlwaysRamCharan @ssrajamoulipic.twitter.com/clTcqxAVfD — Suresh Kondi (@SureshKondi_) January 21, 2022 -
ట్రంప్ నెత్తిన మరో బాంబు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓ పోర్న్ స్టార్‌తో లైంగిక సంబంధం ఉన్నట్లు అప్పట్లో ఓ కథనం అప్పట్లో అగ్రరాజ్యాన్ని కుదిపేసింది. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయం బయటకు పొక్కుకుండా ఉండేందుకు భారీ మొత్తాన్ని చెల్లించి ఆ నటితో ట్రంప్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వైట్ హౌజ్ ఈ వార్తలను ఖండించగా.. తాజాగా అది నిజమేనంటూ ట్రంప్ వ్యక్తిగత న్యాయసలహాదారు బాంబు పేల్చారు. ట్రంప్ వ్యక్తిగత అటార్నీ మైకేల్ కోహెన్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ... ‘పోర్న్‌స్టార్ స్టోర్మీ డేనియల్స్ తో ట్రంప్ లక్షా,30,000 డాలర్లతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమేనని తెలిపారు. ‘స్టోర్మీతో చేసుకున్న ట్రంప్ చేసుకున్న ఒప్పందం ప్రలోభానికి గురి చేసేందుకు ఉద్దేశించింది కాదు. రాజకీయ విమర్శలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చేసుకుంది. పైగా న్యాయబద్ధమైంది’ అని కోహెన్ వివరించారు. ఇంతకాలం గోప్యంగా ఉన్న ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి, ఆమె నిరభ్యరంతరంగా ఈ విషయాన్ని ప్రపంచానికి ఆమె వెల్లడించవచ్చు అని కోహెన్ చెప్పారు. కాగా, ఇన్ టచ్ అనే మాగ్జైన్ లో అడల్ట్ సినీతార స్టోర్మీ డేనియల్స్(అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్) ఇంటర్వ్యూను ప్రచురించగా.. వాల్‌స్ట్రీట్ జర్నల్ దానిని యథాతథంగా ప్రచురించింది. అందులో మెలానియా(ట్రంప్ భార్య) బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్‌తో తాను ఎఫైర్ పెట్టుకున్నట్టు ధృవీకరించింది. కొంతకాలమే కొనసాగిన తమ బంధం సరదాగా సాగిపోయిందని, పైగా తన కూతురు ఇవాంక తరహాలో అందంగా, స్మార్ట్‌గా ఉంటానంటూ ట్రంప్ తరచూ తనతో చెబుతుండేవాడని స్టెఫానీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే వైట్‌హౌజ్ మాత్రం ఆ ఇంటర్వ్యూను ‘ఫేక్’ అంటూ కొట్టి పడేయగా.. ఇప్పుడు మైకేల్ ధృవీకరించిన వార్తపై స్పందించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. ట్రంప్ వ్యక్తిగత న్యాయసలహాదారు మైకేల్ కోహెన్ (పాత చిత్రం) -
కాలిఫోర్నియాను వెంటాడుతున్న కార్చిచ్చు
-
4 వారికి బ్యాడ్ అట..అందుకే 5 వస్తోంది
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు 'వన్ ప్లస్' తన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో 2017లో వన్ ప్లస్ 5ను త్వరలో విడుదల చేయనుంది. గతంలో వన్ ప్లస్ 3 వచ్చిన దృష్ట్యా దాని తరువాత వన్ ప్లస్ 4 వస్తుందని అందరూ భావించారు. కానీ, ప్రస్తుతం నెట్ లోహల్చల్ చేస్తున్న లీక్స్ ప్రకారం వన్ ప్లస్ సంస్థ యూజర్లందరికీ షాక్ ఇస్తూ త్వరలో వన్ ప్లస్ 5ను విడుదల చేయనుంది. వన్ ప్లస్ 3టీతో పోలిస్తే కొంచెం ఎక్కువ ధరలోనే దీన్ని లాంచ్ చేయనుంది. అయితే శాంసంగ్, యాపిల్, గూగుల్ తో సమానంగా దూసుకుపోతున్న వన్‌ప్లస్ శాంసంగ్ ఎస్8, ఆపిల్ 7 తో పోలిస్తే రీజనబుల్ ప్రైస్‌లోనే అందించనుందని తెలుస్తోంది. 8జీబీ వేరియంట్‌ను కూడా లాంచ్ చేయనుందని మరోరిపోర్టు నివేదించింది. అధికారికంగా లాంచ్ కాకముందే ఇంకెన్ని రూమర్లు,అంచనాలు చెలురేగుతాయో చూడాలి. చైనాలో 4 అంకెను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారట. ఆ అంకె వల్ల అంతా చెడు జరుగుతుందని వారు విశ్వసిస్తారట. ఈ నేపథ్యంలోనే చైనా మొబైల్‌దిగ్గజం వన్ ప్లస్ తన ఫోన్ సిరీస్‌లో వన్ ప్లస్ 4ను విడుదల చేయడం లేదని సమాచారం. ఈ ఫ్లాగ్షిప్ డివైస్ పై స్పెసిఫికేషన్స్ అంచనాలు ఇలా ఉన్నాయి. వన్ ప్లస్ 5 ఫీచర్లు 5.5 ఇంచ్ క్వాడ్ హెచ్డీ డిస్ప్లే 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4జీ, 8 జీబీ ర్యామ్ 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 23 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ 2.0 -
శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 కమింగ్...
శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో భారీ నష్టాలను మూటగట్టుకున్న శాంసంగ్ నోట్ సిరీస్‌ను కొనసాగించనున్నట్టు అధికారికంగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో గెలాక్సీ 8నోట్‌ను లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2017 సంవత్సరం ద్వితీయార్థంలో ఈ స్మార్ట్‌ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం. ముఖ్యంగా శాంసంగ్ ఫలితాల సందర్భంగా శాంసంగ్ చీఫ్ డీజే కో ఈ విషయాన్ని సూచన ప్రాయంగా ప్రకటించారు. శాంసంగ్ గురువారం మార్చి 31 తో ముగిసిన త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఈ సందర్బంగా తన కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నామని సంస్థ తెలిపింది. 2017 రెండవ భాగంలో దీన్ని విడుదల చేస్తామని పేర్కొంది. కాగా గత ఏడాది ఆగస్టులో గెలాక్స్ నోట్ 7 లాంచ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్బ్యాటరీ పేలుడు ఘటనలు నమోదు కావడంతో మొత్తం డివైస్‌ను వెనక్కి తీసుకుంది. దీంతో ఈ సంక్షోభంతో నోట్ సిరీస్‌కు శాంసంగ్ ఇక స్వస్తి పలికినట్టేనని ఊహాగానాలు వచ్చాయి. అలాగే గెలాక్సీ నోట్ 8 ఏప్రిల్ 2017 లో రానుందని మొదట అంచనాలు చెలరేగాయి. మరోవైపు గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ వైఫల్యం కారణంగా వినియోగదారుల విశ్వసనీయతను కోల్పొ వటంతో ఈసారి బ్యాటరీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. -
ముంబై నుంచి వెళ్లి సిరియాలో..
ముంబై: ముంబై లోని కళ్యాణి ప్రాంతం నుంచి సిరియాకు వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరిన అమన్ టాండెల్ మృతి చెందినట్లు ఐఎస్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఇస్లామిక్ స్టేట్ అఫిషియల్ మీడియా చానల్ ఖిలాఫా న్యూస్‌లో.. అమన్ అమరుడయ్యాడంటూ ఓ కథనాన్ని ఫోటోతో సహా ప్రచురించింది. అమన్‌తో పాటు విదేశాల నుంచి వచ్చి తమ తరఫున పోరాడుతూ మృతి చెందిన మరికొంత మంది వివరాలను సైతం ఐఎస్ ప్రకటించింది. అమన్ రక్కా ప్రాంతంలో మృతి చెందినట్లు ఖిలాఫా న్యూస్ తెలిపింది. అమన్ మృతి గురించి గత నెలలోనే అతడి కుటుంబసభ్యులు సమాచారం అందుకున్నప్పటికీ.. భారత భద్రతా సంస్థలు దీనిని ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్ ప్రకటనతో అమన్ మృతిపై క్లారిటీ వచ్చినట్లైంది. 2014 లో ఇరాక్‌లోని పవిత్ర ప్రాంతాలను సదర్శించేందుకని కళ్యాణి ప్రాంతం నుంచి అమన్‌తో పాటు మరో ముగ్గురు సిరియాకు వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపారు. ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన ఓ వీడియోలో అమన్‌తో పాటు అతడి మిత్రుడు.. ఇండియాలో ముస్లింలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. అమన్‌తో పాటు వెళ్లిన ముగ్గురిలో సహీమ్ టంకీ ఇంతకుముందే మృతి చెందగా.. అరీబ్ మజీద్ గత ఏడాది ఇండియాకు తిరిగివచ్చి విచారణనను ఎదుర్కొంటున్నాడు. మరో వ్యక్తి షేక్ ప్రస్తుతం సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్నట్లు సమాచారం. -
పాపులర్ గేమ్ షో లవర్స్ కి శుభవార్త!
ముంబై: పాపులర్ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' లవర్స్ కు శుభవార్త. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ యాంకరింగ్ స్టయిల్ తో అత్యంత ప్రజాదరణ పొందిన 'కౌన్ బనేగా కరోడ్ పతి ' మళ్లీ వస్తోంది. అవును ఈ విషయాన్నిస్ వయంగా బిగ్ బీనే సోషల్ మీడియా లైవ్ చాట్ లో కన్ ఫాం చేశారు. బుల్లితెరపై అభిమానులను ఉర్రూతలూగించిన ఈ మేజిక్ ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మళ్లీ టెలివిజన్‌లో కనువిందు చేయడానికి రడీ అవుతున్నారు. వచ్చే ఏడాదిలో కౌన్ బనేగా కరోడ్ పతి గేమ్ కొత్త సీజన్ తిరిగి ప్రారంభం కానున్నట్టు ఫేస్ బుక్ లైవ్ చాట్ లో ధృవీకరించారు. 2017లో కేబీసీ గేమ్ షో ఫ్రెష్ గా మొదలుకావచ్చని బిగ్ బీ తెలిపారు. కాగా 2006 లో ఈ మొదలైన క్విజ్ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. సీజన్ల మధ్య మళ్లీ లాంగ్ గ్యాప్ తరువాత 2014లో మళ్లీ ప్రసారమైంది. సెకండ్ సీజన్ లో కూడా అంతే స్థాయిలో ఆకట్టుకుందీ ఈ గేమ్ షో. పక్కా...లాక్ కర్ దూం.. అంటే తన అద్భుతమైన గొంతుతో, విలక్షణమైన యాంకరింగ్ తో అమితాబ్ ఈ గేమ్ షో మరింత పాపులారిటీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
యాహూ వెల్లడించిన షాకింగ్ న్యూస్
వాషింగ్టన్: ఇంటర్నెట్ దిగ్గజం యాహూ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. 50కోట్ల (500 మిలియన్) యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ప్రకటించింది. యాహూ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఈ విషయాన్ని గురువారం ధృవీకరించారు. ఈ సమాచారాన్ని మొత్తాన్నీ కంపెనీ నెట్ వర్క్ నుంచి 2014లో దొంగిలించారని ఒక ప్రకటనలో తెలిపారు. యాహూ ఆన్ లైన్ ఖాతాదారులు తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని యాహూ ఒక ప్రకటనలో కోరింది. భద్రతా ప్రశ్నలకు సమాధానాలివ్వాలని సూచించింది. అనుమానాస్పద లింక్ లపై క్లిక్ చేయొద్దని, డోన్ లోడ్లు చేయొద్దని హెచ్చరించింది. పేర్లు, ఈ మెయిల్ చిరునామాలు, టెలిఫోన్ నెంబర్లు, పుట్టిన తేదీలు, పాస్‌వర్డ్‌లతో పాటు ఎన్‌క్రిప్ట్, అన్ ఎన్క్రిప్డ్ ప్రశ్నలు, సమాధానాలు కూడా హ్యాకింగ్‌కు గురైన వాటిలో ఉన్నాయని బాబ్ లార్డ్ చెప్పారు. దీనిని స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ అని ఆరోపించిన ఆయన, హ్యాకింగ్‌కు సంబంధించి విచారణ కొనసాగుతోందన్నారు. అలాగే విచారణలో వెల్లడైన సమాచారం మేరకు.. హ్యాకింగ్‌కు గురైన వాటిలో అన్ప్రొటెక్టెడ్ పాస్వర్డ్లు, పేమెంట్ కార్డ్ డాటా, బ్యాంకు అకౌంట్ సమాచారం తదితరాలు లేవని స్పష్టం చేశారు. పేమెంట్ కార్డ్ డేటా, బ్యాంక్ అకౌంటులకు సంబంధించిన సమాచారాన్ని హ్యాకింగ్‌కు గురైన సిస్టంలో భద్ర పరచలేదని చెప్పారు. హ్యాకింగ్ చేసిన వారు యాహూ నెట్ వర్క్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్న వారు కాదని తమ విచారణలో వెల్లడైందన్నారు. మరోవైపు ఇదే అతి పెద్ద సైబర్ ఉల్లంఘనగా టెక్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే 2014 నుంచి పాస్ వర్డ్ లను మార్చని యూజర్లను మార్చుకోవాల్సిందిగా కోరుతోందని షేప్ సెక్యూరిటీ అధికారి తెలిపారు. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ లో ఆధునిక ఆటోమేటెడ్ టూల్స్ ఉపయోగించే అవకాశ ఉందనీ, ఈనేపథ్యంలో 4.8 బిలియన్ డాలర్ల యాహూ వెరిజోన్ కీలక అమ్మకంపై ప్రభావితం చేసే అవకాశం ఉందని మరో టెక్ నిపుణుడు హెచ్చరిచారు. కాగా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మిలియన్ల ఈ మెయిల్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని, హ్యాకర్లు జీమెయిల్, హాట్ మెయిల్, యాహూ అకౌంట్లు హ్యాక్ చేసి పాస్ వర్డ్స్, ఇతర సమాచారం దొంగిలించారని, ఈ సమాచారాన్ని రష్యాలోని క్రిమినల్ అండర్ వరల్డ్‌కు విక్రయించినట్లుగా గతంలో అందోళను చెలరేగిన సంగతి తెలిసిందే. -
కొత్త భారతీయుడు అతడేనా?
-
చిరు 150వ సినిమా ఖరారు
-
టాలీవుడ్ దర్శకుడికి కమల్ గ్రీన్‌సిగ్నల్
సినిమాను కొత్తపుంతలు తొక్కించిన నటుడు కమలహాసన్. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులకే అలంకారంగా మారిన ఈ కళాపిపాసి కొత్తవారిని ప్రోత్సహిచడంలో ముందుంటారు. ప్రతిభను గుర్తించడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో తనపర భేదమే చూపరు. అలాంటి విశ్వనాయకుడు తాజాగా టాలీవుడ్ దర్శకుడి చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. ఆ దర్శకుడెవరో కాదు చిన్న చిత్రాలతో పెద్ద విజయాలు సాధించిన తేజ. వీరిద్దరి కలయికలో ఒక మాస్ ఎంటర్టైనర్ చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. తేజ ఇంతకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చిత్రం చెయ్యాలని ప్రయత్నించారు. ఆయన కోసం మంచి కథను కూడా సిద్ధం చేశారు. కారణమేమైన ఆ చిత్రం సెట్‌పైకి రాలేదు. కానీ ఇప్పుడు సకల కళావల్లభుడు కమలహాసన్‌తో చిత్రం ఖాయం అయినట్లు సమాచారం. ఈ చిత్రం డిసెంబర్ లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నో రకాల పాత్రలకు జీవం పోసిన కమల్‌హాసన్ కోసం తాను కొత్తగా పాత్ర క్రియేట్ చేసే స్థాయిలో లేనని అందుకనే ఆయన మైండ్‌లో ఉన్న కథల్లో కొన్నింటి గురించి కమల్‌హాసన్‌తో చర్చించి ఒక కథను ఎంపిక చేసినట్లు దర్శకుడు తేజ వెల్లడించారు. ఇది ఆయన ఇంతకుముందు నటించిన నాయకన్, ఒరు ఖైదీ ఇన్ డైరీ చిత్రాల తరహాలో పలు ఆసక్తి కరమైన అంశాలతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రానికి కమల్‌హాసన్ స్క్రీన్‌ప్లే సిద్ధం చేస్త్తున్నారని తాను సంభాషణలు రాస్తున్నానని తేజ తెలిపినట్లు ఆంగ్ల పత్రికలో వార్తలు వెలువడుతున్నాయి. -
తెరపై మరో మిస్ ఇండియా