Alia Bhatt Ranbir Kapoor Wedding On April 17: బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌లో పెళ్లి విషయం ప్రస్తుతం బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వారి పెళ్లి కోసం అభిమానులు, ఫాలోవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అది ఎంతలా అంటే.. ఇటీవల వారికి వివాహం జరిగినట్లు ఫేక్ ఫొటోలు క్రియేట్ చేసేంతా. అయితే వీరి వివాహం 2020 డిసెంబర్‌లోనే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా అలియా భట్-రణ్‌బీర్ కపూర్‌లు వివాహ మహోత్సవం తేది ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని అనుకూలిస్తే వారు ఈ ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలో పెళ్లి పీటలు ఎక్కనున్నారట. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఏప్రిల్ 17న వారి పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయిందని ఈ జంటకు అతి సన్నిహితులైన వారు తెలిపినట్లు సమాచారం.
అయితే వీరు ఇలా ఆకస్మికంగా పెళ్లి చేసుకునేందుకు అలియా భట్ తాత ఎన్ రజ్దాన్ కారణమట. ఆయన ఆరోగ్యం అంతగా బాలేదని, తాను చనిపోయేలోపు అలియా వివాహం చూడాలనుకుంటున్నారని సమాచారం. 'అలియా తాత ఎన్ రజ్దాన్ ఆమె వివాహం రణ్‌బీర్‌తో జరగాలని కోరుకుంటున్నారు. అందుకే ఆకస్మికంగా ఏప్రిల్ 17న వివాహ ముహుర్తం ఖరారు చేశారు. కుటుంబ సమేతంగా ఆర్‌కే స్టూడియోస్‌లో జరగనుంది. ఆడంబరంగా ఏం ప్లాన్ చేయలేదు.' అని ఈ జంట సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారమని ప్రముఖ ఇంగ్లీష్ వెబ్‌సైట్ తెలిపింది. అలియా భట్ తాత రజ్దాన్ ఆరోగ్య స్థితిని బట్టి ఏప్రిల్ 17న లేదా ఏప్రిల్ రెండు, మూడో వారంలో వారి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
ఇక కపూర్ వంశానికి చెందిన పురాతన వారసత్వ నివాసం ఆర్కే హౌస్‌లో రణ్‌బీర్- ఆలియా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. కాగా కపూర్ కుటుంబ సభ్యులు ముంబైలోని ఆర్కే హౌస్‌ను సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. అంతేకాదు రణ్‌బీర్ తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్‌ల పెళ్లి కూడా అక్కడే జరిగిందట. అలియా-రణ్‌బీర్ వివాహానికి అతి సన్నిహితులు మాత్రమే హాజరవనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రణ్‌బీర్ తన బ్యాచ్‌లర్ పార్టీని అర్జున్ కపూర్, అయాన్ ముఖర్జీ, ఆదిత్య రాయ్ కపూర్‌లతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment