![Alia Bhatt changes Instagram profile pic after wedding with Ranbir Kapoor - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/15/in.gif.webp?itok=TpNjHxoi)
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ అలియా భట్-రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. 5ఏళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఏప్రిల్ 14న కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చదవండి: రణ్‌బీర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ కత్రినా, దీపికాల పోస్టులు వైరల్
ఇదిలా ఉండగా ఆలియా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా అప్‌డేట్స్‌తో పాటు తనకు సంబంధించిన ప్రత్యేక సందర్భాలను ఆమె తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో వివాహం అనంతరం ఆలియా తన ఇన్‌స్టా ప్రొఫైల్ పిక్‌ని మార్చేసింది.
పెళ్లి ఫోటోని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంది. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరోవైపు ఇంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్న రణ్‌బీర్ కూడా త్వరలోనే నెట్టింట అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. చదవండి: Alia Bhatt: ఆలియా భట్ షాకింగ్ నిర్ణయం! అదేంటంటే..
Comments
Please login to add a commentAdd a comment