profile picture
-
డీపీల మార్పుకై మోదీ పిలుపు.. తమదైన శైలిలో స్పందించిన కాంగ్రెస్ నేతలు
న్యూఢిల్లీ: జాతీయజెండాను సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్లుగా మార్చుకోవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ పార్టీ నేతలు తమదైన శైలిలో స్పందించారు. పార్టీ అధికార వెబ్‌సైట్‌తోపాటు అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రా సహా పలువురు తమ ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాల్లో దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతీయ జెండాను చేతబూనిన ఫొటోను బుధవారం తమ ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకున్నారు. నెహ్రూ జాతీయ జెండా వైపు చూస్తున్నట్లుగా ఉన్న బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని ఫొటోషాప్ సాంకేతికతతో కలర్లోకి మార్చారు. ‘తిరంగా దేశానికి గర్వకారణం. తిరంగా ప్రతి భారతీయుడి గుండెలోనూ ఉంటుంది’అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘52 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ పుణెలోని తన ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయలేదు. ప్రధాని పిలుపుతోనైనా తిరంగా ఆ సంస్థ ప్రొఫైల్ పిక్చర్ మారుతుందా?’అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు ఆ అవకాశం ఇవ్వండి: రాహుల్‌పై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు కాంగ్రెస్ పార్టీ నేతలు సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో త్రివర్ణ పతాకంతో ఉన్న తమ ఫొటోలు పెట్టుకునే అవకాశం నేతలకు ఇవ్వాలని రాహుల్ గాంధీని బీజేపీ ఎద్దేవా చేసింది. తిరంగా విషయంలోనైనా తమ కుటుంబం పరిధి దాటి ఆయన ఆలోచించాలని హితవు పలికింది. -
Mann ki Baat:‘త్రివర్ణ పతాకాన్ని మీ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోండి’
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు వివిధ సోషల్ మీడియాల్లో తమ ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 91వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వివిధ అంశాలపై మాట్లాడారు. 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోదుల పేర్లు పెట్టినట్లు గుర్తు చేశారు. అలాంటి స్టేషన్లను పిల్లలు సందర్శించాలని సూచించారు. ‘దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షాహీద్ ఉద్ధమ్ సింగ్ జీకి సంతాపం తెలుపుతున్నాం. ఆజాదీకా అమృత్ మహోత్సవం ఒక ఉద్యమంగా సాగుతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములై.. ఆగస్టు 2-15 వరకు తమ ప్రొఫైల్ పిక్చర్‌గా మువ్వన్నెల జెండాను పెట్టుకోవాలి. అలాగే.. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగమై.. మీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి.’ అని ప్రజలను కోరారు ప్రధాని మోదీ. హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతున్న మిజార్ మేళాను వీలైతే సందర్శించాలని ప్రజలను కోరారు మోదీ. మరోవైపు.. పీవీ సింధూ, నీరజ్ చోప్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు గొప్ప ఆట తీరును ప్రదర్శించాలని ఆకాక్షించారు. ఇదీ చదవండి: Mann Ki Baat: ‘ఎమర్జెన్సీ’లో ప్రజాస్వామ్యాన్ని అణచే యత్నం -
ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ మార్చేసిన ఆలియా భట్
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ అలియా భట్-రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. 5ఏళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఏప్రిల్ 14న కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చదవండి: రణ్‌బీర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ కత్రినా, దీపికాల పోస్టులు వైరల్ ఇదిలా ఉండగా ఆలియా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా అప్డేట్స్తో పాటు తనకు సంబంధించిన ప్రత్యేక సందర్భాలను ఆమె తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో వివాహం అనంతరం ఆలియా తన ఇన్‌స్టా ప్రొఫైల్ పిక్‌ని మార్చేసింది. పెళ్లి ఫోటోని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంది. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరోవైపు ఇంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్న రణ్‌బీర్ కూడా త్వరలోనే నెట్టింట అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. చదవండి: Alia Bhatt: ఆలియా భట్ షాకింగ్ నిర్ణయం! అదేంటంటే.. -
ధనుష్-ఐశ్వర్య విడాకులు: అక్కకు సపోర్ట్‌గా సౌందర్య.. ఫోటో వైరల్
స్టార్ కపూల్ ధనుష్- ఐశ్వర్యల విడాలకుల విషయం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట.. విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఐశ్వర్య, ధనుష్‌లు.. 18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. (చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులకు కారణం ఇదేనా?) ‘స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం.. ఇలా సాగిందీ ప్రయాణం. ఈ రోజు ఇరువురివి భిన్నమార్గాలుగా కనపడుతున్నాయి... ధనుష్, నేను దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్తు కోసం.. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి’అంటూ ఐశ్వర్య సోషల్ మీడియా ద్వారా తమ విడాకుల విషయాన్ని వెల్లడించారు. అలాగే ధనుష్ కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ..తమ నిర్ణయాన్ని గౌరవించాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాగా వీరి విడాకుల ప్రకటనపై రజనీకాంత్ ఇప్పటికీ స్పందించకపోవడం గమనార్హం. అయితే విడాకుల ప్రకటనకు ముందే రజనీకాంత్‌కు ధనుష్, ఐశ్వర్యలు ఫోన్ చేశారని, ఆయన వారి నిర్ణయానికి ఎలాంటి అడ్డు చెప్పలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కూతురుకు మద్దతుగా మాత్రం రజనీకాంత్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అక్క నిర్ణయానికి సపోర్ట్‌గా నిలిచింది రజనీకాంత్ చిన్న కూతురు, ఐశ్వర్య చెల్లెలు సౌందర్య. అక్క విడాకుల నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లుగా ట్విటర్ ఖాతాలోని ప్రొఫైల్ పిక్‌ని మార్చింది. తండ్రి రజనీకాంత్‌తో చిన్నప్పుడు దిగిన ఫోటోని తన ప్రొఫెల్ పిక్‌గా మార్చింది. అందులో రజనీకాంత్ ఇద్దరి కూతుళ్లను ఎత్తుకొని ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కకు సపోర్ట్‌గా ఉండమని నెటిజన్స్ కోరుతున్నారు. #NewProfilePic pic.twitter.com/0SnIQYvkkg — soundarya rajnikanth (@soundaryaarajni) January 17, 2022 -
వాట్సాప్ కొత్త ఫీచర్..! ‘మెసేజ్ వస్తే...మీ ఫోటో కన్పిస్తుంది..!’
వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్స్‌తో ముందుకురానుంది.తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌తో వాట్సాప్ రానుంది. మెసేజ్ వస్తే..కన్పిస్తారు..! సాధారణంగా యూజర్లు ఇతరులకు మెసేజ్ చేయగానే ఆయా రెసిపెంట్స్కు నోటిఫికేషన్ బార్లో ‘ యూ హవ్ ఏ న్యూ మెసేజ్’ అంటూ మెసేజ్ వస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ తెస్తోన్న కొత్త ఫీచర్‌తో ఇకపై ఇతరులు మెసేజ్ చేయగానే ఆయా వ్యక్తుల ప్రొఫైల్ ఫోటో నోటిఫికేషన్ బార్లో కన్పించనుంది. ఈ ఫీచర్ తొలుత ఐవోఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. నోటిఫికేషన్ ఫోటో ఫీచర్‌ను టెస్ట్ చేస్తోన్నట్లు వాట్సాప్ ట్రాకర్ WABetaInfo పేర్కొంది. అన్నీ పరీక్షలు పూర్తైన తరువాత ఐవోఎస్ యూజర్లతో పాటుగా, ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో రానుంది. చదవండి: వాట్సాప్ యూజర్లకు అలర్ట్..! ‘సారీ..మీరు ఎవరు..!’ అంటూ అమాయకంగా మెసేజ్..! తరువాత.. -
అమెజాన్ ప్రైమ్‌లో ఈ కొత్త ఫీచర్ గమనించారా?
అమెజాన్ ప్రైమ్ గురించి తెలియని వారు ఎవరుండరు అనుకుంటా బహుశా..! అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో వీడియో, మ్యూజిక్, ఫాస్టెస్ట్ డెలివరీ సేవలను అమెజాన్ తన కస్టమర్లకు అందిస్తోంది. తాజాగా అమెజాన్ తన కస్టమర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో మీకు నచ్చిన వెబ్ సిరీస్, సినిమాల్లోని ఇష్టమైన క్యారెక్టర్‌ను మీ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొఫైల్ పిక్చర్‌ను ఎంచుకోవచ్చును. ఈ ఫీచర్ భారత్‌లో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ ప్రైమ్ కస్టమర్ల అందరికీ అందుబాటులో ఉండనుంది. (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!) అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొఫైల్ పిక్చర్లో భాగంగా ప్రస్తుతం మార్వెలస్ మిసెస్ మైసెల్ నుంచి మిడ్జ్ ది బాయ్స్ నుంచి మదర్స్ మిల్క్ (లాజ్ అలోన్సో) వంటి పాత్రలను ప్రోఫైల్ పిక్చర్‌గా మార్చుకొవచ్చును. అంతేకాకుండా ఫ్లీబాగ్, ఇన్విన్సిబుల్, సిల్వీస్ లవ్, టామ్ క్లాన్సి నటించిన జాక్ రైన్, టూమరో వార్ వంటి సిరీస్, చిత్రాల్లో నటించిన వారి క్యారెక్టర్లను ప్రొఫైల్ ఫోటోలుగా ఉంచుకోవచ్చును. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేవలం హలీవుడ్‌కు చెందిన ప్రముఖ క్యారెక్టర్లను ప్రొఫైల్ పిక్స్‌గా ఉంచుకోవడానికి అనుమతిని ఇస్తుంది. త్వరలోనే ఇండియన్ సినిమాకు చెందిన క్యారెక్టర్లను కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో అమెజాన్ ఉన్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్, వెబ్సైట్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొఫైల్ చిత్రాన్ని ఇలా ఛేంజ్ చేయండి....! మీ ఫోన్లో ఉన్న అమెజాన్ ప్రైమ్ వీడియోను ఒపెన్ చేయండి. ప్రైమ్ వీడియో యాప్‌లో హోమ్‌పేజీ దిగువన ఉన్న మై స్టఫ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోండి. తరువాత ప్రొఫైల్ పేరుపై క్లిక్ చేసి, ఆపై మేనేజ్ ప్రొఫైల్‌ను ఎంచుకోండి . మీరు మార్చాలనుకుంటున్న ప్రొఫైల్‌ని ఎంచుకోండి (ఒకవేళ మీకు ఒక అకౌంట్‌పై ఎక్కువ ప్రొఫైల్‌లు ఉంటే). తరువాత ఎడిట్ ప్రొఫైల్‌ను ఎంపిక చేయండి. మీకు మీ పేరుతో కూడిన ప్రోఫైల్ పిక్చర్‌ను గమనిస్తారు. అక్కడ ప్రోఫైల్ పిక్‌పై క్లిక్ చేసి మీకు నచ్చిన సిరీస్, చిత్రానికి సంబంధించిన క్యారెక్టర్‌ను ప్రొఫైల్ ఫోటోను ఎంపిక చేయండి. తరువాత సేవ్ చేయండి. (చదవండి: ఎలన్ మస్క్ కొత్త ప్లాన్.. ఈసారి అంతరిక్షంలో ఏకంగా..!) -
ఈ సెట్టింగ్స్ తో వాట్సప్ ఖాతా మరింత సురక్షితం
ప్రస్తుత ప్రపంచంలో ఏ చిన్న అవసరానికైనా మనం నిత్యం ఉపయోగించేది మెసేజింగ్ యాప్ వాట్సప్. మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు, ఆడియోలు... ఇలా ఏది పంపాలన్నా వాట్సాప్ పై బాగా ఆధారపడుతున్నాం. ఇది అంతలా మన జీవితంలో మమేకమైపోయింది. ఇంతలా వాడుతున్న వాట్సప్ లో తెలియకుండా చేసే చిన్నతప్పులు కూడా సమస్యలను తెచ్చిపెడతాయి. పరిచయం లేని, తాత్కాలిక అవసరంతో పరిచయమైన వ్యక్తుల ఫోన్ నెంబర్లను మన మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకోవడం వల్ల తర్వాత ఎప్పుడో ఒక్కసారి చెక్ చేసుకుంటే వీళ్లు ఎవరబ్బా అని అనుకుంటాం. మనం వాట్సాప్ లో మార్చే డీపీ (ప్రొఫైల్ ఫొటో), స్టేటస్‌లకు సంబంధించిన సమాచారం వారికి కూడా కనిపిస్తుంటుంది. దీని ద్వారా వాళ్ళు మన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. అందుకనే మనం అవసరం లేని కాంటాక్ట్‌లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదా డిలీట్ చేయడం మంచిది. అలాగే మీ స్టేటస్ యొక్క ఫోటోలు పరిచయం లేని వ్యక్తులకు కనిపించకుండా ఉంచితే మంచిది. మీకు తెలియని వాళ్లను మీ స్టేటస్ చూడకుండా ఉండేందుకు సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. మీ స్టేటస్ యొక్క ప్రైవసీలో మూడు ఆప్షన్స్ ఉంటాయి. ‘మై కాంటాక్ట్స్’, ‘మై కాంటాక్ట్స్ కాకుండా..’, ‘ఓన్లీ షేర్ విత్..’ మొదటిది ఎంచుకుంటే... మీ స్టేటస్‌ను కాంటాక్ట్స్‌లో ఉన్న అందరూ చూస్తారు. రెండోది.. సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్‌లో మీరు ఎంచుకున్న వాళ్లకు తప్పించి అందరికీ కనిపిస్తుంది. మూడోది.. మీరు సెలెక్ట్ చేసుకున్న కొంతమంది కాంటాక్ట్స్‌కు మాత్రమే కనిపిస్తుంది. అలాగే మీ సిమ్ ఎప్పుడైనా మార్చినప్పుడు, లేదా మీ ఫోన్‌ను దొంగలించిన సమయంలో.. మీ వాట్సాప్ ఖాతాను ఇతరులు వాడకుండా టూ-స్టెప్ వెరిఫికేషన్ అడ్డుకుంటుంది. కాబట్టి దీని కోసం సెట్టింగ్స్ -> అకౌంట్ -> టూ-స్టెప్ వెరిఫికేషన్‌కు వెళ్లి ఎనేబుల్ చేసుకుంటే.. మీ వాట్సాప్ ఖాతా అనేది చాల సురక్షితంగా ఉంటుంది. (చదవండి: అందరికి అందుబాటులోకి వాట్సాప్ కొత్త ఫీచర్) -
వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోతో లక్షలు..
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ క్రియేట్ చేసి తమ్ముడూ.. వైద్య సేవల కోసం డబ్బులు అత్యవసరమంటూ మెసేజ్‌లు పంపించి మరీ పేట్‌బషీరాబాద్ వాసిని బోల్తా కొట్టించిన ముంబైకి చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సెల్ఫోన్లు, పాన్‌కార్డు, చెక్‌బుక్‌లు స్వాదీనం చేసుకున్నారు. ఈస్ట్ ముంబైలోని కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కె.బాలకృష్ణరెడ్డి తెలిపిన మేరకు.. పేట్‌బషీరాబాద్‌కు చెందిన బాలముకుంద్‌కు యూఎస్ఏలో ఉండే అతని తమ్ముడు మహేందర్ కుమార్ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టి అత్యవసర వైద్య సేవల కోసం రూ.రెండు లక్షలుంటే ట్రాన్స్ఫర్ చేయమంటూ బ్యాంక్ ఖాతా నంబర్‌ను సైబర్ నేరగాళ్లు పంపించారు. చదవండి: తమిళనాడులో ట్రిపుల్ మర్డర్స్ సంచలనం ఇది నిజమని నమ్మిన బాలముకుంద్ తన ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా నుంచి రూ.రెండు లక్షలు పంపాడు. మళ్లీ ఎస్ఎంఎస్లు రావడంతో మరో రూ.లక్షను కూడా బదిలీ చేశాడు. ఆ తర్వాత తన తమ్ముడు మహేందర్ కుమార్‌కు ఫోన్‌కాల్ చేస్తే తాను డబ్బు అడగలేదని చెప్పడంతో మోసపోయానని తెలుసుకున్నాడు. ఆ వెంటనే సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన టెక్నికల్ సాక్ష్యాలతో దీపక్ నందియాల్, మనీశ్ అమృత్‌లాల్‌లను ఈ నెల ఏడున అరెస్టు చేసి ఈస్ట్ ముంబైలోని న్యాయస్థానంలో హాజరుపరిచి బుధవారం సిటీకి తీసుకొచ్చారు. న్యాయస్థానంలో హాజరుపరిచి చర్లపల్లి జైలుకు తరలించారు. -
వాట్సాప్ కొత్త అప్డేట్...వారికి భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ కొత్త అప్డేట్ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రొఫైల్ పిక్‌లు పెట్టుకోవడానికి సంకోచించే వాట్సాప్ యూజర్లకు ఊరట నిస్తూ సరికొత్త అప్డేట్ను తీసుకు రానుంది. యూజర్ల ప్రొఫైల్ చిత్రాలు సేవ్ అవకాశాన్ని తొలగించింది. యూజర్లు తమ కాంటాక్ట్ లిస్ట్‌లో వున్న వ్యక్తుల ప్రొఫైల్ పిక్ లేదా డిస్ప్లే పిక్‌లను చేసుకోనేందుకు అనుమతిని నిరాకరిస్తూ తాజా బేటా అప్డేట్ను ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్ష దశలో ఉందని వాబేటా ఇన్ఫో ట్వీట్ చేసింది. ఈ ఫీచర్ అధికారికంగా త్వరోలనే పూర్తిగా అమల్లోకి రానుంది. -
ప్రొఫైల్ పిక్‌ను డౌన్లోడ్ చేయలేరు!
లాస్ఏంజెలిస్: సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ఫేస్బుక్ ఇప్పడు ఖాతాదారులందరికీ మరో కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. ఫేస్బుక్లో పెట్టే ప్రొఫైల్ పిక్చర్‌ను మరింత భద్రంగా మార్చే ఈ కొత్త ఫీచర్‌ను తొలుత భారత్‌లో ప్రవేశపెట్టనుంది. అనంతరం ఇతర దేశాలకు వర్తింప చేయనుంది. సాధారణంగా ఫేస్బుక్లో పెట్టిన ప్రొఫైల్ పిక్చర్‌ను చాలామంది దుర్వినియోగం చేస్తున్నారని.. అందులో మహిళల ఫొటోలనైతే మార్ఫింగ్ చేసి అభ్యంతరకరంగా పోస్టులు చేస్తున్నట్లు ఫేస్బుక్ గుర్తించింది. దీంతో ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్లు దుర్వినియోగం కాకుండా ఢిల్లీలోని సోషల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ అనే భద్రతా ప్రమాణాల సంస్థతో కలసి ఫేస్బుక్ సంస్థ కొత్త ఫీచర్‌ను తయారు చేసింది. దీనిద్వారా ప్రొఫైల్ పిక్చర్లు ఆన్లైన్లో దుర్వినియోగం కాకుండా ఉంటాయని.. మన ప్రమేయం లేకుండా ఇతరులు డౌన్లోడ్ చేయడం, షేర్చేయడం వంటి వాటిని నిరోధించవచ్చని.. ప్రొఫైల్ పిక్చర్లను మరింత సులభంగా మనకు నచ్చిన డిజైన్లలో రూపొందించుకోవచ్చని ఫేస్బుక్ సంస్థ ప్రొడక్ట్ మేనేజర్ ఆరతి సోమన్ తన బ్లాగ్‌లో పోస్టు చేశారు. కొత్త ఫీచర్ ద్వారా ప్రొఫైల్ పిక్చర్‌కు చుట్టూ ఓ నీలం రంగు వలయం కనిపిస్తుంటుందని ఆమె తెలిపారు. -
మీరు అట్రాక్టివ్ పర్సనా.. కాదా..?
ట్విట్టర్ ఖాతా ఉందా.. అయితే తాజా సర్వేలో వీరిపై కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ సైకలాజికల్ సర్వే నిర్వహించింది. ఇందుకు సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ను మాధ్యమంగా చేసుకుని సర్వే చేసింది. దాదాపు 66 వేల మంది ఖాతాదారుల ట్విట్టర్ ప్రొఫైల్ ను పరిశీలించింది. ప్రొఫైల్ ద్వారా మనం ఎంత అట్రాక్టివ్ వ్యక్తులం, వారి హావభావాలు ఎలా ఉంటాయన్నది సర్వేలో వెల్లడైంది. వ్యక్తులు మొత్తం ఐదు గ్రూపులని విభజించారు ప్రొఫైల్ పిక్చర్ తమ ఫొటో, పెంపుడు జంతువులు, మరేదైనా ఫొటోలు అప్ లోడ్ చేసినవారు.. ఇలా అన్ని రకాల వ్యక్తుల ఖాతాలపై సర్వే జరిగింది. ఫ్రొఫైల్ డాటా గమనిస్తే.. కేవలం ఫాలోయర్స్, ట్వీట్స్, రీట్వీట్స్ మాత్రమే కాదు ఆ వ్యక్తి స్వభావం ఏంటన్నది తెలుస్తుందట. ముఖ్యంగా న్యూరోటిసిమ్ కలిగిన వ్యక్తులు టెన్షన్ గా ఉంటారని, అగ్రిబుల్ నెస్ ఉన్న వారు చుట్టూ ఉన్న వారిని ఎప్పుడూ సంతోష పెట్టడం అలవాటని కనుగొన్నారు. కలర్ ఫుల్ ఫొటోలు పెట్టే తరహా వారు గట్టిగా నవ్వేస్తుంటారని, నవ్వడం వారికి సహజగుణమని చెప్పారు. కాన్సెన్షియస్ తరహా వ్యక్తులు చాలా క్రమశిక్షణతో మెలుగుతారని, పాత జ్ఞాపకాలు, పాత మిత్రులను కలుసుకోవడం వారితో కాలక్షేపం చేయడానికి సమయాన్ని వెచ్చిస్తారట. మరికొందరు వ్యక్తులు ఏ విషయాన్నయినా సూటిగా, స్పష్టంగా చెప్పేస్తుంటారు. కోపం వచ్చినా, సంతోషం కలిగినా కారణాలను వెల్లడిస్తారని రీసెర్చర్స్ పేర్కొన్నారు. రోజుకు 8 ట్వీట్లు చేసినట్లయితే ఆ యూజర్ ఎలాంటి తరహా వ్యక్తి, వారు ఎక్కడ ఉంటారు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చని ఇటీవల సర్వేలో తేలిన విషయం తెలిసిందే.